(1) భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు.
(2) మరియు భూమి తన లోపల ఉన్న మృతులను,ఇతరవాటిని వెలికి తీసివేసినప్పుడు.
(3) మానవుడు కలవర పడి ఇలా పలుకుతాడు : భూమికి ఏమయ్యింది కదులుతుంది,ప్రకంపిస్తుంది.
(4) ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.
(5) ఎందుకంటే అల్లాహ్ దానికి తెలియపరచాడు మరియు దానికి దాని గురించి ఆదేశించాడు.
(6) భూమి ప్రకంపించే ఆ గొప్ప దినమున ప్రజలు లెక్క తీసుకోబడే స్థానం నుండి వర్గములుగా బయలుదేరుతారు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలను చూడటానికి.
(7) ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను,పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.
(8) ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను,పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.