9 - At-Tawba ()

|

(1) ఇది అల్లాహ్ తరపు నుండి,ఆయన ప్రవక్త తరపు నుండి విసుగు ప్రకటన.ఓ ముస్లిములారా అరబ్ ద్వీపకల్పంలో మీరు ముష్రికులతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి ముగింపు ప్రకటన.

(2) అయితే ఓ ముష్రికులారా మీరు నాలుగు నెలల వరకు భువిలో నిశ్చింతగా సంచరించండి.దాని తరువాత మీ కొరకు ఏ ఒప్పందం ఉండదు,ఎటువంటి రక్షణ ఉండదు.ఒక వేళ ఆయన పట్ల మీరు మీ అవిశ్వాసమును కొనసాగిస్తే మీరు అల్లాహ్ శిక్ష నుండి,ఆయన యాతన నుండి విముక్తి పొందరంటే పొందరని నమ్మండి.అల్లాహ్ అవిశ్వాసపరులను ఇహలోకంలో హతమార్చి,బందీలుగా చేసి,ప్రళయదినాన నరకంలో ప్రవేశింపజేసి పరాభవంపాలు చేస్తాడని మీరు నమ్మండి.ఎవరైతే తమ ఒప్పందాలను (ప్రమాణాలను) భంగపరిచారో,ఎవరికైతే కాల పరిమితి లేకుండా ఒప్పందం ఉన్నదో వారందరు ఇందులో వస్తారు.మరియు ఎవరికైతే ఒప్పందములో కాలపరిమితి ఉన్నదో ఒక వేళ అది నాలుగు నెలల కన్న ఎక్కువ ఉన్నా కూడా దాని కాలం పూర్తి అయ్యే వరకు ఒప్పందం పూర్తి చేయబడుతుంది.

(3) సమస్త మానవాళికి నహర్ రోజున (ఖుర్బానీ రోజున) అల్లాహ్ తరపు నుండి ప్రకటన,ఆయన ప్రవక్త తరపు నుండి ప్రకటన "అల్లాహ్ సుబహానహు వ తఆలా (పరిశుద్ధుడైన,మహోన్నతుడైన) ముష్రికుల నుండి విసుగు చెందాడని,అలాగే ఆయన ప్రవక్త వారి నుండి విసుగు చెందారని".ఓ ముష్రికులారా ఒక వేళ మీరు మీ షిర్కు నుండి మన్నింపు కోరుకుంటే (పశ్చ్యాత్తాప్పడితే) మీ పశ్చ్యాత్తాపము మీకు మేలైనది.ఒక వేళ మీరు పశ్చాత్తాపము నుండి విముఖత చూపితే మీరు అల్లాహ్ నుండి తప్పించుకోలేరని,ఆయన శిక్ష నుండి మీరు విముక్తి పొందలేరని నమ్మకమును కలిగి ఉండండి.ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారికి వారిని బాధ కలిగించే దాని గురించి సమాచారమివ్వండి.అది బాధ కలిగించే శిక్ష,అది వారి కోసం నిరీక్షిస్తుంది.

(4) కాని మీరు ఏ ముష్రికులతో ఒప్పందం కుదుర్చుకున్నారో వారు మీ ఒప్పందమును పూర్తి చేసి అందులో ఎటువంటి లోపం చేయకుండా ఉంటే వారికి క్రితం ఆదేశం నుండి మినహాయింపు ఉంది.అయితే మీరు వారి ఒప్పందమును వారి కొరకు దాని గడువు ముగిసే వరకు పూర్తి చేయండి.నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశాలను పాటించటంలో,.ఒప్పందమును (ప్రమాణమును) పూర్తి చేయటం అందులోనిది,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటాడో,ద్రోహము అందులోనిది,దైవభీతి కలవారిని ఇష్టపడుతాడు.

(5) మీరు మీ శతృవులను శరణం కల్పించిన నాలుగు నిషిద్ధ మాసాలు ముగిసిపోయినప్పుడు వారు మీకు దొరికిన చోట వారిని వదించండి. మరియు వారిని వారి కోటల్లోనే నిర్బంధించండి. వారి దారుల్లో మీరు మాటు వేయండి. ఒక వేళ వారు షిర్క్ నుండి అల్లాహ్ తో పశ్చ్యాత్తాప్పడి,వారు నమాజును నెలకొల్పి,తమ సంపదల్లోంచి జకాతును చెల్లిస్తే వారు ఇస్లాం ధర్మ ప్రకారం మీ సోధరులైపోయారు. అలా అయితే మీరు వారితో యుద్ధమును వదిలివేయండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చ్యాత్తాప్పడే వాడిని మన్నించే వాడు,అతడిపై కరుణించే వాడు.

(6) ఒకవేళ ముష్రికుల్లోంచి ఎవడైన రక్తము,ధనము అనుమతించే (సమ్మతించే) ప్రాంతములో ప్రవేసించి ఓ ప్రవక్తా మీతో రక్షణను కోరితే అతడు ఖుర్ఆన్ వినేంత వరకు అతడి కోరికను స్వీకరంచండి.ఆ తరువాత అతడిని అతని సురక్షిత ప్రదేశమునుకు చేరవేయండి.ఇది ఎందుకంటే అవిశ్వాసపరులు ఈ ధర్మ వాస్తవాలు తెలియని వారు.వారు ఖుర్ఆన్ ను వినటం వలన వాటిని తెలుసుకున్నప్పుడు సన్మార్గం పొందవచ్చును.

(7) ఓ ముస్లిములారా సుల్హె హుదేబియా (హుదేబియా ఒడంబడిక) లో మస్జిదుల్ హరాం వద్ద మీరు ఒప్పందము చేసుకున్న ముష్రికుల ఒప్పందము తప్ప ముష్రికుల కొరకు అల్లాహ్ వద్ద,ఆయన ప్రవక్త వద్ద ఏవిధమైన ఒప్పందము,రక్షణ ఉండటం సరి కాదు.అయితే వారు మీ కొరకు మీ మధ్య,వారి మధ్య ఉన్న ఒప్పందమును భంగపరచకుండా దాని పై స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై భంగపరచకుండా స్థిరంగా ఉండండి.నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన ఆదేశాలను పాటిస్తూ తాను వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ దైవభీతి కలవారిని ఇష్టపడుతాడు.

(8) వారి కొరకు ఒప్పందము,రక్షణ ఎలా సాధ్యము.వాస్తవానికి వారు మీకు శతృవులు.ఒక వేళ వారు మీపై విజయం పొందితే వారు మీ విషయంలో అల్లాహ్ ను కాని,ఏ విధమైన బంధుత్వమును కాని,ఏ విధమైన ఒప్పందమును కాని లెక్కచేయరు.అంతే కాక మిమ్మల్ని బాధాకరమైన శిక్షలకు గురి చేస్తారు.వారి నాలుకలతో మాట్లాడే మంచి మాటల ద్వారా మిమ్మల్ని వారు సంతోషపెడుతారు.కాని వారి హృదయాలు వారి నాలుకలను స్వీకరించవు.వారు ఏమంటున్నారో తెలియదు.వారిలో చాలా మంది తమ ఒప్పందాలను భంగపరచటం వలన అల్లాహ్ విధేయత నుండి తొలిగిపోయారు.

(9) అల్లాహ్ యొక్క ఆయతులు అందులో నుంచి ఒప్పందాలను పూర్తి చేయటమును అనుసరించటమునకు బదులుగా,ప్రత్యామ్నాయముగా అల్పమైన ధర అయిన ప్రాపంచిక శిధిలాలు వేటి ద్వారా నైతే వారు తమ మనో వాంఛనలు,తమ కోరికలకు చేరుకుంటారో కోరుకున్నారు.తాము స్వయాన సత్యాన్ని అనుసరించటం నుండి ఆగిపోయారు.ఇతరులను సత్యము నుండి ఆపివేశారు.నిశ్చయముగా వారు చేసే కార్యము చెడ్డదైనది.

(10) వారిలో ఉన్న శతృత్వం వలన వారు ఒక విశ్వాసపరుని విషయంలోఅల్లాహ్ ను కాని ఏ బంధుత్వంను కాని ఏ ఒప్పందమును కాని లెక్క చేయరు.వారిలో ఉన్న దుర్మార్గము,దురాక్రమణ గుణాల వలన వారు అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారు.

(11) అయితే ఒక వేళ వారు తమ అవిశ్వాసము నుండి అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడి (తౌబా చేసి),రెండు సాక్షములను (షహాదతైన్ లను) పలికి,నమాజులను నెలకొల్పి,తమ సంపదల నుండి జకాతును చెల్లిస్తే వారు ముస్లిములైపోయారు.మరియు వారు ధర్మం ప్రకారం మీ సోదరులు.మీ కొరకు ఏవి ఉన్నవో వారి కొరకు అవే ఉన్నవి,మీపై (బాధ్యతగా) ఏవి ఉన్నవో వారిపై అవే ఉన్నవి.వారితో యుద్ధం చేయటం మీ కొరకు ధర్మసమ్మతం కాదు.అయితే వారి ఇస్లాం స్వీకరించటం వారి రక్తములను,వారి సంపదలను,వారి మానమర్యాదలను పరిరక్షిస్తుంది.మరియు మేము ఆయతులను విడమరచి చెబుతున్నాము, తెలుసుకునే జనుల కొరకు వాటిని స్పష్టపరుస్తున్నాము.వారే వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.మరియు వాటి ద్వారా ఇతరులకు ప్రయోజనం చేకురుస్తారు.

(12) నిర్ణీత వ్యవధిలో యుద్ధమును వదిలివేయటం పై మీతో ఒప్పందం చేసిన ఈ ముష్రికులందరు ఒక వేళ తమ ఒప్పందాలను,తమ ప్రమాణాలను భంగ పరచి,మీ ధర్మములో లోపాలను చూపి,దానిని అవహేళన చేస్తే మీరు వారితో యుద్ధం చేయండి.వారు అవిశ్వాసము యొక్క నాయకులు,మరియు దాని అధికారులు.వారి రక్తమును చిందించటము నుండి ఆపే ఎటువంటి ప్రమాణాలు కాని ఒప్పందాలు కాని వారి కొరకు లేవు.అయితే వారు తమ అవిశ్వాసము నుండి,తమ ఒప్పందాలను భంగపరచటం నుండి,తాము ధర్మములో లోపము చూపటం నుండి దూరంగా ఉంటారని ఆశిస్తూ మీరు వారితో యుద్ధం చేయండి.

(13) ఓ విశ్వాసపరులారా తమ ఒప్పందాలను,ప్రమాణాలను భంగపరచి ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లంను మక్కా నగరము నుండి వెలివేయటానికి దారున్నద్వాలో తాము సమావేశమై ప్రయత్నం చేశారో అటువంటి జాతితో మీరు ఎందుకు పోరాడటం లేదు.వారే ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం రక్షణలో ఉన్నకుజాఅ తెగకు వ్యతిరేకముగా ఖురైష్ రక్షణలో ఉన్న బకర్ తెగకు సహాయము చేసి మొదట మీతో యుద్ధమును మొదలు పెట్టారు.ఏమి మీరు వారితో భయపడుతున్నారా,అయితే మీరు వారితో యుద్ధము విషయంలో ముందడుగు వేయకండి.నిజానికి మీరు విశ్వాసవంతులే అయితే మీరు భయపడటానికి అల్లాహ్ సుబహానహువ తఆలా ఎక్కువ హక్కుదారుడు.

(14) ఓ విశ్వాసపరులారా మీరు ఈ ముష్రికులందరితో యుద్ధం చేయండి.నిశ్చయంగా మీరు ఒక వేళ వారితో యుద్ధం చేస్తే అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు.అది మీరే వారిని హతమార్చటం ద్వారా,మరియు పరాభవము,బంధీ అవటం ద్వారా వారిని అవమానపాలు చేస్తాడు.మరియు మీకు ఆధిక్యతను కలిగించటం ద్వారా వారికి ప్రతికూలంగా మీకు సహాయపడుతాడు (వారిపై మీకు విజయాన్ని కలిగిస్తాడు).మరియు యుద్ధంలో హాజరుకాని విశ్వాసపరుల హృదయాల రోగమును వారి శతృవులకు కలిగిన మరణము,బంధీ అవ్వటము,పరాభవము కావటం,వారిపై విశ్వాసపరుల విజయము లాంటి వాటి ద్వారా నయం చేస్తాడు.

(15) మరియు ఆయన తన దాసుల్లోంచి విశ్వాసపరుల హృదయముల నుండి క్రోధమును వారిపై (అవిశ్వాస పరులపై) వారు (విశ్వాసపరులు) పొందిన విజయము ద్వారా దూరం చేస్తాడు.మరియు ఒక వేళ ఈ అవిధేయులందరిలోంచి వారు పశ్చాత్తాప్పడితే అల్లాహ్ తాను కోరుకున్న వారి పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు.ఏ విధంగానైతే మక్కా విజయం నాడు కొందరు మక్కావాసుల నుండి జరిగిందో.మరియు అల్లాహ్ వారిలోంచి పశ్చాత్తాప్పడే వారి నిజాయితి గురించి బాగా తెలిసినవాడు,తన సృష్టించటంలో,తన పర్యాలోచనములో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.

(16) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించకుండా వదిలివేస్తాడని అనుకుంటున్నారా ?.పరీక్ష అన్నది ఆయన సాంప్రదాయాల్లోంచి ఒక సాంప్రదాయము.మీలో నుంచి చిత్తశుధ్ధితో అల్లాహ్ కొరకు పోరాడే దాసులను స్పష్టమైన జ్ఞానంతో అల్లాహ్ తెలుసుకునేంత వరకు మీరు పరీక్షించబడుతారు.వారందరు అల్లాహ్ ను కాక,ఆయన ప్రవక్తను కాక,విశ్వాసపరులను కాక తమతో స్నేహం చేసే అవిశ్వాసపరులను ఆప్త మితృలుగా చేసుకోరు.మరియు అల్లాహ్ మీరు చేసే కార్యాలను తెలుసుకునేవాడు.వాటిలోంచి ఏది కూడా ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు త్వరలోనే ఆయవ వాటిపరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(17) ముష్రికులు తమ ద్వారా బహిర్గతం అవుతున్న వాటి ద్వారా స్వయంగా అవిశ్వాసమును అంగీకరిస్తూ ఆరాధనల ద్వారా,విధేయత కార్యాల ద్వారా అల్లాహ్ మస్జిదులను నిర్వహించటం వారికి సరికాదు.వారందరి ఆచరణలు అవి స్వీకరించబడటానికి కావలసిన షరతు అయిన విశ్వాసమును కోల్పోవటం వలన వృధా అయిపోయినవి.మరియు వారందరు ప్రళయ దినాన నరకములో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేసిస్తారు.కాని ఒక వేళ వారు వారి మరణం ముందు షిర్కు నుండి తౌబా చేసుకుంటే (విముక్తి పొందుతారు).

(18) మస్జిదుల నిర్వహణకు హక్కుదారులు,దాని హక్కును నిర్వహించే బాధ్యతను తీసుకునేవారు ఒకే అల్లాహ్ ను విశ్వసిస్తూ,ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉంటూ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తూ,నమాజులను నెలకొల్పుతూ.తమ సంపద నుండి జకాతును చెల్లిస్తూ,అల్లాహ్ సుబహానహు వ తఆలాతో తప్ప ఇతరులతో భయపడని వారు మాత్రమే.ఇలాంటి వారందరితో వారు సన్మార్గమును పొందుతారని ఆశించవచ్చు.ముష్రికులు మాత్రం దీని నుండి చాలా దూరంగా ఉంటారు.

(19) ఓ ముష్రికులారా ఏమీ మీరు హజ్ చేసేవారికి నీటినిత్రాపించే,మస్జిదుల్ హరాం నిర్వహణ బాధ్యతలు నిర్వహించే వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండి,ప్రళయదినము పై విశ్వాసమును కనబరచి,అల్లాహ్ కలిమానే ఉన్నత స్థానానికి చేరటానికి,అవిశ్వాసపరుల కలిమ క్రిందికి అయిపోవటానికి తన ధన,ప్రాణాల ద్వారా పోరాడిన వారి మాదిరిగా చేస్తారా,ఏమీ మీరు వారందరిని అల్లాహ్ వద్ద అనుగ్రహము పొందే విషయంలో సమానంగా చేస్తారా?వారందరు అల్లాహ్ వద్ద ఎన్నటికి సమానంకారు.మరియు అల్లాహ్ షిర్క్ చేసి దుర్మార్గులైన వారు ఒక వేళ హజ్ చేసేవారికి నీటిని త్రాపించటం లాంటి మంచి కార్యాలు చేసిన సన్మార్గమును పొందే సౌభాగ్యమును కల్పించడు.

(20) అల్లాహ్ పై విశ్వాసమునకు,అవిశ్వాస ప్రాంతముల నుండి విశ్వాస ప్రాంతములకు హిజ్రత్ చేయటమునకు (వలస పోవటమునకు),ధన,ప్రాణాల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటమునకు మధ్య సమీకరించేవారు అల్లాహ్ వద్ద ఇతరుల కన్న ఉన్నత స్థానమును కలవారు.ఈ గుణాలను కలిగిన వారందరు స్వర్గమును పొంది సాఫల్యమును పొందేవారు.

(21) వారి ప్రభువైన అల్లాహ్ వారికి సంతోషపెట్టే తన కారుణ్యము,ఎన్నటికి వారిపై ఆగ్రహం చెందకుండా వారిపై కురిసే తన ప్రసన్నత గురించి,వారి కొరకు కల ఎన్నటికి అంతం కాని శాస్వతమైన అనుగ్రహాలు ఉన్న స్వర్గ వనాల్లో ప్రవేశము గురించి వారికి సమాచారమిస్తున్నాడు.

(22) ఈ స్వర్గవనాల్లో ముగింపు లేకుండా,ఇహలోకంలో వారు చేసుకున్న వారి సత్కర్మలకు ప్రతిఫలంగా బసచేస్తారు.నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మాన్ని ఆయన కొరకు ప్రత్యేకించి ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే వారి కొరకు గొప్ప ప్రతిఫలం ఉన్నది.

(23) ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించిన వారా మీకు బంధుత్వంలో మీ తాతముత్తాతలు,మీ సోదరులు,మీ దగ్గర బంధువులైన ఇతరులు ఒక వేళ వారు ఒకే అల్లాహ్ విశ్వాసము పై అవిశ్వాసమునకు ప్రాధాన్యతనిస్తే వారికి విశ్వాసపరుల రహస్యాలను చేరవేసి,వారితో పరస్పర సంప్రదింపులు చేసి ఆప్తమిత్రులుగా చేసుకోకండి.మరియు ఎవడైతే వారు అవిశ్వాసంపై ఉన్నా కూడా వారిని స్నేహితులుగా చేసుకుంటాడో అతడు అల్లాహ్ పై అవిశ్వాసాన్ని ఒడిగట్టాడు.మరియు అతడు అవిధేయత వలన కావాలనే స్వయమును వినాశనమునకు గురి చేసే ప్రదేశాల్లో పడవేసి తనపై హింసకు పాల్పడ్డాడు.

(24) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీ తాతముత్తాతలు,మీ కుమారులు,మీ సోదరులు,మీ భార్యలు,మీ బంధువులు,మీరు సంపాదించిన మీ సంపదలు, దేని వాడుకను (వ్వవహారమును) మీరు ఇష్టపడుతున్నారో,దేని మాంద్యము నుండి మీరు భయపడుతున్నారో మీ ఆ వ్యాపారము,వేటిలోనైతే మీరు ఉండటాన్ని ఇష్టపడుతున్నారో మీ ఆ గృహాలు ఒక వేళ ఇవన్నీ అల్లహ్ కన్న,ఆయన ప్రవక్త కన్న,ఆయన మార్గములో జిహాద్ కన్న మీకు అమితంగా ఇష్టమైతే అల్లాహ్ మీపై కురిపించే శిక్ష,యాతన కోసం నిరీక్షించండి.మరియు అల్లాహ్ తన విధేయత నుండి తొలిగిపోయే వారికి తాను ఇష్టపడే కార్యమును చేసే భాగ్యమును కలిగించడు.

(25) ఓ విశ్వాసపరులారా చాలా యుద్ధాల్లో మీరు కారకాలను ఎంచుకొని అల్లాహ్ పై నమ్మకమును చూపినప్పుడు మీ సంఖ్యా బలం తక్కువగా ఉండి,మీరు బలహీనులుగా ఉన్నా కూడా అల్లాహ్ మీ శతృవులైన ముష్రికులపై విజయాన్ని కలిగించాడు. మీరు ఎక్కువగా ఉండటం మీకు గర్వకారణం కాలేదు. అలాగే అధికము వారిపై మీ విజయానికి కారణం కాలేదు. కాని హునైన్ యుద్ధం రోజున మీ సంఖ్యాబలం ఆధికము మీకు గర్వకారణమైనది. అప్పుడు మీరు మేము తక్కువగా ఉన్నా ఓడిపోము అన్నారు. మీకు గర్వకారణమైన మీ సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం మీకు కొంచము కూడా ప్రయోజనం చేకూర్చలేదు. అయితే మీపై మీ శతృవులు గెలిచారు. నేల విశాలంగా ఉన్నప్పటికీ మీపై ఇరుకుగా అయిపోయింది. ఆపిదప మీరు పరాజయమునకు గురై మీ శతృవుల ముందు నుండి వెన్ను తిప్పి పారిపోయారు.

(26) మీరు మీ శతృవుల ముందు నుండి పారిపోయిన తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై ప్రశాంతతను అవతరింపజేశాడు.మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు.అయితే మీరు యుద్ధం కొరకు స్థిరత్వాన్ని ప్రదర్శించండి.మరియు ఆయన మీకు కనిపించని దైవదూతలను అవతరింపజేశాడు.మరియు ఆయన అవిశ్వాసపరులను వారికి సంభవించిన మరణము,బంధీ అవటం,సంపదలను స్వాధీనపరచుకోవటం,సంతానమును బానిసలుగా చేసుకోవటం లాంటి ద్వారా శిక్షించాడు.మరియు ఈ ప్రతిఫలం దేని ద్వారానైతే వీరందరూ పొందారో అది తమ ప్రవక్తను తిరస్కరించిన,ఆయన తీసుకుని వచ్చిన దాన్ని విముఖత చూపిన అవిశ్వాసపరుల ప్రతిఫలము.

(27) ఆ శిక్ష విధించబడిన తరువాత ఎవరైతే తన అవిశ్వాసము నుండి,తన అప మార్గము నుండి పశ్చాత్తాప్పడుతాడో నిశ్చయంగా అల్లాహ్ అతనిపై దయ చూపి అతని పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు. అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తప్పడేవారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. ఎందుకంటే ఆయన అవిశ్వాసము తరువాత,పాపకార్యములను పాల్పడిన తరువాత వారి పశ్ఛాత్తాపమును స్వీకరిస్తాడు.

(28) అల్లాహ్,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మబద్దం చేసిన వాటిని అనుసరించిన వారా నిశ్చయంగా ముష్రికులు వారిలో ఉన్న అవిశ్వాసము,దుర్మార్గము,చెడు గుణాలు,దుర అలవాట్ల వలన అపరిశుద్ధులు.అయితే వారు మక్కా హరమ్ లో (నిషిద్ధ ప్రదేశాల్లో),మరియు మస్జిదుల్ హరాంతో సహా ఒక వేళ వారు హాజీలుగా లేదా ఉమ్రా చేసే వారిగా వారి ఈ సంవత్సరము అది హిజ్రత్ యొక్క తొమ్మిదో సంవత్సరం తరువాత ప్రవేశించరాదు.ఓ విశ్వాసపరులారా తినుబండారాలు,రకరకాల వ్యాపార సామగ్రి వారు తీసుకుని వచ్చేవారో అవి అంతం అయిపోవటం వలన పేదరికం యొక్క మీకు భయం ఉంటే నిశ్చయంగా అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా ఒక వేళ తాను తలచుకుంటే మీకు ఆయన చాలును.నిశ్చయంగా అల్లాహ్ మీరు ఉన్న స్థితిని తెలిసిన వాడు,మీ కొరకు ఆయన పర్యాలోచన చేసే విషయాల్లో వివేకవంతుడు.

(29) ఓ విశ్వాసపరులారా మీరు ఆ అవిశ్వాసపరులతో యుద్ధం చేయండి ఎవరైతే ఎవరూ సాటి లేని అల్లాహ్ ను ఆరాధ్య దైవంగా విశ్వసించలేదో,ప్రళయ దినం పై విశ్వాసమును కనబరచలేదో,వారిపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన మృత జంతువులు,పంది మాంసము,మధ్యము,వడ్డీ నుండి దూరంగా ఉండలేదో,యూదులు,క్రైస్తవులు అణచివేయబడి అవమానానికి గురై తమ చేతులతో జిజియా ఇచ్చేంత వరకు అల్లాహ్ ధర్మబద్దం చేసిన వాటిని శిరసావహించలేదు.

(30) నిశ్చయంగా యూదులు,క్రైస్తవుల్లోంచి ప్రతి ఒక్కరు ముష్రికులు.యూదులు ఉజైరును అల్లాహ్ కుమారుడని దావా చేసినప్పుడు (వాదించి) అల్లాహ్ తోపాటు సాటి కల్పించారు.మరియు క్రైస్తవులు మసీహ్ ఈసాను అల్లాహ్ కుమారుడని దావా చేసినప్పుడు ఆయనతోపాటు సాటి కల్పించారు.ఈ మాటలు వేటినైతే వారు అల్లుకున్నారో ఎటువంటి ఆధారం లేకుండా తమ నోళ్ళతో వాటిని పలుకుతున్నారు.మరియు వారు ఈ మాటల్లో తమ కన్న ముందు గతించిన ఆ ముష్రికులను తలపిస్తున్నారు ఎవరైతే నిశ్చయంగా దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు అని పలికారో.వీటన్నింటి నుంచి అల్లాహ్ మహోన్నతుడు గొప్పవాడు.అల్లాహ్ వారిని నాశనం చేయుగాక ఎలా వారు స్పష్టమైన సత్యము నుండి అసత్యము వైపునకు మరలించబడుతున్నారు ?.

(31) యూదులు తమ మతాచారులను,క్రైస్తవులు తమ సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకున్నారు. వారు (మతాచారులు,సన్యాసులు) వారిపై అల్లాహ్ నిషేధించిన వాటిని వారి కొరకు ధర్మ సమ్మతం చేసేవారు,వారి కొరకు అల్లాహ్ ధర్మ సమ్మతం చేసిన వాటిని వారిపై నిషేధించేవారు.మరియు క్రైస్తవులు మర్యం కుమారుడైన మసీహ్ ఈసాను అల్లాహ్ తోపాటు ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. మరియు అల్లాహ్ యూదుల మతాచారులను,క్రైస్తవుల సన్యాసులను,ఉజైరును,మర్యం కుమారుడైన ఈసాను కేవలం తన ఒక్కడినే ఆరాధించమని,తనతో పాటు ఎవరిని సాటి కల్పించవద్దని ఆదేశించాడు. పరిశుద్ధుడైన ఆయన ఒకే ఆరాధ్య దైవము,ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవము ఇంకొకరు లేరు. ఆయన సుబహానహు వ తఆలా అతీతుడు. ఈ ముష్రికులందరు,ఇతరులు పలికినట్లు ఆయనకు సాటి ఉండటం నుండి ఆయన పరిశుద్ధుడు.

(32) ఈ అవిశ్వాసపరులందరు,అవిశ్వాస ధర్మాల్లోంచి ఒక ధర్మం పై ఉన్న ఇతరులు తమ ఈ కట్టుకధల ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని వచ్చిన దాన్ని వారి తిరస్కారము ద్వారా ఇస్లాం ను అంతమొందించాలని,దాన్ని అసత్యముగా చేయాలని,అల్లాహ్ యొక్క తౌహీదును నిరూపించటానికి అందులో వచ్చిన స్పష్టమైన వాదనలను,ఆధారాలను నసింపజేయాలని నిర్ణయించుకున్నారు.మరియు ఆయన ప్రవక్త తీసుకుని వచ్చినది సత్యము.మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ తన ధర్మమును పూర్తి చేయటమును,దాన్ని ఇతర వాటిపై ఆధిక్యతను,ఉన్నతను కలిగించటమును తప్ప మిగతా వాటిని కానివ్వడు.ఒక వేళ అవిశ్వాసపరులు ఆయన ధర్మమును పరిపూర్ణము చేయటమును,దానిని ఆధిక్యతనివ్వటమును,ఉన్నత స్థానమునకు చేర వేయటమును ఇష్టపడకపోయినా ఆల్లాహ్ దాన్ని పరిపూర్ణం చేసేవాడును,ఆధిక్యతను ఇచ్చేవాడును,ఉన్నత స్థానమును కలిగించే వాడును.అల్లాహ్ ఏ విషయమునైనా నిర్ణయించుకుంటే ఇతరవారి నిర్ణయం వృధా అయిపోతుంది.

(33) పరిశుద్ధుడైన అల్లాహ్ ఆయనే తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులందరికి సన్మార్గమును చూపే ఖుర్ఆన్ ను,సత్య ధర్మమైన ఇస్లామును ఇచ్చి అందులో ఉన్న వాదనలు,ఆధారాలు,ఆదేశాల ద్వారా ఇతర ధర్మాలపై దానికి ఔన్నత్యాన్ని కలిగించటం కొరకు పంపించాడు.ఒక వేళ దాన్ని ముష్రికులు ఇష్టపడకపోయిన.

(34) ఓ విశ్వాసమును కనబరచి అల్లాహ్ తమ కొరకు ధర్మపరంగా చేసిన వాటిని పాటించేవారా, చాలా మంది యూదుల మతాచారులు,చాలా మంది క్రైస్తవుల సన్యాసులు ప్రజల సంపదలను ధర్మ హక్కు ప్రకారం కాకుండా తీసుకునేవారు.వారు వాటిని లంచముగా,ఇతరవిధముగా తీసుకునేవారు.మరియు వారు ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశించటం నుండి ఆపేవారు.మరియు ఎవరైతే బంగారమును,వెండిని కూడబెట్టి తమపై విధి అయిన వాటి జకాతును చెల్లించలేదో ఓ ప్రవక్తా వారిని ప్రళయదినాన బాధ కలిగించే బాధాకరమైన శిక్ష గురించి సమాచారమివ్వండి.

(35) ప్రళయదినాన వారు కూడబెట్టి దాని హక్కును ఆపిన సొమ్ము నరకాగ్నిలో కాల్చబడుతుంది.వాటి వేడి తీవ్రమైనప్పుడు అవి వారి నుదురులపై,వారి ప్రక్కలపై,వారి వీపులపై పెట్టబడుతాయి.మరియు వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : ఇవి మీ ఆ సంపదలు వేటినైతే మీరు కూడబెట్టి వాటి విషయంలో విధి అయిన హక్కులను నిర్వర్తించలేదో.అయితే మీరు ఏదైతే కూడబెట్టి దాని హక్కును నిర్వర్తించలేదో దాని దుష్ఫలితాన్ని,దాని పరిణామాన్ని చవిచూడండి.

(36) నిశ్చయంగా సంవత్సరపు నెలల లెక్క అల్లాహ్ ఆదేశములో,ఆయన నిర్ణయంలో ఆయన మొదట భూమ్యాకాశాలను సృష్టించినప్పటి నుంచి లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ పొందుపరచిన వాటిలో పన్నెండు కలదు.ఈ పన్నెండు నెలల్లోంచి నాలుగు నెలల్లో అల్లాహ్ వాటిలో యుద్ధం చేయటమును నిషేధించాడు.అవి మూడు వివరణగా (జులా ఖాదతి,జుల్ హిజ్జతి మరియు ముహర్రమ్) మరియు ఒకటి వేరుగా అది (రజబ్).ఈ ప్రస్తావించబడిన సంవత్సర నెలల లెక్క,వాటిలోంచి నాలుగింటి నిషేధము అదే సక్రమమైన ధర్మము.అయితే మీరు వాటిలో యుద్ధాలు చేసి,వాటిని అగౌరవపాలు చేసి ఈ నిషిద్ధమాసముల్లో మీపై హింసకు పాల్పడకండి.మరియు ఏ విధంగా నైతే ముష్రికులందరు కలిసి మీతో యుద్ధం చేస్తున్నారో ఆ విధంగా మీరందరు కలిసి ముష్రికులతో యుద్ధం చేయండి.మరియు అల్లాహ్ ఎవరైతే ఆయన ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతిని కలిగి ఉంటారో వారికి విజయమును కలిగించి,స్థిరత్వమును ప్రసాధించి తోడుగా ఉంటాడని మీరు తెలుసుకోండి.అల్లాహ్ ఎవరికి తోడుగా ఉంటాడో వారిపై ఎవరూ గెలవలేరు.

(37) నిశ్చయంగా నిషిద్ధ మాసమును నిషిద్ధము కాని మాసము వైపునకు వెనుకకు జరిపి దాని స్థానములో దీనిని ఉంచటం ఏవిధంగా అయితే అజ్ఞాన కాలములో అరబ్ వాసులు చేసేవారో అది అల్లాహ్ పై తమ అవిశ్వాసముపై అవిశ్వాసమును పెంచటం. ఎందుకంటే వారు నిషిద్ధ మాసముల్లో ఆయన ఆదేశమును నిరాకరించారు (అవిశ్వసించారు) .షైతాను ఎప్పుడైతే వారి కొరకు ఈ చెడు సాంప్రదాయమును జారీ చేశాడో వాటి ద్వారా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారిని అపమార్గమునకు లోను చేస్తాడు.వారు ఒక సంవత్సరము నిషిద్ధ మాసమును నిషిద్ధ మాసములు కాని వాటిలోంచి ఒక మాసముతో మార్చి ధర్మ సమ్మతం చేసుకునేవారు.మరియు అల్లాహ్ నిషిద్ధము చేసిన నెలల లెక్క సరిపోవటానికి ఒక వేళ వాటి ప్రముఖులు విభేదించినా వారు ఒక సంవత్సరం దాన్ని నిషిద్ధముగానే ఉంచుకునేవారు.అయితే వారు ఒక మాసమును ధర్మ సమ్మతం చేసుకుంటే దాని స్థానములో వేరే నెలను నిషిద్ధము చేసుకునేవారు.దాని ద్వారా వారు అల్లాహ్ నిషేధించిన నిషిద్ధ మాసములను ధర్మ సమ్మతం చేసుకునేవారు మరియు వారు ఆయన ఆదేశమును విభేదించేవారు.షైతాను వారి కొరకు దుష్కర్మలను మంచిగా చేసి చూపిస్తే వారు వాటిని చేసేవారు.నెలలను వెనుక ముందు చేయటం వాటిలో నుంచే.మరియు అల్లాహ్ తమ అవిశ్వాసము పై మొండితనం చూపేవారికి అనుగ్రహించడు.

(38) ఓ అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి వారి కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీకు ఏమయింది మీ శతృవులతో పోరాడటం కొరకు అల్లాహ్ మార్గంలో జిహాద్ వైపునకు మీరు పిలవబడినప్పుడు మీరు బద్దకిస్తున్నారు. మరియు మీరు మీ ఇళ్ళల్లోనే ఉండిపోవటం వైపు మొగ్గు చూపుతున్నారు ?.ఏమీ మీరు తనవంతుగా అంతమైపోయి నశించిపోయే ఇహలోక జీవిత సామగ్రిని అల్లాహ్ తన మార్గంలో పోరాడే వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన పరలోక శాస్వత అనుగ్రహాలకు బదులుగా కోరుకుంటున్నారా (ఇష్టపడుతున్నారా) ?.ఇహలోక జీవిత సామగ్రి పరలోకము ముందు చాలా అల్పమైనది.అయితే శాస్వతమైన దానికి బదులుగా అంతమైపోయే దాన్ని,గొప్పదానికి బదులుగా అల్పమైన దాన్ని ఎంచుకోవటం ఒక బుద్ధి మంతుడికి ఎలా తగదు ?.

(39) ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు మీ శతృవులతో పోరాడటానికి అల్లాహ్ మార్గంలో జిహాద్ కొరకు బయలుదేరకపోతే అల్లాహ్ మిమ్మల్ని ఒత్తిడి ద్వారా,అవమానానికి గురి చేయటం ద్వారా,ఇతరవాటి ద్వారా శిక్షిస్తాడు.ఆయన జిహాద్ కొరకు పిలుపునిస్తే బయలుదేరి అల్లాహ్ కు విధేయత చూపే వారిని మీకు బదులుగా తీసుకుని వస్తాడు.ఆయన ఆదేశమును మీరు వ్యతిరేకించటం వలన ఆయనకు మీరు ఎటువంటి నష్టం చేయలేరు.ఆయనకు మీ అవసరం లేదు.ఆయన అవసరము మీకు ఉన్నది.మరియు అల్లాహ్ ప్రతీ వస్తువుపై అధికారం కలవాడు.ఆయనను ఏదిను అశక్తుడిని చేయదు.మరియు ఆయన మిమ్మల్ని వదిలి తన ప్రవక్తను,తన ధర్మమును సహాయము చేయటంలో సామర్ధ్యం కలవాడు.

(40) ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ ప్రవక్తకు సహాయం చేయకపోయినా మరియు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయటానికి ఆయన పిలుపును స్వీకరించకపోయినా నిశ్చయంగా అల్లాహ్ ముష్రికులు ఆయనను మరియు అబూబకర్ ను వెలివేసినప్పుడు మీరు ఆయనతో పాటు లేకపోయినా కూడా ఆయనకు సహాయం చేశాడు.వారిద్దరు తమను వెతుకుతూ ఉన్న అవిశ్వాసపరుల నుండి సౌర్ గుహలో దాక్కొని ఉన్నప్పుడు వారిద్దరు కాక మూడో వ్యక్తి లేడు.అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరుడు అబూబకర్ సిద్దీఖ్ తనను ముష్రికులు పట్టుకుంటారని భయపడినప్పుడు ఇలా పలికారు : మీరు విచారించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన తోడ్పాటుతో,సహాయముతో మనకు తోడుగా ఉన్నాడు.అల్లాహ్ తన ప్రవక్త హృదయముపై ప్రశాంతతను కురిపించాడు.మరియు ఆయన అతనిపై మీరు చూడలేని సైన్యములను దించాడు.వారు దైవ దూతలు.వారు ఆయనకు మద్దతును (తోడ్పాటును) ఇచ్చారు.మరియు ఆయన ముష్రికుల మాటను అట్టడుగ స్థితికి దించి వేశాడు.ఇస్లాం ఉన్నత స్థానమునకు చేరుకున్నప్పుడు అల్లాహ్ కలిమ (మాట) ఉన్నతమైన స్థానములో ఉన్నది.మరియు అల్లాహ్ తన అస్తిత్వంలో,తన అణచివేతలో,తన రాజ్యాధికారంలో ఆధిక్యము కలవాడు.ఆయనను ఎవరూ ఓడించలేరు.ఆయన తన పర్యాలోచనలో,తన విధి వ్రాతలో,తన ధర్మబద్దం చేయటంలో వివేకవంతుడు.

(41) ఓ విశ్వాసపరులారా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో,సానుకూలమైన పరిస్థితుల్లో యవ్వనంలో,వృద్ధాప్యంలో అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కొరకు బయలుదేరండి.మరియు మీరు మీ సంపదల ద్వారా,మీ ప్రాణాల ద్వారా పోరాడండి.నిశ్చయంగా ఆ బయలుదేరటం,సంపదలు,ప్రాణాల ద్వారా పోరాడటము యుద్ధం కొరకు బయలుదేరకుండా కూర్చోవటం,సంపదలు,ప్రాణాల భద్రతతో కొలువు తీరటం కన్న ఇహలోక జీవితంలో,పరలోక జీవితంలో చాలా ప్రయోజకరమైనది. ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే దానిపై ఆత్యాశ చూపండి.

(42) ఓ ప్రవక్తా యుద్ధం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరిన కపటులను మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో ఒక వేళ అది సులభంగా లభించే యుద్ధ ప్రాప్తి అయితే,ఎటువంటి కష్టములేని ప్రాయాణము అయితే వారు తప్పకుండా మిమ్మల్ని అనుసరించేవారు.కాని శతృవుల వైపు చేదించటానికి మీరు వారిని పిలిచిన ప్రయాణం దూరం అయిపోయింది.అయితే వారు వెనుక ఉండిపోయారు.వెనుక ఉండటం విషయంలో అనుమతి పొందిన ఈ కపటులందరు మీరు వారి వద్దకు వెళ్ళినప్పుడు ఇలా పలుకుతూ అల్లాహ్ పై ప్రమాణం చేస్తారు : ఒక వేళ మేము మీతోపాటు యుద్ధమునకు బయలుదేరే శక్తిని కలిగి ఉంటే తప్పకుండా మేము బయలుదేరే వాళ్ళము.వారి యుద్ధము నుండి వెనుక ఉండిపోవటం వలన,వారి ఈ అబద్దపు ప్రమాణాల వలన తమ ప్రాణములను అలాహ్ శిక్షకు సమర్పించుకుని స్వయాన నాశనమైపోయారు.మరియు వారు తమ వాదనల్లో,తమ ఈ ప్రమాణాల్లో అసత్యులని అల్లాహ్ కు తెలుసు.

(43) ఓ ప్రవక్తా యుద్ధంలో వెనుక ఉండటం విషయంలో మీరు వారికి అనుమతి ఇవ్వటంలో మీ ప్రయత్నము చేసిన విషయంలో అల్లాహ్ మిమ్మల్ని మన్నించుగాక.వారు ప్రవేశపెట్టిన తమ సాకుల్లో సత్యవంతులో,అందులో అసత్యవంతులో అని మీకు స్పష్టం అవ్వక ముందే వారికి మీరు ఎందుకు అనుమతినిచ్చారు ?.అటువంటప్పుడు మీరు వారిలో అసత్యవంతులకు కాకుండా సత్యవంతులకు అనుమతినిచ్చేవారు.

(44) ఓ ప్రవక్తా తమ సంపదల ద్వారా,తమ ప్రాణముల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతిని కోరటం అల్లాహ్ పై,ప్రళయ దినముపై సత్యవిశ్వాసమును కనబరిచే విశ్వాసపరులకు తగదు. కాని మీరు వారిని యుద్ధం కొరకు ఎప్పుడు బయలుదేరమని అడిగితే అప్పుడు బయలుదేరటం,తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటం వారికి వర్తిస్తుంది. మీతో పాటు బయలుదేరటం నుండి వారిని ఆపే కారణాలు ఉంటే తప్ప మీతో అనుమతి అడగని దైవభీతి గల తన దాసుల గురించి అల్లాహ్ కి బాగా తెలుసు.

(45) ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మార్గములో పోరాటము నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతి కోరే వారు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచని,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరచని కపటులు. అల్లాహ్ ధర్మం విషయంలో వారి మనస్సులకి సందేహము కలిగింది. వారు సత్యం వైపునకు మార్గం పొందకుండా తమ సందేహములో గందరగోళంగా ఊగిసలాడుతున్నారు.

(46) ఒక వేళ అల్లాహ్ మార్గములో యుద్ధము కొరకు మీతో పాటు బయలుదేరటమును వారు కోరుకుంటున్నారన్న వాదనలో వారు సత్యవంతులైతే దాని కొరకు వారు యుద్ధ సామగ్రిని తయారు చేసుకొని సిద్ధం అయ్యేవారు.కాని అల్లాహ్ మీతో పాటు వారి బయలుదేరటమును ఇష్టపడలేదు.అయితే వారికి బయలుదేరటం బరువైనది చివరికి వారు తమ ఇళ్ళలోనే కూర్చోవటమును ప్రాధాన్యతనిచ్చారు.

(47) ఈ కపటులందరు మీతో పాటు బయలుదేరకుండా ఉండటంలోనే మేలు ఉన్నది.ఒక వేళ వారు మీతో పాటు బయలుదేరి ఉంటే వారు నిస్సహాయ స్థిలిలో వదిలివేయటం,సందేహాలను కలిగించటం లాంటి కార్యాలను చేసి మీలో కల్లోలాలను అధికం చేస్తారు.మిమ్మల్ని చెల్లాచెదురు చేయటం కొరకు మీ పంక్తుల్లో చాడీలను వేగవంతంగా వ్యాపింపజేస్తారు.ఓ విశ్వాసపరులారా మీలో వారి అబద్దపు ప్రచారాలను విని వాటిని అంగీకరించి వ్యాపింపజేసేవారు ఉన్నారు.తద్వారా మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి.మరియు విశ్వాసపరుల మధ్య కుట్రలను,సందేహాలను కలిగించే కపటుల్లోంచి దుర్మార్గుల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.

(48) నిశ్చయంగా ఈ కపటులందరూ తబూక్ యుద్ధం కన్నా ముందు నుండే విశ్వాసపరుల మాటను వేరుచేసి,వారి ఐకమత్యమును చిందరవందర చేసి అల్లకల్లోలాలపై అత్యాశను చూపేవారు.ఓ ప్రవక్త వారు కుట్రలను పర్యాలోచన చేసి విషయాలను మీ కొరకు క్రమబద్దీకరించి చేసేవారు.బహుశ వారి కుట్రలు యుద్ధంలో మీ ధృఢ సంకల్పము పై ప్రభావము చూపుతాయని.చివరికి అల్లాహ్ సహాయము,ఆయన ప్రోత్సాహము మీ కొరకు వచ్చినది.మరియు వారు దానిపట్ల అయిష్టత చూపుతుండగా అల్లాహ్ తన ధర్మమును ఆధిక్యతను కలిగించాడు,తన శతృవులను అణచివేశాడు. ఎందుకంటే వారు సత్యము పై అసత్యమునకు విజయమును కోరుకునేవారు.

(49) మరియు కపటుల్లోంచి తయారు చేసుకున్న సాకులతో వంకలు పెట్టేవాడు ఇలా పలుకుతాడు : ఓ ప్రవక్త యుద్ధము నుండి వెనుక ఉండే విషయంలో నాకు అనుమతి ఇవ్వండి.రోమ్ శతృవుల స్త్రీలను నేను చూసినప్పుడు వారి పరీక్ష (ఫిత్నా) ద్వారా నాకు పాపము సంభవించకుండా ఉండేంత వరకు మీతో పాటు బయలుదేరటానికి మీరు నన్ను బలవంత పెట్టకండి.వినండి నిశ్చయంగా వారు పెద్ద పరీక్షలో దేని గురించి వారు వాదిస్తున్నారో దానిలో పడిపోయారు.అది కపటము పరీక్ష,వెనుక ఉండిపోయే పరీక్ష.నిశ్చయంగా నరకము ప్రళయ దినాన అవిశ్వాసపరులను చుట్టుముడుతుంది.వారిలోంచి ఎవరూ దాని నుండి తప్పించుకోలేరు.దాని నుండి పారిపోయే ఏ ప్రదేశమును వారు పొందలేరు.

(50) ఓ ప్రవక్తా ఒక వేళ మీకు సంతోషమును కలిగించే విజయము లేదా యుద్ధప్రాప్తి ద్వారా అల్లాహ్ అనుగ్రహము లభిస్తే వారు దాన్ని ఇష్టపడేవారు కాదు.మరియు దుఃఖం చెందేవారు.మరియు ఒక వేళ కష్టము లేదా శతృవు విజయం ద్వారా మీకు ఆపద కలిగితే ఈ కపటులందరు ఇలా అనేవారు : నిశ్చయంగా మేము మా స్వయం కొరకు జాగ్రత్తపడ్డాము . ఎందుకంటే విశ్వాసపరులు బయలుదేరినట్లు మేము యుద్ధం కొరకు బయలుదేరలేదు. వారికి మరణము,బంధీ అవ్వటం సంభవించినవి.ఆ తరువాత ఈ కపటులందరు శాంతి ద్వారా సంతోషపడుతూ తమ ఇంటి వారి వద్దకు మరలుతారు.

(51) ఓ ప్రవక్తా మీరు ఈ కపటులందరితో ఇలా పలకండి : అల్లాహ్ మా కొరకు రాసినదే మాకు సంభవిస్తుంది పరిశుద్ధుడైన ఆయన మన యజమాని,మేము రక్షణ కోరుకునే రక్షణ నిలయము అతనే. మేము మా వ్యవహారాల్లో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉంటాము.విశ్వాసపరులు తమ వ్యవహారాలను ఆయన ఒక్కడికే అప్పజెప్పుతారు.ఆయన వారికి చాలు,ఆయన చాలా మంచి కార్యసాధకుడు.

(52) ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా అనండి : మాకు విజయం కలగాలని లేదా అమరగతి కలగాలని మీరు నిరీక్షిస్తున్నారా ?.మరియు అల్లాహ్ తన వద్ద నుండి మీపై శిక్షను కలిగించి మిమ్మల్ని వినాశనమునకు గురి చేయాలని లేదా మా చేతులతో మిమ్మల్ని హతమార్చి,మిమ్మల్ని బందీలుగా చేసి మిమ్మల్ని ఆయన శిక్షించాలని మేము నిరీక్షిస్తున్నాము.అప్పుడే కదా ఆయన మీతో పోరాడటానికి మాకు అనుమతినిచ్చాడు.అయితే మీరు మా పరిణామం గురించి నిరీక్షించండి,మేము మీ పరిణామం గురించి నిరీక్షిస్తున్నాము.

(53) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు ఖర్చు చేయవలసినదేదో ఇష్టంతో లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేయండి.మీ అవిశ్వాసము వలన,మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగటం వలన మీరు ఖర్చు చేసిన దానిలో నుంచి మీ నుండి స్వీకరించబడదు.

(54) వారు చేసే ఖర్చులు స్వీకరించబడటం నుంచి మూడు విషయములు ఆపినవి : అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త పట్ల వారి అవిశ్వాసము,వారు నమాజు పాటించేటప్పుడు వారి బద్దకము,వారి సోమరతనము,వారు తమ సంపదను ఇష్టముతో ఖర్చు చేసేవారు కాదు,వారు వాటిని ఖర్చు చేసినా బద్దకంతో ఖర్చు చేసేవారు.ఎందుకంటే వారు తమ నమాజుల్లో,తమ ఖర్చు చేయటంలో పుణ్యాన్ని ఆశించేవారు కాదు.

(55) ఓ ప్రవక్తా కపటుల సంపదలు,వారి సంతానము మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేయకూడదు.మరియు మీరు వాటిని మంచిగా భావించకండి.వారి సంపదల,వారి సంతాన పరిణామం చెడ్డది.అయితే వాటిని పొందటం కొరకు శ్రమ,కష్టము ద్వారా,వారి అవిశ్వాస స్థితిలో అల్లాహ్ వారి ఆత్మలను వెలికి తీసే వరకు వాటి విషయంలో కురిసే ఆపదల ద్వారా అల్లాహ్ వాటిని వారిపై శిక్షగా చేస్తాడు.వారు నరకములో అట్టడుగు స్థానములో శాస్వతముగా ఉండటం ద్వారా శిక్షింపబడుతారు.

(56) ఓ విశ్వాసపరులారా కపటులు మీ ముందట వారు మీ అందరిలోంచి వారని అబధ్ధపు ప్రమాణం చేస్తున్నారు.వాస్తవానికి వారు వారి లోపరంగా మీలో నుంచి కారు.ఒక వేళ వారు మీలో నుంచి అని స్పష్టపరచినా.కాని వారు ముష్రికుల పట్ల ఏదైతే హతమార్చటం,బంధీ చేయటం జరిగినదో వారిపట్ల అదే జరుగుతుందని భయపడుతున్నారు.అయితే వారు రక్షణ కొరకు ఇస్లాంను బహిర్గతం చేస్తున్నారు.

(57) ఒక వేళ ఈ కపటులందరు వారు తమ స్వయాన్ని రక్షించుకునే కోటను గాని దాక్కోవటానికి కొండల్లో గుహలను గాని లేదా ప్రవేశించటానికి సొరంగమును గాని దేనినైనా శరణాలయంగా పొందితే వారు దాని వైపు శరణం పొందుతారు.మరియు అందులో వారు తొందర చేస్తూ ప్రవేశిస్తారు.

(58) ఓ ప్రవక్తా కపటులు కొందరు దానాలు పంచే విషయంలో వాటిలోంచి వారు ఆశించినది పొందకపోయినప్పుడు మీ పై అపనిందలు మోపుతున్నారు.ఒక వేళ వాటిలో నుంచి వారు కోరుకున్నది మీరు వారికి ఇస్తే మీ పట్ల సంతుష్టపడేవారు.మరియు ఒక వేళ వాటిలో నుంచి వారు కోరకున్నది మీరు ఇవ్వకపోతే వారు కోపాన్ని ప్రదర్శిస్తారు.

(59) ఒక వేళ దానాలు పంచే విషయంలో మిమ్మల్ని అపనింద పాలు చేస్తున్న ఈ కపటులందరు అల్లాహ్ వారి కొరకు అనివార్యము చేసిన దాని పట్ల,అందులో నుంచి ఆయన ప్రవక్త వారికి ప్రసాదించిన దాని పట్ల సంతుష్టపడితే,మరియు ఇలా పలికితే అల్లాహ్ మనకు చాలు,తొందరలోనే అల్లాహ్ తన అనుగ్రహములో నుంచి తాను కోరుకున్నది మనకు ప్రసాధిస్తాడు.మరియు తొందరలోనే ఆయన ప్రవక్త అల్లాహ్ ఆయనకు ప్రసాదించిన దానిలో నుంచి మనకు ఇస్తారు.నిశ్చయంగా మేము అల్లాహ్ ఒక్కడే తన అనుగ్రహములో నుంచి మనకు ప్రసాధిస్తాడని ఆశిస్తున్నాము.ఒక వేళ వారు అలా చేస్తే మీకు అపనిందపాలు చేయటం కన్న అది వారి కొరకు మేలైనది.

(60) విధి గావించబడిన జకాత్ దానాలు నిరుపేదల కొరకు ఖర్చు చేయటం తప్పనిసరి. మరియు వారే అవసరము కలవారు ఎవరి వద్దనైతే ఒక వృత్తి లేదా ఒక ఉద్యోగము ఉండి ధనం ఉన్నది కాని అది వారికి సరిపోదు,వారి స్థితి గురించి తెలియజేయబడదు. ఆ నిరుపేదలు ఎవరైతే ఎటువంటి వస్తువు అధికారము లేని వారు (ఏమీ లేని వారు) . వారి స్థితి,వారి తీరు వలన వారు ప్రజల నుండి గోప్యంగా ఉండరు. మరియు ఆ శ్రమించేవారి కొరకు ఎవరినైతే నాయకుడు (ఇమాము) వాటిని (జకాతును) శేకరించటానికి పంపించాడో వారు.మరియు ఆ అవిశ్వాసపరుల కొరకు ఎవరైతే ఇస్లాం స్వీకరించటానికి వాటి ద్వారా ఆకర్షింపజేయబడినవారు లేదా విశ్వాసము బలహీనంగా ఉండటం వలన వారి విశ్వాసమును బలపరచటానికి,కీడు కలిగిన వారి కీడును వాటి ద్వారా తొలగింపజేయటానికి.వాటిని ఖర్చు చేసి బానిసలను విముక్తి కలిగించటం కొరకు.ఋణగ్రస్తుల కొరకు ఎటువంటి దుబారాలో కాకుండా,ఎటువంటి అవిధేయతలో కాకుండా ఒక వేళ వారు తమపై ఉన్న ఋణమును తీర్చలేకున్న స్థితిలో ఉంటే.అల్లాహ్ మార్గములో ధర్మపోరాటం చేసేవారిని సిద్ధం చేయటం కొరకు ఖర్చు చేయటం.మరియు ఆ ప్రయాణికులు ఎవరిదైతే ఖర్చు చేసే సామగ్రి అంతమైపోయిందో వారు.వీరందరిపై జకాతును ఖర్చు చేయటం పరిమితం చేయటం అల్లాహ్ తరపు నుండి విధి. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనాలను తెలిసిన వాడు,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనములో వివేకవంతుడు.

(61) కపటుల్లోంచి ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను మాటల ద్వారా బాధ పెట్టేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఓర్పును చూసినప్పుడు ఇలా పలికేవారు : నిశ్చయంగా ఇతడు ప్రతి ఒక్కడిని విని అతన్ని నమ్ముతున్నాడు. సత్యఅసత్యాల మధ్య తేడా చూపటం లేదు.ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : నిశ్చయంగా ప్రవక్త మేలైన వాటిని మాత్రమే వింటాడు,అల్లాహ్ ను నమ్ముతాడు మరియు సత్య విశ్వాసపరులు ఆయనకు తెలిపే వాటిని నమ్ముతాడు,వారిపై దయ చూపుతాడు. నిశ్చయంగా ఆయన దైవదౌత్యము ఆయన్ను విశ్వసించే వారి కొరకు కారుణ్యము.ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను బాధల్లోంచి ఏ బాధ పెట్టిన వారికి బాధాకరమైన శిక్ష ఉన్నది.

(62) ఓ విశ్వాసపరులారా కపటులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధ కలిగించే మాటలు మాట్లాడలేదని మీ ముందట అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు.ఇదంత వారు మిమ్మల్ని సంతుష్ట పరచటానికి. ఒక వేళ వీరందరూ సత్య విశ్వాస పరులైతే విశ్వాసము,సత్కార్యము ద్వారా సంతుష్టపరచటానికి అల్లాహ్,ఆయన ప్రవక్త ఎక్కువ హక్కుదారులు.

(63) తాము పాల్పడుతున్న ఈ చర్య వలన అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదిస్తున్నారని (ధ్వేషిస్తున్నారని),వారిని ధ్వేషించే వాడు ప్రళయ దినాన నరకాగ్నిలో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేశిస్తాడని ఈ కపటులందరికి తెలియటంలేదా ?.అది అగౌరవము,పెద్ద అవమానము.

(64) తమ హృదయాల్లో దాచిన అవిశ్వాసమును విశ్వాసపరులకు తెలియజేసే ఏదైన సూరహ్ ను అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేస్తాడని కపట విశ్వాసులు భయపడేవారు. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ కపట విశ్వాసులారా మీరు ధర్మ విషయంలో మీ హేళన చేయటంలో,మీ చెడు ప్రస్తావనలో ఉండండి,అల్లాహ్ మీరు దేని గురించి భయపడుతున్నారో సూరహ్ అవతరణ చేయటం ద్వారా లేదా దాన్ని తన ప్రవక్తకు తెలియ పరచటం ద్వారా బయట పెడుతాడు.

(65) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు కపటులతో వారు విశ్వాసపరులని అవమానపరుస్తూ,తిడుతూ మాట్లడిన మాటల గురించి అల్లాహ్ మీకు తెలియపరచిన తరువాత అడిగితే వారు మేము పరిహాసంగా మాట్లాడాము,మేము తగాదా పడే వారము కాము అని తప్పకుండా సమాధానమిస్తారు.ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఏమి మీరు అల్లాహ్ గురించి,ఆయన ఆయతుల గురించి,ఆయన ప్రవక్త గురించి పరిహాసమాడుతున్నారా ?.

(66) ఈ అబద్దపు సాకుల ద్వారా వంకలు పెట్టకండి,నిశ్చయంగా మీరు అవిశ్వాసమును దాచిపెట్టిన తరువాత మీ హేళన ద్వారా దాన్ని బహిర్గతం చేశారు.ఒక వేళ కపటత్వము నుంచి పశ్చాత్తాప్పడి వదిలి వేయటం వలన,అల్లాహ్ కొరకు చిత్తశుద్ది కలిగి ఉండటం వలన మీలోనుంచి ఒక వర్గమును మేము మన్నించి వేసినా మీలో నుంచి ఒక వర్గమును కపటత్వములో మొండిగా ఉండి దాని నుండి వారి పశ్చాత్తాపము లేక పోవటం వలన శిక్షిస్తాము.

(67) కపట విశ్వాస పురుషులు,స్త్రీలు అందరూ కపట లక్షణాల్లో ఒక్కటే.వారు విశ్వాసపరులకు విరుద్ధంగా ఉంటారు.వారు చెడును గురించి ఆదేశిస్తారు,మంచి నుండి వారిస్తారు.వారు తమ సంపదలో పిసినారితనాన్ని చూపి వాటిని వారు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయరు.అల్లాహ్ పై విధేయత చూపటమును వారు వదిలివేశారు.అల్లాహ్ వారిని దాని అనుగ్రహము నుండి వదిలివేశాడు.నిశ్చయంగా కపటులు అల్లాహ్ విధేయత నుండి,సత్య మార్గము నుండి ఆయన అవిధేయత వైపునకు,అపమార్గము వైపునకు వైదొలగిపోతున్నారు.

(68) అల్లాహ్ పశ్చాత్తాప్పడని కపటులకు,అవిశ్వాసపరులకు నరకాగ్నిలో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేశింపజేస్తాడని వాగ్దానం చేసాడు.అది వారికి శిక్షగా తగినది.మరియు అల్లాహ్ వారిని తన కారుణ్యము నుండి బహిష్కరించాడు. మరియు వారి కొరకు ఎడతెగని శిక్ష ఉన్నది.

(69) ఓ కపట విశ్వాసము కల సమాజము వారా మీరు అవిశ్వాసములో,పరిహాసములో మీకన్న పూర్వం గతించిన తిరస్కార జాతుల్లాంటి వారు.వారు బలములో మీకన్న గొప్పవారు,సంపదలు,సంతానము ఎక్కువ కలవారు.వారు తమ కొరకు వ్రాయబడిన ఇహలోక సుఖాలు,వాటి కోరికల నుండి తమ భాగమును అనుభవించారు. ఓ కపట విశ్వాసము కలవారా మీరు కూడా మీ కొరకు వ్రాయబడిన మీ భాగమును మీకన్న పూర్వం గతించిన తిరస్కార జాతుల వారు తమ భాగమును అనుభవించినట్లు అనుభవించారు.మరియు మీరు సత్యాన్ని తిరస్కరించటంలో,దైవ ప్రవక్త విషయంలో అవహేళన చేయటంలో ఏవిధంగానైతే వారు దాన్ని తిరస్కరించటంలో,తమ ప్రవక్తల విషయంలో అవహేళన చేయటంలో పడి ఉన్నారో ఆ విధంగా పడి ఉన్నారు.ఈ దిగజారిన లక్షణాలు కలవారందరి ఆచరణలు అవిశ్వాసము వలన చెడిపోవటం వలన అల్లాహ్ వద్ద దేనికి పనికి రాకుండాపోయినవి.వారందరు నష్టపోయినారు ఎవరైతే తమని వినాశనమును కలిగించే చోట తీసుకుని వచ్చి తమ స్వయాన్ని నష్టం చేసుకున్నారో .

(70) ఏమి ఈ కపటులందరికి తిరస్కార జాతులవారు పాల్పడిన కార్యాల సమాచారము,వారికి విధించబడిన శిక్ష సమాచారము చేరలేదా?.నూహ్ జాతి,హూద్ జాతి,సాలిహ్ జాతి,ఇబ్రాహీమ్ జాతి,మద్యన్ వారు,లూత్ జాతి బస్తీల సమాచారము .వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఋజువులను,స్పష్టమైన వాదనలను తీసుకుని వచ్చారు. అల్లాహ్ వారిపై హింసకు పాల్పడడు. వారి ప్రవక్తలు వారిని హెచ్చరించారు. కాని వారు అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయన ప్రవక్తను తిరస్కరిచటం లాంటి చర్యలకు పాల్పడటం వలన తమ స్వయంపై హింసకు పాల్పడ్డారు.

(71) విశ్వాసపరులైన పురుషులు,విశ్వాసపరులైన స్త్రీలు వారిలో విశ్వాసము సమీకరింపబడి ఉండటం వలన ఒకరికొకరు సహాయకులు,తోడ్పడేవారు. వారు మంచిని గురించి ఆదేశిస్తారు. మరియు అది ఆ ప్రతి కార్యము ఏదైతే అల్లాహ్ కు ఇష్టమైనదో ఆయన విధేయతకు సంబంధించినది తౌహీదు,నమాజుల్లాంటివి. మరియు వారు చెడు నుంచి వారిస్తారు.అది అల్లాహ్ కు ఇష్టం లేని అవిధేయతకు సంబంధించిన ఆ ప్రతి కార్యము అవిశ్వాసము,వడ్డీ లాంటివి. మరియు వారు నమాజులను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. మరియు వారు అల్లాహ్ పై విధేయత చూపుతారు,ఆయన ప్రవక్తపై విధేయత చూపుతారు. ఈ ఉన్నతమైన లక్షణాలు కలిగిన వారందరిని తొందరలోనే అల్లాహ్ తన కారుణ్యములో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యతను చూపేవాడును ఆయనను ఎవరు ఓడించలేరు. ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడు.

(72) అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన పురుషులకు మరియు ఆయనపై విశ్వాసమును కనబరచిన స్త్రీలకు ప్రళయదినాన స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. వాటి భవనాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి,వారు వాటిలో శాస్వతంగా నివాసముంటారు. వారు వాటిలో మరణించరు. మరియు వారి అనుగ్రహాలు అంతము కావు. మరియు ఆయన వారిని శాస్వతమైన స్వర్గవనాల్లో ఉన్న మంచి నివాస స్థలాల్లో ప్రవేశింపజేస్తాడని వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వారిపై కలిగించే ప్రసన్నత వీటన్నింటి కంటే చాలా పెద్దది. ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము ఎంత గొప్పదంటే దానికి సమానమగు ఎటువంటి ప్రతిఫలం లేదు.

(73) ఓ ప్రవక్తా అవిశ్వాసపరులతో ఖడ్గముతో పోరాడండి. మరియు కపటులతో నోటి ద్వారా,వాదన ద్వారా పోరాడండి. రెండు వర్గాలపట్ల కఠినంగా వ్యవహరించండి.వారు దీనికి తగినవారు. ప్రళయదినాన వారి నివాసస్థలము నరకము.మరియు వారి గమ్యస్థానము ఎంతో చెడ్డదైన గమ్యస్థానము.

(74) కపటులు వారితరపు నుండి మీకు కలిగిన తిట్లు,మీ ధర్మమును అపనిందపాలు చేయటం (లోపాలు చూపటం) లాంటి మాటలు వారు పలకలేదని అబధ్ధము పలుకుతూ ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు పలికినవి మీకు చేరినవి మాటలు వారిని అవిశ్వాసపరులని తెలుపుతున్నవి. వారు విశ్వాసమును బహిర్గతం చేసిన తరువాత అవిశ్వాసమును బహిర్గతం చేశారు. మరియు వారికి సాధ్యం కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దాడీ చేయటమును నిశ్చయించుకున్నారు. వారు నిరాకరించకూడదన్న దాన్ని నిరాకరించారు.మరియు అది అల్లాహ్ యుద్ధ ప్రాప్తుల ద్వారా వారిని సంపన్నులు చేసి వారిపై అనుగ్రహించినది దేనినైతే ఆయన తన ప్రవక్తు అనుగ్రహించాడో అది.ఒకవేళ వారు తమ కపటత్వము నుండి అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడితే దాని నుండి వారి పశ్చాత్తాపము దానిపై వారు ఉండటం కంటే వారి కొరకు ఎంతో మేలైనది.ఒక వేళ వారు అల్లాహ్ యందు పశ్చాత్తాపము నుండి విముఖత చూపితే ఆయన వారికి ఇహలోకములో హతమార్చటం ద్వారా,బంధీలు చేయటం ద్వారా బాధాకరమైన శిక్షను విధిస్తాడు.మరియు పరలోకములో వారికి నరకాగ్ని ద్వారా బాధాకరమైన శిక్షను విధిస్తాడు.వారిని శిక్ష నుండి కాపాడటానికి వారిని రక్షించే సంరక్షకుడు వారి కొరకు ఎవడూ ఉండడు.మరియు వారి నుండి శిక్షను దూరం చేసే సహాయకుడూ ఉండడు.

(75) కపటుల్లోంచి అల్లాహ్ పై ప్రమాణము చేసి ఈ విధంగా పలికేవారు ఉన్నారు : ఒకవేళ అల్లాహ్ తన అనుగ్రహమును మాకు ప్రసాదిస్తే మేము తప్పకుండా అవసరం కలవారికి దానం చేస్తాము. మరియు మేము తప్పకుండా తమ ఆచరణల సంస్కరణ అయిన పుణ్యాత్ముల్లోంచి అవుతాము.

(76) పరిశుద్ధుడైన అల్లాహ్ వారికి తన అనుగ్రహమును ప్రసాదించినప్పుడు వారు అల్లాహ్ తో ప్రమాణం చేసిన దాన్ని పూర్తి చేయలేదు.అంతేకాక తమ సంపదలనుండి ఏదీ దానం చేయకుండా ఆపివేశారు. వారు విశ్వాసము నుండి విముఖత చూపుతూ వెను తిప్పి వెళ్ళిపోయారు.

(77) వారు అల్లాహ్ తో చేసిన ప్రమాణమునకు వారి వ్యతిరేకము వలన,వారి తిరస్కారము వలన వారికి శిక్షగా ప్రళయదినం వరకు వారి హృదయాల్లో కపటత్వమును నాటుకునేటట్లుగా ఆయన వారి పరిణామమును చేశాడు.

(78) ఏమీ వారు తమ సమావేశాల్లో చేసుకునే రహస్య కుట్రల,కుతంత్రాల గురించి వారు అల్లాహ్ కు తెలియదని అనుకుంటున్నారా ?.మరియు వాస్తవానికి అల్లాహ్ అగోచరవిషయాల గురించి జ్ఞానము కలవాడు. వారి ఆచరణల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే వారికి వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(79) చిన్నపాటి దానధర్మాలు చేయటంపై విశ్వాసపరుల్లోంచి స్వఛ్ఛంద సేవకులు ఎవరైతే కేవలం తమ శక్తిమేరకు చాలా తక్కువ వాటిని పొందే వారు వారిని అపనిందపాలు చేసేవారు వారిని ఈ విధంగా పలుకుతూ ఎగతాళి చేస్తారు : వారి దానము ఏవిధంగా ప్రయోజనకరమైనది ?.విశ్వాసపరులకు వారి ఎగతాళికి ప్రతిఫలంగా అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తాడు. మరియు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.

(80) ఓ ప్రవక్తా మీరు వారి కొరకు మన్నింపును వేడుకున్నా,వేడుకోకపోయిన.ఒక వేళ మీరు దాన్ని డబ్బై సార్లు వేడుకున్నా నిశ్చయంగా దాన్ని ఎక్కువ సార్లు వేడుకోవటం వారి కొరకు అల్లాహ్ మన్నింపును చేగూరదు.ఎందుకంటే వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను తిరస్కరించేవారు.మరియు అల్లాహ్ ఆయన ధర్మము నుండి కావాలని,ఉద్ధేశపూర్వకంగా వైదొలిగే వారికి సత్య భాగ్యమును కలిగించడు.

(81) తబూక్ యుద్థము నుండి వెనుక ఉండిపోయిన కపటులు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహహు అలైహి వసల్లం వెళ్ళిన తరువాత అల్లాహ్ మార్గములో పోరాడటము నుండి తమ కూర్చోవటం పై సంతోషబడిపోయారు.విశ్వాసపరులు పోరాడినట్లు అల్లాహ్ మార్గములో తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటంను ఇష్టపడలేదు.మరియు వారు తమ కపట సోధరులను ఆపుతూ ఇలా పలికారు : మీరు తీవ్రమైన ఎండలో వెళ్శకండి.తబూక్ యుద్ధము ఎండాకాలములో జరిగింది.ఓ ప్రవక్తా వారితో అనండి : కపటులు నిరీక్షిస్తున్న నరకాగ్ని వారు పారిపోయిన ఈ ఎండ కన్నా ఎంతో తీవ్రమైనది ఒక వేళ వారు తెలుసుకుంటే ఎంతో బాగుండేది.

(82) కావున యుద్ధపోరాటము నుండి వెనుక ఉండిపోయిన ఈ కపటులందరు అంతమైపోయే తమ ఇహలోక జీవితంలో చాలా తక్కువ నవ్వాలి,ఎల్లప్పుడు ఉండే తమ పరలోక జీవితంలో తాము ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,అవిధేయతా కార్యాలు,పాప కార్యాలకు ప్రతిఫలంగా ఎక్కువ ఏడవాలి.

(83) ఓ ప్రవక్తా(స.అ.స) అల్లాహ్ ఈ కపటవిశ్వాసుల్లో నుంచి తమ కపటవిశ్వాసముపై స్థిరంగా ఉన్న ఒక వర్గము వైపునకు మిమ్మల్ని మరలిస్తే వారు మీతోపాటు వేరొక యుద్ధంలో బయలదేరటానికి మిమ్మల్ని అనుమతి కోరుతారు.అప్పుడు మీరు వారితో ఇలా పలకండి : ఓ కపటవిశ్వాసుల్లారా మీరు అల్లాహ్ మార్గములో యుద్ధ పోరాటములో నాతోపాటు ఎన్నడూ బయలుదేరరు మీకు శిక్ష కొరకు,నాతోపాటు ఉంటే కలిగే నష్టాల నుండి జాగ్రత్త కొరకు. మీరు తబూక్ యుద్ధములో (ఇండ్లలో) కూర్చోవటానికి,(యుద్ధము నుండి) వెనుక ఉండిపోవటానికి ఇష్టపడ్డారు.అయితే మీరు (ఇండ్లలోనే) కూర్చోండి,వెనుక ఉండిపోయిన రోగులు,స్త్రీలు,పిల్లలతో పాటు ఉండిపోండి.

(84) ఓ ప్రవక్తా మీరు కపటుల్లోంచి మరణించిన వారి ఏ జనాజా నమాజును ఏమాత్రం చదివించకండి,మరియు అతని సమాధి వద్ద అతని మన్నింపు వేడుకోవటం కొరకు నిలబడకండి.ఇది ఎందుకంటే వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపారు,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును చూపారు.మరియు వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలిగి మరణించారు.మరియు ఎవరైతే ఇలా ఉంటాడో అతని జనాజా నమాజు చదివించకూడదు,మరియు అతని కొరకు దుఆ చేయకూడదు.

(85) ఓ ప్రవక్తా ఈ కపట విశ్వాసులందరి సంపదలు,వారి సంతానము మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేయకూడదు.కేవలం అల్లాహ్ వాటి ద్వారా వారిని ఇహలోక జీవితంలో శిక్షించదలిచాడు.మరియు అది వారు దాని మార్గములో అనుభవిస్తున్నకష్టాల మరియు విపత్తుల ద్వారా జరుగును.మరియు వారి శరీరముల నుండి వారి ఆత్మలు వీడే సమయములో వారు తమ అవిశ్వాసములో ఉండాలని (కోరుతున్నాడు).

(86) మరియు ఎప్పుడైతే అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అల్లాహ్ ను విశ్వశించే మరియు ఆయన మార్గములో ధర్మ పోరాటమునకు సంబంధించి ఏదైన సూరహ్ ను అవతరింపజేసినప్పుడు వారిలోంచి ధనవంతులు,స్థితిమంతులు యుద్ధం నుండి వెనుక ఉండిపోవటం కొరకు మీతో అనుమతిని కోరుతారు.మరియు వారు ఇలా అంటారు : మీరు మమ్మల్ని వదిలివేయండి మేము కారణాలు కలవారైన బలహీనులు,రోగుల తోపాటు యుద్ధము నుండి వెనుక ఉండిపోతాము.

(87) ఈ కపటులందరు కారణాలు కలవారితోపాటు యుద్ధం నుండి వెనుక ఉండిపోవటంను ఇష్టపడినప్పుడు వారు తమ స్వయం కొరకు పరాభవమును,అవమానమును ఇష్టపడ్డారు.మరియు అల్లాహ్ వారి అవిశ్వాసము,వారి కపటత్వము వలన వారి హృదయాలపై సీలు వేశాడు.కావున వారు తమ ప్రయోజనం దేనిలో ఉందో తెలుసుకోలేరు.

(88) ప్రవక్త,ఆయన తోపాటు విశ్వాసపరులు అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వీరందరిలాగా (కపట విశ్వాసుల్లాగా) వెనుక ఉండిపోలేదు,వారు తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడారు.అల్లాహ్ వద్ద వారి ప్రతిఫలం ఉంటుంది.వారి కొరకు విజయము,యుద్ధప్రాప్తి లాంటి ప్రాపంచిక ప్రయోజనాలను పొందటం,పరలోక ప్రయోజనాలను పొందటం, స్వర్గములో ప్రవేశించటం,ఆశించిన వాటి ద్వారా సాఫల్యమును పొందటం,భయంకరమైన వాటి నుండి బ్రతికి బయటపడటం వాటిలోంచివే.

(89) అల్లాహ్ వారి కొరకు ఎటువంటి స్వర్గవనాలను సిధ్ధం చేశాడంటే వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి.వాటిలో వారు ఎల్లవేళలా ఉంటారు,వారికి మరణం సంభవించదు.ఈ ప్రతిఫలమే ఎటువంటి గొప్ప సాఫల్యము అంటే దానికి సరితూగే మరో సాఫల్యము లేదు.

(90) మరియు మదీనా యొక్క పల్లె వాసులు,దాని చుట్టు ప్రక్కల లోంచి ఒక వర్గం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అల్లాహ్ మార్గములో బయలుదేరటం నుండి,యుద్ధ పోరాటము నుండి వెనుక ఉండిపోయే విషయంలో వారికి ఆయన అనుమతి ఇవ్వాలని సాకులు చెబుతూ వచ్చారు.మరియు వేరొక వర్గము అల్లాహ్ వాగ్దానము పై వారి విశ్వాసము లేనందు వలన,ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారు అంగీకరించక పోవటం వలన వారు ఎటువంటి కారణం చెప్పకుండానే వెనుక ఉండిపోయారు.తొందరలోనే వీరందరు తమ అవిశ్వాసము వలన బాధాకరమైన శిక్షను పొందుతారు.

(91) స్త్రీల పై,పిల్లల పై,వ్యాధిగ్రస్తుల పై,వృద్ధుల పై,ప్రయాణ వాహనమును సమకూర్చుకోవటం కోసం ఖర్చు చేయవలసిన ధనము లేని పేదవారి పై ఎటువంటి దోషము లేదు. (యుద్ధము కొరకు) బయలుదేరటం నుండి వెనుక ఉండటంలో వీరందరి పై ఎటువంటి పాపము లేదు ఎందుకంటే వారు ఎప్పుడైతే అల్లాహ్ కొరకు,ఆయన ప్రవక్త కొరకు చిత్తశుద్ధిని చూపి వారు ఆయన ధర్మము పై అమలు చేశారో వారి సాకులు ఉనికిలో ఉన్నాయి.ఈ సాకులు కలిగిన సజ్జనులపై శిక్షను కలిగించటానికి ఎటువంటి మార్గము లేదు.మరియు అల్లాహ్ సజ్జనుల పాపములను మన్నించే వాడును,వారిపై కనికరించేవాడును.

(92) మరియు అదేవిధంగా మీ నుండి వెనుక ఉండిపోయిన వారిపై ఎటువంటి పాపము లేదు ఎవరైతే మీ వద్దకు ప్రయాణపు వాహనమును కోరుతూ వస్తే మిమ్మల్ని నేను సవారీ చేయించటానికి ప్రయాణపు వాహనంగా ఎటువంటి జంతువు నా వద్ద లేదు అని మీరు వారికి సమాధానమిచ్చారు.వారు తమ తరుపు నుండి లేదా మీ తరపు నుండి ఖర్చు చేసే ధనము పొందక పోవటం పై నిరాశులై చింతిస్తూ కన్నీరు కారుస్తూ మీవద్ద నుండి వెనుతిరిగారు.

(93) ఎప్పుడైతే అల్లాహ్ సాకులు కలిగిన వారికి శిక్షించటానికి ఎటువంటి దారి లేదని స్పష్టపరిచాడో యాతనకు ,శిక్షకు అర్హుడు ఎవరో ప్రస్తావించాడు.అయితే ఆయన ఇలా పలికాడు : ఓ ప్రవక్తా ప్రయాణపు వాహనమును సమకూర్చుకునే స్థోమత కలిగి ఉండి కూడా యుద్ధము నుండి వెనుక ఉండి పోయే విషయంలో మీతో అనుమతి కోరుతున్న వారందరూ వెనుక ఉండిపోయే వారితో ఇండ్లలో ఉండిపోయారు.ఈ విధంగా వారు స్వయంగా పరాభవమును,అవమానమును ఇష్టపడ్డారు.మరియు అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేశాడు.అవి హితబోధన ద్వారా ప్రభావితం కావు.మరియు వారు ఈ ముద్ర వలన తమకు ప్రయోజనం ఉన్నవాటిని ఎంచుకోవటమూ మరియు నష్టము ఉన్నవాటి నుండి బయటపడటానికి తెలుసుకోలేరు.

(94) యుద్ధపోరాటము నుండి వెనుక ఉండిపోయిన కపట విశ్వాసులు, ముస్లిములు యుధ్ధము నుండి మరలినప్పుడు వారి ముందు బలహీన సాకులు చెప్పేవారు.అల్లాహ్ వారిని మీరు అబద్దపు సాకులు చెప్పకండి, మీరు మాకు తెలియపరచిన వాటిని మేము అంగీకరించము,అల్లాహ్ మీ మనసుల్లో ఉన్న ప్రతీ విషయాన్ని మాకు తెలియపరచాడు అని ప్రతిస్పందించమని తన ప్రవక్తకు,విశ్వాసపరులకు ఆదేశించాడు.ఏమీ అల్లాహ్ మీ పశ్చాత్తాపమును అంగీకరించటానికి మీరు పశ్చాత్తాప్పడుతారా లేదా మీరు మీ కపట విశ్వాసముపై కొనసాగుతారా ? అన్న విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చూస్తారు.ఆ తరువాత మీరు అన్నీ విషయాల జ్ఞానము కల అల్లాహ్ వైపునకు మరలించబడుతారు.ఆయన మీరు చేసిన కర్మల గురించి మీకు తెలియపరుస్తాడు.వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.అయితే మీరు పశ్చాత్తాపము,సత్కార్యము వైపునకు త్వరపడండి.

(95) ఓ విశ్వాసుల్లారా మీరు యుద్ధము నుండి వెనుక ఉండిపోయే వారి వైపునకు మరలినప్పుడు వారు తమ అసత్య సాకులకు తాకీదుగా మీరు వారిని నిందించటం నుండి,వారిని తిట్టటం నుండి ఆపివేయాలని అల్లాహ్ పై ప్రమాణాలు వేస్తారు.అయితే మీరు వారిని కోపముతో వదిలి వేయండి,వారిని వారి మానాన విడిచిపెట్టండి.నిశ్చయంగా వారు అశుద్ధులు,అంతఃకరణపు పావులు.వారు చేసుకున్న కపటత్వము,పాపములకు ప్రతిఫలంగా వారు శరణం తీసుకునే వారి నివాస స్థలము నరకము.

(96) ఓ విశ్వాసపరులారా యుద్ధము నుండి వెనుక ఉండిపోయిన వీరందరు మీరు వారితో రాజీ పడాలని,మీరు వారి సాకులను అంగీకరించాలని మీ ముందట ప్రమాణాలు చేస్తున్నారు.అయితే మీరు వారితో రాజీపడకండి.ఒక వేళ మీరు వారితో రాజీపడితే నిశ్చయంగా మీరు మీ ప్రభువును విభేదించారు.ఎందుకంటే ఆయన అవిశ్వాసము,కపటత్వము ద్వారా తన విధేయత నుండి వైదొలిగే ప్రజలతో రాజీ పడడు.ఓ ముస్లిములారా అల్లాహ్ రాజీ పడని వారితో మీరు రాజీ పడడం నుండి జాగ్రత్తపడండి.

(97) పల్లె వాసులు ఒకవేళ అవిశ్వాసమును కనబరచినా లేదా కపట విశ్వాసమును చూపినా వారి అవిశ్వాసము ఇతరులైన పట్టణ వాసుల అవిశ్వాసము కన్న కఠినమైనది.మరియు వారి కపట విశ్వాసము వీరందరి కపట విశ్వాసము కన్నా కఠినమైనది.వారు ధర్మము గురించి అజ్ఞానము కలిగి ఉండటంలో ఎక్కువ యోగ్యులు.మరియు వారిలో కఠినత్వము,మొరటుతనము,పరిచయము లేకపోవటము ఉండటం వలన వారులు విధులను,సున్నతులను,అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాలను తెలుసుకోకుండా ఉండటంలో ఎక్కువ హక్కుదారులు.మరియు అల్లాహ్ వారి స్థితులను గురించి ఎక్కువ తెలిసిన వాడు.వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.ఆయన తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనములో వివేకవంతుడు.

(98) పల్లెవాసుల్లోంచి కపట విశ్వాసుల్లోంచి ఒక వేళ ఖర్చు చేస్తే ప్రతిఫలం లభించదని,ఖర్చు చేయకపోతే అతన్ని అల్లాహ్ శిక్షించడన్న ఆలోచన వలన అల్లాహ్ మార్గంలో అతడు చేసిన ఖర్చును నష్టముగా,జరిమానాగా భావించే వారున్నారు. కానీ అతడు దీనితోపాటు ప్రదర్శించటానికి,రక్షణగా అప్పుడప్పుడు ఖర్చు చేస్తాడు. మరియు ఓ విశ్వాసపరులారా మీపై కీడు కలిగి అతడు మీ నుండి తప్పించుకోవాలని నిరీక్షిస్తున్నాడు. కాని వారు విశ్వాసపరులపై పడాలని ఆశించిన చెడులు,దుష్పరిణామ ఆపదలను విశ్వాసపరులపై కాకుండా అల్లాహ్ వారిపైనే వేసేశాడు. మరియు అల్లాహ్ వారు పలుకుతున్న మాటలను వినేవాడు,వారు దాచిపెడుతున్న వాటిని తెలుసుకునేవాడు.

(99) పల్లె వాసుల్లోంచి ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారో,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరుస్తారో,అల్లాహ్ మార్గములో తాను ఖర్చు చేసిన సంపదను అల్లాహ్ సాన్నిద్యమును పొందటానికి సాన్నిద్యంగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆ ద్వారా,తన కొరకు ఆయన మన్నింపు వేడుకోలు (ఇస్తిగ్ఫార్) ద్వారా సాఫల్యం పొందటానికి కారకంగా చేసుకునే వారు ఉన్నారు.వినండి నిశ్చయంగా అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం,అతని కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేయటం అల్లాహ్ వద్ద అతని కొరకు సాన్నిద్యాన్ని చేకూరుస్తాయి.త్వరలోనే అతడు వాటి పుణ్యమును ఆయన వద్ద ఈ విధంగా పొందుతాడు : అల్లాహ్ తన క్షమాపణ,తన స్వర్గంతో ఇమిడి ఉన్న తన విశాలమైన కారుణ్యం లోనికి ప్రవేశింపజేస్తాడు . నిస్సందేహంగా తమ దాసులలో క్షమాపణ వేడుకునే వారి కొరకు అల్లాహ్ చాలా క్షమాశీలి మరియు కరుణామయుడు.

(100) తమ ఇండ్ల నుండి,తమ ప్రదేశముల నుండి అల్లాహ్ వైపునకు వలస వచ్చిన ముహాజిర్ల నుండి,ఆయన ప్రవక్తను సహాయపడిన అన్సారులలో నుండి ప్రప్రధమంగా విశ్వాసమును కనబరచిన వారు,మరియు ప్రప్రధమంగా విశ్వాసమును కనబరచిన ముహాజిర్లను,అన్సారులను విశ్వాసములో,మాటల్లో,ఆచరణల్లో ఉత్తమంగా అనుసరించిన వారందరి నుండి అల్లాహ్ ప్రసన్నుడై వారి విధేయతను స్వీకరించాడు.వారందరు కూడా వారికి ఆయన ప్రసాదించిన గొప్ప పుణ్యము వలన,మరియు వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆ స్వర్గ వనాలు వేటి భవనాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయో వాటిలో వారు ఎల్లవేళలా ఉంటారో వాటి వలన ఆయనతో (అల్లాహ్) సంతుష్టపడ్డారు.ఈ ప్రతిఫలమే గొప్ప సాఫల్యము.

(101) మదీన మునవ్వర దగ్గర ప్రాంతములో ఉన్న పల్లె వాసుల్లోంచి కపటులు,మదీన మునవ్వర వాసుల్లోంచి కపటులు కపటత్వముపై ఉండి దానిపై స్థిరత్వాన్ని ప్రదర్శిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని గుర్తించలేరు.అల్లాహ్ వారిని గుర్తిస్తాడు.అల్లాహ్ వారిని తొందరలోనే రెండు సార్లు శిక్షిస్తాడు.ఒక సారి ఇహలోకంలోనే వారి కపటత్వమును బహిర్గతం చేసి,వారిని హతమార్చి,వారిని బందీలుగా చేసి,ఇంకొక సారి పరలోకములో సమాది శిక్ష ద్వారా,ఆ పిదప వారు ప్రళయదినాన నరకాగ్నిలో అట్టడుగు స్థానములో పెద్దశిక్ష వైపునకు మరలించబడుతారు.

(102) మదీనా వాసుల్లోంచి ఎటువంటి కారణం లేకుండా యుద్ధం నుండి వెనుక ఉండిపోయిన వారు వేరే వారు ఉన్నారు.వారు స్వయంగా తమకు ఎటువంటి కారణం లేదు అని ఒప్పుకున్నారు.మరియు వారు అబద్దపు సాకులూ చెప్పలేదు.వారి పూర్వపు సత్కర్మలు అయిన అల్లాహ్ పై విధేయత పై స్థిరత్వమును చూపటం,ఆయన ఆదేశాలకు కట్టుబడి ఉండటం.ఆయన మార్గములో పోరాడటంను దుష్కర్మలతో కలిపివేశారు. వారి తౌబాను స్వీకరించాలని,వారిని మన్నించాలని వారు అల్లాహ్ తో ఆశించేవారు.నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తౌబా చేసేవారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.

(103) ఓ ప్రవక్తా వారి సంపదల నుండి జకాతును తీసుకుని వాటి ద్వారా అవిధేయకార్యాల,పాపకార్యాల అశుద్ధత నుండి వారిని పరిశుద్ధపరచండి.మరియు వాటి ద్వారా వారి పుణ్య కార్యాలను పెంచండి.వారి నుండి వాటిని తీసుకున్న తరువాత వారి కొరకు మీరు ప్రార్ధించండి.నిశ్చయంగా మీ ప్రార్ధన వారి కొరకు కారుణ్యము,మనశ్శాంతి.మరియు అల్లాహ్ మీ ప్రార్ధనలను వినేవాడును,వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునే వాడును.

(104) ధర్మ పోరాటము నుండి వెనుక ఉండిపోయిన వీరందరు,అల్లాహ్ వైపు పశ్చాత్తాపం చెందేవారు అల్లాహ్ తన వైపు పశ్చాత్తాప్పడే దాసుల పశ్చాత్తాపమును స్వీకరిస్తాడని,దానధర్మాలను స్వీకరిస్తాడని తెలుసుకోవాలి.మరియు ఆయన వాటి యొక్క అవసరం లేనివాడు.మరియు ఆయన దాన ధర్మాలు చేసేవాడికి అతని దానధర్మాలకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.మరియు ఆయన పరిశుద్ధుడు,ఆయన తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పశ్చాత్తాపమును స్వీకరించేవాడు,వారిపై కరుణించే వాడు.

(105) ఓ ప్రవక్తా పవిత్ర యుద్ధము నుండి వెనుక ఉండిపోయి తమ పాపము నుండి పశ్చాత్తాప్పడిన వీరందరితో మీరు ఇలా పలకండి : మీరు కోల్పోయిన నష్టమును పూర్తి చేయండి,మరియు మీరు మీ ఆచరణలను అల్లాహ్ కొరకు ప్రత్యేకించండి,మరియు మీరు ఆయనకు ఇష్టమైన కార్యాలనే చేయండి.అల్లాహ్,ఆయన ప్రవక్త,విశ్వాసపరులు మీ కర్మలను తొందరలోనే చూస్తారు.మరియు మీరు తొందరలోనే ప్రళయదినాన అన్నీ విషయాల గురించి జ్ఞానము కలిగిన మీ ప్రభువు వైపునకు మరలించబడుతారు.అయితే మీరు గోప్యంగా ఉంచుతున్నవి,బహిర్గతం చేస్తున్నవి ఆయనకు తెలుసు.మరియు ఆయన తొందరలోనే ఇహలోకములో మీరు చేస్తున్న కర్మల గురించి తెలియపరుస్తాడు.వాటి పరంగానే మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(106) తబూక్ యుద్ధము నుండి వెనుక ఉండిపోయిన వారిలో ఎటువంటి కారణం చూపని ఇంకొక వర్గము ఉంది.వీరందరూ అల్లాహ్ తీర్పు కొరకు,వారి విషయంలో ఆయన నిర్ణయం కొరకు వాయిదా వేయబడ్డారు.ఆయన వారి విషయంలో తాను కోరుకున్న విధంగా తీర్పు ఇస్తాడు : ఒక వేళ వారు ఆయనతో పశ్చాత్తాప్పడకుండా ఉంటే (తౌబా చేయకుండా ఉంటే) వారిని శిక్షించటం,ఒక వేళా వారు పశ్చాత్తాప్పడితే వారిని మన్నించటం.ఆయన శిక్షకు అర్హులు ఎవరో,ఆయన మన్నింపుకు అర్హులు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.తన ధర్మ శాసనాల్లో,తన పర్యాలోచనలో (తద్బీరులో) వివేకవంతుడు.మరియు వారందరు మురార బిన్ రబీఅ్,కఅబ్ బిన్ మాలిక్,హిలాల్ బిన్ ఉమయ్యహ్.

(107) కపట విశ్వాసుల్లోంచి వారందరు కూడా ఉన్నారు ఎవరైతే అల్లాహ్ అవిధేయత కొరకు ఒక మస్జిదు నిర్మాణం చేశారో.అంతే కాదు ముస్లిములకు హాని తలపెట్టటానికి,కపటవిశ్వాసుల బలము చేకూర్చి అవిశ్వాసమును బహిర్గతం చేయటానికి,విశ్వాసపరులను విడదీయటానికి,మస్జిదు నిర్మాణం కన్న ముందు అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో పోరాడిన వారి కొరకు సిద్ధం చేయటానికి,నిరీక్షించటానికి.మరియు ఈ కపటవిశ్వాసులందరూ మా ఉద్దేశం కేవలం ముస్లిముల పట్ల దయ చూపటం మాత్రమే అని మీ ముందట తప్పకుండా ప్రమాణం చేస్తారు.మరియు అల్లాహ్ నిశ్చయంగా వీరు తమ ఈ వాదనలో అబద్దము చెబుతున్నారని సాక్ష్యం పలుకుతున్నాడు.

(108) ఓ ప్రవక్తా ఈ గుణాలు కల మస్జిదులో మీరు నమాజు చేయటానికి కపటుల పిలుపును అంగీకరించకండి.ఎందుకంటే ప్రప్రధమంగా దైవభీతిపై నిర్మితమైన ఖుబా మస్జిదు(లో నమాజ్ చేయటం),అవిశ్వాసము పై నిర్మితమైన ఈ మస్జిదులో నమాజు చేయటం కన్నా ఎంతో శ్రేయస్కరము.ఖుబా మస్జిదులో మాలిన్యముల నుండి,అశుద్ధతల నుండీ నీటి ద్వారా,పాపముల నుండి పశ్చాత్తాపము,మన్నింపును వేడుకోవటం ద్వారా పరిశుద్దత పొందటమును ఇష్టపడే ప్రజలు ఉన్నారు.మరియు అల్లాహ్ మాలిన్యముల నుండి,అశుద్ధతల నుండి,పాపముల నుండి పరిశుద్ధతను పాటించే వారిని ఇష్టపడుతాడు.

(109) ఏమీ ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ,ఆచరణల్లో విశాలత్వముతో అల్లాహ్ యొక్క ప్రీతి ద్వారా అల్లాహ్ భయభీతి పై దాని నిర్మాణమును ఏర్పరచినవారు వారితో సమానులు కాగలరా ఎవరైతే ముస్లిములకు హాని తలపెట్టటానికి,అవిశ్వాసమును బలపరచటానికి,విశ్వాసపరులను విడదీయటానికి ఒక మస్జిదు నిర్మాణము చేశారో ?.వారిరువురు ఎన్నటికి సమానులు కాలేరు.మొదటి నిర్మాణము పడిపోవటానికి భయపడని ఒక బలమైన,అతుక్కుని ఉండే నిర్మాణం.మరియు ఇది దాని ఉపమానము ఆ వ్యక్తి ఉపమానములాగా ఉన్నది ఎవరైతే ఒక గుంత అంచున నిర్మాణమును ఏర్పరిస్తే అది నాశనమై పడిపోయింది.మరియు దానితో సహా ఆ నిర్మాణము నరకము అట్డడుగులో కుప్పకూలింది.మరియు అల్లాహ్ అవిశ్వాసము,కపటత్వము,ఇతర వాటి ద్వారా దుర్మార్గమునకు పాల్పడే ప్రజలను అనుగ్రహించడు.

(110) వారు నిర్మించిన ఈ మస్జిదు వారి హృదయాలు మరణం ద్వారా లేదా ఖడ్గముతో హత మార్చటం ద్వారా ముక్కలైపోనంత వరకు వారి హృదయాల్లో కీడును,సందేహమును,కపటత్వమును నాటుతూనే ఉంటుంది.మరియు అల్లాహ్ తన దాసుల ఆచరణల గురించి బాగా తెలిసిన వాడు,మేలుపై లేదా చెడు పై ప్రతిఫలమును తాను నిర్ణయించే విషయంలో వివేకవంతుడు.

(111) నిశ్చయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ విశ్వాసపరుల నుండి వారి ప్రాణములను, ఆయన సొత్తు అయినప్పటికీ తన వద్ద నుండి అనుగ్రహంగా అధిక ధర అయిన స్వర్గమునకు బదులుగా కొన్నాడు.ఏవిధంగా అంటే వారు అవిశ్వాసపరులతో అల్లాహ్ యొక్క మాట (కలిమ) గొప్పదవటం కొరకు పోరాడుతారు.అయితే వారు అవిశ్వాసపరులను హతమారుస్తారు మరియు వారిని అవిశ్వాసపరులు హతమారుస్తారు.అల్లాహ్ దీని గురించి మూసా అలైహిస్సలాం గారి గ్రంధమైన తౌరాతులో,ఈసా అలైహిస్సలాం గారి గ్రంధమైన ఇంజీలులో,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గ్రంధమైన ఖుర్ఆన్ లో సత్య వాగ్దానం చేశాడు.పరిశుద్ధుడైన అల్లాహ్ కన్నా ఎక్కువగా తన వాగ్దానమును పూర్తి చేసేవాడు ఇంకెవరూ లేరు.అయితే ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ తో చేసిన మీ వ్యాపారము వలన సంబరపడండి,సంతోషపడండి.అందులో మీరు గొప్ప లాభమును పొందారు.మరియు ఆ వ్యాపారమే గొప్ప సాఫల్యము.

(112) ఈ ప్రతిఫలాన్ని పొందేవారు:అల్లాహ్ ఇష్టపడని,ఆయనకు ఆగ్రహానికి లోను చేసే కార్యాల నుండి(దూరంగా ఉంటారు) ఆయన ఇష్టపడే,ఆయన సంతోషపడే కార్యాల వైపు మరలేవారు,వారు అల్లాహ్ కొరకు భయంతో,వినయంతో విధేయత చూపుతూ ఆయన విధేయతలో శ్రమిస్తారు,అన్నీ సంధర్బాల్లో తమ ప్రభువు స్థుతులను పలికేవారు,ఉపవాసములను పాటించేవారు,నమాజులను పాటించేవారు,అల్లాహ్ లేదా ఆయన ప్రవక్త ఆదేశించిన వాటిని ఆదేశించేవారు,అల్లాహ్,ఆయన ప్రవక్త వారించిన వాటిని వారించేవారు,అల్లాహ్ ఆదేశాలను అనుసరించటం ద్వారా,ఆయన వారించిన వాటి నుండి జాగ్రత్తపడటం ద్వారా పరిరక్షించేవారు,ఓ ప్రవక్తా ఈ లక్షణాలు కలిగిన విశ్వాసపరులను ఇహ,పరలోకాల్లో వారిని సంతోష పెట్టే వాటి గురించి తెలియపరచండి.

(113) ప్రవక్తకు,విశ్వాసపరులకు ముష్రికుల కొరకు ఒక వేళ వారు వారి దగ్గర బంధువులైనా వారి మరణం షిర్క్ స్థితిలో అయ్యి వారు నరక వాసులని స్పష్టమైన తరువాత కూడా అల్లాహ్ తో మన్నింపు వేడుకోవటం తగదు.

(114) ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన తండ్రి కొరకు మన్నింపుని కోరినది కేవలం ఆయన ఇస్లాం స్వీకరిస్తాడని ఆశతో, ఆయన అతని కొరకు దాన్ని కోరుతానని అతనితో చేసిన వాగ్దానం వలన మాత్రమే.అయితే ఎప్పుడైతే ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకి అతని తండ్రి తన విషయంలో హితోపదేశం ప్రయోజన కరం కాకపోవటం వలనా లేదా అతడు అవిశ్వాసపరునిగా మరణిస్తాడని దైవ వాణి ద్వారా తనకి తెలవటం వలన అల్లాహ్ శతృవని స్పష్టమైనదో అతని నుండి ఆయన విసిగిపోయాడు.మరియు అతని కొరకు తన మన్నింపు వేడుకోవటం తన తరపు నుండి ఒక ప్రయత్నం మాత్రమే,అల్లాహ్ ఆయన వైపు అవతరింపజేసిన ఆదేశమునకు వ్యతిరేకం కాదు.నిశ్చయంగా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం అల్లాహ్ వైపు ఎక్కువగా వినయమును చూపేవారు,దుర్మార్గులైన తన జాతి వారిని ఎక్కువగా క్షమించేవారు,మన్నించేవారు.

(115) అల్లాహ్ ఒక జాతి వారిని సన్మార్గము యొక్క సౌభాగ్యమును కలిగించిన తరువాత,వారికి వారు దూరంగా ఉండవసిన నిషిద్ధమైన వాటిని స్పష్టపరచనంత వరకూ వారిని మార్గభ్రష్టతకు లోను చేయటానికి నిర్ణయించడు.ఒకవేళ వారు తమపై నిషేదించిన వాటిని వాటి నిషేదము గురించి స్పష్టమైన తరువాత పాల్పడితే వారిని మార్గభ్రష్టులుగా నిర్ణయిస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ కు అన్నీ విషయాల గురించి బాగా తెలుసు,ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.వాస్తవానికి ఆయన మీకు తెలియని వాటిని మీకు నేర్పించాడు.

(116) నిశ్చయంగా ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూ మండల సామ్రాజ్యాధికారము అల్లాహ్ కొరకే.ఆ రెండింటిలో ఆయనకు సాటి ఎవరూ లేరు.ఆ రెండటిలో గోప్యంగా ఉండే ఏ వస్తువు ఆయన నుండి గోప్యంగా ఉండదు.ఎవరిని ఆయన జీవింపజేయదలచుకుంటే అతనిని జీవింపజేస్తాడు.ఎవరిని ఆయన మరణింపజేయదలచుకుంటే అతనిని మరణింపజేస్తాడు.ఓ ప్రజలారా మీ వ్యవహారాలను పరిరక్షించడానికి పరిరక్షకుడు, మీ నుండి చెడును నిరోధించటానికి ,మీ శతృవులకు వ్యతిరేకముగా మీకు సహాయం చేయటాని సహాయకుడు అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ లేరూ.

(117) నిశ్చయంగా అల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కపటులకు తబూక్ యుద్ధము నుండి వెనుక ఉండిపోయే విషయంలో అనుమతి ఇచ్చినందుకు మన్నించివేశాడు.మరియు ముహాజిరులు,అన్సారులు ఎవరైతే దాని నుండి వెనుక ఉండలేదు,కాని తబూక్ యుద్ధములో ఎండ తీవ్రత,తక్కువ బలము,శతృవుల అధిక బలము ఉండి కూడా వారు ఆయనను అనుసరించారు, వారినీ మన్నించాడు.వారిలోంచి ఒక వర్గము హృదయాలు మగ్గటానికి దగ్గరైన తరువాత వారు యుద్ధమును అందులో ఉన్న వారి పెద్ద కష్టము వలన దాన్ని వదలటానికి పూనుకున్నారు.ఆతరువాత అల్లాహ్ వారికి స్థిరత్వమును,యుద్ధమునకు బయలుదేరటానికి భాగ్యమును కలిగించాడు,వారిని మన్నించాడు.నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన వారిపై దయ చూపేవాడు,కనికరించేవాడు.వారికి పశ్చాత్తప్పడే అనుగ్రహం కలిగించటం ,దానిని వారి నుండి స్వీకరించటం ఆయన కారుణ్యములో నుండే.

(118) మరియు నిశ్చయంగా అల్లాహ్ ముగ్గురుని మన్నించివేశాడు.వారు కఅబ్ బిన్ మాలిక్ ,మురార బిన్ రబీఅ్,హిలాల్ బిన్ ఉమయ్య వారందరు తబూక్ యుద్ధములో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతోపాటు బయలు దేరకుండా వెనుక ఉండిపోయిన తరువాత పశ్చాత్తాప పడటం నుండి వెనుకు ఉంచబడ్డారు,వారి పశ్చాత్తాపము స్వీకరించడం వాయిదా వేయబడింది.అయితే దైవప్రవక్త వారిని(మాట్లాడకుండా)వదిలివేయాలని ప్రజలను ఆదేశించారు.దాని వలన వారికి దుఃఖము,బాధ కలిగినది, చివరికి వారిపై నేల విశాలంగా ఉండి కూడా ఇరుకుగా మారిపోయింది.వారికి కలిగిన భయాందోళనల వలన వారి హృదయాలు బిగుసుకుపోయాయి.ఒక్కడైన అల్లాహ్ తప్ప ఇంకెవరి వైపు వారు శరణం తీసుకోవటానికి వారి కొరకు ఎటువంటి శరణాలయం లేదని వారు తెలుసుకున్నారు.అల్లాహ్ పశ్చాత్తాప పడటానికి వారికి భాగ్యమును కలిగించి వారిపై కనికరించాడు.ఆ తరువాత వారి పశ్చాత్తాపమును స్వీకరించాడు.నిశ్చయంగా ఆయన తన దాసులను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును.

(119) ఓ అల్లాహ్ ను విశ్వవిసించి, ఆయన ప్రవక్తను అనుసరించి,ఆయన ధర్మ ఆదేశాలను పాటించేవారా,మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి అల్లాహ్ భీతిని కలిగి ఉండండి.మరియు మీరు తమ విశ్వాసములో,తమ మాటల్లో,తమ ఆచరణల్లో సత్యవంతులైన వారితో అయిపోండి.మీ కొరకు సత్యములో తప్ప ఎందులోనూ ఎటువంటి రక్షణా లేదు.

(120) మదీనా వాసులకి మరియు దాని చుట్టుప్రక్కల పల్లెవాసులకి దైవప్రవక్త స్వయంగా యుద్ధము కొరకు బయలు దేరినప్పుడు దైవ ప్రవక్త నుండి వెనుక ఉండిపోవటం తగదు.తమ ప్రాణముల గురించి పిసినారితనము చూపి మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణమునకు బదులుగా తమ ప్రాణములను కాపాడుకోవటం వారికి తగదు.కాని వారు ఆయన ప్రాణములకు బదులుగా తమ ప్రాణములను ఖర్చు చేయటం వారిపై అనివార్యము.ఇది ఎందుకంటే అల్లాహ్ మార్గములో వారికి కలిగే దప్పిక,అలసట,ఆకలి మరియు వారి ఏదైన ఆ ప్రాంతములో దిగి ఉండటం అవిశ్వాసపరుల కోపాన్ని రేకెత్తిస్తుందో,శతృవుల నుండి వారు పొందే హతమార్చబడటం గానీ లేదా బంధీ చేయబడటం గానీ లేదా యుద్ధప్రాప్తి గానీ లేదా పరాభవం గానీ దాని వలన అల్లాహ్ వారి కొరకు వారి నుండి స్వీకరించే ఒక సత్కార్య పుణ్యమును వ్రాస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ పుణ్యాత్ముల ప్రతిఫలాన్ని వ్యర్ధపరచడు.కాని ఆయన వారికి దాని పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.మరియు దానిపై వారిని అధికం చేస్తాడు.

(121) వారు ఖర్చు చేసిన కొద్దిపాటి సంపద గానీ లేదా ఎక్కువ గానీ,వారు ఏదైనా లోయ ప్రాంతమును దాటినా అల్లాహ్ వారు చేసిన కర్మలను,ఖర్చు చేయటం,ప్రయాణం చేయటమును,అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి వారి కొరకు వ్రాసివేశాడు.అయితే పరలోకములో వారు చేసుకున్న ఆచరణల కన్న మంచి ప్రతిఫలాన్ని వారికి ప్రసాదిస్తాడు.

(122) విశ్వాసపరులకు వారందరూ యుద్ధానికి బయలుదేరి వారి శతృవులు వారిపై గెలిచినప్పుడు చివరికి వారందరు తుదిముట్టించబడటం తగదు.అయితే ఎందుకు వారిలో ఒక వర్గము యుద్ధపోరాటమునకు బయలదేరకూడదు,ఇంకొక వర్గము దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతోపాటు ఉండిపోయి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఖుర్ఆన్,ధర్మ ఆదేశాలను వినటం ద్వారా ధర్మవిషయాలను నేర్చుకుని తమ జాతివారి వద్దకు మరలినప్పుడు వారు అల్లాహ్ శిక్ష నుండి,ఆయన యాతన నుండి జాగ్రత్తపడుతారని ఆశిస్తూ వారిని తాము నేర్చుకున్న విషయాల ద్వారా హెచ్చరించాలి.అయితే వారు ఆయన ఆదేశాలను పాటిస్తారు,మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారు.మరియు ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పంపించే చిన్నయుద్ధ సమూహాల్లో జరిగేది.మరియు ఆయన దాని కొరకు తన సహచరుల్లోంచి ఒక వర్గాన్ని ఎన్నుకునేవారు.

(123) అవిశ్వాసులతో దగ్గరగా ఉన్నవారితో వారి సామీప్యత కారణంగా విశ్వాసులకు ప్రమాదం ఉన్నందును పోరాడమని విశ్వాసపరులకు అల్లాహ్ ఆదేశించాడు.మరియు వారిని ఇదేవిధంగా భయపెట్టడానికి మరియు వారి చెడును నెట్టడానికి బలాన్ని మరియు తీవ్రతను చూపించాలని వారిని ఆదేశించాడు.మరియు అల్లాహ్ తన సహాయము ద్వారా,తన మద్దతు ద్వారా దైవభీతి కలిగిన విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు.

(124) మరియు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏదైన సూరా అవతరింప జేసినప్పుడు కపట విశ్వాసుల్లోంచి అవహేళన చేస్తూ,ఎగతాళి చేస్తూ ముహమ్మద్ తీసుకుని వచ్చిన దానిపై మీలో నుంచి ఈ అవతరించిన సూరా ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది ? అని అడిగేవారు ఉన్నారు.అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను సత్యమని అంగీకరించిన వారికి సూరా అవతరణ వారి క్రితం విశ్వాసమును అధికం చేసింది.వారందరు అవతరింపబడిన దైవవాణి ద్వారా అందులో ఉన్న వారి ఇహలోక,పరలోక ప్రయోజనాల వలన సంతోషముగా ఉన్నారు.

(125) మరియు కపటుల్లో నిశ్చయంగా ఖుర్ఆన్ లో ఉన్న ఆదేశాలు,గాధల అవతరణ అవతరించిన ప్రతీ దాన్ని వారి తిరస్కారము వలన వారిలో రోగమును,మాలిన్యమును అధికం చేసింది.ఖుర్ఆన్ అవతరణ అధికమవటం వలన వారి హృదయముల రోగము అధికమవుతుంది.ఎందుకంటే ఎప్పుడైన ఏదైన విషయం అవతరిస్తే వారు అందులో ఉన్నవాటి గురించి సందేహపడ్డారు.మరియు అవిశ్వాస స్థితిలోనే మరణించారు.

(126) ఏమి కపటవిశ్వాసులు తమ స్థితిని బహిర్గతం చేసి,ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సార్లు వారి కపటత్వమును బట్టబయలు చేసి వారికి అల్లాహ్ పరీక్షించటం నుండి గుణపాఠమును నేర్చుకుంటూ చూడరా ?.ఆ పిదప వారికి ఇదంతా అల్లాహ్ నే చేశాడని తెలిసి కూడా తమ అవిశ్వాసము నుండి ఆయన వద్ద పశ్చాత్తాప్పడటం లేదు.మరియు తమ కపట విశ్వాసమును విడనాడటం లేదు.మరియు వారికి సంభవించినది అల్లాహ్ వద్ద నుండి అయినా వారు హితబోధన గ్రహించటం లేదు.

(127) అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదైన సూరాను అవతరింపజేసినప్పుడు అందులో కపటవిశ్వాసుల పరిస్థితుల ప్రస్తావన ఉంటే కపటవిశ్వాసులు మిమ్మల్ని ఎవరైన చూశారా ? అని పలుకుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఒక వేళ వారిని ఎవరూ చూడకపోతే వారు సభ నుండి మరలిపోతారు (నెమ్మదిగా జారుకుంటారు).వినండి అల్లాహ్ వారి హృదయాలను సన్మార్గము నుండి,మంచి నుండి మరల్చేశాడు.మరియు వారికి పరాభవమునకు లోను చేశాడు.ఎందుకంటే వారు అర్ధం చేసుకోలేని మనుషులు.

(128) ఓ అరబ్ వాసులారా నిశ్చయంగా మీ కోవకు చెందినవాడే మీ వద్దకు ప్రవక్తగా వచ్చాడు అతను మీలాగే అరబ్బుడు.మీకు బాధ కలిగించేవి ఆయనకు బాధ కలిగించాయి.అతను మీ సన్మార్గము విషయంలో,మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటంలో అతని కోరిక తీవ్రమైనది.మరియు అతడు ప్రత్యేకంగా విశ్వాసపరులపై అధికముగా దయచూపేవాడు,కరుణించేవాడు.

(129) అయితే ఒక వేళ వారు మీ నుండి విముఖత చూపి మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించకపోతే ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నాకు ఆ అల్లాహ్ చాలు ఎ అల్లాహ్ తప్ప సత్యఆరాధ్య దైవము లేడో. ఆయన ఒక్కడి పైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను.పరిశుద్ధుడైన ఆయన సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు.