(1) (طه) తా-హా! సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఓ ప్రవక్తా మీపై విశ్వాసము కనబరచటం నుండి మీ జాతి వారు విముఖత చూపటంపై మీ మనస్సును చింతనలో పడవేయటములో కారణమవటానికి మేము ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేయలేదు.
(3) అల్లాహ్ తన నుండి భయపడటం కొరకు ఎవరిని అనుగ్రహించాడో వారికి హితోపదేశం కావటానికి మాత్రమే మేము దాన్ని అవతరింపజేశాము.
(4) భూమిని సృష్టించిన,ఎత్తైన ఆకాశములను సృష్టించినటువంటి అల్లాహ్ దాన్ని అవతరింపజేశాడు. అది గొప్పదైనటువంటి ఖర్ఆన్ ఎందుకంటే అది గొప్పవాడి వద్ద నుండి అవరింపజేయబడినది.
(5) అనంత కరుణామయుడు సింహాసనం పై ఆశీనుడైనాడు. సర్వ శక్తిమంతుడైన,పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అతనికి ఇది తగినది.
(6) ఆకాశములలో ఉన్న,భూమిలో ఉన్న,మట్టి క్రింద ఉన్న సృష్టితాలన్ని సృష్టిపరంగా,అధికారపరంగా,పర్యాలోచన పరంగా పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి కొరకే.
(7) ఓ ప్రవక్త ఒక వేళ మీరు బిగ్గరగా మాట్లాడినా లేదా నెమ్మదిగా మాట్లాడినా నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయనకు అవన్ని తెలుసు. ఆయనకు రహస్యము,ఇంకా రహస్యము కన్న దాగి ఉన్న మనస్సులో కలిగే ఆలోచనలు సైతం ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(8) అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు.అందములో పరిపూర్ణతకు చేరిన పేర్లు ఆయన ఒక్కడికే కలవు.
(9) ఓ ప్రవక్తా ఇమ్రాన్ కుమారుడైన మూసా అలైహిస్సలాం సమాచారము మీకు చేరినది.
(10) ఆయన తన ప్రయాణములో ఒక మంటను చూసినప్పుడు తన ఇంటివారితో ఇలా పలికారు : మీరు మీ ఈ చోటే ఆగండి.నిశ్ఛయంగా నేను ఒక మంటను చూశాను . బహుశా నేను ఈ మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను లేదా నాకు మార్గమును చూపేవాడిని నేను పొందుతాను.
(11) ఎప్పుడైతే ఆయన మంట దగ్గరకు వచ్చారో పరిశుద్ధుడైన అల్లాహ్ తన మాట ద్వారా ఆయనను ఇలా పిలిచాడు : ఓ మూసా.
(12) నిశ్ఛయంగా నేనే మీ ప్రభువును. అయితే మీరు నా ప్రార్ధన కోసం మీ చెప్పులను విడవండి. నిశ్ఛయంగా మీరు పవిత్రమైన లోయలో (తువా) ఉన్నారు.
(13) ఓ మూసా నేను నా సందేశములను చేరవేయటానికి నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నీ వైపు నేను దైవ వాణి రూపంలో అవతరింపజేసిన దాన్ని విను.
(14) నిశ్ఛయంగా నేనే అల్లాహ్ ని,నేను తప్ప ఇంకెవరూ వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అటువంటప్పుడు నీవు నా ఒక్కడినే ఆరాధించు మరియు నమాజును పరిపూర్ణ పద్దతిలో అందులో నీవు నన్ను స్మరించటానికి పాటించు.
(15) నిశ్ఛయంగా ప్రళయం ఖచ్చితంగా వస్తుంది, వాటిల్లుతుంది. దాదాపు నేను దాన్ని దాచి ఉంచుతాను అప్పుడు దాని సమయము గురించి ఏ సృష్టికి తెలియదు. కాని ప్రతీ వ్యక్తి తాను చేసిన కర్మ అది మంచిదైన గాని చెడ్డదైనా గాని దాని ప్రతిఫలం ఇవ్వబడడానికి వారికి దైవ ప్రవక్త తెలియపరచటం ద్వారా వారు దాని సూచనలను తెలుసుకుంటారు.
(16) అయితే అవిశ్వాసపరుల్లోంచి దాన్ని విశ్వసించకుండా తన మనసు కోరిన నిషిధ్ధ వాటి వెనుక పడిపోయిన వాడు నిన్ను దాన్ని విశ్వసించి దాని కొరకు సత్కర్మ ద్వారా సిద్ధం అవటం నుండి మరలించకూడదు. దాని కారణం చేత నీవు వినాశనమునకు గురి అవుతావు.
(17) మరియు ఓ మూసా నీ కుడి చేతిలో ఉన్నది అది ఏమిటి ?.
(18) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇది నా చేతి కర్ర .నేను నడిచే సమయంలో దాని సహకారం తీసుకుంటాను,దానితో చెట్టును దాని ఆకులు నా మేకలపై రాలటానికి వేగంగా గుంజుతాను,నేను ప్రస్తావించని ప్రయోజనాలు అందులో ఇంకా ఉన్నాయి.
(19) ఆల్లాహ్ ఇలా పలికాడు : ఓ మూసా మీరు దానిని పడవేయండి.
(20) అప్పుడు మూసా దాన్ని పడవేశారు. అప్పుడు అది పాముగా మారి వేగముగా,తేలికగా చలించసాగింది.
(21) అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : మీరు చేతి కర్రను తీసుకోండి అది పాముగా మారటమును చూసి భయపడకండి. మీరు దాన్ని తీసుకున్నప్పుడు మేము దాని మొదటి స్థితిలోకి మరలింపజేస్తాము.
(22) మరియు మీ చేతిని మీ ప్రక్క వైపు (చంకలో) నొక్కిపెట్టు అది బొల్లి లేకుండా తెల్లగా మారి బయటకు వస్తుంది. అది నీ కొరకు రెండవ సూచన.
(23) ఓ మూసా మేము మీకు మా సామర్ధ్యమును సూచించే ,మీరు అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే మా పెద్ద సూచనలను చూపించటానికి ఈ రెండు సూచనలను మీకు చూపించాము.
(24) ఓ మూసా మీరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళండి .ఎందుకంటే అతడు అవిశ్వాసములో,అల్లాహ్ పై తిరుగుబాటులో హద్దు మీరిపోయాడు.
(25) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను బాధను భరించటానికి నా హృదయమును నా కొరకు వికసింపచేయి.
(26) మరియు నా కొరకు నా వ్యవహారమును సులభతరం చేయి.
(27) మరియు నాకు స్పష్టమైన మాట మాట్లాడే సామర్ధ్యమును ప్రసాధించు.
(28) వారికి నేను నీ సందేశమును చేరవేసినప్పుడు వారు నా మాటలను అర్ధం చేసుకోవటానికి.
(29) మరియు నా ఇంటి వారిలోంచి నా వ్యవహారముల్లో నాకు సహాయపడే ఒక సహాయకుడిని నియమించు.
(30) నా సోదరుడైన ఇమ్రాన్ కొడుకైన హారూన్ ను.
(31) అతని ద్వారా నా వీపును బలోపేతం చేయి.
(32) మరియు సందేశమును చేరవేసే విషయంలో నీవు అతడిని నాకు భాగస్వామిగా చేయి.
(33) మేము నీ పవిత్రతను ఎక్కువగా కొనియాడటానికి.
(34) మరియు మేము నీ స్మరణను అధికంగా చేయటానికి.
(35) నిశ్ఛయంగా నీవు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటావు. మా వ్యవహారములోంచి ఏదీ నీపై గోప్యంగా ఉండదు.
(36) అల్లాహ్ ఇలా పలికాడు : ఓ మూసా నిశ్ఛయంగా మేము నీవు కోరినదంతా నీకు ప్రసాధించాము.
(37) మరియు నిశ్ఛయంగా మేము నీపై మరోకసారి అనుగ్రహించాము.
(38) మేము నీ తల్లికి సూచన ఇచ్చినప్పుడు ఇచ్చిన సూచన అల్లాహ్ దాని ద్వారా నిన్ను ఫిర్ఔన్ కుట్ర నుండి రక్షించాడు.
(39) నిశ్ఛయంగా మేము ఆమెకు సూచించినప్పుడు ఇలా ఆదేశించాము : నీవు అతడు జన్మించిన తరువాత అతడిని ఒక పెట్టిలో వేసి,పెట్టెను సముద్రంలో పడవేయి. అప్పుడు సముద్రం దాన్ని మా ఆదేశముతో ఒడ్డున పడవేస్తుంది. ఆ తరువాత నాకు,అతనుకు శతృవైన ఫిర్ఔన్ అతడిని ఎత్తుకుంటాడు. మరియు నేను నా తరపు నుండి నీపై ప్రేమను కురిపించాను. అప్పుడు ప్రజలు నిన్ను ఇష్టపడ్డారు మరియు నిన్ను నా కళ్ళ ముందు,నా సంరక్షణలో,నా పర్యవేక్షణలో పోషించటానికి.
(40) నీ సోదరి నడుస్తూ బయలదేరినప్పుడు పెట్టె నడిచినప్పుడల్లా ఆమె దానిని అనుసరించసాగింది. అయితే దాన్ని తీసుకున్న వారితో ఆమె ఇలా పలికింది : అతడిని పరి రక్షించే,పాలు త్రాపించే,పోషించే వారిని నేను మీకు తెలియపరచనా ?. అప్పుడు మేము నిన్ను నీ తల్లి వద్దకు చేర్చి ఆమె వద్దకు నీవు చేరటం వలన ఆమె సంతోషపడటానికి,నీ వలన ఆమె దుఃఖించకుండా ఉండటానికి నీపై ఉపకారము చేశాము. మరియు నీవు పిడికిలి గుద్ది ఖిబ్తీని హతమార్చావు. అయితే మేము శిక్ష నుండి నిన్ను కాపాడటం ద్వారా నీపై ఉపకారం చేశాము. నీవు ఎదుర్కున్న ప్రతీ పరీక్ష నుండి ఒక దాని తరువాత ఒకటి నుండి నిన్ను మేము విముక్తిని కలిగించాము. అప్పుడు నీవు బయలుదేరి వెళ్ళి,మద్యన్ వాసుల్లో కొన్ని సంవత్సరములు నివాసమున్నావు. ఆ తరువాత ఓ మూసా నీతో మాట్లాడటానికి నీవు రావటానికి నీ కొరకు నిర్ణయించబడిన సమయంలో నీవు వచ్చావు.
(41) మరియు నీ వైపు నేను అవతరింపజేసిన దైవవాణిని ప్రజలకు చేరవేసే ప్రవక్తగా నా వద్ద నుండి నేను నిన్ను ఎంచుకున్నాను.
(42) ఓ మూసా నీవు,నీ సోదరుడు హారూన్ అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వముపై సూచించే మా సూచనలను తీసుకుని వెళ్ళండి.మరియు మీరిద్దరు నా వైపు పిలవటం నుండి,నన్ను స్మరించటం నుండి బలహీనపడకండి.
(43) ఓ మూసా మీరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళండి . ఎందుకంటే అతడు అవిశ్వాసములో,అల్లాహ్ పై తిరుగుబాటులో హద్దు మీరిపోయాడు.
(44) అయితే మీరిద్దరు అతనితో ఎటువంటి కఠినత్వంలేని మృధువైన మాటను అతడు హితోపదేశం గ్రహించి,అల్లాహ్ కి భయపడి పశ్చాత్తాప్పడతాడని ఆశిస్తూ పలకండి.
(45) మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం ఇలా పలికారు : అతనికి దావత్ ఇవ్వటం పూర్తి కాక ముందే శిక్షించటంలో తొందర చేస్తాడని లేదా హతమార్చటం ద్వారా లేదా ఇతర వాటి ద్వారా మాపై హింసకు పాల్పడటంలో అతడు హద్దు మీరుతాడని మేము భయపడుతున్నాము.
(46) అల్లాహ్ వారిద్దరితో ఇలా పలికాడు : మీరిద్దరు భయపడకండి. నిశ్ఛయంగా నేను సహాయము ద్వారా,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాను. మరియు మీకు,అతడికి మధ్య సంభవించేది వింటాను,చూస్తాను.
(47) అయితే వారిద్దరు అతని వద్దకు వచ్చి అతనితో ఇలా పలికారు : ఓ ఫిర్ఔన్ నిశ్చయంగా మేమిద్దరం నీ ప్రభువు యొక్క ప్రవక్తలము. అయితే నీవు మాతోపాటు ఇస్రాయీలు సంతతివారిని పంపించు. వారి మగ సంతానమును హతమార్చి వారి స్త్రీలను జీవించి ఉండేటట్లు వదిలి వారిని శిక్షించకు. నిశ్ఛయంగా మేము నీ వద్దకు నీ ప్రభువు వద్ద నుండి మా నిజాయితీపై ఆధారమును తీసుకుని వచ్చాము. మరియు విశ్వసించి అల్లాహ్ మార్గమును అనుసరించే వారికి అల్లాహ్ శిక్ష నుండి రక్షణ ఉన్నది.
(48) నిశ్చయంగా అల్లాహ్ సూచనలను తిరస్కరించి,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి గురించి విముఖత చూపే వారిపై ఇహలోకములో,పరలోకమలో శిక్ష ఉన్నదని అల్లాహ్ దైవ వాణి ద్వారా తెలియపరచాడు.
(49) ఫిర్ఔన్ వారిద్దరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరిస్తూ ఇలా పలికాడు : ఓ మూసా మిమ్మల్నిద్దరిని నా వద్దకు ప్రవక్తగా పంపించాడని మీరు వాదిస్తున్న మీ ఇద్దరి ప్రభువు ఎవడు ?.
(50) మూసా ఇలా పలికారు : మా ప్రభువు అతడే ఎవడైతే ప్రతీ వస్తువుకు దానికి సరిఅగు రూపమును,ఆకారమును ప్రసాధించి ఆ తరువాత సృష్టితాలన్నింటిని దేని కొరకైతే సృష్టించాడో దాని మార్గదర్శకం చేశాడు.
(51) ఫిర్ఔన్ ఇలా అడిగాడు : అయితే అవిశ్వాసంపై ఉండే పూర్వపు సమాజాల సంగతేమిటి ?.
(52) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు : ఈ సమాజాల వారు దేనిపైనైతే ఉన్నారో దాని జ్ఞానము నా ప్రభువు వద్ద లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉన్నది. దాని జ్ఞానం విషయంలో నా ప్రభువు పొరబడడు,దానిలో నుండి ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని మరవడు.
(53) నా ఆ ప్రభువు వద్ద ఎవరైతే మీ కొరకు భూమిని దానిపై జీవనం కొరకు చదునుగా చేశాడో . మరియు అందులో మీ కొరకు దానిపై నడవటానికి సరైన మార్గములను ఏర్పాటు చేశాడు. మరియు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడు. అప్పుడు మేము ఆ నీటి ద్వారా రకరకాల వేరు వేరు మొక్కలను వెలికితీశాము.
(54) ఓ ప్రజలారా మేము మీ కొరకు వెలికితీసిన శుద్ధమైన వాటిలోంచి తినండి మరియు మీ పశువులకు మేపించండి,నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలలో బుద్ధిమంతుల కొరకు అల్లాహ్ సామర్ధ్యం పై,ఆయన ఏకత్వంపై సూచనలు కలవు.
(55) భూమి మట్టి నుండి మేము మీ తండ్రి అయిన ఆదమ్ అలైహిస్సలాంను సృష్టించాము. మరియు మీరు మరణించినప్పుడు అందులోనే మేము పూడ్చటం ద్వారా మిమ్మల్ని మరలింపజేస్తాము. మరియు మేము ప్రళయదినాన మరణాంతరం లేపటం కొరకు రెండవసారి మిమ్మల్ని దాని నుండి వెలికితీస్తాము.
(56) మరియు నిశ్చయంగా మేము ఫిర్ఔన్ కొరకు మా తొమ్మిది సూచలన్నింటిని బహిరంగపరచాము. మరియు అతడు వాటిని చూసి తిరస్కరించాడు. మరియు అతడు అల్లాహ్ పై విశ్వాసము కనబరచటమును స్వీకరించటం నుండి ఆగిపోయాడు.
(57) ఫిర్ఔన్ ఇలా పలికాడు : ఓ మూసా నీవు తీసుకుని వచ్చిన మంత్రజాలము ద్వారా నీవు మమ్మల్ని మిసర్ నుండి వెళ్ళగొట్టటానికి,దాని అధికారము నీ కొరకు ఉండిపోవటానికి మా వద్దకు వచ్చావా ?.
(58) ఓ మూసా నీ మంత్రజాలము లాంటిదే ఏదైన మంత్రజాలమును మేము తప్పకుండా నీ వద్దకు తీసుకుని వస్తాము. అయితే నీవు మాకు,నీకు మధ్య ఒక నిర్ణీత కాలములో,ఒక నిర్ణీత ప్రదేశములో సమయంను ఏర్పాటు చేయి. దానిని మేమూ వ్యతిరేకించము,మీరూ వ్యతిరేకించకండి. మరియు రెండు వర్గముల మధ్య స్థలం మధ్యస్థంగా,సమాంతరంగా ఉండనివ్వండి.
(59) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో ఇలా పలికారు : మీకు,మాకు మధ్య నిర్ణీత సమయం పండుగ రోజు ప్రజలు తమ పండుగను జరుపుకుంటూ మద్యాహ్నం సమావేశమైన వేళప్పుడు.
(60) ఫిర్ఔన్ తిరిగి వెళ్ళి తన మోసమును,తన కుట్రలను సేకరించాడు. ఆ తరువాత నిర్ణీత సమయము,ప్రదేశములో ఓడించటానికి వచ్చాడు.
(61) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ మాంత్రికులను హితోపదేశం చేస్తూ ఇలా పలికారు : మీరు విడనాడండి (దూరంగా ఉండండి),మీరు ప్రజలను మంత్ర జాలముతో మోసం చేయటం ద్వారా అల్లాహ్ పై అబధ్ధమును కల్పించకండి. అటువంటప్పుడు ఆయన వద్ద నుండి మీకు ఏదైన శిక్ష చుట్టుకుంటుంది. నిశ్ఛయంగా అల్లాహ్ పై అబధ్ధమును కల్పించుకునే వాడు నష్టాన్ని చవిచూస్తాడు.
(62) మంత్రజాలకులు మూసా అలైహిస్సలాం మాటను విన్నప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరియు తమ మధ్య రహస్యంగా మంతనాలు చేశారు.
(63) మంత్రజాలకుల్లోంచి కొందరు కొందరితో రహస్యంగా ఇలా పలికారు : నిశ్చయంగా మూసా,హారూను ఇద్దరూ మాంత్రికులే. వారిద్దరు తాము తీసుకుని వచ్చిన మంత్రజాలము ద్వారా మిమ్మల్ని మిసర్ నుండి వెళ్ళగొట్టదలిచారు. మరియు జీవితంలో ఉన్న మీ ఉన్నతమైన సాంప్రదాయమును,మీ గొప్ప పధ్ధతిని తొలగించదలిచారు.
(64) అయితే మీరు మీ వ్యవహారమును దిట్టముగా చేసుకోండి,అందులో మీరు విభేధించుకోకండి. ఆ తరువాత మీరు పంక్తులవారిగా ముందడుగు వేయండి. మరియు మీరు మీ వద్ద ఉన్న వాటన్నింటిని ఒకేసారి విసరండి. తన ప్రత్యర్ధిని ఓడించిన వాడే ఈ రోజు ఆశించిన దాని ద్వారా ఖచ్చితంగా సాఫల్యం చెందుతాడు.
(65) మంత్రజాలకులు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ మూసా ఈ రెండు విషయముల్లోంచి ఏదో ఒక దానిని ఎంచుకో : నీ వద్ద ఉన్న మంత్రజాలమును మొదట విసిరేవాడివి నీవైన అవ్వు లేదా మేము దాన్ని మొదట విసిరే వాళ్ళమవుతాము.
(66) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : లేదు మీరే మొదట మీ వద్ద ఉన్నవి విసరండి. అప్పుడు వారు తమ వద్ద ఉన్న వాటిని విసిరారు. అప్పుడు వారు విసిరిన వారి త్రాళ్ళు,వారి చేతి కర్రలు వారి మంత్రజాలము వలన మూసా దృష్టిలో వేగముగా చలిస్తున్న పెద్ద సర్పాల మాదిరిగా అనిపించసాగాయి.
(67) అప్పుడు వారు చేసిన దానితో మూసా మనస్సులో భయం కలిగింది.
(68) అల్లాహ్ మూసా అలైహిస్సలాంకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు : ఓ మూసా మీ దృష్టిలో అనిపించిన వాటితో భయపడకండి,మీరే వారిపై ఆధిక్యతతో,విజయముతో ప్రాబల్యం పొందుతారు.
(69) మరియు మీరు మీ కుడి చేతిలో ఉన్న చేతి కర్రను విసరండి,అది పాముగా మారి మంత్రజాలముతో వారు చేసిన వాటన్నింటిని మ్రింగివేస్తుంది. వారు చేసినది కేవలం మంత్ర కుతంత్రం మాత్రమే. మరియు మంత్రజాలకుడు ఎక్కడ ఉన్నా ఆశించిన దాని ద్వారా సఫలీకృతం కాజాలడు.
(70) అప్పుడు మూసా తన చేతి కర్రను విసిరితే అది పాముగా మారిపోయింది. మరియు మంత్రజాలకులు చేసిన దాన్ని మ్రింగివేసింది. ఎప్పుడైతే మంత్రజాలకులు మూసా వద్ద ఉన్నది మంత్రజాలము కాదని,అది అల్లాహ్ వద్ద నుండి మాత్రమే అని తెలుసుకున్నారో వారు అల్లాహ్ కొరకు సాష్టాంగపడిపోయారు. వారు ఇలా పలికారు : మేము మూసా,హారూను ప్రభువు,సృష్టితాలన్నింటి ప్రభువు ను విశ్వసించాము.
(71) ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును వ్యతిరేకిస్తూ,హెచ్చరిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు మూసాను నేను దాని గురించి అనుమతి ఇవ్వకముందే విశ్వసిస్తారా ?!. ఓ మంత్రజాలకులారా నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ నాయకుడు. నేను తప్పకుండా మీలోని ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేతిని వాటి దిశల మధ్య వ్యతిరేకంగా నరికివేస్తాను. మరియు మీ శరీరాలను ఖర్జూరపు దూలాల పై మీరు చనిపోయేంతవరకు,ఇతరులకు గుణపాఠం అయ్యేంత వరకు శిలువ వేస్తాను. అప్పుడు మాలో నుండి ఎవరు శిక్షపరంగా బలవంతుడో,ఎల్లప్పుడు ఉంటాడో నేనా లేదా మూసా ప్రభువునా మీరు తెలుసుకుంటారు.
(72) మంత్రజాలకులు ఫిర్ఔన్ తో ఇలా పలికారు : ఓ ఫిర్ఔన్ మేము మా వద్దకు వచ్చిన స్పష్టమైన ఆయతులను అనుసరించటంపై నిన్ను ప్రాధాన్యత ఇవ్వమంటే ఇవ్వము. మరియు మమ్మల్ని సృష్టించిన అల్లాహ్ పై నిన్నూ ప్రాధాన్యతనివ్వము. నీవు మాతో చేయాలనుకున్నది చేయి.ఈ అంతమైపోయే జీవితంలో మాత్రమే నీకు మాపై అధికారము కలదు. మరియు తొందరలోనే నీ అధికారము తొలిగిపోతుంది.
(73) నిశ్చయంగా మేము మా ప్రభువుపై ఆయన గతించిన మా పాపములైన అవిశ్వాసము,ఇతరవాటిని మా నుండి తుడిచి వేస్తాడని,మా నుండి మంత్రజాల పాపము దేనినైతే నేర్చుకోవటం,ఉపయోగించటం,దాని ద్వారా మూసాను ఓడించటంపై నీవు మమ్మల్ని బలవంతం చేశావో దానిని తుడిచి వేస్తాడని ఆశిస్తూ విశ్వాసమును కనబరిచాము. మరియు అల్లాహ్ నీవు మాకు వాగ్ధానం చేసిన వాటి కన్న మేలైన వాటిని ప్రసాధించేవాడును,నీవు మాకు ఏ శిక్ష గురించి బెదిరస్తున్నావో దానికన్న నిర్విరామంగా శిక్షించేవాడును.
(74) నిశ్ఛయంగా విషయము,జరిగేదేమిటంటే ప్రళయదినాన తన ప్రభువు వద్దకు ఆయనపై అవిశ్వాసమును కనబరచిన స్థితిలో వచ్చే వాడి కొరకు నరకాగ్ని ఉంటుంది. అతడు అందులో శాస్వతంగా ఎల్లవేళలా ఉండేటట్లుగా ప్రవేశిస్తాడు. దాని శిక్ష నుండి అతడు విశ్రాంతి పొందటానికి అందులో అతనికి మరణం సంభవించదు. మరియు అతడు మంచి జీవితమును జీవించలేడు.
(75) మరియు ఎవరైతే ప్రళయదినాన తమ ప్రభువు వద్దకు ఆయనపై విశ్వాసమును కనబరచి వస్తాడో,సత్కర్మలు చేసి ఉంటాడో ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ఎత్తైన అంతస్తులు,ఉన్నతమైన స్థానములు కలవు.
(76) ఈ స్థానాలు అవి శాస్వత స్వర్గ వనాలు వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాస్వతంగా ఉంటారు. ఈ ప్రస్థావించబడిన ప్రతిఫలం అవిశ్వాసమునుండి,పాప కార్యముల నుండి పరిశుద్ధుడైన ప్రతీ వ్యక్తి ప్రతిఫలము.
(77) మరియు నిశ్చయంగా మేము మూసాకి దైవ వాణి ద్వారా ఇలా తెలిపాము : నీవు నా దాసులను తీసుకుని రాత్రి మిసర్ నుండి బయలుదేరు చివరికి వారిని ఎవరు గమనించకూడదు. మరియు సముద్రం పై చేతి కర్రతో కొట్టిన తరువాత వారి కొరకు సముద్రంలో ఒక పొడి మార్గమును ఏర్పాటు చేయి. నిశ్చింతగా నిన్ను ఫిర్ఔన్,అతని దర్బారీలు పట్టుకుంటారని భయపడకు. మరియు సముద్రంలో మునగటం నుండి భయపడకు.
(78) అప్పుడు ఫిర్ఔన్ తన సైనికులతో కలిసి వారిని వెంబడించాడు. అప్పుడు అతడిని,అతడి సైన్యములను సముద్రం అలుముకుని క్రమ్మివేసింది. వారికి ఏదైతే అలుముకుందో దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికి తెలియదు. అప్పుడు వారందరు మునిగి వినాశనమునకు గురైపోయారు. మరియు మూసా,ఆయనతోపాటు ఉన్న వారు సాఫల్యం చెందారు.
(79) మరియు ఫిర్ఔన్ తన జాతి వారిని తాను వారికి మంచిగా చేసి చూపిన అవిశ్వాసముతో అపమార్గమునకు లోనుచేశాడు. మరియు వారిని అసత్యముతో మోసం చేశాడు. మరియు వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శకము చేయలేదు.
(80) ఇస్రాయీలు సంతతివారితో వారిని ఫిర్ఔన్,అతని సైన్యముల నుండి మేము రక్షించిన తరువాత ఇలా పలికాము : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్చయంగా మేము మీ శతృవుల బారి నుండి రక్షించాము. మరియు తూర్ కొండ వైపు ఉన్న లోయ కుడి ప్రక్న మూసాతో మేము సంభాషిస్తామని మీతో వాగ్ధానం చేశాము. మరియు తీహ్ మైదనములో మా అనుగ్రహాల్లోంచి తేనెలాంటి తియ్యటి పానియం,మంచి మాంసము కల చిన్న పిట్టలాంటి చిన్న పక్షిని మీపై కురిపించాము.
(81) మేము మీకు ప్రసాధించిన ధర్మసమ్మతమైన ఆహారపదార్ధముల్లోంచి రుచికరమైన వాటిని మీరు తినండి. మేము మీకు అనుమతించిన వాటిలో మీపై నిషేధించిన వాటి వైపు మితిమీరకండి. అటువంటప్పుడు మీపై నా క్రోధం దిగుతుంది. ఎవరిపై మా క్రోధం దిగుతుందో అతడు వినాశనమునకు గురి అవుతాడు,ఇహ,పరాల్లో దుష్టుడవుతాడు.
(82) నిశ్చయంగా నేను నాతో పశ్చాత్తాప్పడి,విశ్వసించి, సత్కార్యము చేసి, ఆ పిదప సత్యము పై నిలకడ చూపేవాడికి అధికంగా మన్నించేవాడిని,క్షమించేవాడిని.
(83) ఓ మూసా ఏ విషయం నీ జాతి వారి నుండి నిన్ను తొందర చేసేటట్టు చేసింది నీవు వారిని వదిలి వారికన్న ముందు వచ్చావు ?.
(84) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇదిగో వారు నా వెనుక ఉన్నారు,వారు నాతో వచ్చి కలుసుకుంటారు. మరియు నేను నా జాతి వారి కన్న ముందు నీ వద్దకు నేను నీ వైపు చేసిన తొందరతో నీవు ప్రసన్నుడవుతావని వచ్చాను.
(85) అల్లాహ్ ఇలా పలికాడు : నిశ్చయంగా మేము నీవు నీ వెనుక వదిలి వచ్చిన నీ జాతి వారిని ఆవు దూడ ఆరాధన ద్వారా పరీక్షించాము. వారిని సామిరి దాని ఆరాధన వైపు పిలిచాడు. దాని ద్వారా అతడు వారిని అపమార్గమునకు లోను చేశాడు.
(86) అప్పుడు మూసా అలైహిస్సలాం తన జాతివారివైపు వారి ఆవు దూడ పూజవలన కోపముతో వారిపై బాధపడుతూ మరిలారు. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఏమీ అల్లాహ్ మీపై తౌరాతును అవతరింపజేస్తానని,మిమ్మల్ని స్వర్గములో ప్రవేసింపజేస్తాడని మీతో మంచి వాగ్ధానం చేయలేదా. ఏమిటీ మీపై కాలం పొడిగిపోయందని మీరు మరచిపోయారా ?. లేదా మీరు పాల్పడిన ఈ చర్య వలన మీపై మీ ప్రభువు వద్ద నుండి ఆగ్రహము దిగాలని,మీపై ఆయన శిక్ష వచ్చి పడాలని కోరుకున్నారా,అందుకనే నేను మీ వద్దకు తిరిగి వచ్చేంతవరకు విధేయతపై స్థిరంగా ఉండమన్న నా ఒప్పొందమును మీరు భంగపరిచారా ?!.
(87) మూసా జాతివారు ఇలా పలికారు : ఓ మూసా మేము మా అంగీకారముతో నీకు ఇచ్చిన మాటను విబేధించ లేదు కాని బలవంతాన జరిగింది. మేము ఫిర్ఔన్ జాతి వారి నగల భారములను,బరువులను మోశాము. అయితే మేము వాటి నుండి విముక్తి కొరకు వాటిని ఒక గుంటలో పడవేశాము. అప్పుడు గుంటలో మేము వాటిని విసిరినట్లే సామరీకూడా తనతోపాటు ఉన్న జిబ్రయీల్ అలైహిస్సలాం గుర్రము యొక్క గిట్ట యొక్క మట్టిని విసిరాడు.
(88) అప్పుడు సామిరీ ఇస్రాయీలు సంతతి వారి కొరకు ఆ నగల నుండి ఏ ఆత్మ లేని,ఆవు గాండ్రింపు లాంటి గాండ్రింపు కల ఒక దూడను వెలికి తీశాడు. అప్పుడు వారిలో నుండి సామిరీ పనికి ఆకర్షితులైనవారు ఇదే మీ ఆరాధ్య దైవము,మూసా ఆరాధ్య దైవము ఆయన దీన్ని మరచిపోయి ఇక్కడ వదిలివేశాడు అన్నారు.
(89) ఏమీ దూడకు ఆకర్షితులై దాన్ని పూజించే వీరందరు ఈ దూడ వారితో మట్లాడలేదని,వారికి సమాధానము ఇవ్వలేదని,వారి నుండి,ఇతరుల నుండి ఎటువంటి నష్టమును తొలగించలేదని,వారి కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి లాభం తీసుకుని రాలేదని చూడటంలేదా ?!.
(90) మరియు నిశ్ఛయంగా హారూను వారితో మూసా వారి వద్దకు మరలక ముందు ఇలా పలికారు : బంగారముతో దూడ సూత్రీకరణలో,దాని గాండ్రించటంలో అవిశ్వాసపరుని నుండి విశ్వాసపరుడిని స్పష్ట పరచటం కొరకు మీకు పరీక్ష మాత్రమే. ఓ నా జాతి వారా నిశ్చయంగా మీ ప్రభువే దయ చూపే అధికారము కలవాడు,మీ కొరకు ఎటువంటి నష్టమును గాని లాభమును గాని కలిగించే అధికారము లేనటువంటి ప్రత్యేకించి మీపై దయచూపనటువంటి వాడు కాదు. అయితే మీరు ఆయన ఒక్కడి ఆరాధన విషయంలో నన్ను అనుసరించండి. ఇతరుల ఆరాధనను వదిలే విషయంలో నా ఆదేశమును పాటించండి.
(91) దూడ ఆరాధనకి ఆకర్షితులైనవారు ఇలా పలికారు : మా వద్దకు మూసా మరలేంత వరకు మేము దాని ఆరాధనలో స్థిరంగా ఉంటాము
(92) మూసా తన సోదరుడు హారునుతో ఇలా పలికారు : అల్లాహ్ ను వదిలి దూడ ఆరాధనతో వారు అపమార్గంలో పడిపోతే మీరు చూసినప్పుడు (వారిని ఆపటం నుండి) మిమ్మల్ని ఏది ఆటంకం కలిగించింది.
(93) వారిని మీరు వదిలి వేసి నన్ను వచ్చి కలుస్తారా ?!. ఏమీ నేను మిమ్మల్ని వారిపై ప్రతినిధిగా నియమించినప్పుడు మీరు నా ఆదేశమును ఉల్లంఘించారా ?!.
(94) మరియు ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తన సోదరుని గడ్డమును,ఆయన తలను తన వైపు గింజుతూ ఆయన చేసిన కార్యమునకు ఆయనను మందలిస్తూ పట్టుకున్నారో అప్పుడు హారూన్ అలైహిస్సలాం తనపై దయ చూపమని కోరుతూ ఆయనతో ఇలా పలికారు : మీరు నా గడ్డమును,నా తల వెంట్రుకలను పట్టుకోకండి. ఎందుకంటే నేను వారితోపాటే ఉండిపోవటంలో నా కొరకు ఒక కారణం ఉన్నది. ఒక వేళ నేను వారిని ఒంటరిగా వదిలి వేస్తే వారు విడిపోతారని నేను భయపడ్డాను. అప్పుడు నేను వారిని విడగొట్టానని,వారి విషయంలో మీ మాటను ఖాతరు చేయలేదని మీరు అనేవారు.
(95) మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : ఓ సామిరీ నీ సంగతేమిటి ?. నీవు చేసిన కార్యం వైపునకు ఏ కారణం పురిగొల్పింది ?.
(96) సామిరీ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నీవు చూడనిది నేను చూశాను. నిశ్చయంగా నేను జిబ్రయీలును ఒక గుఱ్రంపై చూశాను,అప్పుడు నేను ఆయన గుఱ్రపు అడుగు క్రింద నుండి ఒక గుప్పిట మట్టిని తీసుకొని దాన్ని నేను కరిగించబడి దూడ రూపములో అచ్చు వేయబడిన నగలుపై విసిరాను. అప్పుడు దాని నుండి గాండ్రింపు శరీరము కల ఒక దూడ పుట్టుకొచ్చింది. ఈ విధంగా నా మనస్సుకు మంచిగా అనిపించింది నేను చేశాను.
(97) మూసా అలైహిస్సలాం సామిరీతో ఇలా పలికారు : సరే నీవు వెళ్ళు కాని నీవు జీవించి ఉన్నంత కాలం నీవు నేను ఎవరిని ముట్టుకోను,నన్ను ఎవరు ముట్టుకోకండి అని పలుకూతూ ఉంటావు. అప్పుడు నీవు చండభ్రష్టుడిగా జీవిస్తావు. మరియు నిశ్చయంగా నీ కొరకు ప్రళయ దినాన ఒక వాగ్ధానం చేయబడిన సమయం ఉన్నది. అందులో నీ లెక్క తీసుకోవటం జరుగుతుంది,శిక్షించబడుతావు. ఈ వాగ్ధాన దినమున అల్లాహ్ నిన్ను వదలడు. మరియు నీవు ఆరాధ్యదైవముగా చేసుకుని అల్లాహ్ ను వదిలి నీవు ఆరాధించిన నీ దూడను చూడు. దానిపై మేము అగ్నిని కాలుస్తాము చివరికి అది కరగిపోతుంది. ఆ తరువాత మేము దాన్నిసముద్రంలో విసిరివేస్తాము. చివరికి దాని నామరూపాలు మిగలవు.
(98) ఓ ప్రజలారా మీ వాస్తవ ఆరాధ్యదైవం ఆ అల్లాహ్ ఆయన తప్ప ఎవరు వాస్తవ ఆరాధ్య దైవం కారు. ఆయన ప్రతీ వస్తువును జ్ఞానపరంగా చుట్టుముట్టి ఉన్నాడు. పరిశుద్ధుడైన ఆయన నుండి ఏ వస్తువు యొక్క జ్ఞానము తప్పిపోదు.
(99) ఓ ప్రవక్తా మేము మూసా,ఫిర్ఔన్ గాధ,వారిద్దరి జాతులవారి గాధను చదివి వినిపించినట్లుగానే మీ కన్న పూర్వం గతించిన ప్రవక్తల,జాతులవారి గాధలను మీకు ఓదార్పు కలగటానికి మీకు మేము చదివి వినిపిస్తాము. మరియు నిశ్చయంగా మేము మీకు ఖుర్ఆన్ ను ప్రసాధించాము దానితో హితోపదేశం గ్రహించేవారు హితోపదేశం గ్రహిస్తారు.
(100) మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ నుండి ఎవరైతే విముఖత చూపి,దానిని విశ్వసించకుండా ఉండి,అందులో ఉన్న వాటిని ఆచరించడో ప్రళయదినాన వాడు పెద్ద పాపమును మోసుకుని,బాధాకరమైన శిక్షకు అర్హుడై వస్తాడు.
(101) ఆ శిక్షలో వారు శాశ్వతంగా నివాసముంటారు. ప్రళయదినాన వారు మోసే బరువు ఎంతో చెడ్డదైన బరువు.
(102) ఆ రోజు మరణాంతరం లేపబడటం కోసం దైవదూత బాకాలో రెండవసారి ఊదుతాడు. మరియు పరలోక భయాందోళనల నుండి వారు పొందిన కాఠిన్యత మూలంగా వారి రంగులు,వారి కళ్ళు మారటం కొరకు నీలంగా ఉన్న స్థితిలో అవిశ్వాసపరులను ఆ రోజు మేము సమీకరిస్తాము.
(103) వారు ఒకరితో ఒకరు తమ మాటల్లో ఇలా గుసగుసలాడుతారు : మరణం తరువాత మీరు బర్జఖ్ లో పది రాత్రుల కన్న ఎక్కువ ఉండ లేదు.
(104) వారు రహస్యంగా ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ మా నుంచి తప్పి పోదు. అప్పుడు వారిలో నుండి బుద్ధిమంతుడు ఇలా పలుకుతాడు : మీరు బర్జఖ్ లో ఒక రోజు కన్న ఎక్కువ ఉండ లేదు.
(105) ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని ప్రళయ దినం నాడు పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. అయితే మీరు వారితో ఇలా పలకండి : నా ప్రభువు వాటిని కూకటి వ్రేళ్ళతో పెకిలించి తీసి వాటిని గాలిలో ఎగరవేస్తాడు. అప్పుడు అవి దూళిలా అయిపోతాయి.
(106) అప్పుడు వాటిని మోసిన భూమిని దానిపై ఎటువంటి కట్టడము గాని,మొక్కలు గాని లేనట్లుగా సమాంతరంగా చేసి వదిలేస్తాడు.
(107) దాని వైపు చూసే వాడా నీవు భూమిలో అది పూర్తిగా సమాంతరంగా అయిపోవటం మూలంగా ఎటువంటి వంపును గాని,ఎటువంటి ఎత్తును గాని,ఎటువంటి పల్లమును గాని చూడవు.
(108) ఆ రోజు ప్రజలు హషర్ మైదానము వైపునకి పిలిచే వాడి స్వరమును అనుసరిస్తారు. అతనిని అనుసరించటం నుండి వారిని మరల్చేవాడు ఎవడూ ఉండడు. మరియు అనంత కరుణామయుడి ముందు స్వరాలన్నీ భయంతో మౌనంగా ఉండిపోతాయి. ఆ రోజు నీవు అణిగిన స్వరమును తప్ప ఇంకేమి వినవు.
(109) ఆ గొప్ప రోజున అల్లాహ్ ఎవరికి సిఫారసు చేయటానికి అనుమతి ఇచ్చి,సిఫారసులో వారి మాట ఆయనకు నచ్చితే వారి సిఫారసు తప్ప ఇంకెవరి సిఫారసు ప్రయోజనం చేకూర్చదు.
(110) ప్రజలు ప్రళయ విషయంలో ముందస్తు ఏమి పంపించుకున్నారో పరిశుధ్ధుడైన అల్లాహ్ కి తెలుసు. మరియు వారి ఇహలోకములో ఏమి వదిలి వచ్చారో ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ అస్తిత్వములో,ఆయన గుణగణాలలో దాసులందరు జ్ఞానపరంగా చుట్టు ముట్టలేరు.
(111) దాసుల ముఖాలు - మరణించకుండా నిత్యం జీవించి ఉండేవాడు మరియు తన దాసుల వ్యవహారాల విషయంలో వాటి పర్యాలోచన ద్వారా,వాటిని వ్యవహరించటం ద్వారా ఆధారభూతమైనవాడి కొరకు - కడు వినయంగా,అణుకువతో వంగిపోతాయి. మరియు నిశ్చయంగా ఎవరైతే కావాలనే స్వయంగా వినాశన స్థానమునకు చేరి పాపమును మోస్తాడో అతడు విఫలుడవుతాడు.
(112) మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన స్థితిలో సత్కార్యములను చేసి ఉంటాడో అతడు దాని సంపూర్ణ ప్రతిఫలమును పొందుతాడు. మరియు అతడు తాను చేయని ఏ పాపము వలన శిక్షించబడటం ద్వారా గాని తన సత్కర్మ యొక్క పుణ్యము తరిగించబడటం ద్వారా గాని హింసకు గురవుతాడని భయపడడు.
(113) పూర్వికుల గాధలను మేము అవతరింపజేసినట్లే ఈ ఖుర్ఆన్ ను స్పష్టమైన అరబీ భాషలో అవతరింపజేశాము. మరియు ఇందులో బెదిరించటం,భయపెట్టటం లాంటి రకరకాల హెచ్చరికలను వారు అల్లాహ్ తో భయపడుతారని లేదా వారి కొరకు ఖుర్ఆన్ హితోపదేశం,గుణపాఠమును కలిగింపజేస్తుందని ఆశిస్తూ మేము స్పష్టపరచాము.
(114) అయితే అల్లాహ్ మహోన్నతుడు,పరిశుద్ధుడు,మహత్యము కలవాడు,ప్రతీ వస్తువు యొక్క అధికారము కల సార్వభౌముడు,అతడు సత్యుడు,అతని మాట సత్యము,ముష్రికులు ఆయనకు వర్ణిస్తున్న గుణాల నుండి ఆయన అతీతుడు. ఓ ప్రవక్తా మీరు జిబ్రయీల్ మీకు ఖుర్ఆన్ చేరవేయటమును ముగించక ముందే జిబ్రయీల్ తో పాటు ఖుర్ఆన్ పారాయణం చేయటంలో తొందర పడకండి. మరియు మీరు ఇలా పలకండి : ఓ నా ప్రభువా నీవు నాకు నేర్పించిన జ్ఞానమును వృద్ధిపరచు.
(115) మరియు మేము ముందు నుంచే ఆదమ్ ను ఆ వృక్షము నుండి తినకూడదని సూచించాము. మరియు మేము ఆయనను దాని నుండి వారించాము. ఆయనకు దాని పరిణామం ఏమవుతుందో కూడా స్పష్టపరిచాము. అయితే అతను సూచనను మరచి వృక్షము నుండి తినివేశాడు. మరియు దాని గురించి ఓపిక పట్టలేదు. మేము దేని గురించైతే అతనికి సూచించామో దానిని పరిరక్షించటంపై అతనికి దృడ సంకల్పమున్నట్లు మేము చూడలేదు.
(116) ఓ ప్రవక్తా మేము దైపదూతలను ఆదమ్ కొరకు గౌరవప్రదమైన సాష్టాంగపడమని పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు వారితోపాటు ఉన్న ఇబ్లీసు తప్ప వారందరు సాష్టాంగపడ్డారు. అతడు వారిలో నుంచి కాడు. అతడు అహంకారముతో సాష్టాంగపడ లేదు.
(117) అప్పుడు మేము ఇలా పలికాము : ఓ ఆదమ్ నిశ్ఛయంగా ఇబ్లీసు నీకూ శతృవు,నీ భార్యకూ శతృవు. అతడు దేని గురించైతే ఆలోచనలను రేకెత్తించాడో వాటిలో అతడిని అనుసరించటం ద్వారా అతడు నిన్ను,నీ భార్యను స్వర్గము నుండి వెళ్ళగొట్టకూడదు. అప్పుడు మీరు కష్టాలను,బాధలను మోయవలసి ఉంటుంది.
(118) నిశ్ఛయంగా నీకు స్వర్గంలో ఆకలి కలగకుండా ఉండటానికి నీకు తినిపించటం,నీవు నగ్నంగా ఉండకుండా ఉండటానికి నీకు దుస్తులను తొడిగించటం నీ కొరకు అల్లాహ్ పై బాధ్యత కలదు.
(119) నీకు దాహం కలగకుండా ఉండటానికి ఆయన నీకు త్రాపించటం,నీకు సూర్యుని తాపము తగలకుండా ఉండటానికి నీకు నీడనివ్వటం.
(120) అప్పుడు షైతాను ఆదమ్ నకు దుష్ప్రేరణలను కలిగించి ఆయనతో ఇలా పలికాడు : నేను నీకు ఒక వృక్షం చూపించనా దాని నుండి తినే వాడు ఎన్నటికి మరణించడు,అంతే కాక అతడు ఎల్లప్పుడు జీవించి ఉండిపోతాడు. మరియు అంతం కాని సమాప్తమవ్వని నిరంతర సామ్రాజ్యమును అదీష్టిస్తాడు ?!.
(121) అప్పుడు ఆదమ్ మరియు హవ్వా ఏ వృక్షము నుండి తినటం నుండి వారించబడ్డారో దాని నుండే తిన్నారు. అప్పుడు వారి మర్మావయవాలు కప్పబడి ఉన్న తరువాత కూడా బహిర్గతమైపోయినవి. మరియు వారు స్వర్గ వృక్షాల ఆకులను లాగి వాటితో తమ మర్మావయవాలను కప్పుకోసాగారు. ఎప్పుడైతే అతడు వృక్షము నుండి తినటము నుండి జాగ్రత్త పడే విషయంలో తన ప్రభువు ఆదేశమును పాటంచలేదో ఆదమ్ తన ప్రభువు ఆదేశమును ఉల్లంఘించారు. తన కొరకు సమ్మతం కాని దానిలో అతిక్రమించారు.
(122) ఆ తరువాత అల్లాహ్ ఆయనను ఎన్నుకున్నాడు. మరియు ఆయన పశ్ఛాత్తాపమును అంగీకరించి ఆయనకు సన్మార్గముపై నడిచే అనుగ్రహమును కలిగించాడు.
(123) అల్లాహ్ ఆదమ్,హవ్వాలతో ఇలా పలికాడు : మీరిద్దరూ,ఇబ్లీసు స్వర్గము నుండి దిగిపోండి. అయితే అతడు మీ ఇద్దరికి శతృవు మరియు మీరిద్దరు అతనికి శతృవులు. ఒక వేళ నా వద్ద నుండి మీ వద్దకు నా మార్గము కొరకు స్పష్టత వస్తే అప్పుడు మీలో నుండి ఎవరు నా మార్గము స్పష్టతను అనుసరించి దాని ప్రకారం ఆచరించి దాని నుండి తప్పుకోరో వారు సత్యము నుండి తప్పిపోరు మరియు పరలోకములో శిక్ష ద్వారా బాధపడరు. అంతే కాదు అల్లాహ్ వారిని స్వర్గములో ప్రవేశింపజేస్తాడు.
(124) మరియు ఎవరైతే నా ధ్యానము నుండి విముఖత చూపి దాన్ని స్వీకరించడో మరియు దానికి స్పందించడో అటువంటి వాడికి ఇహలోకంలో,బర్జఖ్ లో ఇరుకైన జీవితం ఉంటుంది.మరియు మేము వాడిని ప్రళయదినాన దృష్టిని,ఆధారమును కోల్పోయిన వాడిగా హషర్ మైదానంలో తీసుకుని వస్తాము.
(125) ధ్యానము నుండి విముఖత చూపిన ఇతడు ఇలా పలుకుతాడు : ఓ నా ప్రభువా ఈ రోజు ఎందుకు నన్ను గ్రుడ్డివానిగా లేపావు,వాస్తవానికి నేను ఇహలోకములో చూడగలిగే వాడిని.
(126) మహోన్నతుడైన అల్లాహ్ అతన్ని ఖండిస్తూ ఇలా పలుకుతాడు : ఇదే విధంగా నీవు ఇహలోకంలో చేశావు, మా సూచనలు నీ వద్దకు వచ్చినవి. అప్పుడు నీవు వాటి నుండి విముఖత చూపి వాటిని వదిలివేశావు. మరియు అలాగే ఈ రోజు నీవు శిక్షలో వదిలివేయబడతావు.
(127) నిషిద్ధ కోరికల్లో మునిగి ఉండి,తన ప్రభువు వద్ద నుండి వచ్చిన స్పష్టమైన ఆధారాలపై విశ్వాసము నుండి విముఖత చూపిన వాడిని మేము ఈ విధమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. పరలోకములో అల్లాహ్ విధించే శిక్ష ఇహలోకములోని,బర్జఖ్ లోని ఇరుకైన జీవితము కన్న ఎక్కువ భయంకరముగా,తీవ్రంగా,శాస్వతంగా ఉంటుంది.
(128) ఏమీ ముష్రికులకి మేము వారి కన్న ముందు తుదిముట్టించిన ఎన్నో సమాజాల వారు స్పష్టం కాలేదా ?. వారు వినాశనమునకు గురైన ఈ సమాజముల వారి నివాసములలోనే తిరుగుతున్నారు,వారికి సంభవించిన వాటి గుర్తులను కళ్ళారా చూస్తున్నారు. నిశ్ఛయంగా ఈ చాలా సమాజాల వారికి కలిగిన వినాశనము,విధ్వంసములో బుద్ధిమంతుల కొరకు గుణపాఠము కలదు.
(129) ఓ ప్రవక్తా ఒక వేళ నీ ప్రభువు వాదన చేయక ముందే ఎవరిని శిక్షించడని నీ ప్రభువు వద్ద నుండి మాట ముందే జరగక ఉండి ఉంటే,అతని వద్ద వారి కొరకు గడువు ముందే నిర్ణయించకుండా ఉంటే వారిని తొందరగా శిక్షించే వాడు వారు దానికి అర్ఙులు కావటం వలన.
(130) ఓ ప్రవక్తా మీతో తిరస్కారులు పలికే అసత్యపు గుణాల పై సహనం పాటించండి. మరియు మీరు సూర్యుడు ఉదయించక మునుపు ఫజర్ నమాజులో,దాని అస్తమించక మునుపు అసర్ నమాజులో,రాత్రి వేళల్లో నుండి మగ్రిబ్,ఇషా నమాజులో,దినపు మొదటి ఘడియల ముగింపు తరువాత సూర్యుడు వాలేటప్పుడు జుహర్ నమాజులో,దినపు రెండవ ఘడియల ముగింపు తరువాత మగ్రిబ్ నమాజులో మీరు ఇష్టపడే ప్రతిఫలమును అల్లాహ్ వద్ద మీరు పొందుతారని ఆశిస్తూ మీ ప్రభువు స్థుతులను కొనియాడుతూ పరిశుద్ధతను పలకండి.
(131) ఈ అన్ని రకాల తిరస్కారుల కొరకు వారిని మేము పరీక్షించటానికి మేము ఇచ్చి ఉంచిన ప్రాపంచిక జీవిత వైభవాల్లోంచి వారు ప్రయోజనం చెందుతుతున్న వాటి వైపుకు మీరు చూడకండి. నిశ్ఛయంగా వాటిలో నుండి మేము వారి కొరకు తయారు చేసినది తరిగిపోవును. మరియు నీ ప్రభువు ప్రసాదించే ప్రతిఫలం దేని గురించైతే ఆయన నీకు వాగ్దానం చేశాడో చివరికి నీవు సంతుష్టపడ్డావో అది ఇహలోకంలో తరిగిపోయే, వారు ప్రయోజనం చెందే దాని కంటే ఎంతో మేలైనది,శాస్వతమైనది. ఎందుకంటే అది అంతమవ్వదు.
(132) ఓ ప్రవక్త మీరు మీ ఇంటివారిని నమాజు పాటించమని ఆదేశించండి. మరియు మీరూ దానిని పాటించటంలో సహనం చూపండి. మేము నీతో నీ స్వయం కొరకు,ఇతరుల కొరకు ఎటువంటి ఆహారమును ఆశించము. మేమే నీకు ఆహారమును ప్రసాదించి పోషిస్తాము. ఇహ,పరలోకాల్లో ప్రశంసనీయమైన పరిణామము అల్లాహ్ తో భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండే భీతిపరుల కొరకు ఉన్నది.
(133) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు ఇలా పలికారు : ఎందుకని ముహమ్మద్ తన నిజాయితీ పై,తాను ప్రవక్త అన్న దానిపై సూచించే ఏదైన చిహ్నమును తన ప్రభువు వద్ద నుండి మా వద్దకు తీసుకుని రాడు ?. ఏమీ ఈ తిరస్కారులందరి వద్దకు ఆ ఖుర్ఆన్ ఏదైతే తన పూర్వ దివ్య గ్రంధములను దృవీకరించేదో రాలేదా ?!.
(134) ఒక వేళ మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును తిరస్కరించిన వీరందరిని వారి వద్దకు మేము ఒక ప్రవక్తను పంపించక ముందు,ఏదైన గ్రంధమును మేము అవతరింపచేయక ముందు వారి అవిశ్వాసం వలన,వారి తిరస్కారము వలన వారిపై శిక్షను అవతరింపజేయటం ద్వారా వినాశనమునకు గురి చేసి ఉంటే ప్రళయదినాన వారు తమ అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుతూ ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు ఎందుకని ఇహలోకంలో మా వద్దకు ఒక ప్రవక్తని పంపించ లేదు ?. నీ శిక్ష వలన మాపై అవమానము,పరాభవము కలగక ముందే ఆయనను విశ్వసించి,ఆయన తీసుకుని వచ్చిన ఆయతులను అనుసరించి ఉండే వాళ్ళము.
(135) ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మనలో నుండి,మీలో నుండి ప్రతి ఒక్కరు అల్లాహ్ ఏమి చేస్తాడోనని నిరీక్షిస్తున్నారు. అయితే మీరు కూడా నిరీక్షించండి. ఖచ్చితంగా మీరు తొందరలోనే తెలుసుకుంటారు ఎవరు సన్మార్గ వంతులు,ఎవరు సన్మార్గం పొందుతారో మేమా లేదా మీరా ?.