(1) అల్లాహ్ పేరుతో ఆయన సహాయాన్ని అర్ధిస్తూ, ఆయన శుభనామంతో శుభాన్ని ఆశిస్తూ ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. మరియు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ లో అల్లాహ్ యొక్క ఉత్తమమైన మూడు పేర్లు ప్రస్తావించబడ్డాయి అవి : 1) అల్లాహ్ : అనగా నిజ ఆరాధ్యదైవం. ఇది ఆయన పేర్లలో ఆయనకు మాత్రమే ప్రత్యేకించబడినది. 2) అర్రహ్మాన్ : అనగా విశాలమైన కారుణ్య ప్రధాత. అంటే ఆయన అస్తిత్వములో అతను అనంత కరుణామయుడు. 3) అర్రహీం: అనగా ఇతరులకు చేరే కారుణ్యము కలవాడు. మరియు ఆయన తన కారుణ్యము ద్వారా తన సృష్టితాల్లోంచి తాను తలచుకున్న వారిపై కరుణిస్తాడు.మరియు విశ్వాసపరులైన ఆయన దాసులు కూడా వారిలో ఉంటారు.
(2) అన్నిరకాల స్తోత్రాలు, ఆయన మహోన్నతమైన గుణాల రిత్యా, ఆయన ఘనత, మరియు పరిపూర్ణత రీత్యా కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి. ఎందుకంటె ఆయన ప్రతీ వస్తువుకు ప్రభువు,దాన్ని సృష్టించినవాడు,దాని కార్య నిర్వాహకుడు . <<అల్ఆలమూన>> ఆలమున్ యొక్క బహువచనం. మహోన్నతుడైన అల్లాహ్ ను వదిలి ప్రతీది <<అల్ఆలమూన>> లో వస్తుంది.
(3) పైన పేర్కొన్న వాక్యములో మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులను తెలిపిన తరువాత ఆయన ప్రశంసత ఉన్నది.
(4) ప్రళయదినం నాడు ఏ ఒక్కరికీ ఇతరులకు సహాయం చేసే అధికారం ఉండదు. ఆనాడు ఆయన ఒక్కడే తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడని ఆయన ఘనతను తెలియచేయబడుతున్నది. ఇందులో యౌముద్దీన్: అంటే తీర్పుదినం మరియు ప్రతిఫల దినం అని అర్ధం.
(5) మేము అన్ని రకాల ఆరాధనలను, విధేయతను నీకు మాత్రమే ప్రత్యేకించుకుంటాము. మరియు నీకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించము. మా వ్యవహారలన్నింటిలో సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తాము. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నీవు తప్ప మాకు సంరక్షకుడు మరొకడు లేడు.
(6) మాకు రుజుమార్గాన్ని చూపించు. మరియు దానిపైనే మమ్మల్ని నడిపించు. మరియు దానిపై మాకు స్థిరత్వాన్ని ప్రసాధించు. మరియు మా సన్మార్గాన్ని మరింత అధికం చేయి. ఇందులో సిరాతల్ ముస్తఖీం అంటే ఎటువంటి వక్రత లేని తిన్నని, స్పష్టమైన మార్గం. అదియే అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చి పంపించిన ఇస్లాం.
(7) నీ దాసుల్లోంచి వారి మార్గము ఎవరినైతే నీవు సన్మార్గము ద్వారా అనుగ్రహించినావో, అనగా : దైవ ప్రవక్తలు, సత్యవంతులు, అమరులు, సద్వర్తనులు.మరియు అటువంటి వారి సహచర్యం ఎంతో మేలైనది. నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం కాకుండా అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పటికి దానిపై ఆచరించకుండా అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారు, ఉదాహరణకు యూదులు . మరియు మార్గభ్రష్టులైన వారి మార్గం కాకుండా అంటే రుజుమార్గాన్ని అవలంభించకుండా అతిగా ప్రవర్తిస్తూ అపమార్గానికి లోనైన వారు, ఉదాహరణకు క్రైస్తవులు.