16 - An-Nahl ()

|

(1) ఓ అవిశ్వాసపరులారా అల్లాహ్ నిర్ణయించిన మీ శిక్ష దగ్గరయింది. అయితే దాని సమయం కన్న ముందే దాన్ని తొందర చేయమని మీరు అడగకండి. మహోన్నతుడైన అల్లాహ్ ముష్రికులు సాటి కల్పిస్తున్న వాటి నుండి పరిశుద్ధుడు.

(2) ఓ ప్రవక్తల్లారా ప్రజలను అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం నుండి మీరు భయపెట్టటానికి అల్లాహ్ వహీ ద్వారా తన నిర్ణయాన్ని తన ప్రవక్తల్లోంచి తాను ఎవరిని కోరుకుంటే వారిపై దైవదూతలను అవతరింపజేస్తాడు. అయితే నేను తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం లేడు. కావున ఓ ప్రజలారా మీరు నా ఆదేశములను పాటిస్తూ,నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నా పట్ల భయభీతి కలిగి ఉండండి.

(3) అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సత్యముతో సృష్టించాడు. ఆ రెండింటిని నిష్ఫలితంగా సృష్టించలేదు. ఆ రెండింటితో తన గొప్పతనాన్ని తెలియపరచటానికి వాటిని సృష్టించాడు.అతని తోపాటు ఇతరులను వారు సాటి కల్పిస్తున్న దాని నుండి అతడు పరిశుద్ధుడు.

(4) ఆయన మనిషిని నీచమైన వీర్య బిందువు నుండి సృష్టించాడు. అప్పుడు అతను ఒక రూపము నుండి ఇంకో రూపములో పెరుగుతూ పోయాడు.(నుత్ఫా-అల్ఖా-ముజ్గా).అప్పుడు అతను అసత్యము ద్వారా సత్యాన్ని అంతం చేయటానికి తీవ్రంగా తగువులాడేవాడు అయిపోయాడు. అతను దాని ద్వారా బహిరంగంగా తగువులాడుతున్నాడు.

(5) ఓ ప్రజలారా ఆయన పశువుల్లోంచి ఒంటెలను,ఆవులను,గొర్రెలను మీ ప్రయోజనముల కొరకు సృష్టించాడు. ఈ ప్రయోజనాల్లోంచి వాటి ఉన్ని,వాటి జుట్టు ద్వారా వెచ్చదనాన్ని పొందటం,వాటి పాలల్లో,వాటి చర్మాల్లో,వాటి వీపుల్లో వేరే ప్రయోజనాలు ఉన్నవి. మరియు మీరు వాటి నుండే తింటున్నారు.

(6) మరియు మీరు వాటిని ప్రొద్దున సాయంత్రం మేపటానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మీ కొరకు వాటిలో ఒక అందం ఉన్నది.

(7) మేము మీ కొరకు సృష్టించిన ఈ పశువులు మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు మీ ప్రయాణముల్లో మీ బరువైన సామగ్రిని మోస్తాయి. ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఈ పశువులను మీ ఆదీనంలో చేసి ఎంతో కరుణించాడు,కనికరించాడు.

(8) అల్లాహ్ గుర్రాలను,కంచర గాడిదలను,గాడిదలను మీరు వాటిపై స్వారీ చేయటానికి,మీ సామానును వాటిపై మీరు మోయించటానికి,మీరు ప్రజల మధ్య శోభను పెంచుకోవటానికి మీ కొరకు అవి శోభ అవటానికి మీ కొరకు సృష్టించాడు. మరియు అతడు తాను సృష్టించదలచుకున్న మీకు తెలియని వాటిని సృష్టిస్తాడు.

(9) అల్లాహ్ పై తన మన్నతలకు చేర్చే తిన్నని మార్గమైన ఇస్లాంను స్పష్టపరిచే బాధ్యత ఉన్నది. మర్గముల్లోంచి షైతాను మార్గములు సత్యము నుండి వంకరగా ఉన్నవి. ఇస్లాం మార్గము కాకుండా ఉన్న ప్రతి మార్గము వంకరిది. ఒక వేళ అల్లాహ్ మిమ్మల్నందరిని విశ్వాసమును ప్రసాధించదలచితే మిమ్మల్నందరిని దాని కొరకు అనుగ్రహించేవాడు.

(10) పరిశుద్ధుడైన ఆయనే మేఘముల నుండి మీ కొరకు నీళ్ళను కురిపించాడు. ఆ నీటి నుండి మీరు త్రాగటానికి,మీ పశువులు త్రాగటానికి నీళ్ళు దొరుకును. దాని నుండి మీ పశువులు మేయటానికి మొక్కలు మొలకెత్తును.

(11) ఈ నీటి ద్వారా అల్లాహ్ మీ కొరకు మీరు తినే పంటలను పండిస్తున్నాడు,మీ కొరకు జైతూన్,ఖర్జూరపు వృక్షాలను,ద్రాక్షాలను పండిస్తున్నాడు. మరియు మీ కొరకు ఫలాలన్నింటిని పండిస్తున్నాడు. నిశ్చయంగా ఈ నీటిలో,దాని నుండి పుట్టుకొచ్చే వాటిలో అల్లాహ్ సృష్టిలో యోచన చేసే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై ఆధారము ఉన్నది. వారు దాని ద్వారా పరిశుద్ధుడైన ఆయన గొప్పతనముపై ఆధారము చూపుతారు.

(12) మరియు అల్లాహ్ రాత్రిని మీరు అందులో విరామం తీసుకోవటానికి,విశ్రాంతి తీసుకోవటానికి,పగలును మీ జీవన సామగ్రిని అందులో సమకూర్చుకోవటానికి మీ కొరకు నియంత్రణలో పెట్టాడు. మరియు ఆయన సూర్యుడిని మీ కొరకు నియంత్రించి దానిని కాంతివంతంగా చేశాడు,చంద్రుడిని నియంత్రించి వెలుగుగా చేశాడు. మరియు నక్షత్రాలు ఆయన విధి ఆదేశము ద్వారా మీ కొరకు నియంత్రించబడ్డాయి. వాటి ద్వారానే మీరు భూమియొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గమును పొందుతున్నారు,సమయములను,ఇతర వాటిని మీరు తెలుసుకో గలుగుతున్నారు. నిశ్చయంగా వీటన్నింటిని నియంత్రించటంలో తమ బుద్దిని వినియోగించే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై స్పష్టమైన సూచనలు కలవు. వారే వాటి నుండి విజ్ఞతను పొందుతారు.

(13) పరిశుద్ధుడైన ఆయన భూమిలో సృష్టించిన రకరకాల రంగులు కల నిక్షేపాలను,జంతువులను,మొక్కలను,పంటలను మీకు వశపరచాడు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సృష్టించటంలో,వశపరచటంలో పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యం పై దాని ద్వారా గుణపాటం నేర్చుకునే జాతి వారికి గొప్ప సూచన కలదు. మరియు వారు అల్లాహ్ సామర్ధ్యం కలవాడని,అనుగ్రహించేవాడని అర్ధం చేసుకుంటారు.

(14) పరిశుద్ధుడైన ఆయనే సముద్రమును మీకు వశపరచాడు. అప్పుడే దానిపై ప్రయాణము,అందులో ఉన్న వాటిని వెలికి తీయటం మీకు సంభవమైనది; మీరు వేటాడే చేపల మెత్తని,తాజా మాంసం మీరు తినటానికి,దాని నుండి మీరు అలంకరణకు మీరు తొడిగే,మీ స్త్రీలు తొడిగే ముత్యాల్లాంటి వాటిని మీరు వెలికి తీయటానికి. మరియు నీవు సముద్రపు అలలను చీల్చుకుంటూ వెళ్ళే ఓడలను చూస్తావు. మీరు ఈ ఓడలపై అల్లాహ్ అనుగ్రహముతో లభించే వ్యాపార లాభాలను ఆశిస్తూ,అల్లాహ్ మీకు ప్రసాధించిన అనుగ్రహాలకు అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తూ ,ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకిస్తూ ప్రయాణం చేస్తారు.

(15) మరియు ఆయన భూమిలో అది మిమ్మల్ని తీసుకుని చలించకుండా,ప్రకంపించకుండా ఉండటానికి దాన్ని స్థిరంగా ఉంచే పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను మీరు వాటి నుండి నీళ్ళు త్రాగటానికి,మీ జంతువులకు,మీ పంటలకు నీరు పట్టటానికి ప్రవహింపజేశాడు. మరియు అందులో మార్గాలను మీరు వాటిలో నడవటానికి తీశాడు. అయితే మీరు దారి తప్పకుండా మీ గమ్య స్థానాలకు చేరుకుంటారు.

(16) మరియు ఆయన మీ కొరకు భూమిలో ప్రత్యక్ష సంకేతాలు వాటి ద్వారా మీరు నడవటంలో మార్గం పొందే వాటిని చేశాడు.మరియు ఆయన నక్షత్రాలను ఆకాశములో మీరు రాత్రి సమయాల్లో మార్గం పొందుతారని ఆశిస్తూ సృష్టించాడు.

(17) అయితే ఈ వస్తువులను,ఇతర వాటిని సృష్టించేవాడు ఏమీ సృష్టించని వాడికి సమానుడు కాగలడా ?.ఏమీ మీరు అన్ని సృష్టించే అల్లాహ్ గొప్పతనమును గమనించరా ?.మీరు ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకించండి,ఆయనతోపాటు ఏమీ సృష్టించని వారికి సాటి కల్పించకండి.

(18) ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన అనేక అనుగ్రహాలను లెక్క వేయటానికి,వాటిని షుమారు చేయటానికి ప్రయత్నించినా అవి అనేకం అవటం వలన,అవి రకరకాలు కావటం వలన వాటిని మీరు లెక్కవేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని వాటి గురించి కృతజ్ఞత తెలపటం నుండి నిర్లక్ష్యం వహించటం వలన పట్టుకోలేదు, ఆయన కరుణించేవాడు ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత తెలపటంలో లోపము చేయటం వలన,పాపకార్యాల వలన మీ నుండి వాటిని అంతం చేయ లేదు.

(19) మరియు ఓ దాసులారా మీరు గోప్యంగా ఉంచే మీ కర్మలన్ని అల్లాహ్ కు తెలుసు,వాటిలో నుండి మీరు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏవి ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా ఆయన తొందరలోనే మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(20) మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఏమీ సృష్టించ లేదు. ఒక వేళ అది చిన్నదైనా సరే (సృష్టించ లేదు).అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని వీరే తయారు చేసుకున్నారు. అయితే వారు తమ చేతులతో తయారు చేసుకున్న విగ్రహాలను అల్లాహ్ ను వదిలి ఎలా ఆరాధిస్తారు ?!.

(21) దానికి తోడుగా వాటి ఆరాధకులు తమ చేతులతో వాటిని తయారు చేసుకున్నారు. అవి ఎటువంటి ప్రాణము లేని,ఎటువంటి జ్ఞానము లేని నిర్జీవులు. వారు తమ ఆరాధకులతోపాటు ప్రళయదినాన నరకములో వారితోపాటు విసిరి వేయటానికి ఎప్పుడు లేపబడుతారో వారికి తెలియదు.

(22) మీ సత్య ఆరాధ్య దైవం ఎటువంటి సాటి లేని ఆరాధ్య దైవం,అతడు అల్లాహ్. ఎవరైతే ప్రతిఫలం ప్రసాధించటానికి ఉన్న మరణాంతర జీవితమును విశ్వసించరో వారి హృదయాలు అల్లాహ్ ఏకత్వమును వాటికి భయం లేకపోవటం వలన నిరాకరించినవి. అవి ఎటువంటి లెక్క తీసుకోవటం గురించి,శిక్ష గురించి విశ్వసించటం లేదు.మరియు వారు సత్యాన్ని స్వీకరించకుండా,దానికి లొంగకుండా దురహంకారములో పడి ఉన్నారు.

(23) వాస్తవానికి నిస్సందేహంగా వీరందరు గోప్యంగా చేసేవి అల్లాహ్ కి తెలుసు.వాటిలో నుండి వారు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు. పరిశుద్ధుడైన ఆయన తన ఆరాధన నుండి,తనకు అణకువ చూపటం నుండి అహంకారమును చూపేవారిని ఇష్టపడడు. కాని ఆయన వారిని ఎక్కువగా ద్వేషిస్తాడు.

(24) మరియు సృష్టికర్త ఏకత్వమును నిరాకరించే,మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరిని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ? అని అడిగినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు : అతనిపై ఆయన ఏదీ అవతరింపజేయలేదు. అతడు తన తరపు నుండి పూర్వీకుల గాధలను,వారి అసత్యాలను మాత్రం తీసుకుని వచ్చాడు.

(25) ఎటువంటి తగ్గుదల లేకుండా తమ పాపముల బరువు మోయటం మరియు ఎవరినైతే వీరు అజ్ఞానం వలన,అనుకరణ వలన ఇస్లాం నుండి అపమార్గమునకు లోను చేశారో వారి పాపముల బరువును మోయటం వారి పరిణామం కావటానికి. వారు మోసే తమ పాపముల బరువు,తమను అనుసరించే వారి బరువు ఎంతో చెడ్డదైనది.

(26) నిశ్చయంగా వీరందరికన్న ముందు అవిశ్వాసపరులు తమ ప్రవక్తల కొరకు కుట్రలు పన్నారు. అప్పుడు అల్లాహ్ వారి కట్టడములను వాటి పునాదులతోసహా శిధిలం చేశాడు. అప్పుడు వాటి పైకప్పులు వారిపై పడ్డాయి. వారు ఊహించని చోటు నుండి శిక్ష వారిపై వచ్చి పడింది. వాస్తవానికి వారి కట్టడాలు వారిని రక్షిస్తాయని వారు భావించేవారు. కాని వారు వాటి ద్వారానే తుదిముట్టించబడ్డారు.

(27) ఆ తరువాత ప్రళయదినమున అల్లాహ్ వారిని శిక్ష ద్వారా అవమానపరుస్తాడు. దాని ద్వారా వారిని నీచపరుస్తాడు. మరియు వారితో మీరు నాతోపాటు ఆరాధనలో సాటికల్పించే భాగస్వాములు ఎక్కడ ఉన్నారు. వారి మూలంగా మీరు నా ప్రవక్తలతో,విశ్వాసపరులతో శతృత్వం చేసేవారు ? అని పలుకుతాడు. దైవ పండితులు ఇలా అంటారు : నిశ్చయంగా అవమానము,శిక్ష ప్రళయదినాన అవిశ్వాసపరులపై వచ్చిపడుతుంది.

(28) ఎవరినైతే దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ఆత్మలను తీస్తారో,వారు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి తమపై హింసకు పాల్పడ్డారు. వారిపై మరణం తాండవించినప్పుడు లొంగిపోయి విధేయత చూపుతారు. మరియు వారు పాల్పడిన అవిశ్వాసమును,పాపకార్యాలను నిరాకరిస్తారు వారి నిరాకరణ వారికి ప్రయోజనం చేకూరుస్తుందని భావించి. వారితో ఇలా పలకబడుతుంది : మీరు అబద్దం పలుకుతున్నారు. మీరు అవిశ్వాసపరులై ఉండేవారు మీరు పాల్పడిన పాపకార్యాలు మీకు తెలుసు. నిశ్చయంగా మీరు ఇహలోకంలో పాల్పడే వాటి గురించి అల్లాహ్ కి తెలుసు. వాటిలో నుంచి ఏవీ ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా వారికి ఆయన తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(29) మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు మీ ఆచరణల ప్రకారం నరకంలో శాస్వతంగా నివాసముండటానికి ప్రవేశించండి. అల్లాహ్ పై విశ్వాసము నుండి,ఆయన ఒక్కడి ఆరాధన నుండి అహంకారమును చూపే వారికి అది నివాసంగా ఎంతో చెడ్డది.

(30) మరియు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారితో ఇలా పలకబడుతుంది : మీ ప్రభువు మీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏమి అవతరింపజేశాడు ?. వారు ఇలా సమాధానమిస్తారు : అల్లాహ్ ఆయనపై ఎంతో గొప్పదైన మంచిని అవతరింపజేశాడు. ఎవరైతే అల్లాహ్ ఆరాధనను ఉత్తమంగా చేస్తారో,ఆయన సృష్టితాల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో వారి కొరకు ఇహలోకంలో మంచి ప్రతిఫలం ఉన్నది. అందులో నుంచి సహాయము. ఆహారోపాదిలో విశాలత్వము.అల్లాహ్ వారి కొరకు పరలోకములో తయారుచేసి ఉంచిన ప్రతిఫలము ఇహలోకములో వారికి శీఝ్రంగా ప్రసాదించే దాని కన్న మేలైనది.తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ దైవభీతి కలిగిన వారి పరలోక గృహము ఎంతో గొప్పది.

(31) శాస్వతమైన,స్థిరమైన స్వర్గవనాల్లో వారు ప్రవేశిస్తారు. వాటి భవనములు,వాటి వృక్షాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారి కొరకు ఈ స్వర్గవనాల్లో వారి మనస్సులు ఇష్టపడే తినే,త్రాగే ఆహారపదార్ధాలు,ఇంకా వేరేవి ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రసాధించే ఈ ప్రతిఫలం లాంటిదే పూర్వ జాతుల వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.

(32) దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు ఎవరి ఆత్మలనైతే వారి హృదయములు అవిశ్వాసము నుండి పరిశుద్ధముగా ఉన్నస్థతిలో తీస్తారో , దైవ దూతలు వారిని ఉద్దేశించి తమ మాటల్లో ఇలా పలుకుతారు : మీపై శాంతి కలుగుగాక. మీరు ప్రతీ ఆపద నుండి సురక్షితంగా ఉన్నారు. మీరు ఇహలోకములో ఆచరించే సరైన విశ్వాసము,సత్కర్మకు బదులుగా స్వర్గంలో ప్రవేశించండి.

(33) ఏమీ ? ఈ తిరస్కారులైన ముష్రికులందరు దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ప్రాణములను సేకరించటానికి,వారి ముఖములపై,వారి వీపులపై కొట్టడానికి వారి వద్దకు వచ్చేంత వరకు లేదా ఇహలోకములోనే శిక్ష ద్వారా వారిని నిర్మూలించటానికి అల్లాహ్ ఆదేశం వచ్చేంత వరకు నిరీక్షిస్తున్నారా ?. మక్కాలోని ముష్రికులు పాల్పడిన ఈ కార్యం లాంటి కార్యమును వారికన్న మనుపు ముష్రికులు పాల్పడ్డారు అప్పుడు అల్లాహ్ వారిని తుదిముట్టించాడు. ఆయన వారిని వినాశనమునకు గరి చేసినప్పుడు వారిపై హింసకు పాల్పడలేదు. కానీ వారే అల్లాహ్ పట్ల అవిశ్వాసం ద్వారా కావాలనే వినాశనమునకు కొనితెచ్చుకుని తమపై హింసకు పాల్పడ్డారు.

(34) అప్పుడు వారు చేసుకున్న కర్మల శిక్షలు వారిపై వచ్చి పడ్డాయి. ఏ శిక్ష గురించి వారి ముందు ప్రస్తావించబడినప్పుడు వారు పరిహాసమాడేవారో ఆ శిక్ష వారిని చుట్టుముట్టింది.

(35) తమ ఆరాధన విషయంలో అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించేవారు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మేము ఆయన ఒక్కడినే ఆరాధించాలని,మేము ఆయన తోపాటు సాటి కల్పించకూడదని తలచుకుంటే మేము ఆయనను వదిలి ఇతరులను ఆరాధించేవారము కాదు. మేమూ కాదు,మా కన్న మునుపటి మా తాత ముత్తాతలూ కాదు. ఒక వేళ మేము దేనినీ నిషేధించకూడదని ఆయన తలచుకుంటే మేము నిషేధించేవారము కాదు. మునుపటి అవిశ్వాసపరులు ఇటువంటి అసత్య ఆధారాలతో పలికేవారు. దైవ ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో ఆసందేశాలను స్పష్టంగా చేరవేయటం మాత్రమే వారిపై బాధ్యత ఉన్నది. నిశ్చయంగా వారు సందేశాలను చేరవేశారు. అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు ఇచ్ఛను,ఎంపిక చేసే అధికారము ఇచ్చి వారి వద్దకు తన ప్రవక్తలను పంపించిన తరువాత తఖ్దీర్ ని నిరాకరించే విషయంలో అవిశ్వాసపరుల కొరకు ఎటువంటి ఆధారము లేదు.

(36) మరియు నిశ్చయంగా మేము పూర్వపు ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపించాము. అతను తన జాతి వారిని అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయన కాక వేరే ఏవైన విగ్రహాల,షైతానుల,ఇతర వాటి ఆరాధన వదిలివేయమని ఆదేశించాడు. వారిలో నుండి అల్లాహ్ ఎవరికి అనుగ్రహించాడో వాడు అతన్ని విశ్వసించి,అతని ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించే వాడు ఉన్నాడు.మరియు వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అతని ప్రవక్తపై అవిధేయత చూపినవాడు ఉన్నాడు. ఆయన అతనికి అనుగ్రహించలేదు. అప్పుడు అతనిపై మార్గభ్రష్టత అనివార్యమైపోయినది. అయితే మీరు తిరస్కారులపై శిక్ష,వినాశనము వచ్చిన తరువాత వారి పరిణామం ఏమయిందో చూడటానికి భూమిలో సంచరించండి.

(37) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు మీకు వీలైనంత మీ ప్రచారము ద్వారా వీరందరి కొరకు శ్రమించినా,వారి సన్మార్గమును మీరు ఆశించినా,దాని కారకాలను ఎంచుకున్నా నిశ్చయంగా అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వాడిని సన్మార్గమును అనుగ్రహించడు. మరియు వారి కొరకు అల్లాహ్ కాకుండా వారి నుండి శిక్షను తొలగించటానికి వారికి సహాయపడే వాడు ఎవడూ ఉండడు.

(38) మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు తమ ప్రమాణాల్లో అతిశయోక్తం చేస్తూ వాటిలో శ్రమిస్తూ అల్లాహ్ మరణించేవారిని మరల లేపడని దృఢమైన ప్రమాణాలు చేశారు .దానిపై వారికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు కాదు అల్లాహ్ తొందరలోనే మరణించే ప్రతీ వ్యక్తిని మరల లేపుతాడు. దానిపై వాగ్ధానము సత్యమైనది.కానీ చాలామందికి అల్లాహ్ మృతులను మరలా లేపుతాడన్న విషయం తెలియదు. అప్పుడే వారు మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారు.

(39) అల్లాహ్ వారికి వారు విభేదించే ఏకత్వము,మరణాంతర జీవితము,దైవదౌత్యము యొక్క వాస్తవికతను స్పష్టపరచటానికి,అవిశ్వాసపరులు అల్లాహ్ తోపాటు భాగస్వాములు ఉన్నారన్నతమ వాదనలో,మరణాంతర జీవిత విషయంలో తమ తిరస్కారములో అబధ్ధము పలుకుతున్నారని తెలుసుకోవాలని ప్రళయదినాన వారందరిని మరల లేపుతాడు.

(40) నిశ్చయంగా మేము మృతులను జీవింపచేయటమును,మరణాంతరం వారిని లేపటమును నిర్ణయించుకుంటే దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఎవడూ ఉండడు. ఏదైన విషయంను మేము నిర్ణయించుకుంటే దానితో నీవు అయిపో (కున్) అని అంటాము.అప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది.

(41) మరియు ఎవరైతే అవిశ్వాసపరుల చేత పీడించబడి,వారి ద్వారా ఇబ్బందులకు గురైన తరువాత అల్లాహ్ మన్నతను ఆశిస్తూ తమ ఇండ్లను,తమ కుటుంబం వారిని,తమ సంపదలను వదలి అవిశ్వాస ప్రాంతము నుండి ఇస్లాం ప్రాంతమునకు వలస పోతారో (హిజ్రత్ చేస్తారో) వారిని మేము తప్పకుండా ఇహలోకంలో ఒక నివాసములో దించుతాము వారు అందులో గౌరవం పొందినవారై ఉంటారు. మరియు పరలోక ప్రతిఫలం ఎంతో గొప్పది ఎందుకంటే దాని నుండే స్వర్గము లభిస్తుంది. ఒకవేళ హిజ్రత్ (వలసపోవటం) నుండి వెనుక ఉండిపోయిన వారు హిజ్రత్ చేసేవారి పుణ్యం గురించి తెలుసుకుని ఉంటే వారు దాని నుండి వెనుక ఉండేవారు కాదు.

(42) అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వీరందరు వారే ఎవరైతే తమ జాతుల వారు కలిగించిన బాధలపై ,తమ కుటుంబం వారి నుండి,తమ నివాసప్రాంతముల నుండి దూరం అవటంపై సహనాన్ని చూపిన వారు,అల్లాహ్ పై విధేయత చూపటం లో సహనాన్ని చూపినవారు.మరియు వారు తమ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపైనే నమ్మకమును కలిగి ఉంటారు. అందుకనే అల్లాహ్ వారికి ఈ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాధించాడు.

(43) ఓ ప్రవక్తా మేము మీ కన్నా మునుపు కేవలం మానవుల్లోంచి మగవారిని మాత్రమే ప్రవక్తలుగా పంపించి వారి వైపునకు దైవ వాణిని అవతరింపజేశాము. మేము దైవదూతల్లోంచి ప్రవక్తలను పంపించలేదు. ఒక వేళ మీరు దీన్ని నిరాకరిస్తే పూర్వ గ్రంధవహులను మీరు అడగండి వారు దైవ ప్రవక్తలు మానువులై ఉంటారని,దైవదూతలు కారని మీకు సమాధానమిస్తారు. ఒక వేళ వారు మానవులని మీకు తెలియకపోతే (అడిగి తెలుసుకోండి)

(44) మేము మానవుల్లోంచి ఈ ప్రవక్తలందరిని స్పష్టమైన ఆధారాలను,అవతరింపబడిన గ్రంధాలను ఇచ్చి పంపించాము. ఓ ప్రవక్త మేము మీపై ఖుర్ఆన్ ను ప్రజలకు ఏ వివరణ అవసరమో ఆ వివరణ ఇవ్వటానికి మీపై అవతరింపజేశాము. బహుశా వారు తమ ఆలోచనలను అమలులో పెట్టి దానికి సంభందించిన విషయాల ద్వారా హితబోధన గ్రహిస్తారు.

(45) ఏమీ అల్లాహ్ మార్గము నుండి ఆపటానికి దుష్ట పన్నాగాలు పన్నిన వారు అల్లాహ్ వారిని ఖారూనును కూర్చినట్లు భూమిలో కూరుకుపోయేలా చేస్తాడనీ లేదా తాము ఊహించని చోటు నుండి వారిపై శిక్ష వచ్చి పడుతుందని భయపడటంలేదా.

(46) లేదా వారు తమ ప్రయాణముల్లో,తమ సంపాదనల కొరకు శ్రమించటంలో ఇటూ అటూ తిరుగుతున్న స్థితిలో ఉన్నప్పుడు వారిని శిక్షకు గురి చేస్తే వారు తప్పించుకోలేరు,కోలుకోలేరు.

(47) ఏమీ వారికి అల్లాహ్ శిక్ష వారు దాని నుండి భయపడుతున్న స్థితిలో వచ్చి పడుతుందని భయపడటం లేదా.అల్లాహ్ ప్రతీ స్థితిలో వారిని శిక్షకు గురి చేసే సామర్ధ్యం కలవాడు. నిశ్చయంగా మీ ప్రభువు దయ చూపేవాడు,కరుణించేవాడు. బహుశా అతని దాసులు అతనితో పశ్చాత్తాప్పడతారని శిక్షను తొందరగా అమలుపరచడు.

(48) ఏమి ఈ తిరస్కారులందరు ఆయన సృష్టితాల వైపు యోచనతో చూడరా ?. వాటి నీడలు సూర్యుని చలనమునకు అనుసరిస్తూ ఎడమ వైపునకు,కుడి వైపునకు వాలుతున్నవి. పగటి పూట వాటి సంచారము,రాత్రి పూట చంద్రునికి (అనుసరిస్తూ). తమ ప్రభువునకు వినమ్రత చూపుతూ ఆయనకు వాస్తవంగా సాష్టాంగపడుతున్నవి. మరియు అవి అణకువ కలవి.

(49) మరియు అల్లాహ్ ఒక్కడి కొరకు భూమ్యాకాశముల్లో ఉన్న సమస్త ప్రాణులు సాష్టాంగపడుతున్నవి,ఆయన ఒక్కడికే దైవదూతలు సాష్టాంగపడుతున్నవి. మరియు అవి అల్లాహ్ ఆరాధన నుండి,ఆయన విధేయత నుండి అహంకారమును చూపవు.

(50) వారందరు తాము చేస్తున్న శాస్వత ఆరాధన,విధేయత తోపాటు తమపై ఉన్న తమ ప్రభువు అస్తిత్వము నుండి,ఆయన అణచివేత నుండి, ఆయన అధికారము నుండి భీతిని కలిగి ఉంటారు. వారికి వారి ప్రభువు ఆదేశించిన వాటిని విధేయతతో పాటిస్తారు.

(51) పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులందరితో ఇలా పలికాడు : మీరు ఇద్దరు ఆరాధ్యదైవాలుగా చేసుకోకండి. సత్య ఆరాధ్య దైవము ఒక్కడే అతనికి రెండవవాడు లేడు, ఎవరు సాటి లేరు.మీరు నాతోనే భయపడండి. నాతోకాక ఇతరులతో భయపడకండి.

(52) భూమ్యాకాశముల్లో ఉన్న సమస్తమును సృష్టించటంలో,పాలించటంలో,పర్యాలోచన చేయటంలో ఆయన ఒక్కడికే అధికారం కలదు. విధేయత,అణకువ,చిత్తశుద్ధి ఆయన ఒక్కడి కొరకే స్థిరము. అయితే మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులతో భయపడుతారా ?!.అలా జరగకూడదు,మీరు కేవలం ఆయన ఒక్కడితోనే భయపడాలి.

(53) ఓ ప్రజలారా మీకు కలిగిన ధార్మిక లేదా ప్రాపంచిక అనుగ్రహాలు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినవి,ఇతరుల వద్ద నుంచి కావు. అంతే కాదు మీకు కలిగే ఆపదలు లేదా రోగము లేదా పేదరికం సమయంలో మీకు కలిగినది మీ నుండి తొలగిపోవటానికి మీరు ఆయన ఒక్కడి వైపే కడు వినయంగా వేడుకుంటారు. అనుగ్రహాలను ప్రసాధంచేవాడు, కష్టమును తొలగించేవాడు(ఆయనే). ఆయన ఒక్కడి ఆరాధన చేయబడటం తప్పనిసరి.

(54) ఆ తరువాత ఆయన మీ అర్ధనను స్వీకరించి మీకు కలిగిన కష్టమును తొలగించగానే మీలో నుండి ఒక వర్గము తమ ప్రభవుతో సాటి కల్పించ సాగారు.ఎలాగంటే ఆయనతోపాటు ఇతరులను ఆరాధించసాగారు. అయితే ఇది ఏమి దిగజారుడుతనం ?!.

(55) అల్లాహ్ తోపాటు వారు సాటి కల్పించటం వారిపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలు వాటిలోంచి నష్టమును తొలగించటం వంటి అనుగ్రహాల పట్ల వారిని కృతఘ్నులయ్యేటట్లు చేశింది. అందువలనే వారితో ఇలా పలకబడింది : మీరు ఉన్న సుఖాలను మీ వద్దకు తొందరగా,ఆలస్యంగా వచ్చే అల్లాహ్ శిక్ష వచ్చేంతవరకు అనుభవించండి.

(56) ముష్రికులు మేము వారికి ప్రసాధించిన జీవనోపాధిలో నుండి నిర్జీవం (జమాదాత్ చలనం లేని,స్థిరమైన,జీవం లేని) కావటం చేత ఎటువంటి జ్ఞానము లేని,లాభం చేకూర్చలేని,నష్టం కలిగించలేని తమ విగ్రహాల కొరకు కొంత భాగమును కేటాయిస్తున్నారు. మరియు దాని ద్వారా వాటి సాన్నిద్యాన్ని పొందదలుస్తున్నారు. ఓ ముష్రికులారా అల్లాహ్ సాక్షిగా మీరు ఈ విగ్రహాల గురించి అవి ఆరాధ్య దైవాలని,మీ సంపదల్లోంచి వారి కొరకు భాగం ఉన్నదని మీరు వాదిస్తున్న వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా మీరు ప్రశ్నించబడుతారు.

(57) ముష్రికులు అల్లాహ్ కి కుమార్తెలను అంటగడుతున్నారు. మరియు వారిని దైవదూతలుగా విశ్వసిస్తున్నారు. వారు ఆయనకు సంతానమును అంటగడుతున్నారు. తమకు ఇష్టంలేని వాటిని ఆయన కొరకు ఎంచుకుంటున్నారు. వారిలో నుండి ఆయన కొరకు వారు అంటగడుతున్న వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవితృడు.మరియు వారు తమ మనస్సులు కోరే మగ సంతానమును తమ కొరకు ఎంచుకొంటున్నారు. అయితే దీనికన్న మహా పాపం ఏమి ఉంటుంది?! .

(58) ఈ ముష్రికులందరిలో నుండి ఎవరికైనా ఆడపిల్ల జన్మించినదని సమాచారమిచ్చినప్పుడు తమకు ఇవ్వబడిన సమాచారము నచ్చక అతని ముఖము నల్లగా మారిపోతుంది. అతని మనసు దుఃఖముతో,బాధతో నిండిపోతుంది. ఆ తరువాత అతను తన మనస్సుకు ఇష్టంలేని వాటిని అల్లాహ్ కి అంటగడుతాడు.

(59) ఆడ సంతానము జన్మించినదని అతనికి ఇవ్వబడిన వార్తను దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి అతడు నక్కి నక్కి దాక్కొని తిరుగుతుంటాడు. అతని అంతరంగము అతనితో ఇలా అంటుంది : అవమానముతో,పరాభవముతో కూడిన ఈ ఆడ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేదా ఆమెను మట్టిలో పూడ్చి జీవ సమాధి చేయాలా ?.ముష్రికులు తీసుకునే నిర్ణయం ఎప్పుడైతే వారి మనసులకి నచ్చదో వాటిని తమ ప్రభువు కొరకు నిర్ణయిస్తారు. అది ఎంతో చెడ్డదైనది.

(60) పరలోకముపై విశ్వాసము లేని అవిశ్వాసపరులకి సంతాన అవసరం ఉండటం,అజ్ఞానం,అవిశ్వాసం లాంటి దుర్గుణాలు కలవు. మరియు ఘనత,పరిపూర్ణత,అక్కరలేకపోవటం,జ్ఞానం లాంటి ఉన్నతమైన గర్వించదగ గుణాలు అల్లాహ్ కే గలవు. మరియు పరిశుద్ధుడైన ఆయన తన రాజ్యాధికారములో ఎవరూ ఆధిక్యత చూపలేని ఆధిక్యుడు,తన సృష్టించటంలో,పర్యాలోచనలో,తన శాసనాల్లో వివేకవంతుడు.

(61) ఒక వేళ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రజలను వారి దుర్మార్గము వలన,ఆయనపట్ల వారి అవిశ్వాసం వలన శిక్షిస్తే భూ ఉపరితలంపై సంచరించే ఏ మానవుడిని,ఏ జంతువుని వదలడు. కాని పరిశుద్ధుడైన ఆయన వారిని తన జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు గడువిస్తాడు. తన జ్ఞానములో నిర్ణీత ఆ గడువు వచ్చినప్పుడు వారు దాని నుండి వెనుకకు కాలేరు మరియు ముందుకు కాలేరు. ఒక వేళ అది కొంచెం సమయమైన కూడా .

(62) మరియు వారు తమకు ఆడ సంతానముతో సంబంధం చూపటం ఇష్టం లేని వాటిని అల్లాహ్ కొరకు అంటగడుతున్నారు.మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద మంచి స్థానం ఉందని వారి నాలుకలు అబధ్ధం పలుకుతున్నవి.ఒక వేళ వారు పలుకుతున్నట్లు సరైనదై ఉంటే వారు మరల లేపబడుతారు.వాస్తవానికి నిశ్చయంగా వారి కొరకు నరకాగ్ని ఉన్నది.మరియు వారు అందులో విసిరివేయబడుతారు.దాని నుండి వారు ఎన్నటికి బయటకు రాలేరు.

(63) ఓ ప్రవక్తా అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా మేము మీకన్నా మునుపు జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపించాము. అయితే షైతాను వారి దుష్కర్మలైన బహుదైవారాధన,అవిశ్వాసము,పాపకార్యాలను మంచిగా చేసి చూపించాడు. అయితే అతడు ప్రళయదినాన వారికి సహాయకుడిగా భావించబడ్డాడు. అయితే వారు అతన్ని సహాయం కోరాలి. మరియు వారి కొరకు ప్రళయ దినాన బాధాకరమైన శిక్ష కలదు.

(64) ఓ ప్రవక్తా మేము ఖుర్ఆన్ ను ప్రజలందరు ఏకత్వము,మరణాంతర జీవితము,ధర్మ ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని మీరు స్పష్టపరచటానికి,మరియు ఖుర్ఆన్ అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై,ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరుచే వారి కొరకు మార్గదర్శకము,కారుణ్యము అవటానికి మాత్రమే మీపై అవతరింపజేశాము. వారందరే సత్యము ద్వారా ప్రయోజనం చెందుతారు.

(65) మరియు అల్లాహ్ ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా బంజరుగా,పొడిగా ఉన్న భూమి నుండి మొక్కలను వెలికి తీసి భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఆకాశము నుండి వర్షం కురిపించటంలో,దాని ద్వారా భూమి యొక్క మొక్కలను వెలికి తీయటంలో అల్లాహ్ వాక్కును విని దానిలో యోచన చేసే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై స్పష్టమైన సూచన కలదు.

(66) ఓ ప్రజలారా నిశ్చయంగా ఒంటెలలో,ఆవులలో,గొర్రెలలో హితబోధన ఉన్నది వాటి ద్వారా మీరు హితబోధన గ్రహిస్తున్నారు. కడుపులో ఉన్న వ్యర్ధాల ,శరీరంలో ఉన్న రక్తము మధ్య నుండి వాటి ఛాతీల ద్వారా వెలువడే పాలను మీకు త్రాపిస్తున్నాము. దానికి తోడుగా ఆయన త్రాగే వారి కొరకు స్వచ్ఛమైన,రుచికరమైన,మంచిగా ఉండే పాలను వెలికి తీస్తున్నాడు.

(67) మరియు మేము మీకు ఆహారోపాధిగా ప్రసాధించిన ఖర్జూర పండ్లలో,ద్రాక్షా పండ్లలో మీ కొరకు హితబోధన ఉన్నది. వాటి నుండి మీరు మతిని పోగొట్టే మత్తు పానీయమును తయారు చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. మరియు మీరు వాటి ద్వారా ఎండు ఖర్జూరములు (డేట్స్), ఎండు ద్రాక్ష (కిష్మిష్), వెనిగార్, ద్రాక్షా రసము (పానకము) లాగా మంచి ఆహారమును తయారు చేసుకుని ప్రయోజనం చెందుతున్నారు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో బుద్ధి కలవారికి అల్లాహ్ దాసులపై కల అల్లాహ్ సామర్ధ్యము,ఆయన అనుగ్రహము పై సూచన ఉన్నది. వారే గుణపాఠం నేర్చుకుంటారు.

(68) ఓ ప్రవక్తా మీ ప్రభువు తేనెటీగ మనసులో మాట వేసి ఇలా సూచించాడు : "నీవు నీ కొరకు పర్వతాలలో గృహములను (తట్టెలను) నిర్మించుకో, చెట్లపై మరియు మనుషులు నిర్మించుకునే,కప్పులుగా చేసుకునే వాటిలో గృహములను (తెట్టెలను) నిర్మించుకో".

(69) ఆ తరువాత నీవు పండ్లలోంచి ఏవి కావాలంటే వాటిని తిను,నీ ప్రభువు నీకు సూచించిన,నడవటం సంభవమైన మార్గాలలో నడువు. ఈ తేనెటీగ కడుపు నుండి రకరకాల రంగులు కల తేనె వెలికి వస్తుంది. అందులో నల్లది,పసుపుది మరియు ఇతర రంగులు కలవి ఉంటాయి. అందులో ప్రజలకు వ్యాధి నివారణ ఉన్నది. దాని ద్వారా వ్యాధులకు వారు చికిత్స చేసుకుంటారు. నిశ్చయంగా తేనెటీగకు దీని ఆదేశం ఇవ్వటంలో,దాని కడుపునుండి వెలికి వచ్చే తేనెలో యోచన చేసేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై, తనసృష్టితాల వ్యవహారాల కొరకు ఆయన పర్యాలోచనలో సూచన ఉన్నది. వారే గుణపాఠం నేర్చుకుంటారు.

(70) మరియు అల్లాహ్ మిమ్మల్ని పూర్వ నమూనా లేకుండా సృష్టించాడు. ఆ తరువాత మీ ఆయుషు పూర్తయినప్పుడు మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో నుండి కొందరు నికృష్టమైన వయస్సు స్థానాలు అయిన వృద్ధాప్యమునకు చేరిన వారు ఉన్నారు. అప్పుడు వాడు తెలిసి వాడు ఏమి తెలియనట్టుగా అయిపోతాడు. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల కర్మల్లోంచి ఏదీ గోప్యంగా లేకుండా బాగా తెలిసిన వాడు,ఆయనను ఏదీ అశక్తిని చేయని సమర్ధుడు.

(71) పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ మీకు ఆహారోపాధి ప్రసాధించే విషయంలో మీలో కొందరిని కొందరిపై ఆధిక్యతను ప్రసాధించాడు. మీలో ధనికులనూ చేశాడు,నిరు పేదలనూ చేశాడు. యజమానులనూ చేశాడు,సేవకులనూ చేశాడు. అల్లాహ్ ఎవరికైతే ఆహారోపాధిలో ఆధిక్యతను ప్రసాధించాడో వారు తమకు అల్లాహ్ ప్రసాధించిన వాటిని తమతో యాజమాన్యంలో సమాన భాగస్వాములు అయిపోయినట్లుగా తమ బానిసలకు ఇవ్వరు. అలాంటప్పుడు వారు ఎలా అల్లాహ్ దాసులను అల్లాహ్ కొరకు భాగస్వాములుగా ఇష్ట్పడుతున్నారు ?.వాస్తవానికి వారు తమ బానిసలను తమతో సమాన భాగస్వాములుగా అవటం తమ కొరకు ఇష్టపడటం లేదు.అయితే దీనికన్నా పెద్ద దుర్మార్గము,అల్లాహ్ అనుగ్రహాల పట్ల తిరస్కారము ఏముంటుంది ?!.

(72) ఓ ప్రజలారా అల్లాహ్ మీలో నుండే మీకు సహవాసులను పుట్టించాడు వారితో మీరు మనశ్శాంతి పొందుతారు. మరియు ఆయన మీ భార్యల నుండి సంతానమును,సంతాన సంతానమును మీ కొరకు సృష్టించాడు. మరియు తినే ఆహారపదార్ధాలైన మాంసము,ధాన్యాలు,ఫలాలు వాటిలో ఉత్తమమైనవి లాంటివాటిని మీకు ప్రసాధించాడు. అలాంటప్పుడు మీరు అసత్యమైనటువంటి విగ్రహాలను,శిల్పాలను విశ్వసిస్తారా . మీరు లెక్క చేయలేనన్ని అనేకమైన అనుగ్రహాలను తిరస్కరిస్తారా,ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం ద్వారా అల్లాహ్ కృతజ్ఞతను తెలుపుకోరా ?!.

(73) మరియు ఈ ముష్రికులందరు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. వారికి ఆహారమును ప్రసాధించే అధికారము వాటికి లేదు. అంటే ఆకాశముల నుండి ఆహారమును గాని భూమి నుండి ఆహారము గాని ప్రసాధించే అధికారం లేదు. అవి ఎటువంటి ప్రాణము లేని,జ్ఞానం లేని నిర్జీవులు కావటం వలన దాని అధికారం కలిగి ఉండటం వారి నుండి సాధ్యం కాదు.

(74) అయితే ఓ ప్రజలారా ఎటువంటి లాభం చేకూర్చలేని,ఎటువంటి నష్టం కలిగించలేని ఈ విగ్రహాలను అల్లాహ్ తో పోల్చకండి.ఆరాధనలో ఆయనతోపాటు మీరు సాటి కల్పించటానికి అల్లాహ్ కి పోలినవాడు ఎవడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు గల ఘనమైన,సంపూర్ణమైన లక్షణాలు ఏమిటో అల్లాహ్ కి తెలుసు. అవి మీకు తెలియవు. అందుకే మీరు ఆయనతోపాటు సాటి కల్పించటంలో,ఆయనకు పోలిన విధంగా మీ విగ్రహాలను అర్ధించటంలో పడిపోతున్నారు.

(75) పరిశుద్ధుడైన అల్లాహ్ ముష్రికులను ఖండిస్తూ ఒక ఉదాహరణ ఇలా ఇస్తున్నాడు : ఇతరుల యాజమాన్యంలో ఉండి ఎటువంటి ఖర్చు చేసే అధికారం లేకుండా ఉన్న ఒక బానిస ఉన్నాడు.అతని వద్ద ఖర్చు చేయటానికి ఏమీ లేదు. ఇంకో వ్యక్తి.స్వేచ్ఛాపరుడు ఉన్నాడు. అతనికి మేము మా వద్ద నుండి ధర్మ సమ్మతమైన (హలాల్) సంపదను ప్రసాధించాము. అందులో నుండి అతను కోరిన విధంగా ఖర్చు చేస్తాడు. అతను అందులో నుండి రహస్యంగా,బహిర్గంగా తాను కోరిన విధంగా ఖర్చు చేస్తాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. అలాంటప్పుడు మీరు ఎలా తన ఇష్టానుసారంగా తన రాజ్యంలో అధికారం చెలాయించే,యజమాని అయిన అల్లాహ్ కి,అసమ్మర్ధులైన మీ విగ్రహాలకు మధ్య సమానత్వమును కల్పిస్తున్నారు . స్తోత్రాలు అన్ని స్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ కొరకే. కానీ దైవత్వమును అల్లాహ్ కే ప్రత్యేకించాలని,ఆయన ఒక్కడి ఆరాధన చేయబడటానికి అర్హత కలవాడని చాలామంది ముష్రికులకు తెలియదు.

(76) మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వారిని ఖండిస్తూ వేరొక ఉదాహరణ ఇద్దరి వ్యక్తులది ఇలా ఇస్తున్నాడు : వారిలో నుండి ఒకడు మూగవాడు. అతడు తన చెవిటితనం,తన మూగతనం వలన ఏమీ విన లేడు,మాట్లాడ లేడు మరియు అర్ధం చేసుకో లేడు. అతడు తనకు గాని ఇతరులకు గాని ప్రయోజనం చేయలేని అసమర్ధుడు. మరియు అతడు తనను పోషించే వాడిపై,అతని బాధ్యత తీసుకునే వాడిపై భారంగా తయారవుతాడు. అతన్ని ఎటు పంపించినా మేలును తీసుకుని రాలేడు,ఆశించిన దానిలో సఫలీకృతం కాలేడు. ఇటువంటి స్థితిలో ఉన్న వాడు ఆ వ్యక్తితో ఎవడైతే సరిగా వినగలుగుతాడో,మాట్లాడగలుగుతాడో,అతని ప్రయోజనాలు అధికము,అతడు ప్రజలను న్యాయపూరితంగా ఆదేశిస్తాడు. స్వయంగా అతను నేరుగా ఉన్నవాడు. అతడు ఎటువంటి సందేహములేని,ఎటువంటి వంకరతనము లేని స్పష్టమైన మార్గంపై ఉన్నాడు సమానుడు కాగలడా ?. అలాంటప్పుడు ఓ ముష్రికులారా ఘనమైన,పరిపూర్ణమైన లక్షణాలు గల అల్లాహ్ కి వినలేని,మాట్లాడలేని,ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేని,ఎటువంటి నష్టమును దూరం చేయలేని మీ విగ్రహాలకి మధ్య సమానత్వమును మీరు ఎలా కల్పిస్తున్నారు ?!.

(77) మరియు భూమ్యాకాశముల్లో గోప్యంగా ఉన్న సమస్తము యొక్క జ్ఞానము ఒక్కడైన అల్లాహ్ కే కలదు. ఆయన సృష్టితాల్లో నుండి ఏ ఒక్కడికి కాకుండా దాని జ్ఞానము ఆయనకే ప్రత్యేకము. ప్రళయదిన విషయం ఏదైతే అగోచర విషయాల్లో ప్రత్యేకించబడినదో దాన్ని ఆయన కోరుకున్నప్పుడు దాని రావటం యొక్క వేగము కను రెప్ప వాల్చి తెరిచే లోపలే లేదా దానికన్నా ఇంకా దగ్గరే. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయన్ని ఏదీ అశక్తుడిని చేయదు. ఏదైన విషయమును ఆయన కోరినప్పుడు దాన్ని ఆయన కున్ (నీవు అయిపో ) అని అంటాడు అది అయిపోతుంది.

(78) ఓ ప్రజలారా అల్లాహ్ మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి గర్భ కాలము ముగిసిన తరువాత చంటి పిల్లలుగా తీశాడు. అప్పుడు మీకేమి తెలియదు. మరియు ఆయన మీరు వినటానికి వినికిడిని,చూడటానికి చూపును,అర్ధం చేసుకోవటానికి హృదయములను తయారు చేశాడు. వాటిలో నుండి ఆయన మీపై అనుగ్రహించిన వాటిపై మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ .

(79) ఏమీ అల్లాహ్ పక్షులకు ప్రసాధించిన రెక్కలతో,సున్నితమైన గాలితో గాలిలో ఎగరటానికి సిద్ధం చేయబడిన,ఆజ్ఞాబద్ధులైన పక్షుల వైపు ముష్రికులు చూడటం లేదా ?. మరియు ఆయన వాటికి తమ రెక్కలను మూయటం,వాటిని చాచటం గురించి సూచించాడు. గాలిలో పడిపోవటం నుండి సమర్ధుడైన అల్లాహ్ మాత్రమే వాటిని ఆపి ఉంచాడు. నిశ్చయంగా ఈ ఆజ్ఞాబద్ధం చేయటంలో,పడకుండా ఆపటంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారి కొరకు సూచనలున్నాయి. ఎందుకంటే వారే సూచనల ద్వారా,గుణపాఠాల ద్వారా ప్రయోజనం చెందుతారు.

(80) మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ మీరు రాళ్ళతో తయారు చేసుకున్న మీ ఇండ్లను మీ కొరకు స్థిరత్వము పొందటానికి,మనశ్శాంతి పొందటానికి తయారు చేశాడు. మరియు ఒంటెల,ఆవుల,గొర్రెల తోలుతో మీ కొరకు డేరాలను,గుడారాలను మైదానాల్లో పట్టణ గృహాల మాదిరిగా చేశాడు. మీ ప్రయాణాల్లో వాటిని ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్ళటం మీపై తేలికగా ఉంటుంది. మరియు మీరు బసచేయవలసినప్పుడు వాటిని పాతటం సులభము. మరియు ఆయన గొర్రెల ఉన్ని నుండి,ఒంటెల జుట్టు నుండి, మేకల వెంట్రుకల నుండి మీ గృహముల కొరకు సామగ్రిని,సంచులని,మూతలని తయారు చేశాడు వాటి ద్వారా మీరు ఒక నిర్ణీత కాలం వరకు లబ్ది పొందుతారు.

(81) మరియు అల్లాహ్ చెట్లను,భవనాలను మీ కొరకు తయారు చేశాడు. మీరు వాటి ద్వారా ఎండ నుంచి నీడను పొందుతున్నారు. మరియు ఆయన పర్వతాల్లో సొరంగాలను,లోయలను,గుహలను తయారు చేశాడు. వాటిలో మీరు చలి నుండి,ఎండ నుండి,శతృవుల నుండి రక్షణ పొందుతున్నారు. మరియు ఆయన మీ కొరకు పత్తి నుండి చొక్కాలను (అంగిలను),వస్త్రాలను తయారు చేశాడు. అవి మీ నుండి ఎండను,చలిని నిర్మూలిస్తాయి. మరియు ఆయన మీ కొరకు యుద్ధంలో మిమ్మల్ని ఒకరినొకరు రక్షించుకునే కవచాలను తయారు చేశాడు. ఆయుధాలు మీ శరీరములను ఛేదించలేవు. అల్లాహ్ మీపై మునుపటి అనుగ్రహములను అనుగ్రహించినట్లే మీపై ఆయన తన అనుగ్రహాలను మీరు ఆయన ఒక్కడినే విధేయత చూపుతారని,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించరని ఆశిస్తూ పరిపూర్ణం చేస్తాడు.

(82) ఓ ప్రవక్తా ఒక వేళ వారు విశ్వాసము నుండి,మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించటం నుండి విముఖత చూపితే మీ పై కేవలం మీకు చేరవేయమని ఆదేశించబడిన వాటిని స్పష్టంగా చేరవేయటం మాత్రమే బాధ్యత. సన్మార్గముపై వారిని ప్రేరేపించటం మీ బాధ్యత కాదు.

(83) ముష్రికులకు అల్లాహ్ వారిపై అనుగ్రహించిన అనుగ్రహాల గురించి తెలుసు. వాటిలో నుంచి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారి వద్దకు ప్రవక్తగా పంపించటం. ఆ తరువాత వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతావైఖరి లేకపోవటం ద్వారా,ఆయన ప్రవక్తను తిరస్కరించటం ద్వారా ఆయన అనుగ్రహాలను తిరస్కరించారు. వారిలో నుండి చాలా మంది పరిశుద్ధుడైన ఆయన అనుగ్రహాలను తిరస్కరించేవారు ఉన్నారు.

(84) ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు అల్లాహ్ ప్రతి జాతి నుండి దాని ప్రవక్తను ఎవరినైతే ప్రవక్తగా వారి వద్దకు ఆయన పంపాడో లేపుతాడు.అతడు వారిలో నుంచి విశ్వసించిన వారి విశ్వాసము పై,అవిశ్వాసపరుని అవిశ్వాసముపై సాక్ష్యమిస్తాడు. ఆ తరువాత అవిశ్వాసపరులకు వారు చేసుకున్న అవిశ్వాసము నుండి క్షమాపణ కోరుకోవటానికి అనుమతించబడదు. మరియు తమ ప్రభువు సంతుష్టపరిచే ఆచరణలు చేయటానికి వారిని ఇహలోకం వైపునకు మరలించబడదు. పరలోకము లెక్కతీసుకునే గృహము,ఆచరణల గృహము కాదు.

(85) మరియు దుర్మార్గులైన ముష్రికులు శిక్షను కళ్లతో చూసినప్పుడు వారి నుండి శిక్షను తేలిక చేయటం జరగదు. మరియు దాన్ని వారి నుండి వెనుకకు నెట్టి వారికి గడువు ఇవ్వటం జరగదు. కాని వారు అందులో శాస్వతంగా ఉండటానికి ప్రవేశిస్తారు.

(86) ముష్రికులు తాము అల్లాహ్ ను వదిలి ఆరాధించే తమ ఆరాధ్యదైవాలను పరలోకములో చూసినప్పుడు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా వీరందరినే మేము నిన్ను వదిలి ఆరాధించి సాటి కల్పించినవారు. వారు తమ భారమును వారిపై వేయటానికి అలా పలుకుతారు. అప్పుడు అల్లాహ్ వారి ఆరాధ్యదైవాలకు మాట్లాడిస్తాడు. అప్పుడు వారు వారిని ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఓ ముష్రికులారా మీరు నిశ్చయంగా అల్లాహ్ తోపాటు సాటికల్పించి మీ ఆరాధన విషయంలో అబధ్ధం పలుకుతున్నారు. ఆయనతో పాటు సాటి ఉంటేగా ఆరాధించబడటానికి.

(87) ముష్రికులు ఒక్కడైన అల్లాహ్ కి తమను సమర్పించుకుని విధేయులైపోతారు. అల్లాహ్ వద్ద తమ విగ్రహాలు తమ కొరకు సిఫారసు చేస్తాయని వాదిస్తూ వారు కల్పించుకున్నవి వారి నుండి తొలగిపోతాయి.

(88) ఎవరైతే అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఇతరులను అల్లాహ్ మార్గము నుండి మరల్చి వేస్తారో వారిని వారి చెడు వలన,ఇతరులను అపమార్గమునకు లోను చేసి చెడును ప్రభలించటం వలన వారి అవిశ్వాసము వలన అర్హులైన వారికి మేము శిక్షపై శిక్షను అధికం చేస్తాము.

(89) ఓ ప్రవక్తా ఒక సారి గుర్తు చేసుకోండి ఆ రోజుని ఏ రోజునైతే మేము ప్రతీ జాతిలో, వారిపై వారు దేనిపైనైతే ఉండేవారో అవిశ్వాసము లేదా విశ్వాసము గురించి సాక్ష్యం పలికే ఒక ప్రవక్తను లేపి నిలబెడుతాము. ఆ ప్రవక్త వారి కోవకు చెందిన వాడై,వారి భాషను మాట్లాడే వాడై ఉంటాడు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని జాతుల వారందరిపై సాక్ష్యం పలికే వాడిగా తీసుకుని వస్తాము. మరియు వారికి హలాల్,హరాం, ప్రతిఫలం,శిక్ష వేరేవి స్పష్టత అవసరమైన వాటన్నింటి స్పష్టత ఇవ్వటానికి మేము మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరియు మేము దాన్ని ప్రజలకి సత్యం వైపునకు మార్గదర్శకముగా,దానిపై విశ్వాసమును కనబరచి అందులో ఉన్న వాటిని ఆచరించిన వారికి కారుణ్యంగా,శాస్వత అనుగ్రహాల కోసం నిరీక్షించటం ద్వారా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారికి శుభవార్తనిచ్చేదానిగా అవతరింపజేశాము.

(90) నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకు న్యాయం చేయమని,దాసుడు అల్లాహ్ హక్కులను,దాసుల హక్కులను నెరవేర్చమని,ఆదేశం విషయంలో ప్రాధాన్యతనివ్వటం అవసరం ఉన్న చోట సత్యముతో మాత్రమే ఒకరిని ఒకరిపై ప్రాధాన్యతనివ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు దాసుడు తనపై తప్పనిసరికాని(దాన్ని) స్వచ్ఛందంగా ఖర్చు చేయటం,దుర్మార్గుడుని క్షమించటం లాంటి కార్యాలను ప్రాధాన్యతనివ్వటంలో మంచిగా చేయమని ఆదేశిస్తున్నాడు. మరియు బంధువులకు అవసరమైన వాటిని ఇవ్వమని ఆదేశిస్తున్నాడు. మరియు అశ్లీల మాటల్లాంటి దుర్భాషలాడటం నుండి,వ్యభిచారము లాంటి దుష్కార్యమునకు పాల్పడటం నుండి వారిస్తున్నాడు.మరియు ధర్మం ఇష్టపడని ప్రతీ పాపకార్యము నుండి వారిస్తున్నాడు. మరియు ప్రజలపై దుర్మార్గమునకు పాల్పడటం,అహంకారమును చూపటం నుండి వారిస్తున్నాడు.ఈ ఆయతులో మీకు ఆదేశించిన వాటి ద్వారా, మీకు వారించిన వాటి ద్వారా ,హితోపదేశం చేసిన వాటి ద్వారా మీరు గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తూ అల్లాహ్ మీకు హితోపదేశం చేస్తున్నాడు.

(91) మరియు మీరు అల్లాహ్ కు చేసిన లేదా ప్రజలకు చేసిన ప్రతీ వాగ్ధానమును నెరవేర్చండి. మరియు మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి దృఢపరచిన తరువాత మీ ప్రమాణాలను భంగపరచకండి. వాస్తవానికి మీరు చేసిన ప్రమాణాలను నెరవేర్చే విషయంలో మీరు అల్లాహ్ ను మీపై సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేస్తున్నది అల్లాహ్ కి తెలుసు. ఆయనపై అందులో నుండి ఏదీ గోప్యంగా లేదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(92) మరియు మీరు ప్రమాణాలను భంగపరచి ఆ ముర్ఖ స్త్రీ వలే బుద్ధి లేని మూర్ఖులు వలే కాకండి. ఎవరైతే తన ఉన్నిని లేదా తన దూదిని వడకటంలో అలసిపోయి దాన్ని వడకటమును బిగువుగా చేసి ఆ తరువాత దాన్ని త్రెంచి దాన్ని వడకక ముందు ఎలా ఉందో అలా వదులుగా చేసివేసింది. అప్పుడు ఆమే దాన్ని వడకటంలో,త్రెంచి వేయటంలో అలిసిపోయింది. ఆమె ఆశించినది పొందలేదు. మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా మీ లోనుండి ఒకరినొకరు మీ వర్గము మీ శతృవుల వర్గము కన్న ఎక్కువ అధికము,బలవంతులు అవటానికి మోసగించుకుంటున్నారు. అల్లాహ్ ప్రమాణాలను పరిపూర్ణం చేసే విషయంలో మీరు వాటిని పూర్తి చేస్తారా లేదా వాటిని భంగపరుస్తారా ? అని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మరియు అల్లాహ్ మీరు ఇహలోకంలో విభేధించుకున్న వాటిని ప్రళయదినాన మీకు తప్పకుండా స్పష్టపరుస్తాడు. అప్పుడు తప్పు చేసిన వాడి నుండి సరైన వాడిని,అసత్యపరుడి నుండి నిజాయితీపరుడిని స్పష్టపరుస్తాడు.

(93) మరియు ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మిమ్మల్ని సత్యంపై కలిసి ఉండేటట్లుగా ఒకే జాతిగా చేసేవాడు. కాని పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్న వాడిని తన న్యాయముతో సత్యము నుండి,ప్రమాణాలను పూర్తి చేయటం నుండి పరాభవమునకు లోను చేసి అపమార్గమునకు గురి చేస్తాడు. మరియు తాను కోరుకున్న వాడిని తన అనుగ్రహము ద్వారా దాని సౌభాగ్యమును కలిగిస్తాడు. మీరు ఇహలోకములో ఏమి చేస్తుండేవారో వాటి గురించి ప్రళయదినాన తప్పకుండా ప్రశ్నించబడుతారు.

(94) మరియు మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా ఒకరినొకరు మోసగించుకోకండి.వాటిలో మీరు మీ కోరికలను అనుసరిస్తున్నారు. అయితే మీరు కోరుకున్నప్పుడు వాటిని భంగపరుస్తున్నారు. మీరు కోరుకున్నప్పుడు వాటిని పూర్తి చేస్తున్నారు. నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే మీ పాదాలు ఋజు మార్గంపై స్థిరపడిన తరువాత దాని నుండి జారిపోతాయి. మరియు మీరు అల్లాహ్ మార్గము నుండి తప్పిపోవటం వలన,ఇతరులను దాని నుండి తప్పించటం వలన శిక్షను చవిచూస్తారు. మరియు మీకు రెట్టింపు శిక్ష ఉంటుంది.

(95) మరియు మీరు అల్లాహ్ వాగ్ధానమునకు బదులుగా మీ ప్రమాణములను భంగపరచి,వాటిని పూర్తి చేయటమును వదిలి కొద్దిపాటి లాభమును కోరుకోకండి.నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉన్న ది ఇహలోకములో సహాయం,యుద్ధప్రాప్తి,పరలోకంలో తన వద్ద ఉన్న శాస్వత అనుగ్రహాలు ప్రమాణాలు భంగపరచి కొద్దిపాటి లాభము వారు ఏదైతే పొందుతారో దానికన్న మీ కొరకు ఎంతో మేలైనది ఒక వేళ అది మీరు తెలుసుకోగలిగితే.

(96) ఓ ప్రజలారా మీ వద్ద ఉన్న సంపద,సుఖభోగాలు,అనుగ్రహాలు అంతమైపోతాయి ఒక వేళ అవి అధికంగా ఉన్నా కూడా.అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం (ఎల్లప్పుడూ) మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా ఎల్లప్పుడు ఉండేదానిపై అంతం అయిపోయే దాన్ని ప్రాధాన్యతనిస్తున్నారు ?. మరియు తమ ప్రమాణాలపై స్థిరంగా ఉండి వాటిని భంగపరచకుండా ఉన్నవారికి మేము తప్పకుండా వారు చేసిన విధేయత కార్యాలకన్న మంచి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాము. అప్పుడు మేము వారికి పుణ్యమునకు ప్రతిఫలము పదిరెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు ఇంకా ఎక్కువ రెట్లు ప్రసాధిస్తాము.

(97) పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ధర్మానికి అనుగుణంగా ఏదైన సత్కార్యము చేస్తే మేము తప్పకుండా అతనికి ఇహలోకములో అల్లాహ్ తీర్పుపై సంతృప్తి,ఉన్నదానిపై సంతోషము,విధేయత కార్యాలను చేసే సౌభాగ్యము ద్వారా మంచి జివితాన్ని తప్పకుండా ప్రసాధిస్తాము. మరియు ఇహలోకములో వారు చేసిన సత్కార్యములకన్న మంచిగా పరలోకములో వారి ప్రతిఫలాన్ని మేము తప్పకుండా ప్రసాధిస్తాము.

(98) ఓ విశ్వాసపరుడా నీవు ఖుర్ఆన్ పఠించదలచుకున్నప్పుడు అల్లాహ్ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను దురాలోచనల నుండి నిన్ను రక్షించమని అల్లాహ్ ని వేడుకో.

(99) నిశ్చయంగా షైతానుకు అల్లాహ్ ను విశ్వసించిన వారిపై ఎటువంటి అధికారము లేదు. మరియు వారు తమ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు.

(100) దుష్ప్రేరణ ద్వారా అతని అధికారము మాత్రం అతన్ని స్నేహితునిగా చేసుకుని అతని భ్రష్టు పట్టించటంలో అతనికి విధేయత చూపినవారిపై ఉంటుంది. మరియు వారే అతని భ్రష్టు పట్టించటం వలన అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయన తోపాటు వేరేవారిని ఆరాధించేవారు.

(101) మరియు మేము ఖుర్ఆన్ లో ఏదైన ఆయతు ఆదేశమును రద్దుపరచి దానికి బదులుగా వేరే ఆయతును తీసుకుని వచ్చినప్పుడు - ఖుర్ఆన్ లో రద్దుపరచబడిన వాటి గురించి అల్లాహ్ కి బాగా తెలుసు - వారు అంటారు : ఓ ముహమ్మద్ నీవు కేవలం అల్లాహ్ కి వ్యతిరేకంగా కల్పించుకుంటున్నావు,అబధ్ధం పలుకుతున్నావు. కానీ రద్దుపరచటం అన్నది దైవ సంపూర్ణ వివేకం వలన అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు.

(102) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : జిబ్రయీల్ అలైహిస్సలాం ఈ ఖుర్ఆన్ ను పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి సత్యముతో తీసుకుని వచ్చారు. అందులో ఎటువంటి తప్పుగాని,మార్పు,చేర్పులు గాని లేవు. ఎప్పుడైన ఆయన వద్ద నుండి ఏదైన కొత్తది తీసుకుని వచ్చినా,ఆయన వద్ద నుండి ఏదైన ఖండించబడినా అల్లాహ్ పట్ల విశ్వాసమును కలిగిన వారు తమ విశ్వాసముపై నిలకడగా ఉండటానికి,వారికి సత్యము వైపునకు మార్గదర్శకము అవటానికి,ముస్లిముల కొరకు దానిపై వారు ఏదైతే ఉన్నత పుణ్యమును పొందుతారో దాని శుభవార్త ఇవ్వటానికి.

(103) మరియు ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఖుర్ఆన్ నేర్పిస్తున్నది ఒక మనిషి అని చెబుతున్న విషయం మాకు తెలుసు. వారు తమ వాదనలో అబధ్ధం చెబుతున్నారు. ఆయనకు నేర్పిస్తున్నాడని వారు వాదిస్తున్న వ్యక్తి భాష అరబీ కాదు (అజమీ). ఈ ఖుర్ఆన్ గొప్ప అర్ధము కల స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది. అలాంటప్పుడు ఆయన ఒక అరబేతరుడితో దాన్ని నేర్చుకున్నాడని మీరు ఎలా వాదిస్తున్నారు ?.

(104) నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతులను పరిశుద్ధుడైన ఆయన వద్దనుండి వచ్చినవని విశ్వసించరో వారికి అల్లాహ్ వారు ఎప్పటి వరకు దానిపై మొండిగా ఉంటారో అప్పటి వరకు సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించడు. వారికి ఉన్న అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ఆయతుల పట్ల తిరస్కారము వలన వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.

(105) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన విషయంలో అబధ్ధపరులు కారు.అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారు అబధ్ధమును కల్పిస్తున్నారు. ఎందుకంటే వారికి శిక్ష భయం లేదు. ప్రతిఫలమును ఆశించటం లేదుమరియు అవిశ్వాస గుణము కలిగిన వారందరు అసత్యపరులు. ఎందుకంటే అబధ్ధము వారి అలవాటు.

(106) ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసము తరువాత అల్లాహ్ పట్ల అవిశ్వాసముతో నిండిన హృదయమును కలిగి ఉండి దాన్ని విశ్వాసమునకు విరుద్ధంగా ఎంచుకుని ఉండి ఇష్టపూర్వకంగా దాన్ని పలికితే అతను ఇస్లాం నుండి మరలిపోతాడు. ఇలాంటి వారిపై అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం వచ్చి పడుతుంది. మరియు వారికి పెద్ద శిక్ష ఉన్నది. కాని ఎవరైతే విశ్వాసము యొక్క వాస్తవికతను నమ్ముతూ అతని హృదయం విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి బలవంతాన తన నోటితో అవిశ్వాస మాటలు పలికితే (అతడు ఇస్లాంలోనే ఉంటాడు) .

(107) ఇస్లాం నుండి ఈ మరలిపోవటం అన్నది వారు తమ అవిశ్వాసం వలన పరలోకమునకు బదులుగా ఇహలోక శిధిలాలను పొందటం వలన జరిగినది. మరియు అల్లాహ్ అవిశ్వాసపరులైన జాతి వారికి విశ్వాసమును అనుగ్రహించడు. కాని వారిని పరాభవమునకు గురి చేస్తాడు.

(108) విశ్వాసము తరువాత మరలిపోయే గుణం కల వీరందరి హృదయములపై అల్లాహ్ ముద్ర వేశాడు. అయితే వారు హితబోధనలను అర్ధం చేసుకోరు. వారి చెవులపై వేశాడు వాటి ద్వారా వారు ప్రయోజనం కలిగించే వాటిని విన లేరు. వారి కళ్ళపై వేశాడు అయితే వారు విశ్వాసము పై సూచించే సూచనలను చూడలేరు. మరియు వారందరు సుఖ,దుఃఖాల కారకాల నుండి మరియు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన శిక్ష నుండి పరధ్యానంలో ఉన్నారు.

(109) వాస్తవానికి నిశ్చయంగా వారు ప్రళయదినాన విశ్వాసము తరువాత తమ అవిశ్వాసం వలన స్వయంగా నష్టపోతారు. ఒక వేళ వారు తమ మొదటి విశ్వాసముపై ఉండి ఉంటే స్వర్గములో ప్రవేశించి ఉండేవారు.

(110) ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఆ బలహీన విశ్వాసపరులను క్షమించేవాడును,కరుణించేవాడును ఎవరైతే ముష్రికుల చేతుల్లో బాధించబడిన తరువాత మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వెళ్లిపోయారో. వారు (ముష్రికులు) వారి ధర్మ విషయంలో పీడిస్తే వారు చివరకు వారి హృదయములు విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి, వారు అవిశ్వాసపలుకులు పలికారు,ఆ పిదప అల్లాహ్ వాక్కు గొప్పదవటానికి,అవిశ్వాసపరుల వాక్కు నేలమట్టం అవటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి,దానిలో కలిగే కష్టాల్లో సహనం చూపించారు. నిశ్చయంగా నీ ప్రభువు వాడు పీడించబడిన ఈ పీడన తరువాత,వారు బాధించబడి చివరికి అవిశ్వాస పలుకును పలికిన బాధ తరువాత వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.ఎందుకంటే వారు అవిస్వాసపలుకులను బలవంతాన మాత్రమే పలికారు.

(111) ఓ ప్రవక్తా మీరు ఆ రోజును గుర్తు చేసుకోండి ఏ రోజైతే ప్రతి మనిషి తన స్వయం తరపు నుండి వాదిస్తాడు. స్థానము యొక్క గొప్పతనం వలన అది కాకుండా వేరే వాటి గురించి వాదించడు. ప్రతి ప్రాణికి తాను చేసుకున్న మంచి చెడుల పూర్తి ప్రతిఫలం ప్రసాధించబడుతుంది.మరియు వారి సత్కర్మలను తరిగించి,వారి పాపములను అధికం చేసి వారిని హింసకు గురిచేయటం జరగదు.

(112) మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానమిచ్చాడు.అది మక్కా నగరం.అది ఎంతో ప్రశాంతతో కూడుకుని ఉండేది,అక్కడి వాసులు భయాందోళనలకు లోనయ్యేవారు కాదు. అది స్థిరంగా ఉన్నది దాని చుట్టుప్రక్కల ప్రాంతముల ప్రజలు మట్టుపెట్టబడేవారు. దానికి ఆహారోపాధి ప్రతి ప్రాంతము నుండి శుభప్రధంగా,సులభంగా వచ్చేది. అప్పుడు అక్కడి వాసులు అల్లాహ్ తమపై అనుగ్రహించిన అనుగ్రహాలను తిరస్కరించారు,ఆయనకు వారు కృతజ్ఞతలు తెలుపుకోలేదు. అయితే అల్లాహ్ వారికి ఆకలి ద్వారా,తీవ్రమైన భయాందోళనల ద్వారా వారి శరీరములపై భయము,బలహీనత బహిర్గతం అవటానికి ప్రతిఫలాన్ని ప్రసాధించాడు. చివరికి అవి (భయం, ఆకలి) వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము కారణం వలన వారికి వస్త్రములుగా అయిపోయినవి.

(113) నిశ్చయంగా మక్కా వాసుల వద్దకు వారిలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు వారు అతన్ని నీతి,నిజాయితీ ద్వారా గుర్తించారు.అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.అయితే వారు అతనిపై అతని ప్రభువు అవతరింపజేసిన విషయంలో అతన్ని తిరస్కరించారు.అప్పుడు వారిపై ఆకలి,భయందోళనల రూపంలో అల్లాహ్ శిక్ష వచ్చిపడింది.వారు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయన ప్రవక్తను తిరస్కరించినప్పుడు వినాశన స్థానములకు చేరటం ద్వారా తమపై హింసకు పాల్పడ్డారు.

(114) ఓ దాసులారా పరిశుద్ధుడైన అల్లాహ్ మీకు ప్రసాధించిన వాటిలో నుంచి వేటిని తినటం మంచిదో వాటిలో నుంచి ధర్మసమ్మతమైన వాటినే తినండి. మరియు మీరు మీకు అల్లాహ్ ప్రసాధించిన ఈ అనుగ్రహాలను స్వీకరించటం ద్వారా, వాటిని ఆయన మన్నతలో వినియోగించటం ద్వారా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఒక వేళ మీరు ఆయనొక్కడినే ఆరాధించాలంటే,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండాలంటే.

(115) తినేవాటిలో నుండి హలాల్ చేయవలసినది హలాల్ చేయకుండానే చనిపోయినది,ప్రవహించే రక్తము,పంది దాని పూర్తి భాగములు,జిబాహ్ చేసే వ్యక్తి అల్లాహేతరుల కొరకు జిబాహ్ చేసిన జంతువు అల్లాహ్ మీపై నిషేధించాడు.ఈ నిషేధము ఎంపిక చేసుకునే స్థితిలో మాత్రమే. కాని ఎవరికైన ప్రస్తావించబడిన వాటిని తినాల్సిన అవసరం ఏర్పడి గత్యంతరం లేనప్పుడు వాటిలో నుండి నిషేధించబడిన విషయంలో ఇష్టం లేకుండా.అవసరము కన్న మితిమీరకుండా తినటంలో అతనిపై ఎటువంటి దోషం లేదు.నిశ్చయంగా అల్లాహ్ తిన్న దానిపై అతనికి మన్నించేవాడును,అత్యవసర పరిస్థితిలో అతనికి దాని అనుమతిచ్చినప్పుడు అతనిపై కనికరించేవాడును.

(116) ఓ ముష్రికులారా అల్లాహ్ నిషేధించని వాటిని నిషేధించి,ఆయన ధర్మసమ్మతం చేయని వాటిని ధర్మసమ్మతం చేసి మీరు అల్లాహ్ పై అబద్ధమును కల్పించే ఉద్ధేశముతో ఈ వస్తువు ధర్మ సమ్మతం,ఈ వస్తువు నిషేధం అని మీ నాలుకలు పలికిన అబద్ధమును అల్లాహ్ పై పలకకండి.నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పై అబద్ధమును కల్పిస్తారో వారు తాము ఆశించిన వాటితో సఫలీకృతం కారు,భయం నుండి వారికి విముక్తి లేదు.

(117) వారు తమ మనోవాంచనలను అనుసరించటం ద్వారా వారికి ఇహలోకంలో కొద్దిపాటి సుఖసంతోషాలు కలుగును .మరియు వారికి ప్రళయదినాన బాధాకరమైన శిక్ష కలదు.

(118) మరియు మేము మీకు ప్రస్తావించిన వాటిని యూదులపై ప్రత్యేకించి నిషేధించాము (సూరె అన్ఆమ్ 146 వ ఆయతులో ఉన్నట్లుగా). ఈ నిషేధము ద్వారా మేము వారిపై హింసకు పాల్పడలేదు.కానీ వారే శిక్షకు కారకాలైన వాటికి పాల్పడినప్పుడు తమ స్వయంపైనే హింసకు పాల్పడ్డారు.వారి దుర్మార్గమునకు ప్రతిఫలాన్ని మేము వారికి ప్రసాధించాము. వారికి శిక్షగా వాటిని వారిపై మేము నిషేధించాము.

(119) ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు వారికి ఎవరైతే దుష్కర్మల పరిణామం తెలియక ఒక వేళ కావాలనే వాటికి పాల్పడి ఆ పిదప దుష్కర్మలకు పాల్పడిన తరువాత వారు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడి ,తమ ఆ కర్మలను వేటిలోనైతే చెడు ఉన్నదో వాటిని సంస్కరించుకుంటే నిశ్చయంగా నీ ప్రభువు పశ్చాత్తాపము తరువాత వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.

(120) నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం మంచి లక్షణాలను సమీకరించేవారై,తన ప్రభువు పట్ల ఎల్లప్పుడు విధేయత చూపేవారై,ధర్మములన్నింటి నుండి ఇస్లాం ధర్మం వైపునకు మగ్గు చూపేవారై ఉండేవారు. ఆయన ఎన్నడూ ముష్రికుల్లోంచి కాలేదు.

(121) మరియు ఆయన తనకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలపట్ల కృతజ్ఞుడై ఉండేవారు. అల్లాహ్ ఆయనను దైవదౌత్యం కొరకు ఎంచుకుని ఆయనని సత్య ధర్మమైన ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు.

(122) మరియు మేము ఆయనకు ఇహలోకంలో దైవదౌత్యమును,పుణ్య సంతానమును ప్రసాధించాము. మరియు నిశ్చయంగా ఆయన పరలోకములో ఆ సజ్జనుల్లోంచి ఉంటాడు ఎవరి కొరకైతే అల్లాహ్ స్వర్గపు ఉన్నత స్థానాలు తయారు చేసి ఉంచాడు.

(123) ఆ తరువాత ఓ ప్రవక్తా మీరు ఏక దైవోపాసనలో,ముష్రికులతో సంబంధం లేకపోవటంలో,అల్లాహ్ వైపునకు ,ఆయన ధర్మం పై ఆచరించటంలో,అన్ని ధర్మముల నుండి ఇస్లాం ధర్మం వైపునకు మగ్గు చూపటంలో ఇబ్రాహీం అలైహిస్సలాం సిద్ధాంతమును అనుసరించమని మేము మీ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. ఆయన ముష్రికులు వాదించినట్లు ఎన్నడూ ముష్రికుల్లోంచి కాలేదు కాని ఆయన అల్లాహ్ కే ఏకదైవోపాసన చేసే వారు.

(124) శనివారం విషయంలో విభేదించుకున్న యూదులపై శనివారం విశిష్టత విధిగావించబడినది. వారు అందులో తమ కార్యములను వదిలి అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమవటానికి.ఇంతక ముందు వారు శుక్రవారం విషయంలో అందులో పూర్తి సమయమును కేటాయించమని ఆదేశించబడిన తరువాత వారు శుక్రవారము నుండి భ్రష్టులైపోయారు.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రళయదినాన విభేదించుకునే వీరందరి మధ్యన విభేదించుకుంటున్న వాటి విషయంలో తీర్పునిస్తాడు మరియు ప్రతీ హక్కుదారుడికి ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.

(125) ఓ ప్రవక్తా మీరు,మిమ్మల్ని అనుసరించే విశ్వాసపరులు అహ్వానితుడి స్థితికి,అతని అవగాహనకు (బుద్ధికి),అతని అనుసరణకు తగ్గట్టుగా,ప్రోత్సహించటం,భయపెట్టటంపై కూడుకున్న హితబోధనల ద్వారా ఇస్లాం ధర్మం వైపునకు పిలవండి.మరియు మీరు వారితో మాటపరంగా,ఆలోచనపరంగా,పద్దతిపరంగా మంచిగా ఉన్న పధ్ధతితో మాట్లాడండి. ప్రజలందరిని సన్మార్గంపై నడిపే బాధ్యత మీపై లేదు. మీపై కేవలం వారికి సందేశాలు చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. ఇస్లాం ధర్మం నుండి భ్రష్టులెవరయ్యారో నిశ్చయంగా నీ ప్రభువుకు బాగా తెలుసు.మరియు ఆయన వైపునకు మార్గం పొందేవారెవరో ఆయనకు బాగా తెలుసు. వారిపై మీరు దుఃఖించి మీ ప్రాణములను కోల్పోకండి.

(126) ఒక వేళ మీరు మీ శతృవులను శిక్షించదలచుకుంటే మీరు ఎటువంటి హెచ్చు లేకుండా వారు మీపట్ల వ్యవహరించినట్లే వారిని శిక్షించండి. ఒక వేళ మీరు శిక్షించే సామర్ధ్యం కలిగి కూడా సహనం పాటిస్తే నిశ్చయంగా అది మీలో నుండి వారిని శిక్షించకుండా సహనం పాటించిన వారికి ఎంతో మేలైనది.

(127) ఓ ప్రవక్తా మీరు వారి వలన మీకు కలిగిన బాధలపై సహనం చూపండి. సహనం కొరకు మీకు అనుగ్రహం అల్లాహ్ అనుగ్రహం ద్వారా మాత్రమే కలుగును. అవిశ్వాసపరులు మీ నుండి విముఖత చూపటంపై మీరు దుఃఖపడకండి. వారు చేసే కుట్రల,కుతంత్రాల వలన మీ మనస్సు వ్యాకులత చెందకూడదు.

(128) నిశ్చయంగా అల్లాహ్ అవిధేయ కార్యాలను వదిలి తనతో భయపడేవారితోపాటు,విధేయకార్యాలను పాటించి,వారికి ఆదేశించబడిన వాటిని పాటించి సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. ఆయనే సహాయము,మద్దతు ద్వారా వారికి తోడుగా ఉంటాడు.