72 - Al-Jinn ()

|

(1) ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారితో ఇలా పలకండి : నఖ్లా ప్రాంతంలో జిన్నుల్లోంచి ఒక వర్గము నేను ఖుర్ఆన్ ను పటిస్తుండగా విన్నదని అల్లాహ్ నాకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు. వారు తమ జాతి వారి వైపునకు మరలి వెళ్ళినప్పుడు వారితో ఇలా పలికారు : నిశ్చయంగా మేము తన స్పష్టపరచటంలో మరియు తన వాక్చాతుర్యంలో విచిత్రమైన చదవబడిన ఒక వాక్కును విన్నాము.

(2) మేము విన్న ఈ వాక్కు విశ్వాసం విషయంలో మరియు మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో సరైన దానిపై సూచిస్తుంది. కాబట్టి మేము దాన్ని విశ్వసించాము. మరియు మేము దాన్ని అవతరించిన మా ప్రభువుతో పాటు ఎవరిని సాటి కల్పించము.

(3) మరియు మేము విశ్వసించాము ఎందుకంటే - మా ప్రభువు ఔన్నత్యము మరియు ఆయన వైభవము అత్యున్నతమైనది - ఆయన ముష్రికులు అంటున్నట్లుగా భార్యను గాని సంతానమును గాని చేసుకోలేదు.

(4) మరియు ఇబ్లీసు అల్లాహ్ పై పరిశుద్ధుడైన ఆయనకు భార్యను మరియు సంతానమును అంటగట్టి వికృత మాటలు పలుకుతున్నాడు.

(5) మానవుల్లోంచి మరియు జిన్నుల్లోంచి ముష్రికులు ఆయనకు భార్య మరియు సంతానం ఉన్నదని వాదించినప్పుడు వారు అబద్దం పలకటం లేదని మేము భావించాము. అప్పుడు మేము వారిని అనుకరిస్తూ వారి మాటలను నిజమని నమ్మాము.

(6) మరియు అజ్ఞాన కాలంలో మానవుల్లోంచి కొందరు పురుషులు భయానక ప్రదేశంలో బస చేసినప్పుడు జిన్నల్లోంచి కొందరు పురుషులతో శరణు వేడుకునేవారు. అప్పుడు వారిలో నుండి ఒకడు ఇలా పలికే వాడు : నేను ఈ ప్రాంతపు నాయకునితో అతని జాతివారి యొక్క మూర్ఖుల కీడు నుండి శరణు వేడుకుంటున్నాను. అప్పుడు మానవుల్లోంచి పురుషులకు జిన్నుల్లోంచి పురుషుల నుండి భయం అధికమైపోయింది.

(7) ఓ జిన్నుల్లారా మీరు అనుకున్నట్లే మానువులు కూడా అల్లాహ్ ఎవరినీ అతని మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపడని భావించారు.

(8) మరియు మేము ఆకాశం యొక్క వార్తలను అడిగాము, మరియు ఆకాశం దైవదూతల యొక్క బలమైన కాపలాతో నిండినట్లు మేము కనుగొన్నాము. వారు మేము చేస్తున్న విన్న వాటిని దోచుకుని పోయే కార్యం నుండి వారు దాన్ని కాపలాకాస్తున్నారు. మరియు అది (ఆకాశం) భగభగ మండే అగ్ని జ్వాలలతో నిండి పోయి ఉంది ఆకాశమునకు దగ్గర వెళ్ళే ప్రతి ఒక్కడి పై అవి విసరబడుతున్నాయి.

(9) మరియు మేము గతంలో ఆకాశములో స్థానములను ఏర్పరచుకుని అక్కడ నుండి దైవ దూతలు పరస్పరం చర్చించుకునే మాటలను వినే వారము. అప్పుడు వాటి గురించి మేము భూలోకవాసుల్లోంచి జ్యోతిష్యులకు సమాచారమిచ్చేవారము. ఇప్పుడు విషయం మారినది. ఇప్పుడు మనలో నుంచి ఎవరైన వింటే అతడు తన కొరకు సిద్ధం చేసి ఉంచిన మండే అగ్నిని పొందుతాడు. ఎప్పుడైతే అతడు దగ్గరకు వెళతాడో అది అతనిపై పంపించబడును. అప్పుడు అది అతడిని దహించివేస్తుంది.

(10) ఈ పతిష్టమైన కాపలాకి కారణం ఏమిటో మాకు తెలియదు. భూవాసులకి కీడు చేసే ఉద్దేశించబడినదా లేదా అల్లాహ్ వారికి మేలు చేయదలచాడా. నిశ్చయంగా ఆకాశ సమాచారం మా నుండి తెగిపోయినది.

(11) మేము జిన్నుల సమాజమునకు చెందినవారము. మాలో నుండి దైవభీతి కలవారు,పుణ్యాత్ములు ఉన్నారు. మరియు మాలో నుండి అవిశ్వాసులు,అవిధేయులు ఉన్నారు. మేము వేరువేరు రకాలుగా మరియు విభిన్న ఇష్టాలు కలవారిగా ఉండేవారము.

(12) పరిశుద్ధుడైన అల్లాహ్ మా పట్ల ఏదైన విషయమును నిర్ణయించుకున్నప్పుడు మేము ఆయన నుండి తప్పించుకోలేమని పూర్తిగా నమ్మాము. మరియు ఆయన మమ్మల్ని చుట్టుముట్టి ఉండటం వలన మేము పారిపోయి ఆయన నుండి ఖచ్చితంగా తప్పించుకోలేము.

(13) మరియు నిశ్ఛయంగా మేము సవ్యమైన మార్గమును చూపించే ఖుర్ఆన్ ను విన్నప్పుడు దాన్ని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తాడో అతడు తన పుణ్యాలు తరుగుతాయని మరియు తన పూర్వ పాపాలతో వేరే పాపము అంటగట్టబడుతుందని భయపడడు.

(14) మరియు నిశ్చయంగా మాలో నుండి అల్లాహ్ కు విధేయులమైన ముస్లిములు ఉన్నారు. మరియు మాలో నుండి సత్యమైన మరియు స్థిరమైన మార్గము నుండి దూరమైనవారు ఉన్నారు. ఎవరైతే విధేయతతో మరియు సత్కర్మతో అల్లాహ్ కు వినయంగా ఉంటారో వారందరు సన్మార్గమును మరియు సరైన మార్గమును నిర్ణయించుకున్నారు.

(15) మరియు సత్యమార్గము నుండి మరియు స్థిర మార్గము నుండి దూరమైన వారు నరకమునకు ఇందనమవుతారు. అది వారి లాంటి జనులతో వెలిగించబడుతుంది.

(16) జిన్నుల్లోంచి ఒక వర్గము విన్నదని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచినట్లే ఒక వేళ జిన్నులు మరియు మానవులు ఇస్లాం మార్గముపై స్థిరంగా ఉండి అందులో ఉన్న వాటిని ఆచరిస్తే అల్లాహ్ వారికి అధికంగా నీటిని త్రాపిస్తాడని మరియు రకరకాల అనుగ్రహాలను ఎక్కువగా ప్రసాదిస్తాడని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు.

(17) వారు అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారా లేదా వాటి వట్ల కృతఝ్నులవుతారా అందులో మేము వారిని పరీక్షించటం కొరకు. మరియు ఎవరైతే ఖుర్ఆన్ నుండి మరియు అందులో ఉన్న ఉపదేశాల నుండి విముఖత చూపుతాడో అతడిని అతడి ప్రభువు కఠినమైన శిక్షలో ప్రవేశింపజేస్తాడు దాన్నిమోసే శక్తి అతనికి ఉండదు.

(18) మరియు నిశ్ఛయంగా మస్జిదులు పరిశుద్ధుడైన ఆయన కొరకే ఇతరుల కొరకు కాదు. కావున మీరు అందులో అల్లాహ్ తో పాటు ఎవరిని ఆరాధించకండి. అప్పుడు మీరు తమ ఆరాధనాలయాలు,తమ చర్చుల విషయంలో యూదులు,క్రైస్తవులవలే అయిపోతారు.

(19) మరియు అల్లాహ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నఖ్లా ప్రాంతములో తన ప్రభువును ఆరాధిస్తూ నిలబడినప్పుడు జిన్నులు ఆయన ఖుర్ఆన్ పఠనమును వారు విన్నప్పుడు రద్ది తీవ్రత వలన ఆయనపై దాదాపుగా కిక్కిరిసిపోయినట్లు ఉన్నారు.

(20) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : నేను ఒక్కడైన నా ప్రభువును మాత్రమే ఆరాధిస్తాను. మరియు నేను అతనితో పాటు ఇతరులను సాటి కల్పించను (ఆ ఇతరులు) ఎవరైనా అయినా సరే.

(21) మీరు వారితో ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ మీ పై విధివ్రాతలో వ్రాసి పెట్టిన ఎటువంటి కీడును మీ కొరకు తొలగించే అధికారం నాకు లేదు. మరియు అల్లాహ్ మీ నుండి ఆపివేసిన ఏ ప్రయోజనమును తీసుకుని వచ్చే అధికారము నాకు లేదు.

(22) మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయత చూపితే అల్లాహ్ నుండి నన్ను ఎవరు రక్షించలేరు. మరియు నేను ఆశ్రయం పొందటానికి ఆయన కాకుండా ఏ ఆశ్రయమును నేను పొందలేను.

(23) కాని నన్ను అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మరియు నాకు మీ వైపునకు ఇచ్చి పంపించిన ఆయన సందేశములను మీకు చేరవేసే అధికారం నాకు కలదు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతాడో అతడి పరిణామం నరకంలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశము. అందులో నుండి అతడు ఎన్నటికి బయటకు రాలేడు.

(24) మరియు అవిశ్వాసపరులు తమ అవిశ్వాసముపైనే కొనసాగుతారు చివరికి వారు తమకు ఇహలోకంలో వాగ్దానం చేయబడిన శిక్షను ప్రళయదినమున కళ్ళారా చూసినప్పుడు. అప్పుడు వారు సహాయపరంగా ఎవరు ఎక్కువ బలహీనుడో వారు తొందరలోనే తెలుసుకుంటారు. మరియు సహాయం చేయటానికి సంఖ్యాపరంగా ఎవరు తక్కువో వారు త్వరలోనే తెలుసుకుంటారు.

(25) ఓ ప్రవక్తా మరణాంతరమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీతో వాగ్దానం చేయబడిన శిక్ష దగ్గరలో ఉన్నదో లేదా దానికి అల్లాహ్ కు మాత్రమే తెలిసిన సమయం ఉన్నదో నాకు తెలియదు.

(26) పరిశుద్ధుడైన ఆయన అగోచర విషయాలన్నింటిని తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన అగోచర జ్ఞానం గురించి ఆయన ఎవరికి తెలియపరచడు. అంతేకాదు అది ఆయన జ్ఞానంతో ప్రత్యేకించబడి ఉంటుంది.

(27) కాని పరిశుద్ధుడైన ఆయన తాను ఇష్టపడిన ప్రవక్తకు మాత్రమే (తెలియపరుస్తాడు). నిశ్చయంగా ఆయన దాని గురించి తాను తలచిన వారికి తెలియపరుస్తాడు. మరియు ఆయన ప్రవక్త ముందు దైవదూతలను కాపలాగా పంపిస్తాడు వారు దాన్ని ప్రవక్త కాకుండా ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకు పరిరక్షిస్తారు.

(28) ప్రవక్త తన కన్నా మునుపటి ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని వారికి వారి ప్రభువు ఆదేశించినటువంటి తమ ప్రభువు సందేశాలను అల్లాహ్ చుట్టూ ఉంచిన పరిరక్షణ వలన మరియు దైవదూతల మరియు ప్రవక్తల వద్ద ఉన్న దాన్నిఅల్లాహ్ జ్ఞాన పరంగా చుట్టు ముట్టి ఉండటం వలన చేరవేశారని తెలుసుకుంటారని ఆశిస్తూ. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ప్రతీ వస్తువు యొక్క లెక్కను ఆయన లెక్కవేసి ఉంచాడు. పరిశుద్ధుడైన ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.