(1) ఆకాశముల్లో ఉన్న మరియు భూమిలో ఉన్న సృష్టి రాసులన్నీ అల్లాహ్ యొక్క ఆయనకు తగని వాటి నుండి గొప్పతనాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన ధర్మ శాసనములలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.
(2) ఆయనే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిరస్కరించి బనూ నజీర్ ను మదీనాలో ఉన్న వారి నివాసముల నుండి వారిని మదీనా నుండి షామ్ (సిరియా) వైపునకు మొదటి సారి వెలివేయటం కొరకు వెలివేశాడు. మరియు వారు తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి వారు. వారు తమ ఒప్పందమును భంగపరచి,ఆయనకు వ్యతిరేకముగా ముష్రికులతో సత్సంబంధాలు కలిగిన తరువాత. ఆయన వారిని షామ్ ప్రాంతము వైపునకు వెలివేశాడు. ఓ విశ్వాసపరులారా వారు కలిగిన ఆధిక్యత మరియు రక్షణ వలన వారు తమ నివాసముల నుండి భయటకు వస్తారని మీరు అనుకోలేదు. మరియు వారు నిర్మించుకున్న వారి కోటలు మరియు వారి రక్షణాలయములు అల్లాహ్ యాతన,ఆయన శిక్ష నుండి తమను రక్షిస్తాయని వారు భావించారు. అప్పుడు అల్లాహ్ శిక్ష ఆయన తన ప్రవక్తను వారితో పోరాడమని,వారిని వెలివేయమని ఆదేశించినప్పుడు వారు దాని వచ్చే చోటును ఊహించని విధంగా వారిపై వచ్చిపడినది. మరియు అల్లాహ్ వారి హృదయముల్లో తీవ్రమైన భయమును కలిగించాడు. వారు తమ నివాసములను ముస్లిములు వాటితో ప్రయోజనం చెందకుండా ఉండటానికి లోపలి నుండి తమ చేతులతో పడగొట్టసాగారు. మరియు ముస్లిములు వాటిని వెలుపల నుండి పడగొట్టసాగారు. కాబట్టి కళ్లు ఉన్నవారలారా వారి అవిశ్వాసం వలన వారిపై కలిగిన దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు వారిలా అవ్వకండి. అటువంటప్పుడు వారు శిక్షంచబడిన వారి ప్రతిఫలము,వారి శిక్షను మీరు పొందుతారు.
(3) మరియు ఒక వేళ అల్లాహ్ వారిని వారి నివాసముల నుండి వెలివేయటమును వారిపై రాసి ఉండకపోతే వారిని ఇహలోకములోనే హతమార్చటం ద్వారా,బందీ చేయటం ద్వారా ఏ విధంగానైతే వారి సోదరులు బను ఖురైజా పట్ల వ్యవహరించాడో ఆ విధంగా శిక్షించేవాడు. మరియు వారి కొరకు పరలోకములో నరక యాతన వారిని నిరీక్షిస్తూ ఉంటుంది. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
(4) అది ఏదైతే వారికి సంభవించినది సంభవించింది. ఎందుకంటే వారు తమ అవిశ్వాసం ద్వారా తమ ప్రమాణములను భంగ పరచటం ద్వారా అల్లాహ్ పట్ల శతృత్వమును చూపారు మరియు ఆయన ప్రవక్త పట్ల శతృత్వమును చూపారు. ఎవరైతే అల్లాహ్ పట్ల శతృత్వమును చూపుతారో నిశ్ఛయంగా అల్లాహ్ కఠినంగా శిక్షంచేవాడు. తొందరలోనే ఆయన కఠినమైన శిక్ష అతనికి కలుగుతుంది.
(5) విశ్వాసపరుల సమాజం వారా బనూ నజీర్ యుద్దంలో మీరు ఏవైతే ఖర్జూరపు చెట్లను అల్లాహ్ శతృవులను ఆగ్రహమునకు గురి చేయటానికి మీరు నరికారో లేదా మీరు ప్రయోజనం చెందటానికి వాటిని వాటి బోదెలపై వదిలి వేశారో అది అల్లాహ్ ఆదేశముతోనే. అది వారు అనుకున్నట్లు భూమిలో ఉపద్రవాన్ని తలపెట్టటం కోసం కాదు. మరియు యూదుల్లోంచి ఆయన విధేయత నుండి వైదొలగిన వారికి అల్లాహ్ దాని ద్వారా అవమానపరచటానికి. వారు ప్రమాణమును భంగపరిచారు. మరియు వారు విశ్వాసపాత్రత మార్గమునకు భిన్నంగా ద్రోహ మార్గమును ఎంచుకున్నారు.
(6) బనూ నజీర్ సంపదల్లోంచి అల్లాహ్ ఏదైతే తన ప్రవక్తకు అందజేశాడో దాన్ని పొందే విషయంలో మీరు సవారి చేసే గుఱ్రములను గాని ఒంటెలను గాని మీరు పరుగెత్తించలేదు. మరియు ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ అల్లాహ్ తాను తలచుకున్న వారిపై తన ప్రవక్తలకు ఆధిక్యతను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఆయన తన ప్రవక్తకు బనూ నజీర్ పై ఆధిక్యతను ప్రసాదించాడు. కాబట్టి ఆయన ఎటువంటి యుద్దం లేకుండానే వారి బస్తీలపై విజయం పొందారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(7) అల్లాహ్ బస్తీ వాసుల సంపదల్లోంచి ఏదైతే తన ప్రవక్తకు ఎటువంటి యుద్దం లేకుండా అనుగ్రహించాడో అది అల్లాహ్ కు చెందినది. ఆయన దాన్ని తాను తలచిన వారికి ఇస్తాడు. మరియు ప్రవక్తకు అధికారం కలదు. మరియు ఆయన బంధువులైన హాషిమ్ సంతతి మరియు ముత్తలిబ్ సంతతి కొరకు అధికారము కలదు అది వారు సదఖా నుండి ఆపబడిన దానికి బదులుగా. మరియు అనాధులకి,పేదవారికి మరియు తన ఖర్చులను కోల్పోయిన బాటసారికి అధికారం కలదు. సంపద పేదవారికి కాకుండా ధనికుల్లోనే ప్రత్యేకించి తిరగకుండా ఉండటానికి. ఓ విశ్వాసపరులారా ఫై సంపదలలోంచి మీకు ప్రవక్త ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి మరియు ఆయన మీకు ఆపిన దాని నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి. నిశ్ఛయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించే వాడు కాబట్టి మీరు ఆయన శిక్ష నుండి జాగ్రత్తపడండి.
(8) మరియు ఈ సంపద నుండి తమ సంపదలను,తమ సంతానమును వదిలివేయటంపై బలవంతం చేయబడి అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన పేదల కొరకు మరలించబడుతుంది. వారు అల్లాహ్ వారిపై ఆహారోపాధి ద్వారా ఇహలోకంలో మరియు మన్నత ద్వారా పరలోకంలో అనుగ్రహిస్తాడని ఆశిస్తుంటారు. మరియు వారు అల్లాహ్ మార్గములో ధర్మ పోరాటము ద్వారా అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు సహాయపడతారు. ఈ లక్షణాలతో వర్ణించబడిన వారందరు వాస్తవానికి విశ్వాసములో పతిష్టమైనవారు.
(9) మరియు ముహాజిర్ ల కన్నా ముందు నుండే మదీనాలో చోటు చేసుకున్న అన్సారులు, వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును ఎంచుకున్నారు. వారు మక్కా నుండి తమ వద్దకు వలస వచ్చిన వారిని ఇష్టపడుతారు. మరియు వారు ఫై నుండి తమకు ఇవ్వకుండా అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన వారికి ఏదైన ఇవ్వబడితే తమ హృదయములలో ఎటువంటి కోపమును గాని ఎటువంటి అసూయను గాని పొందరు. మరియు వారు ప్రాపంచిక భాగములలో ముహాజిర్ లను తమ కన్నా ముందు ఉంచుతారు. ఒక వేళ వారికి పేదరికము, అవసరం కలిగినా సరే. మరియు అల్లాహ్ ఎవరినైతే సంపదపై అత్యాశ నుండి రక్షిస్తాడో అతడు దాన్ని ఆయన మార్గములో ఖర్చు చేస్తాడు. కావున వారందరే తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందుతారు.
(10) మరియు వీరందరి తరువాత ఎవరైతే వచ్చి ప్రళయ దినము వరకు వారిని మంచితో అనుసరిస్తారో వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మమ్మల్ని మరియు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై మా కన్నా ముందు విశ్వాసము కనబరచిన వారైన ధర్మ విషయంలో మా సోదరులైన వారిని మన్నించు. విశ్వాసపరుల్లోంచి ఎవరి కొరకు కూడా మా హృదయములలో ద్వేషమును కాని పగను కాని కలిగించకు. ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు నీ దాసులపై దయ చూపేవాడివి, వారిపై కరుణించేవాడివి.
(11) ఓ ప్రవక్తా అవిశ్వాసమును గోప్యంగా ఉంచి విశ్వాసమును బయటకు చూపే వారిని మీరు గమనించలేదా వారు అవిశ్వాసంలో తమ సోదరులైన మార్పు చేర్పులు చేయబడిన తౌరాత్ ను అనుసరించే యూదులతో ఇలా పలుకుతున్నారు : మీరు మీ ఇండ్లలోనే స్థిరంగా ఉండండి మేము మిమ్మల్ని నిస్సహాయులుగా వదిలివేయము. మరియు మేము మిమ్మల్ని అప్పజప్పము. ఒక వేళ ముస్లిములు మిమ్మల్ని వాటి నుండి వెళ్ళగొడితే మేము కూడా మీతో పాటు కలిసి బయటకు వస్తాము. మేము మీతో పాటు బయటకు రావటం నుండి మమ్మల్ని ఆపదలచిన వారి ఎవరి మాట వినము. మరియు ఒకవేళ వారు మీతో పోరాడితే మేము వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాము. మరియు నిశ్ఛయంగా యూదులు వెళ్ళగొట్టబడినప్పుడు వారితో పాటు బయలు దేరుతారని మరియు వారితో యుద్దం చేయబడినప్పుడు వారితో కలసి యుద్దం చేస్తారని చేసిన వాగ్దానములో కపటులు అబద్దం పలుకుతున్నారని అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడు.
(12) ఒక వేళ ముస్లిములు యూదులను వెళ్ళ గొడితే వారు వారితో పాటు బయలుదేరరు. ఒక వేళ వారు వారితో యుద్దం చేస్తే వారు వారికి సహాయము చేయరు మద్దతూ పలకరు. మరియు ఒక వేళ వారు వారికి ముస్లిములకు వ్యతిరేకముగా సహాయము చేసి మద్దతు పలికితే వారు వారి నుండి తప్పకుండా పారిపోతారు ఆ తరువాత కపటులు సహాయం చేయబడరు. అంతేకాదు అల్లాహ్ వారిని అవమానమునకు గురి చేస్తాడు మరియు వారికి పరాభవమునకు లోను చేస్తాడు.
(13) ఓ విశ్వాసపరులారా కపటుల మరియు యూదుల హృదయములలో అల్లాహ్ కన్నా మీ భయం ఎక్కువ. ఈ ప్రస్తావించబడిన - మీ నుండి వారి భయము యొక్క తీవ్రత మరియు అల్లాహ్ నుండి వారి భయపడటంలో బలహీనత - వారు బుద్దిలేని,అర్ధం చేసుకోలేని జనులు కావటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే అల్లాహ్ భయము,భీతి ఎక్కువ హక్కు కలదని వారు తెలుసుకునేవారు. ఆయనే మిమ్మల్ని వారిపై ఆధిక్యతను కలిగించాడు.
(14) ఓ విశ్వాసపరులారా యుదులు సమావేశమై మీతో యుద్దం చేయరు కాని కోటలుగల పురములలో ఉండిగానీ,గోడల చాటు నుండిగాని పోరాడుతారు. వారు తమ పిరికితనం వలన మిమ్మల్ని ఎదుర్కోలేరు. వారి మధ్య ఉన్నద్వేషముల వలన వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తీవ్రమైనవి. వారి మాట ఒకటే అని,వారి పంక్తి ఒకటే అని మీరు భావిస్తారు. వాస్తవానికి వారి హృదయములు వేరు వేరుగా ఉన్నవి,వ్యతిరేకమైనవి. ఈ విభేదము మరియు ద్వేషము వారికి బుద్ది లేకపోవటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే సత్యమును గుర్తించి దాన్ని అనుసరించేవారు. అందులో విభేదించరు.
(15) తమ అవిశ్వాసములో,తమపై కురిసిన శిక్షలో ఈ యూదులందరి ఉపమానము దగ్గరి కాలములో వారి కన్నా ముందు ఉన్న మక్కా ముష్రికుల ఉపమానము లాంటిది. వారు తమ అవిశ్వాసము యొక్క చెడ్డ పరిణామము రుచిని చవిచూశారు. బదర్ దినమున వారిలో నుండి హతమార్చబడేవారు హతమార్చబడ్డారు మరియు బందీ చేయబడేవారు బందీ చేయబడ్డారు. మరియు వారి కొరకు పరలోకములో బాధాకరమైన శిక్ష కలదు.
(16) కపటుల నుండి వారి వినటంలో వారి ఉపమానముషైతాను ఉపమానములాంటిది అతడు మనిషిని అవిశ్వాసము చూపమని అలంకరించినప్పుడు అవిశ్వాసమును చూపటమును తన కొరకు అతను అలంకరించటం వలన అతడు అవిశ్వసించినప్పుడు అతడు (షైతాను) ఇలా పలుకుతాడు నిశ్చయంగా నీవు అవిశ్వాసం చూపిన దానికి నీతో నాకు సంబంధము లేదు. నిశ్చయంగ నేను సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ తో భయపడుతున్నాను.
(17) షైతాన్ వ్యవహారము పర్యవసానము మరియు అతనిని అనుసరించిన వాడి పర్యవసానము వారిద్దరు (అంటే అనుసరించబడిన షైతాను మరియు అనుసరించిన మనిషి) ప్రళయదినమున నరకాగ్నిలో ఉంటారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఈ ప్రతిఫలము ఏదైతే వారి కొరకు నిరీక్షిస్తున్నదో అది అల్లాహ్ హద్దులను అతిక్రమించి తమ స్వయం పై దుర్మార్గమునకు పాల్పడిన వారి ప్రతిఫలము.
(18) ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మరియు ప్రతి మనిషి ప్రళయదినం కొరకు ముందు చేసుకున్న సత్కర్మను గురించి యోచన చేయాలి. మరియు మీరు అల్లాహ్ కు భయపడండి. నిశ్ఛయంగా అల్లాహ్ మీరు చేసుకున్న కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(19) మరియు మీరు అల్లాహ్ ను ఆయన ఆదేశములను పాటించటమును వదిలి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండకుండా మరచిపోయిన వారిలా అవ్వకండి. అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు. అప్పుడు వారు అల్లాహ్ క్రోదము నుండి,ఆయన శిక్ష నుండి తమను రక్షించే కార్యాలు చేయలేదు. వారందరు అల్లాహ్ ను మరచిపోయారు - వారు ఆయన ఆదేశములను పాటించలేదు మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగ లేదు - వారే అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన వారు.
(20) నరక వాసులు మరియు స్వర్గ వాసులు సరిసమానులు కారు. అంతే కాదు వారు ఇహలోకములో తమ కర్మలు వేరైనట్లుగానే తమ ప్రతిఫలము విషయములో వేరుగా ఉంటారు. స్వర్గ వాసులు వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి ముక్తి పొంది సాఫల్యం చెందుతారు.
(21) ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏదైన పర్వతంపైనైనా అవతరింపజేస్తే ఓ ప్రవక్తా మీరు ఆ పర్వతమును అది దృఢముగా ఉండి కూడా అల్లాహ్ యొక్క తీవ్ర భయం వలన అణిగిపోయి బ్రద్దలైపోవటమును చూస్తారు. ఖుర్ఆన్ లో కల హితోపదేశముల హెచ్చరికలు మరియు తీవ్ర బెదిరింపుల వలన. మరియు మేము ఈ ఉపమానములను ప్రజలకు విశదపరుస్తున్నాము బహుశా వారు తమ బుద్దులను ఆచరణలో పెట్టి దాని ఆయతులలో పొందుపరచబడిన హితోపదేశములతో,గుణపాఠములతో హితోపదేశం గ్రహిస్తారని.
(22) ఆయనే అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లాహ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు.
(23) ఆయనే అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లాహ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు.
(24) ఆయనే అల్లాహ్ ప్రతీ వస్తువును సృష్టించిన సృష్టికర్త, వస్తువులకు ఉనికిని ప్రసాదించేవాడు ,తాను తలచిన విధంగా తన సృష్టిరాసులకు రూపకల్పన చేసేవాడు, ఉన్నత గుణాలను కల మంచి నామములు పరిశుద్ధుడైన ఆయన కొరకే కలవు. ఆకాశములలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ ప్రతీ లోపము నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మశాసనములలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.