76 - Al-Insaan ()

|

(1) మానవునిపై ఒక సుదీర్ఝ కాలం గడిచినది అందులో అతడు తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నాడు.

(2) నిశ్చయంగా మేము మానవుడిని పురుషుని యొక్క నీరు మరియు స్త్రీ యొక్క నీటి మధ్య ఒక మిశ్రమ బిందువుతో సృష్టించాము. మేము అతన్ని అతనిపై వేసిన బాధ్యతల ద్వారా పరీక్షిస్తాము. మేము అతన్ని వినేవాడిగా చూసేవాడిగా చేశాము అతనిపై మేము వేసిన ధర్మ బాధ్యతలను అతను నెరవేర్చటానికి.

(3) నిశ్చయంగా మేము అతనికి సన్మార్గమును మా ప్రవక్తల నోట స్పష్టపరచాము. దాని ద్వారా అతనికి అపమార్గము స్పష్టమైనది. కావున అతను దీని తరువాత సన్మార్గము కొరకు మార్గదర్శకం పొందాలి. అప్పుడు అతను అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకునే విశ్వాసపర దాసుడవుతాడు. లేదా అతను దాని నుండి మార్గభ్రష్టత పొందాలి అప్పుడు అతను అల్లాహ్ ఆయతులను తిరస్కరించే నిరాకరించే దాసుడవుతాడు.

(4) నిశ్చయంగా మేము అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు గొలుసులను సిద్ధం చేసి ఉంచాము వాటి ద్వారా వారు నరకంలో ఈడ్చబడుతారు. మరియు మెడలో వేసే పట్టాలను సిద్ధం చేశాము వాటి ద్వారా వారు అందులో బంధించబడుతారు. మరియు దహించివేసే అగ్నిని సిద్ధం చేశాము.

(5) నిశ్చయంగా అల్లాహ్ కొరకు విధేయత చూపే విశ్వాసపరులు ప్రళయదినమున మంచి వాసన కొరకు కర్పూరముతో కలుపబడిన మధు పానియంతో ఉన్న పాత్రలను సేవిస్తారు.

(6) విధేయుల కొరకు సిద్ధపరచబడిన ఈ పానీయము తేలికగా పొందేటటువంటి సెలయేరు నుండి ఉంటుంది. అది సమృద్ధిగా ఉంటుంది మరియు క్షీణించదు. అల్లాహ్ దాసులు దాన్ని తాము తలచుకున్న చోటికి దాన్ని ప్రవహింపజేసుకుని దాని పానియాలను తీసుకునిపోతారు.

(7) దాన్ని త్రాగే దాసుల గుణములు ఏమిటంటే వారు తమపై తప్పనిసరి చేసుకున్న విధేయ కార్యాలను పూర్తి చేస్తారు. మరియు ఆ దినముతో దేని కీడు అయితే విస్తరించిపోతుందో,వ్యాపిస్తుందో భయపడుతుంటారు. అది ప్రళయదినము.

(8) మరియు వారు భోజనమును దాని అవసరం ఉండి,దాని కోరిక ఉండి దాని ప్రీతి వారికి ఉండి కూడా తినిపిస్తారు. వారు దాన్ని అవసరం కల పేద వారికి,అనాదలకు,ఖైదీలకు తినిపిస్తారు.

(9) మరియు వారు తమ మనస్సుల్లో గోప్యంగా మేము వారికి అల్లాహ్ మన్నత కొరకు మాత్రమే తినిపిస్తున్నాము. కావున వారు వారికి తినిపించటంపై వారి నుండి ఎటువంటి ప్రతిఫలమును మరియు పొగడ్తలను ఆశించరు.

(10) నిశ్చయంగా మేము మా ప్రభువు నుండి ఆ దినముతో దేనిలో నైతే దుష్టుల ముఖములు దాని తీవ్రత వలన మరియు దాని అత్యంత దుర్బరమవటం వలన ఉదాసీనతకు లోనవుతాయో భయపడుతున్నాము.

(11) మరియు అల్లాహ్ తన అనుగ్రహముతో వారిని ఆ గొప్ప దినపు కీడు నుండి రక్షించాడు. మరియు వారికి వారి ముఖములలో తాజాదనమును,కాంతిని వారికి మర్యాద కొరకు మరియు వారి హృదయములలో సంతోషం కలిగించటం కొరకు ప్రసాదిస్తాడు.

(12) విధేయ కార్యాలపై వారి సహనము వలన మరియు అల్లాహ్ నిర్ణయించిన వాటిపై వారి సహనము వలన మరియు పాప కార్యములు చేయకుండా వారి సహనము వలన అల్లాహ్ వారికి స్వర్గమును ప్రతిఫలముగా ప్రసాదిస్తాడు వారు అందులో సుఖభోగాలను అనుభవిస్తారు. మరియు పట్టు వస్త్రములను ప్రసాదిస్తాడు వారు వాటిని తొడుగుతారు.

(13) వారు అక్కడ అలంకరించబడిన పీఠములపై ఆనుకుని కూర్చుని ఉంటారు. ఈ స్వర్గములో వారు తమను బాధించే సూర్య కిరణాలు కల ఎటువంటి సూర్యుడిని గాని ఎటువంటి తీవ్రమైన చలిని కాని చూడరు. అంతేకాదు వారు ఎటువంటి వేడి గాని ఎటువంటి చల్లదనము లేని శాశ్వతమైన నీడలో ఉంటారు.

(14) వాటి నీడలు వారికి దగ్గరగా ఉంటాయి. మరియు వాటి ఫలాలు వాటిని తినే వారి కొరకు అందుబాటులో ఉంచబడి ఉంటాయి. కావున వారు వాటిని తేలికగా ,సులభంగా పొందుతారు. ఎలాగంటే పడుకున్న వాడు,కూర్చున్న వాడు,నిలబడి ఉన్నవాడు వాటిని పొందుతాడు.

(15) వారు త్రాగ దలచినప్పుడు వారి మధ్య సేవకులు వెండి పాత్రలను మరియు స్వచ్చమైన రంగు కల గ్లాసులను తీసుకుని చక్కరులు కొడతారు.

(16) అవి తమ రంగు స్వచ్ఛతనంలో గాజును పోలి ఉంటాయి ఇంకా అవి వెండివి ఉంటాయి. వారు కోరిన విధంగా అంచనా వేయబడి ఉంటాయి. దాని కన్న అధికంగా ఉండవు మరియు తరిగి ఉండవు.

(17) మరియు గౌరవించబడిన వీరందరు సొంటి కలపబడిన మధుపాత్రలు త్రాపించబడుతారు.

(18) వారు స్వర్గంలో ఒక చెలమ నుండి త్రాపించబడుతారు. దాన్ని సల్ సబీల్ అని పిలవబడును.

(19) మరియు స్వర్గంలో వారి మధ్య తమ యవ్వనంలో అను నిత్యం ఉండిపోయే పిల్లలు చక్కరులు కొడుతంటారు. నీవు వారిని చూసినప్పుడు వారి ముఖముల తాజాదనము వలన,వారి మంచి రంగుల వలన,వారు అధికంగా ఉండటం వలన,వారు వేరు వేరుగా ఉండటం వలన నీవు వారిని వెదజెల్లిన ముత్యాలుగా భావిస్తావు.

(20) మరియు నీవు అక్కడ స్వర్గంలో చూసినప్పుడు వర్ణించలేనన్ని అనుగ్రహములను నీవు చూస్తావు. మరియు ఏ రాజ్యాధికారము సరితూగని గొప్ప రాజ్యాధికారమును నీవు చూస్తావు.

(21) వాస్తవానికి వారి శరీరములపై శ్రేష్టమైన వస్త్రాలు ఉంటాయి. మరియు అవి పల్చటి పట్టు వస్త్రాలు మరియు మందమైన వస్త్రాలు. మరియు వారికి అక్కడ వెండి కంకణములు తొడిగించబడుతాయి. మరియు అల్లాహ్ వారికి ప్రతీ బాధ నుండి ఖాళీ అయిన పానీయమును త్రాపిస్తాడు.

(22) మరియు వారితో మర్యదపూరకంగా ఇలా పలకబడును : నిశ్చయంగా మీరు ప్రసాదించబడిన ఈ అనుగ్రహాలు మీరు చేసుకున్న సత్కర్మలకు మీకు ప్రతిఫలము. మరియు మీ కర్మ అల్లాహ్ వద్ద స్వీకరించబడినది.

(23) నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా ఈ ఖుర్ఆన్ ను మీపై క్రమక్రమంగా అవతరింపజేశాము. దాన్ని మేము మీపై ఒకే సారి అవతరింపజేయలేదు.

(24) కావున నీవు అల్లాహ్ విధి వ్రాతపరంగా లేదా ధర్మపరంగా తీర్పునిచ్చిన దానిపై సహనం చూపు. మరియు నీవు ఏ పాపాత్మునికి అతను పిలిచే పాపము విషయంలో అనుసరించకు మరియు ఏ అవిశ్వాసపరునికి అతను పిలిచే అవిశ్వాసం విషయంలో అనుసరించకు.

(25) మరియు నీవు దినపు మొదటి వేళ ఫజర్ నమాజు ద్వారా మరియు దాని చివరి వేళ జుహర్,అసర్ నమాజు ద్వారా నీ ప్రభువు స్మరణ చేయి.

(26) మరియు రాత్రి వేళ రెండు నమాజులలో అనగా మగ్రిబ్ మరియు ఇషా నమాజులలో ఆయన్ను ధ్యానించు. మరియు వాటి తరువాత తహజ్జుద్ నమాజ్ పాటించు.

(27) నిశ్చయంగా అవిశ్వాసులు ఈ తాత్కాలిక ఇహలోక జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందులో ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే దాని వెనుక వచ్చే అంతిమదినం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు - ఆ అంతిమదినం ఎంతో భారమైన దినం. ఎందుకంటే అందులో దిగ్భ్రాంతికి గురి చేసే తీవ్రమైన పరిస్థితులు మరియు పరీక్షలు ఉన్నాయి.

(28) మేము వారిని సృష్టించాము. బలమైన కీళ్ళు, అవయవాలు మరియు ఇతర శరీర భాగాలతో వారిని బలోపేతం చేశాము. ఒకవేళ మేము తలుచుకుంటే వారిని నాశనం చేసి, వారికి బదులుగా అలాంటి బలమైన వారిని సృష్టించగలము.

(29) ఎవరైతే తన ప్రభువు సంతృప్తి చెందే మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఈ సూర ఒక ఉపదేశం మరియు జ్ఞాపిక. కాబట్టి అలాంటి వారు దానిని పొందగలరు.

(30) అల్లాహ్ ను సంతృప్తి పరిచే మార్గాన్ని అనుసరించాలని కోరుకునే వారిలో అల్లాహ్ కోరినవారు తప్ప, మరెవ్వరూ దానిని అనుసరించలేరు. ప్రతి ఆజ్ఞ ఆయన అధీనంలోనే ఉంది. తన దాసులలో ఎవరు సన్మార్గంలో కొనసాగుతారో మరియు ఎవరు కొనసాగరో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన సృష్టించడంలో, శక్తి సామర్ధ్యాలలో మరియు శాసించడంలో మహావివేకవంతుడు.

(31) తన దాసులలో నుండి, ఆయన తన ఇష్టానుసారం తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. వారికి దైవవిశ్వాసం (ఈమాన్) మరియు పుణ్యకార్యాల జ్ఞానం ప్రసాదిస్తాడు. మరియు స్వయంగా అవిశ్వాసంలో మరియు పాపాలలో మునిగి పోవడం వలన సత్యతిరస్కారుల కొరకు ఆయన పరలోకంలో బాధాకరమైన శిక్షను తయారు చేశాడు. అదే నరకాగ్ని శిక్ష.