(1) ఓ ప్రజలారా!మీ ప్రభువుకి భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒక ప్రాణం నుండి సృష్టించాడు,ఆయనే మీ తండ్రి ఆదమ్,మరియు అతని నుండి తన భార్యని సృష్టించాడు,ఆమె మీ తల్లి హవ్వా!వారిరువురి ద్వారా భూమండలంకు నలువైపుల మగ,ఆడ మానవులను వ్యాపింపజేశాడు,మరియు మీరు అల్లాహ్ కు భయపడండి ఆయన పేరుతోనే మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు,మీరు ఇలా అంటారు:-అల్లాహ్ పేరుతో అడుగుతున్నాను నీవు ఇలా చేయి,మీ మధ్య జోడించబడిన బంధాలను తెగత్రెంపులు చేసుకోవడానికి భయపడండి’నిశ్చయంగా అల్లాహ్ ఎల్లప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు,మీ కర్మల నుండి ఏ విషయం వ్యర్ధమవ్వదు,బదులుగా వాటిని లెక్కించి ఉంచుతాడు మరియు వాటి ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు.
(2) మరియు ఇవ్వండి-ఓ సంరక్షకులారా-అనాథలకు (తమ తండ్రులను కోల్పోయిన యుక్తవయస్సుకు చేరని బాలకులు)వారి పూర్తి సంపదను,యుక్తవయస్సుకు చేరి వివేకులైన తరువాత,-మరియు ఆనాధాల యొక్క సంపదలో అత్యుత్తమ సొమ్మును మీరు తీసుకుని వారికి మీ హీనమైన చెడిపోయిన డబ్బును ఇస్తూ హరామును హలాలుగా మార్చుకోవద్దు.మరియు మీ డబ్బుతో కలిపి అనాధాల డబ్బును తీసుకోవద్దు,నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహాపెద్ద పాపం.
(3) మరియు మీ సంరక్షణలో ఉన్న అనాథలను వివాహం చేసుకుంటే న్యాయం చేయలేరని మీరు భయపడినా లేదా వారికి తప్పనిసరిగా చెల్లించాల్సిన‘మహార్’మూల్యం చెల్లించే విషయంలో భయంకలిగిన లేదా వారి పట్ల దుర్వినియోగం జరుగుతుందనే భయం కలిగిన,వారిని వదిలేయండి,మరియు ఇతర ఉత్తమ స్త్రీలను ఎంచుకుని వివాహమాడండి,ఒకవేళ మీరు కోరితే ఇద్దరినీ,ముగ్గురిని,లేదా నలుగురిని వివాహమాడవచ్చు,కానీ వారిమధ్య న్యాయం చెయలేనని ఒకవేళ భయపడితే ‘ఒకరి’తో సరిపెట్టుకోండి,లేదా మీ అధికారంలో ఉన్న బానిస స్త్రీలతో కాపురంచేయండి, ఎందుకంటే వారికి మీ భార్యలతో పోలిన సమానమైన హక్కులు లేవు,ఈ ఆయతులో అనాథలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి మరియు ఒకరితో వివాహం లేదా బానిస-అమ్మాయి’తో తృప్తి చెందమని పరిమితి చేయబడింది, ఇది మీరు మోసపోకుండా మరియు నిషేధాలకు పాల్పడకుండా చేస్తుంది.
(4) స్త్రీలకు వారి మహార్ మూల్యాన్నితప్పనిసరిగా విధిగా చెల్లించండి,ఒకవేళ వారు తమకోసం మరేదైనా వస్తువును బలవంతం లేకుండా మీకోసం తృప్తి చెందితే అలాంటప్పుడు మీరు హలాలును నిరబ్యంతరంగా తినండి,అందులో మొహమాటపడకండి.
(5) మీరు ఇవ్వవద్దు-ఓ సంరక్షకులారా-డబ్బును ఉత్తమంగా వినియోగించడం రాకపోతే ,ఈ సంపదలను అల్లాహ్ ఒక కారణంగా చేశాడు వీటి ద్వారా దాసుల ప్రయోజనాలు మరియు వారి జీవిత వ్యవహారాలు కొనసాగుతాయి,కాబట్టి ఇలాంటి వారు సంపద మరియు దాని సంరక్షణకై అర్హులు కారు,వారిపై ఖర్చుచేయండి మరియు అందులో నుంచి వస్త్రధారణ చేయండి,మరియు వారితో మృదువుగా సంభాషించండి,మరియు మంచిగా ఉపదేశిస్తూ వారు వివేకానికి చేరుకోగానే,ఖర్చు చేసే తెలివి రాగానే ఇస్తాము అని చెప్పండి.
(6) ఓ అనాధాల -సంరక్షకులారా-వారు ప్రాజ్ఞ వయస్సుకు చేరిన తరువాత వారి డబ్బులోంచి కొంతభాగాన్ని పరీక్ష నిమిత్తం వినియోగించడానికి ఇవ్వండి ఒకవేళ వారు దాన్ని ఉత్తమంగా ఉపయోగించినట్లైతే వారి తెలివి,వివేకాలు మీకు అర్ధమైనట్లైతే అలాంటివారి పూర్తి సంపదను ఏ మాత్రం తగ్గించకుండా వారికి అప్పచెప్పండి,అల్లాహ్ మీకు వారి డబ్బులో అవసరార్ధం అనుమతిచ్చిన దాన్ని మినహాయించి హద్దుమీరీ తినకండి,ప్రాజ్ఞ వయసుకు రాగానే వారు దాన్ని తీసుకుంటారన్న భయంతో తినడంలో మితిమీరకండి,మీలో ఎవరైతే డబ్బు అవసరం లేని ధనికులు ఉన్నారో వారు అనాధల సొమ్మును తినకండి,మరెవరైతే మీలో డబ్బులేని పేదవాడుగా ఉంటాడో అవసరానికి సరిపోయేంత తినండి,మీరు వారికి యుక్తవయస్సుకు వచ్చాక మరియు వారి తెలివితేటలు మీ ముందు స్పష్టమయ్యాక డబ్బు అప్పచెప్పండి అలా అప్పగించేటప్పుడు హక్కులను పరిరక్షించేందుకు,మరియు విభేదాలు ఏర్పడకుండా సాక్ష్యులను దానిపై నియమించండి,అల్లాహ్’యే దానికి సాక్షిగా మరియు దాసుల కార్యాలకు లెక్కచూసేందుకు సరిపోతాడు.
(7) తల్లిదండ్రులు మరియు సమీపబంధువులు అంటే అన్నదమ్ములు,మరియు మేనమామలు,మరణించిన తరువాత పురుషుల కొరకు అందులో వాటా ఉంది అది తక్కువ లేదా ఎక్కువ కావచ్చు,మరియు వీరంతా వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా -అజ్ఞాన కాలానికి భిన్నంగా-వాటా ఉంటుంది, ఆ కాలంలో స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఆస్తిహక్కు ఉండేది కాదు,ఈ వాటాలు స్పష్టమైనవి సత్యమైనవి,ఈ వాటాలు అల్లాహ్ తరుపునుండి విధి చేయబడినవి.
(8) ఆస్తిపంపకాల సమయంలో వారసత్వ వాటా లేని సమీపబందువులు,అనాధలు మరియు పేదలు హాజరైనప్పుడు ఈ డబ్బు విభజనకి ముందు మీ మదిని ఆహ్లాదపర్చడానికి ప్రేమపూర్వకంగా ఇవ్వండి,వారు దానిని కోరుకుంటారు,నిశ్చయంగా వారు మీ వద్దకు కష్టపడి వచ్చారు,వారితో ఉత్తమంగా సంభాషించండి,కసురుకోకండి.
(9) తమ బలహీనమైన చిన్నపిల్లలను వారసులుగా విడిచిపెట్టి వెళ్ళినట్లైతే వారు వృధాగా అవుతారని భయపడతారు (భయపడాలి) అలాగే వారి సంరక్షణలో ఉన్న అనాథలకు అన్యాయం చేయకుండా దేవునికి భయపడాలి తద్వారా వారి మరణాంతరం వారి పిల్లలకు వీరు మంచి చేసినట్లు అన్యాయం చేయని వారిని అల్లాహ్ నియమించి వారికి సులభతరం చేశాడు. మరియు వసియత్ సమయంలో హాజరు అయ్యే వారి సంతానముతో మంచిగా వ్యవహరించి వారితో న్యాయపరంగా మాట్లాడండి,వసియత్ వలన వారసుల హక్కులో అన్యాయం చేయకండి, వసియత్ పై అమలు చేయటం వదిలివేసి తమపై కలిగే మంచిని కోల్పోకండి.
(10) అనాథల డబ్బును తీసుకుని అందులో అన్యాయంగా అక్రమంగా ఖర్చు చేసినవారు,నిశ్చయంగా వారి కడుపులను అగ్నితో నింపుతున్నారు అది వారిపై ఎగిసిపడుతుంది,మరియు త్వరలో నరకాగ్ని వారిని పరలోకంలో కాల్చివేస్తుంది.
(11) మీ పిల్లలు పొందే వారసత్వఆస్తి విషయంలో అల్లాహ్ మీకు వసియ్యతు చేస్తూ’ఆదేశిస్తున్నాడు-ఒక కొడుకుకు ఇద్దరు కూతుళ్ళ వాటా ఇవ్వబడుతుంది. ఒకవేళ మృతుడికి కుమారులు లేకుండా కేవలం కూతుళ్ళు మాత్రమే ఉంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడూ2/3 వంతు ఆస్తిలో లభిస్తుంది,ఒకటే కూతురు ఉంటే ఆస్తిలో సగం లభిస్తుంది,మరియు మృతుని తల్లిదండ్రులలో ప్రతీఒక్కరికి అతను వదిలిన ఆస్తి నుంచి 1/6 లభిస్తుంది. మృతునికి కొడుకు లేదా కూతురు ఉన్నపక్షంలో కూడా,మృతునికి తల్లిదండ్రులు తప్ప ఏ సంతానం లేని పక్షంలో వారే ఆస్తికి హక్కుదారులు అవుతారు,అప్పుడు తల్లికి 1/3 వ వంతు మరియు తండ్రికి మిగిలిన మొత్తం లభిస్తుంది. ఒకవేళ మృతునికి ఇద్దరు లేక ఎక్కువ సొంతసోదరులు లేదా వరుస సోదరులు మగ లేక ఆడ ఉన్నట్లైతే తల్లి కి ఖచ్చితంగా 1/6 లభిస్తుంది,మిగతామొత్తం అస్బా కారణంగా తండ్రికి లభిస్తుంది. సహోధరులకు అందులో ఎటువంటి వాటా లభించదు.- అయితే ఈ మొత్తం ఆస్తిపంపకం అనేది మృతుడు చేసిన వసియ్యతును (ఆ వసియ్యతు తన ఆస్తిలో 1/3 వాటా కు మించకూడదనే నిభందనతో )పూర్తిచేయాలి,మరియు అతని పై ఉన్న అప్పులు చెల్లించిన తరువాత పంచబడుతుంది. అల్లాహ్ ఆస్తిపంపకాన్ని ఈ విధంగా నిశ్చయం చేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులలో మరియు సంతానంలో ఇహపరలోకాల ప్రయోజన పరంగా సామీప్యులు ఎవరు అనేది మీకు తెలియదు. మృతుడు ఒకరిని వారసుడిగా మేలైనవాడుగా భావిస్తాడు తన పూర్తి ఆస్తిని అతనికి ఇచ్చేస్తాడు,లేదా ఒకరిని చెడుగా భావిస్తాడు అతన్ని ఆస్తి నుంచి దూరంచేస్తాడు,కానీ పరిస్థితి అతను భావించిన దానికి భిన్నంగా ఉంటుంది,ఈ విషయంలో పరిపూర్ణంగా తెలిసినవాడు అల్లాహ్’యే అతని వద్ద ఏ విషయం దాగి ఉండదు,అంచేత ఆస్తిపంపకాన్ని వివరించిన ప్రకారంగా పంచాలి,దీన్ని ఆయన విధిగా చేశాడు మరియు తనదాసులపై తప్పనిసరి చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు,తనదాసుల ప్రయోజనాలలో ఏ విషయం ఆయన వద్ద దాగిలేదు,మరియు షరీఅతు రచనలలో మరియు దాన్ని నిర్వహించడంలో మహా వివేకవంతుడు.
(12) మరియు మీకు-ఓ భర్తలారా-మీ భార్యలు వదిలిన ఆస్తిలో నుంచి సగం ½ లభిస్తుంది ఒకవేళ వారికి మీనుండి లేక ఇతరుల నుండి మగ,ఆడ ఏ సంతానం లేకుంటే,అదే వారికి మగ లేక ఆడ సంతానం ఉంటే ఆస్తిలో మీకు ¼ లభిస్తుంది.అయితే ఈ ఆస్తి వారి వసియ్యతు(వీలునామా) అభీష్టం నెరవేర్చి మరియు ఆమె అప్పులను చెల్లించిన తరువాత పంచబడుతుంది. మీరు వదిలిన ఆస్తిలో భార్యలకు ¼ వంతు లభిస్తుంది,ఆమెతో లేక ఇతరులతో మీకు మగ ఆడ ఎలాంటి సంతానం లేనిపక్షంలో,అదే మీకు ఆమెనుండి గానీ లేదా వేరేభార్యల నుండి గానీ మగ లేక ఆడ సంతానం ఉన్నట్లైతే అప్పుడు ఆమెకు మీ ఆస్తిలో 1/8 వంతు లభిస్తుంది,మీ అభీష్ట వీలునామా(వసియ్యతు)ను మరియు మీ అప్పులను చెల్లించిన తరువాత వారికి ఇది పంచబడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడు అతనికి తండ్రి మరియు సంతానం లేదు,లేదా ఒక స్త్రీ చనిపోయింది ఆమెకు తండ్రి మరియు సంతానం లేదు,అయితే ఈ మృతులకు సవతి సోదరులు లేక సవతి సోధరీమణులు ఉన్నప్పుడూ మృతుని సవతి సోదరునికి లేదా సహోధరికి 1/6 వంతు విధిగా లభిస్తుంది. ఒకవేళ సవతి సోదరులు లేక సోదరిమణులు ఒకటికంటే ఎక్కువ ఉన్నట్లయితే వారందరికి కలిపి 1/3 విధిగా లభిస్తుంది వారంతా అందులో భాగస్వాములవుతారు.ఇందులో మగ,ఆడ ఇద్దరూ సమానమే,మరియు మృతుని వసియ్యతుఅభీష్టం’వారసులకు నష్టం చేయకుండా ఉండాలి,అది ఆస్తిలో 1/3 కు మించరాదనే ’ ఈ షరత్తుతో పూర్తిచేసి మరియు అప్పులను చెల్లించిన తరువాత పొందుతారు, ఈ ఆదేశం పై ఆయతులో ఉంది,అల్లాహ్ తరుపున మీకు వసియ్యతు చేయబడింది మరియు విధిగా మీకు ఆదేశించబడింది.ఇహపరలోకాల్లో దాసులకు ఏది మంచిదో అల్లాహ్’కు చాలాబాగా తెలుసు,ఆయన నిగ్రహస్తుడు’పాపాత్ముడిని వెంటనే శిక్షించడంలో త్వరపడడు.
(13) అనాథలు మరియు ఇతరుల గురించి ఇక్కడ పెర్కోన్న ఆదేశాలు అల్లాహ్ తన దాసుల కొరకు ఏర్పరిచిన చట్టాలు,శాసనాలు,దీని గురించి వారు తెలుసుకుంటారు,ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఆదేశాలను పాటిస్తూ నిషేధాలకు దూరంగా ఉంటూ విధేయత చూపుతాడో అల్లాహ్ వారికి స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు,నదులు వాటి భవనాల క్రింది నుండి ప్రవహిస్తాయి,అక్కడ వారు శాశ్వతంగా నివాసముంటారు,మరణం వారి దరికి చేరదు,ఇదే అల్లాహ్ ఒసగే గొప్ప బహుమతి,ఇదియే గొప్ప విజయం,దానికి ఏ విజయం సాటి రాదు.
(14) అల్లాహ్’కు మరియు ఆయన ప్రవక్త ‘తీర్పులను ఖాతరుచేయకుండా,వాటిని ఆచరించకుండా,లేదా వాటిని అనుమానిస్తూ,శాసనాల యొక్క హద్దులను అతిక్రమిస్తూ;ఆవిధేయతకు పాల్పడినవాడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అందులోనే ఉంటాడు,అతనికోసం అందులో అవమానకరమైన శిక్ష ఉంటుంది.
(15) మీ స్త్రీలలో ఎవరైతే వ్యభిచారానికి పాల్పడతారో వారు వివాహితులైన అవివాహితులైన వారికి వ్యతిరేకంగా న్యాయం పలికే నలుగురు పురుషులు సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ (నలుగురు) సాక్షులు ఆ స్త్రీలు వ్యభిచరించారని సాక్ష్యం పలికితే దానికి శిక్షగా వారిని గృహాలలో నిర్భధించండి వారికి మరణం వచ్చేంతవరకు లేదా అల్లాహ్ వేరే మార్గం చూపించేంతవరకు, ఆ తరువాత అల్లాహ్ వారి కొరకు ఆ మార్గాన్ని బయలు పరిచాడు అదేమిటంటే వారు అవివాహితులు అయితే వంద కొరడా దెబ్బలు ఒక ఏడాది పాటు ఊరు నుండి బహిష్కరణ మరియు వివాహితులు అయితే శిలా శిక్ష విధించాలి.
(16) పురుషులలో ఏ ఇద్దరైనా వ్యభిచారానికి పాల్పడితే వారు వివాహితులైన అవివాహితులైన వారు నిందింపబడి అవమానానికి గురయ్యేలా వారిని నిందించి చేతులతో దండించండి. ఒకవేళ వారు గనక ఆపనిని పూర్తిగా విడిచిపెట్టి తమ కర్మలను సంస్కరించుకుంటే వారిని బాధపెట్టకండి. ఎందుకంటే పాపం పట్ల పశ్చాత్తాప పడేవాడు ఎలాంటి అపరాధం చేయని వానితో సమానం. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపపడే వారిని కరుణించి క్షమిస్తాడు.ఈ విధమైన శిక్ష తొలికాలపు ఆదేశాలకు సంబంధించినది తరువాత ఈ ఆదేశం రద్దు చేయబడి వ్యభిచరించినవాడు అవివాహితుడైతే కొరడా దెబ్బలు, ఊరు నుండి బహిష్కరణ మరియు వివాహితుడైతే శిలాశిక్ష విధించబడింది.
(17) నిశ్ఛయంగా అల్లాహ్ వారి పశ్ఛాత్తాపమును అంగీకరిస్తాడు ఎవరైతే పాపాల పరిణామము మరియు వాటి దుష్ఫలితాలు తెలియక పోవటం వలన పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడుతారో. మరియు ఈ పరిస్థితి ఉద్దేశపూర్వకంగా పాపమునకు పాల్పడే వారి మరియు ఉద్దేశపూర్వకంగా కాక పాపమునకు పాల్పడే ప్రతి ఒక్కరిది. ఆ తరువాత వారు మరణమును కళ్ళారా చూడక ముందే తమ ప్రభువు వైపునకు పశ్ఛాత్తాపముతో మరలుతారు. వారందరి పశ్చాత్తాపమును అల్లాహ్ స్వీకరిస్తాడు. వారి పాపములను మన్నించివేస్తాడు. మరియు అల్లాహ్ తన సృష్టితాల స్థితులను బాగా తెలిసినవాడు. మరియు తన విధి వ్రాతలో మరియు తన శాసనముల్లో వివేకవంతుడు.
(18) మరియు అల్లాహ్ వారి పశ్చాత్తాపమును అంగీకరించడు ఎవరైతే అవిధేయకార్యాలపై మొండిగా ఉండి వాటి నుండి మరణ ఘడియలు చూడనంత వరకు పశ్ఛాత్తాప్పడరు. అప్పుడు వారిలో నుండి ఒకడు ఇలా పలుకుతాడు : నేను పాల్పడిన పాపముల నుండి ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నాను. మరియు అల్లాహ్ స్వీకరించడు. ఇదే విధంగా వారి పశ్చాత్తాపమును ఎవరైతే అవిశ్వాసముపై మొండిగా ఉన్న స్థితిలో మరణిస్తారో. వారందరు పాపకార్యములపై మొండిగా ఉన్న పాపాత్ములు. మరియు ఎవరైతే తమ అవిశ్వాస స్థితిలో మరణిస్తారో వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
(19) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు సంపదను వారసత్వంగా పొందినట్లు మీ తండ్రుల భార్యలను వారసత్వంగా పొందటం మరియు వారిని వివాహం చేసుకోవటం ద్వారా లేదా వారిని మీరు కోరిన వారికిచ్చి వివాహం చేయటం ద్వారా లేదా వారిని వివాహం చేసుకోవటం నుండి నిరోధించటం ద్వారా మీరు వారి విషయంలో వ్యవహరించటం మీకు సమ్మతం కాదు. మరియు మీరు అసహ్యించుకునే మీ భార్యలను మీరు వారు ఇచ్చి ఉన్న మహర్,ఇతరవాటిలో నుంచి కొంత భాగం మీకు ఇచ్చేంత వరకు వారికి హాని తలపెట్టటానికి ఆపివేయటం మీకు సమ్మతం కాదు. కాని వారు వ్యభిచారము లాంటి బాహాటమైన నీతిమాలిన పనికి పాల్పడితే తప్ప. వారు అలా చేస్తే మీరు వారికి ఇచ్చిన వాటి ద్వారా వారు మీ నుండి విమోచించబడేనంత వరకు వారిని ఆపి ఉంచటం మరియు వారిని ఇబ్బందికి గురి చేయటం మీకు సమ్మతమే. ఒక వేళ మీరు ఏదైన ప్రాపంచిక విషయం వలన వారిని మీరు అసహ్యించుకుంటే మీరు వారిని భరించండి. బహుశా అల్లాహ్ మీరు అసహ్యించుకునే దాని విషయంలో ఇహపరలోక జీవితంలో చాలా మేలును కలిగిస్తాడు.
(20) మరియు ఓ భర్తల్లారా ఒక వేళ మీరు భార్యను విడాకులిచ్చి ఆమె స్థానంలో వేరొకరితో వివాహం చేయదలచుకుంటే అందులో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు ఒక వేళ ఏ స్త్రీ నుండి విడిపోవాలని దృఢ నిర్ణయం చేసుకున్నారో ఆమెకు మీరు మహర్ గా అధిక ధన రాశి ఇచ్చి ఉంటే దాని నుండి ఏమియు తీసుకోవటం మీకు సమ్మతం కాదు. నిశ్చయంగా మీరు వారికి ఇచ్చి ఉన్న దాన్ని తీసుకోవటం స్పష్టమైన అపనింద మరియు స్పష్టమైన పాపము అగును.
(21) మీ మధ్య జరిగిన సంబంధం, ఆప్యాయత, ఆనందం మరియు రహస్యాల జ్ఞానం తర్వాత మీరు వారికి ఇచ్చిన మహర్ ను ఎలా తీసుకుంటారు ?. దీని తరువాత వారి చేతుల్లో ఉన్న సంపద పట్ల అత్యాశ కలిగి ఉండటం చెడు విషయం మరియు అసహ్యకరమైనది. వారు మీ నుండి పటిష్టమైన ప్రమాణమును తీసుకున్నారు. అది మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు ద్వారా ఆయన ధర్మ శాసనం ద్వారా వారిని హలాల్ చేసుకోవటం.
(22) మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా అది నిషిద్ధమైనది. కాని ఇస్లాంకు పూర్వం జరిగినది తప్ప దానిపై శిక్షించడం జరగదు. ఇది పిల్లలు తమ తండ్రుల భార్యలను వివాహం చేసుకోవటం దాని వికారతను అధికం చేసే విషయం. మరియు దాన్ని చేసే వాడిపై అల్లాహ్ ఆగ్రహమునకు ఒక కారణం. మరియు దానిపై నడిచే వారి కొరకు చెడ్డ మార్గము.
(23) అల్లాహ్ మీపై మీ తల్లులతో నికాహ్ ను నిషేధించాడు ఒకవేళ వారు ఆపై ఉన్న అంటే తల్లి యొక్క తల్లి మరియు ఆమె అమ్మమ్మ తండ్రి తరపు నుండి లేదా తల్లి తరపు నుండి. మరియు మీ కుమార్తెలతో (నికాహ్ ను నిషేధించాడు) ఒకవేళ వారు క్రిందకు దిగిన అంటే వారి కుమార్తెలు మరియు వారి కుమార్తె యొక్క కుమార్తెలు మరియు అలాగే కుమారుని కుమార్తెలు,కుమార్తె యొక్క కుమార్తెలు ఒకవేళ వారు క్రిందకు దిగిన మరియు మీ తల్లిదండ్రుల తరపు నుండి లేదా వారిద్దరిలో నుంచి ఒకరి తరపు నుండి మీ సోదరిలు మరియు మీ మేనత్తలు మరియు అలాగే మీ తండ్రుల మరియు మీ తల్లుల మేనత్తలు మరియు ఒక వేళ వారు ఆపై ఉన్న మరియు మీ పిన్నమ్మలు మరియు అలాగే మీ తండ్రుల మరియు మీ తల్లుల పిన్నమ్మలు ఒక వేళ వారు ఆపై ఉన్న మరియు సోదరుల,సోదరిల కుమార్తెలు మరియు వారి సంతానము ఒకవేళ వారు క్రిందకు దిగినా మరియు మీకు పాలు పట్టించిన మీ తల్లులు మరియు పాలు త్రాగటం వలన మీ సోదరులు మరియు మీ భార్యల తల్లులు ఒక వేళ మీరు వారితో సంభోగం చేసినా లేదా వారితో సంభోగం చేయక పోయినా సమానము. మరియు మీతో కాకుండా ఇతరులతో మీ భార్యల కుమార్తెలు ఎవరైతే మీ ఇంటిలో పోషించబడి,పెరిగిన వారు మరియు అలాగే వారు అందులో పెరగకపోయిన ఒక వేళ మీరు వారి తల్లులతో సంభోగం చేసిన. మరియు మీరు వారితో సంభోగం చేయకపోయి ఉంటే వారి కుమార్తెలతో వివాహం చేయటంలో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు మీ సొంత కుమారుల భార్యలతో నికాహ్ చేసుకోవటం మీపై నిషిద్ధం. ఒక వేళ మీరు వారితో సంభోగం చేయక పోయిన మరియు ఈ ఆదేశంలో పాలు త్రాగటం వలన మీ కుమారుల భార్యలు వస్తారు. మరియు ఇద్దరు సోదరిల మధ్య సమీకరించటం మీపై నిషేధము వారు బంధమును బట్టి లేదా పాలు త్రాగటం వలన అయితే. కాని అజ్ఞాన కాలంలో అందులో నుంచి ఏదైతే జరిగినదో అల్లాహ్ దాన్ని మన్నించి వేశాడు. నిశ్చయంగా అల్లాహ్ తన వైపు పశ్ఛాత్తాపముతో మరలే తన దాసులను మన్నించేవాడు. వారిపై కరుణించేవాడు. మరియు ఇదే విధంగా స్త్రీకి ఆమె మేనత్త మరియు పినతల్లి మధ్య సమీకరించటం యొక్క నిషిద్ధత సున్నత్ లో నిరూపితమైనది.
(24) వివాహితులైన స్త్రీలతో వివాహం చేసుకోవటం మీపై నిషేధించబడినది.కాని అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటంలో మీకు బానిసురాలైన వారితో వారి ఋతుస్రావం నయం అయిన తరువాత వారితో లైంగిక సంపర్కం మీకు అనుమతించబడుతుంది. అల్లాహ్ దాన్ని మీపై అనివార్యం చేశాడు. అల్లాహ్ మీకు స్త్రీల్లోంచి కొందరిని మినహాయించి మీకు అనుమతించాడు. మీరు మీ సంపదల ద్వారా మీ స్వయమును రక్షించుకోవటానికి మరియు వాటిని హలాల్ పద్దతి ద్వారా పరిశుద్ధపరచటానికి వ్యభిచార ఉద్దేశముతో కాకుండా మీరు కోరటానికి. మీరు వారితో నికాహ్ ద్వారా ప్రయోజనం చెందితే అల్లాహ్ మీపై అనివార్యం చేసిన వారి మహర్ లను వారికి ఇవ్వండి. అనివార్యం చేయబడిన మహర్ నిర్దేశించిన తరువాత అందులో అధికం చేసే విషయంలో లేదా అందులో కొంత భాగమును మినహాయించే విషయంలో మీ పరస్పర అంగీకారం జరిగిన విషయంలో మీపై ఎటువంటి పాపం లేదు. నిశ్చయంగా అల్లాహ్ కు తన సృష్టితాల గరించి బాగా తెలుసు. వారిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
(25) ఓ పురుషులారా మీలో నుండి ఎవరికైన సంపద తక్కువగా ఉండటం వలన స్వతంత్ర స్త్రీలతో వివాహమాడే స్థోమత లేకపోతే వారు ఇతరులకు చెందిన బానిస స్త్రీలను వివాహం చేసుకోవటం సమ్మతము. ఒక వేళ వారు మీకు కనిపించే వాటిపై విశ్వాసులైతే. మరియు మీ విశ్వాసము యొక్క వాస్తవికత మరియు మీ పరిస్థితుల అంతరంగాల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు మీరు,వారు ధర్మంలో మరియు మానవత్వంలో సమానులు. కావున మీరు వారితో వివాహం చేసుకోవటమును మానుకోకండి. మీరు వారి యజమానుల అనుమతితో వారితో వివాహం చేసుకోండి. మరియు మీరు వారి మహర్ ను తగ్గించకుండా,వాయిదా వేయకుండా వారికి ఇవ్వండి.ఈ ఆదేశం ఒక వేళ వారు బహిరంగంగా వ్యభిచారానికి పాల్పడని సౌశీల్యవంతులై ఉండి,తమతో వ్యభిచారము కొరకు రహస్యంగా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోని వారై ఉంటేనే. వారు వివాహ బంధంలో కట్టుబడినప్పుడు ఆ తరువాత వారు వ్యభిచార అశ్లీల కార్యమునకు ఒడిగడితే అప్పుడు మీరు స్వతంత్రులగు స్త్రీలకు విధించే సగం శిక్ష యాభై కొరడా దెబ్బలు కొట్టడం విధించండి. వారిని రాళ్ళతో కొట్టకండి. వివాహిత స్వతంత్రులైన స్త్రీలు వ్యభిచారం చేసినప్పుడు విధించే దానికి వ్యతిరేకంగా. ఈ ప్రస్తావించబడిన విశ్వాసులైన సౌశీల్యవంతులైన బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం సమ్మతించబడటం, తాను వ్యభిచారంలో పడతానని భయపడేవారికి మరియు స్వతంత్రులైన స్త్రీలతో వివాహం చేసుకునే స్థోమత లేని వారికి వెసులబాటు. అయితే బానిస స్త్రీలతో వివాహం కంటే ఆత్మ నిగ్రహరణ (సహనం) చాలా ముఖ్యం. సంతానమును బానిసత్వం నుండి రక్షించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడు. వారిపై కరుణించేవాడు. వ్యభిచార భయమున్నప్పుడు స్వతంత్ర స్త్రీలను వివాహం చేసుకునే స్థోమత లేని స్థితిలో వారి కొరకు బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం ధర్మబద్ధం చేయటం ఆయన కరుణలో నుంచే.
(26) పరిశుద్ధుడైన అల్లాహ్ ఈ ఆదేశములను మీకు ధర్మబద్ధం చేయటం ద్వారా తన ధర్మ సూత్రాలను,శాసనాలను మరియు ఇహపరాల్లో మీకు ప్రయోజనాలు ఉన్న వాటిని స్పష్టపరచదలచాడు. మరియు హలాల్,హరామ్ చేసే విషయంలో మీకన్న పూర్వ ప్రవక్తల మార్గము వైపునకు మరియు వారి ఉదారలక్షణాలు,వారి మంచి నడవడికల వైపునకు మీరు వారిని అనుసరించటానికి ఆయన మిమ్మల్ని మార్గదర్శకం చేయదలిచాడు. మరియు ఆయన మిమ్మల్ని తన అవిధేయత నుండి తన విధేయత వైపునకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల ప్రయోజనాలు దేనిలో ఉన్నవో బాగా తెలుసు. కాబట్టి ఆయన దానిని వారి కోసం శాసనం చేశాడు. తన ధర్మ శాసనంలో మరియు వారి వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు.
(27) మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించి మీ పాపములను మన్నించ గోరుతున్నాడు. మరియు తమ మనోవాంఛల వెను నడిచేవారు సన్మార్గము నుండి తీవ్రంగా దూరమవటమును కోరుతున్నారు.
(28) అల్లాహ్ తాను ధర్మనిర్దేశం చేసిన వాటి విషయంలో మీ భారమును తగ్గించగోరుతున్నాడు. మీకు శక్తి లేని బాధ్యతను ఆయన మీపై వేయడు. ఎందుకంటే ఆయనకు మానవుడు అతని సృష్టిలో మరియు అతని గుణములో బలహీనుడని తెలుసు.
(29) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీలోని ఒకరు మరొకరి సొమ్మును అన్యాయంగా తీసుకోకండి. ఉదాహరణకి బలవంతాన లాక్కొని,దొంగతనం చేసి,లంచము తీసుకుని,తదితర విధంగా. కాని వ్యాపార ఒప్పందము చేసుకునేవారి పరస్పర అంగీకారముతో వెలువడిన వ్యాపార సంపద అయితే వేరే విషయం. అప్పుడు దాన్ని తినటం,దానిలో వ్యవహరించటం మీకు సమ్మతమగును. మరియు మీరు ఒకరినొకరు హతమార్చుకోకండి. మరియు మీలో నుండి ఎవరూ స్వయాన్ని హతమార్చుకోకండి. స్వయాన్ని వినాశనంలో పడవేయకూడదు. నిశ్చయంగా అల్లాహ్ మీపై దయ కలవాడు. మరియు ఆయన కారుణ్యములో నుంచి ఆయన మీ రక్తములను మరియు మీ సంపదలను మరియు మీ మానములను నిషేధించాడు.
(30) మరియు ఎవరైతే తాను వారించబడిన వాటికి పాల్పడి ఇతరుల సొమ్మును తింటాడో లేదా అతనిపై హత్య ద్వారా లేదా ఇతర వాటి ద్వారా అతిక్రమిస్తాడో అజ్ఞానంగా లేదా మరచిపోయి కాకుండా తెలిసి దుర్మార్గంగా (చేస్తాడో) అల్లాహ్ అతన్ని ప్రళయదినాన పెద్ద అగ్నిలో ప్రవేశింపజేస్తాడు. అతడు దాని వేడిని అనుభవిస్తాడు. మరియు దాని శిక్షను అనుభవిస్తాడు. మరియు ఇది అల్లాహ్ పై సులభము. ఎందుకంటే ఆయన సామర్ధ్యం కలవాడు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(31) ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ తో సాటి కల్పించటం,తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం,ప్రాణాలు తీయటం,వడ్డీ తినటం లాంటి పెద్ద పాపములకు పాల్పడటం నుండి దూరంగా ఉంటే మేము మీరు పాల్పడే చిన్న పాపములను వాటిని ప్రక్షాళన చేసి మరియు వాటిని తుడిచివేసి మన్నించి వేస్తాము. మరియు మేము అల్లాహ్ వద్ద మిమ్మల్ని గౌరవోన్నత ప్రదేశంలో ప్రవేశింపజేస్తాము. అది స్వర్గము.
(32) ఓ విశ్వాసులారా అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం మీరు ఆశపడకండి. అది క్రోధానికి మరియు అసూయకు దారి తీయకుండా ఉండటానికి. కావున అల్లాహ్ దేని మూలంగానైతే పురుషులకు ప్రత్యేకించాడో దాన్ని ఆశించటం స్త్రీల కొరకు తగదు. ఎందుకంటే ప్రతీ వర్గం వారికి వారికి తగ్గట్టుగా ప్రతిఫలములో నుంచి భాగము ఉన్నది. మరియు అల్లాహ్ తన ప్రసాదములో నుండి మీకు అధికంగా ఇవ్వాలని ఆయనతో కోరుకోండి. నిశ్చయంగా ప్రతి విషయం గురించి అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన ప్రతి రకం వారికి దానికి తగిన విధంగా ప్రసాదిస్తాడు.
(33) మరియు మేము మీలో నుండి ప్రతి ఒక్కరి కొరకు అసబహ్ ను చేశాము వారు తల్లిదండ్రులు మరియు దగ్గరి బందువులు వదిలి వెళ్ళిన అస్తిలో వారసులవుతారు. మరియు మీరు ఎవరితోనైతే ఒప్పందముపై,సహాయముపై దృఢమైన ప్రమాణము చేసి ఉంటే మీరు వారికి వారసత్వ సొమ్ములో వారి భాగమును ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుపై సాక్షిగా ఉన్నాడు. మీ ఈ ప్రమాణములపై మరియు మీ ఒప్పందములపై ఆయన సాక్ష్యం అందులో నుంచే. ఒప్పందము ద్వారా వారసులవ్వటం ఇస్లాం ఆరంభంలో ఉండేది. ఆ తరువాత అది రద్దుపరచబడినది.
(34) పురుషులు స్త్రీలను పరిరక్షిస్తారు. మరియు వారి వ్యవహారములను పరిరక్షిస్తారు. ఏదైతే అనుగ్రహమును వారిపై వారికి ప్రత్యేకించాడో దాని వలన మరియు వారికి వారి విషయంలో ఖర్చు చేసే మరియు వారి పరిరక్షణ బాధ్యత వారిపై అనివార్యం అవటం వలన. మరియు స్త్రీల్లోంచి పుణ్యాత్ములైనవారు తమ ప్రభువుకు విధేయిలై ఉంటారు మరియు తమ భర్తలకు విధేయులై ఉంటారు. వారికి అల్లాహ్ భాగ్యము కలిగి ఉండటం వలన వారు వారి గైర్ హాజరీలో వారి కొరకు పరిరక్షిస్తారు. మరియు ఏ స్త్రీల గురించి మాటలో లేదా చేతలో వారి భర్తల విధేయత నుండి వారి అహం భయం మీకు ఉంటే ఓ భర్తల్లారా మీరు వారికి హితబోధన చేయటమును మరియు వారిని అల్లాహ్ నుండి భయపెట్టటమును మొదలెట్టండి. ఒక వేళ వారు మాట వినకపోతే పడకల్లో వారిని వదిలివేయండి వారి నుండి వీపును త్రిప్పి వారితో సంభోగం చేయకుండా ఉండటం ద్వారా. ఒక వేళ వారు మాట వినకపోతే వారిని గాయపరచకుండా కొట్టండి. ఒక వేళ వారు విధేయత వైపుకు మరలితే వారిపై ఎటువంటి హింస ద్వారా లేదా శిక్ష ద్వారా హద్దుమీరకండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుకన్న ఉన్నతుడు,తన అస్తిత్వంలో మరియు తన గుణాల్లో గొప్పవాడు కాబట్టి మీరు ఆయనకు భయపడండి.
(35) ఓ భార్యాభర్తల సంరక్షకులారా వారిద్దరి మధ్య విబేధము శతృత్వమునకు మరియు విడిపోవటానికి దారి తీస్తుందని మీకు భయం ఉంటే మీరు భర్త వైపు నుంచి ఒక న్యాయపూరితమైన వ్యక్తిని మరియు భార్య తరపు నుంచి ఒక న్యాయపూరితమైన వ్యక్తిని పంపించండి; వారిద్దరు వారిరువురి మధ్య విడిపోవటంలో లేదా కలిసి ఉండటంలో దేనిలో ప్రయోజనం ఉన్నదో దాని ద్వారా తీర్పునివ్వటానికి. మరియు కలిసి ఉండటమే చాలా ఇష్టమైనది మరియు చాలా మంచిది. ఒక వేళ తీర్పునిచ్చేవారిద్దరు దాన్నే నిర్ణయించుకుని దాని వైపు మంచి పద్దతిని అవలంబిస్తే అల్లాహ్ భర్యాభర్తల మధ్య బంధమును కలిపి వేస్తాడు. మరియు వారి మధ్య ఉన్న విబేధమును తొలగించివేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ పై దాసుల్లోంచి ఏది గోప్యంగా ఉండదు. మరియు వారు తమ హృదయములలో దాచే సున్నితమైన వాటి గురించి ఆయనకు బాగా తెలుసు.
(36) మరియు మీరు అల్లాహ్ ఒక్కడినే ఆయనకు విధేయత చూపుతూ ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు వేరే వారిని ఆరాధించకండి. మరియు తల్లిదండ్రులతో వారిద్దరి గౌరవం ద్వారా,ధర్మం ద్వారా మంచిగా మెలగండి. మరియు దగ్గరి బంధువులతో,అనాధలతో,పేదవారితో మంచిగా మెలగండి. మరియు దగ్గరి బంధువులైన పొరుగువారితో,దగ్గరి బంధువులు కాని పొరుగు వారితో మంచిగా మెలగండి. మరియు మీతో తోడుగా ఉండే స్నేహితునితో మంచిగా మెలగండి. మరియు దారులు మూసుకోబడిన అపరిచిత ప్రయాణికునితో మంచిగా మెలగండి. మరియు మీ బానిసలతో మంచిగా మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ తన స్వయమును ఇష్టపడేవాడిని మరియు ఆయన దాసులపై గర్వాన్ని చూపేవాడిని మరియు ప్రజల మధ్య గర్వముతో తన స్వయమును పొగిడే వాడిని ఇష్టపడడు.
(37) మరియు అల్లాహ్ తాను ప్రసాదించిన తన ఆహారములోంచి ఖర్చు చేయటమును విధిగావించిన దాన్ని ఆపేవారిని మరియు దాని గురించి ఇతరులను తమ మాటల ద్వారా తన చేతల ద్వారా ఆదేశించేవారిని ఇష్టపడడు. మరియు వారు అల్లాహ్ తన అనుగ్రహములో నుంచి తమకు ప్రసాదించిన ఆహారమును మరియు జ్ఞానమును,ఇతరవాటిని దాస్తున్నారు. మరియు వారు సత్యమును ప్రజల ముందు బహిర్గతం చేయరు. కాని దాన్ని దాచివేస్తారు. మరియు అసత్యమును బహిర్గతం చేస్తున్నారు. మరియు ఈ లక్షణాలు అవిశ్వాసము యొక్క లక్షణాలు. మరియు నిశ్చయంగా మేము అవిశ్వాసపరుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
(38) మరియు అదేవిధంగా మేము శిక్షను వారి కొరకు సిద్ధపరచాము ఎవరైతే తమ సంపదలను ప్రజలకు చూపించటానికి మరియు వారు తమను పొగడటానికి ఖర్చు చేస్తారో. మరియు వారు అల్లాహ్ ను విశ్వసించరు మరియు ప్రళయదినమును విశ్వసించరు. మేము ఆ హీనపరిచే శిక్షను వారి కొరకు సిద్ధపరచాము. మరియు వారిని అపమార్గమునకు లోను చేసినది షైతానును వారు అనుసరించటం మాత్రమే. మరియు ఎవరి కొరకైతే షైతాను అంటిపెట్టుకుని ఉండే స్నేహితునిగా ఉంటాడో. అతడు ఎంత చెడ్డ స్నేహితుడు.
(39) మరియు వీరందరికి ఏమి నష్టం కలిగేది ఒక వేళ వారు వాస్తవంగా అల్లాహ్ ను మరియు ప్రళయదినమును విశ్వసించి మరియు తమ సంపదలను అల్లాహ్ మార్గంలో ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఖర్చు చేసి ఉంటే ?. కాని అందులో అంతా మేలే జరిగి ఉండేది. మరియు అల్లాహ్ వారి గురించి బాగా తెలిసిన వాడు. వారి స్థితి ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(40) నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం చేసేవాడు. ఆయన తన దాసులపై కొంచం కూడా అన్యాయం చేయడు. కావున ఆయన వారి పుణ్య కార్యముల్లోంచి చిన్న చీమంత పరిమాణం తగ్గించడు. మరియు ఆయన వారి పాపములను కొంచం కూడా అధికం చేయడు. ఒక వేళ రవ్వంత బరువు కల పుణ్యం ఉన్న దాని ప్రతిఫలమును ఆయన దాని కన్న రెట్టింపు చేస్తాడు. మరియు ఆయన తన వద్ద ఉన్న వారికి రెట్టింపు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(41) మేము ప్రతీ జాతి ప్రవక్తను వారు చేసిన కర్మలకు వారిపై సాక్ష్యం ఇచ్చేవాడి గా తీసుకొచ్చినప్పుడు మరియు ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని మీ జాతిపై సాక్ష్యం ఇచ్చే వాడిగా తీసుకొచ్చినప్పుడు ప్రళయదినమున విషయం ఏమవుతుంది ?.
(42) ఆ గొప్ప దినమున అల్లాహ్ ను అవిశ్వసించి,ఆయన ప్రవక్తపై అవిధేయత చూపిన వారు ఒక వేళ తాము మట్టిగా అయిపోయి నేలతో పాటు సమాంతరంగా అయిపోయి ఉండాలని కోరుకుంటారు. వారు చేసుకున్న కర్మల్లోంచి వారు అల్లాహ్ నుండి ఏమి దాచలేరు. ఎందుకంటే అల్లాహ్ వారి నాలుకలపై సీలు వేసేస్తాడు అవి మాట్లాడవు. మరియు ఆయన వారి అవయవములకు అనుమతినిస్తాడు అప్పుడు అవి వారు చేసిన కర్మలకు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
(43) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు మీ మత్తు వీడనంత వరకు మరియు మీరు పలికేది అర్ధం చేసుకోనంత వరకు మీరు మత్తులో ఉన్న స్థితిలో నమాజ్ చదవకండి. మరియు ఈ ఆదేశం మద్యం పూర్తిగా నిషేధించబడక మునుపటిది. మరియు మీరు జనాబత్ స్థితిలో (వీర్య స్ఖలనం అయి ఉన్న స్థితిలో) మీరు గుసుల్ చేయనంత వరకు నమాజ్ చదవకండి. మరియు ఆ స్థితిలో మస్జిదులో ప్రవేశించకండి కాని అందులో ఆగకుండా దాటిపోతూ వెళ్ళవచ్చు. ఒక వేళ మీరు అనారోగ్యానికి గురైతే అప్పుడు నీళ్ళను ఉపయోగించటం సాధ్యం కాకపోతే లేదా మీరు ప్రయాణంలో ఉంటే లేదా మీలో నుండి ఎవరైన మలమూత్ర విసర్జన చేసి ఉంటే లేదా మీరు భార్యలతో సంభోగం చేసి ఉంటే అప్పుడు మీకు నీరు లభించకపోతే మీరు పరిశుద్ధ మట్టి వైపుకు మరలండి. అప్పుడు మీరు దానితో మీ ముఖములపై మరియు మీ చేతులపై మసహ్ చేసుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైఫల్యమును మన్నించేవాడు, మిమ్మల్ని క్షమించేవాడు.
(44) ఓ ప్రవక్త అల్లాహ్ తౌరాత్ జ్ఞానంలో నుంచి కొంత భాగం ప్రసాదించిన యూదుల విషయం మీకు తెలియదా వారు సన్మార్గమునకు బదులుగా అపమార్గమును ఎంచుకున్నారు. మరియు వారు మిమ్మల్ని ఓ విశ్వాసపరులారా మీరు వారి వక్ర మార్గములో నడవటం కొరకు ప్రవక్త తీసుకుని వచ్చిన సన్మార్గము నుంచి అపమార్గమునకు లోను చేయటానికి అత్యాశ కలిగి ఉన్నారు.
(45) ఓ విశ్వాసపరులారా మీ శతృవుల గురించి మీకన్న బాగా అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన వారి గురించి మీకు తెలియపరచాడు మరియు వారి శతృత్వం గురించి మీకు స్పష్టపరచాడు. మరియు వారి ఆధిక్యత నుండి మిమ్మల్ని రక్షించటానికి సంరక్షకుడిగా అల్లాహ్ చాలు. మరియు వారి కుట్ర నుండి,వారి బాధ నుండి మిమ్మల్ని నిరోధించటానికి సహాయకుడిగా అల్లాహ్ చాలు. ఆయన వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాడు.
(46) అల్లాహ్ అవతరింపజేసిన వాక్కును మార్చే చెడ్డ వ్యక్తులు యూదుల్లో ఉన్నారు. వారు అల్లాహ్ అవతరింపజేసిన వాటికి భిన్నంగా వాటిని అర్ధం చేసుకుంటారు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైన ఆదేశమిచ్చినప్పుడు వారు ఆయనతో ఈ విధంగా పలికేవారు : మేము మీ మాటను విన్నాము మరియు మేము మీకు అవిధేయత చూపించాము. మరియు వారు వ్యంగ్యముగా ఇలా పలికేవారు : మేము చెప్పేది మీరు వినండి, మీరు వినలేదు. వారు తమ మాటల్లో రాయినా అని పలికి తాము రాయినా సమ్అక కోరుకుంటున్నట్లు సందేహమునకు గురి చేసేవారు. మరియు వారు మాత్రం రఊన (మతి లేనివాడు) పదమును కోరుకునేవారు. వారు తమ నాలుకలను దానితో వక్రీకరిస్తారు. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను శపించదలిచారు మరియు ధర్మంలో లోపాలను చూపదలిచారు. ఒక వేళ వారు తమ మాటల్లో సమిఅనా ఖౌలకా వ అసైనా అమ్రకా (మేము మీ మాటను విన్నాము మరియు మీ ఆదేశమును ఉల్లంఘించాము) కు బదులుగా సమిఅనా ఖౌలక వ అతఅనా అమ్రక (మేము మీ మాట విన్నాము మీ ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము) అని పలికి ఉంటే మరియు ఇస్మఅ్ లా సమిఅత కు బదులుగా ఇస్మఅ్ అని పలికి ఉంటే మరియు వారి మాట రాయినా కు బదులుగా ఇన్తజిర్ నా నఫ్హము అన్క మా తఖూలు అని పలికి ఉంటే అది వారు మొదట పలికిన దాని కంటే వారి కొరకు మేలైనదిగా మరియు దాని కంటే ఎక్కువ న్యాయపురితమైనదిగా ఉండేది ఎందుకంటే అందులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పక్షమున తగిన సత్ప్రవర్తన ఉన్నది. కాని అల్లాహ్ వారిని శపించాడు. వారి అవిశ్వాసం వలన తన కారుణ్యము నుండి వారిని గెంటివేశాడు. కావున వారు తమకు ప్రయోజనం కలిగించే విశ్వాసమును చూపరు.
(47) ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధం ఒసగబడినవారా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన దాన్ని,మీతో పాటు ఉన్న తౌరాత్ ను దృవీకరిస్తూ వచ్చిన దాన్ని విశ్వసించండి. మేము ముఖముల్లో ఉన్న ఇంద్రియాలను చెరిపివేసి వాటిని వారి వెనుక భాగంలో పడవేయక ముందు లేదా వేటాడే విషయంలో వారిని దాని నుండి ఆపిన తరువాత కూడా మితిమీరిన శనివారం వారిని మేము కారుణ్యం నుండి గెంటివేసిన విధంగా అల్లాహ్ కారుణ్యం నుండి మేము గెంటి వేయక ముందు. అప్పుడు అల్లాహ్ వారిని కోతుల రూపంలో మార్చి వేశాడు. మరియు మహోన్నతుడైన ఆయన ఆదేశము,ఆయన విధివ్రాత ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.
(48) నిశ్ఛయంగా అల్లాహ్ తన సృష్టితాల్లోంచి దేనిని తనకు సాటి కల్పించటంను క్షమించడు. మరియు ఆయన పాప కార్యముల్లోంచి సాటి కల్పించటం,అవిశ్వాసం చూపటం కాకుండా ఇతర వాటిని తాను తలచిన వారి కొరకు తన అనుగ్రహం ద్వారా మన్నించివేస్తాడు లేదా వారిలో నుండి తాను తలచిన వారిని వారి పాపములను బట్టి తన న్యాయము ద్వారా వాటి వలన శిక్షిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తాడో అతడు పెద్ద పాపమును కల్పించుకున్నాడు దానిపై మరణించిన వాడు మన్నించబడడు.
(49) ఓ ప్రవక్త ఏమీ తమను,తమ కర్మలను పవిత్రులమని కీర్తించుకునే వారి విషయం మీకు తెలియదా ?. కాని ఒక్కడైన అల్లాహ్ యే తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని కీర్తిస్తాడు మరియు వారిని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు హృదయాల అంతర్గతాలు తెలుసు. మరియు ఆయన వారి కర్మల పుణ్యములో నుంచి కొంచము కూడా తగ్గించడు ఒక వేళ అది కర్జురపు టెంకపై ఉన్న పొర పరిమాణంలో ఉన్నా సరే.
(50) ఓ ప్రవక్తా వారు తమను తాము కీర్తించుకుని అల్లాహ్ పై అబద్దమును కల్పించుకుంటున్నారో మీరు చూడండి. మరియు దీనితో స్పష్టమైన పాపం వారి అపమార్గమునకు చాలును.
(51) ఓ ప్రవక్తా అల్లాహ్ జ్ఞానములో నుంచి ఒక భాగమును ప్రసాదించిన యూదుల స్థితి గురించి మీరు తెలుసుకోరా,ఆశ్చర్యపడరా వారు అల్లాహ్ ను వదిలి తాము తయారు చేసుకున్న ఆరాధ్య దైవాలను విశ్వసిస్తున్నారు మరియు ముష్రికులను సంతోషపెట్టటానికి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల కన్న సన్మార్గంపై ఉన్నారని చెప్పేవారు.
(52) ఈ చెడు విశ్వాసాలను కలిగిన వారందరిని అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేస్తాడు. మరియు ఎవరినైతే అల్లాహ్ గెంటివేస్తాడో అతని కొరకు నీవు ఎవరిని సహాయం చేయటానికి సహాయకుడిగా పొందవు.
(53) రాజ్యములో ఏ మాత్రం భాగం వారి కొరకు లేదు. ఒక వేళ వారి కొరకు అది ఉంటే వారు అందులో నుంచి ఏ మాత్రం ఎవరికీ ఇవ్వరు. ఒక వేళ అది ఖర్జూరపు టెంకపై ఉన్న చీలిక పరిమాణంలో ఉన్నా కూడా.
(54) లేదా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులపై వారికి అల్లాహ్ ఏదైతే దైవదౌత్యము,విశ్వాసము,భూమిపై సాధికారత ప్రసాదించాడో ఆ విషయంలో అసూయపడుతున్నారా. అయితే వారు వారిపై ఎందుకు అసూయపడుతున్నారు వాస్తవానికి ఇబ్రాహీమ్ సంతతికి మేము అవతరింపబడిన గ్రంధమును అనుగ్రహించిన విషయం ముందే తెలుసు. మేము వారి వైపు గ్రంథము తప్ప ఇంకేమి అవతరింపజేయలేదు. మరియు మేము వారికి ప్రజలపై విశాల సామ్రాజ్యాధికారమును ప్రసాదించాము.
(55) గ్రంధవహుల్లోంచి అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంపై మరియు ఆయన సంతానములో నుంచి తన ప్రవక్తలపై అవతరింపజేసిన వాటిని విశ్వసించినవారున్నారు మరియు వారిలో నుండి ఆయనపై విశ్వాసం కనబరచటం నుండి విముఖత చూపినవారూ ఉన్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడినది ఏదైతే ఉన్నదో దాని నుండి వారి స్థానం ఇది. మరియు నరకాగ్నియే వారిలో నుండి తిరస్కరించిన వారి కొరకు సరిఅగు శిక్ష.
(56) నిశ్ఛయంగా మా ఆయతులను తిరస్కరించిన వారిని మేము ప్రళయదినమున నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాము అది వారిని చుట్టుముట్టుతుంది. వారి చర్మములు కాలిపోయినప్పుడల్లా మేము వారికి వేరే చర్మములను మార్చి వేస్తాము వారిపై శిక్ష పదేపదే కొనసాగటానికి. నిశ్ఛయంగా అల్లాహ్ ఏదీ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తాను పర్యాలోచన చేసి తీర్పునిచ్చే దాని విషయంలో వివేచనాపరుడు.
(57) మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో మరియు ఆయన ప్రవక్తలను అనుసరిస్తారో మరియు విధేయకార్యాలు చేస్తారో వారిని మేము తొందరలోనే ప్రళయదినమున స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాము వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తుంటాయి. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. వారి కొరకు ఈ స్వర్గ వనాల్లో ప్రతీ వ్యర్ధము నుండి పరిశుద్ధులైన భార్యలుంటారు. మరియు మేము వారిని విస్తారమైవ దట్టమైన నీడలో ప్రవేశింపజేస్తాము. అందులో ఎటువంటి వేడి ఉండదు మరియు చల్లదనం ఉండదు.
(58) నిశ్ఛయంగా మీకు ఏదైతే అమానత్ గా అప్పజెప్పబడిందో దాన్ని వారి హక్కుదారులకు చేరవేయమని అల్లాహ్ మీకు ఆదేశిస్తున్నాడు. మరియు మీరు ప్రజల మధ్య తీర్పు ఇచ్చినప్పుడు మీరు న్యాయంగా వ్వహరించాలని మరియు తీర్పునివ్వటంలో మీరు దుర్మార్గం వైపుకు మరలకూడదని మీకు ఆదేశించాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు ఏదైతే హితబోధన చేస్తున్నాడో మరియు మీ స్థితులన్నింటిలో దేని వైపునైతే ఆయన మీకు మార్గనిర్దేశకం చేస్తున్నాడో ఎంతో గొప్పది. నిశ్చయంగా అల్లాహ్ మీ పలుకులను బాగా వినేవాడును మరియు మీ కర్మలను బాగా చూసేవాడును.
(59) ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి విధేయత చూపండి. మరియు మీ వ్యవహారాల సంరక్షకులకు వారు అవిధేయత గురించి ఆదేశించనంత వరకు విధేయత చూపండి. ఒక వేళ మీరు ఏదైన విషయంలో విభేదించుకుంటే ఆ విషయంలో మీరు అల్లాహ్ గ్రంధం వైపునకు మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ వైపునకు మరలండి ఒక వేళ మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినంను విశ్వసించినవారే అయితే. గ్రంధం వైపునకు మరియు సున్నత్ వైపునకు ఈ మరలటం విభేధమును పొడిగించి,అభిప్రాయాలు చెప్పటం కంటే మేలైనది మరియు మీ కొరకు ఉత్తమ పర్యవసానం కలది.
(60) ఓ ప్రవక్త మీపై మరియు మీ కన్న పూర్వ ప్రవక్తలపై అవతరింపబడిన దాన్ని విశ్వసించామని అబద్దము పలికే యూద కపటుల వైరుధ్యమును మీరు చూడలేదా. వారు తమ తగాదాల్లో మానవుడు తయారు చేసుకున్న అల్లాహ్ ధర్మబద్ధం చేయని వాటి ద్వారా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి వారు దాన్ని తిరస్కరించాలని ఆదేశించబడ్డారు. మరియు షైతాను వారు సన్మార్గం పొందకుండా సత్యము నుండి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు.
(61) మరియు ఈ కపటులందరితో మీరు అల్లాహ్ తన గ్రంధంలో అవతరించిన ఆదేశం మరియు ప్రవక్త వైపునకు రండి మీ తగాదాల్లో మీ మధ్య ఆయన తీర్పు ఇవ్వటానికి అని పలకబడినప్పుడు. ఓ ప్రవక్తా మీరు వారిని చూస్తారు వారు మీ నుండి పూర్తిగా విముఖత చూపి తీర్పు కొరకు ఇతరుల వద్దకు వెళ్ళిపోతారు.
(62) కపటుల పరిస్థితి ఏమవుతుంది వారు పాల్పడిన పాపముల వలన వారిపై ఆపద వచ్చిపడినప్పుడు. ఆ తరువాత ఓ ప్రవక్త వారు మీ వద్దకు వంకలు చూపుతూ,అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తూ మేము మిమ్మల్ని వదిలి ఇతరులను తీర్పు ఇవ్వటానికి చేసుకున్నది కేవలం మేలును మరియు తగాదా పడిన వారి మధ్య కలపటమును మాత్రమే మా ఉద్దేశము అని పలుకుతూ వస్తారు. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలుకుతున్నారు. నిశ్చయంగా మేలన్నది అల్లాహ్ ధర్మ శాస్త్రం పరంగా ఆయన దాసులపై తీర్పు నివ్వటంలో ఉన్నది.
(63) వారందరి హృదయంలో దాగి ఉన్న కపటత్వము మరియు దురఉద్ధేశము అల్లాహ్ కు తెలుసు. అయితే ఓ ప్రవక్త వారిని వదిలివేయండి. మరియు వారి నుండి విముఖత చూపండి. మరియు అల్లాహ్ ఆదేశమును వారికి ఆశ చూపిస్తూ,భయపెడుతూ స్పష్టం చేయి. మరియు వారి మనస్సులలో పాతుకుపోయే మాటను వారికి చెప్పు.
(64) మరియు మేము ఏ ప్రవక్తను పంపించిన అల్లాహ్ ఇచ్చతో మరియు ఆయన విధి వ్రాతతో ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనకు విధేయత చూపటానికి మాత్రమే. మరియు ఒక వేళ వారు పాపములకు పాల్పడి తమ మనస్సులపై హింసకు పాల్పడినప్పుడు ఓ ప్రవక్తా వారు మీ జీవితంలో తాము పాల్పడిన వాటిని అంగీకరిస్తూ,సిగ్గుపడుతూ,పశ్చాత్తాప్పడుతూ, అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటే. మరియు మీరు వారి కొరకు మన్నింపును వేడుకుంటే వారు అల్లాహ్ ను వారి పశ్చాత్తాపమును అంగీకరించేవాడిగా మరియు వారిపై కరుణించేవాడిగా పొందుతారు.
(65) ఈ కపటులందరు భావించినట్లు విషయం కాదు. ఆ పిదప మహోన్నతుడైన అల్లాహ్ తన స్వయంపై ప్రమాణం చేసి చెబుతున్నాడు వారు తమ మధ్య చెలరేగే విభేదాల్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన జీవించి ఉన్నప్పుడు మరియు ఆయన మరణం తరువాత ఆయన ధర్మశాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుని ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు నుండి సంతుష్టపడేంత వరకు నిజమైన విశ్వాసపరులు కాలేరు. మరియు దాని నుండి వారి హృదయములలో ఎటువంటి ఇబ్బంది గాని,దాని విషయంలో సందేహం గాని కలగకూడదు. మరియు తమ బాహ్యములను,తమ అంతర్గతములను పాటించే విషయంలో పరిపూర్ణంగా అంగీకరించాలి.
(66) ఒక వేళ మేము వారిపై ఒకరినొకరు హతమార్చటమును లేదా వారి ఇండ్ల నుండి వైదొలగిపోవటమును అనివార్యం చేస్తే వారిలో నుండి చాలా కొద్ది మంది మా ఆదేశమును పాటించేవారు. అల్లాహ్ వారికి కష్టమైన దాని బాధ్యత ఇవ్వలేదు కనుక వారు అల్లాహ్ స్థుతులను పలకాలి. ఒక వేళ వారు తమకు బోధించబడిన అల్లాహ్ విధేయతను పాటించి ఉంటే అది విభేదించటం కన్నా మేలైనది. మరియు వారి విశ్వాసమును మరింత దృఢం చేసేది. మరియు మేము మా వద్ద నుండి వారికి గొప్ప ప్రతిఫలమును ఇస్తాము. మరియు మేము అల్లాహ్ వైపునకు మరియు ఆయన స్వర్గం వైపునకు చేరవేసే మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించేవారము.
(67) ఒక వేళ మేము వారిపై ఒకరినొకరు హతమార్చటమును లేదా వారి ఇండ్ల నుండి వైదొలగిపోవటమును అనివార్యం చేస్తే వారిలో నుండి చాలా కొద్ది మంది మా ఆదేశమును పాటించేవారు. అల్లాహ్ వారికి కష్టమైన దాని బాధ్యత వారికి ఇవ్వలేదు కనుక వారు అల్లాహ్ స్థుతులను పలకాలి. ఒక వేళ వారు తమకు బోధించబడిన అల్లాహ్ విధేయతను పాటించి ఉంటే అది విభేధించటం కన్న మేలైనది. మరియు వారి విశ్వాసమును మరింత దృఢం చేసేది. మరియు మేము మా వద్ద నుండి వారికి గొప్ప ప్రతిఫలమును ఇస్తాము. మరియు మేము అల్లాహ్ వైపునకు మరియు ఆయన స్వర్గం వైపునకు చేరవేసే మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించేవారము.
(68) ఒక వేళ మేము వారిపై ఒకరినొకరు హతమార్చటమును లేదా వారి ఇండ్ల నుండి వైదొలగిపోవటమును అనివార్యం చేస్తే వారిలో నుండి చాలా కొద్ది మంది మా ఆదేశమును పాటించేవారు. అల్లాహ్ వారికి కష్టమైన దాని బాధ్యత వారికి ఇవ్వలేదు కనుక వారు అల్లాహ్ స్థుతులను పలకాలి. ఒక వేళ వారు తమకు బోధించబడిన అల్లాహ్ విధేయతను పాటించి ఉంటే అది విభేధించటం కన్న మేలైనది. మరియు వారి విశ్వాసమును మరింత దృఢం చేసేది. మరియు మేము మా వద్ద నుండి వారికి గొప్ప ప్రతిఫలమును ఇస్తాము. మరియు మేము అల్లాహ్ వైపునకు మరియు ఆయన స్వర్గం వైపునకు చేరవేసే మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించేవారము.
(69) మరియు ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విధేయత చూపుతాడో వాడు స్వర్గ ప్రవేశముతో అల్లాహ్ అనుగ్రహించిన దైవ ప్రవక్తలతో పాటు మరియు దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించి దాని ప్రకారం ఆచరించిన సత్యసందులతో పాటు మరియు అల్లాహ్ మార్గములో యుద్ధం చేసిన అమరవీరులతో పాటు మరియు తమ అంతర,బాహ్యాలు సరై,వారి ఆచరణలు సరిగా ఉన్న సద్వర్తనులతో పాటు ఉంటాడు. స్వర్గంలో వారందరితో సాంగత్యం ఉండటం ఎంత మంచిది.
(70) ఈ ప్రస్తావించబడిన ప్రతిఫలము తన దాసులపై అల్లాహ్ వద్ద నుండి అనుగ్రహము. వారి స్థితులను తెలుసుకునేవాడిగా అల్లాహ్ చాలు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(71) ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించిన వారా మీరు మీ శతృవుల నుండి వారితో యద్దమునకు సహాయ కారకాలను ఏర్పరచుకుని జాగ్రత్తపడండి. కావున మీరు వారి వైపునకు సమూహముల తరువాత సమూహములుగా లేదా అందరు కలసికట్టుగా బయలుదేరండి. ఇదంతా మీ ప్రయోజనం దేనిలో ఉన్నదో దాని బట్టి మరియు మీ శతృవులపై ఆధిక్యత దేనిలో ఉన్నదో దాని బట్టి ఉంటుంది.
(72) ఓ ముస్లిములారా నిశ్చయంగా మీలో తమ పిరికితనం వలన మీ శతృవులతో యుద్ధం చేయుట కొరకు బయలుదేరటం నుండి వెనుక ఉండిపోయే జనులున్నారు. మరియు ఇతరుల నుండి వెనుక ఉండిపోయేవారున్నారు. మరియు వారు కపటులు,బలహీన విశ్వాసం కలవారు. ఒక వేళ మీకు మరణం లేదా ఓటమి కలిగితే వారిలో నుంచి ఒకడు తాను భద్రంగా ఉండటంపై సంతోషపడుతూ ఇలా పలుకుతాడు : నిశ్చయంగా అల్లాహ్ నా పై అనుగ్రహించాడు అందుకనే నేను వారితోపాటు యుద్దంలో పాల్గొనలేదు. లేకపోతే వారికి కలిగినది నాకూ కలిగేది.
(73) ఓ ముస్లిములారా ఒక వేళ మీకు అల్లాహ్ వద్ద నుండి ఏదైన సహాయం ద్వారా లేదా యుద్ద ప్రాప్తి ద్వారా అనుగ్రహం కలిగితే ధర్మపోరాటం నుండి వెనుక ఉండిపోయిన ఇతడు మీలో నుండి ఒకడు కానట్లుగా మరియు మీ మధ్య,అతని మధ్య ప్రేమ,సాంగత్యం లేనట్లుగా తప్పకుండా ఇలా పలుకుతాడు : అయ్యో నేను కూడా వారితో పాటు వారి యుద్దంలో ఉంటే బాగుండేది. అప్పుడు నేను కూడా వారు గెలుచుకున్న గొప్పతనమును గెలుచుకునేవాడిని.
(74) కావున అతను అల్లాహ్ వాక్కు (కలిమ) ఉన్నత శిఖరాలకు చేరటానికి అల్లాహ్ మార్గంలో పోరాడాలి. సత్య విశ్వాసులు వారే ఎవరైతే పరలోకమునకు బదులుగా దానిపై ఆశతో ఇహలోక జీవితమును దానిపై అయిష్టత వలన అమ్మివేస్తారు. మరియు ఎవరైతే అల్లాహ్ కలిమ ఉన్నత శిఖరాలకు చేరటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి అమరగతి పొంది వదించబడుతాడో లేదా తన శతృవుపై ఆధిక్యతను చూపి,అతనిపై విజయం పొందుతాడో అతనికి అల్లాహ్ తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అది స్వర్గము మరియు అల్లాహ్ మన్నత.
(75) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చుటకు మరియు బలహీనులైన పురుషులు,స్త్రీలు మరియు పిల్లలకు ఎవరైతే ఇలా పలుకుతూ : ఓ మా ప్రభూ మక్కా నుండి మమ్మల్ని బయటకు తీయి అక్కడి వాసులు అల్లాహ్ కి సాటి కల్పించి,ఆయన దాసులపై హద్దుమీరి ప్రవర్తించి దుర్మార్గమునకు పాల్పడటం వలన,మరియు నీ వద్ద నుండి మా వ్యవహారమును దాక్షిణ్యం ద్వారా,పరిరక్షణ ద్వారా పరిరక్షించే వారిని,మా నుండి నష్టమును తొలగించే సహాయకుడిని నియమించు అని అల్లాహ్ తో వేడుకుంటున్నారో వారికి విముక్తి కలిగించటం కొరకు ఆయన మార్గంలో ధర్మపోరాటం చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది.
(76) సత్యసందులైన విశ్వాసపరులు అల్లాహ్ మార్గంలో ఆయన వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చటం కొరకు పోరాడుతారు. మరియు అవిశ్వాసపరులు తమ అసత్య దైవాల మార్గంలో పోరాడుతారు. కావున మీరు షైతాను యొక్క సహాయకులతో పోరాడండి. నిశ్చయంగా మీరు ఒక వేళ వారితో పోరాడితే మీరే వారిపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఎందుకంటే షైతాను యోచన బలహీనమైనది. అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండేవారికి అది నష్టం కలిగించదు.
(77) ఓ ప్రవక్త తమపై ధర్మపోరాటం విధిగావించబడాలని నీతో కోరిన నీ కొందరి సహచరుల విషయం నీకు తెలియదా. అప్పుడు వారితో ఇలా పలకబడింది : మీరు మీ చేతులను యుద్దం నుండి ఆపుకోండి. మరియు నమాజు నెలకొల్పండి మరియు జకాత్ చెల్లించండి. మరియు ఇది ధర్మపోరాటం (జిహాద్) విధిగావించబడక ముందుది. ఎప్పుడైతే వారు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చారో మరియు (అప్పుడు) ఇస్లాంనకు ప్రబలత ప్రాప్తించింది మరియు యుధ్ధం విధిగావించబడింది. అది వారిలోని కొందరిపై భారమైనది. అప్పుడు వారు అల్లాహ్ తో భయపడినట్లు లేదా ఇంకా ఎక్కువ ప్రజలతో భయపడసాగారు. మరియు వారు ఇలా పలికారు : ఓ మా ప్రభూ యుద్ధమును మాపై ఎందుకు విధిగావించావు ?. ఎందుకని నీవు దాన్ని కొంతకాలం మేము ఇహలోకముతో ప్రయోజనం చెందేంత వరకు వెనుకకు చేయలేదు. ఓ ప్రవక్త మీరు వారితో ఇలా పలకండి : ఇహలోక సామగ్రి ఒక వేళ కొద్దిగా లభించినా తరిగిపోతుంది. మరియు పరలోకం మహోన్నతుడైన అల్లాహ్ తో భయపడే వారి కొరకు అందులో ఉన్న అనుగ్రహాలు శాశ్వతం కావటం వలన మేలైనది. మరియు మీ సత్కర్మల్లోంచి ఏదీ తరిగించబడదు. ఒక వేళ అది ఖర్జూరపు టెంకపై ఉండే దారం పరిమాణంలో ఉన్నా సరే.
(78) మీ సమయం ఆసన్నమైనప్పుడు మీరు ఎక్కడున్నా మీకు మరణం వచ్చి తీరుతుంది. ఒక వేళ మీరు యుద్ద మైదానము నుండి దూరంగా ఉన్న దృఢమైన భవనముల్లో ఉన్నా. ఒక వేళ ఈ కపటులకు వారికి సంతోషము కలిగించే సంతానము గాని,అధికంగా ఆహారోపాధి గాని కలిగితే వారు ఇది అల్లాహ్ వద్ద నుండి అని పలుకుతారు. ఒక వేళ వారికి సంతానములో లేదా ఆహారోపాధిలో బాధ కలిగితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అపశకునంగా భావిస్తారు. మరియు ఈ కీడు నీ వలన జరిగింది అని అనేవారు. ఓ ప్రవక్త వారందరిని ఖండిస్తూ ఇలా పలకండి : ఈ ప్రతీ ఆనందము,బాధ అల్లాహ్ నిర్ణయం మరియు ఆయన విధి వ్రాత వలన. ఈ మాటలు వెలువడే (మాట్లాడే) వీరందరు వారి కొరకు మీ మాటలను అర్ధం చేసుకోలేకపోతున్నారు ఎందుకు ?!
(79) ఓ ఆదమ్ కుమారుడా నీకు సంతోషము కలిగించే ఆహారోపాధి,సంతానము ఏదైతే నీకు లభించినదో అది అల్లాహ్ తరుపు నుంచి. దాన్ని ఆయన నీపై అనుగ్రహించాడు. మరియు నీ ఆహారోపాధిలో మరియు నీ సంతానములో నీకు బాధకలిగించేది ఏదైతే నీకు లభించినదో అది నీవు పాపములకు పాల్పడటం వలన నీ స్వయం తరుపు నుండి. ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మిమ్మల్ని ప్రజలందరి కొరకు అల్లాహ్ తరుపు నుండి వారికి మీ ప్రభువు సందేశమును చేరవేయుటకు ప్రవక్తగా పంపించాము. మరియు మీరు ఏదైతే ఆయన వద్ద నుండి చేరవేశారో ఆ విషయంలో మీ నిజాయితీపై ఆయన మీకు ప్రసాదించిన ఆధారాల ద్వారా,ఋజువుల ద్వారా సాక్షిగా అల్లాహ్ చాలు.
(80) ఎవరైతే ప్రవక్తకు ఆయన ఇచ్చిన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి విధేయత చూపుతాడో అతడు నిశ్చయంగా అల్లాహ్ ఆదేశమును స్వీకరించాడు. ఎవరైతే ఓ ప్రవక్తా మీకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడో అతనిపై మీరు దుఃఖించకండి. మేము మిమ్మల్ని అతనిపై పర్యవేక్షకుడిగా,అతని కర్మల రక్షకుడిగా పంపించలేదు. మేము మాత్రం అతని కర్మను షుమారుచేసి అతని లెక్క తీసుకునేవారము.
(81) మరియు కపటులు తమ నాలుకలతో మీతో ఇలా పలుకుతారు : మేము మీ ఆదేశముపై విధేయత చూపుతాము మరియు దానికి కట్టుబడి ఉంటాము. వారు మీ వద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు వారిలోని ఒక వర్గము మీకు బహిర్గతం చేసిన దానికి వ్యతిరేకంగా గోప్యంగా కుట్రలు పన్నుతుంది. వారు పన్నే కుట్రల గురించి అల్లాహ్ కు తెలుసు. మరియు తొందరలోనే ఆయన వారి ఈ కుట్రపై వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అయితే మీరు వారిని పట్టించుకోకండి. వారు మీకు ఎటువంటి హాని తలపెట్టలేరు. మరియు మీరు మీ వ్యవహారమును అల్లాహ్ కు అప్పజెప్పండి. మరియు ఆయన పై నమ్మకమును కలిగి ఉండండి. మీరు నమ్మకమును కలిగి ఉన్న అల్లాహ్ కార్యసాధకుడిగా చాలు.
(82) వీరందరు ఎందుకని ఖుర్ఆన్ లో యోచన చేయటం లేదు. మరియు అందులో ఎటువంటి వ్యతిరేకత గాని గందరగోళము గాని లేదని వారి కొరకు నిరూపించబడే వరకు దాన్ని చదవటం లేదు ?!. మరియు చివరికి మీరు తీసుకుని వచ్చినది సత్యమని వారు తెలుసుకుంటారు. మరియు ఒక వేళ అది అల్లాహేతరుల వద్ద నుంచి వచ్చి ఉంటే అందులో దాని ఆదేశముల్లో గందరగోళమును మరియు దాని అర్ధములలో చాలా వ్యతిరేకతను వారు పొందేవారు.
(83) మరియు ఈ కపటులందరికి ముస్లిములకు సంతోషమును కలిగించే విషయం లేదా వారికి భయమునకు,బాధకు గురి చేసే విషయం చేరినప్పుడు వారు దాన్ని బట్టబయలు చేసి,దాన్ని వ్యాపింపజేసేవారు. మరియు ఒక వేళ వారు వేచి ఉండి,విషయమును అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు,సలహా ఇచ్చే వారికి,జ్ఞానం కలవారికి,హితబోధన చేసేవారికి చేర్చి ఉంటే సలహా ఇచ్చేవారు,సంగ్రహించేవారు దాన్ని వ్యాపింపజేయటం అవసరమా లేదా దాన్ని గోప్యంగా ఉంచటం అవసరమా తెలుసుకునేవారు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన కారుణ్యము మీపై ఈ కపటులందరు గురిచేస్తున్న వాటి నుండి మిమ్మల్ని పరిరక్షించి ఉండకపోతే మీలో చాలా తక్కువ మంది తప్ప అందరు షైతాను దుష్ప్రేరణలను అనుసరించేవారు.
(84) ఓ ప్రవక్త మీరు అల్లాహ్ మార్గంలో ఆయన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చటానికి పోరాడండి. మరియు ఇతరుల గురించి మీకు ప్రశ్నించటం జరగదు. మరియు అది మీపై మోపబడదు. ఎందుకంటే యుద్ధం పై మీ స్వయమును ప్రేరేపించటం మాత్రమే మీపై బాధ్యత వేయబడింది. మరియు మీరు యుద్ధం విషయంలో విశ్వాసపరులను ప్రోత్సహించండి. మరియు వారిని దానిపై ప్రేరేపించండి. బహుశా అల్లాహ్ మీ యుద్ధం ద్వారా అవిశ్వాసపరుల బలమును తొలగించివేస్తాడు. మరియు అల్లాహ్ అంతులేని శక్తి గలవాడు మరియు తీవ్రంగా శిక్షించేవాడు.
(85) ఎవరైతే ఇతరుల కొరకు మంచి తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పుణ్యంలో భాగముండును. మరియు ఎవరైతే ఇతరుల కొరకు కీడును తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పాపంలో భాగముండును. మరియు మనిషి చేసే ప్రతీ దానిపై అల్లాహ్ సాక్షిగా ఉంటాడు. మరియు తొందరలోనే దాని ప్రకారంగా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అయితే మీలో నుండి ఎవరైతే మంచిని సాధించటంలో కారణం అవుతాడో అతని కొరకు అందులో భాగము,వంతు ఉంటుంది. మరియు ఎవరైతే చెడును సాధించటంలో కారణం అవుతాడో అతడు అందులో నుంచి ఏదైన పొందుతాడు.
(86) మీకు ఎవరైన సలాం చేసినప్పుడు అతను మీకు సలాం చేసిన దాని కన్న ఉత్తమ రీతిలో అతనికి ప్రతిసలాం చేయండి లేదా అతను పలికిన విధంగా అతనికి ప్రతిసలాం చేయండి. మరియు ఉత్తమరీతిలో ప్రతిసలాం చేయటం మంచిది. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసే కార్యాలపై సంరక్షకుడు. మరియు ఆయన ప్రతి ఒక్కరికి అతని కర్మపరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(87) అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. ఎటువంటి సందేహం లేని ప్రళయదినమున ఆయన మీలోని మొదటి వారిని మరియు మీ చివరి వారిని మీ కర్మలపై మీకు ప్రతిఫలం ప్రసాదించటానికి తప్పకుండా సమావేశపరుస్తాడు. మాటపరంగా అల్లాహ్ కన్నా ఎక్కువ సత్యవంతుడు ఎవడూ లేడు.
(88) ఓ విశ్వాసపరులారా మీ విషయమేమిటి? కపటవిశ్వాసులతో వ్యవహరించే విషయంలో విభేదించుకున్న రెండు వర్గములుగా అయిపోయారు. ఒక వర్గము వారి అవిశ్వాసం వలన వారితో యుద్ధం చేయాలని అంటుంది. మరియు ఒక వర్గము వారి విశ్వాసం వలన వారితో యుద్ధంను వదిలివేయాలని అంటుంది ?. వారి విషయంలో మీరు విభేదించుకోవటం మీకు తగదు. మరియు అల్లాహ్ వారి కర్మల వలన వారిని అవిశ్వాసం,అపమార్గం వైపునకు మరల్చాడు. ఏమీ అల్లాహ్ సత్యం వైపునకు భాగ్యం కలిగించని వారిని మీరు సన్మార్గం చూపదలచారా ? అల్లాహ్ ఎవరినైతే అపమార్గమునుకు గురి చేస్తాడో అతని కొరకు నీవు సన్మార్గం వైపునకు మార్గం పొందలేవు.
(89) కపటులు ఒక వేళ మీపై అవతరించిన దాన్ని వారు తిరస్కరించినట్లే మీరూ తిరస్కరిస్తే మీరు అవిశ్వాసంలో వారితో పాటు సమానులవుతారని కోరుకుంటున్నారు. కావున వారు తమ విశ్వాసమునకు సూచనగా షిర్క్ ప్రాంతము నుండి ఇస్లాం ఉన్న ప్రాంతములకు హిజ్రత్ చేయనంతవరకు మీరు వారితో ఉన్న శతృత్వం వలన వారిని స్నేహితులుగా చేసుకోకండి. ఒక వేళ వారు విముఖత చూపి తమ స్థితిపై కొనసాగితే వారిని మీరు ఎక్కడ పొందితే అక్కడ పట్టుకుని చంపండి. మరియు మీ వ్యవహారాలకు బాధ్యతవహించే సంరక్షకులుగా,మీ శతృవులకు వ్యతిరేకంగా మీకు సహాయం చేసే మద్దతుదారులుగా వారిలో నుండి మీరు చేసుకోకండి.
(90) కాని వారిలో నుండి ఎవరైతే ఆ జాతి ప్రజల వద్దకు చేరారో మీకూ వారికీ మధ్య యుద్ధము వదిలివేసే విషయం పై దృఢ ఒప్పందం ఉంటే లేదా మీ వద్దకు ఎవరైతే వచ్చారో వారి హృదయములు కుదించిపోయి వారు మీతో గాని లేదా తమ జాతి వారితో యుద్దము చేయటమును కోరటం లేదో వారికి ఈ ఆదేశం నుండి మినహాయింపు ఉంది. ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే వారికి మీపై ఆధిక్యతను ప్రసాదించేవాడు అప్పుడు వారు మీతో యుద్ధం చేసేవారు. కావున మీరు అల్లాహ్ నుండి ఆయన ప్రసాదించిన శ్రేయస్సును అంగీకరించండి. మరియు చంపడం మరియు బంధించడం ద్వారా మీరు వారితో తలపడకండి. ఒక వేళ వారు మీ నుండి మరలిపోతే వారు మీతో పోరాడరు. మరియు వారు మీతో యుద్ధంను వదిలి వేస్తూ సంధి చేసుకుంటూ మీ వైపునకు వస్తారు. కావున అల్లాహ్ వారిని హతమార్చటానికి లేదా వారిని బంధీ చేయటానికి మీకు వారిపై మార్గం చేయలేదు.
(91) ఓ విశ్వాసపరులారా తొందరలోనే మీరు కపటుల్లోంచి ఇంకో వర్గమును పొందుతారు. వారు మీ ముందట విశ్వాసమును బహిర్గతం చేస్తారు తమ స్వయంపై శాంతి పొందటానికి మరియు తమ జాతి వారిలోంచి అవిశ్వాసపరుల ముందు వారి వైపు మరలినప్పుడు వారి నుండి శాంతి పొందటానికి అవిశ్వాసమును బహిర్గతం చేస్తారు. అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచటం వైపునకు మరియు ఆయనతో పాటు సాటి కల్పించటం వైపునకు వారు పిలవబడినప్పుడల్లా వారు అందులో తీవ్రంగా పడిపోయేవారు. వీరందరు మీతో యుద్దమును వదలకుండా, మీతో సంధీకి రాకుండా,మీ నుండి తమ చేతులను ఆపనప్పుడు మీరు వారిని ఎక్కడ పొందితే అక్కడ పట్టుకుని వారిని సంహరించండి. మరియు వీరందరి ఈ లక్షణమును మేము మీకు వారిని పట్టుకుని సంహరించటానికి స్పష్టమైన వాదనగా చేశాము. వారి విశ్వాసఘాతకానికి మరియు వారి కుట్రకి.
(92) మరియు ఒక విశ్వాసిని సంహరించటం ఇంకొక విశ్వాసికి తగదు. కాని అది అతని నుండి పొరపాటున జరిగితే తప్ప. మరియు ఎవరైతే ఒక విశ్వాసిని పొరపాటున సంహరిస్తారో తన చర్య వలన అతడు ఒక విశ్వాస బానిసను పరిహారంగా విడుదల చేయటం అతనిపై అనివార్యము. మరియు హంతకుని వారసులైన అతని దగ్గరి బంధువులపై హతుడి వారసులకు రక్తపరిహారం ఇవ్వటం తప్పనిసరి. కాని వారు రక్తపరిహారమును మన్నించి వేస్తే ఆ ఆదేశం తొలగిపోతుంది. ఒక వేళ హతుడు మీతో పోరాడేవారి జాతి నుండి అయి,విశ్వాసపరుడైతే అప్పుడు హంతకునిపై ఒక విశ్వాసపర బానిసను విడుదల చేయటం తప్పనిసరి. మరియు అతనిపై రక్తపరిహారం ఉండదు. మరియు ఒక వేళ హతుడు విశ్వాసపరుడు కాకుండా ఉంటే,కాని అతడు జిమ్మీల వలె మీకు వారికి మధ్య ఒప్పందం ఉన్న వారికి చెందినవాడైతే అప్పుడు హంతకుని వారసులైన అతని దగ్గరి బంధువులపై హతుడి వారసులకు రక్తపరిహారం ఇవ్వటం తప్పనిసరి. మరియు హంతకుడిపై అతని చర్య వలన పరిహారంగా ఒక విశ్వాసపర బానిసను విడుదల చేయటం తప్పనిసరి. ఒక వేళ అతడు తాను విడుదల చేయవలసిన బానిసను పొందకపోతే లేదా దాని వెలను తీర్చలేకపోతే అతడు రెండు నెలల ఉపవాసములు నిరంతరం,అంతరాయం లేకుండా ఉండాలి. వాటిని మధ్యలో వదలకూడదు. అతను పాల్పడిన దాన్ని అల్లాహ్ మన్నించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల కర్మల గురించి వారి సంకల్పాల గురించి బాగా తెలిసినవాడు మరియు తన శాసనంలో,నిర్వహణలో విజ్ఞత కలవాడు.
(93) మరియు ఎవరైన ఉద్దేశపూర్వకంగా అన్యాయంగా ఒక విశ్వాసపరుడిని హతమారిస్తే అతని ప్రతీకారం నరకంలో శాశ్వతంగా ప్రవేశమే. ఒక వేళ అతను దాన్ని సమ్మతం అనుకుంటే లేదా అతను పశ్ఛాత్తాప్పడకపోతే. అతనిపై అల్లాహ్ ఆగ్రహం కలుగును. మరియు ఆయన అతడిని తన కారుణ్యము నుండి గెంటివేస్తాడు. మరియు అతడు ఈ పెద్ద పాపమునకు పాల్పడటం వలన అతని కొరకు ఆయన పెద్ద శిక్షను సిద్ధపరిచాడు.
(94) ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ మార్గంలో జిహాద్ కొరకు బయలు దేరినప్పుడు మీరు పోరాడవలసిన వారి విషయంలో నిజనిజాలు నిర్ధారించుకోండి. తన ఇస్లాంపై సూచించే వాటిని మీ ముందట బహిర్గతం చేసిన వారిని మీరు "నీవు విశ్వాసపరుడివి కావు,నీ రక్తంపై,నీ సంపదపై ఉన్న భయం ఇస్లాంను బహిర్గతం చేయటంపై నిన్ను పురిగొల్పింది" అని అనకండి. మీరు అతడి హత్య ద్వారా అతని నుండి యుద్ధధనం (గనీమత్) లాంటి తుచ్ఛమైన ఇహలోక సంపదను ఆశిస్తూ అతడిని హతమారుస్తున్నారు. అల్లాహ్ వద్ద చాలా యుద్దధనం కలదు. అది దీనికన్నా ఎంతో మేలైనది మరియు గొప్పది. తన జాతి వారి నుండి తన విశ్వాసమును దాచిన ఇతని లాగే మీరు ముందు ఉండేవారు. అయితే అల్లాహ్ ఇస్లాం ద్వారా మీపై ఉపకారం చేశాడు. మరియు మీ రక్తములను పరిరక్షించాడు. కాబట్టి మీరు నిజనిజాలు నిర్ధారించుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ పై మీ కర్మల్లోంచి ఏదీ గోప్యంగా లేదు ఒక వేళ అది ఎంత సున్నితమైనదైనా. మరియు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలంను ప్రసాదిస్తాడు.
(95) రోగాలు,అంధులు లాంటి కారణాలు లేని వారు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయిన విశ్వాసులు మరియు తమ సంపదలను,తమ ప్రాణములను ఖర్చు చేసి అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు సమానులు కాజాలరు. తమ సంపదలను,తమ ప్రాణములను ఖర్చు చేసి ధర్మపోరాటం చేసే వారిని ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారిపై అల్లాహ్ స్థాన పరంగా ఉన్నతం చేశాడు. ధర్మ పోరాటకుల్లోంచి మరియు ఏదైన కారణం చేత ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారికి ప్రతి ఒక్కరి కొరకు వారికి తగినటువంటి ప్రతిఫలం కలదు. మరియు అల్లాహ్ ధర్మపోరాటకులకు తన వద్ద నుండి గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ధర్మపోరాటం నుండి కూర్చుండిపోయే వారిపై ఉన్నతం చేశాడు.
(96) ఈ ప్రతిఫలం కొందరి స్థానాలు కొందరిపై వారి పాపముల మన్నింపుతో మరియు వారిపై ఆయన కారుణ్యముతో ఉంటాయి. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
(97) నిశ్చయంగా దైవదూతలు అవిశ్వాసమున్న ప్రదేశము నుండి విశ్వాసమున్న ప్రదేశమునకు వలసపోవటంను వదిలివేసి తమ స్వయమునకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణములు తీస్తారు. వారి ఆత్మలను సేకరించే పరిస్థితిలో వారితో దైవదూతలు మందలిస్తూ ఇలా పలుకుతారు : మీరు ఏ స్థితిలో ఉండేవారు ?. మరియు మీరు దేనితో ముష్రికుల నుండి వేరు చేసుకున్నారు ?. అప్పుడు వారు సాకులు చూపుతూ ఇలా జవాబిస్తారు : మేము బలహీనులముగా ఉండేవారము. మేము మా ప్రాణముల నుండి తొలగించటానికి మాకు ఎటువంటి శక్తి గాని సామర్ధ్యము గానీ లేదు. అప్పుడు దైవ దూతలు వారిని మందలిస్తూ ఇలా పలుకుతారు : అవమానము నుండి,ఆధిక్యత నుండి మీ ధర్మమును,మీ ప్రాణములను మీరు రక్షించుకోవటానికి మీరు వలస వెళ్ళటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేదా ?. వలస వెళ్ళని వీరందరు నివాసముండే శరణాలయం నరకాగ్నే. మరియు ఆ మరలే చోటు మరియు వారి నివాసము చెడ్డదైనది.
(98) అన్యాయమును,అణచివేతను తమ నుండి తొలగించుకునే శక్తి లేని,తమ అణచివేతను వదిలించుకోవటానికి మార్గం పొందని కారణాలు కలిగిన బలహీనులైన పురుషులు,స్త్రీలు,పిల్లలు ఈ శిక్ష నుండి మినహాయించబడతారు. వీరందరిని అల్లాహ్ తన కారుణ్యముతో మరియు తన దయతో మన్నించివేస్తాడేమో. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిలో నుండి పశ్చాత్తాప్పడేవారిని క్షమించేవాడును.
(99) అన్యాయమును,అణచివేతను తమ నుండి తొలగించుకునే శక్తి లేని,తమ అణచివేతను వదిలించుకోవటానికి మార్గం పొందని కారణాలు కలిగిన బలహీనులైన పురుషులు,స్త్రీలు,పిల్లలు ఈ శిక్ష నుండి మినహాయించబడతారు. వీరందరిని అల్లాహ్ తన కారుణ్యముతో మరియు తన దయతో మన్నించివేస్తాడేమో. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిలో నుండి పశ్చాత్తాప్పడేవారిని క్షమించేవాడును.
(100) మరియు ఎవరైతే అవిశ్వాసమున్న ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశము వైపునకు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ హిజ్రత్ చేసి వెళ్తాడో అతడు తాను హిజ్రత్ చేసి వెళ్ళిన భూమిలో మార్పును మరియు తాను వదిలి వచ్చిన భూమికి వేరుగా భూమిని పొందుతాడు. అందులో అతడు గౌరవమును మరియు విశాలమైన ఆహారోపాధిని పొందుతాడు. మరియు ఎవరైతే తన నివాసము నుండి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకు హిజ్రత్ చేస్తూ బయలుదేరుతాడో ఆ పిదప అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరక ముందే అతనికి మరణం సంభవిస్తే నిశ్చయంగా అతని పుణ్యం అల్లాహ్ వద్ద నిరూపితమై ఉంటుంది. మరియు అతను తన హిజ్రత్ చేసే ప్రదేశమునకు చేరలేదని ఆయన అతనికి నష్టం కలిగించడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడిన వారికి మన్నించే వాడును,వారిపై కరుణించేవాడును.
(101) మరియు మీరు భూమిపై ప్రయాణిస్తే, నాలుగు రాకాత్ ల నుండి రెండు రాకాత్ ల వరకు నాలుగు రకాతుల నమాజును ఖసర్ చేయటంలో మీకు ఏ పాపమూ లేదు, అవిశ్వాసులచే ద్వేషించబడినదేదైనా మిమ్మల్ని తాకుతుందని మీరు భయపడితే. మీకు అవిశ్వాసుల శత్రుత్వం ఒక స్పష్టమైన ప్రత్యక్షమైన శత్రుత్వం, మరియు శాంతి పరిస్థితిలో ప్రయాణంలో ఖసర్ చేయటం సమ్మతం అన్న విషయం సరైన సున్నత్ ద్వారా నిరూపించబడింది.
(102) ఓ ప్రవక్త శతృవులతో పోరాడే సమయంలో మీరు సైన్యంలో ఉన్నప్పుడు మీరు వారికి నమాజు చదివించదలిస్తే మీరు సైన్యమును రెండు వర్గములుగా విభజించండి. వారిలో నుండి ఒక వర్గము మీతో పాటు నమాజు చేస్తూ నిలబడుతుంది. వారు తమ నమాజులో తమతో పాటు తమ అస్త్రములను తీసుకుని నిలబడాలి. ఇంకో వర్గము మీకు సంరక్షణగా నిలబడాలి. మొదటి వర్గము ఇమామ్ తో ఒక రకాత్ ను చదివినప్పుడు స్వయంగా నమాజును పూర్తి చేసుకోవాలి. వారు నమాజ్ చదివినప్పుడు వారు మీ వెనుక నుండి శతృవులకు అభిముఖమైపోవాలి. మరియు నమాజ్ చదవకుండా సంరక్షణలో నిలబడిన వర్గము వచ్చి ఇమామ్ తో ఒక రకాత్ ను పూర్తి చేసుకోవాలి. ఇమామ్ సలాం తిరిగినప్పుడు వారు తమ మిగిలిన నమాజును పూర్తి చేసుకోవాలి. మరియు వారు తమ శతృవుల నుండి తమ రక్షణను ఏర్పాటు చేసుకోవాలి. మరియు వారు తమ అస్త్రములను ఎత్తుకుని ఉండాలి. ఎందుకంటే నిశ్చయంగా అవిశ్వాసపరులు మీరు మీ అస్త్రముల నుండి మరియు మీ సామానుల నుండి నిర్లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు నమాజు చేస్తున్నప్పుడు వారు మీపై ఒకేసారి దాడి చేస్తారు. వారు మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు. మరియు వర్షం వలన లేదా అనారోగ్యం,వేరే కారణం వలన మీకు బాధ కలిగితే మీరు మీ అస్త్రములను ఎత్తుకోకుండా దించివేయటంలో మీపై ఎటువంటి పాపం లేదు. మరియు మీరు మీ శక్తిని బట్టి మీ శతృవుల నుండి జాగ్రత్త వహించండి. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు వారిని అవమానపరిచే శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
(103) ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పూర్తి చేసుకున్నప్పుడు మీరు మీ అన్ని స్థితులలో నిలబడి,కూర్చుని,మీ ప్రక్కలపై వాలి తస్బీహ్ పలికి,స్థుతులను పలికి,లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి అల్లాహ్ స్మరణ చేయండి. మీ నుండి భయం తొలిగిపోయి మీకు ప్రశాంతత కలిగినప్పుడు మీరు నమాజును పూర్తిగా వాటి భాగములతో,వాటి విధులతో,వాటి ముస్తహబ్ లతో మీకు ఆదేశించబడిన విధంగా నెరవేర్చండి. నిశ్ఛయంగా నమాజు విశ్వాసపరులపై నియమిత వేళల్లో అనివార్యం చేయబడింది. దాన్ని ఎటువంటి కారణం లేకుండా ఆలస్యం చేయటం సమ్మతం కాదు. ఇది ప్రయాణంలో లేకుండా ఉన్నప్పుడు. ఇక ప్రయాణంలో ఉన్నప్పుడు మీ కొరకు సమీకరించటం ఖసర్ చేయటం కలదు.
(104) ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరుల్లోంచి మీ శతృవులను వెంబడించటంలో బలహీనపడకండి మరియు బద్దకించకండి. ఒక వేళ హతమార్చటం వలన,గాయపర్చటం వలన మీకు ఏదైతే సంభవించినదో దాని వలన మీరు బాధపడితే మీరు బాధపడినట్లే వారు అదే విధంగా బాధపడ్డారు. మీకు సంభవించినదే వారికీ సంభవించినది. కావున వారి సహనం మీ సహనం కన్నా గొప్పది కాకూడదు. ఎందుకంటే మీరు అల్లాహ్ నుండి వారు ఆశించని పుణ్యమును,సహాయమును,మద్దతును ఆశిస్తున్నారు. మరియు అల్లాహ్ తన దాసుల స్థితిగతులను తెలుసుకునేవాడు, తన కార్యనిర్వహణలో,తన ధర్మశాసనంలో వివేకవంతుడు.
(105) ఓ ప్రవక్త నిశ్చయంగా మేము సత్యంతో కూడిన ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేశాము. మీరు ప్రజల మధ్య వారి వ్యవహారాలన్నింటి విషయంలో మీ మనోవాంఛ గాని మీ అభిప్రాయము గాని కాకుండా మీకు అల్లాహ్ నేర్పించిన దానితో మరియు మీ మనస్సులో వేసిన మాటతో తీర్పు ఇవ్వటానికి. మరియు తమ స్వయం కొరకు మరియు తమ అమానతుల విషయంలో విశ్వాసఘాతకులైన వారి తరపు నుండి సత్యమును వారి కోరటం వలన వారి నుండి తొలగిస్తూ మీరు వాదించేవారు కాకండి.
(106) మరియు మీరు అల్లాహ్ తో మన్నింపును,క్షమాపణను కోరుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వారిని మన్నించేవాడును,వారి పై కరుణించేవాడును.
(107) ఆత్మద్రోహం చేసుకుని,తన ఆత్మద్రోహమును దాయటంలో అతిక్రమించే ఏ వ్యక్తి తరుపు నుండి కూడా మీరు వాదించకండి. మరియు అల్లాహ్ ఆత్మద్రోహమునకు పాల్పడే అసత్యపరులైన వారిని ఇష్టపడడు.
(108) వారు పాపమునకు పాల్పడినప్పుడు భయంతో,సిగ్గుతో ప్రజల నుండి దాచేవారు. మరియు అల్లాహ్ నుండి దాచలేరు. మరియు ఆయన వారిని చుట్టుముట్టటం ద్వారా వారితో ఉన్నాడు. తప్పు చేసిన వాడి తరుపు నుండి వాదించటం మరియు అమాయకులపై నిందమోపటం వంటివి, ఆయనకు ఇష్టం లేని మాటలను గోప్యంగా పర్యాలోచన చేసినప్పుడు వారి నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు అల్లాహ్ వారు గోప్యంగా,బహిరంగంగా చేసే వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి వారి కర్మల పరంగా ప్రతిఫలంను ప్రసాదిస్తాడు.
(109) ఇక్కడ మీరు - నేరం చేసే వీరందరి విషయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు మీరు వారి నిర్దోషత్వాన్ని నిరూపించటానికి,వారి నుండి శిక్షను తొలగించటానికి వారి తరుపు నుండి వాదిస్తున్నారు. అయితే ప్రళయదినమున వారి తరుపు నుండి అల్లాహ్ తో ఎవరు వాదిస్తారు. వాస్తవానికి వారి స్థితి గురించి ఆయనకు తెలుసు. మరియు ఆ దినమున వారి పై వక్తగా ఎవరు అవుతారు ? ఆ శక్తి ఎవరికీ లేదు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
(110) మరియు ఎవడైతే పాపమునకు పాల్పడుతాడో లేదా పాపములకు పాల్పడి తన స్వయంపై దుర్మార్గమునకు ఒడిగడతాడో ఆ పిదప తన పాపమును అంగీకరిస్తూ,దానిపై పశ్చాత్తాప్పడుతూ,దాన్ని తన నుండి తొలగిస్తూ అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటాడో అతడు అల్లాహ్ ను తన పాపమును మన్నించేవాడిగా,తనపై కరుణించేవాడిగా పొందుతాడు.
(111) ఎవరైన చిన్న లేదా పెద్ద పాపమునకు పాల్పడితే దాని శిక్ష అతని ఒక్కడికి మాత్రమే వర్తిస్తుంది, అతని నుండి ఇతరులకు వర్తించదు. మరియు దాసుల కర్మల గురించి అల్లాహ్ బాగా తెలిసినవాడు మరియు తన కార్యనిర్వహణలో,తన ధర్మశాసనంలో వివేకవంతుడు.
(112) మరియు ఎవడైతే అనాలోచితంగా పాపం చేస్తాడో లేదా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తాడో ఆ తరువాత ఆ పాపముతో ఒక అమాయక వ్యక్తిపై నిందమోపుతాడో అతడు తన ఆ కార్యం వలన తీవ్రమైన అబద్దమును,స్పష్టమైన పాపమును మోసినవాడవుతాడు.
(113) ఓ ప్రవక్తా మీ రక్షణ ద్వారా అల్లాహ్ అనుగ్రహం మీపై ఉండకపోతే తమ స్వయంపై విశ్వాసఘాతకమునకు పాల్పడిన వీరందరిలో నుంచి ఒక వర్గము మిమ్మల్ని సత్యం నుండి తప్పించటానికి పూనుకునేది. అప్పుడు మీరు అన్యాయంతో కూడకున్న తీర్పునిచ్చేవారు. వారు వాస్తవానికి తమ స్వయమును మాత్రమే అపమార్గమునకు లోను చేసుకున్నారు. ఎందుకంటే అపమార్గమునకు లోను చేసే ప్రయత్నం వారు ఏదైతే చేసారో దాని పరిణామం వారిపైనే మరలుతుంది. మరియు అల్లాహ్ మీ పై ఖుర్ఆన్ ను,సున్నత్ ను అవతరింపజేశాడు. మరియు మీకు ఇంతకు ముందు తెలియని సన్మార్గమును,వెలుగును ఆయన మీకు నేర్పించాడు. మరియు దైవదౌత్యముతో,రక్షణతో మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహం ఎంతో గొప్పది.
(114) ప్రజలను సంతోషం కలిగించే చాలా మాటల్లో ఎటువంటి మేలు లేదు మరియు దాని నుండి ఎటువంటి ప్రయోజనం లేదు. కాని ఒక వేళ వారి మాట ఏదైన దానధర్మం గురించి లేదా ధర్మం తీసుకుని వచ్చిన మరియు బుద్ధి నిర్దేశించిన మంచి గురించి లేదా ఇద్దరు తగాదా పడిన వారి మధ్య సయోధ్య వైపు పిలవటం గురించి ఆదేశం అయితే. ఎవరైతే అల్లాహ్ ప్రీతిని ఆశిస్తూ ఇలా చేస్తాడో మేము తొందరలోనే అతనికి గొప్ప పుణ్యమును ప్రసాదిస్తాము.
(115) మరియు ఎవరైతే తన ముందు సత్యం స్పష్టమైన తరువాత ప్రవక్తను విభేదిస్తాడో మరియు ఆయన తీసుకుని వచ్చిన దాని విషయంలో వ్యతిరేకిస్తాడో మరియు విశ్వాసపరుల మార్గమును కాకుండా ఇతరుల మర్గమును అనుసరిస్తాడో మేము అతన్ని మరియు అతను తన స్వయం కొరకు ఎంచుకున్న దాన్ని వదిలివేస్తాము. అతను ఉద్దేశపూర్వకంగా సత్యం నుండి విముఖత చూపటం వలన మేము అతనికి సత్యం యొక్క భాగ్యమును కలిగించము. మరియు మేము అతన్ని నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాము అతను దాని వేడిని అనుభవిస్తాడు. మరియు అది దాని నివాసుల కొరకు అతి చెడ్డ మరలే చోటు.
(116) నిశ్చయంగా అల్లాహ్ తనతో పాటు సాటి కల్పించటమును క్షమించడు. అంతేకాదు సాటి కల్పించే వారిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉంచుతాడు. మరియు షిర్కు కాకుండా ఇతర పాపములను తాను తలచిన వారి కొరకు తన కారుణ్యముతో మరియు తన అనుగ్రహముతో మన్నించివేస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పిస్తాడో అతడు సత్యం నుండి తప్పిపోయి,దాని నుండి చాలా దూరం వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతడు సృష్టికర్తను మరియు సృష్టిని సమానం చేశాడు.
(117) ఈ ముష్రికులందరు అల్లాహ్ తోపాటు ఆరాధిస్తున్న,పూజిస్తున్నవి లాత్,ఉజ్జా ల స్త్రీల పేర్లు పెట్టుకున్న విగ్రహాలు మాత్రమే. వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు,ఎటువంటి నష్టం లేదు. మరియు వారు వాస్తవానికి అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన షైతానును మాత్రమే ఆరాధిస్తున్నారు. అందులో ఎటువంటి మేలు లేదు. ఎందుకంటే అతడే వారికి విగ్రహాల ఆరాధన గురించి ఆదేశించాడు.
(118) మరియు ఇందుకనే అల్లాహ్ అతన్ని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు ఈ షైతాను తన ప్రభువుతో ప్రమాణం చేస్తూ ఇలా పలికాడు : నేను నీ దాసుల్లోంచి ఒక నియమిత భాగమును నా కొరకు చేసుకుంటాను వారిని నేను సత్యం నుండి తప్పించివేస్తాను.
(119) మరియు వారిని నీ సన్మార్గము నుండి నిరోధిస్తాను. మరియు వారి మార్గభ్రష్టతను వారి కొరకు అలంకరించి చూపే అబద్దపు వాగ్దానాల ద్వారా వారికి ఆశ కలిగిస్తాను. మరియు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాం చేసుకోవటం కొరకు పశువుల చెవులను కోయటానికి వారిని ఆదేశిస్తాను. మరియు అల్లాహ్ సృష్టిని,ఆయన ప్రకృతిని మార్చటానికి వారిని ఆదేశిస్తాను. మరియు ఎవరైతే షైతానును స్నేహితునిగా చేసుకుంటాడో మరియు అతడికి విధేయత చూపుతాడో అతడు ధూత్కరించబడిన షైతానుతో స్నేహం చేయటం వలన స్పష్టమైన నష్టమును పొందుతాడు.
(120) షైతాను వారితో అబద్దపు వాగ్దానాలు చేస్తాడు. మరియు వారికి అసత్యపు ఆశలను రేకెత్తిస్తాడు. వాస్తవానికి వాడు వారితో వాస్తవికత లేని అసత్యపు వాగ్దానం మాత్రమే చేస్తాడు.
(121) షైతాను అడుగుజాడలను అనుసరించే వారందరు మరియు అతని ఆశలను అనుసరించే వారందరి నివాస స్థలం నరకాగ్ని. వారు దాని నుండి పారిపోయి శరణం తీసుకునే ప్రదేశమును పొందరు.
(122) మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన వైపుకు దగ్గర చేసే సత్కర్మలు చేస్తారో మేము వారిని తొందరలోనే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాము వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ వాగ్దానము. మహోన్నతుడైన ఆయన వాగ్దానము సత్యము. ఆయన వాగ్దానమును నెరవేర్చకుండా ఉండడు. మరియు ఎవరూ మాటపరంగా అల్లాహ్ కన్న సత్యవంతుడు ఉండడు.
(123) ఓ ముస్లిములారా ముక్తి మరియు సాఫల్య విషయం మీ ఆశలను మరియు గ్రంథవహుల ఆశలను అనుసరించదు. కాని విషయం కర్మను అనుసరిస్తుంది. అయితే ఎవరైతే మీలో నుండి దుష్కర్మకు పాల్పడుతాడో ప్రళయదినమున అతడికి దాని పరంగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మరియు అతడు తనకు లాభం కలిగించే వాడిగా అల్లాహ్ ను తప్ప ఎవరిని కార్యసాధకుడిగా పొందడు. మరియు తన నుండి కీడుని తొలగించే సహాయకుడిగా పొందడు.
(124) మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన మరియు అతడు మహోన్నతుడైన అల్లాహ్ పై సత్య విశ్వాసవంతుడైతే వారందరు విశ్వాసము మరియు ఆచరణను సమీకరించి స్వర్గములో ప్రవేశిస్తారు. వారి ఆచరణల పుణ్యములోంచి ఏమీ తగ్గించుకోరు. ఒక వేళ ఖర్జూరపు టెంకపై ఉన్న చీలిక పరిమాణమంత కొద్దిగా ఉన్నా కూడా.
(125) బాహ్యపరంగా,అంతః పరంగా అల్లాహ్ కొరకు సమర్పించుకుని తన ఉద్దేశమును ఆయన కొరకు శుద్ధపరచుకున్న వాడి కంటే ధర్మ పరంగా మంచి వాడు ఎవడూ ఉండడు. మరియు ఆయన ధర్మనిర్దేశం చేసిన దాన్ని అనుసరించి తన ఆచరణను మెరుగుపరచుకున్నాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం యొక్క మూలమైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ధర్మమును షిర్కు,అవిశ్వాసం నుండి తౌహీదు,విశ్వాసం వైపునకు మరలుతూ అనుసరించాడు. మరియు అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను తన సృష్టిరాసులందరి మధ్యలో నుంచి పరిపూర్ణ ప్రేమతో ఎన్నుకున్నాడు.
(126) మరియు ఆకాశముల్లో ఉన్న వాటి,భూమిలో ఉన్న వాటి రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు అల్లాహ్ తన సృష్టిలోంచి ప్రతీ దాన్ని జ్ఞాన పరంగా,సామర్ధ్యం పరంగా,కార్యనిర్వహణ పరంగా చుట్టుముట్టి ఉన్నాడు.
(127) మరియు ఓ ప్రవక్తా స్త్రీల విషయంలో వారి కొరకు,వారి పై విధి అయిన వాటి గురించి వారు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఇలా తెలపండి : అల్లాహ్ మీరు అడిగిన దాని గురించి మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీ పరిరక్షణలో ఉన్న అనాధ స్త్రీల విషయంలో మీపై చదవబడుతున్న ఖుర్ఆన్ లో మీ కొరకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీరు వారి కొరకు అల్లాహ్ విధి చేసిన మహర్ ను,వారసత్వ సొమ్మును వారికి ఇవ్వటం లేదు. మరియు వారి వివాహమును ఆశించటం లేదు. మరియు వారి సంపదను ఆశిస్తూ వారిని వివాహం నుండి ఆపుతున్నారు. మరియు బలహీనులైన చిన్న పిల్లలపై విధిగావించబడిన విషయంలో వారసత్వపు సొమ్ము అయిన వారి హక్కు వారికి ఇచ్చే విషయంలో మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు మీరు వారి సంపదలపై ఆధిక్యతను చూపి వారిపై దుర్మార్గమునకు పాల్పడకండి. మరియు వారి (అనాధల) విషయంలో ఇహపరాల్లో ప్రయోజనకరమైన వాటి ద్వారా వారి పరిరక్షణ న్యాయంతో చేయటం విధి అవటం గురించి మరియు అనాధలకు,ఇతరులకు మీరు మేలు చేయటం గురించి మీకు స్పష్టపరుస్తున్నాడు. ఎందుకంటే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు తొందరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(128) ఒక వేళ స్త్రీ కి తన భర్త తన నుండి ముఖము తిప్పుకునే మరియు తనలో అయిష్టత చూపే భయం గనక ఉంటే వారిద్దరు పరస్పరం సంధి చేసుకోవటంలో వారిపై ఎటువంటి పాపం లేదు. ఎలాగంటే ఆమె తన పై విధిగావించబడిన తనపై ఖర్చు చేయటం,తన వద్ద రాత్రి గడపటం లాంటి కొన్ని హక్కులను వదిలివేయాలి. ఇక్కడ వారిరువురు సంధి చేసుకోవటం విడాకులు తీసుకోవటం కన్నా వారికి మంచిది. వాస్తవానికి మనస్సులు అత్యాశ,పిసినారి తనంపై పుట్టించబడినవి. కావున అవి తమ కొరకు ఉన్న ఏ హక్కును వదలటానికి కోరుకోవు. కావున భార్యాభర్తలు ఇద్దరు క్షమాపణ,మంచి చేయటంతో మనస్సును పోషించి ఈ గుణము యొక్క వైధ్యం చేయటం అవసరం. మరియు ఒక వేళ మీరు మీ వ్యవహారములన్నింటిలో మంచి చేసి మరియు అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడితే. నిశ్చయంగా మీరు చేసేవాటి గురించి బాగా తెలుసుకునేవాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(129) ఓ భర్తల్లారా మనస్సు మరలే విషయంలో భార్యలతో ఖచ్చితంగా పూర్తిగా న్యాయం చేయలేరు. ఒక వేళ మీకు దాని పై అత్యాశ ఉన్నా కూడా; కొన్ని కారణాల వలన ఒక్కొక్కసారి అవి మీ ఉద్దేశము నుండి బయట ఉంటాయి. కావున మీరు ఇష్టపడని వారి (భార్యల) నుండి పూర్తిగా మరలకండి. ఆమె హక్కును పూర్తి చేయని భర్త వలె మరియు భర్త లేకుండా వివాహంకోసం వేచి ఉన్న దాని (స్త్రీ) వలె వేళాడుతూ ఉన్న దాని(స్త్రీ) వలె ఆమెను వదలకండి. ఒక వేళ మీరు మీ మనస్సులను భార్య హక్కును నెరవేర్చే విషయంలో అవి కోరని వాటిపై ప్రేరేపించి మీ మధ్య సయోధ్య చేసుకుని,దాని విషయంలో మీరు అల్లాహ్ తో భయపడితే నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును,మీపై కరుణించేవాడును.
(130) భార్యాభర్తలు విడాకులు తీసుకోవడ౦ ద్వారా లేదా ఖులా ద్వారా విడిపోతే, అల్లాహ్ తన విస్తారమైన అనుగ్రహ౦ నుండి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తాడు, అల్లాహ్ తన నిర్వహణలోను, తన విధివ్రాతలోను ఎ౦తో ఘనతను, కారుణ్యమును కలిగిన వివేచనాపరుడు.
(131) భూమ్యాకాశముల్లో ఉన్న దాని సామ్రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న వాటి సామ్రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు నిశ్చయంగా మేము గ్రంధవహులైన యూదులతో మరియు క్రైస్తవులతో మరియు మీతో అల్లాహ్ ఆదేశములను పాటించమని ఆయన వారించిన వాటికి దూరంగా ఉండమని వాగ్దానం తీసుకున్నాము. మరియు ఒక వేళ మీరు ఈ వాగ్దానమును భంగపరిస్తే మీరు మీ స్వయానికే నష్టం కలిగించుకుంటారు. మరియు అల్లాహ్ కు మీ విధేయత అవసరం లేదు. ఆకాశములో మరియు భూమిలో ఉన్నవాటి అధికారము అల్లాహ్ కే చెందును. ఆయన తన సృష్టితాల అక్కర లేని వాడు. తన గుణాలనన్నింటిలో మరియు తన చర్యలన్నింటిలో ప్రశంసించబడినవాడు.
(132) ఆకాశముల్లో ఉన్న వాటి మరియు భూమిలో ఉన్న వాటి రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. విధేయత చూపబడటానికి ఆయన యోగ్యుడు. మరియు తన సృష్టితాల వ్యవహారాలన్నింటి కార్య నిర్వాహకునిగా అల్లాహ్ చాలు.
(133) ఒక వేళ ఓ ప్రజలారా ఆయన తలచుకుంటే మిమ్మల్ని నాశనం చేసి మీరు కాక ఇతరులను తీసుకుని వస్తాడు వారు అల్లాహ్ కు విధేయత చూపుతారు. మరియు ఆయనకు వారు అవిధేయత చూపరు. మరియు అల్లాహ్ దీని సామర్ధ్యం కలవాడు.
(134) ఓ ప్రజలారా మీలో నుండి ఎవరైన తన కర్మ ద్వారా ప్రాపంచిక ప్రతిఫలమును మాత్రమే కోరుకుంటాడో అతడు ఇహపరాల ప్రతిఫలము అల్లాహ్ వద్దనే ఉన్నదని తెలుసుకోవాలి. మరియు ఆ రెండిటి ప్రతిఫలమును ఆయన నుండి కోరుకోవాలి. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడు మీ కర్మలను వీక్షించేవాడు. మరియు ఆయన మీకు వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(135) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు మీ అన్ని పరిస్థితులలో న్యాయం విషయంలో స్థిరంగా ఉండేవారై ఉండండి ప్రతీ ఒక్కరితో సత్యంతో కూడుకున్న సాక్ష్యమును పలికేవారై ఉండండి. ఒక వేళ అది సత్యం విషయంలో మీ స్వయమునకు లేదా మీ తల్లిదండ్రులకు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా మీరు అంగీకరించవలసినా సరే. మరియు ఎవరి పేదరికం గాని లేదా ధనికం గాని మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకటానికి లేదా దాన్ని వదిలివేయటానికి మిమ్మల్ని పురిగొల్పకూడదు. అల్లాహ్ పేదవాడి పట్ల,ధనికుడి పట్ల మీ కన్న ఎక్కువగా (మంచి చేయటానికి) యోగ్యుడు మరియు వారి వారి ప్రయోజనాల గురించి బాగా తెలిసినవాడు. కావున మీరు మీ సాక్ష్యం పలికే విషయంలో మనోవాంఛలను అనుసరించకండి మీరు ఆ విషయంలో సత్యం నుండి మరలిపోకుండా ఉండటానికి. మరియు ఒక వేళ మీరు సాక్ష్యాన్ని వేరే విధంగా ప్రదర్శించడం ద్వారా వక్రీకరించినట్లయితే లేదా మీరు దానిని చేయడానికి (సాక్ష్యం ఇవ్వటానికి) నిరాకరించినట్లయితే; నిశ్ఛయంగా మీరు చేసేదాని గురించి అల్లాహ్ కు తెలుసు.
(136) ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల మరియు ఆయన తన ప్రవక్త పై అవతరింపజేసిన ఖుర్ఆన్ పట్ల మరియు ఆయన కన్న మునుపటి ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధముల పట్ల మీ విశ్వాసము పై స్థిరంగా ఉండండి. మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల,ఆయన దూతల పట్ల,ఆయన గ్రంధముల పట్ల,ఆయన ప్రవక్తల పట్ల,ప్రళయదినము పట్ల అవిశ్వాసము చూపుతాడో అతడు సన్మార్గం నుండి చాలా దూరం అయిపోయాడు.
(137) నిశ్చయంగా వారిలో నుండి విశ్వాసనంతరం పదేపదే అవిశ్వాసమునకు పాల్పడుతారో ఎలాగంటే విశ్వాసములో ప్రవేశించి ఆ తరువాత దాని నుండి మరలిపోయి ఆ తరువాత దానిలో ప్రవేశించి ఆ తరువాత దాని నుండి మరలిపోయి మరియు అవిశ్వాసముపై మొండిగా ఉండి దాని స్థితిలోనే మరణిస్తే అల్లాహ్ వారి పాపములను వారి కొరకు మన్నించడు. మరియు మహోన్నతుడైన ఆయన వైపునకు చేరవేసే సన్మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించడు.
(138) ఓ ప్రవక్తా విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును గోప్యంగా ఉంచిన కపటులకు అల్లాహ్ వద్ద ప్రళయదినమున బాధాకరమైన శిక్ష కలదని శుభవార్తనివ్వండి.
(139) ఈ శిక్ష ఎందుకంటే వారు విశ్వాసపరులను వదిలి అవిశ్వాసపరులను సహాయకులుగా,మద్దతు దారులుగా చేసుకున్నారు. మరియు నిశ్చయంగా అది ఆశ్చర్యకరమైనది ఏదైతే వారిని వారితో స్నేహం చేసేటట్లు చేసినదో. ఏమీ వారు వారి వద్ద బలమును,నివారణను వాటి ద్వారా వారు ఉన్నతులు అవటానికి ఆశిస్తున్నారా ?! నిశ్ఛయంగా బలము మరియు నివారణ అంతా అల్లాహ్ కే చెందుతుంది.
(140) ఓ విశ్వాసపరులారా నిశ్చయంగా అల్లాహ్ మీపై దివ్య ఖుర్ఆన్ లో అవతరింపజేశాడు మీరు ఏదైన సభలో కూర్చుని అందులో అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కరించి, వాటి పట్ల హేళన చేసే వారిని వింటే వారు అల్లాహ్ ఆయతుల పట్ల అవిశ్వాస మాటలు కాకుండా ,వాటి పట్ల హేళన చేసే మాటలు మాట్లాడనంత వరకు మీరు వారితో పాటు కూర్చోవటమును వదిలివేసి వారి సభ నుండి మరలిపోవటం మీపై తప్పనిసరి. నిశ్చయంగా అల్లాహ్ ఆయతుల పట్ల తిరస్కారము,వాటి పట్ల హేళన చేసే స్థితిలో మీరు విన్న తరువాత కూడా వారితో కూర్చుంటే అది వారిలాగే అల్లాహ్ ఆదేశము విబేధించటంలో వస్తుంది. ఎందుకంటే మీరు వారితో కూర్చోవటం వలన అల్లాహ్ కు అవిధేయత చూపారు ఏ విధంగానైతే వారు తమ అవిశ్వాసం వలన అల్లాహ్ కు అవిధేయత చూపారో. నిశ్చయంగా అల్లాహ్ తొందరలోనే ప్రళయదినమున విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును గోప్యంగా ఉంచిన కపటులను నరకాగ్నిలో అవిశ్వాసపరులతో సమావేసపరుస్తాడు.
(141) మీకు సంభవించే మేలు లేదా చెడు గురించి నిరీక్షించే వారు ఒక వేళ మీకు అల్లాహ్ వద్ద నుండి విజయం కలిగి మీరు విజయ ప్రాప్తిని పొందితే వారు మీతో ఇలా పలుకుతారు : ఏమీ మీరు హాజరు అయిన చోట మేము మీతో పాటు హాజరు కాలేదా ? వారు విజయ ప్రాప్తిని పొందటానికి. ఒక వేళ అవిశ్వాసపరులకు అదృష్టం వరిస్తే వారు వారితో ఇలా పలుకుతారు : మేము మీ వ్యవహారములను జాగ్రత్తగా చూసుకోలేదా మరియు సంరక్షణ,మద్దతుతో మిమ్మల్ని సంరక్షించలేదా మరియు మేము మీకు సహాయము చేసి విశ్వాసపరులను పరాభవమునకు గురి చేసి మిమ్మల్ని విశ్వాసపరుల నుండి రక్షించలేదా ?! అయితే అల్లాహ్ ప్రళయదినమున మీ అందరి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన విశ్వాసపరులను స్వర్గములో ప్రవేశింపజేసి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు కపటులకు నరకములో క్రిందటి స్థానములో ప్రవేశింపజేసి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ ప్రళయదినమున అవిశ్వాసపరులకు తన అనుగ్రహమును ప్రసాదించి విశ్వాసపరులకు వ్యతిరేకంగా వాదన చేయడు. కాని విశ్వాసపరులకు వారు సత్యవిశ్వాసముతో ధర్మబద్ధంగా ఆచరించే వరకు మంచి పర్యవాసనమును కలిగిస్తాడు.
(142) నిశ్చయంగా కపటులు ఇస్లాంను బహిర్గతం చేసి అవిస్వాసమును గోప్యంగా ఉంచి అల్లాహ్ ను మోసగిస్తున్నారు. వాస్తవానికి ఆయన వారిని మోసగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వారి అవిశ్వాసము గురించి తెలిసి కూడా వారి రక్తములను పరిరక్షించాడు. మరియు పరలోకంలో వారి కొరకు తీవ్రమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. వారు నమాజులను నెలకొల్పితే బద్దకముతో దాని పట్ల అయిష్టత చూపుతూ ప్రజలను చూపే,వారి మెప్పు పొందే ఉద్దేశముతో నెలకొల్పుతారు. చిత్తశుద్ధితో అల్లాహ్ కొరకు చేయరు. వారు విశ్వాసపరులను చూసినప్పుడు చాలా తక్కువ అల్లాహ్ స్మరణ చేస్తారు.
(143) ఈ కపటవిశ్వాసులందరు కలవరపడటంలో ఊగిసలాడుతుంటారు. కావున వారు బాహ్య పరంగా, అంతర్గతంగా విశ్వాసపరులకు తోడుగా లేరు మరియు అవిశ్వాసపరులకు తోడుగా లేరు. కాని వారి బాహ్యము విశ్వాసపరులకు తోడుగా మరియు వారి అంతర్గతం అవిశ్వాసపరులకి తోడుగా ఉన్నది. ఓ ప్రవక్తా అల్లాహ్ ఎవరినైతే మార్గ భ్రష్టతకు లోను చేస్తాడో మీరు మార్గ భ్రష్టత నుండి అతని సన్మార్గము కొరకు అతని కొరకు ఎటువంటి మార్గమును పొందరు.
(144) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీరు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని విశ్వాసపరులను వదిలి వారితో స్నేహం చేస్తు పరిశుద్ధులుగా చేసుకోకండి. ఏమీ మీ ఈ చర్య ద్వారా మీరు శిక్షకు అర్హులవటం పై సూచించే స్పష్టమైన ఆధారమును మీకు వ్యతిరేకంగా అల్లాహ్ ముందు ఉంచదలచారా ?!
(145) నిశ్చయంగా కపటులకు అల్లాహ్ ప్రళయదినమున నరకము లో అట్టడుగు స్థానంలో ఉంచుతాడు. మరియు నీవు వారి కొరకు వారి నుండి శిక్షను తొలగించే సహాయకుడిని పొందవు.
(146) కాని ఎవరైతే తమ కపటత్వము నుండి పశ్చాత్తాప్పడి అల్లాహ్ వైపు మరలి,తమ అంతరంగమును సంస్కరించుకుని, అల్లాహ్ యొక్క వాగ్దానమును అదిమి పట్టుకుని,తమ కర్మలను ప్రదర్శించటానికి కాకుండా అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకుంటారో ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు ఇహపరాలలో విశ్వాసపరులతో ఉంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే విశ్వాసపరులకు గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(147) ఒక వేళ మీరు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుని ఆయనపై విశ్వాసమును కనబరిస్తే మిమ్మల్ని శిక్షించే అవసరం ఆయనకు లేదు. ఆయన మహోన్నతుడు, మంచిగా వ్యవహరించేవాడు,కరుణించేవాడు. మరియు ఆయన మీ పాపములపై మాత్రమే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఒక వేళ మీరు ఆచరణను సంస్కరించుకుంటే మరియు ఆయన అనుగ్రహములపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని బాహ్యంగా మరియు అంతరంగంగా ఆయనపై విశ్వాసమును కనబరచి ఉంటే ఆయన మిమ్మల్ని శిక్షించడు. మరియు అల్లాహ్ తన అనుగ్రహాలను అంగీకరించే వారి కొరకు ఆదరించి దానిపై వారికి అధికముగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. తన సృష్టితాల విశ్వాసమును గురించి బాగా తెలిసినవాడు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(148) చెడు మాటలను బహిరంగంగా పలకటమును అల్లాహ్ ఇష్టపడడు. కాని దాన్ని ద్వేషిస్తాడు మరియు దానిపై బెదిరిస్తాడు. కాని హింసించబడిన వాడు చెడును బహిరంగంగా పలకటం తనపై హింసకు పాల్పడిన వాడి గురించి ఫిర్యాదు చేయటం మరియు అతనిపై శాపనార్దాలు పెట్టటం (బద్దుఆ చేయటం),అతని మాటలులాగే మాట్లాడి అతనితో ప్రతీకారం తీసుకోవటం అతనికి సమ్మతమే. కాని హింసకు గురైన వాడు చెడు మాటలను బహిరంగపరచటం కన్న సహనం వహించటం ఎంతో ఉత్తమం. మరియు అల్లాహ్ మీ మాటలను వినేవాడును మరియు మీ ఉద్దేశాలను బాగా తెలిసినవాడును. కావున మీరు చెడు పలకటం లేదా దాన్ని ఉద్దేశించడంతో జాగ్రత్తపడండి.
(149) ఒక వేళ మీరు ఏదైన మంచి మాటను లేదా మంచి కార్యమును వ్యక్తపరచినా లేదా దాన్ని గోప్యంగా ఉంచినా లేదా మీకు చెడు చేసిన వారిని మన్నించిన నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును సర్వ సమర్ధుడును. మన్నించటం మీ గుణము కావలెను. బహుశా అల్లాహ్ మిమ్మల్ని మన్నించివేస్తాడు.
(150) నిశ్చయంగా అల్లాహ్ ను అవిశ్వసించేవారు మరియు ఆయన ప్రవక్తలను అవిశ్వసించేవారు మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తలకు మధ్య ఆయనను విశ్వసించి,వారిని తిరస్కరించి బేదభావమును చూపగోరేవారు మరియు వారు ఇలా పలుకుతారు : మేము కొంత మంది ప్రవక్తలను విశ్వసిస్తున్నాము మరియు వారిలో నుండి కొంత మందిని తిరస్కరిస్తున్నాము. మరియు వారు అవిశ్వాసము మరియు విశ్వాసము మధ్య ఒక మార్గమును అది వారిని రక్షిస్తుందని భావించి తయారు చేసుకోదలిచారు.
(151) ఈ మార్గముపై నడిచే వీరందరే వాస్తవానికి అవిశ్వాసపరులు. ఇది ఎవరైతే ప్రవక్తలందరిని లేదా వారిలో కొందరిని తిరస్కరించేవాడు వాస్తవానికి అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను తిరస్కరించాడు. మరియు మేము ప్రళయదినమున వారిని అవమానమనకు గురి చేసే శిక్షను సిద్ధం చేసి ఉంచాము అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్తల పట్ల విశ్వాసము నుండి వారి గర్వంపై వారికి శిక్షగా.
(152) మరియు ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి ఆయన ఏకత్వమును చాటి, ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించరో మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి అవిశ్వాసపరులు చేసినట్లు వారి మధ్య బేధ భావమును చూపకుండా వారందరిపై విశ్వాసమును కనబరుస్తారో వారందరికి అల్లాహ్ వారి విశ్వాసమునకు మరియు వారి సత్కర్మలకు ప్రతిఫలంగా గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
(153) ఓ ప్రవక్తా యూదులు మీ నిజాయితీకి సూచన అవటమునకు మూసా విషయంలో జరిగినట్లు ఆకాశము నుండి ఒక గ్రంధం ఒకేసారి వారిపై అవతరింపబడాలని మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే మీరు వారి ఈ మాటను పెద్దదిగా భావించకండి. వారి పూర్వికులు వీరందరు అడిగిన దానికంటే పెద్దదే మూసాను అడిగారు. అదేమిటంటే వారు అల్లాహ్ ను తమకు కళ్ళారా చూపించమని ఆయనను అడిగారు. అప్పుడు వారు పాల్పడిన దానికి శిక్షగా స్పృహ కోల్పో బడ్డారు. ఆ తరువాత అల్లాహ్ వారి ని జీవింపజేశాడు. అప్పుడు వారు అల్లాహ్ ఏకత్వమును సూచించే మరియు దైవత్వము,ఆరాధన ఆయన ఒక్కడికే అని సూచించే స్పష్టమైన సూచనలు వారి వద్దకు వచ్చిన తరువాత అల్లాహ్ ను వదిలి ఆవు దూడను ఆరాధించారు. ఆ తరువాత మేము వారిని మన్నించాము. మరియు మేము మూసాకు ఆయన జాతి వారికి విరుద్ధంగా స్పష్టమైన వాదనను ప్రసాదించాము.
(154) మరియు వారితో తీసుకోబడిన దృఢ ప్రమాణము వలన అందులో ఉన్న వాటిని వారు ఆచరించటానికి భయపెట్టటానికి మేము వారిపై పర్వతమును తీసుకుని వచ్చి నిలబెట్టాము. మరియు దాన్ని వారిపై నిలబెట్టిన తరువాత మేము వారితో ఇలా పలికాము : మీరు శిరసాలను వంచి సాష్టాంగపడుతూ బైతుల్ మఖ్దిస్ ద్వారములో ప్రవేశించండి. అప్పుడు వారు తమ పిరుదులపై ప్రాకుతూ ప్రవేశించారు. మరియు మేము వారితో ఇలా పలికాము : మీరు శనివార దినమున వేటాడే విషయంలో ముందడుగు వేసి మితిమీరకండి. కాని వారు మితిమీరి వేటాడటం మత్రం వారితో జరిగింది. మరియు మేము దీనిపై వారితో దృఢమైన ప్రమాణమును తీసుకున్నాము. కాని వారితో తీసుకోబడిన ప్రమాణమును వారు భంగపరిచారు.
(155) అయితే వారు తమపై ఉన్న ఖచ్చితమైన ప్రమాణమును భంగపరచటం వలన మరియు అల్లాహ్ ఆయతుల పట్ల వారి తిరస్కారము వలన మరియు దైవ ప్రవక్తలను హతమార్చటంపై వారి దుస్సాహసం వలన మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మా హృదయములపై మూతలు ఉన్నాయి మీరు చెప్పేది అవి గుర్తుపెట్టుకోవు అని వారి పలకటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి దూరం చేశాము. వారు చెబుతున్నట్లు విషయం కాదు. కాని అల్లాహ్ వారి అవిశ్వాసం వలన వారి హృదయములపై సీలు వేశాడు వాటి వరకు మేలు చేరదు. వారు తమకు ప్రయోజనం కలిగించని కొద్దిపాటి విశ్వాసమును మాత్రమే కలిగి ఉన్నారు.
(156) మరియు వారి అవిశ్వాసం వలన మరియు మర్యమ్ అలైహస్సలాంపై అబద్దమైన అపనింద అయిన వ్యభిచారపు అపనిందను వేయటం వలన వారిని మేము కారుణ్యము నుండి దూరం చేశాము.
(157) మరియు గర్వపడుతూ "నిశ్చయంగా మేము అల్లాహ్ ప్రవక్త అయిన మర్యమ్ కుమారుడగు మసీహ్ ఈసాను హతమార్చాము" అబద్దపు వారి మాట వలన మేము వారిని శపించాము. వారు వాదిస్తున్నట్లుగా వారు ఆయనను చంపనూ లేదు మరియు ఆయనకు శిలువా వేయలేదు. కాని వారు అల్లాహ్ ఈసా అలైహిస్సలాం రూపమును వేసిన ఒక వ్యక్తిని చంపి అతనికి వారు శిలువ వేశారు. చంపబడిన వ్యక్తి ఈసా అలైహిస్సలాం అని వారు భావించారు. ఆయనను చంపినట్లు వాదించిన యూదులు మరియు వారి మాటలను అంగీకరించిన క్రైస్తవులు ఇద్దరూ ఆయన విషయంలో గందరగోళంలో మరియు సందేహంలో ఉన్నారు. అయితే వారికి ఆయన గురించి ఎటువంటి జ్ఞానం లేదు. వారు మాత్రం ఊహను అనుసరిస్తున్నారు. మరియు నిశ్చయంగా ఊహ సత్యం విషయంలో ఏ విధంగా పనికిరాదు. ఖచ్చితంగా వారు ఈసా అలైహిస్సలాంను చంపనూ లేదు మరియు వారు శిలువ వేయలేదు.
(158) కాని అల్లాహ్ ఆయనను వారి కుట్ర నుండి రక్షించాడు. మరియు అల్లాహ్ ఆయనను తన శరీరము మరియు తన ఆత్మతో సహా తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు. ఆయనను ఎవరూ ఓడించలేరు. తన పర్యాలోచనలో,తన నిర్ణయంలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
(159) గ్రంధవహుల్లోంచి ఏ ఒక్కడు కూడా ఈసా అలైహిస్సలాంను చివరి కాలంలో ఆయన దిగిన తరువాత,ఆయన మరణం కన్న ముందు విశ్వసించకుండా ఉండరు. మరియు ప్రళయదినమున ఈసా అలైహిస్సలాం వారి కర్మలపై వాటిలో నుండి ఏవైతే ధర్మానికి అనుగుణంగా ఉంటాయో మరియు ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో సాక్షిగా ఉంటారు.
(160) యూదుల దుర్మార్గం వలన మేము వారిపై కొన్ని తినే శుద్ధమైన ఆహారాలను ఏవైతే వారికి ధర్మ సమ్మతంగా ఉన్నాయో వాటిని నిషేధించాము. కావున మేము వారిపై గోళ్ళుకల జంతువులను నిషేధించాము. మరియు ఆవులు, మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని తప్ప మిగిలిన దాన్ని (నిషేధించాము). వారు తమను మరియు ఇతరులను అల్లాహ్ మార్గము నుండి నిరోధించటం వలన. చివరికి మంచి నుండి ఆపటం వారికి అలవాటు అయిపోయింది.
(161) మరియు అల్లాహ్ వారిని వడ్డీ సొమ్మును తినటము నుండి వారిని ఆపినా వారు వడ్డీ వ్యవహారమును నడపటం వలన మరియు ప్రజల సొమ్మును ధర్మ బద్ధంగా కాకుండా అన్యాయంగా తీసుకోవటం వలన. మరియు మేము వారిలో నుండి అవిశ్వాసపరుల కొరకు బాధాకరమైన శిక్షను శిద్ధం చేసి ఉంచాము.
(162) కాని యూదుల్లోంచి జ్ఞానంలో పట్టు ఉండి స్థిరంగా ఉన్నవారు మరియు విశ్వసించినవారు ఓ ప్రవక్త అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ ను దృవీకరించేవారు మరియు మీ కన్న మునుపు ప్రవక్తలపై ఆయన అవతరింపజేసిన తౌరాత్,ఇంజీలు లాంటి గ్రంధములను దృవీకరించేవారు మరియు నమాజును నెలకొల్పేవారు మరియు తమ సంపదల నుండి జకాత్ ను చెల్లించేవారు. మరియు అల్లాహ్ ఒక్కడే అని ఆయనకు ఎవరు సాటి లేరని నమ్ముతారు. మరియు ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరకి మేము తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
(163) నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్త మీకన్న పూర్వ ప్రవక్తలపై అవతరిపజేసినట్లే మీపై దైవవాణిని అవతరింపజేశాము. అయితే మీరు ప్రవక్తల్లోంచి కొత్తవారు కాదు. నిశ్చయంగా మేము నూహ్ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఆయన తరువాత వచ్చిన దైవ ప్రవక్తలపై మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఇబ్రాహీంపై మరియు ఆయన ఇద్దరు కుమారులైన ఇస్మాయీల్,ఇస్హాఖ్ పై మరియు ఇస్హాఖ్ కుమారుడగు యాఖూబ్ పై మరియు ఆయన సంతతి పై (వారు యాఖూబ్ కుమారుల్లోంచి పన్నెండు మంది ఇస్రాయిల్ సంతతికి చెందిన తెగల్లోంచి అయిన దైవ ప్రవక్తలు) మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము ఈసా,అయ్యూబ్,యూనుస్,హారూన్,సులైమాన్ ల వైపు దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము దావూద్ కు ఒక గ్రంధమును ప్రసాదించాము. అది జబూర్.
(164) మరియు మేము కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను ఖుర్ఆన్ లో మీకు తెలియపరిచాము. మరియు కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను మీకు అందులో తెలియపరచలేదు. మరియు మేము వారి ప్రస్తావనను విజ్ఞత కొరకు అందులో వదిలివేశాము. మరియు అల్లాహ్ మూసాతో దైవ దౌత్యం ద్వారా ఎటువంటి ఆధారము లేకుండా పరిశుద్దుడైన ఆయనకు తగిన విధంగా వాస్తవంగా మూసా కు గౌరవంగా మాట్లాడాడు.
(165) మేము వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారికి గౌరవోన్నతమైన ప్రతిఫలము ద్వారా శుభవార్తనిచ్చేవారిగా మరియు ఆయనను అవిశ్వసించే వారికి బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేవారిగా పంపించాము. చివరికి ప్రవక్తలను పంపించిన తరువాత ప్రజలకు వంకలు పెట్టటానికి అల్లాహ్ ముందు ఎటువంటి వాదన లేకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు మరియు తన తీర్పునివ్వటంలో వివేకవంతుడు.
(166) ఒక వేళ యూదులు మిమ్మల్ని తిరస్కరించినా నిశ్చయంగా ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ సరైనదన్న దాని ద్వారా మిమ్మల్ని దృవీకరిస్తున్నాడు. ఆయన అందులో తాను కోరుకుని తాను ఇష్టపడిన వాటిని లేదా తాను ఇష్టపడక తాను నిరాకరించిన వాటిని దాసులకు తెలియపరచదలచిన తన జ్ఞానమును అందులో అవతరింపజేశాడు. మీరు తీసుకుని వచ్చిన దాని నిజాయితీ గురించి అల్లాహ్ సాక్ష్యంతో పాటు దైవదూతలు సాక్ష్యం పలుకుతారు. మరియు సాక్షిగా అల్లాహ్ చాలును. ఇతరుల సాక్ష్యమునకు ఆయన సాక్ష్యము సరిపోతుంది.
(167) నిశ్చయంగా ఎవరైతే మీ దైవదౌత్యమును తిరస్కరించి ప్రజలను ఇస్లాం నుండి నిరోధిస్తారో వారు సత్యము నుండి చాలా దూరం అయిపోయారు.
(168) నిశ్చయంగా అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి మరియు అవిశ్వాసముపై ఉండిపోయి తమ స్వయముపై హింసకు పాల్పడ్డారో వారిని అల్లాహ్ వారు అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించిన దానికి మన్నించడు. మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి విముక్తిని కలిగించే మార్గం వైపునకు మార్గదర్శకం చేయడు.
(169) కాని నరకములో ప్రవేశమునకు దారితీసే మార్గము వైపునకు (మార్గదర్శకం చేస్తాడు) వారు అందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇది అల్లాహ్ పై సులభము. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(170) ఓ మానవులారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి సన్మార్గమును మరియు సత్య ధర్మమును మీ వద్దకు తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించండి అది మీ కొరకు ఇహపరాలలో మేలగును. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్చయంగా అల్లాహ్ మీ విశ్వాసము నుండి అక్కరలేనివాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు.అకాశముల్లో ఉన్న వాటి రాజ్యాధికారము మరియు భూమిలో,ఆ రెండిటి మధ్య ఉన్న వాటి రాజ్యాధికారము ఆయనకే చెందుతుంది. మరియు సన్మార్గమునకు ఎవరు హక్కుదారుడో అల్లాహ్ కు బాగా తెలుసు కాబట్టి ఆయన అతని కొరకు దాన్ని సులభతరం చేస్తాడు. మరియు ఎవరు దానికి హక్కు దారుడు కాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అతడిని దాని నుండి అంధుడిగా చేసేస్తాడు. మరియు ఆయన తన మాటల్లో మరియు తన కార్యాల్లో మరియు తన ధర్మ శాసనాల్లో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.
(171) ఓ ప్రవక్తా ఇంజీలు వారైన క్రైస్తవులతో మీరు ఇలా పలకండి : మీరు మీ ధర్మ విషయంలో హద్దు మీరకండి. మరియు మీరు ఈసా అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ పై సత్యం మాత్రమే పలకండి. మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ అల్లాహ్ ప్రవక్త మాత్రమే. ఆయన అతన్ని సత్యముతో పంపించాడు. ఆయన అతన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా మర్యమ్ కు చేరవేసిన తన వాక్కు ద్వారా సృష్టించాడు. మరియు అది ఆయన మాట అయిన "కున్" అని అంటే అది అయిపోయింది. మరియు అది అల్లాహ్ వద్ద నుండి ఒక ఊదటం దాన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఊదారు. అయితే మీరు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తలందరిపై వారి మధ్య ఎటువంటి బేధభావం లేకుండా విశ్వాసమును కనబరచండి. ఆరాధ్య దైవాలు ముగ్గురు అని మీరు పలకకండి. మీరు ఈ అసత్యపు మరియు తప్పుడు మాటను పలకటం నుండి జాగ్రత్త వహించండి దాని నుండి మీరు జాగ్రత్త వహించటం మీకు ఇహపరాల్లో మేలు కలుగును. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం ఆయన సాటికల్పించబడటం నుండి మరియు సంతానం కలిగి ఉండటం నుండి పరిశుద్ధుడు. మరియు ఆయన అక్కరలేనివాడు. భూమ్యాకాశముల మరియు ఆ రెండిటి మధ్య ఉన్నవాటి సామ్రాజ్యాధికారం ఆయనకే చెందుతుంది. ఆకాశముల్లో మరియు భూమిలో ఉన్న వాటికి స్థాపకుడిగా మరియు వారికి కార్యనిర్వాహకుడిగా అల్లాహ్ చాలు.
(172) మర్యమ్ కుమారుడగు ఈసా అల్లాహ్ దాసుడు కావటం నుండి నిరాకరించరు మరియు ఆగరు. మరియు అల్లాహ్ తనకు దగ్గరగా చేసుకుని వారి స్థానమును పెంచిన దూతలు అల్లాహ్ కు దాసులు కాకుండా ఉండరు. అటువంటప్పుడు మీరు ఈసాను ఎలా ఆరాధ్య దైవంగా చేసుకుంటారు ?! మరియు ముష్రికులు దైవదూతలను ఎలా ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నారు ?! మరియు ఎవరైతే అల్లాహ్ ఆరాధనను చేయకుండా దాని నుండి దూరంగా ఉంటాడో నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినమున అందరిని తన వద్ద సమీకరిస్తాడు. మరియు ప్రతి ఒక్కడికి దేనికి అర్హుడో అది ప్రసాదిస్తాడు.
(173) ఇక ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను దృవీకరించి సత్కర్మలను అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తూ ఆయన ధర్మబద్ధం చేసిన విధంగా ఆచరిస్తూ చేసేవారు. ఆయన వారికి వారి కర్మల ప్రతిఫలమును తగ్గించకుండా ప్రసాదిస్తాడు. మరియు ఆయన తన అనుగ్రహముతో మరియు తన ఉపకారముతో వారికి దాని కన్నా అధికంగా ఇస్తాడు. ఇక ఎవరైతే అల్లాహ్ ఆరాధనను మరియు ఆయన విధేయతను ఉపేక్షించి అహంకారములో పెరిగిపోతారో వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు వారు అల్లాహ్ ను వదిలి తమను రక్షించి తమ కొరకు లాభమును తీసుకుని వచ్చేవాడిని పొందరు. మరియు తమకు సహాయపడి తమ నుండి నష్టమును తొలగించేవాడిని పొందరు.
(174) ఓ ప్రజలారా వంకలను అంతం చేసే మరియు సందేహమును దూరం చేసే స్పష్టమైన వాదన మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు వచ్చినది. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు మేము మీపై స్పష్టమైన వెలుగును అవతరింపజేశాము మరియు అది ఈ ఖుర్ఆన్.
(175) ఇక ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి తమ ప్రవక్తపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అదిమి పట్టుకుంటారో వారిపై అల్లాహ్ స్వర్గములో ప్రవేశింపజేసి కరుణిస్తాడు. మరియు వారికి అధికంగా ప్రతిఫలమును ప్రసాదించి వారి స్థానములను పెంచుతాడు. మరియు వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గముపై నడిచే భాగ్యమును కలిగిస్తాడు. మరియు అది శాశ్వత స్వర్గవనాలకు చేరవేసే మార్గము.
(176) ఓ ప్రవక్తా వారు మీతో కలాలా వారసత్వ విషయంలో మీరు వారికి ధార్మిక శాసనం (ఫత్వా) ఇవ్వాలని అడుగుతున్నారు. మరియు అతడు వెనుక తండ్రి మరియు సంతానం లేకుండా మరణించిన వాడు. మీరు ఇలా పలకండి అల్లాహ్ దాని విషయంలో మీకు ఇలా స్పష్టపరుస్తున్నాడు : ఎవరైన వెనుక తండ్రి మరియు సంతానము లేక మరణించి అతనికి సొంత సోదరి కాని లేదా తండ్రి తరపున సోదరి కాని ఉంటే ఆమెకు అతను వదిలిన ఆస్తిలో విధిగా సగ భాగం ఉంటుంది. మరియు అతని సొంత సోదరుడు లేదా తండ్రి తరపున సోదరుడు ఉండి అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు లేకపోతే అతడు అతని మొత్తం ఆస్తికి వారసుడవుతాడు. ఒక వేళ అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు ఉంటే అతడు అతని తరువాత మిగిలిన దానికి వారసుడవుతాడు. ఒక వేళ సొంత సోదరిమణులు లేదా తండ్రి తరపున సోదరిలు ఎక్కువగా ఉంటే అంటే ఇద్దరు లేక ఇంకా ఎక్కువ ఉంటే వారు ఆస్తిలో విధిగా 2/3 వంతులో వారసులవుతారు. మరియు ఒక వేళ వారిలో సొంత సోదర సోదరీమణులు లేదా తండ్రి తరపున సోదర సోదరీమణులు ఉంటే ఈ నియమం - "ఒక మగాడికి ఇద్దరు స్త్రీలకు ఇచ్చెంత భాగము ఉండును"- ప్రకారం ఆస్తిలో వారసులవుతారు అంటే ఒక స్త్రీకి ఇచ్చే దానికి రెండింత చేసి పురుషునికి ఇవ్వాలి. అల్లాహ్ మీ కొరకు కలాలా మరియు ఇతర వాటి విషయంలో వారసత్వ ఆదేశములను మీరు వాటి విషయంలో అపమార్గమునకు లోను కాకూడదని స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.