88 - Al-Ghaashiya ()

|

(1) ఓ ప్రవక్తా తన భయాందోళనల ద్వారా ప్రజలను క్రమ్ముకునే ప్రళయ సంగతి నీకు చేరినదా ?!

(2) ప్రజలు ప్రళయదినమున దౌర్భాగ్యులై ఉంటారు లేదా పుణ్యాత్ములై ఉంటారు . కావున దౌర్భాగ్యుల ముఖములు క్రుంగిపోయి క్రిందకు వాలి ఉంటాయి.

(3) అవి సంకెళ్ళు వేసి ఈడ్చబడటం వలన మరియు వాటికి వేయబడిన బేడీల వలన అలసి సలసి ఉంటాయి.

(4) ఈ ముఖములు వేడైన అగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తాయి.

(5) వారికి తీవ్ర వేడిదైన సెలయేరు నుండి త్రాపించబడును.

(6) వారి కొరకు అత్యంత చెడ్డదైన మరియు దురవాసన గల మొక్కల్లోంచి షిబ్రిక్ పేరు గల మొక్క తప్ప వారు ఆహారంగా తీసుకోవటానికి ఎటువంటి ఆహారముండదు. అది ఎండిపోయినప్పుడు విషపూరితంగా అయిపోతుంది.

(7) అది దాన్ని తినే వాడిని లావు చేయదు మరియు అతని ఆకలిని ఆపదు.

(8) ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు తాము పొందిన అనుగ్రముల వలన అనుగ్రహము కలవిగా,వికసించి,సంతోషముగా ఉంటాయి.

(9) తాము ఇహలోకంలో చేసుకున్న తమ సత్కర్మ పట్ల సంతుష్టంగా ఉంటారు. నిశ్చయంగా వారు తమ కర్మల పుణ్యమును ఆదా చేసి ఉండగా రెట్టింపు చేసి ఉండగా పొందారు.

(10) ఉన్నతమైన స్థానము కల స్వర్గములో.

(11) స్వర్గములో వారు ఎటువంటి అసత్య మాటను మరియు వ్యర్ధ మాటను వినరు. ఇవే కాక నిషిద్ధ మాటలు వినరు.

(12) ఈ స్వర్గములో ప్రవహించే సెలయేరులు ఉంటాయి వారు వాటిని తాము కోరిన విధంగా త్రవ్వి తీసుకుని పోతారు మరియు వాటిని మరల్చుకుంటారు.

(13) అందులో ఎత్తైన ఆసనాలుంటాయి.

(14) మరియు పాత్రలు త్రాగటానికి సిద్ధం చేసి ఉంచబడి ఉంటాయి.

(15) మరియు అందులో వరుసగా ఒక దానితో ఒకటి ఆనించి పెట్టబడిన దిండ్లు ఉంటాయి.

(16) మరియు అందులో అక్కడక్కడ అనేక తివాచీలు పరచబడి ఉంటాయి.

(17) ఏమిటీ వారు ఒంటెల వైపునకు యోచన చేసే దృష్టితో చూడరా ఎలా అల్లాహ్ వాటిని సృష్టించాడు మరియు వాటిని ఆదం సంతతి కొరకు ఆదీనంలో చేశాడు ?.

(18) మరియు ఆకాశం వైపునకు చూడరా ఏ విధంగా దాన్ని పైకి ఎత్తాడో చివరికి అది వారిపై భద్రమైన కప్పుగా అయిపోయింది. అది వారిపై పడదు.

(19) మరియు పర్వతముల వైపుకు చూడరా ఏ విధంగా వాటిని పాతి పెట్టాడో మరియు భూమి వాటి వలన ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా స్థిరంగా ఉంది.

(20) మరియు భూమి వైపు చూడరా ఎలా ఆయన దాన్ని పరచాడో మరియు దాన్ని ప్రజలు దానిపై నివాసం ఉండటానికి సిద్ధం చేశాడో ?!

(21) ఓ ప్రవక్తా వారందరిని మీరు హితబోధన చేయండి మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. మీరు హితబోధన చేసే వారు మాత్రమే. మీతో వారి హితబోధనను మాత్రమే కోరబడింది. ఇక వారి విశ్వాసము భాగ్యము ఒక్కడైన అల్లాహ్ చేతిలో ఉంది.

(22) మీరు వారిని విశ్వాసముపై బలవంతం పెట్టటానికి మీరు వారిపై నియమింపబడలేదు.

(23) కాని ఎవరైతే వారిలో నుండి విశ్వాసం నుండి ముఖము చాటేశాడో మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసం కనబరచాడో.

(24) అతన్ని అల్లాహ్ ప్రళయదినమున నరకములో ప్రవేశింపజేసి పెద్ద శిక్ష విధిస్తాడు. అందులో శాశ్వతంగా ఉంటాడు.

(25) నిశ్చయంగా వారి మరణం తరువాత వారి మరలటం మా ఒక్కరి వైపే.

(26) ఆ పిదప వారి కర్మలపై వారి లెక్క తీసుకోవటం మా ఒక్కరిపై బాధ్యత కలదు. మరియు మీకూ లేదు మరియు ఇతరులకూ దాని బాధ్యత లేదు.