(1) (الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఏమీ ప్రజలు తాము అన్నమాట "మేము అల్లాహ్ ను విశ్వసించాము" తో వారు అన్న మాట వాస్తవికతను స్పష్టపరిచే ఎటువంటి పరీక్ష లేకుండా విడిచి పెట్టబడతారని భావిస్తున్నారా. వారు వాస్తవంగా విశ్వాసపరులా ?!. వారు అనుకుంటున్నట్లు విషయం కాదు.
(3) మరియు నిశ్ఛయంగా మేము వారి కన్న పూర్వం ఉన్న వారిని పరీక్షించాము. అల్లాహ్ స్వరూప జ్ఞానముతో తప్పకుండా తెలుసుకుంటాడు మరియు తమ విశ్వాసంలో సత్యవంతుల నిజాయితీని,అందులో అసత్యపరుల అబద్దమును మీకు బహిర్గతం చేస్తాడు.
(4) లేక షిర్కు,మొదలగు పాప కార్యములకు పాల్పడేవారు మమ్మల్ని ఓడించి మా శిక్ష నుండి తప్పింకోగలరని భావిస్తున్నారా ?. వారు నిర్ణయించుకుంటున్న వారి నిర్ణయం ఎంత చెడ్డది. వారు ఒక వేళ తమ అవిశ్వాస స్థితిలో మరణిస్తే వారు అల్లాహ్ ను అశక్తుడిని చేసి ఆయన శిక్ష నుండి తప్పించుకోలేరు.
(5) ఎవరైతే ప్రళయ దినాన తనకు ప్రతిఫలం ప్రసాదించటానికి అల్లాహ్ ను కలుసుకునే ఆశ కలిగి ఉంటాడో అతడు దాని కొరకు అల్లాహ్ నిర్ణయించిన గడువు తొందరలోనే రాబోతుందని తెలుసుకోవాలి. మరియు అతడు తన దాసుల మాటలను బాగా వినేవాడు,వారి కర్మలను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏది ఆయన నుండి తప్పించుకోదు. మరియు ఆయన వాటిపరంగా వారికి తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(6) మరియు తన మనస్సును విధేయత చూపటంపై,పాపకార్యముల నుండి దూరంగా ఉండటంపై ప్రేరేపించి సాధన చేసేవాడు మరియు అల్లాహ్ మార్గంలో సాధన చేసేవాడు తన స్వయం కోసం సాధన చేసిన వాడు. ఎందుకంటే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది. మరియు అల్లాహ్ సృష్టితాలన్నింటి నుండి అక్కరలులేని వాడు. వారి విధేయత అతనికి ఏమీ అధికం చేయదు మరియు వారి అవిధేయత ఆయనకు ఏమీ తగ్గించదు.
(7) మరియు ఎవరైతే విశ్వసించి,వారికి మేము పరీక్షించిన దానిపై సహనం చూపి,సత్కార్యాలు చేస్తారో వారు చేసిన సత్కార్యాలకు బదులుగా మేము తప్పకుండా వారి పాపాలను తుడిచివేస్తాము. మరియు మేము వారికి పరలోకములో వారు ఇహలోకములో చేసుకున్న దాని కన్న మంచి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(8) మరియు మేము మానవునికి అతని తల్లిదండ్రులపట్ల మంచిగా వ్యవహరించమని,వారికి ఉపకారము చేయమని ఆదేశించాము. ఓ మానవుడా ఒక వేళా నీ తల్లిదండ్రులు నీకు సాటి కల్పించటం గురించి జ్ఞానం లేని దానిని నాతో పాటు సాటి కల్పించమని ప్రేరేపిస్తే ఏవిధంగా నైతే సఅద్ బిన్ అబీ వఖ్కాస్ రజిఅల్లాహు అన్హుకి ఆయన తల్లితో జరరిగినదో ఆ విషయంలో నీవు వారి మాట వినకు. ఎందుకంటే సృష్టి కర్తకు అవిధేయత చూపటంలో ఏ సృష్టికి విధేయత చూపకూడదు. ప్రళయదినాన నా ఒక్కడి వైపే మీ మరలటం జరుగుతుంది. అప్పుడు నేను మీరు ఇహలోకంలో ఏమి చేసేవారో మీకు తెలియపరుస్తాను. మరియు దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
(9) మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యములను చేసేవారిని మేము తప్పకుండా ప్రళయదినాన పుణ్యాత్ముల్లో చేర్చుతాము. వారితోపాటు వారిని సమీకరిస్తాము. మరియు వారి పుణ్యమును వారికే ప్రసాదిస్తాము.
(10) మరియు ప్రజల్లోంచి కొంత మంది మేము అల్లాహ్ ను విశ్వసించాము అని అనేవారు ఉన్నారు. అవిశ్వాసపరులు అతని విశ్వాసం వలన అతన్ని హింసించినప్పుడు తనకు కలిగిన వారి శిక్షను అల్లాహ్ శిక్షగా చేసుకుని అవిశ్వాసపరులకు అనుగుణంగా విశ్వాసము నుండి మరలిపోతాడు. ఓ ప్రవక్తా ఒక వేళ మీకు మీ ప్రభువు వద్ద నుండి ఏదైన సహాయం కలిగితే వారు తప్పకుండా ఇలా పలుకుతారు : ఓ విశ్వాసపరులారా మేము మీతో పాటు విశ్వాసముపై ఉన్నాము. ఏమీ ప్రజల మనస్సులలో ఉన్న దాని గురించి అల్లాహ్ కు బాగా తెలియదా ?!. వాటిలో ఉన్న అవిశ్వాసము,విశ్వాసము ఆయనపై గోప్యంగా ఉండదు. అటువంటప్పుడు వారు తమ హృదయములలో ఉన్న దాని గురించి అల్లాహ్ కి ఎలా తెలియపరచగలరు. వాస్తవానికి వాటిలో ఉన్నదాని గురించి వారి కన్న బాగా ఆయనకు తెలుసు.
(11) మరియు అల్లాహ్ వాస్తవంగా తనపై విశ్వాసమును కనబరచిన వారిని తప్పకుండా స్పష్టపరుస్తాడు. మరియు ఆయన విశ్వాసమును బహిరంగపరచి అవిశ్వాసమును గోప్యంగా ఉంచే కపటులను స్పష్టపరుస్తాడు.
(12) మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ఒక్కడిని విశ్వసించే వారితో ఇలా పలుకుతారు : మీరు మా ధర్మమును,మేము దేనిపైనైతే ఉన్నామో దానిని అనుసరించండి. మేమే మీ పాపములను మోస్తాము,వాటి ప్రతిఫలము మీరు కాకుండా మేమే పొందుతాము. వాస్తవానికి వారు వారి పాపముల్లోంచి ఏదీ మోయరు. మరియు నిశ్ఛయంగా వారు దాన్ని తమ హృదయములలో అబద్దము పలుకుతున్నారు.
(13) మరియు తమ అసత్యము వైపు పిలిచే ఈ ముష్రికులందరు తాము పాల్పడినటువంటి పాపములను తప్పకుండా మోస్తారు. మరియు తమ పిలుపును అనుసరించినటువంటి వారి పాపములను అనుసరించిన వారి పాపములను వారి కొరకు ఏమాత్రం తగ్గించకుండా మోస్తారు. మరియు ప్రళయదినాన వారు ఇహలోకములో కల్పించుకున్న అసత్యాల గురించి వారు తప్పకుండా ప్రశ్నించబడుతారు.
(14) మరియు నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను ఆయన జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. అప్పుడు ఆయన వారిని అల్లాహ్ ఏకేశ్వరోపాసన వైపునకు పిలుస్తూ వారిలో తొమ్మిది వందల యాభై సంవత్సరములు ఉండిపోయారు. అప్పుడు వారు అతన్ని తిరస్కరించి తమ అవిశ్వాసంపై కొనసాగిపోయారు. అప్పుడు వారికి అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తల పట్ల వారి తిరస్కారం వలన దుర్మార్గంలో ఉన్న స్థితిలో తుఫాను పట్టుకుంది. అప్పుడు వారందరు మునిగి చనిపోయారు.
(15) అప్పుడు మేము నూహ్ ను,ఆయనతోపాటు ఉన్న విశ్వాసపరులను మునిగి చావకుండా నావలో రక్షించాము. మరియు మేము నావను గుణపాఠం నేర్చుకునే ప్రజల కొరకు ఒక గుణపాఠంగా చేశాము.
(16) ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతివారితో ఇలా పలికినప్పటి వృత్తాంతమును గుర్తు చేసుకోండి : మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. మరియు ఆయన ఆదేశించిన వాటిని పాటించటం ద్వారా ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన శిక్షకు భయపడండి. మీకు ఆదేశించబడినది మీ కొరకు ఎంతో మేలైనది ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే.
(17) ఓ ముష్రికులారా మీరు కేవలం లాభం కలిగించలేని,నష్టం కలిగించలేని కొన్ని విగ్రహాలను మాత్రమే ఆరాధిస్తున్నారు. మీరు వారిని ఆరాధన కొరకు హక్కుదారులని వాదించినప్పుడు మీరు అబద్దమును కల్పించుకున్నారు. నిశ్ఛయంగా మీరు అల్లాహ్ ను వదలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీకు ఆహారమును ప్రసాదించటానికి ఎటువంటి మీ ఆహారోపాధి అధికారము వారికి ఉండదు. కాబట్టి మీరు అల్లాహ్ వద్ద ఆహారమును కోరండి. ఆయనే ఆహార ప్రధాత. మీరు ఆయన ఒక్కడినే ఆరాధించండి. మరియు ఆయన మీకు అనుగ్రహించిన ఆహారముపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకోండి. ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపే మీరు మరలించబడుతారు,మీ విగ్రహాల వైపు కాదు.
(18) ఓ ముష్రికులారా మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరిస్తే మీకన్న పూర్వ జాతులు నూహ్, ఆద్,సమూద్ జాతి లాంటి వారు కూడా తిరస్కరించారు. ప్రవక్తపై కేవలం స్పష్టంగా చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. నిశ్ఛయంగా అతని ప్రభువు మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మీకు చేరవేశాడు.
(19) ఏమీ అల్లాహ్ సృష్టిని ఏవిధంగా ఆరంభించాడో,ఆ తరువాత దాని వినాశనం తరువాత ఎలా మరలింపజేస్తున్నాడో ఈ తిరస్కారులందరు చూడటం లేదా ?!. నిశ్ఛయంగా ఇది అల్లాహ్ పై ఎంతో సులభము. ఆయన సామర్ధ్యం కలవాడు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(20) ఓ ప్రవక్త మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా తెలపండి : మీరు భూమిలో సంచరించి అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ఆరంభించాడో చూడండి. ఆ తరువాత అల్లాహ్ ప్రజలను వారి మరణం తరువాత మరల లేపటం కొరకు,లెక్క తీసుకోవటం కొరకు రెండవ సారి జీవింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. అతన్ని ఏదీ అశక్తుడిని చేయదు. ప్రజలను ఆయన మరలా లేపటం నుండి అశక్తుడు కాడు ఏవిధంగా నైతే ఆయన వారిని ఆరంభంలో సృష్టించటంలో అశక్తుడు కాలేదో.
(21) తన సృష్టితాల్లో నుండి తాను కోరిన వారికి తన న్యాయము ద్వారా శిక్షిస్తాడు. మరియు తన సృష్టితాల్లోంచి తాను కోరిన వారికి తన అనుగ్రహము ద్వారా కరుణిస్తాడు. ఆయన మిమ్మల్ని మీ సమాధుల నుండి జీవింపజేసి లేపినప్పుడు మీరు ప్రళయదినాన ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.
(22) మరియు మీరు మీ ప్రభువు నుండి తప్పించుకోలేరు. మరియు మీరు భూమిలో గాని,ఆకాశములో గాని ఆయన శిక్ష నుండి విముక్తి పొందలేరు. మరియు మీ కొరకు మీ వ్యవహారమును రక్షించే రక్షకుడు అల్లాహ్ తప్ప ఇంకెవ్వడూ లేడు. మరియు అల్లాహ్ తప్ప ఆయన శిక్షను మీ నుండి తొలగించే సహాయకుడు మీ కొరకు ఎవడూ లేడు.
(23) మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను,ప్రళయ దినాన ఆయనను కలుసుకోవటమును తిరస్కరించే వారందరు నా కారుణ్యమును నుండి నిరాశ్యులైపోయారు. వారు తమ అవిశ్వాసం వలన ఎన్నటికి స్వర్గంలో ప్రవేశించలేరు. వారందరి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది అది పరలోకములో వారి కొరకు నిరీక్షిస్తుంది.
(24) ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారికి అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి ఆయన కాకుండా ఇతరులైన విగ్రహాల ఆరాధనను విడనాడండి అని ఆదేశించినప్పుడు ఆయన జాతి వారి సమాధానం మీ విగ్రహాలకు సహాయం చేయటం కొరకు అతడిని చంపి వేయండి లేదా అతన్ని అగ్నిలో పడవేయండి అని మాత్రం అయింది. అప్పుడు అల్లాహ్ ఆయనను అగ్ని నుండి రక్షించాడు. నిశ్ఛయంగా ఆయనను అగ్నిలో వేసిన తరువాత దాని నుండి ఆయనను రక్షించటంలో విశ్వసించే జనులకు గుణపాఠం కలదు. ఎందుకంటే వారే గుణపాఠము ద్వారా ప్రయోజనం చెందుతారు.
(25) మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : మీరు కొన్ని విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుని ఇహలోక జీవితంలో పరస్పర పరిచయం కొరకు,పరస్పరం ప్రేమించుకోవటం కొరకు వాటిని ఆరాధించేవారు. ఆ తరువాత ప్రళయదినాన మీ పరస్పర ప్రేమ అంతమైపోతుంది. శిక్షను కళ్ళారా చూసినప్పుడు మీలోని ఒకరినొకరు సంబంధము లేదని చెబుతారు. మరియు ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీరు శరణు తీసుకునే మీ నివాసము. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే సహాయకుల్లోంచి మీ కొరకు ఎవరు ఉండరు. అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించే మీ విగ్రహాల్లోంచి గాని ఇతరుల్లోంచి గాని ఉండరు.
(26) అప్పుడు ఆయనపై లూత్ అలైహిస్సలాం విశ్వాసమును తీసుకుని వచ్చారు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను నా ప్రభువు వైపునకు శుభ ప్రదమైన సిరియా ప్రాంతము వైపునకు వలసపోతాను. నిశ్ఛయంగా ఆయనే ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడు. మరియు ఆయన తన వైపునకు వలసపోయి వచ్చే వారిని అవమానమునకు లోను చేయడు. తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(27) మరియు మేము ఇబ్రాహీం అలాహిస్సలాంనకు ఇస్హాఖ్ ను,అతని కుమారుడగు యాఖూబ్ ను ప్రసాదించాము. మరియు అతని సంతానములో దైవ దౌత్యమును, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను చేశాము. మరియు ఇహలోకములో సత్య మార్గముపై ఆయన సహనమునకు ప్రతిఫలంగా సంతానము మంచితనము,మంచి ప్రశంసలను ప్రసాదించాము. మరియు నిశ్ఛయంగా అతడు పరలోకములో పుణ్యాత్ముల ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఇహలోకంలో అతనికి ప్రసాదించబడినది పరలోకంలో అతని కొరకు సిద్ధం చేసి ఉంచిన గౌరవప్రదమైన ప్రతిఫలమును తగ్గించదు.
(28) ఓ ప్రవక్తా లూత్ అలైహిస్సలాంను ఆయన తన జాతి వారితో ఇలా పలికినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా మీరు మీ కన్నా ముందు లోక వాసుల్లోంచి చేయని నీతి మాలిన పనిని మీరు చేశారు. మీరే మంచి స్వభావము నిరాకరించే ఈ పాపమును మొదట ఆరంభించిన వారు.
(29) ఏమీ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి మగవారి వెనుక భాగము వద్దకు వస్తున్నారా,మరియు మీరు ప్రయాణికులపై దారి కొడుతున్నారా అప్పుడు వారు మీరు పాల్పడే అశ్లీల కార్యంనకు భయపడి మీ దరిదాపుల నుండి ప్రయాణం చేయటం లేదు. మరియు మీరు మీ సభలలో నగ్నత్వం, మీ వద్ద నుండి వెళ్ళేవారిని మాటలతో,చేతలతో బాధ పెట్టటం లాంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నారా ?. అసభ్యకరమైన చర్యల నుండి ఆయన వారింపు తరువాత ఆయన జాతి వారి జవాబు ఆయనతో ఈ విధంగా పలకటం తప్పా ఇంకేమి ఉండేది కాదు : నీవు నీ వాదనలో సత్యవంతుడివే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తున్న అల్లాహ్ శిక్షను మా వద్దకు తీసుకునిరా.
(30) లూత్ అలైహిస్సలాం తన జాతి వారి మొండి వైఖరి,తమపై శిక్షను కురిపించమని వారి కోరిక తనను తక్కువగా అంచనా వేస్తూ చేయటం తరువాత తమ ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువు అవిశ్వాసము,అసభ్యకరమైన పాపములను వ్యాపింపజేసి భూమిలో ఉపద్రవాలను సృష్టించే జనులకి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.
(31) మరియు ఎప్పుడైతే మేము పంపించిన దూతలు ఇబ్రాహీం అలైహిస్సలాంనకు ఇస్హాఖ్,అతని తరువాత అతని కుమారుడు యాఖూబ్ గురించి శుభవార్తనిస్తూ వచ్చారో అప్పుడు ఆయనతో ఇలా పలికారు : నిశ్చయంగా మేము లూత్ అలైహిస్సలాం ఊరైన సదూమ్ ఊరి వాసులను తుదిముట్టించే వారము. నిశ్ఛయంగా దాని వాసులు అశ్లీల కార్యములకు పాల్పడటం వలన దుర్మార్గులైపోయారు.
(32) ఇబ్రాహీం అలైహిస్సలాం దైవ దూతలతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు తుదిముట్టించదలచిన ఈ ఊరి వాసులలో లూత్ కూడా ఉన్నారు. ఆయన దుర్మార్గుల్లోంచి కారు కదా. దైవ దూతలు ఇలా సమాధానమిచ్చారు : అక్కడ ఉన్న వారి గురించి మాకు బాగా తెలుసు. మేము అతన్ని,అతని ఇంటి వారిని ఊరి వాసులపై కురిసే వినాశనము నుండి తప్పకుండా రక్షిస్తాము. కానీ ఆయన భార్య వినాశనమైపోయి వెనుక ఉండే వారిలోంచి అయిపోయింది. మేము తొందరలోనే ఆమెను వారితోపాటు తుదిముట్టిస్తాము.
(33) లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి మేము పంపించిన దూతలు లూత్ వద్దకు వచ్చినప్పుడు తన జాతి వారి చెడు నుండి వారిపై భయం వలన వారి రాక ఆయనకు చెడుగా అనిపించింది,ఆయనకు బాధను కలిగించింది. వాస్తవానికి దూతలు ఆయన వద్దకు మగవారి రూపములో వచ్చారు. మరియు అతని జాతి వారు కామ కోరికలను తీర్చుకోవటానికి స్త్రీలను కాకుండా మగవారి వద్దకు వచ్చేవారు. మరియు దైవ దూతలు ఆయనతో ఇలా పలికారు : నీవు భయపడకు. నీ జాతి వారు నీకు చెడు చేయలేరు. మరియు నీకు మేము వారి వినాశనము గరించి ఇచ్చిన వార్త పై బాధపడకు. నిశ్చయంగా మేము మిమ్మల్ని,మీ ఇంటి వారిని వినాశనం నుండి రక్షిస్తాము. కాని మీ భార్య వెనుక ఉండి వినాశనమైపోయే వారిలో అయిపోతుంది. మేము తొందరలోనే వారితోపాటు ఆమెను తుదిముట్టిస్తాము.
(34) నిశ్చయంగా మేము దుశ్చర్యలకు పాల్పడే ఈ నగర వాసులపై ఆకాశము నుండి శిక్షను కురిపిస్తాము. అది మట్టితో తయారైన కంకరు రాళ్ళు. వారు అసభ్యకరమైన,అశ్లీల కార్యమునకు పాల్పడటం ద్వారా అల్లాహ్ విధేయత నుండి వైదొలిగిపోవటం వలన వారిపై శిక్షగా. మరియు అది స్త్రీలను కాకుండా పురుషులతో వారు కామ కోరికలు తీర్చుకోవటం.
(35) మరియు నిశ్చయంగా మేము నాశనం చేసిన ఈ ఊరి ద్వారా బుద్ధిమంతులైన జనుల కొరకు ఒక స్పష్టమైన సూచనను విడిచిపెట్టాము. ఎందుకంటే వారే సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు.
(36) మరియు మేము వంశ పరంగా వారి సోదరుడైన షుఐబ్ అలైహిస్సలాంను మద్యన్ వైపునకు ప్రవక్తగా పంపించాము. అప్పుడు ఆయన ఇలా పలికాడు : ఓ నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. మరియు మీ ఆరాధన ద్వారా అంతిమ దినమున మీరు ప్రతిఫలమును అతని నుండే ఆశించండి. మరియు మీరు పాప కార్యములు చేసి వాటిని వ్యాపింపజేయటం ద్వారా భూమిలో అల్లకల్లోలాలను సృష్టించకండి.
(37) అప్పుడు అతని జాతి వారు అతన్ని తిరస్కరించారు. అప్పుడు భూకంపం వారిని కబళించింది. అప్పుడు వారు తమ ఇండ్లలోనే తమ ముఖములపై బొర్లా పడిపోయినట్లు అయిపోయారు. వారి ముఖములకు మట్టి అంటుకున్నది,వారిలో ఎటువంటి చలనం లేదు.
(38) మరియు మేము ఇదే విధంగా హూద్ అలైహిస్సలాం జాతి అయిన ఆద్ ను,సాలిహ్ జాతి వారైన సమూద్ ను నాశనం చేశాము. ఓ మక్కా వాసులారా హజరె మౌత్ నుండి హిజర్,షిహర్ పట్టణాల్లో ఉన్న వారి నివాసములు వారి వినాశనముపై మీకు సూచిస్తున్న దాని నుండి మీకు స్పష్టమయ్యింది. వారి ఖాళీ నివాసములు దానికి సాక్ష్యం. మరియు షైతాను వారు ఉన్న అవిశ్వాసము,ఇతర పాపములను వారికి మంచిగా చేసి చూపించాడు. అప్పుడు అతడు వారిని సన్మార్గము నుండి మరలింపజేశాడు. వారికి వారి ప్రవక్తలు బోధించటం వలన వారు సత్యం,మార్గ భ్రష్టత,సన్మార్గం,మార్గ విహీనత గురించి దూర దృష్టి కలవారై ఉండేవారు. కాని వారు సన్మార్గమును అనుసరించటముకు బదులుగా మనోవాంచలను అనుసరించటమును ఎంచుకున్నారు.
(39) మరియు మేము ఖారూనును అతడు మూసా జాతి వారిపై బలవంతం చేసినప్పుడు అతనిని అతని ఇంటితో సహా (భూమిలో) కూర్చి నాశనం చేశాము. మరియు మేము ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామానును సముద్రంలో ముంచి నాశనం చేశాము. వాస్తవానికి మూసా తన విజాయితీపై సూచించే స్పష్టమైన సూచనలను వారి వద్దకు తీసుకుని వచ్చారు. కాని వారు ఆయనపై విశ్వాసము కనబరచటం నుండి మిసర్ భూమిలో అహంకారమును చూపారు. మరియు వారు మా నుండి తప్పించుకుని మా శిక్ష నుండి భద్రంగా ఉండలేరు.
(40) ప్రస్తావించబడిన వారిలో నుండి ప్రతి ఒక్కరిని మేము అంతక ముందే నాశనం చేసే మా శిక్ష ద్వారా పట్టకున్నాము. వారిలో నుండి కొందరు లూత్ జాతి వారు ఉన్నారు. వారిపై మేము కాల్చి మట్టితో తయారు చేయబడిన కంకర రాళ్ళను కురిపించాము. వారిలో నుండి కొందరు సాలిహ్ అలైహిస్సలాం జాతివారు,షుఐబ్ అలైహిస్సలాం జాతి వారు ఉన్నారు వారిని భయంకరమైన గర్జన పట్టుకుంది. వారిలో నుండి ఖారూన్ కూడా ఉన్నాడు. అతని ఇంటితో సహా అతడిని మేము భూమిలో కూర్చి వేశాము. మరియు వారిలో నుండి నూహ్ అలైహిస్సలాం,ఫిర్ఔన్,హామాన్ జాతి వారు ఉన్నారు వారిని మేము ముంచి నాశనం చేశాము. మరియు అల్లాహ్ ఏ పాపము లేకుండా వారిని నాశనం చేసి వారిని హింసించడు. కానీ వారే పాప కార్యములకు పాల్పడి తమ స్వయమును హింసించుకున్నారు. కాబట్టి వారు శిక్షకు అర్హులయ్యారు.
(41) అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని వాటి నుండి లాభమును లేదా వాటి సిఫారసును ఆశిస్తూ వాటిని ఆరాధించే ముష్రికుల ఉపమానమును తనపై దాడి చేయటం నుండి తన రక్షణ కొరకు సాలె పురగు నిర్మించుకున్న ఒక ఇంటితో పోల్చవచ్చు. మరియు నిశ్ఛయంగా ఇండ్లలో అత్యంత బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లు. అది దాని నుండి ఏ శతృవును నిరోధించదు. ఇదే విధంగా వారి విగ్రహాలు ప్రయోజనం కలిగించవు,నష్టం కలిగించవు,సిఫారసు చేయవు. ఒక వేళ ముష్రికులు ఇది తెలుసుకుంటే వారు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను తయారు చేసుకుని ఆరాధించేవారు కాదు.
(42) నిశ్చయంగా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కి వారు ఆయనను వదిలి దేనిని ఆరాధిస్తున్నారో తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయన ముందు దాగి ఉండదు. మరియు ఆయన ఓడించబడని సర్వ శక్తిమంతుడు. తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(43) మరియు మేము ప్రజలకు ఇచ్చే ఉపమానములు వారిని మేల్కొలపటానికి,వారిని సత్యమును చూపించి దాని వైపునకు మార్గదర్శకం చేయటానికి. అల్లాహ్ ధర్మ శాసనములను,ఆయన విజ్ఞతలను తెలుసుకున్న వాడే వాటిని ఆశించిన విధంగా పొందగలడు.
(44) పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను,భూమిని సత్యాధారంగా సృష్టించాడు. మరియు ఆయన వాటిని అసత్యాధారంగా సృష్టించలేదు. మరియు వాటిని వృధాగా సృష్టించలేదు. నిశ్చయంగా ఈ సృష్టించటంలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై స్పష్టమైన ఆధారం కలదు. ఎందుకంటే వారే అల్లహ్ సృష్టి ద్వారా పరిశుద్ధుడైన సృష్టి కర్తపై ఆధారమును గ్రహిస్తారు. కాని అవిశ్వాసపరులు పరిశుద్ధుడైన సృష్టి కర్త గొప్పతనము,ఆయన సామర్ధ్యము వైపునకు తమ దృష్టిని మరల్చకుండా జగతిలో,తమలో ఉన్న సూచనలపై నుండి వెళుతున్నారు.
(45) ఓ ప్రవక్తా అల్లాహ్ మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన ఖుర్ఆన్ ను ప్రజలకు చదివి వినిపించండి. మరియు మీరు నమాజును పరిపూర్ణంగా పాటించండి. నిశ్చయంగా పరిపూర్ణ లక్షణాలతో చేయబడిన నమాజు హృదయములలో పాపములకు పాల్పడటం నుండి ఆపే,సత్కార్యములు చేయటానికి మార్గదర్శకం చేసే వెలుగు కలగటం వలన దాన్ని (నమాజును) పాటించే వాడిని పాపకార్యములలో,దుష్కార్యముల్లో పడటం నుండి ఆపుతుంది. అల్లాహ్ ధ్యానము ప్రతీ వస్తువు నుండి పెద్దది,గొప్పది. మరియు వారు చేసేది అల్లాహ్ కి తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయన ముందు గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే మీకు మీ కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అవి మంచివైతే మంచిగా (ప్రతిఫలం) ఉంటుంది. మరియు ఒక వేళ అవి చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది.
(46) ఓ విశ్వాసపరులారా మీరు యూదులతో,క్రైస్తవులతో మంచి పధ్ధతిలో, ఉత్తమమైన విధానంలో మాత్రమే సంభాషించండి,వాదించండి. అది హితబోధన ద్వారా, స్పష్టమైన వాదనల ద్వారా పిలుపునివ్వటం. కానీ వారిలో నుండి ఎవరైతే మొండితనం,అహంభావంతో దుర్మార్గమునకు పాల్పడ్డారో మరియు మీపై యుద్దమును ప్రకటించారో వారితో మీరు వారు ముస్లిములయ్యేంతవరకు లేదా పరాభవమునకు లోనై తమ చేతులతో జిజియా చెల్లించనంత వరకు పోరాడండి. మరియు మీరు యూదులతో,క్రైస్తవులతో ఇలా పలకండి : అల్లాహ్ మా వైపునకు అవతరించిన ఖుర్ఆన్ ను మేము విశ్వసించాము మరియు మీ వైపునకు అవతరించిన తౌరాతును,ఇంజీలును విశ్వసించాము. మరియు మీ ఆరాధ్య దైవము,మా ఆరాధ్య దైవము ఒక్కడే. ఆయన ఆరాధనలో,ఆయన దైవత్వములో,ఆయన పరిపూర్ణతలో ఆయనకు ఎవ్వరూ సాటి లేరు. మరియు మేము ఆయన ఒక్కడి కొరకే లోబడి,విధేయులై ఉన్నాము.
(47) మరియు మేము మీ కన్నాపూర్వికులపై గ్రంధములను అవతరింపజేసినట్లే మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. తౌరాతును చదివే వీరందరిలో నుండి అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి కొందరు తమ గ్రంధములలో దీని లక్షణములను పొందటం వలన దీనిని విశ్వసించారు. మరియు ఈ ముష్రికులందరిలో నుంచి కొందరు దీనిని విశ్వసించారు. సత్యం స్పష్టమైనా కూడా దాన్ని అవిశ్వసించటం,తిరస్కారము తమ అలవాటైన అవిశ్వాసపరులు మాత్రమే మా ఆయతులను తిరస్కరిస్తారు.
(48) ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ కన్న ముందు ఏ గ్రంధమును చదివేవారు కాదు. మరియు మీరు దేనినీ మీ కుడి చేత్తో వ్రాసే వారు కాదు. ఎందుకంటే మీరు చదవలేని,వ్రాయలేని అజ్ఞాని. మరియు ఒక వేళ మీరు చదవగలిగి,వ్రాయగలిగితే ప్రజల్లోంచి అజ్ఞానులు మీ దైవదౌత్యం గురించి సందేహపడేవారు. మరియు మీరు పూర్వ గ్రంధాల నుండి వ్రాస్తున్నారని వారు సాకుల చెప్పేవారు.
(49) అసలు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ విశ్వాసపరుల్లోంచి జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో ఉన్న స్పష్టమైన ఆయతులు. మరియు అల్లాహ్ పై అశ్వాసమును కనబరచి,ఆయనతోపాటు సాటి కల్పించటం వలన తమ స్వయానికి హింసకు పాల్పడే వారు మాత్రమే మా ఆయతులను తిరస్కరిస్తారు.
(50) మరియు ముష్రికులు ఇలా పలికారు : ఎందుకని ముహమ్మద్ పై అతని ప్రభువు వద్ద నుండి అతని కన్న ముందు ప్రవక్తలపై అవతరించినటువంటి అద్భుత సూచనలు అవతరింపబడలేదు. ఓ ప్రవక్తా ఈ ప్రతిపాదకులందరితో ఇలా పలకండి : అద్భుత సూచనలు మాత్రం పరిశుద్ధుడైన అల్లాహ్ చేతిలో ఉన్నవి. ఆయన వాటిని తాను కోరుకున్నప్పుడు అవతరింపజేస్తాడు. వాటిని అవతరింపజేసే అధికారం నా దగ్గర లేదు. నేను మీ కొరకు అల్లాహ్ శిక్ష నుండి స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే.
(51) మరియు ఏమీ అద్భుత సూచనల కొరకు ప్రతిపాదించే వీరందరికి ఓ ప్రవక్త మీరు వారిపై చదివి వినిపించే ఖుర్ఆన్ ను మేము మీపై అవతరింపజేయటం సరిపోదా. నిశ్చయంగా వారిపై అవతరింపబడే ఖుర్ఆన్ లో విశ్వసించే జనుల కొరకు కారుణ్యము,హితబోధన కలదు. వారే అందులో ఉన్న వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు. పూర్వ ప్రవక్తలపై అవతరింపబడిన ఉపమానము దేనినైతే వారు ప్రతిపాదించారో దాని కన్న వారిపై అవతరింపబడినది మేలైనది.
(52) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీ పై మరియు దాని పట్ల మీ తిరస్కారముపై సాక్షిగా పరిశుద్ధుడైన అల్లాహ్ యే చాలు. ఆకాశముల్లో ఉన్న వాటి గురించి ఆయనకు తెలుసు. మరియు భూమిలో ఉన్న వాటి గురించి ఆయనకు తెలుసు. ఆ రెండింటిలో ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఆరాధించే అసత్యాలన్నింటిపై విశ్వాసమును కనబరచి, ఆరాధనకు అర్హుడైన ఒక్కడైన అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారందరు విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసమును కోరుకోవటం వలన నష్టపోయేవారు.
(53) ఓ ప్రవక్తా ముష్రికులు ఏ శిక్ష గురించైతే మీరు వారిని హెచ్చరించారో దాన్ని తీసుకురమ్మని మిమ్మల్ని తొందరపెడుతున్నారు. ఒక వేళ అల్లాహ్ వారిని శిక్షించటం కొరకు ముందుకు జరగని,వెనుకకు జరగని ఒక సమయమును నిర్ణయించి ఉండకపోతే వారు కోరుకున్న శిక్ష వారి వద్దకు వచ్చితీరేది. మరియు అది వారి వద్దకు అకస్మాత్తుగా వచ్చిపడేది. మరియు వారు దాన్ని నమ్మలేకపోయేవారు.
(54) మీరు వారిని ఏ శిక్ష గురించి వాగ్దానం చేశారో దాని గురించి వారు మిమ్మల్ని తొందరపెడుతున్నారు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ అవిశ్వాసపరులకు వాగ్దానం చేసిన నరకం వారిని చుట్టుముట్టుతుంది. దాని శిక్ష నుండి వారు పారిపోలేరు.
(55) ఆ రోజు శిక్ష వారి పైనుండి వారిని కప్పివేస్తుంది. మరియు అది వారి కాళ్ళ క్రింది నుండి వారి కొరకు పరుపుగా అయిపోతుంది. మరియు అల్లాహ్ వారిని దూషిస్తూ వారితో ఇలా పలుకుతాడు : మీరు చేస్తుండే షిర్కు,పాప కార్యల ప్రతిఫలమును రుచి చూడండి.
(56) నన్ను విశ్వసించిన ఓ నా దాసులారా నా ఆరాధన సాధ్యంకాని ప్రాంతము నుండి మీరు వలసపోండి. నిశ్చయంగా నా భూమి ఎంతో విశాలమైనది. మీరు నా ఒక్కడి ఆరాధనే చేయండి. నాతోపాటు ఎవరినీ సాటి కల్పించకండి.
(57) మరణ భయం మిమ్మల్ని వలసపోవటం నుండి ఆపకూడదు. ప్రతీ ప్రాణము మరణ రుచి చూడవలసినదే. ఆ తరువాత మీరు ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మా ఒక్కరి వైపునకే మరలించబడుతారు.
(58) మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి ఆయన సాన్నిధ్యమును చేకూర్చే సత్కార్యములు చేస్తారో వారిని మేము తప్పకుండా స్వర్గములోని పెద్దపెద్ద భవనముల్లో దించుతాము. వాటి క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తుంటాయి,వాటిలో వారు శాస్వతంగా నివాసముంటారు. వాటిలో వారికి అంతమన్నది కలగదు. అల్లాహ్ కు విధేయత చూపే వారి ఈ ప్రతిఫలము ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలము.
(59) అల్లాహ్ పై విధేయతకు పాల్పడే వారి ప్రతి ఫలము శ్రేష్ఠమైనది,వారు ఆయన పై విధేయత చూపటంపై,ఆయన పై అవిధేయత చూపటం నుండి సహనం చూపుతారు. తమ వ్యవహారలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉంటారు.
(60) ప్రాణులన్ని అవి అధికంగా ఉన్నప్పటికి తమ జీవనోపాధిని సమకూర్చుకోలేవు,వాటిని సాధించలేవు. అల్లాహ్ వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు మరియు మీకు జీవనోపాధిని సమకూరుస్తాడు. ఆకలి భయంతో వలసపోవటమును వదిలి వేయటానికి ఎటువంటి వంక మీకు లేదు. మరియు ఆయనే మీ మాటలను వినే వాడును,మీ సంకల్పాలను,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే మీకు వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(61) ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఇలా అడిగితే : ఆకాశములను సృష్టించినదెవరు ? మరియు భూమిని సృష్టించినదెవరు ? మరియు సూర్య చంద్రులను ఒక దాని వెనుక ఒకటి వచ్చే విధంగా ఉపయుక్తంగా చేసినదెవరు ?. వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : వాటిని అల్లాహ్ సృష్టించాడు. అటువంటప్పుడు వారు ఎలా ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి మరలింపబడుతున్నారు. మరియు వారు ఎలా ఆయనను వదిలి ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని ఆరాధ్య దైవాలను ఆరాధిస్తున్నారు ?.
(62) అల్లాహ్ తనకు తెలిసిన విజ్ఞత వలన తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఆహారోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు. మరియు తాను కోరుకున్న వారికి దాన్ని కుదించివేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీది తెలిసినవాడు. అలాగే తన దాసుల కొరకు కార్య నిర్వహణలో నుంచి ప్రయోజనకరమైనది ఆయనపై గోప్యంగా ఉండదు.
(63) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ముష్రికులతో ఆకాశము నుండి నీటిని కురిపించి దాని ద్వారా భూమిని బంజరు అయిన తరువాత మొలకెత్తించిందెవరు అని అడిగితే వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : ఆకాశము నుండి వర్షమును కురిపించి దాని ద్వారా భూమిని మొలకెత్తించినది అల్లాహ్. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : స్థుతులన్నీ మీపై వాదనను స్పష్టపరచిన అల్లాహ్ కొరకే. కాని జరిగిందేమిటంటే వారిలో చాలా మంది అర్ధం చేసుకోలేదు. వారు ఒక వేళ అర్ధం చేసుకునే వారైతే అల్లాహ్ తో పాటు ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని విగ్రహాలను సాటి కల్పించేవారు కాదు.
(64) మరియు ఈ ఇహలోక జీవితం అందులో ఉన్న కోరికలు,సామగ్రి వాటి సంబంధికుల హృదయాలకు కేవలం వినోద కాలక్షేపం,ఆట మాత్రమే. అది తొందరగా ముగుస్తుంది. మరియు నిశ్ఛయంగా పరలోక నివాసము అది శాశ్వతమైనది కావటం వలన అదే వాస్తవ జీవితము. ఒక వేళ వారికి తెలిసి ఉంటే వారు శాశ్వతంగా ఉండే దానిపై అంతమయ్యే దాన్ని ముందుకు నెట్టరు.
(65) మరియు ముష్రికులు సముద్రంలో నావలో ప్రయాణిస్తున్నప్పుడు తమను మునగటం నుండి రక్షించమని ఒక్కడైన అల్లాహ్ ను ఆయన కొరకు దుఆను ప్రత్యేకిస్తూ వేడుకునేవారు. ఎప్పుడైతే ఆయన వారిని మునగటం నుండి రక్షించాడో వారు ఆయనతోపాటు తమ ఆరాధ్య దైవాలను వేడుకుంటూ సాటి కల్పిస్తూ మరలిపోతారు.
(66) మేము వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులవటానికి,వారికి ప్రసాదించబడిన ఇహలోక భోగభాగ్యాల్లో వారు జుర్రుకోవటానికి సాటి కల్పిస్తూ మరలిపోతారు. అయితే వారు తొందరలోనే వారు మరణించేటప్పుడు తమ దుష్పరిణామమును తెలుసుకుంటారు.
(67) ఏమీ తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించే వీరందరు అల్లాహ్ వారిని మునగటం నుండి కాపాడినప్పుడు వారు ఇంకో అనుగ్రహమును చూడటం లేదా. అది మేము వారి కొరకు హరమ్ ను తయారు చేశాము అందులో వారి రక్తములు,వారి సంపదలు భద్రంగా ఉన్నవి. అదే సమయంలో ఇతరులపై దాడులు జరుగుతున్నవి. వారు హతమార్చబడుతున్నారు మరియు బంధీలు చేయబడుతున్నారు. మరియు వారి స్త్రీలు,వారి సంతానము బానిసలు చేయబడుతున్నారు. వారి సంపదలు దోచుకోబడుతున్నాయి. ఏమీ వారు అసత్యమైన వారు ఆరోపిస్తున్న వారి ఆరాధ్య దైవాలను వారు విశ్వసిస్తున్నారా. మరియు తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించి వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోరా ?!.
(68) అల్లాహ్ వైపునకు సాటిని కల్పించి లేదా ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన సత్యమును తిరస్కరించి అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్న వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. అవిశ్వాసపరుల కొరకు,వారి లాంటి వారి కొరకు నరకములో ఒక నివాస స్థలం ఉండటంలో ఏ సందేహము లేదు.
(69) మరియు ఎవరైతే స్వయంగా మా మన్నతులను ఆశిస్తూ పాటుపడుతారో (సహనమును చూపుతారో) వారికి మేము తప్పకుండా సన్మార్గమును చేరే భాగ్యమును కలిగిస్తాము. మరియు నిశ్చయంగా అల్లాహ్ సహాయము,సహకారము,సన్మార్గము ద్వారా సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.