(1) మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి చీలిపోయినప్పుడు.
(2) మరియు నక్షత్రాలు రాలిపోయి చెల్లాచెదురైపోయినప్పుడు.
(3) మరియు సముద్రాలు ఒకదానిపై ఒకటి తెరవబడి కలిసిపోయినప్పుడు.
(4) మరియు సమాధులు అందులో ఉన్న మృతులు లేపబడటానికి వాటి మట్టి పెళ్ళగింపబడినప్పుడు.
(5) అప్పుడు ప్రతీ మనిషి తాను చేసుకున్న ఆచరరణను మరియు తాను చేయకుండా వెనుక వదిలేసిన ఆచరణను తెలుసుకుంటాడు.
(6) ఓ తన ప్రభువును తిరస్కరించే మానవుడా తన వద్ద నుండి దాతృతంగా నిన్ను శిక్షించటంలో తొందర చేయకుండా నీకు గడువునిచ్చిన నీ ప్రభువు ఆదేశమును విభేదించేటట్లు ఏది చేసింది ?.
(7) ఆయనే నీవు ఉనికిలో లేని తరువాత నీకు ఉనికిని ప్రసాదించాడు. మరియు నిన్ను సరైన,తగిన పరిమాణంలో ఉన్న అవయవాలు కలిగిన వాడిగా తీర్చి దిద్దాడు.
(8) ఆయన నిన్ను ఏ రూపంలో సృష్టించదలిచాడో ఆ రూపంలో నిన్ను సృష్టించాడు. మరియు నిశ్చయంగా ఆయన నిన్ను గాడిద రూపంలో గాని కోతి రూపంలో గాని కుక్క రూపంలో గాని ఇతర వాటిలా గాని సృష్టించకుండా నీపై ఉపకారం చేశాడు.
(9) ఓ నిర్లక్ష్యం వహించేవారా (మోసపోయినవారా) మీరు భావించినట్లు విషయం కాదు. కాని మీరు ప్రతిఫల దినమును తిరస్కరిస్తున్నారు. కావున మీరు దాని కొరకు ఆచరించటం లేదు.
(10) మరియు నిశ్ఛయంగా మీపై దైవదూతలు కనిపెట్టుకుని వారు మీ కర్మలను నమోదు చేస్తున్నారు.
(11) వారు అల్లాహ్ వద్ద గౌరవోన్నతులు,లేఖకులు మీ కర్మలను వ్రాస్తున్నారు.
(12) మీరు చేస్తున్న కర్మను వారు తెలుసుకుని దాన్ని వ్రాస్తున్నారు.
(13) నిశ్చయంగా మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు.
(14) మరియు నిశ్చయంగా పాపాలను చేసేవారు నరకాగ్నిలో ఉంటారు. అది వారిపై మండించబడుతుంది.
(15) వారు అందులో ప్రతిఫలదినమున ప్రవేశిస్తారు. దాని వేడిని కళ్ళారా చూస్తారు.
(16) వారు దాని నుండి ఎన్నటికి అదృశ్యమవరు. అంతే కాదు వారు అందులో శాశ్వతంగా ఉంటారు.
(17) ఓ ప్రవక్తా ప్రతిఫల దినం ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
(18) ఆ పిదప ప్రతిఫల దినం ఏమిటో మీకేమి తెలుసు ?!
(19) ఆ రోజు ఎవరూ ఎవరికి లాభం చేకూర్చ లేడు.ఆ రోజు పూర్తి వ్వవహారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న దానితో నిర్వహిస్తాడు. ఆయనకు తప్ప ఎవరికి చెందదు.