83 - Al-Mutaffifin ()

|

(1) కొలతల్లో,తూనికలలో తగ్గించి ఇచ్చేవారి కొరకు వినాశనము,నష్టము కలదు.

(2) వారు ఇతరుల నుండి కొలిచి తీసుకున్నప్పుడు తగ్గించకుండా పూర్తిగా తమ హక్కును తీసుకుంటారు.

(3) మరియు వారు ప్రజలకు కొలచి ఇచ్చినప్పుడు లేదా వారికి తూకమేసి ఇచ్చినప్పుడు కొలవటంలో,తూకమేయటంలో తగ్గించి ఇచ్చేవారు. మరియు ఈ పరిస్థితి మదీనా వాసులది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఉండేది.

(4) ఏమీ ఈ దుష్కార్యమునకు పాల్పడేవారు అల్లాహ్ వద్దకు మరల లేపబడి వెళతారని నమ్మకం లేదా ?!

(5) ఒక గొప్ప దినములో లెెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అందులో ఉన్న పరీక్ష మరియు భయాందోళనల వలన.

(6) ఆ దినమున ప్రజలు లెక్క కొరకు సృష్టితాలందరి ప్రభువు ముందు నిలబడుతారు.

(7) మరణాంతరం మరల లేపబడటం లేదని మీరు భావించినట్లు విషయం కాదు. నిశ్చయంగా అవిశ్వాసపరులైన,కపటులైన పాపాత్ముల కర్మల పుస్తకములు అత్యంత క్రిందటి భూమిలో నష్టములో ఉంటాయి.

(8) ఓ ప్రవక్తా సిజ్జీన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?.

(9) నిశ్ఛయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు.

(10) సత్య తిరస్కారుల కొరకు ఆ రోజు వినాశనం,నష్టము కలదు.

(11) ఎవరైతే అల్లాహ్ ఇహ లోకంలో తన దాసులు చేసుకున్న వారి కర్మల ప్రతిఫలం ప్రసాదించే దినమును తిరస్కరిస్తారో వారికి.

(12) అల్లాహ్ హద్దులను అతిక్రమించే అధిక పాపములు కల ప్రతి ఒక్కరు ఆ దినమును తిరస్కరిస్తారు.

(13) మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను అతనికి చదివి వినిపించబడినప్పుడు అవి పూర్వ సమాజాల కట్టు కథలు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడినవి కావు అనేవాడు.

(14) ఈ తిరస్కారులందరు ఊహించినట్లు విషయం కాదు. కాని వారు చేసుకున్న పాపాలు వారి బుద్ధులను అదిగమించి వాటిని కప్పివేశాయి. వారు తమ మనస్సులతో సత్యమును చూడలేదు.

(15) వాస్తవానికి వారు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనం నుండి ఆపబడుతారు.

(16) ఆ పిదప నిశ్చయంగా వారు నరకాగ్నిలో ప్రవేశిస్తారు. దాని వేడిని వారు అనుభవిస్తారు.

(17) ఆ పిదప ప్రళయదినమున వారిని నిందిస్తూ వారితో ఇలా పలకబడును : మీరు పొందే ఈ శిక్ష అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మీకు తెలిపినప్పుడల్లా మీరు దాన్ని తిరస్కరించేవారు.

(18) లెక్క తీసుకోవటం గాని ప్రతిఫలం ప్రసాదించటం గాని లేదని మీరు ఊహంచినట్లు విషయం కాదు. నిశ్చయంగా విధేయత చూపేవారి కర్మల పుస్తకం ఇల్లియ్యీన్ లో ఉంటుంది.

(19) ఓ ప్రవక్తా ఇల్లియ్యూన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?.

(20) నిశ్చయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు.

(21) ఈ పుస్తకం వద్ద ప్రతి ఆకాశమునకు దగ్గర ఉండే దైవదూతలు హాజరవుతారు.

(22) నిశ్ఛయంగా విధేయకార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు.

(23) అలంకరించబడిన ఆసనములపై కూర్చుని తమ ప్రభువు వైపునకు మరియు వారి మనస్సులను ఆనందపరిచే,వారికి సంతోషమును కలిగించే వాటన్నింటి వైపు వారు చూస్తుంటారు.

(24) నీవు వారిని చూసినప్పుడు వారి ముఖముల్లో అందం పరంగా,సంతోషం పరంగా సుఖభోగాల ప్రభావమును చూస్తావు.

(25) వారికి వారి సేవకులు సీలు వేయబడిన పాత్ర నుండి మధువును త్రాపించుతారు.

(26) దాని ముగింపు వరకు దాని నుండి కస్తూరి సువాసన పరిమళిస్తూ ఉంటుంది. మరియు ఈ గౌరవోన్నత ప్రతిఫలం విషయంలో ముందుకు సాగే వారు ముందుకు సాగాలి. అల్లాహ్ ను సంతోష పెట్టే కార్యాలను చేసి మరియు ఆయనను క్రోధానికి గురి చేసే వాటిని వదిలి.

(27) సీలు వేయబడిన ఈ పానీయం తస్నీమ్ సెలయేరు నుండి కలుపబడి ఉంటుంది.

(28) మరియు అది స్వర్గము యొక్క ఉన్నత స్థానంలో ఉన్న ఒక సెలయేరు దాని నుండి సాన్నిధ్యం పొందిన వారు తాగుతారు అది పరిశుద్ధమైనది కలితీలేనిది. దాని నుండి విశ్వాసపరులందరు త్రాగుతారు. అది వేరే దానితో కలిసి ఉంటుంది.

(29) నిశ్చయంగా తాము ఉన్న అవిశ్వాసముతో అపరాధమునకు పాల్పడినవారు విశ్వాసపరులపై పరిహాసంగా నవ్వేవారు.

(30) మరియు వారు విశ్వాసపరుల యెదుట నుండి పోయినప్పుడు ఒకరినొకరు పరిహాసంగా,హచ్చరికగా కనుసైగలు చేసుకునేవారు.

(31) మరియు వారు తమ ఇంటివారి వద్దకు మరలినప్పుడు తాము ఉన్న అవిశ్వాసము మరియు విశ్వాసపరుల పట్ల పరిహాసముతో సంబరపడుతూ మరలేవారు.

(32) మరియు వారు ముస్లిములను చూసినప్పుడు నిశ్చయంగా వీరందరు తమ తాతముత్తాతల ధర్మమును వదిలివేయటం వలన సత్యమార్గము నుండి తప్పిపోయారు అని అనేవారు.

(33) వారు తమ ఈ మాట పలకటానికి అల్లాహ్ వారిని వారి కర్మలను పరిరక్షించే బాధ్యత ఇవ్వలేదు.

(34) కాని అల్లాహ్ ను విశ్వసించేవారు ప్రళయదినమున అవిశ్వాసపరులపై నవ్వుతారు ఏవిధంగానైతే వారు ఇహలోకంలో వారిపై నవ్వే వారో అలా.

(35) అలంకరించబడిన ఆసనములపై కూర్చొని అల్లాహ్ తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శాశ్వత అనుగ్రహాలను చూస్తుంటారు.

(36) నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలకు హీనమైన శిక్షతో ప్రతిఫలం ప్రసాదించబడ్డారు.