(1) దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మ నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది.
(2) అతడి సంపద మరియు అతని సంతానములో నుంచి అవి అతడి నుండి శిక్షను తొలగించకపోతే మరియు అతనికి కారుణ్యమును తీసుకుని రాకపోతే దేనికి పనికి వస్తాయి ?.
(3) ప్రళయదినమున అతడు ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశిస్తాడు. మరియు దాని వేడిని అనుభవిస్తాడు.
(4) మరియు అతని భార్య అయిన ఉమ్మెజమీల్ అతనితో పాటు అందులో ప్రవేశిస్తుంది. ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన మార్గంలో ముళ్ళను పరచి బాధ కలిగించేది.
(5) ఆమె మెడలో ఖర్జూరపు నారతో పేనబడిన తాడు ఉంటుంది. దానితో ఆమె నరకాగ్నిలోకి ఈడ్చబడుతుంది.