(1) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.
(2) సృష్టితాల్లోంచి బాధను కలిగించే వాటి కీడు నుండి.
(3) మరియు నేను అల్లాహ్ తో రాత్రి వేళ బహిర్గతమయ్యే జంతువుల,దొంగల కీడుల నుండి శరణం వేడుకుంటున్నాను.
(4) మరియు నేను ముడులలో ఊదే మంత్రజాలకుల కీడు నుండి అల్లాహ్ తో శరణం వేడుకుంటున్నాను.
(5) మరియు నేను అల్లాహ్ తో అసూయ చెందే వాడి కీడు నుండి అతడు అసూయను కలిగించే కార్యాలకు పురికొల్పే వాటిని చేసినప్పుడు శరణు వేడుకుంటున్నాను.