71 - Nooh ()

|

(1) నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను తన జాతి వారి వద్దకు పంపించాము. వారు అల్లాహ్ కు సాటి కల్పించటం వలన వారిపై వచ్చే బాధాకరమైన శిక్షకు ముందు ఆయన తన జాతి వారిని భయపెట్టానికి వారిని ఆహ్వానించమని.

(2) నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను ఒక వేళ మీరు అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడకపోతే మీ కోసం నిరీక్షిస్తున్న ఒక శిక్ష నుండి మీ కొరకు స్పష్టంగా హెచ్చరించేవాడిని.

(3) మీకు నా హెచ్చరిక యొక్క ఆవశ్యకత ఏమిటంటే, నేను మీకు చెప్తున్నాను: అల్లాహ్ ఒక్కడిని మాత్రమే మీరు ఆరాధించండి మరియు ఆయనతో దేనినీ సాటి కల్పించకండి. మరియు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మీరు నన్ను అనుసరించండి.

(4) నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే అల్లాహ్ మీ కొరకు మీ పాపములను ఏవైతే దాసుల హక్కులతో సంబంధము లేదో వాటిని మన్నించివేస్తాడు. మరియు ఇహలోకంలో మీ సమాజ కాలమును అల్లాహ్ జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు పొడిగిస్తాడు. మీరు భూమిని దానిపై మీరు ఉన్నంతకాలం ఏలుతారు. నిశ్చయంగా మరణం వచ్చినప్పుడు గడువు ఇవ్వబడదు. ఒక వేళ మీకు తెలిస్తే మీరు అల్లాహ్ పై విశ్వాసము వైపునకు మరియు మీరు ఉన్న షిర్కు,మార్గభ్రష్టత నుండి పశ్చాత్తాప్పడటం వైపునకు త్వరపడుతారు.

(5) నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభూ నిశ్చయంగా నేను నీ దాసులను నీ తౌహీద్ వైపునకు రాత్రింబవళ్ళు క్రమం తప్పకుండా పిలిచాను.

(6) వారిని నా పిలవటం నేను దేని వైపునైతే వారిని పిలిచానో దాని నుండి బెదిరి పారిపోవటమును మరియు దూరమును మాత్రమే అధికం చేసింది.

(7) మరియు నేను ఎప్పుడెప్పుడైతే వారిని వారి పాపములకు మన్నింపు గలవైన నీ ఒక్కడి ఆరాధన మరియు నీపై,నీ ప్రవక్తపై విధేయత చూపటం వైపునకు పిలిచానో వారు తమ చెవులను తమ వేళ్ళతో నా పిలుపును వినటం నుండి వాటిని ఆపటానికి అడ్డుపెట్టుకునేవారు. మరియు నన్ను చూడకుండా ఉండటానికి తమ ముఖములను తమ వస్త్రములతో కప్పుకునేవారు. మరియు వారు తాము ఉన్న షిర్కుపైనే కొనసాగిపోయేవారు. మరియు దేని వైపునైతే నేను వారిని పిలిచానో దాన్ని స్వీకరించటం నుండి మరియు దానికి కట్టుబడి ఉండటం నుండి అహంకారమును చూపేవారు.

(8) ఆ పిదప ఓ నా ప్రభువా నేను వారిని బహిరంగంగా పిలిచాను.

(9) ఆ పిదప నిశ్చయంగా నేను పిలవటంలో వారి కొరకు నా స్వరమును బిగ్గరగా చేశాను మరియు నేను రహస్యంగా గోప్యంగా చెప్పాను. మరియు నేను వారిని నెమ్మదైన స్వరముతో పిలిచాను. వారికి నా పిలుపు యొక్క రకరకాల పద్దతులతో పిలిచాను.

(10) అప్పుడు నేను వారితో ఇలా పలికాను : ఓ నా జాతి వారా మీరు మీ ప్రభువుతో ఆయన వైపునకు పశ్ఛాత్తాప్పడుతూ పాపముల మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి తన వైపునకు పశ్ఛాత్తాపముతో మరలే వారి పాపములను మన్నించేవాడు.

(11) నిశ్ఛయంగా మీరు ఇలా చేస్తే అల్లాహ్ మీపై వర్షమును మీకు దాని అవసరం ఉన్నప్పుడల్లా క్రమం తప్పకుండా కురిపిస్తాడు. మీకు కరువు అన్నది సంభవించదు.

(12) మరియు ఆయన మీకు సంపదలను మరియు సంతానమును అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ కొరకు తోటలను చేస్తాడు మీరు వాటి ఫలముల నుండి తింటారు. మరియు ఆయన మీ కొరకు సెలయేరులను చేస్తాడు మీరు వాటి నుండి త్రాగుతారు మరియు మీ పంటలకు,మీ పశువులకు నీటిని పట్టిస్తారు.

(13) ఓ నా జాతి ప్రజలారా మీ విషయమేమిటి మీరు అల్లాహ్ గొప్పతనానికి భయపడటం లేదు ?. అందుకనే మీరు పట్టించుకోకుండా ఆయనపై అవిధేయత చూపుతున్నారు.

(14) వాస్తవానికి ఆయన మిమ్మల్ని ఒక దశ తరువాత ఇంకో దశగా సృష్టించాడు. వీర్యపు బిందువు నుండి రక్తపు ముద్దగా,ఆ తరువాత మాంసపు ముద్దగా.

(15) ఏమీ ఒక ఆకాశముపై ఇంకో ఆకాశముగా ఏడు ఆకాశములను అల్లాహ్ ఎలా సృష్టించాడో మీరు చూడటంలేదా ?!

(16) మరియు ఆయన వాటిలో నుండి భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములో చంద్రుడిని భూ వాసులకు వెలుగుగా చేశాడు. మరియు ఆయన సూర్యుడిని కాంతివంతముగా చేశాడు.

(17) మరియు అల్లాహ్ మీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించటంతో మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఆ పిదప మీరు అది మీ కొరకు ఉత్పత్తి చేసే వాటిని ఆహారంగా తీసుకొంటున్నారు.

(18) ఆ పిదప ఆయన మిమ్మల్ని మీ మరణం తరువాత అందులో మరలింపజేస్తాడు. ఆ తరువాత మరణాంతరం లేపటం కొరకు ఆయన మిమ్మల్ని దాని నుండి వెలికి తీస్తాడు.

(19) మరియు అల్లాహ్ మీ కొరకు భూమిని నివాసం కొరకు విస్తరింపజేసి సిద్ధం చేశాడు.

(20) మీరు దాని విశాలమైన మార్గముల్లో ధర్మ సమ్మతమైన సంపాదన కొరకు శ్రమిస్తూ నడుస్తారని ఆశిస్తూ.

(21) నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్ఛయంగా నా జాతి వారు నేను వారికి నీ తౌహీదు గురించి మరియు నీ ఒక్కడి ఆరాధన గురించి ఇచ్చిన ఆదేశం విషయంలో నా పై అవిధేయత చూపారు. మరియు వారిలో నుండి తక్కువ స్థానం కలవారు నీవు ధనాన్ని,సంతానమును అనుగ్రహించిన తమ నాయకులను అనుసరించారు. వారికి నీవు అనుగ్రహించినది వారిని అపమార్గములో మాత్రం అధికం చేసింది.

(22) వారిలోని పెద్దవారు తమ క్రిందటి స్థానం కలవారిని నూహ్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టటంతో పెద్ద కుట్రనే పన్నారు.

(23) మరియు వారు తమను అనుసరించే వారితో ఇలా పలికారు : మీరు మీ దేవతలను ఆరాధించటమును వదలకండి. మరియు మీరు మీ విగ్రహములైన వద్ద్ ని గాని సువాను గాని యగూస్ ని గాని యఊఖ్ ని గాని మరియు నస్ర్ ని గాని ఆరాధించటమును వదలకండి.

(24) వాస్తవానికి వారు తమ ఈ విగ్రహాల ద్వారా చాలా మంది ప్రజలను అపమార్గమునకు లోను చేశారు. ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసంపై,పాప కార్యములపై మొండితనముతో తమ స్వయమునకు హింసించుకున్న వారిని నీవు సత్యం నుండి తప్పిపోవటంలో మాత్రం అధికం చేయి.

(25) వారు పాల్పడిన తమ పాపముల వలన ఇహలోకంలో తుఫాను ద్వారా ముంచబడ్డారు. తమ మరణం తరువాత వెంటనే నరకాగ్నిలో ప్రవేశించబడ్డారు. వారు తమను మనుగటం నుండి.నరకాగ్ని నుండి రక్షించే ఏ సహాయకుడిని అల్లహ్ ను విడిచి ఎవరినీ తమ కొరకు పొందలేదు.

(26) మరియు నూహ్ అలైహిస్సలాం ఆయన జాతి వారిలో నుండి విశ్వసించిన వారు తప్ప ఇంకా ఎవరు విశ్వసించరని అల్లాహ్ ఆయనకు తెలియపరచినప్పుడు ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసపరుల్లోంచి ఎవరినీ భూమిపై తిరుగుతుండగా లేదా సంచరిస్తుండగా వదలకు.

(27) నిశ్ఛయంగా ఓ మా ప్రభువా ఒక వేళ నీవు వారిని వదిలి,వారికి గడువిస్తే వారు విశ్వాసపరులైన నీ దాసులను అపమార్గమునకు గురి చేస్తారు. మరియు నీపై విధేయత చూపని పాపాత్ముడిని,నీ అనుగ్రహములపై నీకు కృతజ్ఞత తెలపని కఠిన కృతఘుృడిని మాత్రమే వారు జన్మనిస్తారు.

(28) ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు మరియు నా తల్లిదండ్రులను మన్నించు మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వారిని మన్నించు. మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను మన్నించు. మరియు అవిశ్వాసము,పాప కార్యముల ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారిని వినాశనంలో మరియు నష్టంలో అధికం చేయి.