66 - At-Tahrim ()

|

(1) ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు అనుమతించిన మీ దాసిని అయిన మారియాతో ప్రయోజనం చెందటంను ఎందుకు మీ కొరకు నిషేధించుకున్నారు. దాని ద్వారా మీ సతీమణుల ఇష్టతను వారు ఆమెను ద్వేషించుకోవటం వలన మీరు కోరుకుంటూ. మరియు అల్లాహ్ మిమ్మల్ని మన్నించేవాడును మరియు మీ పై కరుణించేవాడును ?!.

(2) వాస్తవానికి అల్లాహ్ మీ కొరకు పరిహారము ద్వారా మీ ప్రమాణాల నుండి బయటపడటమును ధర్మ బద్ధం చేశాడు ఒక వేళ మీరు దాని కన్న మంచి దాన్ని పొందితే లేదా ఆ విషయంలో ప్రమాణమును భంగపరచి ఉంటే. మరియు అల్లాహ్ మీకు సహాయం చేసేవాడును. మరియు మీ పరిస్థితులను గురించి,మీకు ప్రయోజనం కలిగించే వాటి గురించి ఆయనకు బాగా తెలుసు. తాను ధర్మ బద్ధం చేసే విషయంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.

(3) మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సా రజిఅల్లాహు అన్హా కి ప్రత్యేకించి ఒక విషయమును తెలియపరచినప్పటి సంఘటనను మీరు గుర్తు చేసుకోండి. మరియు అది ఆయన తన సతీమణి మారియాకి ఎన్నటికి దగ్గరవనని (చెప్పిన విషయం). హఫ్సా ఆ విషయమును ఆయిషాకు తెలియపరచినప్పుడు అల్లాహ్ తన ప్రవక్తకు ఆయన రహస్యం బట్టబయలు అవటంను తెలియపరిస్తే ఆయన హఫ్సాను మందలించి ఆమెకు కొంత విషయమును తెలియపరచి కొంత విషయమును తెలియపరచలేదు. అప్పుడు ఆమే ఆయనతో ఈ విషయం మీకు ఎవరు తెలియపరచారు అని ప్రశ్నించినది. ఆయన సమాధానమిస్తూ ప్రతీది తెలుసుకునే వాడు మరియు ప్రతీ గోప్యమును తెలుసుకునేవాడు నాకు తెలియపరచాడు అని పలికారు.

(4) మీరు ఇద్దరు పశ్చాత్తాపం చెందటం మీపై తప్పనిసరి ఎందుకంటే మీరిద్దరి హృదయములు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దాసిని నుండి దూరం ఉండటమును మరియు ఆమెను తనపై నిషేదించుకన్న విషయమును (బయట పడటమును) అయిష్ట పడిన దాని ఇష్టత వైపునకు వాలాయి. మరియు ఒక వేళ మీరిద్దరు ఆయనకు విరుద్దంగా మరలటానికి పట్టుబట్టితే నిశ్చయంగా అల్లాహ్ ఆయన సంరక్షకుడు మరియు సహాయకుడు. మరియు అలాగే జిబ్రయీలు మరియు సత్పురుషులైన విశ్వాసపరులు ఆయనకు సంరక్షకులు మరియు ఆయనకు సహాయం చేసేవారు. మరియు దైవ దూతలు అల్లాహ్ సహాయము తరువాత ఆయనకు సహాయకులు మరియు ఆయనకు బాధ కలిగించే వారికి విరుద్దంగా సహాయం చేసే వారు.

(5) బహుశా పరిశుద్ధుడైన ఆయన ప్రభువు ఒక వేళ ఆయన ప్రవక్త మీకు విడాకులు ఇస్తే మీకన్న మంచి భార్యలను ఆయనకు బదులుగా ప్రసాదిస్తాడు. వారు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండేవారై ఉంటారు, ఆయనపై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచే వారై ఉంటారు. అల్లాహ్ కు విధేయులై ఉంటారు. తమ పాపములపై పశ్ఛాత్తాపము పడేవారై ఉంటారు. తమ ప్రభువును ఆరాధించేవారై ఉంటారు. ఉపవాసాలుండేవారై ఉంటారు. విధవలు మరియు ఇతరులతో వివాహం కాని కన్యలై ఉంటారు. కానీ ఆయన వారికి విడాకులివ్వ లేదు.

(6) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు మీ కొరకు,మీ ఇంటి వారి కొరకు మనుషులతో,రాళ్ళతో మండించబడే పెద్ద అగ్ని నుండి రక్షణను ఏర్పరచుకోండి. ఈ అగ్ని పై అందులో ప్రవేశించే వారిపై కఠినంగా వ్వహరించే కఠినమైన దూతలు ఉంటారు. అల్లాహ్ వారికి ఆదేశించినప్పుడు ఆయన ఆదేశమును నెరవేర్చకుండా ఉండరు. ఆయన వారికి ఇచ్చిన ఆదేశమును ఆలస్యం చేయకుండా,అశ్రద్ధ వహించకుండా నెరవేరుస్తారు.

(7) ప్రళయదినమున అవిశ్వాసపరులతో ఇలా పలకబడును : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచినవారా మీరు చేసుకున్న అవిశ్వాస కార్యము నుండి,పాప కార్యముల నుండి ఈ రోజు వంకలు పెట్టకండి. మీ వంకలు అంగీకరించబడవు. మీరు మాత్రం ఈ రోజు మీరు ఏదైతే ఇహలోకంలో అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచారో,ఆయన ప్రవక్తలను తిరస్కరించారో దాని ప్రతిఫలం ప్రసాదించబడుతారు.

(8) ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ వద్ద మీ పాపముల నుండి నిజమైన తౌబా చేయండి. బహుశా మీ ప్రభువు మీ నుండి మీ పాపములను తుడిచివేసి మిమ్మల్ని స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి ప్రళయదినమున కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ రోజు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయనతో పాటు విశ్వసించిన వారిని నరకములో ప్రవేశింపజేసి అవమానమును కలిగించడు. సిరాత్ వంతెనపై వారి కాంతి వారి ముందట మరియు వారి కుడివైపున పరుగెడుతూ ఉంటుంది. వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మేము స్వర్గంలో ప్రవేశించే వరకు,సిరాత్ వంతెనపై తమ వెలుగును పోగొట్టుకున్న కపటుల మాదిరిగా మేము కానంత వరకు మా వెలుగును నీవు మా కొరకు పూర్తి చేయి. మరియు నీవు మా పాపములను మన్నించు. నిశ్చయంగా నీవు ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడివి. కావున నీవు మా వెలుగును పూర్తి చేయటం నుండి మరియు మా పాపములను మన్నించటం నుండి అశక్తుడివి కావు.

(9) ఓ ప్రవక్తా మీరు అవిశ్వాసపరులతో ఖడ్గము సహాయంతో మరియు కపటులతో నాలుక సహాయంతో, హద్దులను నెలకొల్పుతూ పోరాడండి. మరియు వారు మీతో భయపడేంత వరకు వారిపై మీరు కఠినంగా వ్యవహరించండి. వారు దేని వైపునైతే ప్రళయదినమున ఆశ్రయం పొందుతారో ఆ నివాసము నరకము. వారు మరలి వెళ్ళేదైన వారి ఆశ్రయం అతి చెడ్డ ఆశ్రయం.

(10) అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచే వారి కొరకు అల్లాహ్ ఒక ఉపామానమును తెలియపరుస్తున్నాడు - విశ్వాసపరులతో వారి సంబంధము వారికి ప్రయోజనం కలిగించదు - అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఇద్దరు ప్రవక్తలైన నూహ్,లూత్ అలైహిమస్సలాంల ఇద్దరి భార్యల పరిస్థితి ద్వారా. వారిద్దరు పుణ్యాత్ములైన ఇద్దరు దాసుల వివాహ బంధంలో ఉన్నారు. వారిద్దరు తమ భర్తల పట్ల అవినీతి చూపారు ఎలాగంటే వారు అల్లాహ్ మార్గము నుండి నిరోదించి మరియు తమ జాతిలో నుండి అవిశ్వాసపరులకు మద్దతు పలికి. వారు ఈ పుణ్య దాసుల వివాహంలో ఉండటం వారికి ప్రయోజనం కలిగించలేదు. వారిద్దరితో ఇలా పలకబడింది : మీరిద్దరు అవిశ్వాసపరులు,పాపాత్ములందరితో కలిసి నరకములో ప్రవేశించండి.

(11) మరియు అల్లాహ్ పై ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరిచే వారి కొరకు అవిశ్వాసపరులతో వారి సంబంధము వారికి నష్టం కలిగించదని మరియు వారు సత్యంపై స్థిరంగా ఉన్నంత వరకు వారి విషయంలో ప్రభావం చూపదని అల్లాహ్ ఫిర్ఔన్ భార్య ఇలా పలికినప్పటి పరిస్థితి ద్వారా ఒక ఉపమానమును తెలియపరచాడు : ఓ నా ప్రభువా స్వర్గంలో నీ వద్ద నా కొరకు ఒక గృహమును నిర్మించు. మరియు ఫిర్ఔన్ దౌర్జన్యము నుండి,అతని ఆదిపత్యము నుండి మరియు అతని దుష్కర్మల నుండి నన్ను రక్షించు. మరియు అతని మితిమీరటంలో,అతని దుర్మార్గములో అతన్ని అనుసరించటంతో తమపై హింసకు పాల్పడిన జాతి వారి నుండి నన్ను రక్షించు.

(12) మరియు వ్యభిచారము నుండి తన మర్మావయవమును పరి రక్షించుకున్న ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యమ్ స్థితి ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై విశ్వాసము కనబరిచే వారి కొరకు అల్లాహ్ ఒక ఉపమానమును తెలియపరచాడు. అప్పుడు అల్లాహ్ జిబ్రయీల్ ను అందులో ఊదమని ఆదేశించాడు. అప్పుడు ఆమె అల్లాహ్ సామర్ధ్యముతో తండ్రి లేకుండానే మర్యమ్ కుమారుడగు ఈసా గర్భమును దాల్చింది. మరియు ఆమే అల్లాహ్ ధర్మ శాసనాలను మరియు ఆయన ప్రవక్తలపై అవతరింపబడిన ఆయన గ్రంధములను దృవీకరించింది. మరియు ఆమె అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటిని విడనాడి విధేయత చూపే వారిలోంచి అయిపోయినది.