17 - Al-Israa ()

|

(1) పరిశుద్ధుడైన అల్లాహ్ తాను తప్ప ఇంకెవరూ సామర్ధ్యం కనబరచని వాటిపై తన సామర్ధ్యం ఉండటం వలన ఆయన సర్వ లోపాలకు అతీతుడు,మహోన్నతుడు. ఆయనే తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆత్మతో,శరీరంతో సహా మేల్కొన్న స్థితిలో రాత్రి ఒక భాగములో మస్జిదుల్ హరాం నుండి బైతుల్ మఖ్దిస్ మస్జిద్ (పరిశుద్ధ గృహము) దేని పరిసర ప్రాంతాలకైతే మేము ఫలాల ద్వారా,పంటల ద్వారా,దైవ ప్రవక్తలు అలైహిముస్సలాంల గృహముల ద్వారా శుభవంతం చేశామో దాని వరకు పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును దృవీకరించే మా సూచనలను ఆయన చూడటానికి నడిపించాడు. నిశ్చయంగా ఆయనే వినేవాడును ఆయనపై ఎటువంటి వినబడేది గోప్యంగా ఉండదు,చూసే వాడును ఆయనపై ఎటువంటి చూడబడేది గోప్యంగా ఉండదు.

(2) మరియు మేము మూసా అలైహిస్సలాంకు తౌరాత్ ను ప్రసాధించి దాన్ని ఇస్రాయీలు సంతతివారికి మార్గదర్శినిగా,సన్మార్గమును చూపించేదానిగా చేశాము. మరియు మేము ఇస్రాయీలు సంతతివారితో ఇలా పలికాము : మీరు నన్ను వదిలి ఎవరినీ మీ వ్యవహారాలన్నింటిని అప్పజెప్పటానికి సంరక్షకునిగా చేసుకోకండి. కాని మీరు నా ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉండండి.

(3) మీరు నూహ్ అలైహిస్సలాం తోపాటు తూఫానులో మునగటం నుండి ముక్తి ద్వారా మేము అనుగ్రహించిన సంతతిలో నుంచి వారు. అయితే మీరు ఈ అనుగ్రహమును గుర్తు చేసుకుంటూ ఉండండి మరియు మహోన్నతుడైన అల్లాహ్ కు ఆయన ఒక్కడి ఆరాధన ద్వారా,విధేయత ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీరు ఈ విషయంలో నూహ్ ను అనుసరించండి ఎందుకంటే ఆయన మహోన్నతుడైన అల్లాహ్ కి ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకునేవాడు.

(4) మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిని వారి నుండి భువిలో పాపకార్యలకు పాల్పడటం ద్వారా,అహంకారము ద్వారా రెండు సార్లు సంక్షోభం తలెత్తుతుందని సమాచారమిచ్చాము,తెలియపరచాము. మరియు వారు తప్పకుండా ప్రజలపై హింస ద్వారా,దుర్మార్గము ద్వారా వారిపై అహంకారమును ప్రదర్సించటంలో హద్దు మీరుతూ గర్వమును చూపుతారు.

(5) అయితే వారి నుండి మొదటి సంక్షోభం తలెత్తినప్పుడు మేము వారిపై బలవంతులైన,అత్యంత పరాక్రమ వంతులైన మా దాసులకు ఆధిపత్యమును ప్రసాధించాము. వారు వారిని హతమార్చారు,వెలివేశారు. అప్పుడు వారు వారి నివాసముల మధ్యలో ఏ ప్రాంతము నుండి వెళ్ళినా దాన్ని నాశనం చేసేవారు. అల్లాహ్ వాగ్ధానం ఇలాగే ఖచ్చితంగా వాటిల్లుతుంది.

(6) ఆ తరువాత ఓ ఇస్రాయీలు సంతతివారా మీరు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడినప్పుడల్లా మీపై ఆధిపత్యాన్ని చూపిన వారిపై మేము మీకు అధికారమును,ఆధిక్యతను తయారు చేసి ఉంచాము. మరియు సంపద దోచుకోబడిన తరువాత సంపద ద్వారా,వారు బందీ అయిన తరువాత సంతానము ద్వారా మీకు మేము సహాయం చేశాము. మరియు మేము మీ సంఖ్యా బలమును మీ శతృవులకన్న అధికం చేశాము.

(7) ఓ ఇస్రాయీలు సంతతివారా ఒక వేళ మీరు మీ కర్మలను మంచిగా చేసి వాటిని కోరిన విధంగా తీసుకుని వస్తే దాని ప్రతిఫలము మీకే చేరుతుంది. అల్లాహ్ కి మీ కర్మల అవసరం లేదు. ఒక వేళ మీరు మీ కర్మలను చెడుగా చేసి ఉంటే దాని శిక్ష మీపైనే పడుతుంది. అయితే మీ కర్మలను మంచిగా చేయటం అల్లాహ్ కి ప్రయోజనం చేకూర్చదు,వాటిని చెడుగా చేయటం ఆయనకు నష్టం కలిగించదు. ఎప్పుడైతే రెండవ సంక్షోభం తలెత్తుతుందో మేము మీ శతృవులకు మీపై ఆధిక్యతను కలిగిస్తాము. వారు మిమ్మల్ని పరాభవమునకు గురి చేయటానికి,వారు రకరకాల పరాభవముల రుచి మీకు చూపించినప్పుడు మీ ముఖములపై ప్రత్యక్షంగా చెడును వారు కలిగించటానికి,మొదటి సారి వారు బైతుల్ మఖ్దిస్ లో ప్రవేశించి దాన్ని ఏవిధంగా శిధిలం చేశారో ఆవిధంగా వారు అందులో ప్రవేశించి శిధిలం చేయటానికి,మీ బస్తీల్లోంచి దేనిపైనైతే వారు జయిస్తారో దాన్ని పూర్తిగా నేలమట్టం చేయటానికి.

(8) ఓ ఇస్రాయీలు సంతతివారా బహుశా మీ ప్రభువు ఒక వేళ మీరు ఆయనతో పశ్చాత్తాప్పడి మీ కర్మలను మంచిగా చేసుకుంటే ఈ తీవ్ర ప్రతీకారము తరువాత మీపై దయ చూపుతాడేమో. మరియు ఒక వేళ మీరు మూడోసారి లేదా ఎక్కువ సార్లు సంక్షోభం రేకెత్తించటానికి మరలితే మేము మీతో ప్రతీకారం తీర్చుకోవటానికి మరలుతాము. మరియు మేము నరకమును అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు పరుపుగా, ఒడిగా చేస్తాము వారు దాని నుండి ఖాళీ అవ్వరు.

(9) నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ మంచి మార్గములను సూచిస్తుంది. అవి ఇస్లాం మార్గము మరియి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసే వారికి వారిని సంతోషమును కలిగించే దాని గురించి తెలియపరుస్తుంది. మరియు అది అల్లాహ్ వద్ద నుండి వారికి గొప్ప పుణ్యం లభిస్తుందని(తెలియపరుస్తుంది).

(10) మరియు పరలోకముపై విశ్వాసమును కనబరచని వారికి వారిని చెడు కలిగించే దాని గురించి తెలియపరుస్తుంది. మరియు అదేమిటంటే మేము వారి కొరకు ప్రళయదినాన బాధ కలిగించే శిక్షను తయారు చేసి ఉంచాము.

(11) మరియు మానవుడు తన అజ్ఞానం వలన కోపం వచ్చినప్పుడు తనపై,తన సంతానముపై,తన సంపదపై తన కొరకు మంచిని అర్ధించినట్లు చెడును అర్ధించేవాడు. ఒక వేళ మేము చెడు గురించి అతని అర్ధనను స్వీకరించి ఉంటే అతడు నాశనమయ్యేవాడు,అతని సంపద,అతని సంతానము నాశనమయ్యేది. మానవుడు స్వాభావిక పరంగా తొందరపడేవాడు. అందుకనే అతడు తనకు నష్టం కలిగించేదాన్ని తొందర చేసుకున్నాడు.

(12) మరియు మేము రాత్రిని,పగలును అల్లాహ్ ఏకత్వముపై,ఆయన సామర్ధ్యంపై సూచించే రెండు సూచనలుగా సృష్టించాము, ఆ రెండింటిలో ఉన్న పొడవవటంలో,చిన్నదవటంలో,వేడిలో,చల్లదనములో విభేదము వలన. మేము రాత్రిని విశ్రాంతి కొరకు,నిదుర కొరకు చీకటిగా చేశాము. మరియు మేము పగలును కాంతివంతంగా చేశాము. అందులో ప్రజలు చూస్తున్నారు,తమ జీవన సామగ్రి కొరకు శ్రమిస్తున్నారు. ఆ రెండింటి ఒకదాని వెనుక ఇంకొకటి రావటం ద్వారా మీరు సంవత్సరముల లెక్కను,మీకు అవసరమైన నెలలు,రోజులు,గంటల వేళలను తెలుసుకుంటారని ఆశిస్తూ. మేము ప్రతి వస్తువును వస్తువుల్లో వ్యత్యాసం ఉండటానికి,అసత్యము నుండి సత్యము స్పష్టమవటానికి స్పష్టపరిచాము.

(13) మరియు మేము ప్రతీ మనిషిని అతని నుండి జరిగిన అతని ఆచరణను అతనితోపాటు ఉండేటట్లుగా మెడకు హారంగా చేశాము. అతని లెక్క తీసుకోబడనంత వరకు అది అతనితో వేరవదు. మరియు మేము ప్రళయదినాన అతని కొరకు ఒక పుస్తకమును వెలికి తీస్తాము. అందులో అతను చేసిన మంచీ,చెడును తన ముందట అతను తెరచి ఉన్నట్లుగా,పరచినట్లుగా పొందుతాడు.

(14) ఆ రోజు మేము అతనితో ఇలా అంటాము : ఓ మానవుడా నీవు నీ పుస్తకమును (కర్మల పుస్తకమును) చదువు. నీ కర్మల పై నీ స్వయం యొక్క లెక్క బాధ్యత వహిస్తుంది. నీ లెక్క తీసుకోవటానికి ప్రళయదినాన స్వయంగా నీవు చాలు.

(15) ఎవరైతే విశ్వాసము వైపునకు మార్గం పొందుతారో అతనికి మార్గం పొందినందుకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరైతే అపమార్గం పొందుతారో అతని అపమార్గము పొందినందుకు శిక్ష అతనిపైనే పడుతుంది. ఏ ప్రాణి వేరే ప్రాణి పాపమును మోయదు. మరియు ఏ జాతినీ వారి వద్దకు మేము ప్రవక్తలను పంపి వారికి వ్యతిరేకంగా ఆధారం నిలబెట్టనంతవరకు శిక్షించేవారము కాము.

(16) మరియు మేము ఏదైన బస్తీ వారిని వారి దుర్మార్గం వలన తుదిముట్టించదలచుకుంటే ఎవరైతే అనుగ్రహాల్లో మునిగి అహంకారమును చూపిన వారికి విధేయత పాటించమని ఆదేశించాము. కాని వారు దాన్ని పాటించలేదు. అంతేకాక వారు పూర్తిగా అవిధేయతకు పాల్పడ్డారు.అప్పుడు కూకటి వేళ్ళతో పెకిలించే శిక్ష ద్వారా వారిపై మాట నిరూపితమైనది. అయితే మేము కూకటి వేళ్ళతో పెకిలించే వినాశనమును వారిపై కలిగించాము.

(17) ఆద్,సమూద్ లాంటి ఎన్నో తిరస్కార జాతులవారిని నూహ్ తరువాత మేము నాశనం చేశాము.ఓ ప్రవక్త తన దాసుల పాపములను తెలుసుకోవటానికి,వీక్షించటానికి మీ ప్రభువు చాలు.వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(18) ఎవరైతే ప్రాపంచిక కార్యాల ద్వారా ఇహలోకమును కోరుకుని,పరలోకము పై దాని కొరకు ఏమీ చేయకుండా విశ్వసించడో అతని కొరకు మేము ఇందులో అతను కోరినది కాకుండా మేము కోరిన అనుగ్రహాలను తొందరగా ప్రసాదిస్తాము. ఆ తరువాత మేము అతని కొరకు నరకమును నియమిస్తాము. అతడు అందులో ప్రళయదినాన దాని వేడిని కళ్లముందట చూస్తూ, తాను ఇహలోకమును ఎంచుకుని పరలోకమును వదలటంపై అవమానముతో,అల్లాహ్ కారుణ్యము నుండి బహిష్కరించబడి ప్రవేశిస్తాడు.

(19) మరియు ఎవరైతే ప్రాపంచిక కార్యాల ద్వారా పరలోకమును కోరుకుని దాని కొరకు ప్రదర్శన,ఖ్యాతి లేని కృషిని చేసి, దేనిపైనైతే అల్లాహ్ విశ్వాసమును అనివార్యం చేశాడో దాన్ని విశ్వసిస్తే ఇటువంటి, లక్షణాలు కలిగిన వారి కృషి అల్లాహ్ వద్ద స్వీకృతమవుతుంది.మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(20) ఓ ప్రవక్త మేము ఈ రెండు వర్గముల్లోంచి ప్రతి ఒక్కరికి పాపాత్ముడు,పుణ్యాత్ముడికి నీ ప్రభువు యొక్క అనుగ్రహాలలో నుండి ఆపకుండా ఇవ్వదలచాము.ఇహలోకములో నీ ప్రభువు యొక్క అనుగ్రహాలు పుణ్యాత్ముడైన లేదా పాపాత్ముడైన ఎవరి నుండి ఆపబడలేదు.

(21) ఓ ప్రవక్తా మేము ఏ విధంగా వారిలో కొందరిని కొందరిపై ఇహ లోకములో జీవనోపాధిలో,స్థానముల్లో ప్రాధాన్యతను కల్పించామో మీరు యోచించండి. మరియు పరలోకము ఇహలోకము కన్న అనుగ్రహాల స్థానముల విషయంలో హెచ్చుతగ్గులు అవటంలో ఉన్నతమైనది,ప్రాధాన్యత నివ్వటంలో గొప్పది. విశ్వాసపరుడు దాన్ని పొందటం కొరకు అత్యాశను చూపాలి.

(22) ఓ దాసుడా నీవు అల్లాహ్ తోపాటు ఆరాధించటానికి వేరే ఆరాధ్య దైవమును చేసుకోకు. అటువంటప్పుడు నీవు అల్లాహ్ వద్ద,ఆయన పుణ్య దాసుల వద్ద నిన్ను పొగిడే వారు లేకుండా అవమానించబడిన వాడివైపోతావు. నీకు సహాయం చేసేవాడు ఎవడూ లేక ఆయన వద్ద నుండి పరాభవమునకు గురైన వాడివైపోతావు.

(23) మరియు ఓ దాసుడా నీ ప్రభువు అతనిని తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదని ఆదేశించి అనివార్యం చేశాడు. మరియు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకించి వారు వృద్ధాప్యమునకు చేరినప్పుడు మంచిగా మెలగమని ఆదేశించాడు. ఒక వేళ నీ దగ్గర తల్లిదండ్రుల్లోంచి ఎవరైన ఒకరు లేదా ఇద్దరూ వృద్ధాప్యమునకు చేరుకుంటే నీవు వారితో విసుగు చెందే విధంగా మాట్లాడకు, వారిని కసురుకోకు,వారిపై మాటల్లో కఠినత్వమును చూపకు. మరియు వారితో మృదువుగా,దయగా ఉన్నట్లు మర్యాదగా మాట్లాడు.

(24) మరియు నీవు వారిపై అణుకువ,దయాభావం ఉట్టిపడే విధంగా వారి కొరకు నిమమ్రత చూపు. మరియు ఇలా పలుకు : ఓ నా ప్రభువా వారు నన్ను నా బల్యంలో పోషించినందు వలన నీవు వారిపై కారుణ్యంగా దయ చూపు.

(25) ఓ ప్రజలారా ఆరాధన విషయంలో, సత్కర్మల విషయంలో, తల్లిదండ్రల పట్ల ఉత్తమంగా మెలిగే విషయంలో, మీ మనస్సుల్లో అయన కొరకు ఉన్న చిత్తశుద్ధి గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక వేళ మీ ఆరాధన విషయంలో,మీ తల్లిదండ్రుల కొరకు,ఇతరుల కొరకు మీ వ్యవహారము విషయంలో మీ సంకల్పములు మంచిగా ఉంటే నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన వైపునకు పశ్చాత్తాపముతో ఎక్కువగా మరలే వారిని మన్నించేవాడు. అయితే ఎవరైతే తన ప్రభువు పట్ల తన విధేయతలో లేదా తన తల్లిదండ్రుల పట్ల విధేయతలో ముందు జరుగిన లోపము పై పశ్చాత్తాప్పడుతాడో అతనిని అల్లాహ్ మన్నించివేస్తాడు.

(26) ఓ విశ్వాసపరుడా నీవు దగ్గరి బంధువుల హక్కు అయిన అతని బంధుత్వమును కలపటమును ఇవ్వు. మరియు నిరుపేదకు ఇవ్వు,తన ప్రయాణంలో తెగిపోయిన (ప్రయాణ సామగ్రి,డబ్బు కోల్పోయిన) వారికి హక్కును ఇవ్వు. మరియు నీవు నీ సంపదను పాపకార్యల్లో లేదా దుబారాగా ఖర్చు చేయకు.

(27) నిశ్చయంగా తమ సంపదలను పాపకార్యాల్లో ఖర్చు చేసేవారు,దుబారాగా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు. వారు దుబారాగా,వృధాగా ఖర్చు చేయటం గురించి ఆదేశిస్తే వీరు వారిని అనుసరిస్తున్నారు. వాస్తవానికి షైతాను తన ప్రభువు పట్ల కృతఘ్నుడు. అతడు కేవలం పాపము ఉన్న దానినే ఆచరిస్తాడు. తన ప్రభువుకు ఆగ్రహమును కలిగించే వాటిని మాత్రమే ఆదేశిస్తాడు.

(28) ఒక వేళ అల్లాహ్ నీపై ఆహారోపాధిని తెరచి వేయటమును నిరీక్షిస్తూ, వీరందరికి ఇవ్వవలసినది లేకపోవటం వలన నీవు ఇవ్వలేకపోతే,అప్పుడు నీవు వారితో మృధువుగా,సుతిమెత్తగా మాట్లాడు. ఎలాగంటే నీవు వారి కొరకు ఆహారోపాధి పెరగటం గురించి ప్రార్ధించటం లేదా నీకు అల్లాహ్ ప్రసాధిస్తే వారికి ఇస్తానని వాగ్ధానం చేయటం.

(29) మరియు నీవు ఖర్చు చేయటం నుండి నీ చేతిని నియంత్రించుకోకు మరియు ఖర్చు చేయటంలో దుబారా చేయకు. ఒక వేళ నీవు ఖర్చు చేయటం నుండి నీ చేతిని నియంత్రిస్తే అప్పుడు నీ పిసినారి తనంపై ప్రజలు నిన్ను అపనిందపాలు చేయటం వలన నీవు అపనిందపాలు అవుతావు,నీ దుబారా ఖర్చు వలన ఖర్చు చేయలేకపోతావు. నీవు ఖర్చు చేయవలసినది నీవు పొందలేవు.

(30) నిశ్చయంగా నీ ప్రభువు సంపూర్ణ వివేకము వలన తాను కోరుకున్న వారికి ఆహారమును పుష్కలంగా ప్రసాధిస్తాడు,తాను కోరుకున్న వారికి దాన్ని కుదించివేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసుల గురించి తెలుసుకునేవాడు,చూసేవాడును. వారిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వారి మధ్య తాను కోరిన విధంగా తన ఆదేశమును జారీ చేస్తాడు.

(31) మరియు మీరు మీ సంతానమును వారిపై ఖర్ఛు చేస్తే భవిష్యత్తులో పేదరికం కలుగుతుందన్నభయంతో హతమార్చకండి. మేము వారిని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము,మిమ్మల్ని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము. ఒక వేళ వారిది ఏ పాపం లేకపోతే, వారిని హతమార్చటాన్ని అనివార్యం చేసే ఏ కారణం లేకపోతే నిశ్చయంగా వారిని హతమార్చటం మహా పాపం అవుతుంది.

(32) మరియు మీరు వ్యభిచారము నుండి దూరంగా ఉండండి,దానిని పురిగొల్పే వాటి నుండి జాగ్రత్త పడండి. ఎందుకంటే అది అత్యంత చెడ్డ కార్యము. వంశములను కలతీ అవటమునకు,అల్లాహ్ శిక్షకు తీసుకుని వెళ్ళే చెడ్డ మార్గము.

(33) మరియు మీరు అల్లాహ్ ఏ ప్రాణము యొక్క రక్తమును విశ్వాసము ద్వారా లేదా రక్షణ ద్వారా పరిరక్షించాడో ఆ ప్రాణమును చంపకండి. ఒక వేళ అతను విశ్వాసము నుండి తిరిగిపోవటం ద్వారా లేదా శీలము తరువాత వ్యభిచారము చేయటం ద్వారా లేదా ప్రతీకార న్యాయము ద్వారా ప్రాణము తీయటం అనివార్యం అయితే తప్ప. ఎవరిదైన ప్రాణం తీయటమునకు సమ్మతం అవటానికి ఎటువంటి కారణం లేకుండా దుర్మార్గంగా ప్రాణం తీయబడితే నిశ్చయంగా మేము అతని వ్యవహారమునకు దగ్గరగా ఉన్న అతని వారసులకు అతని ప్రాణం తీసిన వారిపై ఆధిక్యతను ప్రసాధించాము. అప్పుడు అతని కొరకు అతని ప్రాణం తీయటము పై ప్రతీకార న్యాయమును అడగాలి. మరియు అతని కొరకు ఎటువంటి బదులు లేకుండా మన్నించే హక్కు ఉన్నది, పరిహారము తీసుకోవటంతోపాటు మన్నించే హక్కు ఉన్నది. అయితే అతను హంతకుని విషయంలోఉన్నది ఉన్నట్లుగా వ్యవహరించటం ద్వారా లేదా అతను హత్య చేసిన దానితో కాకుండా వేరేదానితో హత్య చేయటం ద్వారా లేదా హంతకుని వదిలి వేరే వారిని హత్య చేయటం ద్వారా అల్లాహ్ అతని కొరకు సమ్మతం చేసిన హద్దును అతిక్రమించకూడదు. నిశ్చయంగా అతడు మద్దతు ఇవ్వబడినవాడును,సహాయం చేయబడిన వాడును.

(34) మరియు పిల్లల్లోంచి ఎవరి తండ్రి చనిపోయాడో అతని సంపదను అతను పరిపూర్ణ బుద్ధికి,యుక్త వయస్సుకు చేరే వరకు దానిని పెంచటంలో,దానిని పరి రక్షించటంలో అతని కొరకు ప్రయోజన కరమైతేనే తప్ప మీరు దాన్ని వినియోగించకండి. మరియు మీరు మీకూ,అల్లాహ్ కు మధ్య ఉన్న మరియు మీకూ అతని దాసులకు మధ్య ఉన్న ప్రమాణమును ఏ విధంగా భంగపరచకుండా లేదా తగ్గించకుండా పూర్తి చేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రమాణమును ఇచ్చే వాడిని ప్రళయదినాన ప్రశ్నిస్తాడు : ఏమి అతనికి ప్రతిఫలం ఇవ్వటానికి అతను దాన్ని పూర్తి చేశాడా లేదా అతను శిక్షించబడటానికి దాన్ని పూర్తి చేయలేదా.

(35) మరియు మీరు ఇతరుల కొరకు కొలచినప్పుడు కొలిచే పాత్రను పూర్తిగా కొలచి ఇవ్వండి. మరియు మీరు దాన్ని తరిగించకండి. త్రాసుతో ఎటువంటి తగ్గుదల లేకుండా ,ఎటువంటి తరగుదల లేకుండా న్యాయపూరితంగా (సమానంగా) తూకమేయండి. కొలమానములో,తూకములో ఈ సమాంతరము ఇహలోకములో,పరలోకములో మీ కొరకు మేలైనది. కొలమానాలను,తూకములను తరిగించటం ద్వారా తగ్గంచి ఇవ్వటం కన్నా మంచి పరిణామం కలది.

(36) ఓ ఆదం కుమారుడా నీవు నీకు జ్ఞానం లేని విషయాలను అనుసరించకు. అటువంటప్పుడు నీవు అనుమానాలను,అపోహలను అనుసరిస్తావు.నిశ్చయంగా మానవుడు తన వినికిడి,తన చూపు,తన మనస్సు ముందడుగు వేసిన మంచి గురించి,చెడు గురించి ప్రశ్నించబడుతాడు. అప్పుడు అతను మంచి చేసిన దానిపై ప్రతిఫలమును ప్రసాధించబడుతాడు,చెడు చేసిన దానిపై శిక్షించబడుతాడు.

(37) మరియు నీవు భుూమిపై గర్వంతో,అహంకారముతో నడవకు. నిశ్చయంగా నీవు ఒక వేళ అందులో అహంకారముతో నడిస్తే నీ నడవటం ద్వారా నీవు భూమిని చీల్చ లేవు,మరియు నీ ఎత్తు పర్వతాల ఎత్తునకు చేరనూ లేదు అటువంటప్పుడు గర్వము ఏ విషయంపైన ?!.

(38) ఓ మానవుడా ముందు ప్రస్తావన జరిగిన ప్రతీ చెడు నీ ప్రభువు వద్ద వారించబడినది. అల్లాహ్ వాటిని పాల్పడిన వాడిని ఇష్టపడడు కాని అతన్ని అసహ్యించుకుంటాడు.

(39) మేము నీకు స్పష్టపరచిన ఈ ఆజ్ఞలు,వారింపులు,ఆదేశాలు వేటినైతే నీ ప్రభువు నీకు దివ్య జ్ఞానం ద్వారా తెలియపరచాడో. ఓ మానవుడా నీవు అల్లాహ్ తోపాటు వేరొక ఆరాధ్య దైవమును తయారు చేసుకోకు. అలా చేస్తే నీవు ప్రళయదినాన నీ మనస్సు,ప్రజలు నిన్ను అపనిందపాలు చేసిన స్థితిలో,ప్రతీ మేలు నుండి గెంటివేయబడిన స్థితిలో పడవేయబడుతావు.

(40) ఓ దైవదూతలు అల్లాహ్ కు ఆడ సంతానము అని వాదించే వారా,ఓ ముష్రికులారా ఏమీ మీ ప్రభువు మీ కొరకు మగ సంతానమును ప్రత్యేకించి తన స్వయం కొరకు దైవ దూతలను ఆడ సంతానముగా చేసుకున్నాడా ?. మీరు పలికే మాటల నుండి అల్లాహ్ మహోన్నతుడు. నిశ్చయంగా మీరు అల్లాహ్ కొరకు సంతానమును అంటగట్టినప్పుడు పరిశుద్ధుడైన అల్లాహ్ పై అత్యంత చెడ్డ మాటను పలుకుతున్నారు. మరియు మీరు ఆయనపై అవిశ్వాసములో దగ్గరవుతూ ఆయనకి ఆడ సంతానము ఉన్నదని వాదిస్తున్నారు.

(41) మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ఆదేశాలను,హితబోధనలను,ఉదాహరణలను ప్రజలు వాటి ద్వారా హితబోధన గ్రహించటానికి స్పష్టపరచాము. వారు తమకు ప్రయోజనకరమైన వాటిలో నడవటానికి,తమకు నష్టం కలిగించే వాటిని విడనాడటానికి. పరిస్థితి ఏమిటంటే వారిలో తమ స్వభావము తిరిగిపోయిన కొందరికి దాని ద్వారా సత్యం నుండి దూరం అవటం,దాని పట్ల ద్వేషమును మాత్రమే అధికం చేసినది.

(42) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ మహోన్నతుడైన అల్లాహ్ తోపాటు వీరు కల్పించుకుని,అబధ్ధమాడుతూ పలికినట్లే ఆరాధ్యదైవాలే గనక ఉంటే అప్పుడు ఆ భావించబడిన ఆరాధ్య దైవాలు సింహాసనాధిపతి అయిన అల్లాహ్ వైపునకు ఆయన రాజ్యముపై ఆధిక్యతను పొందటాన్ని కోరుకునేవారు,ఆ విషయంలో ఆయనతో తగువులాడేవారు.

(43) అల్లాహ్ సుబహానహు వ తఆలా ముష్రికులు తెలుపుతున్న గుణాల నుండి అతీతుడు,పరిశుద్ధుడు. మరియు వారు పలుకుతున్న మాటల నుండి మహోన్నతుడు,గొప్పవాడు.

(44) ఆకాశములు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి,భూమి అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నది, భూమ్యాకశముల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఆయన స్థుతులని కలుపుతూ ఆయనదే పరిశుద్ధతను కొనియాడని ఏ వస్తువూ లేదు. కాని వారు పరిశుద్ధతను కొనియాడే వైనమును మీరు అర్ధం చేసుకోలేరు. మీరు మాత్రం మీ భాషలో పరిశుద్ధతను కొనియాడేవారి పరిశుద్ధతను కొనియాడటమును మాత్రమే అర్ధం చేసుకుంటారు. నిశ్చయంగా మహోన్నతుడైన ఆయన శిక్షను తొందర చేయని సహనశీలుడు,తన వద్ద పశ్చాత్తాప్పడిన వారిని మన్నించేవాడు.

(45) ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు అందులో ఉన్న వారింపులు,హితబోధనలను వారు విన్నారు. వారి విముఖత వలన శిక్షగా వారిని ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటం నుండి ఆపే ఒక కప్పి వేసే తెరను మేము మీకీ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరచని వారి మధ్య వేశాము.

(46) మరియు మేము వారి హృదయములపై తెరలను చేశాము చివరికి వారు ఖుర్ఆన్ ను గ్రహించలేకపోయారు. మరియు మేము వారి చెవులలో ఇబ్బందిని కలిగించాము చివరికి వారు దాన్ని ప్రయోజనం చెందే విధంగా వినలేకపోయారు. మరియు నీవు ఖుర్ఆన్ లో నీ ప్రభువు యొక్క ఏకత్వమును గుర్తు చేసి వారి తరపు నుండి వాదించబడిన దైవాలను గుర్తు చేయకపోతే వారు అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన యొక్క నీతి నుండి దూరమవుతూ తమ మడమలపై వెనుకకు మరలిపోయారు.

(47) ఖుర్ఆన్ కొరకు వారి నాయకుల వినే పద్దతి మాకు బాగా తెలుసు. వారు దాని ద్వారా సన్మార్గము పొందదలచుకోలేదు. కాని నీవు పఠించేటప్పుడు వారు అల్పంగా భావించటం,పనికిమాలిన మాటగా అనుకోవటమును కోరుకునేవారు. ఈ దుర్మార్గులందరు తమ మనస్సుల కొరకు అవిశ్వాసముతో "ఓ ప్రజలారా మీరు మంత్రజాలనికి గురై బుద్ధి కలతీ అయిన ఒక మనిషిని మాత్రమే అనుసరిస్తున్నారు" అన్న వేళ వారు గుసగుసలాడే అబధ్ధాల గురించి,దాని (ఖుర్ఆన్) నుండి ఆపటం గురించి మాకు బాగా తెలుసు.

(48) ఓ ప్రవక్తా మీరు యోచించండి -వారు మిమ్మల్ని రకరకాల నిందార్హమైన లక్షణాల ద్వారా పోల్చటం నుండి మీరు తప్పక ఆశ్చర్యపోతారు. వారు సత్యము నుండి మరలిపోయారు. వారు బిత్తరపోయి సత్యము వైపునకు మార్గం పొందలేకపోయారు.

(49) ముష్రికులు మరణాంతరం లేపబడటమును నిరాకరిస్తూ ఇలా పలికారు : ఏమీ మేము చనిపోయి ఎముకలుగా మారిపోయి,మా శరీరములు కృశించిపోయిన తరువాత మేము సరి క్రొత్తగా లేపబడతామా ?.నిశ్చయంగా ఇది అసాధ్యము.

(50) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఓ ముష్రికులారా మీరు తీవ్రతలో రాళ్ళు లాగా అయ్యే శక్తి ఉంటే అవ్వండి లేదా బలములో లోహములా అవ్వండి. మీకు దాని శక్తి లేదు.

(51) లేదా మీరు ఆ రెండిటి కన్నా పెద్ద వేరే సృష్టితం ఏదైతే మీ మనస్సుల్లో పెద్దదిగా ఉన్నదో దానిలా అవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఎలా ప్రారంభించాడో అలాగే మరలింపజేస్తాడు. మిమ్మల్ని ఎలా మొదటిసారి సృష్టించాడో అలా మిమ్మల్ని(మరల) జీవింపజేస్తాడు. ఈ విభేదకులందరు ఇలా అంటారు : మమ్మల్ని మరణించిన తరువాత జీవింపజేసి మరలించేవాడు ఎవడు ?. అప్పుడు మీరు వారితో ఇలా అనండి : పూర్వ నమూనా లేకుండా మొదటిసారి మిమ్మల్ని సృష్టించిన వాడే మిమ్మల్ని మరలింపజేస్తాడు. మీరు ఎవరినైతే ఖండించారో వారు ఎగతాళిగా తమ తలలను ఊపుతారు. మరియు వారు దూరమవుతూ ఈ మరలింపు ఎప్పుడు ? అని అంటారు. మీరు బహుశా అది దగ్గరలో ఉన్నదని వారితో అనండి,ఎందుకంటే వచ్చేది ప్రతీది దగ్గరలోనే ఉన్నది.

(52) అల్లాహ్ మిమ్మల్ని ఆ రోజు మరలింపజేస్తాడు ఏ రోజైతే ఆయన మిమ్మల్ని సమీకరించబడే భూమి వద్దకు పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన ఆదేశమునకు విధేయత చూపుతూ,ఆయన స్థుతులను పలుకుతూ పిలుపునకు సమాధానమిస్తారు. మరియు మీరు భూమిలో కొద్ది సమయం మాత్రమే ఉండినట్లు భావిస్తారు.

(53) మరియు ఓ ప్రవక్తా నా పై విశ్వాసమును కనబరచే నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటను పలకమని,ధ్వేషమును కలిగించే చెడ్డ మాట నుండి దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే షైతాను వాటి ద్వారా ప్రయోజనం చెంది వారి మధ్య వారి ఇహలోక,పరలోక జీవితమును సంక్షోభములో నెట్టే చర్యలకు పాల్పడటానికి కృషి చేస్తాడు. నిశ్చయంగా షైతాను మానవునికి స్పష్టమైన శతృవు. అటువంటప్పుడు అతడు అతనితో జాగ్రత్తపడటం అత్యవసరము.

(54) ఓ ప్రజలారా మీ ప్రభువు మీ గురించి బాగా తెలిసినవాడు. మీ నుండి ఆయనపై ఏదీను గోప్యంగా ఉండదు. ఆయన ఒక వేళ మీపై దయ చూపదలచుకుంటే ఆయన మీకు విశ్వాసమును,సత్కార్యమును చేయటమును అనుగ్రహించటం ద్వారా మీపై దయ చూపుతాడు. ఒక వేళ ఆయన మిమ్మల్ని శిక్షించదలచుకుంటే ఆయన మిమ్మల్ని విశ్వాసము నుండి పరాభవమునకు గురి చేసి,అవిశ్వాస స్థితిలో మీకు మరణమును కలిగించి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారిని విశ్వాసమును తీసుకుని రావటానికి బలవంతం పెట్టటానికి,వారిని అవిశ్వాసము నుండి ఆపటానికి,వారి కర్మలను లెక్క పెట్టటానికి వారిపై రక్షకుడిగా (బాధ్యుడిగా) పంపించ లేదు. మీరు కేవలం అల్లాహ్ వద్ద నుండి ఆయన మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని చేరవేసేవారు మాత్రమే.

(55) ఓ ప్రవక్తా భూమ్యాకాశముల్లో ఉన్న వారందరి గురించి మీ ప్రభువు బాగా తెలిసినవాడు,వారి స్థితిగతుల గురించి,వారు దేనికి హక్కుదారులో దాని గురించి బాగా తెలిసిన వాడు. నిశ్చయంగా మేము కొందరు ప్రవక్తలను కొందరిపై అనుసరులను అధికం చేసి,గ్రంధములను అవతరింపజేసి ప్రాధాన్యతను కలిగించాము. మరియు మేము దావుద్ నకు జబూర్ గ్రంధమును ప్రసాధించాము.

(56) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఓ ముష్రికులారా మీరు ఎవరినైతే అల్లాహ్ ను వదిలి దైవాలుగా భావిస్తున్నారో వారిని వేడుకోండి ఒక వేళ మీకు ఏదైన నష్టం వాటిల్లితే వారికి మీ నుండి నష్టమును తొలగించే అధికారం లేదు మరియు వారి అశక్తి వలన దాన్ని మీ నుండి ఇతరులకు మరలించే అధికారం లేదు. ఎవరైతే అశక్తుడై ఉంటాడో వాడు దైవం కాజాలడు.

(57) వారందరు ఎవరినైతే పిలుస్తున్నారో దైవదూతలు,వారిలాంటివారు వారే స్వయంగా తమకు సామిప్యమును కలిగించే సత్కార్యమును కోరుకుంటారు. మరియు వారిలో ఎవరు విధేయత ద్వారా ఎక్కువ దగ్గరవుతారని పోటీపడుతారు. మరియు ఆయన వారిపై దయ చూపాలని ఆశిస్తున్నారు. వారిని ఆయన శిక్షిస్తాడని భయపడుతున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష జాగ్రత్తపడవలసిన వాటిలోంచిది.

(58) ఏ బస్తీ,ఏ నగరము దాని అవిశ్వాసము వలన ఇహ లోకములో మేము వాటిపై శిక్ష,వినాశనము అవతరించకుండా,లేదా వారిని వారి అవిశ్వాసము వలన హతమార్చటం లేదా ఇతర రూపంలో ఉన్న బలమైన శిక్ష ద్వారా పరీక్షించకుండా లేదు. ఈ వినాశనము,శిక్ష లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడిన దైవ నిర్ణయం.

(59) మృతులను జీవింపజేయటం,ఇంకా వాటి లాంటి వాటిని వేటినైతే ముష్రికులు కోరారో ప్రవక్త నీతిపై సూచించే ఇంద్రియ సూచనలను అవతరింపజేయటం మేము వదలలేదు కాని మేము పుర్వ జాతులపై వాటిని అవతరింపజేశాము అప్పుడు వారు వాటిని తిరస్కరించారు. నిశ్చయంగా మేము స్పష్టమైన పెద్ద సూచనను సమూద్ జాతివారికి ప్రసాధించాము.అది ఆడ ఒంటె. అయితే వారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని శీఘ్రంగా శిక్షకు గురి చేశాము.మేము ప్రవక్తల చేతికి సూచనలను ఇచ్చి పంపించేది వారి జాతులవారిని భయపెట్టటానికి మాత్రమే.బహుశా వారు భద్రంగా ఉంటారేమో.

(60) ఓ ప్రవక్తా మేము మీతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి నిశ్చయంగా మీ ప్రభువు ప్రజలను అధికారముతో చుట్టుముట్టాడు.అయితే వారు అతని ఆదీనంలో ఉంటారు. మరియు అల్లాహ్ వారి నుండి మిమ్మల్ని నిరోదిస్తాడు. అయితే మీరు దేన్ని చేరవేసే ఆదేశం ఇవ్వబడినదో దాన్ని చేరవేయండి. ఇస్రా రాత్రిలో మీకు కళ్ళారా చూపించినది ప్రజలకు మేము పరీక్షగా చేయటానికి మాత్రమే. వారు దాన్ని అంగీకరిస్తారా లేదా దాన్ని తిరస్కరిస్తారా ?.మరియు ఖుర్ఆన్ లో ప్రస్తాంవించబడిన జఖ్ఖూమ్ వృక్షము అది నరక పాతాళము నుండి మొలకెత్తుకుని వస్తుంది దాన్ని మేము వారి కొరకు పరీక్షగా మాత్రమే మార్చాము. అయితే వారు ఎప్పుడైతే ఈ రెండు సూచనలను విశ్వసించలేదో అప్పుడు వారు ఇతర సూచనలనూ విశ్వసించరు. మరియు మేము వారిని సూచనలను అవతరింపజేసి భయపెడుతున్నాము. వాటిని అవతరింపజేయటం ద్వారా భయపెట్టటం వలన వారు అవిశ్వాసంలో అధికమవటములో ,అపమార్గంలో ఎక్కవవటములో అధికమయ్యారు.

(61) ఓ ప్రవక్తా మేము దైవదూతలతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి :"మీరు ఆరాధన కొరకు కాకుండా శుభాకాంక్షల సాష్టాంగపడండి".అప్పుడు వారందరు విధేయత చూపి ఆయన కొరకు సాష్టాంగపడ్డారు. కాని ఇబ్లీసు ఆయన కొరకు సాష్టాంగపడటం నుండి అహంకారమును ప్రదర్శిస్తూ ఇలా పలుకుతూ నిరాకరించాడు : "ఏమీ నీవు మట్టితో సృష్టించిన వాడికి నేను సాష్టాంగపడాలా ?.మరియు నీవు నన్ను అగ్నితో పుట్టించావు.అయితే నేనే అతనికన్న గొప్పవాడిని".

(62) ఇబ్లీసు తన ప్రభువుతో ఇలా పలికాడు : నీవు సాష్టాంగపడమని నన్ను ఆదేశించి ఈ సృష్టిని ఎవరికైతే నీవు గౌరవాన్ని ప్రసాధించావో చూశావా ?. ఒక వేళ నీవు ఇహలోక జీవితం చివరి వరకు నన్ను జీవించి ఉండగా వదిలివేస్తే నేను తప్పకుండా అతని సంతానమును మరలింపజేస్తాను,నీ సన్మార్గము నుండి వారిని తప్పించి వేస్తాను. కాని చాలా తక్కువ మందిని నీవు వారిలో నుండి రక్షిస్తావు.మరియు వారే నీ నమ్మకమైన దాసులు.

(63) అప్పుడు నీ ప్రభువు అతనితో నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించిన వారు వెళ్లండి అని ఆదేశించాడు. నిశ్చయంగా నరకము అదే నీ ప్రతిఫలము,వారి ప్రతిఫలము. మీ కర్మల యొక్క సంపూర్ణ ప్రతిఫలము.

(64) నీవు వారిలోంచి ఎవరిని భ్రష్టు పట్టించగలవో వారిని పిలిచే నీ పాపిష్టి స్వరముతో భ్రష్టు పట్టించు. మరియు నీ విధేయత కొరకు పిలిచే నీ ఆశ్విక దళాలతో,పదాతి దళాలతో వారిపై పడు. మరియు నీవు వారి సంపదల్లో ప్రతీ ధర్మ విరుద్ధ ఖర్చులను అలంకరించటం ద్వారా వారికి భాగస్వామి అవ్వు,వారి సంతానము విషయంలో వారిని అబధ్ధములో దావా చేయటం ద్వారా,వారిని వ్యభిచారముతో పొందటం ద్వారా, వారిని పేరు పెట్టే సమయంలో అల్లాహేతరుల కొరకు వారి దాస్యమును అంటగట్టటం ద్వారా వారితో భాగస్వామ్యం అవ్వు. మరియు వారి కొరకు అబధ్ధపు వాగ్ధానాలను,అసత్యపు ఆశలను అలంకరించు.షైతాను వారిని కేవలం మోసానికి గురి చేసే అబధ్ధపు వాగ్ధానమును మాత్రమే చేస్తాడు.

(65) ఓ ఇబ్లీస్ నిశ్చయంగా నా పై విధేయత చూపుతూ ఆచరించే విశ్వాసపరులైన నా దాసులపై నీ ఆధిపత్యం చెల్లదు. ఎందుకంటే అల్లాహ్ వారి నుండి షిర్కును నిర్మూలిస్తాడు. ఎవరైతే తన వ్యవహారాల్లో అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉంటారో వారి కొరకు అల్లాహ్ సంరక్షకునిగా చాలు.

(66) ఓ ప్రజలారా మీ ప్రభువు అతడే ఎవరైతే ఓడలను సముద్రంలో మీరు వ్యాపార ప్రయోజనాలు,ఇతరవాటి ద్వారా అతని ఆహారోపాధిని పొందుతారని ఆశిస్తూ నడిపించాడు. నిశ్చయంగా మీ కొరకు ఈ కారకాలను సౌలభ్యం చేసినప్పుడు మీ ప్రభువు మీపై కారుణ్యమును చూపేవాడయ్యాడు.

(67) ఓ ముష్రికులారా సముద్రంలో మీకు ఆపద,కష్టం కలిగి చివరికి మీకు వినాశన భయము కలిగినప్పుడు అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరు మీ నుండి అదృశ్యమైపోతారు. మరియు మీరు అల్లాహ్ తప్ప ఇంకెవరిని గుర్తు చేసుకోరు, అప్పుడు మీరు ఆయనతోనే సహాయమును అర్ధిస్తారు. ఆయన మీకు సహాయము చేసి మీరు భయపడిన దాని నుండి మిమ్మల్ని రక్షిస్తే మీరు ఒడ్డుకు చేరినప్పుడు మీరు ఆయన ఏకత్వము నుండి,ఆయన ఒక్కడిని అర్ధించటం నుండి విముఖత చూపి,మీ విగ్రహాల వైపు మరలిపోతారు. మానవుడు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నుడైపోయాడు.

(68) ఓ ముష్రుకులారా అల్లాహ్ మిమ్మల్ని ఒడ్డుకు చేర్చినప్పుడు ఆయన మిమ్మల్ని పతనానికి గురి చేయటం నుండి మీరు నిర్భయులైపోయారా ? లేదా లూత్ జాతి వారిపై మేము చేసినట్లు మీపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించి,ఆ తరువాత మీరు మిమ్మల్ని రక్షించేవాడిని,వినాశనం నుండి మిమ్మల్ని ఆపే సహాయకుడెవరినీ పొందలేకపోవటం నుండి నిర్భయులైపోయారా.

(69) లేదా అల్లాహ్ మిమ్మల్ని మొదటి సారి రక్షించి మీపై చేసిన అనుగ్రహమునకు మీరు కృతఘ్నులవటం వలన మిమ్మల్ని రెండవ సారి సముద్రం వద్దకు తీసుకుని వెళ్ళి మీపై తీవ్రమైన గాలిని వీపింపజేసి మిమ్మల్ని ముంచివేసి ఆ తరువాత మేము మీకు చేసిన దాని నుండి సహాయంగా మమ్మల్ని కోరే వాడినెవరినీ మీరు పొందకపోవటం నుండి నిశ్చింతగా ఉన్నారా ?.

(70) మరియు నిశ్చయంగా మేము ఆదమ్ సంతతిని జ్ఞానము ద్వారా,దైవ దూతలను వారి తండ్రిని సాష్టాంగపడేటట్లు చేయటం ద్వారా,ఇతర వాటి ద్వారా గౌరవాన్ని ప్రసాధించాము. మరియు మేము పశువుల్లోంచి,సవారీలలో నుంచి నేలపై వారిని ఎత్తుకుని వెళ్ళే వాటిని,సముద్రంలో వారిని ఎత్తుకుని వెళ్ళే ఓడలను వారి కొరకు ఉపయుక్తంగా చేశాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన తినుబండారాలు,త్రాగే పానియములు,తగిన జతలను ,ఇతరవాటిని ప్రసాధించాము. మరియు మేము వారికి మన సృష్టిలో నుండి చాలా సృష్టితాలపై గొప్ప ప్రాధాన్యతను ప్రసాధించాము. అటువంటప్పుడు వారు తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

(71) ఓ ప్రవక్తా మేము ప్రతీ వర్గమును తమ ఆ నాయకునితోపాటు కలిపి ఎవరినైతే వారు ఇహలోకములో అనుసరించేవారో పిలుస్తాము ఆ రోజును మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.ఎవరికైతే అతని కర్మల పుస్తకమును అతని కుడి చేతిలో ఇవ్వబడిద్దో వారందరు తమ పుస్తకములను సంతోషపడుతూ చదువుతారు. వారి కర్మల ప్రతిఫలములోంచి ఏమీ తగ్గించబడదు. ఒక వేళ అది చిన్నదవటంలో ఖర్జూరపు గింజపై ఉండే దారమంతటిదైనా సరే.

(72) మరియు ఎవరైతే ఈ ఇహ లోక జీవితంలో సత్యమును స్వీకరించటం నుండి,దాన్ని అంగీకరించటం నుండి అంధుడైపోతాడో అతను ప్రళయదినాన అత్యంత అంధునిగా అయిపోతాడు. అప్పుడు అతను స్వర్గము యొక్క దారిని పొందలేడు. సన్మార్గం పొందటం నుండి భ్రష్టుడైపోతాడు. ఆచరణపరంగా ప్రతిఫలం ఉంటుంది.

(73) ఓ ప్రవక్తా ముష్రికులందరు మీరు ఖుర్ఆన్ ను కాకుండా వారి కోరికలకు అనుగుణంగా ఉండే దాన్ని మేము మీకు దివ్య జ్ఞానము ద్వారా ఇచ్చిన ఖుర్ఆన్ నుండి మిమ్మల్ని మరల్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ మీరు వారు కోరిన విధంగా చేస్తే వారు మిమ్మల్ని ఆప్త మితృనిగా చేసుకునేవారు.

(74) ఒక వేళ మేము మిమ్మల్ని సత్యముపై నిలకడచూపేటట్లు చేసి మీపై ఉపకారము చేసి ఉండకపోతే మీరు వారి విశ్వాసము కనబరచటం పై మీ అత్యాశతోపాటు వారి మోసగించటంలో బలము,వారి తీవ్ర కుట్రల వలన వారు మీతో కోరిన విషయంలో మీరు వారి మాట విని వారి వైపున మొగ్గు చూపేవారు. కాని మేము మిమ్మల్ని వారి వైపునకు మొగ్గు చూపటం నుండి రక్షించాము.

(75) ఒక వేళ మీరు వారు కోరిన దాని వైపు మొగ్గు చూపితే మేము తప్పకుండా ఇహ లోక జీవితములో,పరలోకములో రెట్టింపు శిక్షను కలిగిస్తాము.ఆ తరువాత మీరు మాకు వ్యతిరేకంగా సహాయపడటానికి, మీ నుండి శిక్షను నిర్మూలించటానికి సహాయకుడిని పొందలేరు.

(76) అవిశ్వాసపరులు మిమ్మల్ని మక్కా నుండి వెళ్ళగొట్టటానికి తమ శతృత్వము ద్వారా మిమ్మల్నే కలవరపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అల్లాహ్ మీరు మీ ప్రభువు ఆదేశముతో హిజ్రత్ చేసేంత వరకు మిమ్మల్ని వెళ్ళగొట్టటం నుండి వారిని ఆపి ఉంచాడు. వారు ఒక వేళ వారు మిమ్మల్ని వెళ్ళగొడితే మిమ్మల్ని వెళ్ళగొట్టిన తరువాత కొద్ది కాలం మాత్రమే ఉండగలుగుతారు.

(77) మీ తర్వాత వారు కొద్ది కాలము తప్ప ఉండరన్న ఈ తీర్పు మీ కన్నపూర్వ ప్రవక్తల్లో ఎల్లప్పుడు స్థిరంగా ఉన్న సంప్రదాయము. అదేమిటంటే ఏ ప్రవక్తను అతని జాతి వారు తమ మధ్య నుండి వెళ్ళగొడతారో వారిపై అల్లాహ్ శిక్షను అవతరింపజేస్తాడు. ఓ ప్రవక్తా మీరు మా సంప్రదాయములో మార్పును పొందలేరు. కాని మీరు దాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా పొందుతారు.

(78) మీరు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో దాని వేళల్లో సూర్యుడు ఆకాశము మధ్య నుండి వాలినప్పటి నుండి - ఇందులో జొహర్,అసర్ నమాజులు ఉన్నాయి - రాత్రి చీకటి వరకు - ఇందులో మగ్రిబ్,ఇషా నమాజులు ఉన్నవి - నెలకోల్పండి. మరియు మీరు ఫజర్ నమాజును నెలకోల్పండి,అందులో ఖిరాఅత్ (ఖుర్ఆన్ పారాయణము) ను సుదీర్ఘంగా చేయండి. ఫజర్ నమాజు వేళ రాత్రి దైవ దూతలు,పగటి దైవ దూతలు హాజరవుతారు.

(79) ఓ ప్రవక్తా నీవు రాత్రి నిలబడి అందులో కొద్ది భాగము నమాజు చదువు. నీ నమాజు నీ కొరకు నీ స్థానములను పెంచటంలో అధికమవటానికి, ప్రళయదినాన నీ ప్రభువు నిన్ను ప్రజల కొరకు వారు ఉన్న భయాందోళనల నుండి సిఫారసు చేసే వాడిగా పంపిస్తాడని అన్వేషిస్తూ, నీ కొరకు సిఫారసు యొక్క గొప్ప స్థానము దేనినైతే ముందువారు ,చివరి వారు పొగిడారో అది కలగటానికి.

(80) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నా ప్రవేశాలన్నింటిని,నా బహిర్గమనాలన్నింటిని నీ విధేయతలో,నీ ఇష్టానుసారంగా ఉండేటట్లు చేయి. మరియు నీ వద్ద నుండి నాకు నీవు నా శతృవు కి విరద్ధంగా సహాయపడటానికి బహిరంగ ఆధారమును తయారు చేసి ఇవ్వు.

(81) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఇస్లాం వచ్చింది.అల్లాహ్ దానికి సహాయము చేసి దాని ద్వారా ఏదైతే వాగ్ధానం చేశాడో అవి నిరూపితమైనవి. మరియు షిర్క్,అవిశ్వాసం అంతరించింది. నిశ్చయంగా అసత్యము సత్యం ముందట నిలబడలేక అంతరించిపోతుంది.

(82) మేము అవతరింపజేస్తున్నటువంటి ఈ ఖుర్ఆన్ అజ్ఞానము,అవిశ్వాసము,సందేహము నుండి హృదయముల కొరకు స్వస్థత కలది, దాన్ని చదివి ఊదినప్పుడు శరీరముల కొరకు స్వస్థత కలది, దాని ప్రకారం ఆచరించే విశ్వాసపరుల కొరకు కారుణ్యము కలది. ఈ ఖుర్ఆన్ అవిశ్వాసపరుల కొరకు వినాశనమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే దాన్ని వింటే అది వారికి ఆగ్రహమును కలిగిస్తుంది, దాని నుండి తిరస్కారమును,విముఖతను వారికి అధికం చేస్తుంది.

(83) మరియు మేము మానవునికి ఆరోగ్యము,ఐశ్వర్యము లాంటి అనుగ్రహాలను అనుగ్రహించినప్పుడు అతడు అల్లాహ్ కి కృతజ్ఞత తెలపటం నుండి,ఆయనకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడు,అహంకారముతో దూరమవుతాడు. మరియు అతనికి అనారోగ్యము లేదా పేదరికం,అటువంటివి ఏవైన కలిగినప్పుడు అతడు అల్లాహ్ కారుణ్యము నుండి తీవ్రంగా నిరాశ,నిస్పృహలకు లోనవుతాడు.

(84) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ప్రతీ మనిషి సన్మార్గ విషయంలో,అపమార్గ విషయంలో తన పరిస్థితికి తగిన విధమైన తన పద్దతి ప్రకారం ఆచరిస్తున్నాడు. అయితే సత్యం వైపునకు మార్గం ప్రకారం సన్మార్గం పొందిన వాడెవడో మీ ప్రభువుకు బాగా తెలుసు.

(85) ఓ ప్రవక్తా గ్రంధవహులలో నుండి అవిశ్వాసపరులు మీతో ఆత్మ యొక్క వాస్తవికత గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : ఆత్మ యొక్క వాస్తవికత గురించి అల్లాహ్ కి మాత్రమే తెలుసు. మరియు మీకు,సృష్టితాలన్నిటికి ఇవ్వబడిన జ్ఞానము పరిశుద్ధుడైన అల్లాహ్ జ్ఞానము ముందు చాలా తక్కువ.

(86) అల్లాహ్ సాక్షిగా ఓ ప్రవక్తా ఒక వేళ మేము మీపై అవతరింపజేసిన దైవ వాణిని హృదయముల నుండి,పుస్తకముల నుండి చరిపివేసి తీసుకుని వెళ్ళదలిస్తే తప్పకుండా మేము దాన్ని తీసుకుని వెళతాము. ఆ తరువాత మీకు సహాయపడి ఆయన స్పందనకు బాధ్యత వహించేవాడిని మీరు పొందలేరు.

(87) కానీ నీ ప్రభువు తరపు నుండి కారుణ్యముగా దాన్ని మేము తీసుకుని వెళ్ళ లేదు. మరియు దాన్ని మేము భద్రంగా ఉంచాము. నిశ్చయంగా నిన్ను ప్రవక్తగా చేసినప్పుడు,ప్రవక్తల పరంపర నీతో సమాప్తం చేసినప్పుడు,నీ పై ఖుర్ఆన్ ను అవతరింపజేసినప్పుడు నీ పై నీ ప్రభువు యొక్క అనుగ్రహము ఎంతో గొప్పది.

(88) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ మానవులు, జిన్నులు అందరు కలిసి మీపై అవతరింపబడినదైన ఈ ఖుర్ఆన్ దాని వాగ్ధాటిలో,దాని మంచి వ్యవస్థీకరణలో,దాని స్పష్టతలో పోలిటువంటి దానిని తీసుకుని రాదలచుకుంటే ఖచ్చితంగా వారు ఎన్నటికి తీసుకుని రాలేరు. ఒక వేళ వారు ఒకరికొకరు సహాయసహకారాలు చేసుకున్నా కూడా.

(89) నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు స్పష్టపరచాము మరియు అందులో దాని ద్వారా గుణపాఠం నేర్చుకోబడే ప్రతీది హితబోధనల్లో నుండి,గుణపాఠాల్లో నుండి,ఆదేశాలలో నుండి,వారింపులలో నుండి,గాధలలో నుండి అన్ని రకాల వాటిని వారు విశ్వసిస్తారని ఆశిస్తూ వివరించాము. అయితే చాలా మంది ప్రజలు ఈ ఖుర్ఆన్ పట్ల వ్యతిరేకతను,నిరాకరణను విడనాడలేదు.

(90) ముష్రికులు నీవు మా కొరకు మక్కా నేల నుండి ఎన్నటికి ఎండని,ప్రవహించే సెలయేరును తీసేంత వరకు మేము నీపై విశ్వాసమును కనబరచము అని అన్నారు.

(91) లేదా నీ కొరకు ఖర్జూరపు,ద్రాక్ష వృక్షాలు కలిగి అందులో నుంచి భారీగా ప్రవహించే కాలువలు గల ఒక తోట ఉండాలి.

(92) లేదా నీవు ప్రస్తావించినట్లు ఆకాశము నుండి శిక్ష ముక్క మాపై వచ్చిపడాలి లేదా నీవు అల్లాహ్ ను,దైవ దూతలను ప్రత్యక్షంగా తీసుకుని వచ్చి వారు నీ కొరకు నీవు వాదిస్తున్నది సరైనదని సాక్ష్యం చెప్పనంత వరకు.

(93) లేదా నీ కొరకు బంగారముతో గాని ఇతర వాటితో గాని అలంకరించబడిన గృహము ఉండాలి లేదా నీవు ఆకాశము వైపు ఎక్కాలి, ఒక వేళ నీవు దాని వైపు ఎక్కినా అల్లాహ్ వద్ద నుండి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము చదవటానికి వ్రాయబడిన ఏదైన గ్రంధమును తీసుకుని నీవు దిగితే కానీ నీవు ప్రవక్తగా పంపించబడినావని మేము విశ్వసించమంటే విశ్వసించము. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : నా ప్రభువు పరిశుద్ధుడు. నేను ప్రవక్తలందరి మాదిరిగా ఒక మానవుడైన ప్రవక్తను మాత్రమే.నాకు నేనే దేనిని తీసుకుని వచ్చే అధికారము లేదు అటువంటప్పుడు మీరు ప్రతిపాదించిన దాన్ని నేను తీసుకుని రావటం ఎలా సాధ్యం అవుతుంది ?.

(94) అవిశ్వాసపరులను అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి,ప్రవక్త తీసుకుని వచ్చిన దానిపై అమలు చేయటం నుండి ఆపినది కేవలం వారు తిరస్కార వైఖరితో "ఏమీ అల్లాహ్ మా వద్దకు మనషుల్లోండి ఒక ప్రవక్తను పంపించాడా ?" అని పలికిన వేళ ప్రవక్త మానవుల రకంలో నుండి కావటమును వారి తిరస్కారము మాత్రమే .

(95) ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఒక వేళ భూమిపై దైవ దూతలే అందులో నివసిస్తూ ఉండి మీ పరిస్థితి మాదిరిగా వారు నిశ్చింతగా సంచరిస్తూ ఉంటే మేము ఖచ్చితంగా వారి వద్దకు వారిలో నుండే ఒక దైవ దూతను ప్రవక్తగా పంపిస్తాము. ఎందుకంటే అతను తాను దేనిని తీసుకుని వచ్చాడో (పంపించబడ్డాడో) దాన్ని వారికి అర్ధం అయ్యేటట్లు చెప్పగలడు. అటువంటప్పుడు వారి వద్దకు (దైవ దూతల వద్దకు) మానవుల్లో నుండి ఒకరిని ప్రవక్తగా పంపించటం వివేకము కాదు. అలాగే మీ పరిస్థితి కూడాను.

(96) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాను అనటానికి,నేను మీ వద్దకు ఇచ్చి పంపించబడిన సందేశాలను మీకు చేర వేశాను అనటానికి నాకు,మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. నిశ్చయంగా ఆయన తన దాసుల స్థితులను చుట్టుముట్టి ఉన్నాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. వారి మనసుల్లో గోప్యంగా ఉన్న ప్రతీ దానిని వీక్షిస్తున్నాడు.

(97) వాస్తవానికి అల్లాహ్ ఎవరికి సన్మార్గమును పొందే సౌభాగ్యమును ప్రసాధిస్తాడో వాడే సన్మార్గంపై ఉన్నాడు. దాని నుండి ఆయన ఎవరిని పరాభవమునకు లోను చేసి మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో ఓ ప్రవక్తా మీరు వారి కొరకు సత్యం వైపునకు దారి చూపే,వారి నుండి చెడును నిర్మూలించే,వారికి ప్రయోజనమును తీసుకుని వచ్చే రక్షకులను పొందరు. మరియు మేము వారిని ప్రళయ దినాన వారు చూడకుండా,మాట్లాడకుండా,వినకుండా వారి ముఖములపై ఈడ్చబడినట్లు ఉన్న స్థితిలో సమీకరిస్తాము. వారు ఆశ్రమం పొందే వారి నివాసము నరకము. దాని జ్వాలలు చల్లారినప్పుడల్లా మేము వారిపై మండించటమును అధికం చేస్తాము.

(98) ఈ శిక్ష ఏదైతే వారు పొందుతారో అది మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన,మరణాంతర జివితమును దూరంగా భావించి ఇలా వారి పలకటం వలన వారి ప్రతిఫలము : ఏమీ మేము మరణించి కృసించిపోయిన ఎముకలవలె మారిపోయి ముక్కలు ముక్కలై భాగములుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము సరిక్రొత్త సృష్టిగా లేపబడుతామా ?.

(99) ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరికి భూమ్యాకాశములను గొప్పగా సృష్టించిన వాడు వారి లాంటివారిని సృష్టించటంపై సమర్ధుడని తెలియదా ?. అయితే ఎవరైతే గొప్పవైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు దాని కన్నఅల్పమైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు. ఇహలోకంలో అల్లాహ్ వారి కొరకు ఒక నిర్ణీత సమయమును ఎందులోనైతే వారి జీవితం ముగుస్తుందో తయారు చేశాడు. మరియు వారిని మరణాంతరం లేపటం కొరకు ఎటువంటి సందేహం లేని ఒక గడువును తయారు చేశాడు. ముష్రికులు మరణాంతరం లేపబడటం యొక్క ఆధారాలు బహిర్గతమైనా కూడా,దాని ఆధారాలు స్పష్టమైనా కూడా మరణాంతరము లేపబడటమును తిరస్కరించకుండా ఉండరు.

(100) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఒక వేళ అంతం కాని,ముగియని నా ప్రభువు యొక్క కారుణ్యము యొక్క నిక్షేపాలు మీ ఆదీనంలో ఉంటే అప్పుడు మీరు పేదవారిగా కాకుండా ఉండేంత వరకు అవి అంతం అయిపోతాయన్న భయంతో ఖర్చు చేయకుండా ఆగిపోతారు. మరియు మనిషి పిసినారి అని సీలు వేయబడ్డాడు. కాని ఒక వేళ అతను విశ్వాసపరుడైతే అతడు అల్లాహ్ పుణ్యమును ఆశిస్తూ ఖర్చు చేస్తాడు.

(101) మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు ఆయన కొరకు సాక్ష్యం పలికే తొమ్మిది స్పష్టమైన మహిమలను (ఆధారాలను) ప్రసాధించాము.అవి 1-చేతి కర్ర, 2-చేయి (యదే బైజా), 3-కరువుకాటకాలు, 4-ఆహార ధాన్యాల్లో,ఫలాల్లో కొరత, 5-తుఫాను,6-మిడుతల దండు, 7-పేలు, 8-కప్పలు, 9-రక్తము. అయితే ఓ ప్రవక్తా మీరు యూదులను మూసా వారి పూర్వికుల వద్దకు ఈ మహిమలను తీసుకుని వచ్చినప్పటి వైనమును గురించి అడగండి. అప్పుడు ఫిర్ఔన్ ఆయనతో ఇలా అన్నాడు : ఓ మూసా నీవు తీసుకుని వచ్చిన ఈ వింతల వలన నేను నిన్ను చేతబడి (మంత్రజాలము) చేయబడిన ఒక వ్యక్తిగా భావిస్తున్నాను.

(102) మూసా అలైహిస్సలాం అతని మాటలను ఖండిస్తూ ఇలా పలికారు : ఓ పిర్ఔన్ భూమ్యాకాశముల ప్రభువైన అల్లాహ్ మాత్రమే ఈ మహిమలను అవతరింపజేశాడని నీకు ఖచ్చితంగా తెలుసు. ఆయన వాటిని తన సామర్ధ్యమునకు,తన ప్రవక్త నిజాయితీకి ఆధారాలుగా అవతరింపజేశాడు. కాని నీవు తిరస్కరించావు. ఓ ఫిర్ఔన్ నీవు వినాశనమునకు గురై నష్టపోతావని నిశ్చయంగా నాకు బాగా తెలుసు.

(103) అప్పుడు ఫిర్ఔన్, మూసా అలైహిస్సలాం,ఆయన జాతి వారిని మిసర్ నుండి వెళ్ళగొట్టి శిక్షించదలచాడు. అప్పుడు మేము అతన్ని,అతనితోపాటు ఉన్న అతని సైన్యములందరినీ ముంచి తుదిముట్టించాము.

(104) మరియు ఫిర్ఔన్,అతని సైన్యములను తుదిముట్టించిన తరువాత మేము ఇస్రాయీలు సంతతి వారితో మీరు షామ్ (సిరియా) ప్రాంతములో నివశించండి. ప్రళయ దినం అయినప్పుడు మేము మీరందరిని మహ్షర్ లో లెక్క తీసుకోవటానికి తీసుకుని వస్తాము.

(105) ఈ ఖుర్ఆన్ ను మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సత్యముతో అవతరింపజేశాము. అది సత్యముతో ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఆయనపై అవతరించింది. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని భీతి కలవారికి స్వర్గపు శుభవార్తనిచ్చేవాడిగా,అవిశ్వాసపరులకు ,పాపాత్ములకు నరకము నుండి భయపెట్టే వానిగా మాత్రమే పంపించాము.

(106) మరియు మీరు ఖుర్ఆన్ ని ప్రజలపై చదివేటప్పుడు నెమ్మదిగా,ఆగిఆగి చదువుతారని ఆశిస్తూ మేము దాన్ని ఖుర్ఆన్ గా అవతరింపజేసి దాన్ని వివరింపజేశాము,స్పష్టపరచాము. ఎందుకంటే అది అర్ధం చేసుకోవటానికి,యోచన చేయటానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మరియు మేము దాన్ని సంఘటనల,స్థితుల లెక్క ప్రకారం వంతులవారిగా,విడివిడిగా అవతరింపజేశాము.

(107) ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ఆయనపై విశ్వాసమును కనబరచండి. మీ విశ్వాసము ఆయనకు ఏమీ అధికం చేయదు లేదా మీరు ఆయనను విశ్వసించకపోయినా (ఏమీ అధికం చేయదు). మీ అవిశ్వాసం ఆయనది ఏమీ తరిగించదు. నిశ్చయంగా ఎవరైతే పూర్వ దివ్య గ్రంధాలను చదివి,దైవ వాణి,దైవ దౌత్యమును గుర్తించారో వారిపై ఖుర్ఆన్ చదివి వినిపించబడినప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సాష్టాంగపడుతూ తమ ముఖములపై బొర్లా పడిపోతారు.

(108) మరియు వారు తమ సజ్దాలలో ఇలా పలుకుతారు : మా ప్రభువు వాగ్ధానమును నెరవేర్చకుండా ఉండటం నుండి అతీతుడు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం (ప్రవక్తగా పంపించటం) గురించి ఏదైతే వాగ్ధానం చేశాడో అది నెరవేరుతుంది. నిశ్చయంగా దాని గురించి,వేరే దాని గురించి మా ప్రభువు వాగ్ధానము ఖచ్చితముగా నెరవేరుతుంది.

(109) మరియు వారు అల్లాహ్ కొరకు సాష్టాంగపడుతూ ఆయన భయముతో ఏడుస్తూ తమ ముఖములపై పడిపోతారు. ఖుర్ఆన్ ను వినటం,దాని అర్ధాల్లో యోచన చేయటం అల్లాహ్ కొరకు వినమ్రతను,ఆయన భీతిని వారికి అధికం చేస్తుంది.

(110) ఓ ప్రవక్తా దుఆలో మీ మాటలైన యా అల్లాహ్,యా రహ్మాన్ ను విభేదించిన వారితో ఇలా పలుకు : అల్లాహ్,అర్రహ్మాన్ పరిశుద్ధుడైన ఆయన నామములు. అయితే మీరు వాటిలో నుండి దేని ద్వారా నైన లేదా అవి కాకుండా ఆయన నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. పరిశుద్ధుడైన ఆయన కొరకు మంచి నామములు కలవు. ఈ రెండూ వాటిలో నుంచే. అయితే మీరు ఆ రెండిటి ద్వారా లేదా ఆయన మంచి నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. మరియు నీవు నీ నమాజులో ఖుర్ఆన్ పరాయణమును ముష్రికులు వినేటట్లుగా బిగ్గరగా చేయకు మరియు విశ్వాసపరులు దానిని విననట్లుగా మెల్లగా చేయకు. ఆ రెండింటి మద్య మార్గమును అవలింబించు.

(111) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : పొగడ్తలన్నీ అన్నీ రకాల పొగడ్తలకు అర్హుడైన ఆ అల్లాహ్ కొరకే ఎవడైతే సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు,భాగస్వామి కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన రాజరికములో ఆయనకి ఎటువంటి భాగస్వామి లేడు.ఆయనకు ఎటువంటి అవమానము గాని,పరాభవము గాని కలగదు. ఆయనకు మద్దతునిచ్చే,బలోపేతం చేసే వారు ఆయనకు అవసరం లేదు. నీవు ఆయన గొప్పతనమును ఎక్కువగా కొనియాడు. అయితే నీవు ఆయన కొరకు ఎటువంటి సంతానమును గాని,రాజరికంలో ఎటువంటి భాగస్వామిని గాని ఎటువంటి సహాయం చేసేవాడు మద్దతునిచ్చే వాడిని గాని అంటగట్టకు.