(1) ఓ ప్రవక్తా మీరు లేదా మీ సమాజము నుండి ఎవరైన తమ భార్యకు విడాకులు ఇవ్వదలచినప్పుడు ఆమె గడువు (ఇద్దత్) ఆరంభంలో ఆమెకు విడాకులివ్వండి. విడాకులు శుద్ధావస్తలో ఇవ్వాలి అందులో ఆమెతో సంబోగించకుండా ఉండాలి. ఆ గడువులో మీరు వారి వైపు మరలదలచుకుంటే మీ భార్యల వైపు మరలే అధికారం మీకు కలగటానికి. మరియు మీరు మీ ప్రభువైన అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మీరు విడాకులిచ్చిన స్త్రీలను వారు ఉన్న నివాసముల నుండి మీరు వెళ్ళగొట్టకండి. మరియు వారు కూడా తమ గడువు ముగియనంతవరకు స్వయంగా వెళ్ళిపోకూడదు. కాని ఒక వేళ వారు వ్యభిచారము లాంటి ప్రత్యక్షమైన అశ్లీల కార్యమునకు పాల్పడితే తప్ప. ఈ ఆదేశాలు అల్లాహ్ తన దాసుల కొరకు విధించిన హద్దులు. మరియు ఎవరైతే అల్లాహ్ హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన ప్రాణముపై దుర్మార్గమునకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు తన ప్రభువుకు అవిధేయత చూపటం వలన దాన్ని వినాశన స్థానములకు చేర్చాడు. ఓ విడాకులిచ్చేవాడా నీకు తెలియదు బహుశా అల్లాహ్ దీని తరువాత భర్త మనస్సులో ఆకర్షణను కలిగిస్తే అప్పుడు అతడు తన భార్య వైపుకు మరలుతాడు.
(2) వారి గడువు ముగిసే సమయం ఆసన్నమైనప్పుడు మీరు వారివైపు ప్రేమతో,మంచిగా వ్యవహరిస్తూ మరలండి లేదా వారి గడువు ముగిసేంత వరకు వారి వైపు మరలటమును వదిలి వేయండి. అప్పుడు వారికి తమపై పూర్తి అధికారముంటుంది, అది కూడా వారి కొరకు ఉన్న హక్కులను వారికి అప్పగించటంతో పాటు. మరియు మీరు వారి వైపు మరలదలచుకుంటే లేదా వారి నుండి విడిపోవదలచుకుంటే అప్పుడు మీరు తగాదాను అంతమొందించటానికి మీలో నుండి ఇద్దరు న్యాయవంతులైన సాక్షులను ఏర్పాటు చేసుకోండి. ఓ సాక్ష్యం పలికేవారా మీరు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సాక్ష్యం ఇవ్వండి. ఈ ప్రస్తావించబడిన ఆదేశాలతో అల్లాహ్ పై,ప్రళయదినం పై విశ్వాసమును చూపే వాడు హితోపదేశం గ్రహిస్తాడు. ఎందుకంటే అతడే హితోపదేశము ద్వారా ప్రయోజనం చెందుతాడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడతాడో అతడిని అల్లాహ్ అతడికి కలిగే ప్రతీ ఇబ్బంది నుండి,బాధ నుండి బయటపడే మార్గమును తయారు చేస్తాడు.
(3) మరియు ఆయన అతను ఆలోచించని మరియు అతని మనసులో లేని చోటు నుండి అతనికి ఆహారోపాధిని కలిగిస్తాడు. మరియు ఎవరైతే తన వ్యవహారాల్లో అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉంటాడో ఆయన అతనికి చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశమును చేసి తీరుతాడు. దేని నుండి కూడా ఆయన అశక్తుడు కాడు. మరియు ఏదీ ఆయన నుండి తప్పిపోదు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుకు నిర్ణీత లెక్కను ఉంచాడు. అది దానికి చేరుతుంది. కావున కష్టానికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. మరియు సుఖానికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. ఆ రెండిటిలో నుంచి ఏది కూడా మనిషిపై శాశ్వతంగా ఉండదు.
(4) మరియు ఆ విడాకులివ్వబడిన స్త్రీలు ఎవరైతే తమ వయస్సు అధికమవటం వలన రుతుస్రావము అవటం నుండి నిరాశులయ్యారో ఒక వేళ మీరు వారి గడువు ఎలా ఉంటుందని సందేహ పడితే వారి గడువు మూడు నెలలు. మరియు ఏ స్త్రీలైతే తమ చిన్న వయస్సు వలన రుతుస్రావ వయస్సుకు చేరలేదో వారి గడువు కూడా అలాగే మూడు నెలలు. మరియు గర్భిణీ స్త్రీలు విడాకుల వలన లేదా మరణం వలన వారి గడువు ముగింపు వారు తమ గర్భమును ప్రసవించినప్పుడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతాడో అల్లాహ్ అతని వ్యవహారములను అతని కొరకు సులభతరం చేస్తాడు. మరియు అతని కొరకు ప్రతీ కష్టతరమైన పనిని సులభం చేస్తాడు.
(5) ఈ ప్రస్తావించబడిన తలాఖ్ (విడాకులు),మరలింపు,గడువు ఆదేశాలు అల్లాహ్ ఆదేశము ఓ విశ్వాసపరులారా ఆయన దాన్ని మీ వైపునకు అవతరింపజేశాడు మీరు దాన్ని తెలుసుకోవటానికి. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతాడో ఆయన అతను పాల్పడిన అతని పాపములను తుడిచివేస్తాడు. మరియు ఆయన అతనికి పరలోకములో గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గములో ప్రవేశము. మరియు తరగని అనుగ్రహాలను పొందటం.
(6) ఓ భర్తల్లారా మీరు మీ స్థోమతను బట్టి మీరు నివాసం ఉన్న చోటే వారికి నివాసమును కల్పించండి. అల్లాహ్ మీపై దాని కన్న మించి భారం వేయడు. మరియు మీరు ఖర్చు చేసే విషయంలో గాని నివాసమును కల్పించే విషయంలో గాని ఇతర విషయముల్లో గాని వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశముతో వారికి కీడును కలిగించకండి. మరియు ఒక వేళ విడాకులివ్వబడిన స్త్రీలు గర్భవతులైతే వారు తమ గర్భమును ప్రసవించే వరకు వారిపై ఖర్చు చేయండి. ఒక వేళ వారు మీ కొరకు మీ సంతానమునకు పాలు త్రాపిస్తే వారు పాలు త్రాపించినందుకు వారికి ప్రతిఫలం ఇవ్వండి. ప్రతిఫలం విషయంలో ధర్మానుసారంగా పరస్పరం సంప్రదించుకోండి. ఒక వేళ భర్త భార్య ఆశించిన ప్రతిఫలం విషయంలో పిసినారి తనం చూపి మరియు ఆమె తాను ఆశించిన దానిపై తప్ప ఇష్టపడకుండా పిసినారి తనం చూపితే తండ్రి తన సంతానమునకు పాలు త్రాపించే వేరొక స్త్రీను ఏర్పాటు చేసుకోవాలి.
(7) ఎవరికైతే సంపదలో విశాలత్వం ఉన్నదో అతడు తాను విడాకులిచ్చిన స్త్రీ పై మరియు తన సంతానముపై తన స్తోమత ప్రకారం ఖర్చు చేయాలి. మరియు ఎవరి ఆహారోపాధి కుదించబడి ఉన్నదో అతడు అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానిలో మాత్రమే భారం వేస్తాడు. దానికి మించి అతనిపై భారం వేయడు. మరియు అతని సామర్ధ్యముకు మించి భారం వేయడు. తొందరలోనే అల్లాహ్ అతని క్లిష్టమైన,కష్టమైన స్థితిని విశాలత్వమును,ఐశ్వర్యమును కలిగింపజేస్తాడు.
(8) మరియు ఎన్నో నగర వాసులు పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశమును మరియు ఆయన ప్రవక్తలు అలైహిముస్సలాంల ఆదేశమును ధిక్కరించినప్పుడు మేము వారి దుష్కర్మలపై వారితో కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు మేము వారికి ఇహపరాల్లో అతి చెడ్డదైన శిక్షను విధించాము.
(9) కావున వారు తమ దుష్కర్మల పరిణామమును రుచి చూశారు. మరియు వారి ముగింపు ఇహలోకములో నష్టముగా మరియు పరలోకములో నష్టముగా జరిగినది.
(10) అల్లాహ్ వారి కొరకు తీవ్రమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. కావున ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను విశ్వసించిన బుద్ధిమంతులారా వారిపై దిగినది మీపై దిగనంతవరకు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వద్దకు హితోపదేశమును అవతరింపజేశాడు. అది మీకు ఆయన పై అవిధేయత యొక్క దుష్పరిణామమును మరియు ఆయన పై విధేయత యొక్క మంచి పరిణామమును గుర్తు చేస్తుంది.
(11) ఈ హితోపదేశం అతడు ఆయన వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త . ఆయన ఎటువంటి సందేహము లేని స్పష్టమైన అల్లాహ్ ఆయతులను వారికి చదివి వినిపిస్తున్నారు. అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, ఆయన ప్రవక్తను దృవీకరించి సత్కర్మలు చేసే వారిని అపమార్గపు చీకట్ల నుండి సన్మార్గపు వెలుగు వైపునకు ఆయన తీస్తారని ఆశిస్తూ. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేస్తారో వారిని అల్లాహ్ స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల ,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వాస్తవానికి అల్లాహ్ అతనకి మంచి ఆహారోపాధిని ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన అతన్ని అనుగ్రహాలు అంతం కాని స్వర్గములో అతన్ని ప్రవేశింపజేశాడు.
(12) అల్లాహ్ ఆయనే సప్తాకాశములను సృష్టించాడు. మరియు ఆయన సప్తాకాశములను సృష్టించినట్లే సప్త భూములను ఆయన సృష్టించాడు. వాటి మధ్య అల్లాహ్ యొక్క విశ్వ ,ధార్మిక ఆదేశము దిగుతుంది. అల్లాహ్ ప్రతీ వస్తువుపై సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ. ఆయనను ఏదీను అశక్తుడిని చేయదు. మరియు పరిశుద్ధుడైన ఆయన జ్ఞాన పరంగా ప్రతీ వస్తువును చుట్టుముట్టి ఉన్నాడు. ఆకాశముల్లోగాని భూమిలో గాని ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.