(1) అల్లాహ్ దుమ్మును రేపే గాలుల పై ప్రమాణం చేస్తున్నాడు.
(2) మరియు సమృద్దిగా ఉన్న నీటిని మోసుకొచ్చే మేఘాలపై (ప్రమాణం చేస్తున్నాడు).
(3) మరియు సముద్రంలో తేలికగా మరియు సులభంగా పయనించే ఓడలపై (ప్రమాణం చేస్తున్నాడు).
(4) మరియు అల్లాహ్ దాసుల వ్యవహారములను పంచిపెట్టమని ఆదేశించిన వాటిని పంచిపెట్టే దైవదూతలపై (ప్రమాణం చేస్తున్నాడు).
(5) నిశ్చయంగా మీ ప్రభువు మీకు వాగ్దానం చేసిన లెక్కతీసుకోబడటం మరియు ప్రతిఫలం ప్రసాధించబడటం నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.
(6) మరియు నిశ్చయంగా దాసుల లెక్కతీసుకోబడటం ప్రళయదినమున ఖచ్చితంగా వాటిల్లుతుంది.
(7) మరియు అల్లాహ్ మార్గాలు కల మంచి సృష్టి అయిన ఆకాశముపై ప్రమాణం చేస్తున్నాడు.
(8) ఓ మక్కా వాసులారా నిశ్చయంగా మీరు ఒక పరస్పర వైరుధ్యమైన,విరుద్దమైన మాటలో ఉన్నారు. ఒక సారి మీరు ఖుర్ఆన్ ను మంత్రజాలము అంటే ఒక సారి కవిత్వం అంటున్నారు. మరియు మీరు ముహమ్మద్ ను ఒక సారి మంత్రజాలకుడు అంటే ఒక సారి కవి అంటున్నారు.
(9) ఖుర్ఆన్ పై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసము నుండి అతడే మరలింపబడుతాడు ఎవడైతే అల్లాహ్ జ్ఞానములో అతడు విశ్వసించడని మరియు సన్మార్గము పొందే భాగ్యమును కలగడని ఉన్నదో.
(10) ఖుర్ఆన్ విషయంలో మరియు తమ ప్రవక్త విషయంలో ఇలా పలికిన తిరస్కారులే శపించబడ్డారు.
(11) వారే అజ్ఞానంలో పడి ఉండి పరలోక నివాసము నుండి పరధ్యానంలో ఉన్నారు. వారు దాని గురించి పట్టించుకోరు.
(12) వారు ప్రతిఫల దినము ఎప్పుడూ ? అని అడుగుతున్నారు. వాస్తవానికి వారు దాని కొరకు ఆచరించటంలేదు.
(13) అల్లాహ్ వారి ప్రశ్న గురుంచి వారికి ఇలా సమాధానమిస్తున్నాడు : ఆ రోజు వారు నరకాగ్నిపై శిక్షింపబడుతారు.
(14) వారితో ఇలా పలకబడుతుంది : మీరు మీ శిక్ష రుచి చూడండి. మీరు హెచ్చరించబడినప్పుడు హేళనగా దేని గురించైతే తొందరపెట్టే వారో అదే ఇది.
(15) నిశ్ఛయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడేవారు ప్రళయదినమున స్వర్గవనాల,ప్రవహించే సెలయేరుల మధ్య ఉంటారు.
(16) వారికి వారి ప్రభువు ఇచ్చే మర్యాదపూర్వక ప్రతిఫలమును పుచ్చుకుంటూ ఉంటారు. నిశ్ఛయంగా వారు ఈ మర్యాదపూర్వక ప్రతిఫలము కన్న ముందు ఇహలోకంలో సదాచర సంపన్నులుగా ఉండేవారు.
(17) వారు రాత్రి పూట నమాజు చదివే వారు. తక్కువ సమయం నిదురపోయేవారు.
(18) రాత్రి చివరి ఘడియల్లో తమ పాపముల నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకునేవారు.
(19) మరియు వారి సంపదల్లోంచి వారు స్వచ్చందంగా ఇచ్చే దానిలో ప్రజల్లోంచి యాచించేవారి కొరకు మరియు ఏదో ఒక కారణం చేత ఆహారోపాధి ఆగిపోయన వారిలో నుండి వారితో యాచించని వారి కొరకు హక్కు ఉన్నది.
(20) మరియు భూమిలో మరియు అల్లాహ్ అందులో ఉంచిన పర్వతాల్లో,సముద్రముల్లో,చెలమల్లో,వృక్షముల్లో,మొక్కల్లో మరియు జంతువుల్లో అల్లాహ్ యే సృష్టికర్త,రూపకల్పన చేసేవాడు అని నమ్మేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై సూచనలు కలవు.
(21) మరియు మీ స్వయంలో ఓ ప్రజలారా అల్లాహ్ సామర్ధ్యంపై సూచనలు కలవు. ఏమీ మీరు గుణపాఠం నేర్చుకోవటం కొరకు చూడరా ?!
(22) మరియు ఆకాశములో మీ ప్రాపంచిక మరియు ధార్మిక ఆహారోపాధి కలదు. మరియు అందులో మీతో వాగ్దానం చేయబడిన మంచి లేదా చెడులు కలవు.
(23) భూమ్యాకాశముల ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మరణాంతరం లేపబడటం వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానంటే మీరు మాట్లాడుకునేటప్పుడు మీ మాట్లాడటంలో సందేహం లేదో ఆ విధంగా.
(24) ఓ ప్రవక్తా మీకు ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దైవదూతల్లోంచి ఆయన మర్యాదలు చేసిన అతిధుల గురించి మీకు (సమాచారం) చేరినదా ?.
(25) వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో సలాం (నీపై శాంతి కురియుగాక) అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రతిసలాంచేస్తూ సలాం (మీపై శాంతి కురియుగాక) అన్నారు. మరియు ఆయన (ఇబ్రాహీం అలైహిస్సలాం) తన మనసులో వీరందరు మాకు పరిచయం లేని జనులు అనుకున్నారు.
(26) అప్పుడు ఆయన చాటుగా తన ఇంటివారి వైపునకు మరలి వారి వద్ద నుండి ఒక సంపూర్ణ బలిసిన ఒక ఆవు దూడను వారు మనుషులని భావించి తీసుకుని వచ్చారు.
(27) అప్పుడు ఆయన ఆవు దూడను వారికి దగ్గరగా చేశారు. మరియు వారితో మృదువుగా పలుకుతూ మీ ముందు ఉంచిన ఆహారమును మీరు తినరా ? అని అన్నారు.
(28) వారు తినకపోవటం చూసినప్పుడు ఆయన తన మనసులో వారి నుండి భయపడసాగారు అప్పుడు వారు ఆయన నుండి గుర్తించారు. అప్పుడు వారు ఆయనను సంత్రుప్తిపరుస్తూ ఇలా పలికారు : మీరు భయపడకండి. మేము అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ దూతలము. మరియు వారు ఆయనకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు చాలా జ్ఞానం కల ఒక మగ సంతానము కలుగుతుందని తెలిపారు. మరియు శుభవార్త ఇవ్వబడినది ఇస్హాఖ్ అలైహిస్సలాం గురించే.
(29) ఎప్పుడైతే ఆయన భార్య శుభవార్తను విన్నదో సంతోషముతో అరుస్తూ ముందుకు వచ్చినది. మరియు తన నుదిటిపై కొడుతూ ఆశ్ఛర్యముతో ఇలా పలికింది : ఏమీ ఒక వృద్ధురాలు జన్మనిస్తుందా. మరియు ఆమె వాస్తవానికి గొడ్రాలు.
(30) ఆమెతో దూతలు ఇలా పలికారు : నీ ప్రభువు చెప్పినదే నీకు మేము తెలిపాము. ఆయన చెప్పిన దాన్ని మార్చే వాడు ఎవడూ లేడు. నిశ్ఛయంగా ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రాతలో విజ్ఞత కలవాడు. తన సృష్టి రాసుల గురించి మరియు వారికి ప్రయోజనకరమైన వాటి గురించి తెలిసినవాడు.
(31) ఇబ్రాహీం అలైహిస్సలాం దైవదూతలతో ఇలా పలికారు : మీ విషయమేమిటి ? మీరు ఏమి నిర్ణయించుకున్నారు ?.
(32) దైవదూతలు ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ మమ్మల్ని అతి చెడ్డ పాపములకు పాల్పడే అపరాధ జనుల వైపునకు పంపించాడు.
(33) మేము వారిపై గట్టి మట్టితో చేయబడిన రాళ్ళను కురిపిస్తాము.
(34) ఓ ఇబ్రాహీం నీ ప్రభువు వద్ద నుండి గుర్తు వేయబడినవి అవి అల్లాహ్ హద్దులను అతిక్రమించి,అవిశ్వాసములో మరియు పాప కార్యముల్లో హద్దు మీరే వారిపై కురిపించబడుతాయి.
(35) అప్పుడు మేము లూత్ జాతి వారి ఊరిలో ఉన్న విశ్వాసపరులను వారికి అపరాధులకు సంభవించే శిక్ష సంభవించకుండా ఉండటానికి బయటకు తీసాము.
(36) వారి ఆ ఊరిలో ముస్లిముల ఒక ఇల్లును మాత్రమే మేము పొందాము. వారే లూత్ అలైహిస్సలాం ఇంటివారు.
(37) మరియు మేము లూత్ జాతి వారి ఊరిలో వారిపై కురిసిన శిక్షను సూచించే శిక్ష ఆనుమాళ్ళను వారికి కలిగిన బాధాకరమైన శిక్ష నుండి భయపడి గుణపాఠం నేర్చుకోవటానికి వదిలాము. దాని నుండి ముక్తి పొందటానికి వారి కర్మలకు పాల్పడరు వారు.
(38) మరియు మూసా అలైహిస్సలాంలో ఆయనను మేము ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన వాదనలను ఇచ్చిపంపినప్పుడు బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు ఒక సూచన కలదు.
(39) అప్పుడు ఫిర్ఔన్ తన బలమును మరియు తన సైన్యమును సిద్ధం చేసుకుంటూ సత్యము నుండి విముఖత చూపాడు. మరియు మూసా అలైహిస్సలాం గురించి ఇలా పలికాడు : అతడు ప్రజలను మంత్రజాలమునకు గురి చేసే మంత్రజాలకుడు లేదా తనకు అర్ధం కాని మాటలను పలికే పిచ్చివాడు.
(40) అప్పుడు మేము అతన్ని మరియు అతని పూర్తి సైన్యములను పట్టుకుని వారిని మేము సముద్రంలో విసిరివేశాము. అప్పుడు వారు మునిగి నాశనమైపోయారు. మరియు ఫిర్ఔన్ తిరస్కారము మరియు తాను దైవమని వాదించటం వలన నిందను తీసుకుని వచ్చాడు.
(41) మరియు హూద్ జాతి అయిన ఆద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు మేము వారిపై వర్షమును మోయని మరియు చెట్లను పరాగసంపర్కము చేయని గాలిని పంపినప్పుడు ఒక సూచన కలదు. మరియు అందులో ఎటువంటి చెరువు లేదు.
(42) అది దేనిపైనైతే వచ్చినదో ఏ ప్రాణమును గాని ఏ సంపదన గాని ఇతరవాటిని గాని నాశనం చేయకుండా వదలలేదు. మరియు దాన్ని అది క్రుసించిపోయిన,నలిగిపోయిన దాని వలె చేసినది.
(43) మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి అయిన సమూద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు వారితో మీరు మీ ఆయుషు పూర్తి కాక ముందే మీ జీవితంతో ప్రయోజనం చెందండి అని అన్నప్పుడు ఒక సూచన కలదు.
(44) అప్పుడు వారు తమ ప్రభువు ఆదేశము నుండి గర్వమును చూపి,విశ్వసించటం మరియు విధేయత చూపటం పై అహంకారమును చూపారు. అప్పుడు శిక్ష పిడుగు దాని గురించి వారు నిరీక్షిస్తుండగానే వారిని పట్టుకుంది. అప్పటికే వారు శిక్ష గురించి దాని అవతరణ కన్న మూడు దినముల ముందే హెచ్చరింపబడ్డారు.
(45) అయితే వారు తమపై కురిసిన శిక్షను తమ నుండి తొలగించుకోలేకపోయారు. మరియు వారికి దాన్ని ఎదుర్కునే శక్తి కూడా లేదు.
(46) మరియు ఈ ప్రస్తావించబడిన వారి కన్నా ముందు మేము నూహ్ జాతిని ముంచి నాశనం చేశాము. నిశ్చయంగా వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జనులు. కావున వారు ఆయన శిక్షకు యోగ్యులయ్యారు.
(47) మరియు మేము ఆకాశమును నిర్మించాము. మరియు మేము దాన్ని శక్తితో నిర్మించటంలో ప్రావీణ్యము కలవారము. మరియు నిశ్చయంగా మేము దాని అంచులను విస్తరింపజేసేవారము.
(48) మరియు భూమి దాన్ని మేము దానిపై నివసించేవారి కొరకు పరపులా పరచివేశాము. అయితే మేము దాన్ని వారి కొరకు పరచినప్పుడు మేము ఎంతో చక్కగా పరిచేవారము.
(49) మరియు మేము ప్రతీ వస్తువు నుండి మగ,ఆడ మరియు ఆకాశము,భూమి మరియు నేల,సముద్రం లా రెండు జతలను సృష్టించాము. బహుశా మీరు ప్రతి వస్తువు నుండి రెండు జతలను సృష్టించిన అల్లాహ్ ఏకత్వమును గుర్తు చేసుకుంటారని మరియు మీరు ఆయన సామర్ధ్యమును గుర్తు చేసుకుంటారని.
(50) కావున మీరు అల్లాహ్ శిక్ష నుండి ఆయన ప్రతిఫలం వైపునకు ఆయనపై విధేయత ద్వారా మరియు ఆయన పట్ల అవిధేయతను విడనాడటం ద్వారా పరుగెత్తండి. నిశ్చయంగా నేను మీకు ఓ ప్రజలారా ఆయన శిక్ష నుండి స్పష్టంగా హెచ్చరించే వాడిని.
(51) మరియు మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్యదైవమును ఆయనను వదిలి అతన్ని ఆరాధించటానికి చేయకండి. నిశ్చయంగా నేను మీకు ఆయన వద్ద నుండి స్పష్టంగా హెచ్చరించే వాడిని.
(52) మక్కా వాసులు తిరస్కరించిన ఈ తిరస్కారము వలె పూర్వ సమాజములూ తిరస్కరించారు. అయితే అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా అతని గురించి వారు ఇతడు మంత్రజాలకుడు లేదా పిచ్చివాడు అని అనకుండా ఉండలేదు.
(53) ఏమీ అవిశ్వాసపరుల్లోంచి ముందు గతించిన వారు మరియు వారిలో నుండి తరువాత వచ్చేవారు ఒకరినొకరు ప్రవక్తలను తిరస్కరించటంపై తాకీదు చేసుకున్నారా ?!. లేదు కాని వారి ఈ తలబిరుసుతనంపై వారి సమీకరణము అయినది.
(54) ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరి నుండి విముఖత చూపండి. మీరు నిందించబడేవారు కాదు. వాస్తవానికి మీరు వారి వద్దకు ఇచ్చి పంపించబడ్డ సందేశములన్నింటిని వారికి చేరవేశారు.
(55) వారి నుండి మీ విముఖత చూపటం వారిని హితోపదేశం చేయటం నుండి మిమ్మల్ని ఆపకూడదు. కావున మీరు వారిని ఉపదేశము మరియు హితోపదేశం చేయండి. ఎందుకంటే హితోపదేశం చేయటం అల్లాహ్ పై విశ్వాసము కలవారికి ప్రయోజనం కలిగిస్తుంది.
(56) నేను జిన్నులను మరియు మానవులను నా ఒక్కడి ఆరాధన కొరకు మాత్రమే సృష్టించుకున్నాను. మరియు నేను వారిని వారు నాకు సాటి కల్పించటానికి సృష్టించలేదు.
(57) మరియు నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు. మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా నేను వారి నుండి కోరటం లేదు.
(58) నిశ్చయంగా అల్లాహ్ యే తన దాసులకు ఆహార ప్రధాత. కావున అందరు ఆయన ఆహారము అవసరము కలవారు. ఆయన తనను ఎవరు ఓడించని మహా శక్తిశాలి,మహాబలుడు. జిన్నులు మరియు మానవులందరు పరిశుద్ధుడైన ఆయన శక్తి ముందట తలఒగ్గుతారు.
(59) ఓ ప్రవక్తా నిశ్చయంగా మిమ్మల్ని తిరస్కరించి తమపై అన్యాయం చేసుకున్న వారికి పూర్వం గతించిన తమ సహచరులకు భాగం కలిగినట్లే శిక్ష నుండి భాగము కలదు. దానికి ఒక నిర్ణీత సమయం కలదు. దాని సమయం కన్నా ముందు వారు నన్ను దాన్ని తొందరగా కోరనవసరంలేదు.
(60) అల్లాహ్ ను తిరస్కరించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారి కొరకు తమపై శిక్ష అవతరణ గురించి వాగ్దానం చేయబడిన ప్రళయదినమున వినాశనము మరియు నష్టము కలదు.