(1) .(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఇవి స్పష్టమైన ఖుర్ఆన్ వచనాలు.
(3) మేము మూసా మరియు ఫిర్ఔన్ వృత్తాంతమును విశ్వాస జనుల కొరకు ఎటువంటి సందేహము లేని సత్యముతో మీపై చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే వారే అందులో ఉన్న దానితో ప్రయోజనం చెందుతారు.
(4) నిశ్ఛయంగా ఫిర్ఔన్ మిసర్ (ఈజిప్టు) భూమిలో అతిక్రమించాడు మరియు అందులో ఆదిపత్యమును చెలాయించాడు. మరియు అతడు దాని వాసులను వర్గాలుగా విభజించాడు. వారిలో నుండి ఒక వర్గమును వారి మగ సంతానమును హత మార్చి,వారి ఆడవారిని సేవ కొరకు వారిని మరింత అవమానానికి గురి చేయడానికి జీవించి ఉండేటట్లు చేసి బలహీనులుగా చేశాడు. వారు ఇస్రాయీలు సంతతివారు. నిశ్ఛయంగా అతడు హింస,నిరంకుశత్వము,అహంకారము ద్వారా భూమిలో ఉపద్రవాలను రేకెత్తే వారిలోంచి అయిపోయాడు.
(5) మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రాయీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రాముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَاۖ అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము.
(6) మరియు మేము వారిని భూమిలో ఆధిక్యత కలిగిన వారిని చేసి వారికి భూమిలో సాధికారత ప్రసాదించాలని మరియు మేము ఫిర్ఔన్ కు,రాజ్యంలో అతనికి పెద్ద మద్దతు దారుడైన హామాన్ మరియు వారిరువురి సైనికులకు,రాజ్యంలోని వారిరువురి సహాయకులకు వారు దేని గురించైతే భయపడుతున్నారో వారి రాజ్యమును కోల్పోవటమును,అది కూడా ఇస్రాయీలు సంతతి లో నుండి ప్రస్తావించబడిన ఒక పిల్లవాడి చేతిలో జరగటమును చూపించటమును కోరుతున్నాము.
(7) మరియు మేము మూసా అలైహిస్సలాం తల్లి మనస్సులో ఇలా ఆదేశించాము : నీవు అతనికి పాలు ఇస్తూ ఉండు. చివరికి ఫిర్ఔన్,అతని జాతి వారు అతన్ని హతమారుస్తారని నీకు భయమేస్తే అతన్ని ఒక పెట్టిలో ఉంచి దాన్ని నైలు నదిలో పడవేయి. మరియు నీవు మునగటం గురించి గాని ఫిర్ఔన్ నుండి గాని అతనిపై భయపడకు. మరియు అతను నీ నుండి విడిపోతాడని దుఃఖించకు. నిశ్చయంగా మేము అతన్ని జీవించి ఉన్న స్థితిలో నీ వైపునకు మరలించేవారము. మరియు అతన్ని అల్లాహ్ సృష్టితాలవైపు ప్రవక్తలుగా పంపించిన ప్రవక్తల్లోంచి చేసేవారము.
(8) అప్పుడు ఆమె మేము ఆదేశించినట్లే అతన్ని ఒక పెట్టిలో పెట్టి నదిలో పడవేసింది. అప్పుడు అతను ఫిర్ఔన్ వంశీయులకు దొరికాడు. అప్పుడు వారు అతన్ని ఎత్తుకున్నారు. మూసా ఫిర్ఔన్ కు శతృవు అయ్యి అతని రాజ్యం అతని చేతి మీద కోల్పోవటం,వారికి దుఃఖమును తీసుకుని వచ్చే వాడిగా అవటం ఏదైతే అల్లాహ్ తలచుకున్నాడో అది నిజమవటానికి. నిశ్చయంగా ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామాను,వారిరువురి సహాయకులు తమ అవిశ్వాసం వలన,తమ నిరంకుశత్వం వలన,భూమిపై తమ సంక్షోభమును కలిగించటం వలన అపరాధులైపోయారు.
(9) ఎప్పుడైతే ఫిర్ఔన్ అతన్ని హతమార్చదలచాడో అతనితో అతని భార్య ఇలా పలికింది : ఈ పిల్లవాడు నీకూ,నాకూ సంతోషమును కలిగించేవాడు. నీవు అతన్ని హతమార్చకు. బహుశా అతను సేవ ద్వారా మనకు ప్రయోజనం కలిగిస్తాడు లేదా మేము అతన్ని దత్తత చేసుకుని పుతృనిగా చేసుకుందాము. అతని చేతి మీదుగా వారి రాజ్యము అతనికి చేరుతుందన్న విషయం వారికి తెలియదు.
(10) మరియు మూసా అలైహిస్సలాం తల్లి హృదయం మూసా వ్యవహారం విషయం తప్ప ప్రపంచ వ్యవహారాలన్నింటి నుండి ఖాళీ అయిపోయింది. ఆమెకు ఓపిక లేకపోయేది. చివరికి ఆమె అతనితో తనకు ఉన్నసంబంధము వలన అతడు తన కుమారుడని బహిర్గతం చేసే ఆస్కారం ఉండేది. ఒక వేళ మేము ఆమె హృదయమును అతని స్థిరత్వముపై,ఆమె సహనముపై తమ ప్రభువుపై విశ్వసించి,నమ్మకమును కలిగి ఉండి తనపై తీర్పు ఇవ్వబడిన దానిపై సహనము చూపే వారిలో నుండి అవటానికి ముడివేశాము.
(11) మరియు మూసా అలైహిస్సలాం తల్లి ఆయనను నదిలో పడవేసిన తరువాత అతని సోదరినితో ఇలా పలికింది : నీవు అతనిపట్ల ఏమి చేయబడుతుందో తెలుసుకోవటానికి అతని వెంట వెళ్ళు. అప్పుడు ఆమె తన విషయం బయటపడకుండా ఉండేందుకు దూరం నుంచే ఆయనను గమనించసాగింది. మరియు ఆమె అతని సోదరి అని,ఆమె అతని సమాచారమును తనిఖీ చేస్తున్నదని ఫిర్ఔన్,అతని జాతి వారు గ్రహించలేకపోయారు.
(12) మరియు మూసా అల్లాహ్ నిబంధనతో స్త్రీల నుండి పాలు త్రాగటం నుండి దూరంగా ఉన్నారు. అతని సోదరి అతన్ని పాలు త్రాపించటంపై వారి ఆసక్తిని చూసినప్పుడు వారితో ఇలా పలికింది : ఏమీ నేను అతన్ని పాలు త్రాపించి,అతని బాగోగులు చూసుకునే (పోషించే) ఒక కుటుంబం వారిని మీకు తెలుపనా ? . వారు అతని మేలును ఆశించేవారై ఉంటారు.
(13) అప్పుడు మేము మూసాను అతని తల్లికి ఆయన దగ్గరవటం నుండి ఆమె కంటిచలువ అవుతారని ఆశిస్తూ వాపసు చేశాము. మరియు ఆమె అతని విడిపోవటం వలన బాధపడకుండా ఉండటానికి,అతన్ని ఆమెకు వాపసు చేసే విషయంలో అల్లాహ్ వాగ్దానం ఎటువంటి సందేహం లేని సత్యమని తెలుసుకోవటానికి. కాని వారిలో నుండి చాలా మందికి ఈ వాగ్దానం గురించి తెలియదు. మరియు ఎవరికీ ఆమె అతని తల్లి అని తెలియదు.
(14) మరియు అతను దృఢమైన శరీరము అయ్యే వయస్సుకు చేరి,తన బలమును దృఢపరచుకున్నప్పుడు మేము అతనికి ఇస్రాయీలు సంతతి వారి ధర్మ విషయంలో అతని దైవదౌత్యముకు మునుపే అర్ధం చేసుకునే గుణమును,జ్ఞానమును ప్రసాదించాము. ఏ విధంగానైతే మేము మూసాకు తన విధేయత వహించటంపై ప్రతిఫలమును ప్రసాదాంచామో అలాగే ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశములో సద్వర్తనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(15) మరియు మూసా ప్రజలు తమ ఇండ్లలో విశ్రాంతి తీసుకునే సమయంలో నగరంలో ప్రవేశించారు. అప్పుడు ఆయన అక్కడ ఇద్దరు వ్యక్తులను పరస్పరం తగాదాలాడుతుండగా,ఒకరినొకరు కొట్టుకుంటుండగా చూశారు. వారిలో ఒకడు మూసా అలైహిస్సలాం జాతి అయిన ఇస్రాయీలు సంతతికి చెందినవాడు,ఇంకొకడు మూసా శతృవైన ఫిర్ఔన్ జాతి ఖిబ్తీకు చెందిన వాడు. అప్పుడు తన జాతికి చెందిన వాడు తన శతృవు జాతి ఖిబ్తీ నుండి ఉన్న వ్యక్తి కి విరుద్ధంగా తనకు సహాయం చేయాలని ఆయనతో కోరాడు. అప్పుడు మూసా తన చేతి పిడికిలితో ఖిబ్తీని కొట్టారు. ఆయన ఇలా బలంగా కొట్టి అతన్ని హతమార్చారు. మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : ఇది షైతాను అలంకరణ,అతని మోసం లో నుంచిది. నిశ్చయంగా షైతాను తనను అనుసరించే వాడికి అపమార్గమునకు లోను చేసే ఒక శతృవు .అతని శతృత్వము బహిర్గతమవుతుంది. అయితే నా నుండి ఏదైతే జరిగినదో అతని శతృత్వం వలన,అతడు నన్ను అపమార్గమునకు లోను చేయదలిచే అపమార్గమునకు లోను చేసేవాడు కావటం వలన.
(16) మూసా తన ప్రభువుతో తన ద్వారా జరిగిన దాన్ని అంగీకరిస్తూ వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను ఈ ఖిబ్తీను హత్య చేసి నాపై హింసకు పాల్పడ్డాను. అయితే నీవు నా కొరకు నా పాపమును మన్నించు. అప్పుడు అల్లాహ్ మా కొరకు మూసాకి తన మన్నింపును స్పష్టపరచాడు. నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారికి మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
(17) అ తరువాత మూసా ప్రార్ధన గురించి సమాచారము కొనసాగింది అందులో ఆయన ఈ విధంగా పలికాడు : ఓ నా ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన బలము,తెలివి,జ్ఞానము వలన నేను అపరాధము చేసే వారికి వారి అపరాధము చేయటం పై సహాయకునిగా ఉండనంటే ఉండను.
(18) ఎప్పుడైతే ఆయన నుండి ఏదైతే సంభవించినదో ఖిబ్తీ హత్య నుండి సంభవించినదో ఆయన ఏమి జరుగుతుందో అని భయపడుతూ నిరీక్షిస్తూ తెల్లవారు చేశాడు. నిన్నటి రోజు తన శతృవుకి విరుద్ధంగా సహాయమును,తోడ్పాటును ఆయనతో కోరాడో అతడు వేరొక ఖిబ్తీకి వ్యతిరేకంగా సహాయమును కోరాడు. మూసా అతనితో ఇలా పలికారు : నిశ్ఛయంగా నీవు మార్గభ్రష్టకు లోను చేసేవాడివి,స్పష్టమైన అపమార్గమునకు లోను చేసేవాడివి.
(19) ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తనకు,ఇస్రాయిలీకి శతృవైన ఖిబ్తీని గట్టిగా పట్టుకో దలిచారో ఇస్రాయిలీ ఆయనతో إِنَّكَ لَغَوِيٌّ مُبِينٌ నిశ్ఛయంగా నీవు అపమార్గమునకు లోను చేసే వాడివి అన్న మాటలు విన్నాడో మూసా తనను గట్టిగా పట్టుకుంటారని భావించాడు. అప్పుడు అతడు మూసాతో ఇలా పలికాడు : నీవు నిన్న ఒక ప్రాణమును తీసినట్లే నన్ను హత్యచేయదలచావా. నీవు ప్రజలని హతమార్చి,వారిపై హింసకు పాల్పడి భూమిలో క్రూరునిగా అవ్వాలని మాత్రం అనుకుంటున్నావు. నీవు ఇద్దరు పోట్లాడుకునే వారి మధ్య సంస్కరించేవాడవదలచుకోలేదు.
(20) మరియు ఎప్పడైతే వార్త వ్యాపించినదో నగర శివారు నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ మూసాను వేటాడటం పై దయ చూపుతూ ఇలా పలికాడు : ఓ మూసా నిశ్చయంగా ఫిర్ఔన్ జాతి పెద్దలు నిన్ను హత మార్చటానికి సంప్రదింపులు చేస్తున్నారు కాబట్టి నీవు ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపో. నిశ్ఛయంగా నేను నీకు ఉపదేశము చేసేవాడిని,నిన్ను వారు పొంది హత్య చేయటం నుండి నీపై కరుణించేవాడిని.
(21) మూసా ఉపదేశము చేసిన వ్యక్తి ఆదేశించినట్లే చేశారు. అప్పుడు ఆయన ఊరి నుండి భయపడుతూ తనకు ఏమి జరుగుతుందో అని నిరీక్షిస్తూ బయలుదేరారు. తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికాడు : ఓ నా ప్రభువా దుర్మార్గ ప్రజల నుండి ,వారు నాకు చెడును కలిగించకుండా నన్ను రక్షించు.
(22) మరియు ఆయన మద్యన్ వైపునకు బయలుదేరినప్పుడు ఆయన ఈ విధంగా పలికారు : బహుశా నా ప్రభువు నన్ను మంచి మర్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాడు. అప్పుడు నేను దాని నుండి మార్గభ్రష్టుడిని కాను.
(23) మరియు ఆయన మద్యన్ వాసులు నీటిని త్రాగే నీటి వద్దకు చేరుకున్నప్పుడు ప్రజల ఒక సమూహం తమ పశువులకు నీటిని త్రాపిస్తుండగా పొందారు. మరియు వారే కాకుండా ఇద్దరు స్త్రీలను తమ గొర్రెలను ప్రజలు త్రాపించేంత వరకు ఆపి ఉండగా పొందారు. మూసా అలైహిస్సలాం వారిద్దరితో ఇలా అడిగారు : మీరిద్దరి సమస్య ఏమిటి మీరు ప్రజలతోపాటు త్రాపించటం లేదు ?. వారిద్దరు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : కాపరులు మరలిపోయేంత వరకు మేము త్రాపించకుండా ఆగి ఉండటం మా అలవాటు ; వారితో కలవకుండా జాగ్రత్తపడటానికి. మరియు మా తండ్రి అధిక వయస్సు కల వృద్ధుడు. ఆయన త్రాపించలేడు. కాబట్టి మా గొర్రెలకు మేమే నీరు త్రపించాలి.
(24) అప్పుడు ఆయన వారిద్దరిపై దయ చూపి వారిద్దరి కొరకు వారి గొర్రెలకు నీరు త్రాపించారు. ఆ తరువాత నీడ వైపునకు మరలారు అందులో సేదతీరారు. తన అవసరాన్ని తన ప్రభువు ముందట పెట్టి ఇలా ప్రార్ధించారు : ఓ నా ప్రభూ నీవు నా వైపునకు కురుపించే ఏ మేలైనా నేను అవసరం కలవాడిని.
(25) అప్పుడు వారిద్దరు వెళ్లి తమ తండ్రికి అతని గురించి తెలియపరచారు. అప్పుడు ఆయన వారి నుండి ఒకామెను అతన్ని పిలుచుకుని రమ్మని ఆయన వద్దకు పంపించారు. అప్పుడు ఆమే ఆయన వద్దకు సిగ్గు పడుతూ నడిచి వచ్చింది. ఆమె ఇలా పలికింది : నిశ్చయంగా మా తండ్రి మీరు మా కొరకు నీళ్ళు త్రాపించినందుకు మీకు మీ ప్రతిఫలమును ప్రసాదించటానికి ఆయన వద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మూసా వారి తండ్రి వద్దకు వచ్చినప్పుడు,ఆయనకు తన సమాచారములన్ని తెలియపరచారు. ఆయన అతనికి భరోసా కలిగిస్తూ ఇలా పలికారు : నీవు భయపడకు నీవు దుర్మార్గ ప్రజలైన ఫిర్ఔన్,అతని నాయకుల నుండి ముక్తిని పొందావు. వారికి మద్యన్ పై ఎటువంటి అధికారము లేదు. అలాగే వారు నీకు ఎటువంటి కీడును తీసుకుని రాలేరు.
(26) అతని ఇద్దరి కుమార్తెల్లోంచి ఒకామె ఇలా పలికింది : ఓ మా తండ్రి అతన్ని మా గొర్రెలను మేపటానికి జీతంపై పెట్టుకోండి. అతనిలో బలము,అమానత్ కలిగి ఉండటం వలన మీరు అతన్ని జీతంపై పెట్టుకోవటానికి తగిన వాడు. బలముతో అతనికి ఇవ్వబడిన బాధ్యతను నెరవేరుస్తాడు. మరియు అమానత్ తో అతనికి అప్పగించిన అమానత్ ను పరిరక్షిస్తాడు.
(27) వారి తండ్రి మూసా అలైహిస్సలాంను ఉద్దేసించి ఇలా పలికారు : నిశ్చయంగా నేను నా ఇద్దరు కుమార్తెలలో ఒకరితో మీ వివాహం చేయదలిచాను. ఆమె మహర్ గా మీరు ఎనిమిది సంవత్సరాలు మా గొర్రెలను మేపాలి. ఒక వేళ మీరు పది సంవత్సరములు కాలమును పూర్తి చేస్తే అది మీ తరపు నుండి అధికము మీపై తప్పనిసరి కాదు. ఎందుకంటే ఒప్పందం ఎనిమిది సంవత్సరములు మాత్రమే. దానిపై ఏదైతే ఉన్నదో అది స్వచ్ఛందంగా ఉంటుంది. మీకు కష్టమైన దాన్ని నేను మీపై తప్పనిసరి చేయదలచుకోలేదు. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే మీరు తొందరలోనే నన్ను ఒప్పందాలను పూర్తి చేసే వారైన పుణ్యాత్ముల్లోంచి పొందుతారు,వారు ప్రమాణాలను భంగపరచరు.
(28) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : మేము చేసుకున్న ఒప్పందము ఏదైతే ఉన్నదో అది మీకూ,మాకూ మధ్య ఉన్నది. రెండు కాలముల్లో నుంచి నేను మీ కొరకు చేసిన ఎనిమిది సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు నేను నాపై ఉన్న బాధ్యతను పూర్తి చేసిన వాడినవుతాను. మీరు నాతో అధికంగా కోరకండి. మరియు మేము చేసుకున్న ఒప్పందంపై అల్లాహ్ యే సాక్షి,దాని పరిరక్షకుడు.
(29) ఎప్పుడైతే మూసా రెండు కాలములను పది సంవత్సరములుగా పూర్తి చేసి,తన ఇంటి వారిని తీసుకుని మద్యన్ నుండి మిసర్ కు బయలు దేరారో తూర్ పర్వత దిక్కులో ఆయన ఒక మంటను చూశారు. అప్పుడు ఆయన తన ఇంటి వారితో ఇలా పలికారు : మీరు ఆగండి, నిశ్చయంగా నేను ఒక మంటను చూశాను. బహుశా నేను దాని నుండి మీ వద్దకు ఏదైన సమాచారము తీసుకుని వస్తాను. లేదా నేను మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను మీరు దానితో మంటను వెలిగిస్తారు. బహుశా మీరు చలి నుండి వెచ్చదనాన్ని గ్రహిస్తారు.
(30) ఎప్పుడైతే మూసా తాను చూసిన మంట వద్దకు వచ్చారో పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన ప్రభువు ఆయనను లోయ కుడి వైపున ఉన్న స్థలము నుండి దేనినైతే అల్లాహ్ మూసా కొరకు వృక్షము నుండి తన మాట ద్వారా శుభప్రదం చేశాడో ఇలా మాట్లాడాడు : ఓ మూసా నేనే సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ ను.
(31) మరియు నీవు నీ చేతి కర్రను పడవేయి. అప్పుడు మూసా తన ప్రభువు ఆదేశమునకు కట్టుబడి ఉండి దాన్ని పడవేశారు. ఎప్పుడైతే ఆయన దాన్ని చూశారో అది చలిస్తున్న,కదులుతున్న స్థితిలో ఉండి తన వేగములో పాము వలె ఉన్నది. అప్పుడు మూసా దాని నుండి భయపడి వెనుతిరిగి పారిపోసాగారు. తన పరగెత్తటం నుండి తిరిగి చూడ లేదు. అప్పుడు ఆయన్ని ఆయన ప్రభువు ఇలా పిలుపునిచ్చాడు : ఓ మూసా ముందుకు రా,నీవు దానితో భయపడకు. నిశ్చయంగా నీవు దాని నుండి,నీవు భయపడే ఇతర వాటి నుండి సురక్షితంగా ఉన్నావు.
(32) నీవు నీ కుడి చేతిని నీ మెడ దగ్గరలో నీ చొక్క తెరవబడిన భాగములో ప్రవేశింపజేయి అది ఎటువంటి బొల్లి రోగము లేకుండా తెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు మూసా దాన్ని ప్రవేశింపజేశారు అది మంచువలె తెల్లగా బయటకు వచ్చింది. మరియు నీ చేతిని నీ వైపునకు నీ భయం తగ్గటానికి అదుముకో. అప్పుడు మూసా దాన్ని తన వైపునకు అదుముకున్నారు అంతే ఆయన భయము ఆయన నుండి తొలగిపోయింది. ఈ ప్రస్తావించబడిన చేతి కర్ర,చేయి నీ ప్రభువు వద్ద నుండి ఫిర్ఔన్,అతని జాతి నాయకుల వైపునకు పంపించబడ్డ నిదర్శనాలు. నిశ్చయంగా వారు అవిశ్వాసము ద్వారా,పాపకార్యలకు పాల్పడటం ద్వారా అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన ప్రజలు.
(33) మూసా తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : నిశ్చయంగా నేను వారిలో నుండి ఒక ప్రాణమును చంపాను అందు వలన ఒక వేళ నేను వారి వద్దకు నీవు ఇచ్చి పంపించిన వాటిని వారికి చేర వేయటానికి వస్తే వారు నన్ను చంపి వేస్తారని నేను భయపడుతున్నాను.
(34) మరియు నాసోదరుడు హారూన్ నా కన్న ఎక్కువ స్పష్టంగా మాట్లాడుతాడు. కాబట్టి నీవు ఒక వేళ ఫిర్ఔన్,అతని జాతి వారు నన్ను తిరస్కరిస్తే అతన్ని నా మాటను సమర్ధించటానికి సహాయకునిగా నాతోపాటు పంపించు. నిశ్చయంగా వారు నన్ను తిరస్కరిస్తారని భయపడుతున్నాను. ఏ విధంగానైతే అది నాకన్న పూర్వం ప్రవక్తలు పంపించబడ్డ జాతుల అలవాటో,వారు వారిని తిరస్కరించారు.
(35) అల్లాహ్ మూసా దుఆను స్వీకరిస్తూ ఇలా పలికాడు : ఓ మూసా మేము తొందరలోనే నీతో పాటు నీ సోదరుడిని ప్రవక్తగా,సహాయకునిగా పంపింపించి నీకు బలమును చేకూరుస్తాము. మరియు మీరిద్దరి కొరకు ఆధారమును,మద్దతును కలిగిస్తాము. అయితే వారు మీరు అసహ్యించుకునే చెడుతో మీకు చేరుకోలేరు. మేము మీకు ఇచ్చి పంపంపించిన సూచనల మూలంగా మీరు, మిమ్మల్ని అనుసరించిన విశ్వాసపరులు విజయమును పొందుతారు.
(36) మూసా అలైహిస్సలాం వారి వద్దకు మా స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చినప్పుడు వారు ఇది మూసా కల్పించుకున్న అబద్దము మాత్రమే. మరియు మేము దీన్ని మా పూర్వ తాత ముత్తాతలలో వినలేదు.
(37) మరియు మూసా ఫిర్ఔన్ ను ఉద్దేశించి ఇలా పలికారు : పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి మార్గదర్శకమును తీసుకుని వచ్చిన సత్యవంతుడి గురించి నా ప్రభువుకి తెలుసు,మరియు పరలోకములో ప్రశంసనీయమైన పర్యవసానం ఎవరి కొరకు ఉన్నదో ఆయనకు తెలుసు. నిశ్చయంగా దుర్మార్గులు తాము ఆశించిన దానిలో సాఫల్యం చెందలేరు. మరియు తాము భయపడే వాటి నుండి విముక్తి చెందలేరు.
(38) మరియు ఫిర్ఔన్ తన జాతి వారిలో నుండి నాయకులను ఉద్దేశించి ఇలా పలికాడు : ఓ నాయకులారా నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం గలడని నాకు తెలియదు. ఓ హామాన్ గట్టిపడే వరకు మట్టిపై అగ్నిని రాజేసి దానితో ఎత్తైన ఒక నిర్మాణమును కట్టు నేను దానిపై నిలబడి మూసా ఆరాధ్య దైవమును చూస్తానని ఆశిస్తున్నాను. మరియు నిశ్చయంగా మూసా అల్లాహ్ వద్ద నుండి నా వైపునకు,నా జాతి వారి వైపునకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదిస్తున్న విషయంలో అబద్దము పలుకుతున్నాడని భావిస్తున్నాను.
(39) మరియు ఫిర్ఔన్,అతని సైన్యముల అహంకారం తీవ్రమైపోయినది. మరియు వారు మిసర్ ప్రాంతములో అన్యాయంగా అహంకారాన్ని ప్రదర్శించారు. మరియు మరణాంతరం లేపబడటమును నిరాకరించారు. మరియు వారు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం,పర్యవసానం కొరకు మా వైపునకు మరలించబడరని భావించారు.
(40) అప్పుడు మేము అతన్నీ పట్టుకున్నాము,అతని సైన్యములనూ పట్టుకున్నాము. వారిని సముద్రంలో ముంచుతూ విసిరివేశాము. చివరికి వారందరు నాశనమయ్యారు. ఓ ప్రవక్తా మీరు యోచన చేయండి దుర్మార్గుల స్థితి,వారి ముగింపు ఏమయిందో. వారి స్థితి,వారి ముగింపు వినాశనమయ్యింది.
(41) మరియు మేము వారిని అవిశ్వాసము, మార్గభ్రష్టతను వ్యాపింపజేసి నరకము వైపునకు పిలిచే నిరంకుశుల కొరకు,మార్గభ్రష్టుల కొరకు నమూనాగా చేశాము. మరియు ప్రళయదినాన శిక్ష నుండి వారిని రక్షించటం ద్వారా వారు సహాయపడరు. అంతే కాదు వారు చెడు సంప్రదాయాలను జారీ చేయటం,అపమార్గముతో దానివైపునకు పిలవటం వలన వారిపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. దానిపై ఆచరించిన దాని బరువు కూడా వారిపై వ్రాయబడుతుంది,మరియు దానిపై ఆచరించటంలో వారిని అనుసరించిన వారి కర్మల బరువు వ్రాయబడుతుంది.
(42) మరియు మేము వారి శిక్షను ఇహలోకములో పరాభవం,ధూత్కారము రూపములో అధికము చేసి వెంటాడేటట్లు చేశాము. మరియు ప్రళయ దినాన వారే దూషించబడినవారు,అల్లాహ్ కారుణ్యము నుండి దూరం చేయబడినవారు.
(43) మరియు నిశ్చయంగా మేము పూర్వ జాతుల వారి వద్దకు మా ప్రవక్తలను పంపించి వారు వారిని తిరస్కరిస్తే మేము వారి తిరస్కారము వలన వారిని తుది ముట్టించిన తరువాత మూసా అలైహిస్సలాంనకు తౌరాత్ ను ప్రసాదించాము. అందులో ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిని వారు చూసి వాటిని వారు ఆచరించేవి,వారికి నష్టం కలిగించేవాటిని చూసి వాటిని వదిలివేసేవి ఉన్నవి. అందులో వారికి మేలు వైపునకు,ఇహపరాల మేలు ఉన్న కారుణ్యం వైపునకు మార్గదర్శకత్వం ఉన్నది. బహుశా వారు తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని,ఆయనను విశ్వసిస్తారేమో.
(44) ఓ ప్రవక్తా మేము మూసాను ఫిర్ఔన్,అతని నాయకుల వద్దకు పంపించిన విషయమును మూసా వద్ద ముగించినప్పుడు మీరు మూసా అలైహిస్సలాం కొరకు కొండ పడమర వైపున లేరు. మరియు మీరు ప్రత్యక్షంగా ఉన్న వారిలో లేరు చివరకు మీరు ఆ సమాచారము తెలుసుకుని దాన్ని ప్రజలకు తెలియపరచారు. మీరు వారికి చెప్పినది అల్లాహ్ మీకు వహీ ద్వారా తెలియపరచాడు.
(45) కాని మేము మూసా తరువాత ఎన్నో సమాజాలను,సృష్టితాలను ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘ కాలం గడిచిపోయింది చివరకు వారు అల్లాహ్ ప్రమాణములను మరచిపోయారు. మరియు మీరు మద్యన్ వాసుల మధ్య నివాసమూ లేరు వారిపై మా ఆయతులను చదివి వినిపించటానికి. కానీ మేము మిమ్మల్ని మా వద్ద నుండి ప్రవక్తగా పంపించి,మూసా వృత్తాంతమును,మద్యన్ లో ఆయన నివాసమును మీకు వహీ ద్వారా మేము తెలియపరచాము. అప్పుడు అందులో నుండి మీకు అల్లాహ్ వహీ ద్వారా మీకు తెలియపరచిన దాన్ని మీరు ప్రజలకు తెలియపరచారు.
(46) మరియు మేము మూసాను పిలిచి ఆయనకు ఏదైతే మేము దివ్యవాణిని అవతరింపజేశామో అప్పుడు మీరు తూర్ వైపున లేరు. కాని మేము మిమ్మల్ని ప్రజల కొరకు నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యంగా పంపించాము. మేము ఆ వృత్తాంతమును మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము మీరు మీ కన్న పూర్వం ఎటువంటి హెచ్చరించే వాడు హెచ్చరించటానికి రాని జాతి వారిని హెచ్చరించటానికి బహుశా వారు హితోపదేశం గ్రహించి,మీరు వారి వద్దకు పరిశుద్ధుడైన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తారని.
(47) మరియు ఒక వేళ వారు ఉన్న అవిశ్వాసము,పాప కార్యముల వలన వారిపై దైవ శిక్ష వచ్చి చేరితే వారి వద్దకు ఒక ప్రవక్త పంపించకపోవటంపై వాదిస్తూ ఇలా పలుకుతారు : నీవు ఎందుకని మా వద్దకు ఒక ప్రవక్తను పంపించలేదు అప్పుడు మేము నీ ఆయతులను అనుసరించి,వాటిని ఆచరించి,మేము విశ్వసించి వారి ప్రభువు ఆదేశముపై ఆచరించే వారిలో నుండి అయిపోయేవారము. ఒక వేళ అలా జరిగి ఉంటే మేము వారిని శీఝ్రంగా శిక్షించేవారము. కానీ మేము దాన్ని వారి నుండి ఆలస్యం చేశాము చివరికి వారి వద్దకు ఒక ప్రవక్తను పంపించి వారిని మన్నించటానికి.
(48) ఎప్పుడైతే ఖురైష్ జాతి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం తీసుకుని వచ్చారో వారు యూదులను ఆయన గురించి అడిగారు. అప్పుడు వారు వారికి ఈ వాదనను నేర్పిస్తే వారు అన్నారు : మూసా తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే చేయి,చేతి కర్ర లాంటి మహిమలు ఇవ్వబడినట్లు ఎందుకని ముహమ్మద్ కు ఇవ్వబడలేదు. ఓ ప్రవక్తా మీరు వారిని ఖండిస్తూ ఇలా తెలియపరచండి : ఏమీ మునుపు మూసా ఇవ్వబడిన వాటిని యూదులు తిరస్కరించలేదా ?!. మరియు వారు తౌరాత్,ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు నిశ్ఛయంగా అవి రెండూ మంత్రజాలములు ఒక దానికొకటి మద్దతిస్తున్నవి. మరియు వారు నిశ్ఛయంగా మేము తౌరాత్,ఖుర్ఆన్ ను పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని అన్నారు.
(49) ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి : మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గదర్శకం కల అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును తీసుకుని రండి. ఒక వేళ మీరు తీసుకుని వస్తే నేను దాన్ని అనుసరిస్తాను,ఒక వేళ మీరు తౌరాత్,ఖుర్ఆన్ మంత్రజాలము అని వాదిస్తున్న విషయంలో మీరు సత్యవంతులే అయితే.
(50) ఒక వేళ ఖురైష్ మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గ దర్శకం గల ఏదైన పుస్తకమును తీసుకుని రమ్మని మీరు వారికి ఇచ్చిన పిలుపును స్వీకరించకపోతే ఆ రెండింటి పట్ల వారి తిరస్కారము ఎటువంటి ఆధారం కాదు అని నమ్మండి. అది కేవలం మనోవాంచలను అనుసరించటం మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క ఎటువంటి మార్గ నిర్దేశకం లేకుండా తన మనోవాంచలను అనుసరించే వాడి కన్నపెద్ద మార్గభ్రష్టుడు ఎవడూ ఉండడు. నిశ్ఛంగా అల్లాహ్ ,అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడే జనులకు సన్మార్గము,మార్గదర్శకత్వం కొరకు భాగ్యమును కలిగించడు.
(51) మరియు నిశ్ఛయంగా మేముఇస్రాయీలు సంతతి నుండి ముష్రికులకు,యూదులకు పూర్వ సమాజాల వృత్తాంతముల ద్వారా,వారు మా ప్రవక్తలను తిరస్కరించినప్పుడు వారిపై మేము దించిన శిక్ష ద్వారా మాటను దాని ద్వారా వారు హితబోధన గ్రహించి వారికి సంభవించినది వీరికి సంభవించకముందే విశ్వసిస్తారని ఆశిస్తూ మాటను చేరవేశాము.
(52) ఎవరైతే ఖుర్ఆన్ అవతరణ ముందు నుండే తౌరాత్ పట్ల విశ్వాసముపై స్థిరంగా ఉన్నారో వారే ఖుర్ఆన్ పై తమ గ్రంధముల్లో దాని సమాచారము,దాని గుణమును వారు పొందటం వలన విశ్వాసమును కనబరుస్తారు.
(53) దాన్ని వారిపై పఠించబడినప్పుడు వారు ఇలా పలికేవారు : మేము దాన్ని విశ్వసించాము నిశ్చయంగా అది ఎటువంటి సందేహము లేని,మన ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన సత్యము. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ కన్న ముందు నుండే ప్రవక్తలు దాని కన్న ముందు తీసుకుని వచ్చిన వాటిపై ఉన్న మన విశ్వాసము వలన విధేయులమై ఉండేవారము.
(54) ప్రస్తావించబడిన గుణములతో వర్ణించబడిన వీరందరికి అల్లాహ్ వారి గ్రంధము పట్ల విశ్వాసముపై వారి సహనము వలన,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడినప్పుడు ఆయనపై తమ విశ్వాసము వలన వారి ఆచరణలకు రెండు సార్లు వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు వారు తమ సత్కర్మల పుణ్యాలతో వారు చేసుకున్న పాపాలను తొలగించుకుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన వాటిని మంచి మార్గముల్లో ఖర్ఛు చేస్తారు.
(55) గ్రంధవహుల్లో నుండి విశ్వాసపరులైన వీరందరు అసత్య మాటను విన్నప్పుడు దాని వైపునకు శ్రద్ధ చూపకుండానే దాని నుండి విముఖత చూపుతారు. మరియు దాన్ని కలిగిన వారిని (అసత్యపరులని) ఉద్దేశించి ఇలా పలుకుతారు : మా కర్మలు మాకు,మీ కర్మలు మీకు. మీరు మా నుండి దూషణ,బాధల నుండి నిశ్ఛింతగా ఉన్నారు. ధర్మ విషయముల్లో,ప్రాపంచిక విషయంలో నష్టము,బాధ కలిగిన అజ్ఞాన వాసుల తోడు మాకు అవసరం లేదు.
(56) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు ఇష్టపడిన వారికి అబూతాలిబ్,ఇతరుల్లాంటి వారిని విశ్వాసము భాగ్యమును కలిగించి సన్మార్గమును కలిగించ లేరు. కాని ఒక్కడైన అల్లాహ్ అతడే తాను కోరిన వారికి సన్మార్గపు భాగ్యమును కలిగించగలడు. మరియు ఆయనే సన్మార్గము వైపునకు మార్గము పొందే వారు ఎవరో తన ముందస్తు జ్ఞానము ద్వారా బాగా తెలిసిన వాడు.
(57) మరియు మక్కా వాసుల్లోంచి ముష్రికులు ఇస్లాంను అనుసరించటం నుండి,దానిపట్ల విశ్వాసమును కనబరచటం నుండి వంకలు చూపుతూ ఇలా పలుకుతారు : ఒక వేళ మేము నీవు తీసుకుని వచ్చిన ఈ ఇస్లామును అనుసరిస్తే మా శతృవులు మా దేశము నుండి మమ్మల్ని వేగముగా గెంటివేస్తారు. ఏమీ మేము ఈ ముష్రికులందరిని హరమ్ ప్రాంతములో నివాసమును కలిగించలేదా ?. అక్కడ రక్తపాతము,హింస నిషిద్ధము. వారిపై ఇతరుల దాడి నుండి అక్కడ వారు నిశ్చింతగా ఉన్నారు. అక్కడ అన్ని రకాల ఫలములు మా వద్ద నుండి ఆహారముగా చేరుతున్నాయి. దాన్ని మేము వారి వద్దకు తీసుకుని వచ్చాము. కాని వారిలో నుండి చాలా మందికి అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలపటం తెలియదు.
(58) మరియు చాలా బస్తీలు తమపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహములను తిరస్కరించి పాప కార్యముల్లో,అవిధేయకార్యముల్లో వృధా అయిపోయినవి. అప్పుడు మేము వారిపై ఒక శిక్షను పంపించి దాని ద్వారా వారిని తుదిముట్టించాము. ఇవి నాశనమైన వారి నివాసములు వాటిపై నుండి ప్రజలు పోతుంటారు. అక్కడ నివాసమున్న వారి తరువాత పయనమయ్యే వారిలో నుండి కొద్దిమంది తప్ప నివాసముండలేదు. మరియు ఆకాశముల్లో,భూమిలో మరియు వాటిలో ఉన్న వారికి మేము వారసులమయ్యాము.
(59) ఓ ప్రవక్తా మీ ప్రభువు నగరములను ముఖ్య నగరమైన మక్కాలో మిమ్మల్ని ప్రవక్తగా పంపించినట్లు వాటిలో పెద్ద నగరములో ఒక ప్రవక్తను పంపించి అక్కడి వాసులను మన్నించినంత వరకు వినాశనం చేయడు. మరియు మేమూ నగరవాసులు సత్యంపై స్థిరంగా ఉన్న స్థితిలో ఉంటే నాశనం చేయము. మేము మాత్రం ఒక వేళ వారు అవిశ్వాసం, పాప కార్యములకు పాల్పడటం వలన దుర్మార్గులైతే వారిని నాశనం చేస్తాము.
(60) మరియు మీకు మీ ప్రభువు ప్రసాదించినది ఏదైన దాని ద్వారా మీరు ఇహలోక జీవితంలో ప్రయోజనం చెందుతారు,అలంకరించుకుంటారు. ఆ పిదప అది అంతమైపోతుంది. మరియు పరలోకంలో అల్లాహ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం ఇహలోకంలో ఉన్న సామగ్రి,అలంకరణ కన్న మేలైనది,శాస్వతంగా ఉండేది. ఏమీ మీరు దాన్ని అర్ధం చేసుకొని అంతమైపోయే దానిపై శాస్వతంగా ఉండే దాన్ని ప్రాధాన్యతనివ్వరా ?!.
(61) ఏమీ పరలోకము,అందులో ఉన్న శాస్వత అనుగ్రహాల గురించి మేము వాగ్దానం చేసిన వాడు అతనితో సమానుడు కాగలడా ఎవడికైతే మేము ఇహలోకంలో అతను ప్రయోజనం చెందే సంపద,అలంకరణను ప్రసాదించామొ. ఆ తరువాత అతడు ప్రళయదినాన నరకాగ్ని వైపునకు హాజరు చేయబడే వారిలో నుండి అయిపోతాడు ?!.
(62) మరియు ఆరోజు వారిని పరిశుద్ధుడైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?.
(63) అవిశ్వాసం వైపున పిలిచే వారిలో నుండి ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వారు ఇలా అంటారు : ఓ మా ప్రభువా వీరందరు మేము అపమార్గమును పొందిన విధంగా మేము అపమార్గమునకు లోను చేసిన వారు. మేము వారి నుండి నీ వద్ద నిర్దోషత్వమును కోరుతున్నాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. వారు కేవలం షైతానులను ఆరాధించేవారు.
(64) మరియు వారితో ఇలా అనబడుతుంది : మీరు ఉన్న అవమానము నుండి మిమ్మల్ని రక్షించటానికి మీరు మీ భాగస్వాములను పిలవండి. అప్పుడు వారు తమ భాగస్వాములను పిలుస్తారు. కాని వారు వారి పిలుపునకు సమాధానమివ్వరు. మరియు వారు తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శిక్షను చూసి తాము ఇహలోకంలో సత్యమునకు దారి పొంది ఉండాల్సిందని కోరుకుంటారు.
(65) మరియు ఆరోజు వారిని వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నేను మీ వద్దకు పంపించిన నా ప్రవక్తలకు మీరు ఏమి సమాధానమిచ్చారు ?.
(66) అప్పుడు వారు వాదించినవి వారిపై గోప్యమైపోయాయి,వారు ఏమీ ప్రస్తావించలేదు. వారు శిక్షించబడుతారని వారు పూర్తి నమ్మకముతో ఉండటం వలన వారికి కలిగిన ఆపద భయానక పరిస్థితి వలన వారు ఒకరినొకరు ప్రశ్నించుకోరు.
(67) కాని ఈ ముష్రికులందరిలో నుండి ఎవడైతే తన అవిశ్వాసము నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,ఏదైన సత్కార్యమును చేస్తే బహుశా అతడు తాము ఆశించిన దాన్ని పొంది సాఫల్యము చెందే వారిలోంచి,తాము భయపడే వాటి నుండి ముక్తి పొందే వారిలో నుంచి అయిపోతాడు.
(68) మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు తాను సృష్టించదలచిన దాన్ని సృష్టిస్తాడు. మరియు తన విధేయత కొరకు,తన దౌత్యము కొరకు తాను కోరుకున్న వారిని ఎన్నుకుంటాడు. ముష్రికులకు అల్లాహ్ పై అభ్యంతరం తెలిపే అనుమతి ఉండదు. పరిశుద్ధుడైన ఆయన అతీతుడు మరియు ఆయన వారు ఆయనతో పాటు సాటి కల్పించేవారి నుండి పరిశుద్ధుడు.
(69) మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తున్నాయో,ఏమి బహిర్గతం చేస్తున్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(70) మరియు ఆయనే అల్లాహ్ పరిశుద్ధుడు ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవం లేడు. ఇహలోకములో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి మరియు పరలోకంలో స్థుతులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి. మరియు ఆయనకు తిరుగులేని జారి అయ్యే న్యాయ వ్యవస్థ కలదు. ప్రళయదినాన మీరు లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలింపబడుతారు.
(71) ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా అడగండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ మీపై శాశ్వతంగా ఎడతెగకుండా,అంతం లేకుండా ప్రళయం వరకు రాత్రిని ఉండేటట్లు చేస్తే అల్లాహ్ కాకుండా మీ వద్దకు పగటి వెలుగులాంటి వెలుగును తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?. ఏమీ మీరు ఈ వాదనలను వినరా,దానిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం కాడని మీరు తెలుసుకోరా ?.
(72) ఓ ప్రవక్తా వారితో ఇలా అడగండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ ప్రళయం వరకు పగలును శాశ్వతంగా,ఎడతెగకుండా మీపై చేస్తే అల్లాహ్ కాకుండా మీ వద్దకు పగలు చేసిన కార్యల వలన కలిగిన అలసట నుండి మీరు విశ్రాంతి తాసుకోవటానికి మీరు ఉండే రాత్రిని తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?!. ఏమీ మీరు ఈ సూచనలను చూడటం లేదా,వీటన్నింటిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని మీరు తెలుసుకోరా ?!.
(73) ఓ ప్రజలారా మీరు పగలు పని చేయటం వలన అలసిపోయిన తరువాత విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మీ కొరకు చీకటిగా చేయటం మరియు మీరు ఆహారోపాధి అన్వేషణలో శ్రమించటానికి పగలును మీ కొరకు కాంతివంతంగా చేయటం పరిశుద్ధుడైన ఆయన కారుణ్యము. బహుశా మీరు మీపై ఉన్నఅల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని,వాటి పట్ల కృతఘ్నులు కారని.
(74) మరియు ఆరోజు వారిని పరిశుద్ధుడైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తాడు : నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?.
(75) మరియు మేము ప్రతీ జాతి నుండి దాని ప్రవక్తను తీసుకుని వస్తాము,అతడు వారికి వ్యతిరేకంగా వారు ఉన్న అవిశ్వాసం,తిరస్కారం గురించి సాక్ష్యం పలుకుతాడు. ఆ జాతుల్లోంచి తిరస్కరించిన వారితో మేము ఇలా పలుకుతాము : మీరు ఉన్న అవిశ్వాసము,తిరస్కారముపై మీ వాదనలను, ఆధారాలను ఇవ్వండి. అప్పుడు వారి వాదనలు అంతమైపోతాయి. మరియు ఎటువంటి సందేహం లేని సత్యము అల్లాహ్ కొరకే అని వారికి నమ్మకం కలుగుతుంది. పరిశుద్ధుడైన ఆయన కొరకు వారు కల్పించుకుని సాటికల్పించిన వారు వారి నుండి అదృశ్యమైపోతారు.
(76) నిశ్ఛయంగా ఖారూను మూసా అలైహిస్సలాం జాతి వారిలో నుండి వాడు. అతడు వారిపై అహంకారమును చూపాడు. మరియు మేము అతనికి ఎన్నో సంపదల యొక్క నిధులను ప్రసాదించాము అంటే దాని నిధుల తాళములను మోయటం బలవంతులైన సమూహమునకు భారంగా ఉండేది. అతడి జాతివారు అతడితో ఇలా పలికారు : నీవు అహంకార సంతోషమును కలిగి ఉండకు. నిశ్చయంగా అల్లాహ్ అహంకార సంతోషమును చూపేవారిని ఇష్టపడడు. అంతేకాక వారిని ద్వేషిస్తాడు మరియు దానిపై వారిని శిక్షిస్తాడు.
(77) మరియు నీవు అల్లాహ్ నీకు ప్రసాదించిన సంపదల్లో వాటిని మంచి మార్గముల్లో ఖర్చు చేసి పరలోక నివాసములో ప్రతిఫలాన్ని ఆశించు. మరియు నీవు తినటం,త్రాగటం,వస్త్రములు ధరించటం మొదలగు అనుగ్రహాల నీ భాగమును మరువకు. ఎటువంటి దుబారా లేకుండా,సందేహం లేకుండా (ఖర్చు చేయి). పరిశుద్ధుడైన ఆయన నీతో మంచిగా వ్యవహరించినట్లే నీ ప్రభువుతో,ఆయన దాసులతో మంచిగా వ్యవహరించు. మరియు నీవు పాపకార్యములకు పాల్పడి,విధేయ కార్యాలను విడనాడి భూమిలో అల్లకల్లోలాను కోరుకోకు. నిశ్చయంగా అల్లాహ్ వాటి ద్వారా భూమిలో అల్లకల్లోలాలను రేకెత్తించే వారిని ఇష్టపడడు. అంతే కాదు వారిని ద్వేషిస్తాడు.
(78) ఖారూన్ ఇలా పలికాడు : ఈ సంపదలన్నీ నాకు మాత్రం నా జ్ఞానం వలన,సామర్ధ్యం వలన ఇవ్వబడినవి. నేను వాటి హక్కుదారుడను. ఏమీ అతని కన్నా ముందు తమ శక్తి అధికంగా కల,తమ అధిక సంపదలు కల జాతుల వారిని అల్లాహ్ అంతమొందించాడన్న విషయం ఖారూనుకు తెలియదా ?. అప్పుడు వారి బలము,వారి సంపదలు వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు ప్రళయదినాన పాపత్ములు తమ పాపముల గురించి వాటి గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉండటం వలన ప్రశ్నించబడరు. అప్పుడు వారిని ప్రశ్నించటం గద్దింపు ప్రశ్న,మందలింపు ప్రశ్న.
(79) అప్పుడు ఖారూను తన అహంకారమును ప్రదర్శిస్తూ తన వైభవంలో బయలుదేరాడు. ఖారూను సహచరుల్లోంచి ఇహలోక జీవిత వైభవములో అత్యాశను కలిగిన వారు ఇలా పలికారు : అయ్యో మా దౌర్భాగ్యం మేము కూడా ఖారూన్ కు ఇవ్వబడినట్లు ఇహలోక వైభవమును ఇవ్వబడి ఉంటే ఎంత బాగుండేది. నిశ్చయంగా ఖారూను పరిపూర్ణమైన పెద్ద వాటా కలిగిన వాడు.
(80) మరియు జ్ఞాన సంపన్నులు ఖారూనును అతని వైభవంలో చూసినప్పుడు,అతని సహచరులు ఆశపడుతున్న దానిని విన్నప్పుడు ఇలా పలికారు : మీ పాడు గాను! అల్లాహ్ ప్రసాదించే ప్రతిఫలం పరలోకంలో ఉన్నది. మరియు ఏవైతే ఆయన తయారు చేసి ఉంచాడో అనుగ్రహాలు అతన్ని విశ్వసించి,సత్కార్యములు చేసిన వారి కొరకు ఉన్నయో అవి ఖారూనుకు ఇవ్వబడిన ప్రాపంచిక వైభవము కన్న గొప్పవి. ఈ మాటను పలకటానికి,దానికి తగ్గట్టుగా ఆచరించటానికి ఇహలోకంలో ఉన్న అంతమైపోయే ప్రాపంచిక సామగ్రిపై అల్లాహ్ వద్ద ఉన్న పుణ్యముపై ప్రాధాన్యత ఇవ్వటంపై సహనం చూపే ఓర్పుగలవారికే ఈ భాగ్యం కలిగించబడుతుంది.
(81) అప్పుడు మేము అతని ద్రోహానికి ప్రతీకారంగా అతనిని,అతని ఇంటిని,అందులో ఉన్న వారందరిని భూమిలోకి కూర్చివేశాము. అల్లాహ్ తప్ప అతనికి సహాయం చేయటానికి ఎటువంటి వర్గము వారు అతని కొరకు లేకుండాపోయారు. మరియు అతను స్వయంగా తనను కాపాడుకోలేకపోయాడు.
(82) అతన్ని కూర్చక ముందు అతని సంపదలో,అతని వైభవంలో ఆశను కలిగిన వారు ఇలా పలకసాగారు : అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తాడని,వారిలో నుండి తాను కోరిన వారిపై కుంచింపజేస్తాడని మాకు తెలియదా ఏమిటీ ?!. ఒక వేళ మేము పలికిన దానికి ఆయన శిక్షించకుండా అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఖారూన్ ను కూర్చినట్లు మమ్మల్ని ఆయన కూర్చేవాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు ఇహలోకంలో గాని,పరలోకంలో గాని సాఫల్యం చెందరు. అంతే కాదు వారి పరిణామం,వారి స్థితి ఆ రెండింటిలో నష్టమే.
(83) ఈ పరలోక గృహమును మేము సత్యముపై విశ్వాసమును కనబరచి,దాన్ని అనుసరించటం నుండి భూమిలో అహంకారమును కోరని వారి కొరకు,అందులో చెడును ఆశించని వారి కొరకు అనుగ్రహాల,మర్యాదల గృహముగా చేస్తాము. స్థుతింపబడిన పరిణామమైన అనుగ్రహాలు కల స్వర్గము,అందులో ఉండే అల్లాహ్ ప్రసన్నత తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఉంటుంది.
(84) ప్రళయదినాన ఎవరైన నమాజు,జకాతు,ఉపవాసము మొదలగు వాటి లోంచి ఏ సత్కార్యమును తీసుకుని వచ్చినా అతని ఆ సత్కార్యము కన్నా మంచిగా ప్రతిఫలముంటుంది. ఏ విధంగా నంటే అతని కొరకు పుణ్యము పది రెట్లు అధికం చేయబడుతుంది. మరియు ఎవరైన అవిశ్వాసము, వడ్డీ సొమ్ము తినటం, వ్యభిచారము మొదలగు వాటిలో నుంచి ఏ దుష్కార్యమును తీసుకుని వచ్చినా దుష్కార్యములకు పాల్పడిన వారికి మాత్రం అధికం చేయకుండా వారు చేసిన దుష్కార్యమునకు సమాన ప్రతిఫలమే ప్రసాదించటం జరుగుతుంది.
(85) నిశ్ఛయంగా మీపై ఎవరైతే ఖుర్ఆన్ ను అవతరింపజేసి దాని ప్రచారమును,అందులో ఉన్న వాటిపై ఆచరణను మీపై విధిగావించాడో అతడు మిమ్మల్ని మక్కాకు విజయంతో మరలింపజేస్తాడు. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఎవరు సన్మార్గమును తీసుకొని వచ్చాడో,ఎవరు సన్మార్గము నుండి,సత్యము నుండి తప్పి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నాడో నా ప్రభువుకు బాగా తెలుసు.
(86) ఓ ప్రవక్తా ఖుర్ఆన్ దైవ వాణి రూపంలో అల్లాహ్ వద్ద నుండి నీ వైపునకు అవతరిస్తుందని ప్రవక్తగా పంపించక మునుపు నీవు ఆశించ లేదు. కాని పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కారుణ్యము నీపై దాని అవతరణను నిర్ణయించినది. కావున నీవు అవిశ్వాసపరులకు వారు ఉన్న అపమార్గములో సహాయకునిగా ఉండకు.
(87) ఈ ముష్రికులందరు అల్లాహ్ ఆయతుల నుండి అవి మీపై అవతరించిన తరువాత వాటిని మీరు పఠించటమును,వాటి ప్రచారమును వదిలివేయటానికి మరలించకూడదు. మరియు మీరు ప్రజలను అల్లాహ్ పై విశ్వాసము వైపునకు,ఆయన ఏకత్వం వైపునకు,ఆయన ధర్మంపై ఆచరణ వైపునకు పిలవండి. మరియు మీరు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించే ముష్రికుల్లోంచి కాకండి. కాని మీరు ఒక్కడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి ఏకేశ్వరోపాసన చేసే వారిలో నుంచి అయిపోండి.
(88) మరియు మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధించకండి. ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. పరిశుద్ధుడైన ఆయన ముఖము తప్ప ప్రతీది నశిస్తుంది. న్యాయ నిర్ణయం ఆయన ఒక్కడి కొరకే,తాను కోరినది నిర్ణయిస్తాడు. ఆయన ఒక్కడి వైపునకే ప్రళయదినాన మీరు లెక్క తీసుకనబడటానికి,ప్రతిఫలం ప్రసాదించబడటానికి మరలింపబడుతారు.