(1) ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేరవేసిన దాన్ని సృష్టితాలన్నింటిని సృష్టించిన మీ ప్రభువు నామముతో ఆరంభిస్తూ చదవండి.
(2) ఆయన మానవుడిని వీర్యబిందువుగా ఉన్న తరువాత గడ్డ కట్టిన రక్తపు ముద్దతో సృష్టించాడు.
(3) ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేర వేసిన దాన్ని చదవండి. మీ ప్రభువు ఏ దాత కూడా ఆయన దాతృత్వానికి సరతూగని పరమదాత. ఆయన అధిక దాతృత్వం మరియు ఉపకారం కలవాడు.
(4) ఆయనే కలము ద్వారా వ్రాయటమును బోధించాడు
(5) ఆయన మానవునికి తెలియని విషయాలను బోధించాడు
(6) వాస్తవానికి నిశ్చయంగా అబూజహల్ లాంటి పాపాత్ముడు మానవుడు అల్లాహ్ హద్దులను అతిక్రమించటంలో హద్దును అతిక్రమించాడు.
(7) తన వద్ద ఉన్న గౌరవం మరియు సంపద మూలంగా తనను నిరపేక్షాపరుడిగా భావించటం వలన.
(8) ఓ మమానవుడా నిశ్చయంగా ప్రళయదినమున నీ ప్రభువు వైపునకు మరలవలసి ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి అతని హక్కును ఇస్తాడు.
(9) నిరోధించే అబూజహల్ విషయమును నీవు ఆశ్చర్యముతో చూశావా?
(10) మా దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాబా వద్ద నమాజ్ చేసినప్పుడు
(11) నీవు చెప్పు ఒక వేళ ఈ నిరోధించబడినవాడు తన ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉండి,పూర్తి అవగాహనతో ఉంటే
(12) లేదా అతడు ప్రజలను అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగి ఉండమని ఆదేశించి ఉంటే ఏమీ ఇటువంటి వ్యక్తి అయిన అతడు నిరోధించబడతాడా ?!
(13) ఒక వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని నిరోధించే ఇతడు ఒక వేళ తిరస్కరించి,దాని నుండి విముఖత చూపితే మీరేమంటారు అతడు అల్లాహ్ కు భయపడడా ?!
(14) ఈ దాసుడిని నమాజు చదవటం నుండి నిరోధించేవాడికి అల్లాహ్ తాను చేస్తున్నది చూస్తున్నాడని ,ఆయనపై దానిలో నుండి ఏదీ గోప్యంగా లేదని తెలియదా ?!
(15) ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. ఒక వేళ అతడు మా దాసుడిని బాధపెట్టటం నుండి మరియు అతన్ని తిరస్కరించటం నుండి ఆగకపోతే మేము తప్పకుండా అతని తల ముందు భాగమును (నుదుటను) గట్టిగా పట్టుకుని బలవంతాన నరకాగ్ని వైపుకు లాక్కుని వెళతాము.
(16) ఆ నుదుటి కలవాడు అబద్దము పలికేవాడు మరియు తప్పులు చేసేవాడు.
(17) అయితే అతని తల ముందు భాగమును పట్టుకుని నరకాగ్ని వైపుకు తీసుకెళ్ళబడినప్పుడు అతను తన సహచరులను మరియు తనతో పాటు కూర్చునే వారిని తనను శిక్ష నుండి రక్షించటానికి వారి సహాయం కోరతూ పిలుచుకోవాలి.
(18) మేము కూడా తొందరలోనే నరక భటులైన కఠిన దూతలను పిలుచుకుంటాము. వారు అల్లాహ్ తమకు ఆదేశించిన దానికి అవిధేయత చూపరు మరియు తమకు ఆదేశించబడిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కావున రెండు వర్గముల్లోంచి ఎవరు ఎక్కువ బలవంతులో మరియు సామర్ధ్యులో చూడాలి.
(19) ఈ దుర్మార్గుడు మీకు చెడు కలిగిస్తాడని ఊహించినట్లు విషయం కాదు. కావున మీరు ఏ ఆదేశంలో గాని ఏ వారింపులో గాని అతని మాట వినకండి. అల్లాహ్ కొరకు సాష్టాంగపడండి. విధేయత కార్యాల ద్వారా ఆయనకు దగ్గరవ్వండి. ఎందుకంటే అవి ఆయనకు దగ్గర చేస్తాయి.