36 - Yaseen ()

|

(1) (يسٓ) యా-సీన్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

(2) అల్లాహ్ ప్రమాణం చేస్తున్నాడు ఆ ఖుర్ఆన్ పై దేని వాక్యాలు అయితే నిర్దుష్టముగా చేయబడ్డాయో. మరియు దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు రాదు.

(3) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు అల్లాహ్ తన దాసుల వైపునకు వారికి తన తౌహీద్ గురించి,తన ఒక్కడి ఆరాధన గురించి ఆదేశించటానికి పంపించిన ప్రవక్తల్లోంచి వారు.

(4) (మీరు) సరళమైన పద్దతి పై,సరైన ధర్మం పై ఉన్నారు. మరియు ఈ సరళమైన పద్దతి,సరైన ధర్మం ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడైన,విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడైన నీ ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.

(5) (మీరు) సరళమైన పద్దతి పై,సరైన ధర్మం పై ఉన్నారు. మరియు ఈ సరళమైన పద్దతి,సరైన ధర్మం ఎవరూ ఆధిక్యత చూపలేని సర్వశక్తిమంతుడైన,విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడైన నీ ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.

(6) మీరు ఒక జాతి వారిని భయపెట్టటానికి,వారిని మీరు హెచ్చరించటానికి దాన్ని మేము మీ వైపునకు అవతరింపజేశాము. మరియు వారు ఆ అరబ్ వాసులు ఎవరి వద్దకైతే వారిని హెచ్చరించే ఏ ప్రవక్తా రాలేదో. మరియు వారు విశ్వాసము నుండి,ఏకేశ్వరోపాసన నుండి (తౌహీద్ నుండి) పరధ్యానంలో ఉండేవారు. మరియు ఇదే విధంగా హెచ్చరించటం తెగిపోయిన ప్రతీ జాతి పరిస్థితి ఉంటుంది. వారు తమను హెచ్చరించే ప్రవక్తల అవసరం కలవారు.

(7) వీరందరి కొరకు వారి వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఆయన ప్రవక్త నోట సత్యం చేరి,వారు దాన్ని విశ్వసించకుండా తమ అవిశ్వాసముపైనే ఉండిపోయిన తరువాత అల్లాహ్ వద్ద నుండి శిక్ష అనివార్యమైపోయింది. కాబట్టి వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచరు. మరియు వారు తమ వద్ద వచ్చిన సత్యము ప్రకారం ఆచరించరు.

(8) ఈ విషయంలో వారి ఉపామానము వారిలా ఉన్నది ఎవరి మెడలలో బేడీలు వేయబడి వారి చేతులు వారి మెడలతోపాటు వారి గడ్డాల యొక్క సమీకరించబడిన స్థలం క్రింద వరకు కలిపి కట్టబడి ఉన్నవి. కాబట్టి వారు తమ తలలను ఆకాశము వైపునకు ఎత్తవలసి వచ్చినది. కావున వారు వాటిని క్రిందకు దించలేక పోతున్నారు. అయితే వీరందరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం నుండి కట్టబడి ఉన్నారు. కనుక వారు అతనికి లొంగటం లేదు. మరియిు వారు అతని కోసం తమ తలలను క్రిందకు దించటంలేదు.

(9) మరియు మేము వారి ఎదుట సత్యము నుండి ఒక అడ్డుని ఏర్పాటు చేశాము మరియు వారి వెనుక ఒక అడ్డుని ఏర్పాటు చేశాము. మరియు మేము వారి చూపులను సత్యము నుండి కప్పివేశాము. కావున వారు దానితో ప్రయోజనం చెందే విధంగా చూడలేరు. అవిశ్వాసముపై వారి మొండితనము,మొరటతనము స్పష్టమైన తరువాత ఇది వారి కొరకు సంభవించినది.

(10) ఓ మొహమ్మద్ సత్యాన్ని వ్యతిరేకించే ఈ అవిశ్వాసపరులందరి వద్ద వారిని మీరు భయపెట్టినా లేదా భయపెట్టకపోయినా సమానమే. మీరు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని వారు విశ్వసించరు.

(11) నిశ్చయంగాఎవడైతే ఈ ఖుర్ఆన్ ను విశ్వసించి అందులో వచ్చిన వాటిని ఆచరించి, తనను ఎవరూ గమనించని వేళ ఏకాంతములో తన ప్రభువుతో భయపడుతాడో అతడే మీ హిచ్చరించటం నుండి ప్రయోజనం చెందుతాడు. కాబట్టి మీరు ఈ లక్షణములు కలవాడికి అతనికి సంతోషమును కలిగించే అల్లాహ్ అతని పాపములను తుడిచి వేయటం,వాటిని ఆయన మన్నించటం,పరలోకంలో అతని కొరకు నిరీక్షిస్తున్న గొప్ప పుణ్యం అది స్వర్గము గురించి మీరు తెలియపరచండి.

(12) నిశ్ఛయంగా మేము ప్రళయదినమున లెక్క తీసుకోవటం కొరకు వారిని మరల లేపటం ద్వారా మృతులను జీవింపజేస్తాము. మరియు ఇహలోక వారి జీవితంలో వారు చేసుకున్న సత్కర్మలను,దుష్కర్మలను మేము వ్రాస్తాము. మరియు వారి కొరకు ఉండే వారు మరణించిన తరువాత మిగిలిన వారి చిహ్నము కొనసాగే దానము (సదఖే జారియ) లాంటి సత్కర్మ లేదా అవిశ్వాసం లాంటి దుష్కర్మను వ్రాస్తాము. మరియు నిశ్ఛయంగా మేము ప్రతీ దాన్ని ఒక స్పష్టమైన గ్రంధంలో వ్రాసి ఉంచాము. అది లౌహె మహ్ఫూజ్.

(13) ఓ ప్రవక్తా ఈ మొండివారైన తిరస్కారులందరికి వారికి గుణపాఠమయ్యే ఒక ఉపమానమును ఇవ్వండి. అది బస్తీ వాసుల వారి వద్దకు వారి ప్రవక్తలు వచ్చినప్పటి గాధ.

(14) అప్పుడు మేము వారి వద్దకు మొదట్లో వారిని అల్లాహ్ తౌహీదు వైపునకు,ఆయన ఆరాధన వైపునకు పిలవటానికి ఇద్దరు ప్రవక్తలను పంపించాము. అప్పుడు వారు ఈ ఇద్దరి ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు మేము వారితోపాటు మూడవ ప్రవక్తను పంపించి వారికి బలం చేకూర్చాము. అప్పుడు ముగ్గురు ప్రవక్తలు బస్తీ వాసులతో ఇలా పలికారు : మేము ముగ్గరము మీ వైపునకు మిమ్మల్ని అల్లాహ్ తౌహీదు వైపునకు,ఆయన ధర్మమును అనుసరించటం వైపునకు పిలవటానికి ప్రవక్తలుగా పంపించబడ్డాము.

(15) బస్తీ వాసులు ప్రవక్తలతో ఇలా పలికారు : మీరు మా లాంటి మానవులు మాత్రమే. కనుక మీ కొరకు మాపై ఎటువంటి ప్రత్యేకత లేదు. అనంత కరుణామయుడు మీపై ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. మరియు మీరు కేవలం మీ ఈ పిలవటంలో అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నారు.

(16) ముగ్గురు ప్రవక్తలు బస్తీ వాసుల తిరస్కారమును ఖండిస్తూ ఇలా పలికారు : ఓ బస్తీ వాసులారా నిశ్ఛయంగా మా ప్రభువుకు మేము మీ వైపునకు ఆయన వద్ద నుండి ప్రవక్తలుగా పంపించబడ్డామని తెలుసు. ఈ విషయంలో ఆయన మా కొరకు వాదనగా చాలు.

(17) ఆయన మాకు చేరవేయమని ఆదేశించిన వాటిని స్పష్టంగా మీకు చేరవేయటం మాత్రమే మా బాధ్యత. మీకు సన్మార్గంపై తీసుకుని వచ్చే అధికారము మాకు లేదు.

(18) బస్తీ వాసులు ప్రవక్తలతో ఇలా పలికారు : నిశ్ఛయంగా మేము మీతో అపశకునమును పొందాము. ఒక వేళ మీరు తౌహీద్ వైపునకు మమ్మల్ని పిలవటమును విడనాడకపోతే మరణించే వరకు మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి శిక్షిస్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష తప్పకుండా చేరుతుంది.

(19) ప్రవక్తలు వారిని ఖండిస్తూ ఇలా పలికారు : అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసము,ఆయన ప్రవక్తలను అనుసరించటమును మీరు వదిలివేయటం వలన మీ అపశకునం మీతోనే అంటుకుని ఉంది. ఏమి ఒక వేళ మేము అల్లాహ్ గురించి మీకు హితబోధన చేస్తే మీరు దాన్ని అపశకునంగా భావిస్తున్నారా ?. అది కాదు మీరు అవిశ్వాసము,పాపకార్యములను పాల్పడటంలో మితిమీరిపోతున్న జనులు.

(20) మరియు బస్తీ నుండి దూర ప్రాంతము నుండి ఒక వ్యక్తి పరుగెడుతూ ప్రవక్తలను తిరస్కరించటం,వారిని హతమార్చటం,బాధపెట్టటం గురించి బెదిరించటంపై తన జాతి వారిపై భయపడి వచ్చాడు. అతను ఇలా పలికాడు : ఓ నా జాతి వారా మీరు ఈ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని అనుసరించండి.

(21) ఓ నా జాతి వారా మీరు తాను తీసుకుని వచ్చిన దాన్ని చేరవేయటంలో మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును కోరని వాడిని అనుసరించండి. మరియు వారు అల్లాహ్ నుండి చేరవేస్తున్న ఆయన వహీ విషయంలో సన్మార్గంపై ఉన్నారు. ఎవరైతే అలా ఉంటాడో అతడు అనుసరించబడటానికి యోగ్యుడు.

(22) హితోపదేశం చేసే ఆ వ్యక్తి ఇలా పలికాడు : ఏ ఆపే వస్తువు నన్ను సృష్టించిన అల్లాహ్ ఆరాధన చేయటం నుండి నన్ను ఆపుతుంది ?. మరియు ఏ ఆపే వస్తువు మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించటం నుండి ఆపుతుంది ?. మరణాంతరం లేపబడి ప్రతిఫలం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపు మరలించబడుతారు.

(23) ఏమీ నేను నన్ను సృష్టించిన అల్లాహ్ ను వదిలి అన్యాయంగా ఇతర ఆరాధ్య దైవాలను చేసుకోవాలా ?. ఒక వేళ అనంత కరుణామయుడు నాకు ఏదైన కీడు కలిగించదలిస్తే ఈ ఆరాధ్యదైవాల సిఫారసు కొంచము కూడా నాకు ఉపయోగపడదు. మరియు నాకు ఎటువంటి లాభము గాని నష్టము గాని చేసే అధికారము వారికి లేదు. మరియు ఒక వేళ నేను అవిశ్వాస స్థితిలో మరణిస్తే అల్లాహ్ నాకు కీడు కలగించదలచిన దాని నుండి వారు నన్ను రక్షించలేరు.

(24) నిశ్ఛయంగా నేను అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నప్పుడు నేను స్పష్టమైన తప్పిదములో ఉన్నాను ఎందుకంటే నేను ఆరాధనకు అర్హుడు కాని వాడిని ఆరాధించాను మరియు దానికి అర్హుడైన వాడి ఆరాధనను నేను వదిలివేసాను.

(25) ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను నా ప్రభువు,మీరందరి ప్రభవును విశ్వసించాను. అయితే మీరు నన్ను వినండి. మరియు మీరు నాకు బెదిరిస్తున్నహత్యను లెక్క చేయను. అయితే అతని జాతి వారి నుండి అతన్ను హత్య చేయటం తప్ప ఇంకేమి అవలేదు. అప్పుడు అల్లాహ్ అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు.

(26) అతని అమరగతినొందిన తరువాత అతనితో గౌరవంగా ఇలా పలకబడింది : నీవు స్వర్గంలో ప్రవేశించు. అతను స్వర్గంలో ప్రవేశించి అందులో ఉన్న అనుగ్రహాలను చూసి ఆశతో ఇలా పలుకాడు : అయ్యో నన్ను తిరస్కరించి,నన్ను హతమార్చిన నా జాతి వారు నాకు కలిగిన పాపముల మన్నింపుని, నా ప్రభువు నాకు కలిగించిన గౌరవమును చూసి ఉంటే ఎంత బాగుండేది. వారూ నేను విశ్వసించినట్లు విశ్వసించేవారు. నా ప్రతిఫలం లాంటి ప్రతిఫలమును వారు పొంది ఉండేవారు.

(27) అతని అమరగతినొందిన తరువాత అతనితో గౌరవంగా ఇలా పలకబడినది : నీవు స్వర్గంలో ప్రవేశించు. అతను స్వర్గంలో ప్రవేశించి అందులో ఉన్న అనుగ్రహాలను చూసి ఆశతో ఇలా పలుకాడు : అయ్యో నన్ను తిరస్కరించి,నన్ను హతమార్చిన నా జాతి వారు నాకు కలిగిన పాపముల మన్నింపుని, నా ప్రభువు నాకు కలిగించిన గౌరవమును చూసి ఉంటే ఎంత బాగుండేది. వారూ నేను విశ్వసించినట్లు విశ్వసించేవారు. నా ప్రతిఫలం లాంటి ప్రతిఫలమును వారు పొంది ఉండేవారు.

(28) అతన్ని తిరస్కరించి,అతన్ని హతమార్చిన అతని జాతి వారిని నాశనం చేసే విషయంలో మేము ఆకాశము నుండి అవతరింపజేసే దైవ దూతల సైన్యం మాకు అవసరం లేదు. వారి విషయం మా వద్ద దాని కన్న ఎక్కువ సులభము. అప్పుడు నిశ్చయంగా మేము ఆకాశము నుండి శిక్ష దూతలను దించకుండా ఒక అరుపు ద్వారా వారి వినాశనమవటమును నిర్ణయించాము.

(29) అతని జాతి వారి వినాశనము యొక్క గాధ ఒక్క అరుపు మాత్రమే. మేము దాన్ని వారిపై పంపించాము. తక్షణమే వారు నేలకొరిగిపోయి వారిలో నుండి ఎవరూ మిగలకుండా పోయారు. వారి ఉపమానం ఆ రగిలించబడి ఆరిపోయిన అగ్నిలా ఉన్నది. దాని ఆనుమాలు కూడా లేకుండా పోయాయి.

(30) అయ్యో ప్రళయదినమున తిరస్కారులైన దాసుల అవమానము మరియు వారి విచారము. ఎందుకంటే వారు శిక్షను చూస్తారు. ఇది ఎందుకంటే ఇహలోకములో వారి వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా అతన్ని వారు హేళన చేసేవారు. అతన్ని ఎగతాళి చేసేవారు. వారు అల్లాహ్ విషయంలో నిర్లక్ష్యం చేసిన దానికి ప్రళయదినమున వారి పరిణామము అవమానమయ్యింది.

(31) ఏమి ప్రవక్తలను తిరస్కరించే,హేళన చేసే వీరందరు తమ కన్న మునుపు గతించిన సమాజములలో గుణపాఠమును పొందలేదా ?. వారు మరణించారు. మరియు వారు ఇహలోకము వైపునకు ఇంకొక సారి ఎన్నటికి మరలి రారు. అంతే కాదు వారు చేసుకున్న కర్మలకు అప్పజెప్పబడ్డారు. మరియు తొందరలోనే అల్లాహ్ వాటి పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(32) మరియు సమాజములన్ని ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రళయదినాన మరణాంతరం వారి లేపబడిన తరువాత వారి కర్మలపరంగా మేము వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి మా వద్ద హాజరుపరచబడకుండా ఉండవు.

(33) మరియు మరణాంతరం లేపబడటం సత్యం అనటానికి తిరస్కారుల కొరకు మరణాంతరం లేపబడటమునకు సూచన : ఈ ఎండిన బంజరు భూమి దీనిపై మేము ఆకాశము నుండి వర్షమును కురిపించి అందులో రకరకాల మొక్కలను మొలకెత్తించాము. మరియు అందులో నుండి రకరకాల ధాన్యములను ప్రజలు వాటి నుండి తినటానికి వెలికి తీశాము. అయితే ఎవరైతే వర్షమును కురిపించి,మొక్కలను వెలికి తీసి ఈ భూమిని జీవింపజేయగలడో అతడు మృతులను జీవింపజేసి మరణాంతరం వారిని లేపటంపై సామర్ధ్యం కలవాడు.

(34) మరియు మేము వర్షమును కురిపించిన ఈ భూమిలో ఖర్జూరపు,ద్రాక్ష తోటలను తయారు చేశాము. మరియు అందులో వాటిని నీటిని సమకూర్చే నీటి ఊటలను ప్రవహింపజేశాము.

(35) ప్రజలు అల్లాహ్ వారిపై అనుగ్రహించిన ఈ తోటల ఫలముల నుండి తినటానికి. మరియు వారి కొరకు ఇందులో ఎటువంటి శ్రమ లేదు. ఏమీ వారు అల్లాహ్ కి అతని ఈ అనుగ్రహాలపై ఆయన ఒక్కడి ఆరాధన చేసి,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి కృతజ్ఞతలు తెలుపుకోరా ?!.

(36) రకరకాల మొక్కలను,వృక్షములను సృష్టించిన మరియు స్వయాన ప్రజల్లో నుంచి ఆడమగను సృష్టించినప్పుడు మరియు భూమిపై,సముద్రంలో,ఇతర వాటిలో ప్రజలకు తెలియని అల్లాహ్ యొక్క ఇతర సృష్టితాలను సృష్టించిన అల్లాహ్ అతీతుడు,మహోన్నతుడు.

(37) మరియు మేము పగలును తొలగించి,రాత్రిని దాని నుండి పగలును మేము తొలగించి తీసుకుని వచ్చి వెలుగును తొలగించటంలో ఆల్లాహ్ తౌహీద్ పై ప్రజలకు సూచన కలదు. మరియు మేము పగలు వెళ్ళిపోయిన తరువాత చీకటిని తీసుకుని వస్తాము. అప్పుడు ప్రజలు చీకటిలో ప్రవేశిస్తారు.

(38) మరియు నిర్ణీత కాలములో పయనిస్తున్న ఈ సూర్యుడు అల్లాహ్ ఏకత్వమునకు వారి కొరకు ఒక సూచన. దాని పరిమాణం అల్లాహ్ కు తెలుసు అతడు (సూర్యుడు) దాన్ని అతిక్రమించడు. ఈ నిర్ధారించిన విధానం ఎవరు ఆధిక్యతను కనబరచని సర్వశక్తిమంతుడి, తన సృష్టితాల వ్యవహారముల్లోంచి తనపై ఏదీ గోప్యంగా లేని సర్వజ్ఞుడి నిర్ధారించిన విధానం.

(39) మరియు వారి కొరకు పరిశుద్ధుడైన ఆయన ఏకత్వముపై సూచించే ఒక సూచన మేము ప్రతీ రాత్రి దశలను నియమించిన ఈ చంద్రుడు. అది చిన్నదిగా మొదలై ఆ తరువాత పెద్దదవుతుంది ఆ తరువాత చిన్నదిగా మారి చివరికి అది ఖర్జూరపు చెట్టు యొక్క ఆ రెమ్మ మాదిరిగా అయిపోతుంది ఏదైతే ఒంకరుగా ఉన్నది,తన సన్నదనములో,తన వంకరుతనంలో,తన పసుపుతనంలో,తన పాత అవటంలో చెరిపిపోయేలా ఉన్నది.

(40) మరియు సూర్య,చంద్రుల,రాత్రి,పగలుల సూచనలు అల్లాహ్ విధివ్రాతతో నిర్ధారించబడి ఉన్నవి. అయితే అవి తమ నిర్ధారిత వాటి నుండి అతిక్రమించవు. కాబట్టి సూర్యుడికి చంద్రుడిని దాని పయన మార్గమును మార్చి లేదా దాని కాంతిని తొలగించి కలవటం సాధ్యం కాదు. మరియు రాత్రికి పగటిలో దాని సమయం పూర్తవక మనుపు ప్రవేశించటం సాధ్యం కాదు. మరియు ఈ ఉపయుక్తంగా చేయబడిన సృష్టితాలు,వేరే అయిన నక్షత్రాలు,ఉల్కలు వాటి కొరకు ప్రత్యేకించబడిన వాటి పయన మార్గాలు ఉన్నవి. వాటిని అల్లాహ్ నియమించి ఉన్నాడు,వాటిని పరిరక్షిస్తున్నాడు.

(41) మరియు ఇదేవిధంగా మేము నూహ్ కాలములో ఆదమ్ సంతతిలో నుండి తుఫాను నుండి ముక్తి పొందిన వారిని అల్లాహ్ యొక్క సృష్టితాలతో నిండిన నావలో ఎక్కించటం వారి కొరకు అల్లాహ్ ఏకత్వము పై ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము. అల్లాహ్ అందులో ప్రతీ రకము నుండి రెండింటిని ఎక్కించాడు.

(42) మేము నూహ్ నావ లాంటి సవారీలను వారి కొరకు సృష్టించటం అల్లాహ్ తౌహీద్ పై వారి కొరకు ఒక సూచన మరియు ఆయన దాసులపై ఆయన అనుగ్రహము.

(43) మరియు ఒక వేళ మేము వారిని ముంచివేయదలచితే వారిని ముంచివేస్తాము. అప్పుడు వారికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు ఒక వేళ మేము వారిని ముంచదలిస్తే. మా ఆదేశముతో,మా తీర్పుతో వారు మునిగినప్పుడు వారిని రక్షించటానికి రక్షకుడెవడూ ఉండడు.

(44) వారు అదిగమించని ఒక నిర్ణీత కాలం వరకు వారు ప్రయోజనం చెందటం కొరకు మునగటం నుండి వారిని రక్షించి,వారిని మరలించి వారిపై మేము కరుణిస్తే తప్ప. బహుశా వారు గుణపాఠం నేర్చుకుని విశ్వసిస్తారేమో.

(45) మరియు విశ్వాసము నుండి విముఖత చూపే ముష్రికులందరితో ఇలా పలకబడినప్పుడు : మీరు ఎదుర్కోబోతున్న పరలోక విషయం, దాని ప్రతికూలత విషయంలో జాగ్రత్తపడండి. మరియు వెనుకకు మళ్ళిపోయే ఇహలోకముతో అల్లాహ్ మీపై తన కారుణ్యముతో ఉపకారము చేస్తాడని ఆశిస్తూ జాగ్రత్తపడండి. వారు దానికి కట్టుబడి ఉండలేదు. అంతే కాదు వారు దాన్ని లెక్క చేయకుండా దాని నుండి విముఖత చూపారు.

(46) మరియు ఎప్పుడైన మొండిగా వ్యవహరించే ఈ ముష్రికులందరి వద్దకు అల్లాహ్ ఏకత్వమును,ఆరాధనకు ఆయన ఒక్కడే యోగ్యుడవటమునకు సూచించే అల్లాహ్ ఆయతులు వస్తే వారు వాటితో గుణపాఠమును నేర్చుకోకుండా వాటి నుండి విముఖత చూపేవారు.

(47) మరియు మొండిగా వ్యవహరించే వారితో మీరు పేదవారికి,అగత్యపరులకు అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలో నుండి ఇచ్చి సహాయం చేయండి అని అనబడినప్పుడు వారు విశ్వసించిన వారితో తిరస్కరిస్తూ ఇలా పలుకుతూ వాపసు చేస్తారు : అల్లాహ్ ఎవరికైతే తినిపించదలచుకుంటే అతనికి తినిపిస్తాడో వాడిని మేము తివిపించాలా ?! కావున మేము ఆయన ఇచ్చకు విరుద్ధంగా చేయము. ఓ విశ్వాసపరులారా మీరు మాత్రం స్పష్టమైన తప్పిదములో,సత్యము నుండి దూరంగా ఉన్నారు.

(48) మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు దాన్ని తిరస్కరిస్తూ,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు : ఓ విశ్వాసపరులారా ఈ మరణాంతరం లేపబడటం ఒక వేళ మీరు అది వాటిల్లుతుంది అన్న మీ వాదనలో సత్యవంతులేనైతే ఎప్పుడో చెప్పండి ?!

(49) మరణాంతరము లేపబడటమును తిరస్కరించే,దాన్ని దూరంగా భావించే వీరందరు మాత్రం బాకాలో ఊదినప్పటి మొదటి ఊదటమునకు నిరీక్షిస్తున్నారు. వారు తమ ప్రాపంచిక కార్యాలైన క్రయ విక్రయలు,(తోటలకు) నీళ్ళను పెట్టటం,(జంతువులను) మేపటం ఇతర ప్రాపంచిక కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది.

(50) ఈ అరుపు వారిపై అకస్మాత్తుగా వచ్చినప్పుడు వారు ఒకరినొకరు వీలునామ వ్రాసుకోలేక పోతారు. మరియు వారు తమ ఇండ్లకు,తమ ఇంటివారి వద్దకు మరలి వెళ్ళలేకపోతారు. అంతేకాదు వారు తమ ఈ కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మరణిస్తారు.

(51) మరియు మరణాంతరం లేపటం కొరకు రెండవసారి బాకా ఊదినప్పుడు వారందరు తమ సమాధుల నుండి లెక్కతీసుకొనబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తమ ప్రభువు వైపునకు వేగముగా వెలికి వస్తారు.

(52) మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ అవిశ్వాసపరులందరు అవమానపడుతూ ఇలా అంటారు: అయ్యో మా దౌర్భాగ్యము మా సమాధుల నుండి మమ్మల్ని ఎవరు మరల లేపాడు ?!. వారి ప్రశ్న గురించి వారు ఇలా సమాధానమివ్వబడుతారు : అల్లాహ్ వాగ్దానం చేసినది ఇదే నిశ్చయంగా అది ఖచ్చితంగా జరిగినది. మరియు దైవ ప్రవక్తలు తమ ప్రభువు వద్ద నుండి చేరవేసిన దీని విషయంలో నిజం పలికారు.

(53) సమాధుల నుండి మరణాంతరం లేపబడే విషయం కేవలం బాకాలో రెండవసారి ఊదటం యొక్క ప్రభావము మాత్రమే. అంతే సృష్టితాలన్ని ప్రళయదినాన లెక్కతీసుకొనబడటం కొరకు మా వద్ద హాజరు చేయబడుతారు.

(54) ఆ రోజు తీర్పు న్యాయముతో జరుగును. ఓ దాసులారా మీ పాపములను అధికం చేసి లేదా మీ పుణ్యాలను తగ్గించి మీకు కొంచెము కూడా అన్యాయం చేయబడదు. ఇహలోకములో మీరు చేసుకున్న కర్మలకు మీరు పూర్తిగా ప్రతిఫలము మాత్రమే ప్రసాదించబడుతారు.

(55) నిశ్చయంగా స్వర్గవాసులు శాశ్వత అనుగ్రహాలను, గొప్ప సాఫల్యమును చూసినప్పుడు ప్రళయదినాన తమ ఇతర విషయాల గురించి నిశ్ఛింతగా ఉంటారు. వారు వాటిలో సుఖభోగాలను అనుభవిస్తూ సంతోషముగా ఉంటారు.

(56) వారు మరియు వారి సతీమణులు స్వర్గము యొక్క విశాలమైన నీడల క్రింద ఆసనాలపై కూర్చుని ఆస్వాదిస్తుంటారు.

(57) వారి కొరకు ఈ స్వర్గములో ద్రాక్ష,అంజూరము,దానిమ్మ లాంటి రకరకాల శ్రేష్టమైన ఫలములు ఉంటాయి. మరియు వారి కొరకు వారు కోరుకునే ప్రతీది ఇష్టపడే ప్రదేశముల్లోంచి,రకరకాల అనుగ్రహాల్లోంచి కలవు. వాటిలో నుంచి వారు ఏది కోరుకున్న అది లభిస్తుంది.

(58) మరియు వారి కొరకు ఈ అనుగ్రహాలపై సలాం వారికి కరుణామయుడైన తమ ప్రభువు వద్జ నుండి వారిపై మాటగా లభించును. ఎప్పుడైతే ఆయన వారికి సలాం చేస్తాడో ప్రతీ వైపు నుండి వారికి శాంతి కలుగును. మరియు వారికి అభినందన కలుగును దాని కన్న గొప్ప అభినందన ఏదీ ఉండదు.

(59) మరియు ప్రళయదినాన ముష్రికులతో ఇలా పలుకబడును : మీరు విశ్వాసపరుల నుండి వేరైపోండి. వారు మీతో పాటు కావటం వారికి తగదు. మీ ప్రతిఫలాలను వారి ప్రతిఫలాలతో మరియు మీ లక్షణాలను వారి లక్షణాలతో విబేధించటానికి.

(60) ఏమీ నేను మీకు నా ప్రవక్తల నోటితో మీకు ఆజ్ఞాపించి,ఆదేశించి మీతో ఇలా పలకలేదా : ఓ ఆదం సంతతివారా మీరు అన్ని రకాల అవిశ్వాస,పాప కార్యాలకు పాల్పడి షైతాను మాట వినకండి. నిశ్చయంగా షైతాను మీకు స్పష్టమైన శతృవు. తన శతృత్వమును బహిర్గతము చేసే శతృవుకు విధేయత చూపటం బుద్దిమంతుడికి ఎలా తగదు.

(61) ఓ ఆదం సంతతివారా నేను నా ఒక్కడి ఆరాధన చేయమని,నాతోపాటు ఎవరినీ సాటి కల్పించవద్దని మిమ్మల్ని ఆదేశించాను. నా ఒక్కడి ఆరాధన చేయటం,నాకు విధేయత చూపటం నా మన్నతకు,స్వర్గ ప్రవేశమునకు దారి తీసే తిన్నని మార్గము. కాని దేని గురించైతే నేను మీకు బోధించానో మరియు ఆదేశించానో వాటిని మీరు పాటించలేదు.

(62) మరియు నిశ్చయంగా షైతాను మీలో నుండి చాలా మంది సృష్టితాలను అపమార్గమునకు లోను చేశాడు. ఏ మీకు మీ ప్రభువుకు విధేయత చూపమని,పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి ఆరాధన చేయమని ఆదేశించే, మీకు స్పష్టమైన శతృవైన షైతాను విధేయత నుండి భయపెట్టే బుద్దులు లేవా ?!

(63) ఇది అదే నరకము దేని గురించైతే ఇహలోకములో మీ అవిశ్వాసం మూలంగా మీతో వాగ్దానం చేయబడిందో. మరియు అది మీ నుండి అదృశ్యంగా ఉండేది. మరియు మీరు ఈ రోజు దాన్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నారు.

(64) మీరు ఈ రోజు అందులో ప్రవేశించండి. మరియు ప్రాపంచిక మీ జీవితంలో అల్లాహ్ పట్ల మీరు కనబరచిన మీ అవిశ్వాసం మూలంగా దాని వేడితో బాధను అనుభవించండి.

(65) ఆ రోజు మేము వారి నోళ్ళపై ముద్ర వేస్తాము అప్పుడు వారు మూగవారై తాము పాల్పడిన అవిశ్వాసము,పాపాలను తిరస్కరించటం గురించి మాట్లాడరు. మరియు వారి చేతులు వాటితో ఇహలోకంలో చేసిన వాటి గురించి మాతో మాట్లాడుతాయి. మరియు వారి కాళ్ళు వారు పాల్పడే పాపాల గురించి,వాటి వద్ద నడిచి వెళ్ళిన దాన్ని గురించి సాక్ష్యం పలుకుతాయి.

(66) మరియు ఒక వేళ మేము వారి కళ్ళను పోగొట్టదలచితే వాటిని పోగొట్టుతాము. అప్పుడు వారు చూడలేరు. అప్పుడు వారు దారి వైపునకు దాని ద్వారా దాటి స్వర్గము వైపునకు వెళ్లటానికి పరుగెత్తుతారు. వారు దాటటం అసాధ్యం . వాస్తవానికి వారి చూపు పోయినది.

(67) మరియు ఒక వేళ మేము వారి సృష్టిని మార్చటమును,వారిని వారి కాళ్ళపై కూర్చోపెట్టటమును కోరుకుంటే మేము వారి సృష్టిని మార్చేవారము, వారిని వారి కాళ్ళ పై కూర్చోపెట్టేవారము. అప్పుడు వారు తమ స్థానమును విడిచిపెట్టలేరు. మరియు వారు ముందుకు వెళ్ళటంగాని వెనుకకు మరలటం గాని చేయలేరు.

(68) మరియు మేము ప్రజల్లోంచి ఎవరి ఆయుషును పొడిగించి అతని జీవితమును పొడిగిస్తామో అతన్ని మేము బలహీన దశకు మరలుస్తాము. ఏమీ వారు తమ బుద్ధులతో ఆలోచన చేసి ఈ నివాసము స్థిరమైన,శాశ్వతమైన నివాసము కాదని, స్థిరమైన నివాసము అది పరలోక నివాసమని గుర్తించటంలేదా.

(69) మరియు అతను కవి అన్న వాదన మీ కొరకు నిజం అవ్వటానికి మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమునకు కవిత్వమును నేర్పలేదు. మరియు ఆయనకు అది తగదు ఎందుకంటే అది ఆయన స్వభావము నుంచి కాదు. మరియు అతని స్వభావమునకు అది తగదు. ఆయనకు మేము కేవలం హితోపదేశమును,స్పష్టమైన ఖుర్ఆన్ ను దానిలో యోచన చేసే వారి కొరకు నేర్పించాము.

(70) ఆయన బ్రతికి ఉన్న హృదయం కలవాడికి,జ్ఞానోదయం ఉన్నవాడికి హెచ్చరించటానికి. అతడే దానితో ప్రయోజనం చెందుతాడు. మరియు అవిశ్వాసపరులపై శిక్ష నిరూపితమవుతుంది. అప్పుడు దాని అవతరణ గురించి, అతని సందేశము వారికి చేరవేయటం గురించి వారిపై వాదన నిరూపితమైనది. వారు వంక పెట్టటానికి ఎటువంటి వంక వారి కొరకు మిగల్లేదు.

(71) ఏమీ మేము వారి కొరకు పశువులను సృష్టించినది వారు చూడలేదా ?. వారు ఈ పశువులకు యజమానులు. వారు తమ ప్రయోజనాలకు తగిన విధంగా వాటిని ఉపయోగించుకుంటారు.

(72) మరియు మేము వాటిని వారి ఆదీనంలో చేశాము మరియు వాటిని వారికి కట్టుబడి ఉండేటట్లుగా చేశాము. వాటిలో నుండి కొన్నింటి వీపులపై వారు సవారీ చేస్తున్నారు మరియు తమ బరువులను మోయిస్తున్నారు. మరియు వాటిలో నుండి కొన్నింటి మాంసమును వారు తింటున్నారు.

(73) మరియు వారి కొరకు వాటి వీపులపై సవారీ చేయటం,వాటి మాంసములను తినటమే కాకుండా వాటి ఉన్ని,వాటి జుట్టు,వాటి వెంట్రుకలు,వాటి ధరలు లాంటి ప్రయోజనాలు కలవు. వాటి నుండి వారు దుప్పట్లను,వస్త్రాలను తయారుచేస్తున్నారు. మరియు వారి కొరకు వాటిలో పానియములు కలవు అప్పుడే వారు వాటి పాలును త్రాగుతున్నారు. ఏమీ వారు తమపై ఈ అనుగ్రహాలను,ఇతరవాటిని అనుగ్రహించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోరా ?.

(74) ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవములను తయారు చేసుకున్నారు. అవి తమకు సహాయం చేస్తాయని,తమకు అల్లాహ్ శిక్ష నుండి రక్షిస్తాయని ఆశిస్తూ వారు వాటిని ఆరాధిస్తున్నారు.

(75) వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలకు తమ స్వయానికి సహాయం చేసుకునే శక్తి లేదు. మరియు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించేవారికి సహాయం చేసే శక్తి లేదు. మరియు వారు,వారి విగ్రహాలు అందరు శిక్షలో హాజరుపరచబడుతారు. వారిలో నుండి ప్రతి ఒక్కడు ఇంకొకడి నుండి విసుగుని చూపుతాడు.

(76) ఓ ప్రవక్తా మీరు ప్రవక్తగా పంపించబడలేదన్న లేదా మీరు కవి అన్న వారి మాట మీకు బాధ కలిగించకూడదు. మరియు ఇతర వారి అపనిందలు. నిశ్చయంగా వారు వాటిలో నుండి దాచుతున్నవి,బహిర్గతం చేస్తున్నవి మాకు తెలుసు. వాటిలో నుండి ఏదీ మాపై గోప్యంగా ఉండవు. తొందరలోనే మేము వాటి పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.

(77) ఏమీ మరణాంతరం లేపబడే ఈ మనిషి యోచన చేయటంలేదా ? మేము అతడిని వీర్యముతో సృష్టించాము,ఆ తరువాత అతడు పుట్టి,పెరిగే వరకు వివిధ దశల నుండి పయనిస్తాడు ఆ తరువాత అతడు అధికముగా వాదించే వాడిగా,తగువులాడే వాడిగా అయిపోయాడు. ఏమీ అతడు మరణాంతరం లేపబడటము వాటిల్లిటములో ఆధారం చూపటానికి వీటిని చూడటంలేదా ?.

(78) ఈ అవిశ్వాసి మరణాంతరం లేపబడటము అసాధ్యము అని తెలపటంపై కృశించిపోయిన ఎముకల ద్వారా ఆధారమును చూపినప్పుడు పరధ్యానంలో పడిపోయాడు,అజ్ఞానుడైపోయాడు మరియు ఇలా పలికాడు : వాటిని ఎవరు మరలింపజేస్తాడు ?. వాస్తవానికి దాని నుండి దాని సృష్టి అదృశ్యంగా ఉన్నది అది ఉనికిలో లేనిది.

(79) ఓ ప్రవక్తా అతనికి మీరు సమాధానమిస్తూ ఇలా పలకండి : ఈ కృశించిపోయిన ఎముకలను వాటిని మొదటిసారి సృష్టించినవాడే జీవింపజేస్తాడు. కాబట్టి వాటిని మొదటిసారి సృష్టించిన వాడు వాటి వైపునకు జీవితమును మరల్చటం నుండి అశక్తుడవడు. మరియు పరిశుద్ధుడైన ఆయనకు ప్రతీ దాన్ని సృష్టించే జ్ఞానం కలదు. ఆయనపై దాని నుండి ఏది గోప్యంగా ఉండదు.

(80) ఓ ప్రజలారా ఆయనే మీ కొరకు పచ్చటి తడి చెట్ల నుండి అగ్నిని సృష్టించాడు మీరు దానిని దాని నుండి వెలికి తీస్తున్నారు. మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటున్నారు. అయితే ఎవరైతే రెండు విభిన్నమైన వాటి మధ్య అంటే పచ్చటి చెట్టు నీటి తడికి,అందులో మండే మంటకు మధ్య సమీకరించాడో అతడే మృతులను జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడు.

(81) ఏమీ ఆకాశములను,భూమిని వాటిలో ఉన్నవి పెద్దవైనా కూడా సృష్టించిన వాడికి మృతులను వారికి మరణమును కలిగించిన తరువాత జీవింపజేసే సామర్ధ్యం లేనివాడా ?. ఎందుకు కాదు అతనికి దాని సామర్ధ్యం కలదు. మరియు ఆయన సృష్టితాలన్నింటిని సృష్టించిన అధిక సృష్టికర్త. వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(82) కేవలం అల్లాహ్ ఆదేశం,పరిశుద్ధుడైన ఆయన వ్యవహారం ఎలా ఉండిద్దంటే ఆయన ఏదైన చేయదలచుకుంటే దాన్ని ఇలా అంటాడు : "నీవు అయిపో" అప్పుడు తాను కోరుకున్నది అయిపోతుంది. జీవింపజేయటం,మరణింపజేయటం,మరణాంతరం లేపటం మొదలగునవి ఆయన కోరుకునే వాటిలోంచివే.

(83) ముష్రికులు అల్లాహ్ కు అంటగడుతున్న నిస్సహాయత నుండి ఆయన పరిశుద్ధుడు,అతీతుడు. ఆయనే అన్ని వస్తువుల అధికారము కలవాడు వాటిలో తాను తలచుకున్న విధంగా నడిపిస్తాడు. మరియు ఆయన చేతిలోనే ప్రతీ వస్తువు యొక్క తాళములు కలవు. పరలోకములో మీరు ఆయన ఒక్కడివైపే మరలింపబడుతారు. అప్పుడు ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.