(1) (طسٓ) తా-సీన్ .సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారూప్యంపై చర్చ జరిగినది. మీపై అవతరింపబడిన ఈ ఆయతులు ఖుర్ఆన్ యొక్క,ఎటువంటి గందరగోళం లేని ఒక స్పష్టమైన గ్రంధం యొక్క ఆయతులు. అందులో యోచన చేసేవాడు అది అల్లాహ్ వద్ద నుండి అని తెలుసుకుంటాడు.
(2) ఈ ఆయతులు సత్యం వైపు మార్గదర్శకత్వం చేసి దానివైపు దారి చూపేవి. మరియు అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసమును కనబరిచే వారికి శుభవార్తనిచ్చేవి.
(3) వారు నమాజును పరిపూర్ణ పధ్ధతిలో పాటిస్తారు. మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును తీసి వాటిని ఇవ్వవలసిన చోట ఇస్తారు. మరియు వారే పరలోకంలో ఉన్న పుణ్యమును మరియు శిక్షను నమ్ముతారు.
(4) నిశ్ఛయంగా పరలోకము పై మరియు అందులో ఉన్న పుణ్యము,శిక్షను విశ్వసించని అవిశ్వాసపరుల కొరకు మేము వారి దుష్కర్మలను మంచిగా చేసి చూపించాము. అప్పుడు వారు వాటిని చేయటం వెనుక పడి ఉన్నారు. వారు అయోమయంలో పడి సరైన మార్గమును గాని ఋజు మార్గమును గాని పొందలేరు.
(5) ప్రస్తావించబడిన వాటి ద్వారా వర్ణించబడిన వీరందరు వారే వారి కొరకు ఇహ లోకంలో హతమార్చటం,ఖైదీ చేయటం ద్వారా చెడ్డ శిక్ష ఉన్నది. మరియు వారిలో నుంచి చాలా మంది పరలోకంలో నష్టములో ఉంటారు. అక్కడ వారు స్వయంగా,వారి ఇంటి వారు ప్రళయదినాన నరకాగ్నిలో శాస్వతంగా పడవేయబడే నష్టమును చవిచూస్తారు.
(6) ఓ ప్రవక్తా నిశ్చయంగా నీవు నీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన,తన దాసుల యొక్క ప్రయోజనాల్లో నుండి ఏదీ తనకు గోప్యంగా లేని జ్ఞానవంతుడి వద్ద నుండి పొందుతావు.
(7) ఓ ప్రవక్తా మీరు మూసా అలైహిస్సలాం తన ఇంటి వారితో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : నిశ్చయంగా నేను అగ్నిని చూశాను. నేను దాని నుండి దాన్ని వెలిగించిన వాడి ఏదైన సమా చారమును మీ వద్దకు తీసుకుని వస్తాను అతను మనకు మార్గమును చూపిస్తాడు. లేదా దాని నుండి అగ్ని కొరవిని మీరు దానితో చలి నుండి వేడిని పొందుతారని ఆశిస్తూ మీ వద్దకు తీసుకుని వస్తాను.
(8) ఎప్పుడైతే ఆయన (మూసా అలైహిస్సలాం) చూసిన అగ్ని ఉన్న ప్రదేశమునకు చేరుకున్నారో అల్లాహ్ ఆయనను పిలిచి ఇలా పలికాడు : ఈ అగ్నిలో ఉన్న వాడు మరియు దాని పరిసరాల్లో ఉన్న దైవ దూతలు పరిశుద్ధులు. మరియు సర్వలోకాల ప్రభువు కొరకు గౌరవంగా, మార్గ భ్రష్టులు వర్ణిస్తున్న గుణాలు ఏవైతే ఆయనకు తగవో వాటి నుండి ఆయన పరిశుద్ధుడు.
(9) అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : ఓ మూసా నిశ్ఛయంగా నేనే ఎవరూ ఓడించని సర్వ శక్తివంతుడైన, నా సృష్టించటంలో,నా తఖ్దీర్ లో,నా ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లాహ్ ను.
(10) మరియు మీరు మీ చేతి కర్రను వేయండి. అప్పుడు మూసా అలాగే చేశారు. ఎప్పుడైతే మూసా దాన్ని పాములా చలించినట్లుగా,కదలినట్లుగా చూశారో దాని నుండి వెనుకకు తిరిగి మరలకుండా పరిగెత్తారు. అప్పుడు అల్లాహ్ ఆయనతో ఇలా పలికాడు : మీరు దానితో భయపడకండి. నిశ్ఛయంగా నా వద్ద ప్రవక్తలు ఏ పాముతో గాని వేరేవాటితో గాని భయపడరు.
(11) కాని ఎవరైన ఏదైన పాపమునకు పాల్పడి తన స్వయంపై హింసకు పాల్పడి ఆ తరువాత పశ్ఛాత్తాప్పడితే అప్పుడు నేను అతనిని మన్నించే వాడును,అతనిపై కనికరించే వాడును.
(12) మరియు మీరు మీ చేతిని మెడకు క్రింద మీ చొక్కా యొక్క తెరిచి ఉన్న ప్రదేశంలో ప్రవేశింపజేయండి. దాన్ని మీరు ప్రవేశింపజేసిన తరువాత అది బొల్లి రోగం కాకుండా మంచు వలే బయటకు వచ్చును. మీ నిజాయితీ గురించి సాక్ష్యమిచ్చే తొమ్మిది మహిమలను ఫిర్ఔన్ వద్దకు చేర్చండి. అవి చేతితో పాటు చేతి కర్ర, అనావృష్టి,ఫలాల తగ్గుదల,తూఫాను,మిడతలు,నల్లులు,కప్పలు,రక్తము. నిశ్ఛయంగా వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జనులు అయిపోయారు.
(13) ఎప్పుడైతే మేము మూసాకు మద్దతిచ్చిన స్పష్టమైన,బహిర్గతమైన మా ఈ ఆయతులు వారి వద్దకు వచ్చాయో వారు మూసా తీసుకుని వచ్చిన ఈ ఆయతులు స్పష్టమైన మంత్రజాలము అని అన్నారు.
(14) అవి అల్లాహ్ వద్ద నుండి అని వారి మనస్సులు అంగీకరించినా వారు ఈ స్పష్టమైన సూచనలను తమ దుర్మార్గము వలన,సత్యము నుండి తమ అహంకారము వలన వాటిని తిరస్కరించారు. మరియు వాటిని అంగీకరించలేదు. ఓ ప్రవక్తా మీరు భూమిలో తమ అవిశ్వాసము,తమ పాప కార్యముల వలన అల్లకల్లోలాలను సృష్టించే వారి పరిణామము ఏవిధంగా ఉంటుందో యోచన చేయండి. నిశ్ఛయంగా మేము వారిని తుదిముట్టించాము. మరియు మేము వారందరిని నాశనం చేశాము.
(15) నిశ్ఛయంగా మేము దావూదు,అతని కుమారుడు సులైమానుకు జ్ఞానమును ప్రసాదించాము. పక్షులతో మాట్లాడటం అందులో నుంచే. మరియు దావూదు,సులైమాను అల్లాహ్ అజ్జవజల్ల కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా పలికారు : ఎవరైతే మాకు విశ్వాసపరులైన తన దాసుల్లోంచి చాలా మందిపై దైవ దౌత్యము ద్వారా,జిన్నులను,షైతానులను ఆదీనంలో చేయటం ద్వారా ప్రాముఖ్యతను ప్రసాదించాడో ఆ అల్లాహ్ కొరకే స్థుతులన్నీ.
(16) మరియు సులైమాను తన తండ్రి దావూదుకు దైవ దౌత్యంలో,జ్ఞానములో, అధికారములో వారసుడయ్యాడు. మరియు ఆయన తనపై,తన తండ్రిపై గల అల్లాహ్ అనుగ్రహాలను వివరిస్తూ ఇలా పలికాడు : ఓ ప్రజలారా అల్లాహ్ మనకు పక్షుల శబ్దముల అర్ధమును నేర్పాడు. మరియు ప్రవక్తలకు,రాజులకు ప్రసాదించిన ప్రతీ వస్తువును ఆయన మాకు ప్రసాదించాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ మాకు ప్రసాదించినది ఇది స్పష్టమైన,బహిర్గతమైన అనుగ్రహము.
(17) సులైమాను కొరకు మానవుల్లోంచి,జిన్నల్లోంచి,పక్షుల్లోంచి అతని సైన్యములు సేకరించబడినవి. వారు ఒక పధ్ధతితో నడపబడేవారు.
(18) అప్పుడు వారు క్రమంగా నడిపించబడుతూనే ఉన్నారు చివరకు వారు నమల్ లోయ (సిరియాలోని ఒక ప్రాంతము) వద్దకు రావంగానే ఒక చీమ చీమలతో ఇలా పలికింది : ఓ చీమల్లారా మీరు సులైమాను,అతని సైన్యములు వారు మిమ్మల్ని చూడకుండా నాశనం చేయకుండా ఉండటానికి మీ నివాసముల్లో ప్రవేశించండి. ఒక వేళ వారు మిమ్మల్ని గుర్తిస్తే వారు ఎన్నటికీ మిమ్మల్ని కాళ్ళ క్రింద తొక్కరు.
(19) ఎప్పుడైతే సులైమాను వారి మాటలు విన్నారో వారి మాటలపై చిరునవ్వు నవ్వారు. మరియు పరిశుద్ధుడైన తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నాకు,నా తల్లిదండ్రులకు అనుగ్రహించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకునే వాడిగా నాకు భాగ్యమును కలిగించు,దివ్య జ్ఞానమును కలిగించు. మరియు నీవు సంతుష్ట చెందే సత్కార్యమును నేను చేసే విధంగా నాకు అనుగ్రహించు. మరియు నీవు నన్ను నీ కారుణ్యము ద్వారా నీ పుణ్య దాసులందరిలో చేర్చు.
(20) సులైమాను పక్షులను పరిశీలిస్తే ఆయనకు హుద్ హుద్ పక్షి (వడ్రంగి పిట్ట) కనబడలేదు. అప్పుడు ఆయన నాకేమయ్యింది నేను హుద్ హుద్ పక్షిని చూడటం లేదే ?. ఏమీ ఏదైన ఆటంకము దాన్ని చూడటం నుండి నన్ను ఆపినదా లేదా అది అదృశ్యమయ్యే వారిలోంచి అయిపోయినదా ? అని అన్నారు.
(21) ఎప్పుడైతే ఆయనకు దాని అదృశ్యమవటం బహిర్గతం అయినదో ఆయన ఇలా పలికారు : దాని అదృశ్యమవటంపై దానికి శిక్షగా నేను తప్పకుండా దాన్ని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది అదృశ్యమైన విషయంలో తన కారణమును స్పష్టపరిచే స్పష్టమైన ఆధారమును నా వద్దకు తీసుకుని రావాలి.
(22) అప్పుడు హుద్ హుద్ తన అదృశ్యమవటంలో చాలా సేపు ఉండ లేదు. ఎప్పుడైతే అది వచ్చినదో సులైమాన్ అలైహిస్సలాం తో ఇలా పలికింది : మీకు తెలియని ఒక విషయం నాకు తెలిసినది. మరియు నేను సబా వాసుల వద్ద నుండి మీ వద్దకు ఎటువంటి సందేహం లేని నిజమైన ఒక వార్తను తీసుకుని వచ్చాను.
(23) నిశ్ఛయంగా వారిపై పరిపాలన చేస్తుండగా నేను ఒక స్త్రీను చూశాను. మరియు ఆ స్త్రీ బలము,అధికారము యొక్క కారకముల్లోంచి ప్రతీది ఇవ్వబడినది. మరియు ఆమెకు ఒక పెద్ద సింహాసనం కలదు. అక్కడ నుంచి ఆమె తన జాతి వారి యొక్క వ్యవహారాలను నడిపిస్తుంది.
(24) నేను ఆ స్త్రీని,ఆమె జాతివారిని మహోన్నతుడైన, పరిశుద్ధుడైన అల్లాహ్ ను వదిలి సూర్యుడిని సాష్టాంగపడుతుండగా చూశాను. మరియు షైతాను వారి కొరకు వారు దేనిపైనైతే ఉన్నారో షిర్కు కార్యాలను,పాప కార్యాలను మంచిగా చేసి చూపించాడు. వారిని సత్య మార్గము నుండి మరలింపజేశాడు. అయితే వారు దాని వైపునకు మార్గం పొందలేరు.
(25) షైతాను వారి కొరకు షిర్కు కార్యాలను,పాప కార్యాలను వారు ఆకాశములో ఆయన దాచిన వర్షము,భూమిలోని మొక్కలను వెలికి తీసేవాడైన ఒక్కడైన అల్లాహ్ కు సాష్టాంగ పడకుండా చేయటానికి మంచిగా చేసి చూపించాడు. మరియు ఆయన మీరు గోప్యంగా ఉంచే కర్మలను మరియు మీరు బహిర్గతం చేసే వాటిని తెలుసుకుంటాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(26) అల్లాహ్ ఆయన కాకుండా వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఆయనే మహోన్నతమైన సింహాసనమునకు అధిపతి.
(27) సులైమాను అలైహిస్సలాం హుద్ హుద్ తో ఇలా పలికారు : నీవు వాదిస్తున్న విషయంలో నిజం పలుకుతున్నావో లేదా నీవు అబద్దాలు పలికే వారిలోంచి వాడవో మేము వేచి చూస్తాము.
(28) అప్పుడు సులైమాను అలైహిస్సలాం ఒక ఉత్తరాన్ని రాసి దాన్ని హుద్ హుద్ కు అప్పజెప్పి ఇలా ఆదేశించారు : నీవు నా ఈ ఉత్తరాన్ని తీసుకునిపోయి సబా వాసుల వద్ద పడవేసి వారికి దాన్ని అప్పజెప్పు. మరియు నీవు వారి నుండి ఒక వైపునకు దాని గురించి వారు ఏమి అనుకుంటున్నారో వింటూ ఉన్నట్లుగా జరుగు.
(29) రాణి ఉత్తరమును స్వీకరించింది. మరియు ఆమె ఇలా పలికింది : ఓ గౌరవనీయులైన వారా నిశ్చయంగా నా వద్దకు ఒక గౌరవప్రధమై, మహోన్నతమైన ఉత్తరం పంపించబడింది.
(30) సులైమాను వద్ద నుండి పంపించబడిన ఈ ఉత్తరం యొక్క అంశము బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంతో ఆరంభం చేమబడినది.
(31) మీరు అహంకారమును చూపకండి. మరియు నేను మీకు అల్లాహ్ ఏకత్వము వైపునకు ,మీరు ఉన్న షిర్కు ఆయనతో పాటు మీరు సూర్యుడిని ఆరాధించినప్పుడు చేసిన దాన్ని విడనాడటం వైపునకు దాన్ని అంగీకరిస్తూ ,విధేయత చూపుతూ నా వద్దకు రండి.
(32) రాణి ఇలా పలికినది : ఓ నాయకులారా,గొప్పవారా నా విషయంలో సరైన పధ్దతిని నాకు మీరు స్పష్టపరచండి. నేను ఏదైన విషయంలో మీరు నా వద్ద హాజరు అయ్యి అందులో మీ అభిప్రాయమును వ్యక్తపరచేంతవరకు తీర్పునివ్వను.
(33) ఆమె జాతి నాయకులు ఆమెతో ఇలా పలికారు : మేము అధిక బలం కలవారము. మరియు యుద్దంలో పరాక్రమ వంతులం. మరియు అభిప్రాయము నీవు చెప్పినదే అయితే నీవు చూడు నీవు మాకు ఏది ఆదేశించదలచావో అప్పుడు మేము దాన్ని పూర్తి చేయటానికి సామర్ధ్యం కలవారము.
(34) రాణి ఇలా పలికింది : నిశ్చయంగా రాజులు గ్రామాల్లోంచి ఏదైన గ్రామంలో ప్రవేశిస్తే అందులో హత్యాకాండను,గుంజుకోవటమును,దోచుకోవటమును నెలకొల్పి దాన్ని పాడు చేస్తారు. అక్కడి నాయకులను,గొప్పవారిని వారు మర్యాద,బలము కలవారై ఉండినా కూడా అవమానపాలు చేస్తారు. మరియు రాజులు ఏ గ్రామ వాసులను జయించినప్పుడు హృదయముల్లో భయాందోళనలను నాటటానికి ఎల్లప్పుడు ఇదేవిధంగా చేస్తారు.
(35) మరియు నిశ్ఛయంగా నేను సందేశం పంపించిన వ్యక్తి,అతని జాతి వారి వద్దకు ఒక కానుకను పంపిస్తాను. ఆతరువాత ఈ కానుకను పంపిన తరువాత దూతలు ఏమి తెస్తారో వేచి చూస్తాను.
(36) ఎప్పుడైతే ఆమె దూత,అతనితో పాటు అతని సహాయకులు కానుకను తీసుకుని సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వచ్చినప్పుడు సులైమాన్ అలైహిస్సలాం వారు కానుకను పంపటం నుండి ఇలా పలుకుతూ నిరాకరించారు : ఏమీ మీ నుండి నన్ను మరల్చటానికి మీరు నాకు ధనం ద్వారా సహాయం చేస్తారా ?. నాకు అల్లాహ్ ప్రసాదించినటువంటి దైవ దౌత్యం,రాజరికము,ధనము మీకు ప్రసాదించిన వాటికంటే మేలైనది. అంతే కాక మీరు మీకు కానుకగా ఇవ్వబడిన ప్రాపంచిక శిధిలాల నుండి సంతోషపడండి.
(37) సులైమాను అలైహిస్సలాం ఆమె దూతతో ఇలా పలికారు : నీవు తీసుకుని వచ్చిన కానుకను తీసుకుని వారి వైపునకు మరలి వెళ్ళిపో. మేము తప్పకుండా ఆమె వద్దకు,ఆమె జాతి వారి వద్దకు సైన్యాలను తీసుకుని వస్తాము వారిని ఎదుర్కొనే శక్తి వారికి ఉండదు. మరియు ఒక వేళ వారు విధేయులై నా వద్దకు రాకపోతే మేము వారిని సబా ప్రాంతము నుండి వారు అందులో గౌరవం కలవారై ఉండిన తరువాత కూడా వారిని అవమానమునకు,పరాభవమునకు లోనైన స్థితిలో వెళ్ళగొడతాము.
(38) సులైమాను అలైహిస్సలాం తన రాజ్యపు సహాయకులను ఉద్దేశించి ఇలా పలికారు : ఓ నాయకుల్లారా వారు నావద్దకు విధేయులై రాక ముందే ఆమె రాజ్య సింహాసనమును మీలో నుండి ఎవరు నా వద్దకు తీసుకుని వస్తారు ?.
(39) జిన్నుల్లోంచి తలబిరుసైన ఒకడు ఇలా పలుకుతూ ఆయనకు సమాధానమిచ్చాడు : మీరు ఉన్న మీ కూర్చున్న చోటు నుండి మీరు లేవక ముందే ఆమె సింహాసనమును నేను మీ వద్దకు తీసుకుని వస్తాను. మరియు నేను దాన్ని ఎత్తుకోవటంలో బలవంతుడిని,దానిలో ఉన్న వాటి విషయాల్లో నీతిమంతుడిని. అందులో నుండి నేను ఏమీ తగ్గించను.
(40) సులైమాన్ వద్ద ఉన్న ఒక పుణ్యాత్ముడైన జ్ఞాని పలికాడు,అతని వద్ద గ్రంధ జ్ఞానము కలదు,అతని ఆదీనములో అల్లాహ్ యొక్క గొప్ప నామము ఉన్నది దాని ద్వారా అతడు పిలవబడితే అతను సమాధానమిస్తాడు : మీరు కను రెప్ప వేయక ముందే ఆమె సింహాసమును మీ వద్దకు నేను తీసుకుని వస్తాను. అల్లాహ్ తో నేను దుఆ చేస్తే ఆయన దాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు అతడు దుఆ చేస్తే అల్లాహ్ అతని దుఆను స్వీకరించాడు. సులైమాన్ అలైహిస్సలాం ఎప్పుడైతే ఆమె సింహాసనమును తన వద్ద ఉండటంను చూశారో ఇలా పలికారు : ఇది పరిశుద్ధుడైన నా ప్రభువు అనుగ్రహము నేను ఆయన అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుతానా లేదా కృతఘ్నుడవుతానా ? నన్ను ఆయన పరీక్షించటానికి. మరియు ఎవరైతే అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడో అతని కృతజ్ఞత లాభము అతని వైపు మరలుతుంది. అల్లాహ్ స్వయం సమృద్ధుడు దాసుల కృతజ్ఞత ఆయనకు అధికం చేయదు. మరియు ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తాడో అతడే ఆయనకు వాటిపై కృతజ్ఞతలు తెలుపుకోడు ఎందుకంటే నా ప్రభువు అతని కృతజ్ఞల అవసరం లేని వాడు,ఉదారమైన వాడు. వాటిని (అనుగ్రహాలను) తిరస్కరించేవారికి ఆయన అనుగ్రహించటం ఆయన ఉదారత్వం లోనిదే.
(41) సులైమాన్ అలైహిస్సలాం ఆదేశించారు : మీరు రాణి సంహాసనమును దాని రూపు రేఖలను ఏవైతే ఆమె వద్ద అది ఉన్నప్పుడు ఉన్నవో మార్చివేయండి. మేము చూద్దాం ఆమె అది తన సింహాసనం అని గుర్తించటం వైపునకు మార్గం పొందుతుందా లేదా తమ వస్తువులను గుర్తించటం వైపు మార్గం పొందని వారిలోంచి అయిపోతుందా ?.
(42) ఎప్పుడైతే సబా రాణి సులైమాన్ అలైహిస్సలాం వద్దకు వచ్చినదో ఆమెను పరీక్షించటానికి ఆమెతో ఇలా పలకబడింది : ఏమీ ఇది నీ సింహాసనంలా ఉన్నదా ?. అది దాని మాదిరిగా ఉన్నదని ఆమె ప్రశ్న ఎలా ఉన్నదో జవాబు అలాగే ఇచ్చినది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : అల్లాహ్ మాకు ఈమె కన్న ముందు తన సామర్ధ్యంతో ఈ విషయాల్లాంటి వాటి పట్ల జ్ఞానమును ప్రసాదించాడు. మరియు మేము అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడి ఆయనకు విధేయులమై ఉన్నాము.
(43) ఆమె తన జాతి వారిని అనుసరించి, వారిని అనుకరించి అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధించినదో అవి ఆమెను అల్లాహ్ ఏకత్వము నుండి మరల్చినవి. నిశ్ఛయంగా ఆమె అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే ప్రజల్లోంచి అయిపోయినది. ఆమె కూడా వారిలా అవిశ్వాసపరురాలైపోయింది.
(44) ఆమెతో ఇలా అనబడింది : నీవు రాజభవనంలోకి ప్రవేశించు. అది ఉపరితలం రూపంలా ఉన్నది. ఆమె దాన్ని చూసినప్పుడు దాన్ని నీటిగా భావించి అందులో దిగటానికి తన వస్త్రములను పిక్కలపై నుండి తొలగించుకుంది. అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఆమెతో ఇది గాజుతో మృదువుగా చేయబడిన భవనం అని అన్నారు. మరియు ఆమెను ఇస్లాం వైపునకు పిలిచారు.అప్పుడు ఆమె ఆయన దేని వైపునకు పిలిచారో దాన్ని ఇలా పలుకుతూ స్వీకరించింది : ఓ నా ప్రభువా నేను నీతోపాటు ఇతరులను ఆరాధించి నా పై హింసకు పాల్పడ్డాను. మరియు నేను సులైమానుతోపాటు సృష్టితాలన్నింటి ప్రభువు అల్లాహ్ కు విధేయులిని అవుతాను.
(45) మరియు నిశ్ఛయంగా మేము సమూద్ వద్దకు బంధుత్వములో వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాం ను మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి అని సందేశముతో పంపాము. వారికి ఆయన పిలుపు తరువాత రెండు వర్గాలుగా అయిపోయారు : ఒక వర్గము విశ్వాసపరులది ఇంకొకటి అవిశ్వాసపరులది వారిలో ఎవరు సత్యంపై ఉన్నారో అని పరస్పరం తగాదా పడ్డారు.
(46) సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు ఎందుకు కారుణ్యము కన్న ముందు శిక్షను తొందరపెడుతున్నారు ?. ఎందుకని మీరు మీ పాపముల కొరకు అల్లాహ్ తో మన్నింపును ఆయన మీపై దయ చూపుతాడని ఆశిస్తూ వేడుకోరు.
(47) అతనితో అతని జాతివారు సత్యము నుండి మొండితనమును చూపిస్తూ ఇలా పలికారు : మేము నీతో,నీతోపాటు ఉన్న విశ్వాసపరులతో అపశకునమును పొందాము. సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీకు ఇష్టం లేనివి మీకు కలగటం వలన మీరు అపశకునం గురించి దూషిస్తున్నారు. దాని జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది అందులో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. అంతేకాదు మీకు కలిగిన మేలు ద్వారా,మీకు సంభవించిన చెడు ద్వారా మీరు పరీక్షంపబడే జనులు మీరు.
(48) మరియు హిజ్ర్ నగరంలో తొమ్మిది మంది అవిశ్వాసం,పాపకార్యముల ద్వారా భూమిలో అరాచకాలను సృష్టించేవారు. మరియు వారు అందులో విశ్వాసము ద్వారా,సత్కర్మ ద్వారా సంస్కరణ చేసేవారు కాదు.
(49) వారిలోని కొందరు కొందరితో ఇలా పలికారు : మీలో నుండి ప్రతి ఒక్కరు మేము ఒక రాత్రి అతను ఇంటిలో ఉన్నప్పుడు అతని వద్దకు వచ్చి వారందరిని హతమార్చేస్తాము అని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి. ఆ తరువాత అతని సంరక్షకుడితో మేము ఇలా చెబుతాము : సాలిహ్,అతని ఇంటివారి హత్య సమయంలో మేము లేము. మరియు నిశ్ఛయంగా మేము చెబుతున్న దానిలో సత్యవంతులము.
(50) మరియు వారు సాలిహ్,అతన్ని అనుసరించిన విశ్వాసపరులను తుదిముట్టించటానికి రహస్యంగా కుట్రలు పన్నారు. మరియు మేము కూడా ఆయనకు సహాయం కొరకు,వారి కుట్ర నుండి ఆయనను రక్షించటం కొరకు అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరులను తుదిముట్టించటానికి వ్యూహం రచించాము. అది వారికి తెలియదు.
(51) ఓ ప్రవక్తా మీరు వారి కుట్రల,కుతంత్రాల పరిణామం ఏమయిందో దీర్ఘంగా ఆలోచించండి ?. నిశ్చయంగా మేము వారిని మా వద్ద నుండి శిక్ష ద్వారా కూకటి వేళ్ళతో పెకిలించాము అప్పుడు వారు వారి చివరి వరకు నాశనం అయిపోయారు.
(52) ఇవి వారి ఇండ్లు వాటి గోడలు వాటి పై కప్పుల సమేతంగా శిధిలమైపోయినవి. మరియు అవి వాటి యజమానుల నుండి వారి దుర్మార్గము వలన ఖాళీగా ఉండిపోయినవి. నిశ్ఛయంగా వారి దుర్మార్గము వలన వారికి సంభవించిన శిక్షలో విశ్వసించే జనులకు గుణపాఠం ఉన్నది. వారే సూచనలతో గుణపాఠం నేర్చుకుంటారు.
(53) మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి వారిలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచిన వారిని మేము కాపాడాము. మరియు వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన భీతిని కలిగి ఉంటారు.
(54) ఓ ప్రవక్తా మీరు లూత్ అలైహిస్సలాం తన జాతి వారిని మందలిస్తూ,వారిని నిరాకరిస్తూ ఇలా పలికిన వైనమును గుర్తు చేసుకోండి : ఏమీ మీరు మీ సభల్లో బహిరంగంగా ఒకరిని ఒకరు చూస్తుండంగా అసహ్యకరమైన కార్యము స్వలింగ సంపర్కముకు పాల్పడుతున్నారా ?.
(55) మీరు ఆడవారిని వదిలి మగవారి వద్దకు కామవాంచతో వస్తున్నారేమిటి. మీరు పవిత్రతను,సంతానమును కోరుకోవటం లేదు. కేవలం జంతువుల్లా కామవాంచను తీర్చుకోవటమే. అంతే కాదు మీపై అనివార్యమైన విశ్వాసమును,పరిశుద్ధతను,పాపకార్యముల నుండి దూరమును తెలియని మూర్ఖ జనం మీరు.
(56) అతని జాతి వారి వద్ద జవాబుగా వారి ఈ మాటలు తప్ప ఇంకేమి లేదు : మీరు లూత్ పరివారమును మీ ఊరి నుండి వెళ్ళగొట్టండి. నిశ్ఛయంగా వారు మాలిన్యాల నుండి,చెడుల నుండి పవిత్రతను కొనియాడుకునే జనం. వారు ఇదంత వారు పాల్పడే అశ్లీల కార్యాల్లో వారికి పాలుపంచుకోని వారైన లూత్ పరివారంపై హేళనగా మాట్లాడేవారు. అంతే కాదు వారు (లూత్ పరివారము) దాన్ని పాల్పడటమును వారిపై (లూత్ జాతి) కూడా ఇష్టపడేవారు కాదు.
(57) అప్పుడు మేము అతనిని రక్షించాము,అతని పరివారమును రక్షించాము. కాని అతని భార్య ఆమె నాశనమయ్యే వారిలోంచి అయిపోవటానికి శిక్షలో ఉండిపోయే వారిలో ఆమె అయిపోవటమును మేము ఆమెపై నిర్ణయించాము.
(58) మరియు మేము వారిపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించాము. అప్పుడు అది శిక్ష ద్వారా భయపెట్టబడిన వారి కొరకు చెడ్డ వర్షంగా నాశనం చేసేదిగా అయిపోయింది. మరియు వారు స్పందించలేదు.
(59) ఓ ప్రవక్తా వారితో అనండి : ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయన అనుగ్రహాల వలన,లూత్ అలైహిస్సలాం జాతి శిక్షించబడిన ఆయన శిక్ష నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులకు ఆయన తరపు నుండి రక్షణ కల్పించటం వలన. ప్రతీ వస్తువు యొక్క అధికారం తన చేతిలో ఉన్న వాస్తవ ఆరాధ్య దైవమైన అల్లాహ్ మేలా లేదా ఎటవంటి లాభం కలిగించటం గాని నష్టం కలిగించే అధికారం లేని వారిని ఆరాధ్య దైవాలుగా ముష్రికులు ఆరాధించేవి మేలా ?.
(60) ఓ ప్రజలారా పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించిన వాడెవడు,మీ కొరకు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించినదెవరు ?. అప్పుడు మేము దాని ద్వారా మీ కొరకు మనోహరమైన,అందమైన తోటలను మొలకెత్తించాము. ఆ తోటల వృక్షములను మొలకెత్తించటం మీకు సాధ్యం కాదు ఎందుకంటే దాని శక్తి మీకు లేదు. అల్లాహ్ యే వాటిని మొలకెత్తించాడు. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఎవరైన ఆరాధ్య దైవం ఉన్నాడా ?. లేడు కాని వారు సత్యము నుండి మరలిపోయే జనులు. వారు సృష్టి కర్తను సృష్టితో దుర్మార్గంగా సమానం చేస్తున్నారు.
(61) భూమిని స్థిరంగా,దానిపై ఉన్న వారితో అది కదలకుండా నిలకడగా ఉన్నట్లు చేసినదెవరు ?. మరియు దాని లోపల నుండి కాలువలను ప్రవహించే విధంగా చేసినదెవరు ?. మరియు దాని కొరకు స్థిరమైన పర్వతాలను చేసినదెవరు ?. మరియు ఉప్పు నీటి,తీపి నీటి మధ్య ఉప్పు నీరు తీపి నీటితో కలిసిపోయి పాడై త్రాగటానికి అనుకూలం కాని విధంగా కాకుండా ఉండటానికి అడ్డు తెరను ఏర్పరచినదెవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఎవరైన ఆరాధ్య దైవమున్నాడా ?. లేడు కాని వారిలో చాలా మందికి తెలియదు. ఒక వేళ వారికి తెలిస్తే వారు అల్లాహ్ తో పాటు ఆయన సృష్టితాల్లో నుంచి ఎవరినీ సాటి కల్పించే వారు కాదు.
(62) ఎవరిపైననైన అతని వ్యవహారము ఇబ్బందిగా మారి,కష్టంగా అయినప్పుడు ఆయనను అతడు వేడుకుంటే అతని వేడుకను స్వీకరించి మానవునిపై వాటిల్లిన రోగము,పేదరికము,ఇతర వాటిని తొలగించేవాడెవడు ?. మరియు మీలోని కొందరు కొందరికి వంశపారంపర్యముగా ప్రాతినిధ్యం వహించటానికి మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినదెవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే వేరే ఆరాధ్య దైవం ఉన్నాడా ?. మీరు హితోపదేశం స్వీకరించి,గుణపాఠం నేర్చుకునేది చాలా తక్కువ.
(63) భూమి యొక్క అంధకారముల్లో,సముద్రం యొక్క అందకారముల్లో ఆయన పెట్టిన సూచనలు,నక్షత్రాల ద్వారా మీకు మార్గమును చూపేదెవరు ?. తన దాసులపై ఆయన కరుణించిన వర్షము కురవక ముందు గాలులను శుభవార్తనిచ్చేవానిగ పంపించేదెవరు ?. ఏమి అల్లాహ్ తో పాటు దీన్ని చేసే ఏ ఆరాధ్య దైవమైన ఉన్నాడా ?!. అల్లాహ్ అతీతుడు. వారు ఆయనతో పాటు ఆయన సృష్టితాలకు సాటి కల్పిస్తున్న వాటి నుండి పరిశుద్దుడు.
(64) మాతృ గర్భాల్లో ఒక దశ తరువా త ఇంకో దశ లో సృష్టిని ఆరంభించి ఆతరువాత దానికి మరణమును కలిగించిన తరువాత జీవింపచేసేదెవడు ?. మరియు ఆకాశము నుండి తన వైపు నుండి కురవబడిన వర్షము ద్వారా మీకు జీవనోపాధిని కల్పించేదెవరు ?. మరియు భూమి నుండి అందులో మొక్కలను మొలకెత్తించటం ద్వారా మీకు జీవనోపాధిని కల్పిస్తున్నది ఎవరు ?. ఏమీ అల్లాహ్ తో పాటు దీన్ని చేసే మరోక ఆరాధ్య దైవం ఉన్నాడా ?. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు ఉన్న షిర్కు గురించి మీ వాదనలను తీసుకుని రండి. ఒక వేళ మీరు సత్యముపై ఉన్నారని మీరు వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులు అయితే.
(65) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : ఆకాశముల్లో ఉన్న దైవ దూతలకు గానీ భూమిపై ఉన్న మానవులకు గానీ అగోచర విషయాల జ్ఞానము లేదు. కాని అల్లాహ్ ఒక్కడికే దాని జ్ఞానము ఉన్నది. మరియు భూమ్యాకాశముల్లో ఉన్న వారందరికి ప్రతిఫలం కొరకు ఎప్పుడు లేపబడతారో అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు.
(66) లేదా వారి జ్ఞానము పరలోకమును అనుసరించి దాన్ని గట్టిగా నమ్ముతున్నారా ?. లేదు , కాని వారు పరలోకము నుండి సందేహములో,గందరగోళములో పడి ఉన్నారు. అంతే కాదు వారి అంతర్దృష్టులు దాని గురించి కళ్ళు మూసుకున్నాయి.
(67) అవిశ్వాసపరులు తిరస్కరిస్తూ (విముఖత చూపుతూ) ఇలా పలికారు : మేము మరణించి మట్టిగా అయిపోయినప్పుడు జీవింపజేసి మరల లేపబడటం సాధ్యమా ?.
(68) నిశ్చయంగా మేమందరం మరల లేపబడుతామని మాకూ వాగ్దానం చేయబడింది మరియు మా పూర్వ తాతముత్తాతలకూ వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం నెరవేరటమును మేము చూడలేదు. మేమందరం వాగ్దానం చేయబడిన ఈ వాగ్దానం పూర్వికులు తమ పుస్తకాల్లో రాసుకున్న అబద్దాలు మాత్రమే.
(69) ఓ ప్రవక్తా మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి : మీరు భూమిపై ఏ ప్రాంతములోనైనా సంచరించి మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన అపారాదుల ముగింపు ఏ విధంగా జరిగినదో యోచన చేయండి. నిశ్చయంగా మేము వారిని దాన్ని తిరస్కరించటం వలన నాశనం చేశాము.
(70) మరియు నీ పిలుపు నుండి ముష్రికులు విముఖత చూపటం వలన నీవు బాధపడకు. మరియు వారి కుట్రల వలన నీకు మనస్తాపము కలగకూడదు. అల్లాహ్ వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేసేవాడు.
(71) మరియు మీ జాతి వారిలో నుంచి మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు ఇలా పలికే వారు : నీవు మరియు విశ్వాసపరులు మాకు వాగ్దానం చేసిన శిక్ష ఎప్పుడు నెరవేరనుంది. ఒక వేళ మీరు చేస్తున్న ఈ వాదనలో మీరు సత్యవంతులే అయితే .
(72) ఓ ప్రవక్తా వారితో అనండి : బహుశా మీరు తొందరపెడుతున్న శిక్షలో కొంత భాగము మీకు సమీపంలోనే ఉండవచ్చు.
(73) ఓ ప్రవక్త నిశ్చయంగా మీ ప్రభువు ప్రజలపై వారు అవిశ్వాసం,పాపకార్యాల్లో ఉన్నా కూడా ఎప్పుడైతే వారిని శీఘ్రంగా శిక్షంచటమును వదిలివేశాడో అనుగ్రహము కల వాడు. కానీ చాలా మంది ప్రజలు అల్లాహ్ కి ఆయన వారికి కలిగంచిన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకోరు.
(74) మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తున్నాయో,ఏమి బహిర్గతం చేస్తున్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(75) ఆకాశములో ప్రజల నుండి గోప్యంగా ఉన్నది మరియు భూమిలో వారి నుండి గోప్యంగా ఉన్నది స్పష్టమైన గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో పొందుపరచకుండా లేదు.
(76) నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఇస్రాయీలు సంతతి వారికి వారు విభేదించుకున్న చాలా విషయాల గురించి విడమరచి తెలుపుతుంది. మరియు వారి విచలనాలను వెల్లడిస్తుంది.
(77) నిశ్చయంగా ఇది ఇందులో వచ్చిన వాటిని విశ్వసించి ఆచరించే వారి కొరకు మార్గదర్శిని,కారుణ్యము.
(78) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ప్రళయదినాన ప్రజల మధ్య వారిలో నుండి విశ్వాసపరుడిని,వారిలో నుండి అవిశ్వాసపరుడిని తన న్యాయపూరిత నిర్ణయం ద్వారా తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన విశ్వాసపరునిపై కరుణిస్తాడు మరియు అవిస్వాసపరుడిని శిక్షిస్తాడు. మరియు ఆయన తన శతృవులపై ప్రతీకారము తీసుకునే సర్వ శక్తిమంతుడు. మరియు ఆయన పై ఎవరూ ఆధిక్యత చూపలేరు. అసత్యపరుడి ద్వారా సత్యపరుడు ఆయనను అయోమయంలో పడవేయలేని జ్ఞానవంతుడు.
(79) కావున నీవు అల్లాహ్ పై నమ్మకమును కలిగిఉండు. మరియు నీ వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే ఆధారపడి ఉండు. నిశ్చయంగా నీవు స్పష్టమైన సత్యంపై ఉన్నావు.
(80) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు అల్లాహ్ పై అవిశ్వాసం వలన మరణించిన హృదయములు కలిగిన మృతులకు వినిపించలేరు. మరియు మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో దాని నుండి వినికిడిని కోల్పోయిన వారు మీ నుండి విముఖత చూపుతూ వెనుకకు మరలిపోయేటప్పుడు మీరు వినిపించలేరు.
(81) మరియు మీరు సత్యము నుండి ఎవరి చూపులైతే గుడ్డివైపోయినవో వారికి మార్గం చూప లేరు. మీరు వారిపై బాధపడకండి మరియు మీరు స్వయంగా అలసిపోకండి. మా ఆయతులను విశ్వసించే వారికి మాత్రమే మీరు మీ పిలుపును వినిపించగలరు. మరియు వారు అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటారు.
(82) మరియు వారిపై శిక్ష అనివార్యమై వారి అవిశ్వాసము,వారి పాపములపై వారి మొండితనం వలన వారిపై జరిగి తీరి,ప్రజల్లోంచి చెడ్డవారు ఉండిపోయినప్పుడు మేము ప్రళయం దగ్గరైనప్పుడు వారి కొరకు దాని పెద్ద సూచనల్లోంచి ఒక సూచనను వెలికి తీస్తాము. అది భూమి నుండి ఒక జంతువు అది వారు అర్ధం చేసుకునే మాటల్లో ప్రజలు మన ప్రవక్త పై అవతరింపబడిన మన ఆయతులను నమ్మేవారు కాదని మాట్లాడుతుంది.
(83) ఓ ప్రవక్తా మేము సమాజముల్లోంచి ప్రతీ సమాజములో నుంచి మా ఆయతులను తిరస్కరించే వారి పెద్దల ఒక జమాతును సమీకరించే రోజును గుర్తు చేసుకోండి. వారిలో మొదటి వారు వారి చివరి వారి వైపునకు మరలించబడుతారు. ఆతరువాత వారు లెక్క తీసుకోబడటానికి తీసుకుని రాబడతారు.
(84) వారిని తీసుకుని రావటం జరుగుతూ ఉంటుంది చివరికి వారు తమ లెక్క తీసుకునే ప్రదేశమునకు వచ్చినప్పుడు అల్లాహ్ వారిని మందలిస్తూ ఇలా పలుకుతాడు : ఏమీ మీరు నా ఏకత్వముపై సూచించే,నా ధర్మ శాసనమును కలిగన నా ఆయతులను తిరస్కరిస్తున్నారా ? మీరు జ్ఞానంతో అవి అసత్యాలని తెలుసుకోకుండా అవి అసత్యాలని తిరస్కరంచటం మీకు అనుమతిస్తుంది లేదా మీరు వాటిపట్ల వ్యవహరిస్తున్న తీరు దృవీకరించటం లేదా తిరస్కరింటం మీరు ఏమి చేస్తున్నారు.
(85) అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం,ఆయన ఆయతులను తిరస్కరించటం ద్వారా వారి దుర్మార్గం వలన వారిపై శిక్ష వచ్చిపడినది. అయితే వారు తమ నుండి దాన్ని తొలగించుకోవటానికి తమకు శక్తి లేనందువలన,వారి వాదనలు అసత్యాలవటం వలన వారు మాట్లాడలేరు.
(86) మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వారందరు చూడటం లేదా ? మేము రాత్రిని వారు అందులో నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోవటానికి చేశాము. మరియు మేము దినమును వారు అందులో చూసి తమ కార్యాల వైపు శ్రమించటానికి కాంతి వంతంగా చేశాము. నిశ్చయంగా ఈ పదే పదే వచ్చే మరణం ఆ తరువాత మరణాంతర లేపబడటంలో విశ్వసించే వారి కొరకు స్పష్టమైన సూచనలు కలవు.
(87) ఓ ప్రవక్తా మీరు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత రెండవ సారి ఊదే రోజును ఒక సారి గుర్తు చేసుకోండి. అప్పుడు ఆకాశముల్లో,భూమిలో ఉన్న వారందరిలో నుండి అల్లాహ్ భయంతో కంపించటం నుండి మినహాయించిన వారు తప్ప వారందరు భయంతో కంపించిపోతారు. ఇది (మినహాయింపు) ఆయన తరపు నుండి వారికి ఒక అనుగ్రహము. అల్లాహ్ సృష్టితాల్లో నుండి ఆ రోజు ఆయన వద్దకు విధేయులై,అణకువతో వస్తారు.
(88) మరియు ఆ రోజు నీవు పర్వతాలను ఎటువంటి చలనం లేకుండా స్థిరంగా ఉన్నాయని భావిస్తావు. వాస్తవానికి అవి మేఘములు వెళ్ళినట్లు వేగముగా వెళ్ళుతాయి. ఇది అల్లాహ్ పనితనము. ఆయనే దాన్ని కదిలింపజేస్తాడు. నిశ్ఛయంగా మీరు చేస్తున్నదాని గురించి తెలుసుకునే వాడు. మీ కార్యాల్లో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(89) ఎవరైతే ప్రళయదినాన విశ్వాసముతో పాటు సత్కార్యమును తీసుకుని వస్తాడో అతని కొరకు స్వర్గము కలదు. మరియు వారు ప్రళయ దిన భీతి నుండి తమ కొరకు కల అల్లాహ్ రక్షణ ద్వారా సురక్షితంగా ఉంటారు.
(90) మరియు ఎవరైతే అవిశ్వాసమును,పాపకార్యములను తీసుకుని వస్తారో వారి కొరకు నరకాగ్ని కలదు. అప్పుడు వారు అందులో తమ ముఖములపై బొర్లావేసి వేయబడుతారు. మరియు వారితో మందలిస్తూ,అవమానపరుస్తూ ఇలా చెప్పబడుతుంది : మీరు ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములకు తప్ప వేరే దాని ప్రతిఫలం ఇవ్వబడినదా ?.
(91) ఓ ప్రవక్తా వారితో అనండి : నాకు మాత్రం మక్కా ప్రభువు ఎవరైతే దాన్ని పవిత్ర క్షేత్రంగా చేశాడో ఆయన ఆరాధన చేయమని ఆదేశం ఇవ్వబడినది. కావున అక్కడ ఏ విధమైన రక్తం చిందించకూడదు. మరియు అందులో ఎవరిపై దౌర్జన్యం చేయకూడదు. మరియు దాని వేట జంతువును చంపకూడదు. మరియు దాని వృక్షములను నరకకూడదు. పరిశుద్ధుడైన ఆయనకే ప్రతీ వస్తువు యొక్క అధికారము కలదు. మరియు నేను అల్లాహ్ కు వేధేయుడవ్వాలని,ఆయన కొరకు విధేయతకు కట్టుబడి ఉండాలని నాకు ఆదేశించబడినది.
(92) మరియు నేను ప్రజలకు ఖుర్ఆన్ చదివి వినిపించాలని నేను ఆదేశించబడ్డాను. అయితే ఎవరైతే దాని సన్మార్గము నుండి మార్గము పొందతాడో,అందులో ఉన్న వాటిని ఆచరిస్తాడో అతని మార్గదర్శకత్వము అతని కొరకే. మరియు ఎవరైతే మార్గ భ్రష్టుడై,అందులో ఉన్న వాటి నుండి మరలిపోయి దాన్ని తిరస్కరించి,అందులో ఉన్నవాటి పై ఆచరించడో వాడితో మీరు ఇలా పలకండి : నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిక చేసే హిచ్చరికుడిని మాత్రమే. మిమ్మల్ని సన్మార్గమును చూపటం నా చేతిలో లేదు.
(93) మరియు ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : లెక్కవేయలేని అల్లాహ్ అనుగ్రహాలపై సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కే. తొందరలోనే అల్లాహ్ తన సూచనలను మీలో,ఆకాశములో,భూమిలో,జీవనోపాధిలో చూపిస్తాడు. అప్పుడు మీరు వాటిని ఏవిధంగా గుర్తిస్తారంటే అవి మిమ్మల్ని సత్యానికి లొంగిపోవటానికి మార్గనిర్దేశం చేస్తాయి. మీరు చేస్తున్న వాటి నుండి మీ ప్రభువు నిర్లక్ష్యంగా లేడు. అంతేకాదు దాన్ని ఆయన తెలుసుకునేవాడును. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన దానిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.