74 - Al-Muddaththir ()

|

(1) ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)

(2) మీరు లేచి అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి.

(3) మరియు నీ ప్రభువు యొక్క ఉన్నతను చాటిచెప్పు.

(4) మరియు మీరు మీ మనస్సును పాపముల నుండి మరియు మీ వస్త్రములను మాలిన్యముల నుండి పరిశుద్ధపరచండి.

(5) మరియు మీరు విగ్రహాల ఆరాధన నుండి దూరం దూరంగా ఉండండి.

(6) నీ సత్కర్మను అధికంగా కోరటం ద్వారా నీ ప్రభువుపై నీవు ఉపకారం చేయకు.

(7) మీరు పొందే బాధలపై అల్లాహ్ కొరకు సహనం వహించండి.

(8) బాకాలో రెండోవసారి ఊదబడినప్పుడు.

(9) అప్పుడు ఆ దినము కఠినమైన దినమై ఉంటుంది.

(10) అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిపై సులభముగా ఉండదు.

(11) ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు నేను తన తల్లి గర్భంలో ఎటువంటి సంపద గాని సంతానము గాని లేకుండా ఒంటరిగా పుట్టించిన వాడిని (అతడు వలీదిబ్నె ముగైరహ్) వదిలివేయండి.

(12) మరియు నేను అతనికి చాలా సంపదను ఇచ్చాను.

(13) మరియు నేను అతని కొరకు అతనికి తోడుగా ఉండి అతనితో పాటు సభలలో హాజరై ఉండే కుమారులను ప్రసాదించాను. అతని సంపద అధికంగా ఉండటం వలన వారు ఏ ప్రయాణం కొరకు అతనిని వీడి వెళ్ళరు.

(14) మరియు నేను అతని కొరకు జీవితంలో మరియు ఆహారొపాధిలో మరియు సంతానములో విస్తారమును ప్రసాదించాను.

(15) ఆ పిదప అతడు నాపై అవిశ్వాసం ఉండి కూడా నేను అతనికి వాటన్నింటిని ఇచ్చిన తరువాత కూడా అతనికి నేను ఇంకా అధికంగా ఇస్తానని అతడు ఆశ పెట్టుకుని ఉంటాడు.

(16) అతను అనుకున్నట్లు విషయం కాదు. నిశ్చయంగా అతడు మన ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను విబేధిస్తూ,వాటిని తిరస్కరిస్తూ ఉండేవాడు.

(17) నేను తొందరలోనే అతనిపై శిక్ష భారమును మోపుతాను అతను దాన్ని మోయలేడు.

(18) నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలను అనుగ్రహించిన ఈ అవిశ్వాసపరుడు ఖుర్ఆన్ విషయంలో దాన్ని అసత్యమని నిరూపించటానికి తాను పలకవలసిన మాటల గురించి ఆలోచించాడు మరియు దాన్ని తన మనస్సులో దాచి ఉంచాడు.

(19) అయితే అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు.

(20) మరి అతడు నాశనమైపోను మరియు శిక్షింపబడుగాక అతడు ఎలాంటి ప్రణాళిక చేశాడు.

(21) ఆ తరువాత తాను చెప్పే విషయంలో దృష్టిని మరల్చి పునరాలోచన చేశాడు.

(22) ఆ తరువాత ఖుర్ఆన్ విషయంలో ఎత్తి పొడవటానికి (దెప్పి పొడవటానికి) అతడు ఏమీ పొందనప్పుడు తన ముఖమును పాడు చేసుకుని నల్లగా మాడ్చుకున్నాడు.

(23) ఆ తరువాత అతడు విశ్వాసము నుండి వెన్ను తిప్పాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం నుండి అహంకారమును చూపాడు.

(24) మరియు ఇలా పలికాడు : ముహమ్మద్ తీసుకుని వచ్చినది ఇది అల్లాహ్ వాక్కు కాదు. కాని ఇది ఇతరుల నుండి నకలు చేయబడిన మంత్రజాలము.

(25) ఇది అల్లాహ్ వాక్కు కాదు. కాని అది మానవుని వాక్కు.

(26) నేను తొందరలోనే ఈ అవిశ్వాసపరుడిని నరకాగ్ని స్థానముల్లోంచి ఒక స్థానములో ప్రవేశింపజేస్తాను అది సఖర్ అతడు దాని వేడిని అనుభవిస్తాడు.

(27) ఓ ముహమ్మద్ సఖర్ ఏమిటో మీకు ఏమి తెలుసు?.

(28) అందులో శిక్షింపబడే వాడి నుండి అది అతనిపై వచ్చి ఏది మిగిల్చదు. మరియు అతడిని వదలదు. ఆ తరువాత అతడు ఎలా ఉండేవాడో అలా అయిపోతాడు. మరల అది అతనిపై వస్తుంది. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.

(29) కాల్చివేయటంలో తీవ్రమైనది మరియు చర్మములను మార్చి వేసేది.

(30) దానిపై పంతొమ్మిది దూతలు ఉంటారు. మరియు వారు దాని రక్షకులు.

(31) మరియు మేము నరక సంరక్షకులుగా దైవదూతలను మాత్రమే చేశాము. మానవులకు వాళ్ళను ఎదుర్కొనే శక్తి లేదు. తాను మరియు తన జాతి వారు వారిని అదిగమించే సామర్ధ్యం ఉన్నదని ఆ తరువాత నరకము నుండి బయటకు వస్తారని వాదించినప్పుడు అబూజహల్ అబద్దము పలికాడు. మరియు మేము వారి ఈ సంఖ్య లెక్కను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచే వారి కొరకు పరీక్షగా చేశాము. వారు పలికినదే పలుకుతారు. అప్పుడు వారిపై శిక్ష రెట్టింపు చేయబడును. మరియు తౌరాత్ ఇవ్వబడిన యూదులకు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులకు తమ గ్రంధముల్లో ఉన్న దాన్ని దృవీకరించే ఖుర్ఆన్ అవతరింపబడినప్పుడు నమ్మకం కలగటానికి. మరియు గ్రంధవహులు తమను ఏకీభవించినప్పుడు విశ్వాసపరుల విశ్వాసం అధికమవటానికి. మరియు యూదులు,క్రైస్తవులు మరియు విశ్వాసపరులు సందేహంలో పడకుండా ఉండటానికి. మరియు విశ్వాసము విషయములో వ్యాకులములో ఉన్నవారు మరియు అవిశ్వాసపరులు ఈ విచిత్రమైన సంఖ్య ద్వారా అల్లాహ్ ఏమి చేయదలచాడు ? అని పలకటానికి. ఈ సంఖ్యను నిరాకరించే వాడిని అపమార్గమునకు లోను చేయటం మరియు దాన్ని దృవీకరించే వారిని సన్మార్గం చూపినట్లే అల్లాహ్ ఎవరిని అపమార్గమునకు గురి చేయదలచుకుంటే వారిని అపమార్గమునకు గురి చేస్తాడు మరియు తాను సన్మార్గమునకు గురి చేయదలచిన వారికి సన్మార్గమునకు గురి చేస్తాడు. మరియు మీ ప్రభువు యొక్క సైన్యములు అవి అధికంగా ఉండి పరిశుద్ధుడైన ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. (ఏమీ ముహమ్మద్ కొరకు సహాయకులు పంతొమ్మిది మందేనా ?) అని తక్కువ చేస్తూ మరియు తిరస్కరిస్తూ పలికిన అబూజహల్ దీన్ని తెలుసుకోవాలి. నరకాగ్ని మానవులకు ఒక హితబోధన మాత్రమే. వారు దాని ద్వారా పరిశుద్ధుడైన అల్లాహ్ గొప్పతనమును తెలుసుకుంటారు.

(32) ముష్రికుల్లోంచి కొందరు అనుకుంటున్నట్లు నరక రక్షకులకు అతడు సరిపోతాడని చివరికి వారిని దాని నుండి తొలగించి వేస్తాడని మాట కాదు. అల్లాహ్ చంద్రునిపై ప్రమాణం చేశాడు.

(33) మరియు ఆయన గడిచిపోయే రాత్రి పై ప్రమాణం చేశాడు.

(34) మరియు ఆయన ప్రకాశించే వేళప్పుడు ఉదయం పై ప్రమాణం చేశాడు.

(35) నిశ్ఛయంగా నరకాగ్ని పెద్ద ఆపదల్లోంచి ఒకటి.

(36) ప్రజలకు హెచ్చరించటానికి మరియు భయపెట్టటానికి.

(37) ఓ ప్రజలారా మీలో నుండి ఎవరు తలచుకుంటే వారు అల్లాహ్ పై విశ్వాసముతో మరియు సత్కర్మతో ముందుకు సాగాలి లేదా అవిశ్వాసముతో మరియు పాప కార్యములతో వెనుకకు జరగాలి.

(38) ప్రతీ ప్రాణము తాను చేసుకున్న కర్మల వలన పట్టుకోబడుతాడు. అతని కర్మలు అతడిని నాశనం చేస్తాయి లేదా అవి అతడిని వినాశనం నుండి ముక్తిని కల్పించి అతడిని రక్షిస్తాయి.

(39) విశ్వాసపరులు తప్ప ఎందుకంటే వారి పాపముల వలన వారిని పట్టుకోబడదు. కాని వారి సత్కర్మల వలన అవి మన్నించబడతాయి.

(40) మరియు వారు ప్రళయదినమున స్వర్గవనములలో ఒకరితో ఒకరు అడుగుతుంటారు.

(41) తాము చేసుకున్న పాప కర్యముల ద్వారా తమ స్వయమును నాశనం చేసుకున్న అవిశ్వాసపరుల గురించి.

(42) వారు వారితో ఇలా పలుకుతారు : మిమ్మల్ని నరకములో ఏది ప్రవేశింపజేసింది ?.

(43) అప్పుడు అవిశ్వాసపరులు ఇలా పలుకుతూ వారికి జవాబు ఇస్తారు : ఇహలోకములో ఫర్జ్ నమాజులో పాటించేవారిలో నుంచి మేము కాలేదు.

(44) అల్లాహ్ మాకు ప్రసాదించిన దానిలో నుండి మేము పేదవారికి తినిపించేవారము కాదు.

(45) మరియు మేము అసత్య ప్రజలతో ఉండి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వారితో పాటు కలిసి తిరిగేవారము. మరియు అపమార్గమునకు,మార్గభ్రష్టతకు లోనైన వారితో కూర్చుని మాట్లాడే వారము.

(46) మరియు మేము ప్రతిఫల దినమును తిరస్కరిస్తూ ఉన్నాము.

(47) మరియు మేము దాన్ని తిరస్కరించటంలో పడి ఉన్నాము చివరకు మాకు మరణం వచ్చి చేరింది. అప్పుడు అది మాకు మరియు మా పశ్చాత్తాపమునకు మధ్య వచ్చి పడింది.

(48) ప్రళయదినమున దైవదూతలు, ప్రవక్తలు మరియు నీతిమంతులలో నుండి సిఫారసు చేసేవారి యొక్క మధ్యవర్తిత్వం వారికి ఏమి ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే సిఫారసు స్వీకరించబడటానికి సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ఇష్టత ఉండటం షరతు.

(49) ఈ ముష్రికులందరిని ఏది ఖుర్ఆన్ నుండి విముఖత చూపేవారిగా చేసినది ?!

(50) దాని నుండి తమ విముఖతలో మరియు తమ బెదిరిపోవటంలో వారు తీవ్రంగా బెదిరిపోయిన అడవి గాడిదలవలె ఉన్నారు.

(51) అవి సంహం ముందు నుండి దానితో భయపడి పారిపోయాయి.

(52) అలా కాదు, ఈ ముష్రికులలో ప్రతి ఒక్కరూ తన తల వద్ద ముహమ్మద్ అల్లాహ్ వద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త అని చెప్పే ఒక ప్రచురించబడిన పుస్తకాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, దానికి కారణం సాక్ష్యాలు తక్కువగా ఉండటం లేదా బలహీనమైన వాదనలు కాదు, మొండితనం మరియు అహంకారం.

(53) విషయం అలా కాదు. కాని వారు తమ అవిశ్వాసంలో కొనసాగిపోవటానికి కారణం వారు పరలోక శిక్షను విశ్వసించకుండా తమ అవిశ్వాసంలోనే ఉండిపోయారు.

(54) వినండి నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఒక హితబోధన మరియు ఒక ఉపదేశం.

(55) కాబట్టి ఎవరైతే ఖుర్ఆన్ ను చదివి దాని ద్వారా హితబోధన గ్రహించదలచుతారో వారు దాన్ని చదవాలి మరియు దానితో హితబోధన గ్రహించాలి.

(56) వారు హితబోధన గ్రహించాలని అల్లాహ్ తలచుకుంటే తప్ప వారు హిత బోధన గ్రహించలేరు. పరిశుద్ధుడైన ఆయనే, ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడటానికి యోగ్యుడు మరియు పశ్చాత్తాపముతో ఆయన వైపునకు మరలినప్పుడు తన దాసుల పాపములను ఆయన మన్నించటం కొరకు యోగ్యుడు.