(1) ఈ సూరాను మేము అవతరింపజేశాము. మరియు మేము దానిలోని ఆదేశాలను ఆచరించటంను అనివార్యం చేశాము. మరియు మేము దానిలో స్పష్టమైన ఆయతులను వాటిలో కల ఆదేశాలను మీరు గుర్తు చేసుకుని వాటి ప్రకారం ఆచరిస్తారని ఆశిస్తూ అవతరింపజేశాము.
(2) వ్యభిచారకురాలు,వ్యభిచారకుడు ఇద్దరు అవివాహితులైతే వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మీరు వంద కొరడా దెబ్బలు కొట్టండి. ఒక వేళ మీరు అల్లాహ్ పై,అంతిమ దినంపై విశ్వాసమును కలిగి ఉంటే వారిద్దరి విషయంలో మీరు వారిపై శిక్ష విధించకుండా ఉండటానికి లేదా వారిపై దాన్ని తేలిక చేయటానికి మీకు వారిపై జాలి గాని దయ గాని కలగకూడదు. శిక్షను విధించేటప్పుడు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గం వారిద్దరి (శిక్ష) గురించి నలువైపుల వ్యాపించటానికి,వారిద్దరిని,ఇతరులను హెచ్చరించటానికి హాజరుకావాలి.
(3) వ్యభిచారము యొక్క విహీనతను స్పష్టపరచటం కొరకు అల్లాహ్ తెలిపాడు వ్యభిచారమునకు అలవాటు పడినవాడు తన లాంటి వ్యభిచారినిలో లేదా వ్యభిచారము నుండి దూరంగా ఉండని ముష్రిక్ స్త్రీలో మాత్రమే నికాహ్ యొక్క ఆశను కలిగి ఉంటాడు. వాస్తవానికి ఆమెతో వివాహం చేయటం సమ్మతం కాకపోయినా కూడా. మరియు వ్యభిచారమునకు అలవాటుపడిన స్త్రీ తన లాంటి వ్యభిచారము చేసే వ్యక్తిలో లేదా వ్యభిచారము నుండి దూరంగా ఉండని మష్రిక్ పురుషునిలో అతనితో వివాహం చేయటం సమ్మతం కాకపోయిన వివాహము యొక్క ఆశను కలిగి ఉంటుంది. మరియు వ్యభిచారము చేసే స్త్రీ తో నికాహ్ చేయటం,వ్యభిచారము చేసే వ్యక్తి యొక్క నికాహ్ చేయటం విశ్వాసపరులపై నిషేధము.
(4) మరియు ఎవరైతే శీలవతులైన స్త్రీలపై అశ్లీలవతులని నింద మోపి (అలాగే శీలవతులైన పురుషులపై) తాము ఎవరిపైనైతే అశ్లీలవతులని నింద మోపారో దానిపై నలుగురు సాక్షులను తీసుకుని రాలేదో ఓ అధికారులారా వారిని ఎనబై కొరడా దెబ్బలను కొట్టండి. మరియు వారి సాక్ష్యమును ఎన్నటికీ స్వీకరించకండి. శీలవతులపై నిందమోపే అలాంటి వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు.
(5) కానీ ఎవరైతే ఆ కార్యం చేయటానికి ముందడుగు వేసిన తరువాత అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడి,తమ కర్మలను సరి దిద్దుకుని ఉంటే నిశ్ఛయంగా అల్లాహ్ వారి పశ్ఛాత్తాపమును,వారి సాక్ష్యమును స్వీకరిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.
(6) మరియు ఆ పురుషులు ఎవరైతే తమ భార్యలపై నింద మోపి వారిపై నిందమోపినది నిజం అవటంపై సాక్ష్యం ఇవ్వటానికి సాక్షులుగా స్వయంగా తాము తప్ప ఇతరులు లేని పక్షంలో వారిలో నుండి (భర్తల్లో నుండి) ఒకరు అల్లాహ్ పై నాలుగు సార్లు ప్రమాణం చేసి తన భార్యపై వ్యభిచారము గురించి నింద మోపిన దాని విషయంలో సత్య వంతుడని సాక్ష్యమివ్వాలి.
(7) ఆ తరువాత ఐదవసారి తన ప్రమాణంలో "ఆమెపై నింద మోపిన విషయంలో ఒక వేళ తాను అసత్యపరుడైతే శాపమునకు హక్కు దారుడని" తన స్వయంపై శాపమును అధికంగా చేసుకోవాలి.
(8) దీనితో ఆమె వ్యభిచార శిక్ష విధించబడటానికి అర్హులైపోతుంది. మరియు ఆమె ఈ శిక్షను తన నుండి తొలగించటానికి అల్లాహ్ పై నాలుగు ప్రమాణాలు చేసి అతను తనపై నింద మోపిన విషయంలో అసత్యపరుడని సాక్ష్యమివ్వాలి.
(9) ఆ తరువాత ఐదవసారి తన ప్రమాణంలో "ఆమెపై నింద మోపిన విషయంలో ఒక వేళ అతను సత్యవంతుడైతే తనపై అల్లాహ్ ఆగ్రహము కురవాలని" తన స్వయంపై శాపమును అధికంగా చేసుకోవాలి.
(10) ఓ ప్రజలారా మీపై అల్లాహ్ అనుగ్రహము మరియు మీపై ఆయన కారుణ్యము లేకుంటే,ఆయన తన దాసుల్లోంచి తౌబా చేసేవారి తౌబాను స్వీకరిస్తాడని,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడని (కాకపోతే) మీ పాపములపై శీఘ్రంగా శిక్షించేవాడు మరియు దానితో మిమ్మల్ని పరాభవమునకు లోను చేసేవాడు.
(11) నిశ్చయంగా నింద మోపేవారు (విశ్వాసపరుల తల్లి అయిన ఆయిష రజియల్లాహు అన్హా పై అశ్లీలత యొక్క నిందమోపటం) మీకు చెందిన ఒక వర్గము వారు. ఓ విశ్వాసపరులారా వారు కల్పించుకున్నది మీ కొరకు కీడుగా భావించకండి. కాని అది అందులో ఉన్న పుణ్యము,విశ్వాసపరుల పరిశీలనను బట్టి, విశ్వాసపరుల తల్లి (ఆయిషా రజియల్లాహు అన్హా) నిర్దోషత్వము వెళ్ళడిని బట్టి మేలైనది. ఆమెపై నింద మోపే విషయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి కొరకు అతను అపనింద గురించి మాట్లాడటం వలన తాను చేసుకున్న దానికి ప్రతిఫలం ఉన్నది. మరియు ఎవరైతే దాన్ని మొదలెట్టి ఘోరమైన దానికి పాల్పడ్డాడో అతని కొరకు ఘోరమైన శిక్ష కలదు. అంటే దాని ఉద్దేశము కపటుల నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్యి బిన్ సలూల్.
(12) విశ్వాసపరులైన పురుషులు,విశ్వాసపరులైన స్త్రీలు ఈ ఘోరమైన అపనిందను విన్నప్పుడు తమ విశ్వాసపర సోదరుల్లోంచి ఎవరి పై ఈ నింద వేయబడినదో వారి శ్రేయస్సును భావించి ఇది స్పష్టమైన అసత్యమని వారు ఎందుకు చెప్పలేదు ?.
(13) విశ్వాసపరుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హాపై నింద మోపినవారు తమ ఘోరమైన నింద ఏదైతే ఆమెకు అంటగట్టారో అది సత్యమవటముపై సాక్ష్యమును పలికే నలుగురు సాక్షులను ఎందుకు తీసుకుని రాలేదు. ఒక వేళ వారు దాని గురించి నలుగురు సాక్షులను తీసుకుని రాలేకపోతే వారు ఖచ్చితంగా వాటిని ఎన్నడూ తీసుకుని రాలేరు. వారు అల్లాహ్ ఆదేశం విషయంలో అసత్యవాదులు.
(14) ఓ విశ్వాసపరులారా మీపై అల్లాహ్ అనుగ్రహించకుండా ఉంటే,మీపై శిక్షను శీఘ్రంగా దించకుండా ఆయన కరుణ మీపై లేకుంటే ,మీలో నుండి తౌబా చేసిన వారి తౌబా స్వీకరించకుండా ఉంటే విశ్వాసుల తల్లి పై అబద్దము,అపనిందపాలు చేసే విషయంలో మీరు మునిగిపోయిన కారణంగా ఘోరమైన శిక్ష మీకు కలిగేది.
(15) అప్పుడు మీరు దాన్ని ఒకరి నుండి ఒకరు చేరవేయసాగారు. మరియు అది అసత్యమైనా కూడా దాన్ని మీరు మీ నోళ్ళతో చేరవేయసాగారు. దాని గురించి మీకు జ్ఞానం లేదు. మరియు మీరు అది సులభమని,తేలికని భావించసాగారు. మరియు అందులో ఉన్న అసత్యము, నిర్దోషిపై నింద వేయటం వలన అది అల్లాహ్ వద్ద ఘోరమైనది.
(16) మరియు మీరు ఈ నిందను విన్నప్పుడు ఈ ఘోరమైన విషయం గురించి మేము మాట్లాడటం మాకు సరి కాదు,ఓ మా ప్రభువా నీవు పరిశుద్ధుడవు,విశ్వాసపరుల తల్లి పై ఏ నింద అయితే వేయబడినదో అది ఘోరమైన అబద్దము అని మీరు ఎందుకనలేదు ?.
(17) ఒక వేళ మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరిస్తే ఇటువంటి నిందను మీరు ఎవరైన నిర్దోషిపై అశ్లీలత నిందమోపటమును మీరు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు,హితోపదేశం చేస్తున్నాడు.
(18) అల్లాహ్ తన ఆదేశములతో,తన ఉపదేశాలతో కూడుకుని ఉన్న ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ మీ కర్మలను తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పరంగా తొందరలోనే మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఆయన తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
(19) నిశ్ఛయంగా ఎవరైతే చెడును వ్యపింపచేయాలని ఇష్టపడతారో - అందులో నుండి వ్యభిచారము యొక్క నింద మోపటం- విశ్వాసపరులలో వారి కొరకు ఇహలోకములో వారిపై నిందమోపినందుకు శిక్షను విధించి బాధాకరమైన శిక్ష విధించబడుతుంది. మరియు పరలోకంలో నరకాగ్ని యొక్క శిక్ష ఉన్నది. మరియు అల్లాహ్ కి వారి అబద్దము,తన వైపు మరలే తన దాసుల యొక్క వ్యవహారము గురించి తెలుసు. మరియు ఆయనకు వారి ప్రయోజనాల గురించి తెలుసు. మరియు మీకు దాని గురించి తెలియదు.
(20) ఓ అపనింద వేయటంలో పాల్గొన్న వారా ఒక వేళ మీపై అల్లాహ్ అనుగ్రహించకుండా ఉండి ఉంటే,మీపై ఆయన కారుణ్యమే లేకుంటే,ఒక వేళ అల్లాహ్ మీపై దయ చూపే వాడై,కరుణించే వాడై ఉండకపోతే మీపై ఆయన శిక్షను శీఘ్రంగా తీసుకుని వచ్చే వాడు.
(21) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ ప్రకారం ఆచరించే వారా మీరు అసత్యమును అలంకరించే షైతాను మార్గములను అనుసరించకండి. ఎవరైతే అతని మార్గములను అనుసరిస్తారో వారిని అతడు చెడు కార్యాల గురించి,మాటల గురించి,ధర్మం ఖండించిన వాటి గురించి ఆదేశిస్తాడు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీపైన అల్లాహ్ అనుగ్రహమే లేకుంటే మీలో నుండి ఎన్నటికి ఎవరినీ ఆయన తౌబా ద్వారా - ఒక వేళ అతను తౌబా చేసి ఉంటే - పరిశుద్ధుడు చేసే వాడు కాదు. కానీ అల్లాహ్ ఆయన ఎవరిని తలచుకుంటే వారి తౌబా స్వీకరించి పరిశుద్ధుడు చేస్తాడు. మరియు అల్లాహ్ మీ మాటలను వినే వాడును,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(22) ధర్మంలో పరపతులు,సంపదలో సమృద్ధత కలవారు పేదరికం వలన అవసరాలు కల తమ దగ్గరి బంధువులకు,అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వారికి వారు చేసిన పాపము వలన ఇవ్వమని ప్రమాణం చేయకూడదు. వారిని మన్నించాలి. మరియు వారిని క్షమించాలి. మీరు వారిని మన్నించి క్షమించి వేసినప్పుడు అల్లాహ్ మీ పాపములను మీ కొరకు క్షమించటమును మీరు ఇష్టపడరా ?!. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తౌబా చేసే వారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. ఆయన దాసులు వాటిని నమూనాగా తీసుకోవాలి. ఈ ఆయతులు అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు గారి విషయంలో ఆయన మిస్తహ్ నింద మోపే విషయంలో పాలుపంచుకోవటంవలన అతనిపై ఖర్చు చేయనని ప్రమాణం చేసినప్పుడు అవతరించబడినది.
(23) నిశ్ఛయంగా శీలవతులైన, అశ్లీలతను అర్ధం చేసుకోలేని అమాయక విశ్వాసపరురాలైన స్త్రీల పై నింద మోపే వారు ఇహలోకంలో,పరలోకంలో అల్లాహ్ కారుణ్యం నుండి గెంటివేయబడుతారు. మరియు పరలోకంలో వారి కొరకు ఘోరమైన శిక్ష ఉన్నది.
(24) ఈ శిక్ష వారికి ప్రళయ దినమున సంభవించును. ఆ రోజు వారు పలికిన అసత్యము గురించి వారికి వ్యతిరేకముగా వారి నాలుకలు సాక్ష్యం పలుకుతాయి. మరియు వారు చేసే కర్మల గురించి వారి కాళ్ళూ,చేతులు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
(25) ఆ రోజున వారికి అల్లాహ్ వారి ప్రతిఫలమును న్యాయముతో పూర్తిగా ప్రసాదిస్తాడు. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ సత్యమని,ఆయన నుండి జరిగే ప్రతీ మంచి గాని లేదా వాగ్దానము గాని లేదా హెచ్చరిక గాని ఎటువంటి సందేహం లేని స్పష్టమైన సత్యమని తెలుసుకుంటారు.
(26) పురుషుల్లోంచి,స్త్రీలలోంచి,మాటల్లోంచి,కార్యాల్లోంచి అపవిత్రమైనది ప్రతీది అపవిత్రమైన దాని కొరకు సముచితమైనది,తగినది. వాటిలోంచి పవిత్రమైనది ప్రతీది పవిత్రమైన దాని కొరకు సముచితమైనది,తగినది. పవిత్రమైన పురుషులు,స్తీలు వీరందరు వారి గురించి అపవిత్రమైన పురషులు,స్త్రీలు పలికే వాటి నుండి పరిశుద్ధులు. అల్లాహ్ తరపు నుండి వారి కొరకు మన్నింపు ఉన్నది. దాని ద్వారా ఆయన వారి పాపములను మన్నించివేస్తాడు. మరియు వారి కొరకు గౌరవ ప్రధమైన ఆహారము ఉన్నది అది స్వర్గము.
(27) ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ధర్మ ప్రకారం ఆచరించేవారా మీరు ఇతరుల ఇండ్లలో అందులో ఉండేవారితో ప్రవేశమునకు అనుమతి కోరనంత వరకు లోపల ప్రవేశించకండి. మరియు మీరు వారికి సలాం చేయండి సలాంలో,అనుమతి తీసుకోవటంలో మీరు ఇలా పలకటం ద్వారా : అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కురియుగాక),నేను లోపలికి రానా ?. ఈ అనుమతి తీసుకోవటం అకస్మాత్తుగా ప్రవేశించటం కన్న మీకు మేలైనది. బహుశా మీరు మీకు ఆదేశించబడిన దాన్ని పాటించి హితోపదేశం గ్రహిస్తారు.
(28) ఒక వేళ మీరు ఈ ఇండ్లలో ఎవరినీ పొందకపోతే అనుమతిచ్చే అధికారము కలవారు వాటిలో ప్రవేశించటానికి మీకు అనుమతిచ్చేంత వరకు మీరు వాటిలో ప్రవేశించకండి. ఒక వేళ వాటి యజమానులు మీకు (మీరు వాపసు అయిపోండి) అంటే మీరు వాపసు అయిపోండి వాటిలో ప్రవేశించకండి. ఎందుకంటే అది అల్లాహ్ వద్ద మీ కొరకు ఎంతో పరిశుద్ధమైనది. మరియు అల్లాహ్ మీరు చేసే వాటి గురించి తెలిసిన వాడు. ఆయనపై మీరు చేసిన కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(29) ఎవ్వరికీ చెందని ప్రజల ప్రయోజనాల కొరకు సిద్ధం చేయబడిన లైబ్రరీలు, బజారులలోని దుకాణాల్లాంటి ప్రజా ఇళ్ళలో అనుమతి లేకుండా మీరు ప్రవేశించటంలో మీపై ఎటువంటి పాపం లేదు. మరియు మీరు బహిర్గం చేసే మీ కర్మలు,మీ స్థితులు,మీరు గోప్యంగా ఉంచేవి అన్నీ అల్లాహ్ కి తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(30) ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులతో వారు తమ చూపులను తమ కొరకు సమ్మతం కాని స్త్రీలను,నగ్నమైన వాటిని చూడటం నుండి ఆపుకోమని మరియు మర్మావయవాలను నిషిద్ధ కార్యముల్లో పడటం నుండి, అవి బహిర్గతం అవటం నుండి కాపాడుకోమని చెప్పండి. అల్లాహ్ నిషేధించిన వాటి వైపు చూడటం నుండి ఈ ఆపుకోవటం వారి కొరకు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది. నిశ్ఛయంగా వారు చేస్తున్న వాటి గురించి బాగా తెలిసినవాడు. దానిలో నుండి ఆయనపై ఎదీ గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(31) మరియు మీరు విశ్వాసపరులైన స్త్రీలతో తమకు చూడటం సమ్మతం కాని మర్మావయవాల వైపు చూడటం నుండి తమ చూపులను ఆపి ఉంచమని,తమ మర్మాంగాలను అశ్లీలత నుండి దూరంగా ఉండి,వస్త్రంతో కప్పి పరిరక్షించమని,తమ అలంకరణను పరాయి వారి ముందు ప్రదర్శించవద్దని కాని అందులోంచి బహిర్గతమైపోయేవి వేటినైతే దాయటం అసంభవమో అవి తప్ప ఉదాహరణకు : వస్త్రములు, తమ దుపట్టాలను తమ వస్త్రముల పై భాగములో తెరవబడిన భాగములపై నుండు తమ శిరోజాలను,తమ ముఖములను,తమ మెడలను కప్పుకోవటానికి వేసుకోమని, తమ దాచిన అలంకరణను తమ భర్తల ముందు లేక తమ తండ్రుల ముందు లేక తమ మామల ముందు లేక తమ కొడుకుల ముందు లేక తమ భర్తల కొడుకుల ముందు లేక తమ సోదరుల ముందు లేక తమ సోదరుల కుమారుల ముందు లేక తమ అక్కాచెల్లెళ్ల కుమారుల ముందు లేక తమతో కలిసి ఉండే స్త్రీల ముందు వారు ముస్లిములైన లేదా ముస్లిమేతరులైనా లేక స్త్రీ అయిన లేదా పురుషుడైన బానిస ముందు లేక స్త్రిలలో ఇతరత్రా ఉద్దేశాలు లేని లోబడి ఉన్న పురుషుల ముందు లేక తమ బాల్యము వలన స్త్రీల మర్మావయవాల అవగాహన లేని పిల్లల ముందు మాత్రమే బహిర్గతం చేయాలని చెప్పండి. మరియు కాలి పట్టీలు, వాటిని పోలినటువంటి తాము దాచి పెట్టుకున్న అలంకరణను తెలియాలనే ఉద్ధేశంతో తమ కాళ్ళను (నేలమీద) కొట్టకూడదు. ఓ విశ్వాసపరులారా మీరందరు మీ కొరకు సంభవించిన చూపులు మొదలగు వాటి గురించి మీరు కోరుకున్న వాటి ద్వారా మీరు సాఫల్యం చెందుతారని,భయపడే వాటి నుండి విముక్తి పొందుతారని ఆశిస్తూ అల్లాహ్ యందు తౌబా చేయండి.
(32) ఓ విశ్వాసపరులారా మీరు భర్యలు లేని పురషులకు,భర్తలు లేని స్వతంత్రపరులైన స్త్రీలకు వివాహం చేయించండి. మరియు విశ్వాసపరులైన మీ బానిస పురుషులకు,స్త్రీలకు వివాహం చేయించండి. ఒక వేళ వారు పేదవారైతే అల్లాహ్ వారిని తన విశాలమైన అనుగ్రహం ద్వారా ధనికులను చేస్తాడు. మరియు అల్లాహ్ ఆహారోపాధిలో విశాలవంతుడు. ఎవరి సుసంపన్నత ఆయన ఆహారోపాధిని తగ్గించదు. ఆయన తన దాసుల స్థితులను తెలిసినవాడు.
(33) తమ పేదరికం వలన వివాహం చేసుకోవటానికి స్థోమత లేనివారు అల్లాహ్ వారికి తన విశాల అనుగ్రహం ద్వారా ధనవంతులుగా చేసేవరకు వ్యభిచారము నుండి శీల శుద్ధతను పాటించాలి. మరియు బానిసల్లోంచి ఎవరైతే విముక్తి పొందటం కొరకు ధనం ఇవ్వటం పై తమ యజమానులతో వ్రాత పత్రమును కోరితే వారి యజమానులు వారిలో చెల్లించే సామర్ధ్యమును,ధర్మ విషయంలో మంచితనమును చూస్తే వారు తప్పకుండా వారి నుండి స్వీకరించాలి. మరియు వారు తమకు అల్లాహ్ ప్రసాదించిన సంపద నుండి వారు వ్రాతపూరకంగా చెల్లిస్తామన్న దానిలో తమవంతు భాగస్వాములు అవటానికి వారికి ఇవ్వటం ధర్మము. మరియు మీరు మీ బానిస స్త్రీలను ధనాన్ని ఆశిస్తూ వ్యభిచారమునకు బలవంత పెట్టకండి - ఏవిధంగా నైతే అబ్దుల్లాహ్ ఇబ్ను ఉబయ్ తన ఇద్దరి బానిస స్త్రీల పట్ల వారు శీలమును ,అశ్లీలతను దూరంగా ఉండటమును ఆశించినప్పుడు కూడా పాల్పడే వాడు - మీరు వారి మర్మావయవము ద్వారా సంపాదించిన దాన్ని కోరుతూ దానిపై మీలో నుండి ఎవరైన వారిని బలవంతం చేసి ఉంటే నిశ్ఛయంగా అల్లాహ్ బలవంతము తరువాత వారి (ఆ స్త్రీల కొరకు) పాపములను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును. ఎందుకంటే వారు బలవంతం చేయబడ్డారు. పాపమన్నది బలవంతం చేసినవారిపై ఉంటుంది.
(34) మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రజలారా మీ వైపు ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. మరియు మేము మీ వైపున మీకన్న పూర్వం గతించిన విశ్వాసపరుల,అవిశ్వాసపరుల ఉదాహరణలను అవతరింపజేశాము. మరియు మేము మీపై హితోపదేశమును అవతరింపజేశాము. తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన పట్ల భయభీతి కలిగిన వారు దాని ద్వారా హితోపదేశం గ్రహిస్తారు.
(35) అల్లాహ్ ఆకాశములకు,భూమికి జ్యోతీ,వాటిలో ఉన్నవారికి మార్గదర్శకుడు. పరిశుద్ధుడైన ఆయన జ్యోతి విశ్వాసపరుని హృదయంలో కిటికీ లేని గోడలో ఒక గూటితో పోల్చవచ్చు. అందులో ఒక దీపం ఉన్నది. ఆ దీపము ఒక కాంతి వంతమైన గాజు సీసాలో ఉన్నది. అది ముత్యములా మెరిసిపోతున్న ఒక నక్షత్రమువలె ఉన్నది. ఆ దీపము ఒక శుభ ప్రదమైన వృక్షపు నూనెతో వెలిగించబడుతుంది. అది జైతూన్ వృక్షము (ఆలివ్ చెట్టు). ఆ వృక్షమును సూర్యుడి నుండి ప్రొద్దునా గాని సాయంత్రము గాని ఏదీ కప్పి ఉంచలేదు. దాని నూనె స్వచ్ఛదనం వలన దానికి అగ్ని తగలకపోయినా వెలిగిపోయినట్లుంది. అటువంటప్పుడు దానికి అది (అగ్ని) తగిలితే ఎలా ఉంటుంది ?!. దీపం వెలుగు గాజు సీసా వెలుగుపై ఉన్నది. ఇదే విధంగా విశ్వాసపరుని హృదయం అందులో సన్మార్గము యొక్క వెలుగు వెలిగినప్పుడు ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ఖుర్ఆన్ ను అనుసరించే సౌభాగ్యమును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ వస్తువులను వాటిని పోలిన వాటితో ఉపమానములను తెలపటం ద్వారా స్పష్టపరుస్తాడు. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువు గురించి తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
(36) ఈ దీపము ఆ మస్జిదులలో వేటి స్థానమునైతే పెంచమని,వేటినైతే నిర్మించమని అల్లాహ్ ఆదేశించాడో వాటిలో వెలిగించబడుతుంది. మరియు వాటిలో అజాన్ ద్వారా,స్మరణ ద్వారా,నమాజు ద్వారా ఆయన నామము స్మరించటం జరుగుతుంది. వాటిలో అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఉదయం మొదటి వేళలో,చివరి వేళలో నమాజులను పాటిస్తారు.
(37) ప్రజల్లోంచి కొంత మందిని ఏ క్రయ విక్రయాలు వారిని పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ నుండి ,నమాజును సంపూర్ణ పధ్ధతిలో పాటించటం నుండి,జకాతును దాన్ని ఇవ్వవలసిన చోటు ఇవ్వటం నుండి పరధ్యానంలో పడవేయదు. వారు ప్రళయదినం నుండి భయపడుతారు. ఆ రోజు హృదయములు శిక్ష నుండి విముక్తిపొందే ఆశ మధ్యలో దాని నుండి భయపడటంలో తిరుగుతుంటాయి. మరియు కళ్ళు ఏ వైపు వెళ్ళాలో అందులో తిరుగుతుంటాయి.
(38) వారు చేసిన కర్మలకన్న మంచిగా వారికి అల్లాహ్ పుణ్యమును ప్రసాదించాలని,వారికి వాటికి ప్రతిఫలంగా తన అనుగ్రహంలో నుండి అధికంగా ఇవ్వాలని వారు ఇలా చేశారు. మరియు అల్లాహ్ తాను తలచుకున్న వారికి వారి కర్మలకు తగ్గట్టుగా లెక్క లేనంత ప్రసాదిస్తాడు. అంతే కాదు వారికి వారి కర్మల కన్న రెట్టింపు ప్రసాదిస్తాడు.
(39) మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు చేసుకున్న కర్మలు వాటికి ఎటువంటి పుణ్యము ఉండదు. భూమికి పల్లములో ఉన్న ఎండమావులు వలే దాహం కలిగిన వ్యక్తి దాన్ని చూసినప్పుడు దాన్ని నీళ్ళు అని భావించి దాని వద్దకు వస్తాడు. చివరికి దాని వద్దకు వచ్చి దాని దగ్గర నిలబడినప్పుడు ఎటువంటి నీటిని పొందడు. ఇదే విధంగా అవిశ్వాసపరుడు అతని కర్మలు అతనికి ప్రయేజనం చేకూరుస్తాయని భావిస్తాడు. చివరికి అతను మరణించి మరలా లేపబడినప్పుడు అతడు వాటి పుణ్యమును పొందడు. మరియు అతడు తన ప్రభువును తన ముందట పొందుతాడు. అప్పుడు ఆయన అతని కర్మలకు పరిపూర్ణంగా లెక్కతీసుకుంటాడు. మరియు అల్లాహ్ శీఘ్రంగా లెక్క తీసుకునే వాడు.
(40) లేదా వారి కర్మలు లోతైన సముద్రంలో చీకట్ల వలె ఉంటాయి. దానిపై ఒక అల ఎక్కి ఉంటుంది,ఆ అల పై నుండి వేరొక అల ఉంటుంది. దానిపై నుండి మార్గమును పొందటానికి ఉన్న నక్షత్రములను కప్పివేసే ఒక మేఘం ఉంటుంది. చీకట్లు ఒక దానిపై ఒకటి పేరుకుపోయి ఉంటాయి. ఈ చీకట్లలో వాటిల్లిన వాడు తన చేతిని బయటకు తీసినప్పుడు చీకటి తీవ్రత వలన దాన్ని చూడలేక పోతాడు. ఇదే విధంగా అవిశ్వాసపరుడు కూడా. అతనిపై అజ్ఞానం,సందేహం,గందరగోళం,అతని హృదయంపై ముద్ర యొక్క చీకట్లు ఒక దానిపై ఒకటి పేరుకుపోయాయి. ఎవరికైతే అల్లాహ్ మార్గ భ్రష్టత నుండి సన్మార్గమును,తన గ్రంధం ద్వారా జ్ఞానమును ప్రసాదించడో అతని కొరకు మార్గం పొందటానికి సన్మార్గము గాని,వెలుగును పొందటానికి ఎటువంటి గ్రంధము గాని ఉండవు.
(41) ఓ ప్రవక్తా ఆకాశముల్లో ఉన్నవి అల్లాహ్ పరిశుద్ధతను తెలుపుతున్నవని మరియు భూమిలో ఉన్న ఆయన సృష్టితాలు ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవని మీకు తెలియదా. మరియు పక్షులు గాలిలో తమ రెక్కలను చాచి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఆ సృష్టితాల్లోంచి ప్రతీ ఒక్కరికీ వారిలో నుండి నమాజును చదివే వారికి అల్లాహ్ నమాజును నేర్పించాడు ఉదా : మనిషి. వారిలో నుండి పరిశుద్ధతను కొనియాడే వారికి పరిశుద్ధతను నేర్పించాడు ఉదా : పక్షులు. వారు చేసే వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(42) ఆకాశముల యొక్క అధికారము,భూమి యొక్క అధికారము ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ప్రళయదినాన లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలిపోవలసి ఉంది.
(43) ఓ ప్రవక్తా అల్లాహ్ మేఘాలను నడుపుతాడని మీకు తెలియదా .ఆ పిదప వాటి కొన్నింటి భాగములను కొన్నింటితో కలిపి వేస్తాడు. ఆ తరువాత వాటిని ఒక దానిపై ఒకటి ఎక్కి గుట్టలాగా ఉండేటట్లు పేరుస్తాడు. అప్పుడు నీవు వర్షాన్ని మేఘముల మధ్య నుండి వెలికి రావటమును చూస్తావు. మరియు ఆయన ఆకాశము వైపు నుండి పెద్దవవటంలో పర్వతాలను పోలిన దట్టమైన మేఘముల నుండి కంకర రాళ్ళ వలే ఘనీభవించిన నీటి ముక్కలను కురిపిస్తాడు. అప్పుడు ఆ వడగండ్లను తన దాసుల్లోంచి ఆయన కోరిన వారికి చేరవేస్తాడు. మరియు ఆయన కోరిన వారి నుండి మరలింపజేస్తాడు. మేఘముల మెరుపు కాంతి దాని తీవ్ర మెరవటం వలన చూపులను తీసుకుని పోయే విధంగా ఉంటుంది.
(44) అల్లాహ్ రేయింబవళ్ళ మధ్య పెద్దవవటంలో,పొట్టిదవటంలో మరియు రావటం,పోవటంలో మారుస్తున్నాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన సూచనలలో నుంచి రుబూబియత్ యొక్క ఆధారాలలో అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై అంతర్దృష్టి కలవారికి హితోపదేశం ఉన్నది.
(45) మరియు అల్లాహ్ జంతువుల్లోంచి భూ ఉపరితలంపై ప్రాకే ప్రతీ దాన్ని నీటి బిందువుతో సృష్టించాడు. వాటిలో నుండి తమ పొట్టపై ప్రాకుతూ నడిచే పాములు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి రెండుకాళ్ళపై నడిచే మనుషులు,పక్షులు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి నాలుగు కాళ్ళపై నడిచే పశువులు లాంటివి ఉన్నవి. అల్లాహ్ తాను ప్రస్తావించిన వాటిని,ప్రస్తావించని వాటిలో నుంచి తాను కోరిన వాటిని సృష్టిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(46) నిశ్ఛయంగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. అల్లాహ్ తాను తలచిన వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు సౌభాగ్యమును కలిగింపజేస్తాడు. ఆ మార్గము అతన్ని స్వర్గము వైపునకు తీసుకుని పోతుంది.
(47) మరియు కపటులు ఇలా పలికారు : మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు దైవ ప్రవక్తను విశ్వసించాము. మరియు అల్లాహ్ పై విధేయత చూపాము మరియు ఆయన ప్రవక్తపై విధేయత చూపాము. ఆ తరువాత వారిలో నుండి ఒక వర్గము ముఖము చాటేసింది. వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసము గురించి,వారి పట్ల విధేయత గురించి వాదించిన తరువాత వారు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం ఆదేశం విషయంలో,ఇతరవాటిలో అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత చూపలేదు. మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త పై విధేయత నుండి విముఖత చూపే వీరందరు ఒక వేళ వారు విశ్వాసపరులని వాదించినా వారు విశ్వాసపరులు కారు.
(48) ఈ కపటులందరు అల్లాహ్ వైపునకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు వారు తగాదా పడుతున్న దాని విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పునివ్వటానికి పిలవబడినప్పుడు వారు తమ కపటత్వం వలన ఆయన తీర్పు నుండి విముఖత చూపేవారు.
(49) ఒక వేళ హక్కు తమదే అని,ఆయన తమకు అనుకూలంగా తీర్పునిస్తారని వారికి తెలిస్తే వారు ఆయన వద్దకు లొంగిపోతూ,అణకువను చూపుతూ వస్తారు.
(50) ఏమీ వీరందరి హృదయములలో ఏదైన రోగం వాటిని అంటిపెట్టుకుని ఉన్నదా ? లేదా వారు ఆయన అల్లాహ్ ప్రవక్త అన్న విషయంలో సందేహపడుతున్నారా ? లేదా తీర్పు విషయంలో అల్లాహ్,ఆయన ప్రవక్త వారికి అన్యాయం చేస్తారని భయపడుతున్నారా ? .ఈ ప్రస్తావించబడినది ఏదీ కాదు. కాని అతని తీర్పు నుండి వారి విముఖత,అతని పట్ల వారి మొండితనం వలన వారి మనస్సులలో ఉన్న రోగం వలన ఇది.
(51) విశ్వసించిన వారిని వారి మధ్య తీర్పునివ్వటం కొరకు అల్లాహ్ వైపునకు,దైవ ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు వారి మాటలు ఇలా ఉంటాయి : మేము ఆయన మాటను విన్నాము మరియు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము. ఈ గుణాలతో వర్ణించబడిన వారు ఇహ,పరాలలో సాఫల్యం చెందుతారు.
(52) మరియు ఎవరైతే అల్లాహ్ కు విధేయత చూపుతాడో,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతాడో మరియు వారిద్దరి ఆదేశమునకు లొంగిపోతాడో,తనను పాప కార్యాల వద్దకు తీసుకుని వెళ్ళే వాటితో భయపడతాడో ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి భయపడుతూ అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడతాడో వారందరు మాత్రమే ఇహ,పరాల మంచితో సాఫల్యం చెందుతారు.
(53) కపట విశ్వాసులు ఒక వేళ మీరు వారిని ధర్మ పోరాటం కొరకు బయలదేరమని ఆదేశిస్తే వారు తప్పకుండా బయలుదేరుతారని అల్లాహ్ పై తమ శక్తిమేరకు అంతం వరకు ప్రమాణం చేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ప్రమాణాలు చేయకండి, మీ అబద్దము చెప్పటం తెలుసు. మీరు ఆరోపిస్తున్న మీ విధేయతా తెలుసు. మీరు చేస్తున్న వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మీరు మీ కర్మల్లోంచి ఏది దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
(54) ఓ ప్రవక్తా ఈ కపట విశ్వాసులందరితో అనండి : మీరు అల్లాహ్ కు,ప్రవక్తకు బహిర్గంగా,అంతరంగా విధేయత చూపండి. ఒక వేళ మీరు వారిద్దరి విధేయత విషయంలో మీకు ఆదేశించబడిన వాటి గురించి విముఖత చూపితే ఆయనపై సందేశాలను చేరవేసే బాధ్యత ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే ఆయన బాధ్యులు మరియు ఆయన తీసుకుని వచ్చిన దానిపై వీధేయత చూపే, ఆచరించే బాధ్యత, మీకు ఏదైతే ఇవ్వబడినదో దాని బాధ్యత మీపై ఉన్నది. ఒక వేళ మీరు ఆయన మీకు ఆదేశించిన వాటిని పాటించి,మీకు వారించిన వాటిని విడనాడి ఆయనకు విధేయత చూపితే మీరు సత్యము వైపునకు మార్గం పొందుతారు. మరియు ప్రవక్తపై స్పష్టంగా చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. సన్మార్గము పై మిమ్మల్ని ప్రేరేపించే,దానిపై మిమ్మల్ని బలవంతం పెట్టే బాధ్యత ఆయనపై లేదు.
(55) మీలో నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసే వారికి వారి శతృవులకు విరుద్ధంగా సహాయం చేస్తాడని,వారికన్న మునుపు విశ్వాసపరులని భూమిలో ప్రతి నిధులుగా చేసినట్లు వారినీ ప్రతినిధులుగా చేస్తాడని అల్లాహ్ వాగ్దానం చేశాడు. మరియు వారి కొరకు తాను ఇష్టపడిన ధర్మమైన ఇస్లాం ధర్మమును స్థిరంగా,ఆధిక్యంగా చేస్తాడని వారికి వాగ్దానం చేశాడు. మరియు వారి భయాందోళనల స్థితి తరువాత వారికి శాంతి స్థితిగా మారుస్తాడని వాగ్దానం చేశాడు. వారు నన్నే ఆరాధించాలి. మరియు నాతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు. ఈ అనుగ్రహాల తరువాత ఎవరైతే కృతఘ్నులవుతారో వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలిగిన వారు.
(56) మరియు మీరు అల్లాహ్ కారుణ్యమును పొందటమును ఆశిస్తూ నమాజులను సంపూర్ణ పధ్ధతిలో పాటించండి, మీ సంపదల నుండి జకాతును చెల్లించండి,మీకు ఆదేశించిన వాటిని పాటించి,మీకు వారించిన వాటిని విడనాడి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి.
(57) ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు నేను వారిపై శిక్షను అవతరింపదలచినప్పుడు వారు నా నుండి తప్పించుకుంటారని మీరు భావించకండి. ప్రళయదినాన వారి నివాసం నరకము. ఎవరి గమ్య స్థానము నరకమయిద్దో వారి గమ్య స్థానం ఎంత చెడ్డదైనదో.
(58) ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీ బానిస పురుషులు,మీ బానిస స్త్రీలు,ప్రజ్ఞా వయస్సుకు చేరని స్వతంతృలైన పిల్లలు మూడు వేళల్లో మీతో అనుమతి తీసుకోవాలి అవి : 1) ప్రొద్దున నమాజు కన్నముందు నిద్ర బట్టలను మార్చి మేల్కొనే బట్టలు వేసుకునే వేళ, 2) మద్యాహ్న నమాజు తరువాత మీరు విశ్రాంతి కొరకు మీ వస్త్రములను విడిచిన వేళ, 3) ఇషా నమాజు తరువాత ఎందుకంటే అది మీ నిద్ర సమయము మరియు మేల్కొన్నప్పుడు వేసుకున్న బట్టలను విడిచి నిద్ర బట్టలు తొడుగుకునే సమయము. ఈ మూడు మీ పరదా సమయములు. ఆ సమయాలలో వారు మీ వద్దకు మీ అనుమతి తరువాతే రావాలి. వేరే సమయములలో అనుమతి లేకుండా వారు మీ వద్దకు వస్తే మీ పై ఎటువంటి పాపం లేదు. వారు ఎక్కువగా వస్తూ పోవు వారు. మీరు ఒకరి వద్దకు ఒకరు వచ్చి పోయేవారు. అనుమతితో తప్ప అన్ని సమయాలలో ప్రవేశించకుండా వారిని నిరోధించలేము. ఏ విధంగానైతే అల్లాహ్ మీకు అనుమతి తీసుకునే ఆదేశాలను స్పష్టపరచాడో మీ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన ఆదేశములను సూచించే ఆయతులను మీ కొరకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనాల గురించి బాగా తెలిసినవాడు,వారి కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.
(59) పెద్దవారి విషయంలో ముందు ప్రస్తావించినట్లే మీలో నుండి పిల్లలు ప్రజ్ఞా వయస్సుకు చేరుకున్నప్పుడు అన్ని వేళల్లో ఇండ్లలో ప్రవేశించేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఏ విధంగానైతే అల్లాహ్ అనుమతి తీసుకునే ఆదేశాలను మీకు స్పష్టపరచాడో మీకు అల్లాహ్ తన ఆయతులను స్పష్టపరిచాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల ప్రయోజనాల గురించి బాగా తెలుసు,వారి కొరకు ఆయన ధర్మ సమ్మతం చేస్తున్న వాటి విషయంలో వివేకవంతుడు.
(60) మరియు ఆ వృద్ధ స్త్రీలు ఎవరైతే తమ వృద్ధాప్యం వలన ఋతుస్రావం నుండి,గర్భందాల్చటం నుండి కూర్చున్నారో వారు,వివాహంలో ఆశ లేని స్త్రీలు తమ వస్త్రాలైన దుప్పట,ముసుగు వంటి వాటిని తీసి వేయటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. వారిని వేటినైతే కప్పివేయమని ఆదేశించబడినదో ఆ దాయబడిన అలంకరణలను బహిర్గతం చేసే విధంగా ఉండకూడదు. ఎక్కువగా పరదా,నిగ్రహము పాటించటంలో వారు ఆ వస్త్రములను విడవటమును వదిలివేయటం విడవటం కన్న వారికి ఎంతో మంచిది. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడుని,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన మీకు వాటి పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
(61) తన దృష్టిని కోల్పోయిన అంధునిపై ఎటువంటి పాపం లేదు,కుంటివానిపై ఎటువంటి పాపం లేదు, రోగిపై ఎటువంటి పాపం లేదు ఒక వేళ వారు అల్లాహ్ మార్గంలో పోరాడటం లాంటి బాధ్యతలను నెరవేర్చే శక్తి లేని వాటిని వదిలివేస్తే (వారిపై ఎటువంటి పాపం లేదు). ఓ విశ్వాసపరులారా మీరు మీ ఇండ్ల నుండి తినటంలో,మీ పిల్లల ఇండ్ల నుండి గాని ,మీ తండ్రుల లేదా మీ తల్లుల లేదా మీ సోదరుల లేదా మీ సోదరిల లేదా మీ బాబాయిల లేదా మీ మేనత్తల లేదా మీ మేనమామల లేదా మీ పిన్నుల లేదా తోటమాలి లాంటి మీరు పరిరక్షణ కొరకు బాధ్యత వహిస్తున్న ఇండ్ల నుండిగాని తినటంలో ఎటువంటి పాపం లేదు. మీ స్నేహితుని ఇండ్ల నుండి అతని మంచి మనస్సు వలన దానికి అలవాటు ఉంటే తినటంలో ఎటువంటి పాపం లేదు. మరియు మీరు ఒక వేళ కలిసి తిన్నా లేదా ఒంటరిగా తిన్నా మీపై ఎటువంటి పాపం లేదు. ప్రస్తావించబడిన ఇండ్ల లాంటి ఇండ్లలో,ఇతరవాటిలో మీరు ప్రవేశించినప్పుడు వాటిలో ఉన్నవారిపై మీరు అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక) అని పలుకుతూ సలాం చేయండి. ఒక వేళ వాటిలో ఎవరూ లేకపోతే మీరు అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ (మా పై,అల్లాహ్ పుణ్య దాసులపై శాంతి కలుగు గాక) అని పలుకుతూ సలాం చేయండి. ఇది అల్లాహ్ తరపు నుండి సలాం దాన్ని ఆయన మీ కొరకు శుభదాయకంగా ధర్మబద్దం చేశాడు. మీరు మీ మధ్య ప్రేమను,సాన్నిహిత్యమును వ్యాపింపజేయటానికి. పరిశుద్ధమైనది. దాన్ని వినే వాడి మనస్సు పరిశుద్ధమవుతుంది. సూరాలో ముందల ఈ ప్రస్తావించినట్లే మీరు వాటిని అర్ధం చేసుకుని వాటిలో ఉన్న దాన్ని మీరు చేస్తారని ఆశిస్తూ అల్లాహ్ ఆయతులను స్ఫష్టపరుస్తున్నాడు.
(62) ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారో,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తారో వారే తమ విశ్వాసములో సత్యవంతులైన విశ్వాసవంతులు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఏదైన వ్యవహారం విషయంలో ముస్లిముల ప్రయోజనం కొరకు సమావేశమైనప్పుడు వారు ఆయనతో తాము మరలటానికి అనుమతి కోరనంత వరకు వారు మరలరు. ఓ ప్రవక్తా నిశ్ఛయంగా ఎవరైతే మరలేటప్పుడు మీతో అనుమతి కోరుతారో వారందరు వాస్తవానికి అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారు,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరిచే వారు. వారు తమ అత్యవసర ఏదైన పని నిమిత్తం మీతో అనుమతి కోరినప్పుడు మీరు వారిలో నుండి ఎవరికి అనుమతినివ్వదలచుకుంటే వారికి అనుమతినివ్వండి. మరియు వారి పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కనికరించేవాడును.
(63) ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ ప్రవక్తను గౌరవించండి. మీరు ఆయనను పిలిచినప్పుడు ఆయన పేరుతో ఓ ముహమ్మద్ అని లేదా ఆయన తండ్రి పేరుతో కలిపి ఓ అబ్దుల్లాహ్ కుమారుడా అని పిలవకండి. ఏ విధంగానైతే మీరు ఒకరితో ఒకరు చేసేవారో అలా (చేయకండి). కాని మీరు ఓ అల్లాహ్ ప్రవక్తా (యా రసూలల్లాహ్) ఓ అల్లాహ్ సందేశహరుడా (యా నబియల్లాహ్ ) అని పలకండి. మరియు ఆయన మిమ్మల్ని ఏదైన సాధారణ విషయం కోసం పిలిచినప్పుడు మీరు ఆయన పిలుపును అలవాటు ప్రకారంగా మీలో కొందరు కొందరిని అల్పమైన విషయాల కోసం పిలిచే పిలుపుగా చేయకండి. అంతేకాదు మీరు దాన్ని స్వీకరించటానికి త్వరపడండి. వాస్తవానికి మీలో నుండి అనుమతి లేకుండా చాటుగా మరలేవారి గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశమునకు వ్యతిరేకించేవారు అల్లాహ్ వారిని ఏదైన బాధను,ఆపదను కలిగింపజేస్తాడని లేదా వారికి వారు భరించలేని బాధాకరమైన శిక్షను కలిగింపజేస్తాడని జాగ్రత్తపడాలి.
(64) వినండి నిశ్ఛయంగా ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారం పరంగా, పర్యాలోచన పరంగా ఒక్కడైన అల్లాహ్ కొరకే. ఓ ప్రజలారా మీరు ఉన్న స్థితుల గురించి ఆయనకు తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ప్రళయదినాన - మరణాంతరం లేపబడటం ద్వారా వారు మరలించబడినప్పుడు - ఆయన వారికి ఇహలోకంలో వారు చేసిన కర్మల గురించి తెలియపరుస్తాడు. మరియు అల్లాహ్ అన్ని విషయాల గురించి బాగా తెలిసినవాడు. ఆకాశముల్లో గాని భూమిలో గాని ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.