70 - Al-Ma'aarij ()

|

(1) ముష్రికుల్లోంచి ఒక వేడుకునే వాడు తనపై మరియు తన జాతి వారిపై శిక్షను గురించి ఒక వేళ ఈ శిక్ష వచ్చేదే అయితే రావాలని వేడుకున్నాడు. మరియు అది అతని తరపు నుండి హేళణగా. మరియు అది ప్రళయదినమున వాటిల్లుతుంది.

(2) అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఈ శిక్షను తొలగించేవాడు ఎవడూ ఉండడు.

(3) ఔన్నత్యమును,స్థానములను,శుభాలను,అనుగ్రహాలను కల అల్లాహ్ వద్ద నుండి.

(4) ఆయన వైపునకు దైవదూతలు మరియు జిబ్రయీలు ఆ స్ధానముల్లో ప్రళయదినము నాడు ఎక్కుతారు. ఆ రోజు ఎంత పెద్దదిగా ఉంటుందంటే దాని పరిమాణము యాభైవేల సంవత్సరములు ఉంటుంది.

(5) ఓ ప్రవక్త మీరు ఎటువంటి ఆందోళన మరియు ఫిర్యాదు లేని సహనమును చూపండి.

(6) నిశ్ఛయంగా వారు ఈ శిక్షను దూరంగా, వాటిల్లటం అసంభవంగా భావిస్తున్నారు.

(7) మరియు మేము దాన్ని దగ్గరగా ,ఖచ్చితంగా వాటిల్లుతుందని భావిస్తున్నాము.

(8) ఆ రోజు ఆకాశము కరిగించబడిన ఇత్తడి మరియు బంగారము, ఇతర వాటిలాగా అయిపోతుంది.

(9) మరియు పర్వతాలు తేలికతనంలో ఉన్ని వలె అయిపోతాయి.

(10) మరియు ఏ దగ్గరి బందువు ఏ దగ్గరి బందువుని అతని పరిస్థితిని గురించి అడగడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన గురించి తీరిక లేకుండా ఉంటాడు.

(11) ప్రతీ మనిషి తన దగ్గరి బందువును చూస్తాడు అతడిపై అతను గోప్యంగా ఉండడు. మరియు దానితో పాటు పరిస్థితి భయానకంగా ఉండటం వలన ఒకరినొకరు అడగరు. నరకాగ్నికి హక్కుదారైన వాడు శిక్ష కొరకు తనకు బదులుగా తమ సంతానమును ఇవ్వాలనుకుంటాడు.

(12) మరియు తన భార్యను,తన సోదరుడిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు.

(13) మరియు తన దగ్గరి బందువులైన తన వంశము వారిని ఎవరైతే కష్టాల్లో తనకు తోడుగా నిలబడుతారో వారిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు.

(14) మరియు భూమిలో ఉన్న మానవులను,జిన్నులను,ఇతరులందరిని పరిహారంగా ఇవ్వాలనుకుంటాడు. ఆ పిదప ఆ పరిహారము అతనిని నరకాగ్ని శిక్ష నుండి రక్షిస్తుందనుకుంటాడు.

(15) ఈ అపరాధి ఆశించినట్లు విషయం కాదు. నిశ్ఛయంగా అది పరలోక అగ్ని భగభగమండుతుంది మరియు ప్రజ్వలిస్తుంది.

(16) దాని వేడి తీవ్రత వలన మరియు దాని మండటం వలన తల చర్మం తీవ్రంగా వలచి విడిపోతుంది.

(17) అది సత్యము నుండి విముఖత చూపి దాని నుండి దూరమై,దానిపై విశ్వాసమును కనబరచకుండా ఆచరించని వాడిని పిలుస్తుంది

(18) మరియు అతడు సంపదను కూడబెట్టాడు. దాని నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటం నుండి పిసినారితనమున చూపాడు.

(19) నిశ్ఛయంగా మానవుడు తీవ్ర పిసినారిగా పుట్టించబడ్డాడు.

(20) అతనికి రోగము లేదా పేదరికం నుండి కీడు సంభవించినప్పుడు అతడు తక్కువ సహనం చూపేవాడై ఉంటాడు.

(21) మరియు అతనికి సంతోషమును కలిగించే కలిమి మరియు ఐశ్వర్యము కలిగినప్పుడు అతడు దాన్ని అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి ఎక్కువగా నిరోధించుకుంటాడు.

(22) కాని నమాజులను పాటించేవారు. వారు ఈ దుర లక్షణాల నుండి భద్రంగా ఉంటారు.

(23) వారే తమ నమాజులలో నిబద్ధులై ఉంటారు. వాటి నుండి నిర్లక్ష్యం చూపరు. వాటిని వారు వాటి నిర్ణీత సమయముల్లో పాటిస్తారు.

(24) మరియు వారు తమ సంపదలో విధించబడిన నిర్దిష్టమైన భాగమును (వాటాను) ఉంచుతారు.

(25) వారు దాన్ని తమను యాచించిన వారికి ఇస్తారు మరియు ఏదైన కారణం చేత ఆహారోపాధి ఆగిపోయి యాచించని వారికి ఇస్తారు.

(26) మరియు వారు ప్రళయదినమును విశ్వసిస్తారు. ఆ దినము అల్లాహ్ హక్కుదారుడైన ప్రతీ వ్యక్తికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(27) మరియు వారే తమ సత్కర్మలను ముందు పంపించుకున్నా కూడా తమ ప్రభువు యొక్క శిక్ష నుండి భయపడేవారు.

(28) నిశ్ఛయంగా వారి ప్రభువు యొక్క శిక్ష భయంకరమైనది దాని నుండి ఏ బుద్ధిమంతుడు సురక్షితంగా ఉండడు.

(29) మరియు తమ మర్మాంగాలను వాటిని కప్పి ఉంచి మరియు వాటిని అశ్లీల కార్యాల నుండి దూరంగా ఉంచి పరిరక్షిస్తారు.

(30) కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలతో. ఎందుకంటే వారితో సంభోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు.

(31) ఎవరైతే ప్రస్తావించబడిన భార్యలను,దాసినీలను వదిలి ఇతర వాటి ద్వారా ప్రయోజనం చెందాలని కోరుకుంటే వారందరు అల్లాహ్ హద్దులను అతిక్రమించినవారు.

(32) మరియు వారే తమ వద్ద అమానతుగా పెట్టబడిన సంపదలను మరియు రహస్యాలను,ఇతరవాటిని మరియు ప్రజలతో తాము చేసిన ప్రమాణాలను పరిరక్షిస్తారు. వారి అమానతులలో అవినీతికి పాల్పడరు మరియు వారి ప్రమాణాలను భంగపరచరు.

(33) మరియు వారే కోరిన విధంగా తమ సాక్ష్యములపై స్థిరంగా ఉంటారు. అందులో ఏ బంధుత్వము మరియు శతృత్వము ప్రభావం చూపదు.

(34) మరియు వారే తమ నమాజులను వాటిని వాటి సమయముల్లో ,పరిశుద్దతతో మరియు మనశ్శాంతితో పాటించి పరిరక్షిస్తారు. వారిని ఏ పరధ్యానం వాటి నుండి నిర్లక్ష్యంలో పడవేయదు.

(35) ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తాము పొందే శాశ్వత అనుగ్రహాలతో మరియు గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖ దర్శనంతో స్వర్గవనాల్లో సగౌరవంగా ఉంటారు.

(36) ఓ ప్రవక్తా మీ జాతి వారిలో నుంచి ఈ ముష్రికులందరికి మీ చుట్టూ మిమ్మల్ని తిరస్కరించటానికి త్వరపడేటట్లు ఏది లాగుతుంది ?.

(37) మీ కుడి వైపు నుండి మీఎడమవైపు నుండి గుంపులు గుంపులుగా మిమ్మల్ని చుట్టు ముడుతున్నారు.

(38) ఏమీ వారిలో నుండి ప్రతి ఒక్కడు అల్లాహ్ అతడిని అనుగ్రహములు కల స్వర్గములో ప్రవేశింపజేస్తాడని మరియు అతడు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను తాను తన అవిశ్వాసం పై ఉండి అనుభవిస్తాడని ఆశిస్తున్నాడా ?.

(39) వారు అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా మేము వారిని వారికి తెలిసిన వాటి నుండి సృష్టించాము. వాస్తవానికి మేము వారిని నీచమైన నీటితో సృష్టించాము. కావున వారు బలహీనులు. తమ స్వయం కొరకు ఎటువంటి లాభం గాని నష్టం గాని చేసుకునే అధికారం వారికి లేదు. అటువంటప్పుడు వారు ఎలా అహంకారము చూపుతారు ?.

(40) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆయన తూర్పు పడమరలకు మరియు సూర్యుడు,చంద్రుడు మరియు అన్నిరకాల నక్షత్రాలకు ప్రభువు నిశ్ఛయంగా మేము సామర్ధ్యం కలవారమని ప్రమాణం చేస్తున్నాడు.

(41) వారి స్థానంలో అల్లాహ్ పై విధేయత చూపే వారిని తీసుకుని రావటంపై. మరియు మేము వారిని నాశనం చేస్తాము. మేము దాని నుండి అశక్తులము కాము. వారిని నాశనం చేసి వారి స్థానంలో వేరే వారిని తీసుకుని రావాలని మేము కోరుకున్నప్పుడు మేము ఓడిపోము.

(42) ఓ ప్రవక్తా మీరు వారిని వారు ఉన్న అసత్యములో,అపమార్గములో మునిగి ఉండగా మరియు ఖుర్ఆన్ లో వారికి వాగ్దానం చేయబడిన ప్రళయ దినమును వారు పొందే వరకు తమ ఇహలోక జీవితంలో ఆటల్లో మునిగి ఉండగా వదిలివేయండి.

(43) ఆ రోజు వారు సమాదుల నుండి వేగముగా వెలికి వస్తారు. వారు ఒక జెండా వైపునకు ఉరకలు వేస్తూ పరుగెత్తుతున్నట్లు.

(44) వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వారిపై అవమానము క్రమ్ముకుని ఉంటుంది. ఇదే ఆ దినము దేని గురించైతే వారికి ఇహలోకంలో వాగ్దానం చేయబడినది. వారు దాని గురించి పట్టించుకునేవారు కాదు.