93 - Ad-Dhuhaa ()

|

(1) పగటి మొదటి వేళ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు

(2) మరియు రాత్రిపై ప్రమాణం చేసాడు అది చీకటి అయినప్పుడు మరియు అందులో ప్రజలు కదలకుండా ఉన్నప్పుడు .

(3) ఓ ప్రవక్త మీ ప్రభువు మిమ్మల్ని వదలలేదు మరియు మిమ్మల్ని ద్వేషించ లేదు; వహీ ఆగి పోయినప్పుడు ముష్రికులు పలికినట్లు.

(4) మరియు పరలోక నివాసము మీ కొరకు ఇహలోకము కన్న మేలైనది. అందులో ఉన్న శాశ్వతమైన,అంతం కాని అనుగ్రహాల వలన.

(5) మరియు ఆయన తొందరలోనే మీకు మరియు మీ జాతికి చాలా పుణ్యమును ప్రసాదిస్తాడు. చివరికి ఆయన మీకు మరియు మీ జాతి వారికి ప్రసాదించిన దానితో మీరు సంతోషపడుతారు.

(6) నిశ్చయంగా ఆయన మిమ్మల్ని బాల్యంలో మీ తండ్రి మీ నుండి మరణించి ఉండగా పొందాడు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయం కల్పించాడు. ఎలాగంటే మీ తాత అబ్దుల్ ముత్తలిబ్ మీపై దయ చూపారు. ఆ తరువాత మీ బాబాయి అబూతాలిబ్.

(7) గ్రంధం ఏమిటో విశ్వాసం ఏమిటో మీకు తెలియని స్థితిలో ఆయన మీకు పొందాడు. అయితే ఆయన వాటిలో నుండి మీకు తెలియని దానిని ఆయన నేర్పించాడు.

(8) మరియు ఆయన మిమ్మల్ని బీద వారిగా పొంది మిమ్మల్ని ధనికులుగా చేశాడు.

(9) అయితే మీరు బాల్యంలో తన తండ్రిని కోల్పోయిన వాడితో చెడుగా వ్యవహరించకండి. మరియు అతడిని అవమానపరచకండి.

(10) మరియు అవసరం ఉండి చేయి చాపి అడిగే వాడిని గద్దించకండి.

(11) మరియు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుకో. మరియు వాటిని బహిరంగంగా ప్రకటించు.