(1) ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ పరిశుద్దతను మరియు ఆయనకు తగని వాటి నుండి ఆయన అతీతను తెలుపుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించని సర్వాధిక్యుడు, తన సృష్టించటంలో మరియు తన విధి వ్రాతలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
(2) ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారా వాస్తవానికి మీరు చేయని దాన్ని మేము చేశాము అని ఎందుకు పలుకుతున్నారు ?! మీలో నుండి ఒకరు ఇలా పలికినట్లు : నేను నా ఖడ్గముతో ఇలా పోరాడాను మరియు ఇలా కొట్టాను. వాస్తవానికి అతడు తన ఖడ్గముతో పోరాడలేదు మరియు కొట్టలేదు.
(3) మీరు చేయని దాని గురించి మీరు పలకటం అల్లాహ్ యందు చాలా అసహ్యకరమైనది. విశ్వాసపరునికి అల్లాహ్ తో సత్యం పలికే వాడిగా ఉండటం మాత్రమే తగినది. అతని మాటను అతని ఆచరణ సత్యం చేయాలి.
(4) నిశ్ఛయంగా అల్లాహ్ తన మన్నతను ఆశిస్తూ ఒకరి ప్రక్కన ఒకరు ఒకే పంక్తిలో ఉండి ఒక దానితో ఒకటి ఇమిడి ఉన్న కట్టడము వలె తన మన్నతను ఆశిస్తూ తన మార్గములో పోరాడే విశ్వాసపరులను ఇష్టపడుతాడు.
(5) ఓ ప్రవక్తా మూసా తన జాతి వారితో ఇలా పలికినప్పటి వైనమును ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ నా జాతి వారా నేను మీ వద్దకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్తనని తెలిసికూడా నా ఆదేశమును విబేధించి ఎందుకని మీరు నాకు బాధను కలిగిస్తున్నారు ?!. ఎప్పుడైతే వారు ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చిన సత్యము నుండి వాలిపోయారో,మరలిపోయారో అల్లాహ్ వారి హృదయములను సత్యము నుండి మరియు స్థిరత్వము నుండి మరలింపజేశాడు. మరియు అల్లాహ్ తన విధేయత నుండి వైదొలగిపోయిన జాతి వారిని సత్యము పొందే భాగ్యమును కలిగించడు.
(6) ఓ ప్రవక్తా మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాం ఇలా పలికినప్పటి వైనమును మీరు ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ ఇస్రాయీలు సంతతివారా నిశ్ఛయంగా నేను అల్లాహ్ ప్రవక్తను ఆయన నన్ను నా కన్న ముందు అవతరింపబడిన తౌరాత్ ను దృవీకరించేవాడిగా పంపించాడు. నేను ప్రవక్తల్లో మొదటి వాడిని కాను. మరియు నా తరువాత వచ్చే ఒక ప్రవక్త గురించి శుభవార్తనిచ్చే వానిగా పంపించాడు అతని పేరు అహ్మద్. ఎప్పుడైతే ఈసా అలైహిస్సలాం వారి వద్దకు తన నిజాయితీని సూచించే వాదనలను తీసుకుని వచ్చారో వారు ఇలా పలికారు : ఇది ఒక స్పష్టమైన మంత్రజాలము కావున మేము దీన్ని అనుసరించము.
(7) అల్లాహ్ పై అబద్దమును కల్పించుకునే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. ఎందుకంటే అతడు ఆయనకు సాటి కల్పించుకుని ఆయనను వదిలి వారిని ఆరాధించాడు. వాస్తవానికి అతడు అల్లాహ్ కొరకు ప్రత్యేకించబడిన ఏక దైవోపాసన ధర్మమైన ఇస్లాం వైపునకు పిలవబడ్డాడు. మరియు షిర్కుతో,పాప కార్యములతో తమపై దుర్మార్గమునకు పాల్పడిన జాతి వారిని అల్లాహ్ వారి సన్మార్గము మరియు వారి సంస్కరణ ఉన్న దాని వైపునకు భాగ్యము కలిగించడు.
(8) ఈ తిరస్కారులందరు తమ నుండి వెలువడిన చెడు మాటల ద్వారా మరియు సత్యమును వక్రీకరించటం ద్వారా అల్లాహ్ వెలుగును ఆర్పివేయాలనుకుంటున్నారు. మరియు అల్లాహ్ భూమండల తూర్పు పశ్ఛిమాల్లో తన ధర్మమునకు ఆధిక్యతను కలిగించి మరియు తన కలిమాకు ఉన్నత శిఖరాలకు చేర్చి వారికి విరుద్దంగా తన వెలుగును పూర్తి చేసేవాడును.
(9) అల్లాహ్ యే తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇస్లాం ధర్మమును ఇచ్చి పంపించాడు. అది సన్మార్గ ధర్మము మరియు మంచిని మార్గ నిర్దేశకం చేసేది మరియు ప్రయోజనకర జ్ఞాన మరియు సత్కర్మ ధర్మము. భూమిపై దానికి అధికారము కలగటమును ద్వేషించే ముష్రికులకు ఇష్టం లేకపోయిన దాన్ని ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి.
(10) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా ఏమీ నేను మీకు మిమ్మల్ని బాధకరమైన శిక్ష నుండి రక్షించే ఒక లాభదాయకమైన వ్యాపారము వైపునకు మార్గ నిర్ధేశకం చేయనా ?.
(11) ఈ లాభదాయక వ్యాపారము అది మీరు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసం చూపటం మరియు పరిశుద్ధుడైన ఆయన మార్గంలో మీ సంపదలను ఖర్చు చేసి,మీ ప్రాణములను వినియోగించి ఆయన మన్నతను ఆశిస్తూ పోరాడటం. ఈ ప్రస్తావించబడిన కార్యము మీ కొరకు మేలైనది ఒక వేళ మీరు తెలుసుకుంటే దాని వైపునకు త్వరపడండి.
(12) మరియు ఈ వ్యాపారము యొక్క ప్రయోజనం అది అల్లాహ్ మీ కొరకు మీ పాపములను మన్నించటం మరియు మిమ్మల్ని భవనముల క్రింది నుండి,చెట్ల క్రింది నుండి కాలువలు ప్రవహించే స్వర్గ వనములలో ప్రవేశింపజేయటం మరియు శాశ్వత స్వర్గ వనముల్లో ఉన్న మంచి నివాసములలో మిమ్మల్ని ప్రవేశింపజేయటం. వాటి నుండి మరలింపు అన్నది ఉండదు. ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలమే ఎటువంటి విజయము సరితూగని గొప్ప విజయము.
(13) మరియు ఈ వ్యాపార ప్రయోజనముల్లోంచి మీరు ఇష్టపడే ఇంకొక లక్షణం ఉన్నది అది ఇహలోకంలో త్వరగా లభించేది. అల్లాహ్ మీ శతృవులకు విరుద్ధంగా మీకు సహాయం చేయటం మరియు ఆయన మీకు విజయం కలిగించే దగ్గరలోని విజయం అది మక్కాపై విజయం మొదలుగునవి. ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులకు సంతోషమును కలిగించే ఇహలోకములో సహాయము పరలోకంలో స్వర్గపు విజయము గురించి తెలియపరచండి.
(14) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా ఈసా అలైహిస్సలాం హవారీలతో అల్లాహ్ మార్గములో నాకు ఎవరు సహాయకులుగా ఉంటారు అని పలికినప్పుడు హవారీలు సహాయము చేసిన మాదిరిగా మీ ప్రవక్త తీసుకుని వచ్చిన అల్లాహ్ ధర్మము కొరకు మీ సహాయము ద్వారా అల్లాహ్ కు సహాయకులుగా అయిపోండి. అప్పుడు వారు (హవారీలు) త్వరపడుతూ ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : మేము అల్లాహ్ కు సహాయకులుగా ఉంటాము. అప్పుడు ఇస్రాయీలు సంతతి వారిలోంచి ఒక వర్గము ఈసా అలైహిస్సలాం పై విశ్వాసమును కనబరచినది. ఇంకొక వర్గము ఆయనను తిరస్కరించింది. అప్పుడు మేము ఈసా అలైహిస్సలాం పై విశ్వాసమును కనబరచిన వారికి ఆయనను తిరస్కరించిన వారికి విరుద్ధంగా మద్దతును కలిగించాము. అప్పుడు వారు వారిపై ఆధిక్యతను కలిగినవారైపోయారు.