(1) నేను తమ ఆరాధన చేయటంలో వరసగా బారులుతీరి నిలబడిన దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.
(2) మరియు మేఘములను సమీకరించి తెచ్చి వాటిని అల్లాహ్ కురిపించదలచిన చోట నడిపించే దైవదూతలపై నేను ప్రమాణం చేస్తున్నాను.
(3) మరియు నేను అల్లాహ్ వాక్కును పఠించే దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.
(4) ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ సత్య ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయనే అల్లాహ్.
(5) ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్నవాటికి ప్రభువు మరియు సంవత్సరమంతా తన ఉదయించే స్థలములలో,తన అస్తమించే స్థలములలో ఉన్న సూర్యుడి ప్రభువు.
(6) నిశ్ఛయంగా మేము భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములను అందమైన అలంకరణతో అందంగా ముస్తాబు చేశాము అవి చూడటానికి మిణుకు మిణుకుమని మెరిసే వజ్రవైఢూర్యాల్లాంటి నక్షత్రములు.
(7) మరియు మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశమును విధేయత నుండి వైదొలగిన తలబిరుసైన ప్రతీ షైతాను నుండి నక్షత్రముల ద్వారా భద్రపరిచాము. అవి అతనిపై విసరబడుతాయి.
(8) ఈ షైతానులందరికి దైవదూతలు ఆకాశములో తమ ప్రభువు దివ్యవాణి ద్వారా తన ధర్మ విషయాలను,తన తఖ్దీర్ విషయాలను తెలియపరచిన వాటి గురించి చర్చించుకుంటున్నప్పుడు వినలేరు. ప్రతీ వైపు నుండి వారిపై అగ్ని జ్వాలలు విసిరివేయబడుతాయి.
(9) వారిని (షైతానులను) ధూత్కరించటానికి మరియు వారిని (దైవదూతలను) వినటం నుండి దూరంగా ఉంచటానికి. మరియు వారి కొరకు పరలోకంలో బాధను కలిగించే శాశ్వతమైన అంతము కాని శిక్ష కలదు.
(10) కాని షైతానుల్లోంచి ఎవరైన ఎగరేసుకునిపోతే - అది దైవదూతలు సంప్రదించుకునే మాటల్లోంచి మాట అయి ఉంటుంది. అది వారి మధ్య చక్కరులు కొట్టేదై ఉంటుంది,దాని గురించి జ్ఞానం లోకవాసులకు చేరి ఉండదు - అప్పుడు కాంతివంతమైన అగ్ని జ్వాల అతడిని వెంబడించి కాల్చివేస్తుంది. ఒక్కొక్క సారి అగ్ని జ్వాల అతడిని కాల్చక ముందే ఆ మాటను అతడు తన సోదరుల వద్దకు చేరవేస్తాడు అప్పుడు అది జ్యోతిష్యులకు చేరుతుంది. అప్పుడు వారు దానితో పాటు వంద అబద్దాలను కలిపి చెబుతారు.
(11) ఓ ముహమ్మద్ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులతో అడగండి : ఏమీ వారు మేము సృష్టించిన ఆకాశములు,భూమి,దైవదూతల కన్న సృష్టిపరంగా బలమైన వారా,అవయవాలపరంగా పెద్ద వారా ?. నిశ్ఛయంగా మేము వారిని జిగట మట్టితో సృష్టించాము. అటువంటప్పుడు వారు ఎలా మరణాంతరం లేపబడటమును తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు స్వయంగా బలహీన సృష్టి నుండి సృష్టించబడిన వారు. అది జిగట మట్టి ?.
(12) ఓ ముహమ్మద్ వాస్తవానికి మీరు అల్లాహ్ సామర్ధ్యము నుండి,ఆయన సృష్టి వ్యవహారాల విషయంలో ఆయన పర్యాలోచన నుండి ఆశ్చర్యపోయారు. మరియు మీరు ముష్రికుల మరణాంతరం లేపబడటమును తిరస్కరించటం నుండి ఆశ్ఛర్యపోయారు. మరియు ఈ ముష్రికులందరు మరణాంతరము లేపబడటము పట్ల తమ తిరస్కారము యొక్క తీవ్రత వలన మీరు ఆయన విషయము గురించి చెబుతున్న వాటి నుండి ఎగతాళి చేస్తున్నారు.
(13) మరియు ఈ ముష్రికులందరు హితబోధనల్లోంచి ఏదైన హితబోధన ద్వారా హితబోధన చేయబడితే వారు తమకు ఉన్న హృదయాల కఠినత్వం వలన దానితో హితబోధనను గ్రహించరు,ప్రయోజనం చెందరు.
(14) మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల్లోంచి ఆయన నిజాయితీపై సూచించే ఏదైన సూచనను చూసినప్పుడు హేళన చేయటంలో,దాని నుండి ఆశ్ఛర్యమును చూపటంలో అధికం చేసేవారు.
(15) మరియు ఇలా పలికారు : ఓ ముహమ్మద్ నీవు తీసుకుని వచ్చినది కేవలం స్పష్టమైన మంత్రజాలము మాత్రమే.
(16) అయితే మేము మరణించి మట్టిగా,కృశించిపోయి ముక్కలుగా అయిన ఎముకలుగా మారిపోయినప్పుడు ఏమీ మేము దాని తరువాత జీవింపజేయబడి మరల లేపబడతామా ?. నిశ్ఛయంగా ఇది చాలా దూరమైన విషయం.
(17) ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తాతలు మరల లేపబడుతారా ?.
(18) ఓ ముహమ్మద్ వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : అవును మీరు మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయిన తరువాత మరల లేపబడుతారు మరియు మీ పూర్వ తాతముత్తాతలూ మరల లేపబడుతారు. మీరందరు అధములై,నీచులై లేపబడుతారు.
(19) అది బాకాలో కేవలం ఒకేే ఒక ఊదటం (రెండవ బాకా) మాత్రమే అప్పుడు వారందరు ప్రళయదిన భయానక స్థితులను చూసి అల్లాహ్ తమకు ఏమి చేస్తున్నాడో అని ఎదురుచూస్తుంటారు.
(20) మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలుకుతారు : అయ్యో మా పాడుగాను ఇది ఆ ప్రతిఫలదినము దేనిలోనైతే అల్లాహ్ తన దాసులకు వారు తమ ఇహలోక జీవితములో చేసుకున్న కర్మలకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడో.
(21) అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : ఇది దాసుల మధ్య తీర్పునిచ్చే ఆ దినము దేనిగురించైతే మీరు ఇహలోకంలో నిరాకరించేవారో,తిరస్కరించేవారో.
(22) మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది : తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్చయంగా అది వారి గమ్యస్థానము.
(23) మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది : తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్ఛయంగా అది వారి గమ్యస్థానము.
(24) వారిని నరకాగ్నిలో ప్రవేశపెట్టక మునుపు లెక్క తీసుకోవటం కొరకు ఆపండి. అప్పుడు వారు ప్రశ్నించబడుతారు. ఆ పిదప వారిని నరకాగ్ని వైపునకు తీసుకునిరండి.
(25) వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీకేమయింది మీరు ఇహలోకములో ఎలాగైతే ఒకరినొకరు సహాయపడేవారో,మీ విగ్రహాలు మీకు సహాయం చేస్తారని ఆరోపించేవారో అలా ఒకరినొకరు ఎందుకు సహాయం చేసుకోవటం లేదు.
(26) కాని వారు ఆ రోజు అల్లాహ్ ఆదేశమునకు కట్టుబడినవారై,లోబడినవారై ఉంటారు. తమ అశక్తి వలన,తమ నిస్సహాయత వలన ఒకరినొకరు సహాయం చేసుకోరు.
(27) మరియు వారు ఒకరినొకరు దూషించుకుంటూ,వాదులాడుతూ ముందుకు వస్తారు. అప్పుడు దూషణ,వాదులాట వారికి ప్రయోజనం కలిగించదు.
(28) అనుసరించేవారు అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : ఓ మా పెద్దలారా నిశ్ఛయంగా మీరు ధర్మం,సత్యం వైపు నుండి మా వద్దకు వచ్చి మా కొరకు అవిశ్వాసమును, అల్లాహ్ తో సాటి కల్పించటంను,పాపకార్యములకు పాల్పడటంను అలంకరించి చూపించారు. మరియు ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన సత్యము నుండి మమ్మల్ని మీరు ధ్వేషమును కలిగించారు.
(29) అనుసరించబడేవారు అనుసరించేవారితో ఇలా పలుకుతారు : విషయం మీరు వాదించినట్లు కాదు. కానీ మీరు అవిశ్వాసంపై ఉన్నారు. మీరు విశ్వాసపరులు కారు. అంతేకాక మీరు తిరస్కరించేవారు.
(30) ఓ అనుసరించేవారా మేము మిమ్మల్ని అవిశ్వాసంలో,షిర్కులో,పాపములను పాల్పడటంలో పడవేయటానికి అణచివేత లేదా ఆధిపత్యం ద్వారా మాకు మీపై ఎలాంటి అధికారం లేదు. అంతే కాదు మీరు అవిశ్వాసంలో,మార్గభ్రష్టతలో మితిమీరిపోయే జనులు.
(31) కావున మాపై మీపై అల్లాహ్ బెదిరింపు ఈ ఆయతులో అనివార్యమయింది : {لأَمْلأَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ} "నీతోను,నిన్ను అనుసరించే వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను". ఆపై నిశ్చయంగా మేము మా ప్రభువు బెదిరించిన దాని రుచి ఖచ్చితంగా చూస్తాము.
(32) కావున మేము మిమ్మల్ని మార్గభ్రష్టత వైపునకు,అవిశ్వాసము వైపునకు పిలిచాము. నిశ్ఛయంగా మేము కూడా సన్మార్గము నుండి తప్పిపోయి ఉన్నాము.
(33) నిశ్ఛయంగా అప్పుడు అనుసరించేవారు,అనుసరించబడినవారు ప్రళయదినమున శిక్షలో భాగస్వాములవుతారు.
(34) నిశ్ఛయంగా మేము ఏవిధంగానైతే వీరందరికి శిక్ష రుచి చూపించామో అలాగే ఇతర అపరాధులతో వ్యవహరిస్తాము.
(35) నిశ్ఛయంగా ఈ ముష్రికులందరితో ఇహలోకములో "లా ఇలాహ ఇల్లల్లాహ్" మీ వాస్తవ ఆరాధ్యదైవం అల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు దానికి తగ్గట్టుగా ఆచరించమని,దానికి వ్యతిరేకమైన వాటిని వదిలివేయమని పలికినప్పుడు వారు దాన్ని స్పందించడానికి,దానికి కట్టుబడి ఉండటానికి సత్యము నుండి గర్వముతో దానిపై అహంకారముతో నిరాకరించారు.
(36) మరియు వారు తమ అవిశ్వాసము కొరకు వాదిస్తూ ఇలా పలికేవారు : ఏమీ మేము ఒక పిచ్చి కవి మాటపై మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టాలా ?! వారి ఈ మాటకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అర్ధం.
(37) నిశ్ఛయంగా వారు పెద్ద నిందనే వేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి పిచ్చివారు కాదు,ఎటువంటి కవి కాదు. కాని ఆయన అల్లాహ్ తౌహీద్ వైపునకు,అయన ప్రవక్త ను అనుసరించటం వైపునకు పిలిచే ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. మరియు ఆయన దైవప్రవక్తలను వారు అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన తౌహీదును,వాగ్దాన దినము యొక్క నిరూపణను నిజం చేసి చూపించారు. ఏ విషయంలోను వారిని విబేధించలేదు.
(38) ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు ప్రళయదినమున మీ అవిశ్వాసము,ప్రవక్తల పట్ల మీ తిరస్కారము వలన బాధాకరమైన శిక్ష రుచి చూస్తారు.
(39) ఓ ముష్రికులారా మీరు ఇహలోకములో చేసిన అల్లాహ్ పట్ల అవిశ్వాసం,పాపకార్యములకు పాల్పడిన దానికి మాత్రమే ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
(40) కానీ అల్లాహ్ తన ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న విశ్వాసపరులైన అల్లాహ్ దాసులు. మరియు వారు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు. వారే ఈ శిక్ష నుండి విముక్తి పొందుతారు.
(41) చిత్తశుద్ధి కల ఈ దాసులందరి కొరకు ఆహారోపాధి కలదు. దాన్నే అల్లాహ్ వారికి ప్రసాదిస్తాడు. అది తన శ్రేష్ఠతలో,తన మంచితనములో,తన ఎల్లప్పుడు ఉండటంలో పేరుగాంచినది.
(42) మరియు ఈ జీవనోపాధి నుండే వారు తినే మరియు కోరుకునే ఉత్తమమైన ఫలములను ప్రసాదించబడుతారు. మరియు ఆపైన వారు స్థానములను పెంపొందించబడి,గౌరవోన్నతుడైన అల్లాహ్ ముఖమును దర్శించుకోవటం ద్వారా గౌరవించబడుతారు.
(43) వీటన్నింటిని వారు అంతంకాని,తొలగిపోని శాశ్వతమైన,స్థిరమైన అనుగ్రహాలు కల స్వర్గవనాలలో పొందుతారు.
(44) వారు ఎదురెదురుగా ఆసనములపై ఆనుకుని కూర్చొని ఒకరినొకరు చూస్తుంటారు.
(45) వారి మధ్య తమ స్వచ్చదనంలో ప్రవహించే నీటి వలే ఉండే మధు గ్లాసులు త్రిప్పబడుతాయి.
(46) అవి రంగులో తెల్లవిగా ఉంటాయి వాటిని త్రాగేవాడు పరిపూర్ణ రుచిని ఆస్వాదిస్తాడు.
(47) అది ఇహలోకపు మధ్యం లాంటిది కాదు. అందులో మతిని పోగొట్టే మత్తు ఉండదు. మరియు దాన్ని వినియోగించేవారికి తలనొప్పి ఉండదు. దాన్ని త్రాగేవాడి శరీరము,బుద్ధి భద్రంగా ఉంటాయి.
(48) మరియు స్వర్గములో వారి దగ్గర శీలవతులైన స్త్రీలు ఉంటారు. వారి చూపులు తమ భర్తలకు తప్ప ఇతరుల.వైపునకు వాలవు. అందమైన కళ్ళుగల వారై ఉంటారు.
(49) వారు తమ రంగులో పసుపురంగులో కలిసిన తెల్లగా ఉండి ఎవరిచేతులు తాకని భద్రంగా ఉన్న తెల్లని పక్షులవలే ఉంటారు.
(50) అప్పుడు స్వర్గవాసులు ఒకరినొకరు తమ గతము గురించి ఇహలోకములో వారికి సంభవించిన దాని గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు.
(51) విశ్వాసపరులందరిలో నుండి పలికేవాడు ఒకడు ఇలా పలుకుతాడు : నిశ్చయంగా నాకు ఇహలోకంలో మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఒక స్నేహితుడుండేవాడు.
(52) అతడు నాతో తిరస్కరిస్తూ,హేళన చేస్తూ ఇలా పలికేవాడు : ఓ మిత్రమా ఏమీ నీవు మృతులు మరల లేపబడటమును నమ్మేవారిలోంచివా ?.
(53) ఏమీ మేము మరణించి మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయినప్పుడు మేము మరలలేపబడుతామా మరియు మేము ఇహలోకంలో చేసిన మా కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతామా ?.
(54) విశ్వాసపరుడైన అతని మితృడు స్వర్గవాసులైన తన మితృలతో ఇలా పలుకుతాడు : ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన స్నేహితుడి పరిణామమును మేము చూడటానికి మీరు నాతోపాటు తొంగి చూస్తారా ?.
(55) అప్పుడు అతను తొంగి చూస్తాడు. తన స్నేహితుడిని నరకం మధ్యలో చూస్తాడు.
(56) అతడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ సాక్షిగా ఓ నా మిత్రమా నీవు నన్ను అవిశ్వాసము,మరణాంతరము లేపబడటము వైపు నీ పిలుపు ద్వారా నన్ను నరకములో ప్రవేశింపజేసి నాశనం చేసి ఉండేవాడివే.
(57) ఒక వేళ నాపై విశ్వసము కొరకు మార్గదర్శకము,దాని సౌభాగ్యము ద్వారా అల్లాహ్ అనుగ్రహమే లేకపోతే నీలాగా నేనూ శిక్ష వైపు హాజరు అయ్యేవారిలో నుంచి అయిపోయేవాడిని.
(58) అయితే మేము - స్వర్గవాసులు - మరణించము.
(59) ఇహలోకములోని మన మొదటి మరణం తప్ప. అంతే కాదు మేము స్వర్గంలో శాశ్వతంగా ఉంటాము. మరియు అవిశ్వాసపరులు శిక్షింపబడినట్లు మేము శిక్షింపబడము.
(60) నిశ్ఛయంగా మా ప్రభువు మాకు ప్రతిఫలంగా ప్రసాదించిన స్వర్గములో ప్రవేశము,అందులో శాశ్వత నివాసము,నరకాగ్ని నుండి భద్రత గొప్ప సాఫల్యము. దానికి సరితూగే ఎటువంటి సాఫల్యము లేదు.
(61) ఇటువంటి గొప్ప సాఫల్యము కొరకు ఆచరించే వారు ఆచరించటం తప్పనిసరి. నిశ్ఛయంగా ఇదే లాభదాయకమైన వ్యాపారము.
(62) తన విధేయత కొరకు ప్రత్యేకించుకున్న తన దాసుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచినటువంటి ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలు స్థానమును బట్టి,ఆతిధ్యమును బట్టి మేలైనవా,గొప్పవా లేదా ఖుర్ఆన్ లో దూషించబడినటువంటి జముడు చెట్టు ఏదైతే అవిశ్వాసపరుల ఆహారమో అది లావు చేయదు,ఆకలినీ తీర్చదు అది (మేలైనదా).
(63) నిశ్ఛయంగా మేము ఈ వృక్షమును ఒక పరీక్షగా చేశాము. దాని ద్వారా అవిశ్వాసముతో,పాపకార్యములతో దుర్మార్గులైనవారు పరీక్షింపబడుతారు. అందుకనే వారు ఇలా పలికారు : నిశ్ఛయంగా అగ్ని వృక్షములను తినివేస్తుంది. అందులో అవి మొలకెత్తటం అసంభవం.
(64) నిశ్ఛయంగా జముడు చెట్టు ఒక ప్రాణాంతక చెట్టు. అది నరకము యొక్క లోతు నుండి వెలికి వచ్చే వృక్షము.
(65) దాని నుండి వాటి ఫలములు వెలికి వచ్చే భయంకర దృశ్యము షైతానుల తలలవలె ఉంటాయి. దృశ్యం యొక్క వికారము సమాచారము ఇచ్చేవారి వికారమునకు సూచన. మరియు ఇది అంటే దాని ఫలములు రుచిలో చెడ్డవని అర్ధం.
(66) అయితే అప్పుడు అవిశ్వాసపరులు చేదైన,వికారమైన దాని పండ్లను తింటారు. తమ ఖాళీ కడుపులను దానితో నింపుకుంటారు.
(67) నిశ్ఛయంగా వారు దాని నుండి తిన్న తరువాత వారి కొరకు వికారమైన వేడి మిశ్రమ పానియం ఉంటుంది.
(68) ఆ తరువాత నిశ్ఛయంగా దాని తరువాత వారి మరలింపు మండే అగ్నిశిక్ష వైపుకు అవుతుంది. అప్పుడు వారు ఒక శిక్ష నుండి ఇంకో శిక్ష వైపునకు మరలుతారు.
(69) నిశ్ఛయంగా ఈ అవిశ్వాసపరులందరు తమ తాతముత్తాతలను సన్మార్గము నుండి తప్పిపోయినవారిగా పొందుతారు. వారు వారిని నమూనాగా చేసుకున్నది అనుకరణగా మాత్రమే, ఎటువంటి ఆధారపరంగా కాదు.
(70) అప్పుడు వారు తమ తాతముత్తాతల అడుగుజాడలోనే మర్గభ్రష్టతలో తొందరపడుతూ అనుసరించారు.
(71) వాస్తవానికి వారికి మునుపు చాలా మంది పూర్వికులు పెడదారి పట్టి ఉన్నారు. ఓ ప్రవక్తా జాతుల్లోంచి మొదట పెడదారిన పడినది మీ జాతి కాదు.
(72) మరియు నిశ్చయంగా మేము ఆ మొదటి జాతుల వారిలో ప్రవక్తలను పంపించాము.వారు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవారు. అప్పుడు వారు తిరస్కరించారు.
(73) ఓ ప్రవక్తా ఆ జాతుల ముగింపు ఎవరినైతే వారి ప్రవక్తలు హెచ్చరిస్తే వారు వారిని స్వీకరించలేదో ఏమయిందో మీరు చూడండి. నిశ్ఛయంగా వారి అవిశ్వాసం వలన,వారి ప్రవక్తలను వారు తిరస్కరించటం వలన వారి ముగింపు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశమయింది.
(74) అల్లాహ్ తనపై విశ్వాసమునకు ప్రత్యేకించుకున్నవారు తప్ప. నిశ్ఛయంగా వారు తిరస్కారులైన అవిశ్వాసపరులందరి ముగింపు ఏదైతో జరిగినదో ఆ శిక్ష నుండి ముక్తి పొందేవారయ్యారు.
(75) మరియు నిశ్ఛయంగా మన ప్రవక్త నూహ్ అలాహిస్సలాం తనును తిరస్కరించిన తన జాతి వారిపై బద్దుఆ (శపించినప్పుడు) చేసినప్పుడు మమ్మల్నే వేడుకున్నాడు. మేమే ఎంతో చక్కగా ప్రార్ధనలను అంగీకరించేవారము. నిశ్ఛయంగా మేము వారికి వ్యతిరేకంగా ఆయన ప్రార్దనను స్వీకరించటంలో తొందర చేశాము.
(76) మరియు నిశ్ఛయంగా మేము అతనిని,అతని కుటుంబీకులని,అతనితోపాటు విశ్వసించినవారిని అతని జాతి వారి వేదింపుల నుండి,అవిశ్వాసపరులైన అతని జాతి వారిపై పంపించబడ్డ పెద్ద తూఫాను ద్వారా మునగటం నుండి రక్షించాము.
(77) మరియు మేము అతని కుటుంబం వారిని,విశ్వాసపరులైన అతనిని అనుసరించేవారిని ఒక్కరినే రక్షించాము. నిశ్ఛయంగా మేము అతని జాతిలో నుండి అవిశ్వాసపరులైన ఇతరులను ముంచివేశాము.
(78) మరియు మేము అతని కొరకు తరువాత వచ్చే సమాజముల్లో మంచి కీర్తిని మిగిల్చాము వారు దాని ద్వారా అతనిని పొగిడేవారు.
(79) నూహ్ కొరకు తరువాత వచ్చే సమాజములలో ఆయన గురించి చెడు పలకటం నుండి భద్రత మరియు శాంతి కలుగుగాక. అంతే కాదు ఆయన కొరకు కీర్తి మరియు మంచి ప్రస్తావన మిగిలి ఉంటుంది.
(80) నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలం లాంటి దాన్ని ఒక్కడైన అల్లాహ్ కొరకు తమ ఆరాధన చేయటంలో, తమ విధేయత చూపటంలో మంచిగా చేసే వారికి ప్రసాదిస్తాము.
(81) నిశ్ఛయంగా నూహ్ అల్లాహ్ విధేయతలో ఆచరించే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
(82) ఆ తరువాత మిగిలిన వారిని మేము వారిపై పంపించిన తూఫాను ద్వారా ముంచివేశాము. వారిలో నుండి ఎవరూ మిగలలేదు.
(83) మరియు నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ తౌహీద్ వైపునకు పిలవటంలో ఆయనను ఏకీభవించిన అతని ధర్మం వారిలోంచి వారు.
(84) అయితే షిర్కు నుండి భద్రమైన హృదయముతో, అల్లాహ్ కొరకు ఆయన సృష్టితాల్లో హితోపదేశం చేసేవాడిగా తన ప్రభువు వద్దకు వచ్చినప్పటి వేళ మీరు గుర్తు చేసుకోండి.
(85) ఆయన తన తండ్రితో,తన జాతి వారైన ముష్రికులతో వారిని మందలిస్తూ మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు.
(86) ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి అసత్య దైవాలను ఆరాధిస్తున్నారా ?.
(87) ఓ నా జాతివారా సర్వలోకాల ప్రభువు గురించి మీరు ఇతరులను ఆరాధిస్తూ ఆయనను కలిసినప్పుడు మీ ఆలోచనేమిటి ?. మరియు ఆయన మీకు ఏమి చేస్తారని మీరు అనుకుంటున్నారు ?!
(88) అప్పుడు ఇబ్రాహీం తన జాతి వారితోపాటు బయలుదేరటం నుండి ముక్తి పొందటం కొరకు వ్యూహమును రచిస్తూ నక్షత్రముల వైపు ఒక చూపు చూశారు.
(89) అప్పుడు ఆయన తన జాతి వారితో వారి జాతరకి బయలుదేరటం నుండి కారణం చూపుతూ ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను అనారోగ్యంగా ఉన్నాను.
(90) అప్పుడు వారు ఆయనను తమ వెనుక వదిలి వెళ్ళిపోయారు.
(91) అప్పుడు ఆయన వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే వారి ఆరాధ్య దైవాల వద్దకు మెల్లగా వెళ్ళారు. అప్పుడు వారి ఆరాధ్య దైవాలను హేళన చేస్తూ ఇలా పలికారు : ఏమీ ముష్రికులు మీ కొరకు తయారు చేసినటువంటి ఆహారమును మీరు తినరా ?!
(92) మీ విషయమేమిటి మీరు మాట్లాడటం లేదు మరియు మిమ్మల్ని అడిగిన వారికి సమాధానమివ్వటం లేదు ?. ఏమీ ఇలాంటివి అల్లాహ్ ను వదిలి ఆరాధన చేయబడుతున్నాయా ?!
(93) అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని విరగ్గొట్టటం కొరకు తన కుడి చేత్తో కొడుతూ వారి వైపుకు వెళ్ళారు.
(94) అప్పుడు ఈ విగ్రహాల ఆరాధకులు ఆయన వద్దకు తొందరగా వచ్చారు.
(95) అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని స్థిరంగా ఎదుర్కొన్నారు. మరియు వారితో ఇలా పలికారు : ఏమీ మీరు మీ చేతులతో చెక్కిన దేవతలను అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారా ?!
(96) పరిశుద్ధుడైన అల్లాహ్ మమ్మల్నీ సృష్టించాడు మరియు మీ ఆచరణనూ సృష్టించాడు. మరియు ఈ విగ్రహాలు మీ కర్మల్లోంచివే. కాబట్టి ఆయన తన ఒక్కడి ఆరాధన చేయబడటం కొరకు,తనతోపాటు ఇతరులను సాటికల్పించకుండా ఉండటం కొరకు యోగ్యుడు.
(97) ఎప్పుడైతే వారు ఆయన్ను వాదనతో ఎదుర్కోవటం నుండి అశక్తులయ్యారో బలప్రయోగమునకు ఆశ్రయించారు. అప్పుడు వారు ఇబ్రాహీంను ఏమి చేయాలన్న విషయంలో పరస్పరం సంప్రదింపులు చేశారు. వారు ఇలా పలికారు : మీరు అతని కొరకు ఒక కట్టడమును నిర్మించండి. మరియు దాన్ని కట్టెలతో నింపివేసి దాన్ని నిప్పంటించండి. ఆ తరువాత అతన్ని అందులో విసిరివేయండి.
(98) అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతివారు ఇబ్రాహీం అలైహిస్సలాంను హతమార్చి ఆయన నుండి విముక్తి పొందటానకి ఇబ్రాహీం అలైహిస్సలాంను కీడు చేయదలచారు. మేము ఆయనపై అగ్నిని చల్లగా,శాంతిదాయకంగా చేసినప్పుడు మేము వారిని నష్టపోయేవారిలోంచి చేశాము.
(99) ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్చయంగా నేను నా ప్రభువు వైపునకు ఆయన ఆరాధనను పూర్తిగా చేయటానికి నా జాతి వారి నగరమును వదిలి వలసపోయేవాడిని. తొందరలోనే నా ప్రభువు ఇహపరాల్లో నాకు మేలు దేనిలో ఉన్నదో దాన్ని నాకు సూచిస్తాడు.
(100) ఓ నా ప్రభువా నాకు సహాయకునిగా,ప్రవాసంలో నా జాతివారి నుండి బదులుగా అయ్యే ఒక పుణ్య కుమారుడిని నాకు ప్రసాదించు.
(101) అప్పుడు మేము అతని అర్ధనను స్వీకరించి అతనికి సంతోషమును కలిగించే శుభవార్తనిచ్చాము. ఎందుకంటే మేము అతనికి పెద్దరికమును చాటి సహనశీలుడయ్యే ఒక కుమారుడిని ప్రసాదించాము. మరియు ఈ పిల్లవాడు అతడే ఇస్మాయీల్ అలైహిస్సలాం.
(102) ఇస్మాయీల్ అలైహిస్సలాం యవ్వనానికి చేరుకుని తన తండ్రి పరుగెత్తటమునకు తన పరుగెత్తటము చేరువైనప్పుడు అతని తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కలను చూశారు. మరియు దైవప్రవక్తల కల దైవవాణి అవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కల అంశము గురించి తన కుమారుడికి సమాచారమిస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా నేను కలలో నిన్ను జుబహ్ చేస్తున్నట్లుగా చూశాను. అయితే నీవు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చూడు. అప్పుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం తన తండ్రికి ఇలా పలుకుతూ సమాధానమిచ్చారు : ఓ నా తండ్రి నన్ను జుబహ్ చేసే విషయం గురించి మీకు అల్లాహ్ ఆదేశించిన దాన్ని చేసి తీరండి. తొందరలోనే మీరు నన్ను అల్లాహ్ ఆదేశమును స్వీకరించే వారిలోంచి,సహనం చూపే వారిలోంచి పొందుతారు.
(103) ఎప్పుడైతే వారిద్దరు అల్లాహ్ కి లోబడి ఆయనకు విధేయులయ్యారో ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని తన ప్రభువు అతన్ని జుబహ్ చేయమని ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి అతని నుదటి మీద బొర్లా పడుకోబెట్టారు.
(104) మరియు మేము ఇబ్రాహీం ను అతను తన కుమారుడిని జుబహ్ చేయమని అల్లాహ్ ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి పూనుకుని ఉన్నప్పుడు ఇలా పిలిచాము : ఓ ఇబ్రాహీం
(105) నిశ్ఛయంగా నీవు నీ నిదురలో చూసిన కలను నీ కుమారుని జుబహ్ చేసే దృఢ సంకల్పము ద్వారా నిజం చేసి చూపించావు. ఈ పెద్ద పరీక్ష నుండి నిన్ను విముక్తిని కలిగించి మేము నీకు ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము. కావున మేము వారిని పరీక్షల నుండి,కష్టాల నుండి విముక్తిని కలిగిస్తాము.
(106) నిశ్ఛయంగా ఇదే స్పష్టమైన పరీక్ష. మరియు నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అందులో సాఫల్యం చెందారు.
(107) మరియు మేము ఇస్మాయీలు అలైహిస్సలాంకు బదులుగా ఆయన తరపు నుండి జుబహ్ చేయటానికి ఒక పెద్ద గొర్రెను పరిహారంగా ఇచ్చాము.
(108) మరియు మేము తరువాత వచ్చే తరాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం పై మంచి కీర్తిని ఉంచాము.
(109) అల్లాహ్ వద్ద నుండి ఆయన కొరకు అభినందనలు, ప్రతీ నష్టము,ఆపద నుండి భద్రత యొక్క ప్రార్ధన లభించినది.
(110) మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆయన విధేయత చూపటంపై ఈ ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(111) నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ కొరకు ఆరాధనను తగిన విధంగా పూర్తి చేసే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
(112) మరియు మేము ఆయనకు తన ఏకైక కుమారుడిని జుబహ్ చేయటంలో అల్లాహ్ కు తన విధేయత చూపటంపై ప్రతిఫలంగా ప్రవక్త, పుణ్యదాసుడయ్యే ఇంకొక కుమారుడి శుభవార్తనిచ్చాము. అతడే ఇస్హాఖ్ అలైహిస్సలాం.
(113) మరియు మేము అతనిపై,అతని కుమారుడగు ఇస్హాఖ్ పై మా వద్ద నుండి శుభాలను కురిపించాము. అప్పుడు మేము వారి కొరకు అనుగ్రహాలను అధికం చేశాము. మరియు వారిద్దరి సంతానము అధికమవటం వాటిలో నుండే. మరియు వారి సంతానములో నుండి తమ ప్రభువు కొరకు తమ విధేయతను మంచిగా చేసే వారున్నారు. మరియు వారిలో నుండి అవిశ్వాసము,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయంపై స్పష్టమైన దుర్మార్గమునకు పాల్పడిన వారున్నారు.
(114) మరియు నిశ్ఛయంగా మేము మూసా మరియు ఆయన సోదరుడైన హారూన్ పై దైవదౌత్యము ద్వారా ఉపకారము చేశాము.
(115) మరియు మేము వారిని, వారి జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని ఫిర్ఔన్ వారిని బానిసలుగా చేసుకోవటం నుండి మరియు మునగటం నుండి విముక్తిని కలిగించాము.
(116) మరియు మేము వారికి ఫిర్ఔన్,అతని సైన్యములకు వ్యతిరేకముగా సహాయం చేశాము. అప్పుడు వారికి వారి శతృవులపై విజయం కలిగింది.
(117) మరియు మేము మూసా,ఆయన సోదరుడు హారూన్ కి తౌరాతును అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి సందేహము లేని గ్రంధముగా ప్రసాదించాము.
(118) మరియు మేము వారిద్దరికి ఎటువంటి వంకరుతనం లేని రుజుమార్గమును చూపించాము. మరియు అది పరిశుద్ధుడైన సృష్టికర్త ఇష్టతకు చేరవేసే ఇస్లాం ధర్మం.
(119) మరియు మేము వచ్చే తరాలలో వారికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము.
(120) వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి మంచి అభినందనలు,వారికి కీర్తి, ప్రతీ ఇష్టం లేని వాటి నుండి భద్రత కొరకు ప్రార్ధన కలవు.
(121) నిశ్ఛయంగా మేము మూసా,హారూన్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే తమ ప్రభువు కొరకు తమ విధేయత ద్వారా మంచి చేసేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(122) నిశ్ఛయంగా మూసా,హారూన్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే, ఆయన వారి కొరకు ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించే మా దాసులలోంచివారు.
(123) మరియు నిశ్ఛయంగా ఇల్యాస్ తన ప్రభువు వద్ద నుండి పంపించబడిన ప్రవక్తల్లోంచి వారు. అల్లాహ్ ఆయన పై దైవదౌత్యము,సందేశాలను చేరవేయటమును అనుగ్రహించాడు.
(124) అతను తాను ప్రవక్తగా పంపించబడిన తన జాతి ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికినప్పుడు : ఓ నా జాతివారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి అందులో నుండి తౌహీదు ఉన్నది మరియు తాను వారించిన వాటి నుండి జాగ్రత్త వహించి వాటిలో నుండి షిర్కు ఉన్నది మీరు అల్లాహ్ కి భయపడరా ?.
(125) ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి మీ విగ్రహమైన బఅల్ ను ఆరాధిస్తున్నారా మరియు సర్వోత్తముడైన అల్లాహ్ ఆరాధనను వదిలివేస్తున్నారా ?!.
(126) మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించిన,మీ పూర్వికులైన తాతముత్తాతలను సృష్టించిన మీ ప్రభువు. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన కాకుండా లాభం చేయలేని,నష్టం కలిగించని విగ్రహాలు కావు.
(127) అయితే అతని జాతివారి నుండి అతన్ని తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగలేదు. వారి తిరస్కారము వలన వారు శిక్షలో హాజరుచేయబడుతారు.
(128) కాని అతని జాతి వారిలో నుంచి విశ్వాసపరుడై అల్లాహ్ కొరకు ఆయన ఆరాధన విషయంలో చిత్తశుద్ధి కలవాడై ఉండేవాడు నిశ్ఛయంగా అతడు శిక్ష వైపునకు హాజరు చేయటం నుండి ముక్తి పొందుతాడు.
(129) మరియు మేము వచ్చే తరాలలో అతనికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తావనను మిగిలి ఉండేలా చేశాము.
(130) అల్లాహ్ వద్ద నుండి ఇల్,యాస్ పై అభినందనలు మరియు కీర్తి కలుగుగాక.
(131) నిశ్ఛయంగా మేము ఇల్,యాస్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే విశ్వాసపరులైన మా దాసుల్లోంచి మంచి చేసే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(132) నిశ్ఛయంగా ఇల్,యాస్ వాస్తవంగా విశ్వాసపరులైన,తమ ప్రభువు పై తమ విశ్వాసములో సత్యవంతులైన మా దాసులలోని వాడు
(133) మరియు నిశ్చయంగా లూత్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు.
(134) అయితే అతని జాతి వారిపై పంపించబడ్డ శిక్ష నుండి మేము అతన్ని,అతని జాతి వారిని రక్షించినప్పటి వైనమును నీవు గుర్తుచేసుకో.
(135) అతని భార్య తప్ప. ఆమెకూడా వారిలాగా అవిశ్వాసపరురాలు కావటం వలన ఆమె జాతి వారి యొక్క శిక్ష ఆమెకూ వర్తించే స్త్రీ అయిపోయినది.
(136) ఆ తరువాత అతన్ని తిరస్కరించి,అతను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించని వారిలో నుంచి అయిన అతని జాతి వారిలో నుండి మిగిలిన వారినీ కూడా మేము తుదిముట్టించాము.
(137) మరియు నిశ్ఛయంగా ఓ మక్కా వాసులారా మీరు షామ్ (శిరియా) వైపు మీ ప్రయాణములలో వారి నివాసములపై నుండి ఉదయం వేళ ప్రయాణిస్తూ ఉంటారు.
(138) మరియు అలాగే మీరు వాటిపై నుండి రాత్రి వేళలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఏమీ వారి యొక్క తిరస్కరించటం,వారి యొక్క అవిశ్వాసము కనబరచటం,ముందెన్నడూ వారితో జరగని అశ్లీల కార్యమును వారి యొక్క పాల్పడటం తరువాత వారికి ఏమి జరిగినదో దాని ద్వారా మీరు అర్ధం చేసుకోరా,హితబోధన గ్రహించరా ?.
(139) మరియు నిశ్ఛయంగా మా దాసుడగు యూనుస్ అల్లాహ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు.
(140) తన ప్రభువు అనుమతి లేకుండా తన జాతి వారి నుండి పారిపోయి ప్రయాణికులతో,సామానుతో నిండిన ఒక పడవ పై సవారీ అయినప్పుడు.
(141) పడవ అది నిండిపోవటం వలన మునగటానికి దగ్గరలో ఉన్నది. అప్పుడు ప్రయాణికులు ఎక్కువవటం వలన పడవ మునిగి పోతుందేమోనని భయముతో తమలోని కొందరిని తీసి పడవేయటానికి ప్రయాణికులు చీటీ వేశారు. ఆ ఓడిపోయిన వారిలో నుండి యూనుస్ అయ్యాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు.
(142) ఎప్పుడైతే వారు అతన్ని సముద్రంలో పడవేశారో పెద్ద చేప అతన్ని పట్టుకుని మ్రింగివేసింది. మరియు అతడు తన ప్రభువు అనుమతి లేకుండా సముద్రం వద్దకు వెళ్ళటం వలన అతడు నిందించబడే కార్యము చేశాడు.
(143) యూనుస్ తనకు సంభవించిన దాని కన్న మునుపు ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారిలో నుంచి కాకపోయి ఉంటే మరియు చేప కడుపులో ఆయన పరిశుద్ధత కొనియాడటం లేకపోయి ఉంటే.
(144) ఆయన చేప కడుపులోనే అది అతనికి సమాదిగా అయిపోయి ప్రళయదినం వరకు ఉండిపోయేవాడు.
(145) అప్పుడు మేము అతడిని చేప కడుపు నుండి తీసి చెట్లు,కట్టడాలు లేని ఖాళీ ప్రదేశంలో పడవేశాము. అతడు చేప కడుపులో కొంత కాలం ఉండటం వలన బలహీన శరీరము కలవాడి స్థితిలో ఉన్నాడు.
(146) మరియు మేము ఆ ఖాళీ ప్రదేశంలో ఆనపకాయ చెట్టును అతనిపై దాని ద్వారా అతను నీడను పొందటానికి,దాని నుండి తినటానికి మొలిపించాము.
(147) మరియు మేము అతడిని అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. మరియు వారి సంఖ్య లక్ష మంది ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉంటుంది.
(148) అప్పుడు వారు విశ్వసించారు మరియు ఆయన తీసుకుని వచ్చిన దాన్ని నిజమని నమ్మారు. అప్పుడు అల్లాహ్ వారి ఇహలోక జీవితంలో వారి నిర్ణీత ఆయుషు ముగిసేవరకు వారికి ప్రయోజనం చేకూర్చాడు.
(149) అయితే ఓ ముహమ్మద్ మీరు ముష్రికులతో నిరాకరించే విధంగా అడగండి : ఏమీ మీరు మీకు ఇష్టంలేనివైన కుమార్తెలను అల్లాహ్ కొరకు చేసి మీరు ఇష్టపడే కుమారులను మీ కొరకు చేసుకుంటున్నారా ?. ఇదేమి పంపకము ?!
(150) దైవదూతలను వారు ఎలా స్త్రీలు అనుకున్నారు. వాస్తవానికి వారి పుట్టించే సమయంలో వారు హాజరై లేరు. మరియు వారు దాన్ని చూడనూ లేదు ?!.
(151) జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు.
(152) జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు.
(153) ఏమీ అల్లాహ్ తన స్వయం కొరకు మీరు ఇష్టపడే మగ సంతానమునకు బదులుగా మీరు ద్వేషించే ఆడ సంతానమును ఎన్నుకున్నాడా ?!. ఖచ్చితంగా కాదు.
(154) ఓ ముష్రికులారా మీకేమయింది. మీరు అల్లాహ్ కొరకు కుమార్తెలను చేసి,మీ కొరకు కుమారులని చేసి ఈ దుర్మార్గపు నిర్ణయం చేస్తున్నారు ?.
(155) ఏమీ మీరు ఉన్న ఈ చెడు విశ్వాసము అసత్యమని గ్రహించలేకపోతున్నారా ?!. నిశ్ఛయంగా మీరు ఒక వేళ గ్రహిస్తే ఈ మాటను పలికేవారు కాదు.
(156) లేదా మీ వద్ద దీని గురించి ఏదైన పుస్తకం లేదా ఎవరైన ప్రవక్త నుండి స్పష్టమైన వాదన గాని,స్పష్టమైన ఆధారం గాని ఉన్నదా ?.
(157) మీరు వాదిస్తున్న విషయంలో ఒక వేళ మీరు నీతిమంతులే అయితే ఈ విషయంపై మీకొరకు ఆధారమయ్యే మీ పుస్తకాన్ని మీరు తీసుకుని రండి.
(158) మరియు ముష్రికులు దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు అని ఆరోపించినప్పుడు వారు అల్లాహ్ కు మరియు తమ నుండి తెరలో ఉంచబడిన దైవదూతలకు మధ్య సంబంధమును అంటగడుతున్నారు. వాస్తవానికి అల్లాహ్ ముష్రికులను లెక్క తీసుకోవటానికి తొందరలోనే హాజరు పరుస్తాడన్న విషయం దైవదూతలకు తెలుసు.
(159) పరిశుద్ధుడైన ఆయనకు తగనటువంటి సంతానము,భాగస్వామి మరియు ఇతరలు ఉండటం వేటి గురించైతే ముష్రికులు తెలుపుతున్నారో వాటి నుండి అల్లాహ్ పరిశుద్ధుడు మరియు అతీతుడు.
(160) చిత్తశుద్ధిగల అల్లాహ్ దాసులు తప్ప. ఎందుకంటే వారు పరిశుద్ధుడైన అల్లాహ్ కు తగినటువంటి గొప్ప,పరిపూర్ణ గుణాలను మాత్రమే తెలుపుతారు.
(161) అయితే ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు మరియు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధిస్తున్నవారు.
(162) ఎవరినీ కూడా మీరు సత్య ధర్మం నుండి తప్పించలేరు.
(163) కాని అల్లాహ్ ఎవరిపైనైతే అతడు నరకవాసుల్లోంచి అవుతాడని తీర్పునిస్తాడో. నిశ్చయంగ అల్లాహ్ అతనిపై తన తీర్పును జారీ చేస్తాడు. అప్పుడు అతడు అవిశ్వాసమునకు పాల్పడి నరకములోకి ప్రవేశిస్తాడు. కాని మీకు,మీ ఆరాధ్యదైవాలకు దాని శక్తి లేదు.
(164) మరియు దైవదూతలు అల్లాహ్ కొరకు తమ ఆరాధనను, ముష్రికులు ఆరోపిస్తున్న దాని నుండి తమ నిర్దోషత్వమును స్పష్టపరుస్తూ ఇలా పలుకుతారు : అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో ఒక నిర్ణీత స్థానం లేకుండా మాలో నుండి ఎవడూ లేడు.
(165) మరియు మేమే దైవదూతలము అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లాహ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము.
(166) మరియు మేమే దైవదూతలము అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లాహ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము.
(167) మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
(168) మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
(169) మరియు నిశ్చయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
(170) మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు : ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తున్న తీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు.
(171) మరియు నిశ్చయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
(172) మరియు నిశ్చయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
(173) మరియు నిశ్ఛయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లాహ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లాహ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని.
(174) ఓ ప్రవక్తా ఈ వ్యతిరేకించే ముష్రికులందరి నుండి వారి వద్దకు వారి శిక్ష సమయం వచ్చేవరకు అల్లాహ్ కు తెలిసిన కొంత కాలం వరకు విముఖత చూపండి.
(175) మరియు మీరు వారిపై శిక్ష అవతరించేటప్పుడు వారిని చూడండి. తొందరలోనే వారూ చూస్తారు. అప్పుడు చూడటం వారికి ప్రయోజనం చేకూర్చదు.
(176) ఏమీ ఈ ముష్రికులందరు అల్లాహ్ శిక్ష గురించి తొందరపెడుతున్నారా ?.
(177) అయితే ఎప్పుడైతే వారిపై అల్లాహ్ శిక్ష దిగుతుందో అప్పుడు వారి ఉదయం దుర్భరమైన ఉదయం అవుతుంది.
(178) ఓ ప్రవక్తా అల్లాహ్ వారి శిక్ష గురించి తిర్పునిచ్చేంత వరకు వారి నుండి మీరు విముఖత చూపండి.
(179) మరియు మీరు చూడండి. అప్పుడు వారందరు తొందరలోనే తమపై వాటిల్లే అల్లహ్ శిక్షను,ఆయన యాతనను చూస్తారు.
(180) ఓ ముహమ్మద్ బలవంతుడైన నీ ప్రభువు ముష్రికులు కల్పించి తెలిపే లోపపూరితమైన లక్షణాల నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు.
(181) మరియు అల్లాహ్ అభినందనలు మరియు ఆయన పొగడ్తలు గౌరవోన్నతులైన ఆయన ప్రవక్తలపై కలుగుగాక.
(182) పొగడ్తలన్నీ పరిశుద్దుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దానికి యోగ్యుడు. మరియు ఆయన లోకాలన్నింటికి ప్రభువు. వారికి ఆయన తప్ప ఇంకెవరూ ప్రభువు లేడు.