(1) ప్రళయం ఖచ్చితంగా సంభవించినప్పుడు.
(2) ఇహలోకంలో తిరస్కరించినట్లు దాన్ని తిరస్కరించే ఏ ప్రాణము దొరకదు.
(3) అది అపరాధులైన అవిశ్వాసపరులను వారిని నరకములో ప్రవేశింపజేసి హీనపరిచేది,దైవభీతి కలిగిన విశ్వాసపరులను వారిని స్వర్గములో ప్రవేశింపజేసి ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది.
(4) భూమి తీవ్రంగా కంపించబడినప్పుడు,
(5) మరియు పర్వతాలు తుత్తునియలుగా చేయబడినప్పుడు,
(6) అప్పుడు తుత్తునియలుగా చేయటం వలన అవి స్థిరత్వం లేని చెల్లాచెదురయ్యే ధూళి అయిపోతాయి.
(7) ఆ రోజున మీరు మూడు రకాలుగా (వర్గములుగా) అయిపోతారు.
(8) ఇక తమ కుడి చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే కుడి పక్షము వారు. వారి స్థానము ఎంత గొప్పదైనది మరియు ఎంత ఉన్నతమైనది!
(9) మరియు తమ ఎడమ చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే ఎడమ పక్షం వారు. వారి స్ధానము ఎంత దిగజారినది మరియు ఎంత చెడ్డది
(10) ఇహలోకములో సత్కర్మలు చేయటంలో ముందుండేవారు పరలోకంలో వారే స్వర్గంలో ప్రవేశము కొరకు ముందుంటారు.
(11) వారందరే అల్లాహ్ సాన్నిధ్యమును పొందేవారు.
(12) వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో రకరకాల అనుగ్రహములను అనుభవిస్తూ ఉంటారు.
(13) ఈ సమాజము నుండి మరియు పూర్వ సమాజముల నుండి ఒక పెద్ద వర్గము,
(14) మరియు చివరి కాలము నాటి ప్రజల్లోంచి కొంత మంది వారే సాన్నిధ్యమును పొంది ముందు ఉండేవారు.
(15) వారు బంగారముతో నేయబడిన పీఠాలపై ఉంటారు.
(16) వారు ఈ పీఠాలపై అభిముఖమై ఎదురుబదురుగా అనుకుని కూర్చుని ఉంటారు. వారిలోని ఏ ఒక్కరు ఇతరుల వెనుక వైపు చూడరు.
(17) వారి సేవ కొరకు చిన్న పిల్లలు వారి మధ్య తిరుగుతుంటారు వారికి వృద్ధాప్యము గాని వినాశనం గాని ముట్టుకోదు.
(18) స్వర్గంలో వారు ప్రవహించే మధ్యముతో నిండిన కడయమలు లేని పాత్రలను మరియు కడియములు కల కూజాలను మరియు గ్లాసులను తీసుకుని వారి మధ్య తిరుగుతుంటారు.
(19) అది ఇహలోక మధ్యము వలే ఉండదు. దాన్ని సేవించే వారికి ఎటువంటి తలనొప్పి గాని మతి కోల్పోవటం గాని సంభవించదు.
(20) ఈ పిల్లలందరు వారి మధ్య వారు కోరుకునే ఫలాలలను తీసుకుని తిరుగుతుంటారు.
(21) మరియు వారు వారి మనస్సులు కోరుకునే పక్షుల మాంసమును తీసుకుని తిరుగుతుంటారు.
(22) మరియు వారి కొరకు స్వర్గములో అందములో విశాలమైన కనులు కల స్త్రీలు ఉంటారు.
(23) గవ్వల్లో దాయబడిన ముత్యాల వలే ఉంటారు.
(24) వారు ఇహలోకములో చేసుకున్న సత్కర్మలకు వారికి ప్రతిఫలముగా.
(25) వారు స్వర్గములో అశ్లీల మాటలను వినరు మరియు దాని వాసుల నుండి ఎటువంటి పాపము జరగదు.
(26) వారికి దైవదూతలు సలాము చేయటమును మరియు వారు ఒకరినొకరు సలాం చేసుకోవటమును మాత్రమే వారు వింటారు.
(27) కుడి పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రాలైతే వారి కుడి చేతులలో ఇవ్వబడుతాయో అల్లాహ్ వద్ద వారి స్థానము మరియు వారి విషయము ఎంతో గొప్పది.
(28) (వారు) ముళ్ళు కోయబడిన రేగు చెట్ల మధ్య ఉంటారు. అందులో ఎటువంటి బాధ ఉండదు.
(29) మరియు ఒక దానిపై ఒకటి వరుసగా పేర్చబడిన అరటి పండ్ల మధ్యలో ఉంటారు.
(30) మరియు వాలని నిరంతరాయంగా విస్తరించిన నీడలో ఉంటారు.
(31) మరియు ఆగకుండా ప్రవహించే నీటిలో ఉంటారు.
(32) మరియు పరిమితం కాని చాలా పండ్లలో ఉంటారు.
(33) అవి వారి నుండి ఎన్నటికి అంతమవవు. ఎందుకంటే వాటికి ఎటువంటి కాలం (సీజన్) లేదు. వాటిని వారు ఏ సమయంలో కోరినా ఎటువంటి అభ్యంతరం వాటిని నిరోధించదు.
(34) మరియు ఆసనాలపై ఉంచబడిన ఎత్తైన పరుపుల మధ్య ఉంటారు.
(35) నిశ్ఛయంగా మేమే ప్రస్తావించబడిన హూరెయీన్ లను అసాధరణ రీతిలో సృష్టించాము.
(36) మేము వారిని ముందెన్నడు తాకబడని కన్యలుగా చేశాము.
(37) తమ భర్తలను ప్రేమించే వానిగా,సమ వయస్సు గల వారిగా (చేశాము).
(38) తమ ఆనందానికి సంకేతంగా కూడిచేత తీసుకొనబడిన కుడి పక్షం వారి కొరకు మేము వారిని సృష్టించాము.
(39) ]వారు మొదటి తరాల ప్రవక్తల సమాజాల వర్గము.
(40) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజము నుండి ఒక వర్గము ఉంటుంది. అది సమాజములందరిలో చివరిది.
(41) ఎడమ పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రాలు వారి ఎడమ చేతులలో ఇవ్వబడుతాయో,వారి పరిశ్థితి,వారి పర్యవాసనము ఎంతో చెడ్డది.
(42) వారు తీవ్ర వేడి గాలులలో మరియు తీవ్ర వేడి నీటిలో ఉంటారు.
(43) నల్లటి పొగ నీడలో ఉంటారు.
(44) వీచటంలో మంచిగా ఉండదు మరియు చూడ్డానికి అందంగా ఉండదు.
(45) నిశ్చయంగా వారు శిక్షను అనుభవించక ముందు ఇహలోకంలో సుఖభోగాలను అనుభవించేవారు. వారికి వారి మనో వాంఛలు తప్ప ఏ ఉద్ధేశము ఉండేది కాదు.
(46) వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచటంపై మరియు ఆయనను వదిలి విగ్రహాలను ఆరాధించటంపై హఠులై ఉండేవారు.
(47) మరియు వారు మరణాంతరం లేపబడటమును నిరాకరించి దాని పట్ల పరిహాసముగా,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము మరణించి,మట్టిగా,క్రుసించి పోయిన ఎముకలుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము మరణాంతరం లేపబడుతామా ?!
(48) ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తాతలు మరల లేపబడుతారా ?.
(49) ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి : నిశ్చయంగా పూర్వ ప్రజలు మరియు తురువాత వచ్చే వారు కూడా.
(50) ప్రళయదినమున వారు లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఖచ్చితంగా సమీకరించబడుతారు.
(51) ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము.
(52) ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము.
(53) అప్పుడు మీ ఖాళీ కడుపులను ఆ చేదు వృక్షముతో నింపుకుంటారు.
(54) అప్పుడు దానిపై తీవ్రమైన వేడి నీళ్ళను త్రాగుతారు.
(55) హుయామ్ రోగము కారణం వలన ఎక్కువ నీటిని త్రాగే ఒంటెల వలె వారు దాని త్రాగటమును అధికం చేస్తారు.
(56) ఈ ప్రస్తావించబడిన చేదు ఆహారము మరియు వేడి నీళ్ళు ప్రతిఫలం దినం నాడు వారికి ఇవ్వబడే ఆతిధ్యము.
(57) ఓ తిరస్కారులారా మీరు ఉనికిలో లేనప్పటికీ మేము మిమ్మల్ని సృష్టించాము. మేము మిమ్మల్ని మరణాంతరం జీవింపజేసి లేపుతామని మీరెందుకు నమ్మరు ?!
(58) ఓ ప్రజలారా మీరు మీ భార్యల గర్భాల్లో విసిరే వీర్యమును గమనించారా ?!
(59) ఏమీ ఆ వీర్యమును మీరు సృష్టించేవారా లేదా మేము దాన్ని సృష్టించేవారమా ?!
(60) మేమే మీ మధ్య మరణమును నిర్ణయించాము. మీలో నుండి ప్రతి ఒక్కరికి ఒక సమయమున్నది దాన్ని అదిగమించటం జరగదు మరియు వెనుకకు జరగటం జరగదు. మరియు మేము అలసిపోయేవారము కాము.
(61) మీరు ఉన్న మీకు తెలిసిన సృష్టి,రూపమును మేము మార్చి మీకు తెలియని సృష్టి,రూపములో మిమ్మల్ని సృష్టించే సామర్ధ్యమును కలిగిన వారము.
(62) వాస్తవానికి మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా సృష్టించామో మీకు తెలుసు. ఏమీ మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు మీరు మరణించిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యము కలవాడని మీరు గుణపాఠం నేర్చుకుని తెలుసుకోరా ?!
(63) ఏమీ మీరు భూమిలో నాటే బీజమును గమనించారా ?!
(64) ఆ విత్తనమును మీరు మొలకెత్తిస్తున్నారా లేదా మేము దాన్ని మొలకెత్తిస్తున్నామా ?!
(65) ఒక వేళ మేము ఆ పంటను నాశనం చేయదలచుకుంటే అది పక్వమునకు వచ్చి చేతికి వచ్చే సమయాన దాన్ని మేము నాశనం చేస్తాము. అప్పుడు దాని తరువాత మీరు దానికి సంభవించిన దానిపై ఆశ్ఛర్యపోతారు.
(66) మీరంటారు నిశ్చయంగా మేము ఖర్చు చేసిన దాన్ని నష్టపోయి శిక్షింపబడ్డాము.
(67) కాదు కాదు మేము ఆహారోపాధిని కోల్పోయాము.
(68) ఏమీ మీరు దప్పికకు గురైనప్పుడు మీరు త్రాగే నీటిని గమనించారా ?!
(69) ఏమీ ఆకాశములో ఉన్న మేఘము నుండి మీరు దాన్ని కురిపించారా లేదా మేము దాన్ని కురిపించామా ?!
(70) ఒక వేళ మేము ఆ నీటిని త్రాగటానికి,దాహం తీర్చుకోవటానికి ఉపయోగించకుండా ఉప్పగా చేయదలచుకుంటే దాన్ని చాలా ఉప్పగా చేసేవారము. మీపై కారుణ్యముగా తియ్యగా దాన్ని మీపై కురిపించినందుకు మీరు అల్లాహ్ కు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోరు.
(71) మీ ప్రయోజనముల కొరకు మీరు వెలిగించే అగ్ని ని మీరు గమనించారా ?!
(72) ఏ వృక్షముతో దాన్ని వెలిగించబడుతున్నదో దాన్ని మీరు సృష్టించారా లేదా మీపై దయగా మేము దాన్ని సృష్టించామా ?!
(73) మేము ఈ అగ్నిని మీకు పరలోక అగ్నిని గుర్తు చేసే మీ కొరకు ఒక జ్ఞాపికగా చేశాము. మరియు దాన్ని మీలో నుండి ప్రయాణికుల కొరకు ప్రయోజనదాయకంగా చేశాము.
(74) ఓ ప్రవక్తా మహోన్నతుడైన నీ ప్రభువు యొక్క ఆయనకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడండి.
(75) అల్లాహ్ నక్షత్రముల స్థానాల మరియు వాటి ప్రదేశాలపై ప్రమాణం చేశాడు.
(76) మరియు నిశ్చయంగా ఈ ప్రదేశముల యొక్క ప్రమాణము ఒక వేళ మీరు దానిలో ఉన్న సూచనలు మరియు లెక్క లేనన్ని గుణపాఠములు ఉండటం వలన దాని గొప్పతనమును తెలుసుకుని ఉంటే ఎంతో గొప్పది.
(77) ఓ ప్రజలారా నిశ్చయంగా మీకు చదివి వినిపించబడే ఖుర్ఆన్ అందులో ఉన్న గొప్ప ప్రయోజనముల వలన దివ్యమైన ఖుర్ఆన్.
(78) ప్రజల కళ్ళ నుండి సురక్షితమైన ఒక గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది.
(79) పాపముల నుండి మరియు లోపముల నుండి పరిశుద్ధులైన దైవదూతలు మాత్రమే దాన్ని ముట్టుకుంటారు.
(80) సృష్టితాల ప్రభువు వద్ద నుండి తన ప్రవక్త అగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడినది.
(81) ఓ ముష్రికులారా మీరు ఈ విషయమును విశ్వసించకుండా తిరస్కరిస్తున్నారా ?!
(82) మరియు మీరు అల్లాహ్ కు ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాలపై మీ కృతజ్ఞతలను వాటిని మీ తిరస్కారముగా చేసి వర్షము కురవటమును నక్షత్రముల వైపు చేసి ఫలానా నక్షత్రము వలన మాపై వర్షము కురిసింది అని అంటున్నారా ?!
(83) ప్రాణము గొంతుకు చేరిపోయినప్పుడు
(84) మరియు మీరు ఆ సమయమున మీ ముందట ప్రత్యక్షమయ్యే దాన్ని చూస్తుండిపోతారు.
(85) మరియు మేము మా జ్ఞానముతో,మా సామర్ధ్యముతో మరియు మా దూతలు మీ మృత్యువునకు మీకన్న దగ్గరగా ఉంటారు. కాని మీరు ఆ దూతలందరిని చూడలేరు.
(86) మీరు అనుకుంటున్నట్లు మీ కర్మలకు మీరు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మరల లేపబడకుండా ఉంటే
(87) మీరు సత్యవంతులే అయితే మీ మృతుని నుండి వెలికి వచ్చిన ఈ ప్రాణమును తిరిగి రప్పించుకోండి ?! మీరు అలా చేయలేరు.
(88) ఇక ఒక వేళ మరణించే వాడు సత్కర్మల వైపు ముందడుగు వేసేవారిలో నుంచి అయితే
(89) అతనికి మనశ్శాంతి,కారుణ్యము ఉంటుంది దాని తరువాత ఎటువంటి అలసట ఉండదు.మరియు మంచి ఆహారము,కారుణ్యముంటుంది. మరియు అతని కొరకు స్వర్గముంటుంది అందులో అతడు తన మనస్సుకు నచ్చిన వాటితో సుఖభోగాలను అనుభవిస్తాడు.
(90) మరియు ఒక వేళ మరణించే వాడు కుడిపక్షం వారిలో నుంచి అయితే మీరు వారి విషయం గురించి పట్టించుకోకండి. వారికి శాంతి శ్రేయస్సులు ఉంటాయి.
(91) మరియు ఒక వేళ మరణించే వాడు కుడిపక్షం వారిలో నుంచి అయితే మీరు వారి విషయం గురించి పట్టించుకోకండి. వారికి శాంతి శ్రేయస్సులు ఉంటాయి.
(92) మరియు ఇక ఒక వేళ మరణించే వాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారిలో నుండి మరియు సన్మార్గము నుండి తప్పిపోయే వారిలో నుండి అయితే.
(93) అప్పుడు అతనికి తీవ్రమైన వేడి గల నీటితో ఆతిధ్యమివ్వబడును.
(94) మరియు అతను నరకాగ్నికి ఆహుతి అవటం జరుగును.
(95) ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు తెలియపరచిన ఈ గాధ ఎటువంటి సందేహం లేని రూఢీ అయిన సత్యం.
(96) కావున మీరు మీ మహోన్నత ప్రభువు యొక్క నామము పరిశుద్ధతను కొనియాడండి. మరియు లోపముల నుండి ఆయన పరిశుద్ధతను తెలపండి.