(1) ఓ ప్రజలారా సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.
(2) చివరికి మీరు మరణించి మీ సమాదులలో ప్రవేశించారు.
(3) వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.
(4) ఆ పిదప మీరు తొందరలోనే దాని పర్యవసానమును తెలుసుకుంటారు.
(5) వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.
(6) అల్లాహ్ సాక్షిగా ప్రళయదినమున మీరు నరకాగ్నిని తప్పకుండా చూస్తారు.
(7) ఆ తరువాత మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
(8) ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.