53 - An-Najm ()

|

(1) పరిశుద్ధుడైన ఆయన నక్షత్రము రాలినప్పుడు ప్రమాణం చేశాడు.

(2) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గము నుండి మరల లేదు మరియు ఆయన అపమార్గమునకు లోను కాలేదు కాని ఆయన హేతుబద్ధమైనవారు.

(3) మరియు ఆయన ఈ ఖుర్ఆన్ ను తన మనోవాంఛను అనుసరించి పలకలేదు.

(4) ఈ ఖుర్ఆన్ అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం మార్గము నుండి ఆయన వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన ఒక దైవవాణి మాత్రమే.

(5) మహా బలవంతుడు ఒక దూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం దాన్ని ఆయనకు నేర్పించాడు.

(6) మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం మంచి రూపము కలవారు. మరియు ఆయన అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు అల్లాహ్ ఆయనను సృష్టించిన రూపములో (నిజ రూపములో) ప్రత్యక్షమై నిలబడ్డారు.

(7) మరియు జిబ్రయీల్ ఆకాశపు ఎత్తైన అంచులపై ఉన్నారు.

(8) ఆ తరువాత జిబ్రయీల్ అలైహిస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమునకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు.

(9) ఆయనకు ఆయన దగ్గరవ్వటం రెండు విల్లులంత లేదా దానికి ఇంచుమించుగా ఉన్నది.

(10) అప్పుడు జిబ్రయీల్ అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు దైవవాణి చేర్చవలసినది చేర్చారు.

(11) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయం ఆయన చూపులు చూసిన దాన్ని అబద్దమనలేదు.

(12) ఓ ముష్రికులారా అల్లాహ్ ఆయనను రాత్రివేళ తీసుకుని వెళ్ళి ఆయనకు చూపిన దాని విషయంలో మీరు ఆయనతో వాదులాడుతున్నారా ?!

(13) మరియు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను రెండవ సారి ఆయన నిజరూపములో ఆయనకు రాత్రి వేళ తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు.

(14) సిద్రతుల్ ముంతహా (చివరి హద్దుల్లో ఉన్న రేగు చెట్టు) వద్ద. ఏడవ ఆకాశములో ఉన్న చాలా గొప్ప వృక్షము అది.

(15) ఆ వృక్షము వద్దనే జన్నతుల్ మావా (స్వర్గ ధామం) కలదు.

(16) అప్పుడు సిద్రహ్ ను అల్లాహ్ ఆదేశముతో ఒక గొప్ప వస్తువు కప్పివేస్తుంది. దాని వాస్తవికత అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు.

(17) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపులు కుడి యడమలకు వాలనూ లేదు మరియు ఆయనకి నిర్ణయించిన హద్దులను అతిక్రమించలేదు.

(18) వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను గగన యాత్ర చేయించబడిన రాత్రి తన ప్రభువు సామర్ధ్యమును సూచించే గొప్ప సూచనలను చూశారు. అప్పుడు ఆయన స్వర్గమును చూశారు మరియు నరకమును ఇతరవాటిని చూశారు.

(19) ఓ ముష్రికులారా మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు లాత్ మరియు ఉజ్జాలను గురించి ఆలోచించారా.

(20) మరియు మీ విగ్రహాల్లోంచి మూడవదైన ఇంకొకటి మనాత్ ను గరించి. నాకు చెప్పండి మీరు అవి మీకు ఏదైన ప్రయోజనం గాని నష్టం గాని కలిగించే అధికారం కలవా ?!

(21) ఓ ముష్రికులారా మీకు మీరు ఇష్డపడే మగ సంతానమా మరియు పరిశుద్ధుడైన ఆయనకు మీరు ఇష్టపడని ఆడ సంతానమా ?!.

(22) మీ ఇచ్ఛానుసారం మీరు పంచిన ఈ పంపకము ఒక అన్యాయమైన పంపకం.

(23) ఈ విగ్రహాలు కొన్ని అర్దరహిత పేర్లు మాత్రమే. దైవత్వ గుణముల్లో వాటికి ఎటువంటి భాగము లేదు. వాటిని మీరు మీ తాత ముత్తాతలు మీ స్వయంతరపు నుండి పేర్లు పెట్టుకున్నారు. వాటి గురించి అల్లాహ్ ఎటువంటి ఆధారము అవతరింపజేయలేదు. ముష్రికులు తమ మనసులు కోరిన తమ హృదయములలో షైతాను అలంకరించిన విశాసములను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు వద్ద నుండి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైైహి వసల్లం నాలుక ద్వారా వారి వద్దకు సన్మార్గము వచ్చినది. కాని వారు ఆయన ద్వారా మార్గము పొందలేదు.

(24) లేదా మానవునికి తాను ఆశించిన విగ్రహాల సిఫారసు అల్లాహ్ యందు కలదా ?!

(25) లేదు అతను ఆశించినది అతనికి లభించదు. పరలోకము మరియు ఇహలోకము అల్లాహ్ దే. వాటిలో నుండి ఆయన తాను కోరిన దాన్ని ఇస్తాడు మరియు తాను కోరిన దాన్ని ఆపుతాడు.

(26) మరియు ఆకాశముల్లో ఎందరో దూతలున్నారు ఒక వేళ వారు ఎవరికోసమైన సిఫారసు చేయదలచితే వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు కాని అల్లాహ్ వారిలో నుంచి ఎవరికి తలచుకుని సిఫారసు చేసే అనుమతించిన తరువాత మరియు దానికి సిఫారసు చేయబడే వాడి నుండి ప్రసన్నుడు అయితే తప్ప. అల్లాహ్ సాటి కల్పించే వారి కొరకు సిఫారసు చేసే అనుమతివ్వడు మరియు అల్లాహ్ ను వదిలి అతను ఆరాధించే ఆతని సిఫరసు చేయబడే వాడి నుండి ఆయన ప్రసన్నుడవడు.

(27) నిశ్చయంగా పరలోక నివాసములో మరల లేపబడటం గురించి విశ్వసించని వారు దైవదూతలను వారు అల్లాహ్ కుమార్తెలు అన్న తమ విశ్వాసముతో స్త్రీల పేర్లను పెట్టుకున్నారు. అల్లాహ్ వారి మాటల నుండి ఎంతో మహోన్నతుడు.

(28) మరియు వారికి వారిని స్త్రీలుగా పేర్లు పెట్టుకోటానికి ఎటువంటి ఆధారపూరితమైన జ్ఞానం లేదు. వారు ఈ విషయంలో ఊహగానాలను మరియు భ్రమను మాత్రమే అనుసరిస్తున్నారు. భ్రమ సత్యం విషయంలో దాని స్థానములో నిలబడనంతవరకు ప్రయోజనం కలిగించదు.

(29) ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ స్మరణ నుండి వీపు త్రిప్పుకుని,దాని గురించి పట్టించుకోని మరియు ఇహలోక జీవితమునే ఆశించే వ్యక్తి నుండి మీరు ముఖం త్రిప్పుకోండి. అతడు తన పరలోకం కొరకు ఆచరించడు. ఎందుకంటే అతడు దాన్ని విశ్వసించడు.

(30) ఈ ముష్రికులందరు దైవదూతలను స్త్రీల పేర్లు పెట్టి ఏదైతే పలుకుతున్నారో వారు చేరే వారి జ్ఞాన పరిధి. ఎందుకంటే వారు అజ్ఞానులు. వారు వాస్తవమునకు చేరలేదు. ఓ ప్రవక్తా నిశ్చయంగా సత్య మార్గము నుండి మరలిపోయిన వారి గురించి మీ ప్రభువుకే బాగా తెలుసు. మరియు ఆయన మార్గమును పొందే వారి గురించి ఆయనకే బాగా తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.

(31) ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అధికారక పరంగా, సృష్టి పరంగా మరియు కార్య నిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఇహలోకము దుష్కర్మలు చేసిన వారికి యోగ్యమైన శిక్షను కలిగించటానికి మరియు సత్కర్మలు చేసిన విశ్వాసపరులకు స్వర్గమును ప్రసాదించటానికి.

(32) మరియు ఎవరైతే చిన్న పాపములు కాకుండా పెద్ద పాపముల నుండి మరియు అసహ్యకరమైన పాపముల నుండి దూరంగా ఉంటారో ఇవి (చిన్న పాపములు) పెద్ద పాపములను వదిలి వేయటం వలన,విధేయత కార్యములను అధికంగా చేయటం వలన మన్నించబడుతాయి. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు విశాలమైన మన్నింపు కలవాడు. ఆయన తన దాసుల పాపములను వారు వాటి నుండి మన్నింపు వేడుకున్నప్పుడు మన్నిస్తాడు. పరిశుద్ధుడైన ఆయనకు మీ స్థితులను గురించి మరియు మీ వ్యవహారముల గురించి మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించబడినప్పుడు మరియు మీరు మీ మాతృ గర్భముల్లో పిండములుగా ఉండి పుట్టుక తరువాత సృష్టించబడినప్పుడు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పై మీరు స్వయంగా దైవభీతిపరులని గొప్పగా చెప్పుకోకండి. పరిశుద్ధుడైన ఆయనకు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడే వారి గురించి బాగా తెలుసు.

(33) ఇస్లాం నుండి అది దగ్గరైన తరువాత విముఖత చూపిన వాడి దుర్భర స్థితిని మీరు చూశారా ?.

(34) మరియు అతడు సంపద నుండి కొద్దిగా ఇచ్చి ఆ తరువాత ఆగిపోయాడు ఎందుకంటే పిసినారితనం అతని తీరు. అయినా కూడా అతడు తన గొప్పలు చెప్పుకునేవాడు.

(35) ఏమీ అతను చూడటానికి మరియు అగోచర విషయాలు మాట్లాడటానికి అతని వద్ద అగోచర జ్ఞానమున్నదా ?!.

(36) లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడా ? లేదా అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్న ఇతడికి అల్లాహ్ మూసాపై అవతరింపజేసిన మొదటి గ్రంధముల్లో ఉన్న వాటి గురించి తెలియపరచబడలేదా ?.

(37) మరియు తన ప్రభువు తనకు ఇచ్చిన బాధ్యతలన్నింటిని నెరవేర్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం గ్రంధముల్లో.

(38) ఏ మనిషి ఇతరుల పాప బరువును మోయడని.

(39) మరియు మనిషికి తాను చేసుకున్న కర్మల ప్రతిఫలం మాత్రమే ఉంటుందని.

(40) మరియు అతడు తొందరలోనే తన కర్మను ప్రళయదినమున కళ్ళారా చూపబడుతుందని.

(41) ఆ తరువాత అతని కర్మ ప్రతిఫలం ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది.

(42) ఓ ప్రవక్తా దాసుని మరలే చోటు,వారి గమ్య స్థానము వారి మరణము తరువాత నీ ప్రభువు వైపే ఉంటుందని.

(43) మరియు ఆయనే తాను నవ్వింపదలచిన వారికి నవ్వించే వాడని మరియు తాను బాధ కలిగించదలచిన వాడిని ఏడ్పిస్తాడని.

(44) మరియు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్న వారికి మరణమును కలిగిస్తాడని మరియు మృతులను మరణాంతరం లేపి జీవింపజేస్తాడని.

(45) మరియు ఆయన ఆడ,మగ రెండు జంటలను సృష్టించాడని,

(46) విర్య బిందువు నుండి అది మాతృ గర్భంలో ఉంచబడినప్పుడు.

(47) మరియు వారి మరణం తరువాత మరణాంతరం లేపటం కొరకు వారిద్దరి సృష్టిని మరలింపజేయటం ఆయనపై ఉన్నదని.

(48) మరియు నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి తాను తలచిన వారికి సంపదలో అధికారమును ప్రసాదించి సంపన్నులుగా చేసేవాడు మరియు ప్రజల్లోంచి సంపద పట్ల తృప్తి చెందే విధంగా సంపదను ప్రసాదించేవాడని.

(49) మరియు ఆయనే ముష్రికుల్లోంచి కొందరు అల్లాహ్ తో పాటు ఆరాధించే షిఅ్'రా నక్షత్రమునకు ప్రభువు అని.

(50) మరియు ఆయనే హూద్ జాతి వారైన తొలి ఆద్ ను వారు తమ అవిశ్వాసంపై మొండిగా వ్యవహరించినప్పుడు నాశనం చేశాడని.

(51) మరియు ఆయన సాలిహ్ జాతి సమూద్ ను వారిలో నుండి ఏ ఒక్కరిని మిగల్చకుండా తుదిముట్టించాడని.

(52) మరియు ఆయన ఆద్,సమూద్ కన్న ముందు నూహ్ జాతివారిని నాశనం చేశాడు. నిశ్చయంగా నూహ్ జాతి వారు ఆద్ మరియు సమూద్ కన్న పరమ దుర్మార్గులుగా మరియు అధికంగా మితిమీరేవారిగా ఉండే వారు. ఎందుకంటే నూహ్ వారి మధ్య తొమ్మిదొందల యాభై సంవత్సరాలు అల్లాహ్ ఏకత్వము వైపునకు పిలుస్తూ ఉన్నారు. కాని వారు ఆయన మాటను స్వీకరించలేదు.

(53) మరియు లూత్ జాతి వారి బస్తీలను ఆకాశము వైపునకు ఎత్తి ఆ తరువాత వాటిని తిరిగేశాడు. ఆ తరువాత వాటిని భూమి వైపునకు పడవేశాడు.

(54) ఆ తరువాత వాటిని ఆకాశము వైపునకు ఎత్తి భూమిపై పడవేసిన తరువాత వాటిపై క్రప్పవలసిన రాళ్ళతో క్రప్పివేశాడు.

(55) ఓ మానవుడా అయితే నీవు నీ ప్రభువు సామర్ధ్యముపై సూచించే ఏ ఏ సూచనలను వాటి ద్వారా హితోపదేశం స్వీకరించకుండా వాదులాడుతావు ?.

(56) మీ వైపునకు పంపించబడ్డ ఈ ప్రవక్త తొలి ప్రవక్తల కోవకు చెందినవాడే.

(57) దగ్గరయ్యే ప్రళయం దగ్గరైనది.

(58) దాన్ని తొలగించే వాడు మరియు దాని గురించి తెలుసుకునేవాడు అల్లాహ్ మాత్రమే.

(59) ఏమీ మీకు చదివి వినిపించబడే ఈ ఖుర్ఆన్ గురించి అది అల్లాహ్ వద్ద నుండి అవటం విషయంలో మీరు ఆశ్ఛర్యపోతున్నారా ?!

(60) మరియు దానిపై పరిహాసంగా మీరు నవ్వుతున్నారు మరియు మీరు దాని హితోపదేశాలను విన్నప్పుడు ఏడవటంలేదు ?!

(61) మరియు మీరు దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దాన్ని పట్టించుకోవటంలేదు.

(62) అయితే మీరు ఒక్కడైన అల్లాహ్ కు సాష్టాంగపడండి మరియు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించండి.