(1) తన సృష్టిరాసుల కన్న గొప్ప వాడైన నీ ప్రభువు పరిశుద్దతను కొనియాడు ఆయన నామమును పలుకుతూ ఆయననే నీవు స్మరించినప్పుడు మరియు నీవు ఆయన గొప్పతనమును పలుకుతూ.
(2) ఆయనే మనిషిని సమగ్రంగా సృష్టించాడు మరియు అతని రూపమును తగిన ప్రమాణంలో తీర్చిదిద్దాడు.
(3) మరియు ఆయనే సృష్టితాలను వాటి జాతులను వాటి రకాలను మరియు వాటి గుణములను అంచనా వేశాడు. మరియు ప్రతీ సృష్టి రాసిని దానికి తగిన దాని వైపునకు మరియు దానికి అనుకూలమైన దాని వైపునకు మార్గదర్శకం చేశాడు.
(4) మరియు ఆయనే భూమి నుండి మీ పశువులు మేసే మేతను వెలికితీశాడు.
(5) మరల దాన్ని తాజాగా పచ్చగా ఉన్న తరువాత ఆయన నల్లటి ఎండు గడ్డిగా మార్చి వేశాడు.
(6) ఓ ప్రవక్తా మేము తొందరలోనే ఖుర్ఆన్ ను మీకు చదివింపజేస్తాము మరియు దాన్ని మీ హృదయంలో సమీకరిస్తాము. మీరు దాన్ని మరచిపోరు. కాబట్టి మీరు చదివే విషయంలో జిబ్రయిల్ కన్న ముందు చదవకండి ఏ విధంగానైతే మీరు దాన్ని మరవకుండా ఉండటానికి అత్యాశతో చేసేవారో అలా.
(7) కాని విజ్ఞతతో దాని నుండి మీరు మరవాలని అల్లాహ్ తలచినది తప్ప. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయనకు బహిర్గతం చేయబడేవి మరియు గోప్యంగా ఉంచబడేవి తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(8) మరియు స్వర్గంలో ప్రవేశింపజేసే కర్మల్లోంచి అల్లాహ్ సంతుష్టపడే వాటిని చేయటమును మీకు మేము సులభతరం చేస్తాము.
(9) కావున ఖుర్ఆన్ నుండి మేము మీకు దైవవాణి ద్వారా తెలియజేసిన వాటిని మీరు ప్రజలకు బోధించండి మరియు వారిని హితోపదేశం విన్నంత కాలం హితోపదేశం చేయండి.
(10) అల్లాహ్ తో భయపడే వాడు మీ హితబోధనలతో హితబోధన గ్రహిస్తాడు. ఎందుకంటే అతడే హితబోధనతో ప్రయోజనం చెందుతాడు.
(11) మరియు అవిశ్వాసపరుడు హితబోధన నుండి దూరమైపోతాడు మరియు అతడు దాని నుండి బెదిరిపోతాడు. ఎందుకంటే అతడు నరకాగ్నిలో ప్రవేశించటం వలన పరలోకంలో ప్రజలందరికెల్ల పెద్ద దౌర్భాగ్యవంతుడు.
(12) అతడే పరలోక పెద్ద నరకాగ్నిలో ప్రవేశిస్తాడు. దాని వేడి అనుభవిస్తాడు మరియు శాశ్వతంగా దాన్ని అనుభవిస్తాడు.
(13) ఆ తరువాత అతడు అందులో ప్రవేశిస్తాడు ఏ విధంగా నంటే అతడు అనుభవించే శిక్ష నుండి ఉపశమనం పొందటానికి అందులో అతడు మరణించడు. మరియు అతడు మంచి గౌరవ ప్రధమైన జీవితమును జీవించడు.
(14) నిశ్ఛయంగా షిర్కు నుండి మరియు పాప కార్యముల నుండి పరిశుద్ధుడైనవాడు ఆశించిన వాటి ద్వారా సాఫల్యం చెందుతాడు.
(15) మరియు అతడు తన ప్రభువును ఆయన ధర్మబద్ధం చేసిన స్మరణల ద్వారా స్మరించాడు. మరియు నమాజును దాన్ని పాటించుటకు కోరబడిన గుణము ద్వారా పాటించాడు.
(16) కాని మీరు ఇహలోక జీవితమును ముందు పెడుతున్నారు. మరియు దాన్ని పరలోక జీవితం పై ఆ రెండిటి మధ్య పెద్ద లోపమున్నాకూడు ప్రాధాన్యతనిస్తున్నారు.
(17) మరియు పరలోకం ఇహలోకము కన్న మేలైనది మరియు గొప్పది. మరియు అందులో ఉన్న సుఖభోగాలు,వైభవాలు,శాశ్వతమైనవి. ఎందుకంటే అందులో ఉన్న అనుగ్రహాలు అంతము కానివి,శాశ్వతమైనవి.
(18) నిశ్చయంగా మేము మీకు ప్రస్తావించిన ఈ ఆదేశాలు మరియు సమాచారములు ఖుర్ఆన్ కన్న పూర్వం అవతరించబడిన గ్రంధముల్లో కలవు.
(19) అవి ఇబ్రాహీం మరియు మూసా అలైహిమస్సలాం పై అవతరింపబడిన గ్రంధములు.