60 - Al-Mumtahana ()

|

(1) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు నా శతృవులను మరియు మీ శతృవులను వారిపై ప్రేమ చూపుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోకండి. వాస్తవానికి వారు మీ ప్రవక్త చేత మీ వద్దకు వచ్చిన ధర్మమును తిరస్కరించారు. ప్రవక్తను వారు ఆయన ఇంటి నుండి వెలివేశారు మరియు అలాగే మిమ్మల్ని కూడా మీ నివాసమైన మక్కా నుండి వెలివేశారు. వారు మీ విషయంలో ఎటువంటి బంధుత్వమును మరియు ఎటువంటి రక్త సంబంధమును లెక్క చేయలేదు. కేవలం మీరు మీ ప్రభువైన అల్లాహ్ ను విశ్వసించటం వలన. ఒక వేళ మీరు నా మర్గములో ధర్మ పోరాటము కొరకు బయలు దేరితే,నా ఇష్టతను కోరుకుంటూ ఉంటే మీరు అలా చేయకండి. మీరు వారితో ఉన్న ప్రేమ వలన ముస్లిముల సమాచారములను రహస్యంగా చేరవేస్తున్నారు. మీరు వాటిలో నుండి ఏవి దాచుతున్నారో మరియు ఏవి బహిర్గతం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీను మరియు వేరేవి ఏవి కూడా నాపై గోప్యంగా ఉండవు. మరియు ఎవరైతే ఈ స్నేహమును,ప్రేమాభిమానములను అవిశ్వాసపరులపై చూపుతాడో అతడు మధ్యే మార్గము నుండి మరలిపోయాడు మరియు సత్య మార్గము నుండి తప్పిపోయాడు. సరైన మార్గము నుండి తప్పిపోయాడు.

(2) ఒక వేళ వారు మీపై ప్రాభల్యం వహిస్తే తమ హృదయములలో దాచి ఉంచిన శతృత్వమును బహిర్గతం చేసేవారు. మరియు బాదించటంతో,కొట్టటంతో తమ చేతులను మీ వైపునకు చాపుతారు. మరియు దూషించటంతో,తిట్టటంతో తమ నాలుకలను చలాయిస్తారు. మీరు వారిలా అయిపోవటం కొరకు మీరు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల తిరస్కారమును చూపాలని వారు ఆశిస్తారు.

(3) మీ బంధుత్వము మరియు మీ సంతానము మీరు అవిశ్వాసపరులతో వారి మూలంగా స్నేహం చేసినప్పుడు మీకు ఏ విధంగాను ప్రయోజనం చేకూర్చరు. ప్రళయదినమున అల్లాహ్ మీ మధ్య వేరు పరుస్తాడు. కావున ఆయన మీలో నుండి స్వర్గ వాసులను స్వర్గములో ప్రవేశింపజేస్తాడు మరియు నరక వాసులను నరకంలో ప్రవేశింపజేస్తాడు. మీలో నుండి ఒకరు ఇంకొకరికి లాభం కలిగించరు. మరియు మీరు చేస్తున్నది అల్లాహ్ చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ పరిశుద్ధుడైన ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(4) ఓ విశ్వాసపరులారా వాస్తవానికి మీ కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాంలో మరియు ఆయనతో పాటు ఉన్న విశ్వాసపరులలో ఒక ఆదర్శం ఉన్నది ఎప్పుడైతే వారు అవిశ్వాసపరులైన తమ జాతి వారితో ఇలా పలికారో : నిశ్ఛయంగా మీతో మరియు మీరు అల్లాహ్ ని వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలతో మాకు ఎటువంటి సంబంధము లేదు. మీరు ఏ ధర్మంపై ఉన్నారో ఆ ధర్మమును మేము తిరస్కరిస్తున్నాము. మీరు ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించి ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండనంత వరకు మా మధ్య మరియు మీ మధ్య శతృత్వము మరియు ద్వేషము బహిర్గతమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అవిశ్వాసపరులైన మీ జాతి వారితో సంబంధమును వదులుకోండి. కాని ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో అల్లాహ్ యందు మీ కొరకు నేను తప్పకుండా మన్నింపును వేడుకుంటాను అని పలికిన మాటలో ఆదర్శం లేదు. ఎందుకంటే ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి నుండి నిరాశులు కాక ముందు జరిగినది. కావున ఒక విశ్వాసపరుడు ఒక ముష్రిక్ కొరకు మన్నింపు వేడుకోవటం సరికాదు. మరియు నేను మీ నుండి అల్లాహ్ శిక్షను ఏమాత్రం తొలగించలేను. ఓ మా ప్రభువా మేము మా వ్యవహారాలన్నింటిలో నీపైనే నమ్మకమును కలిగి ఉన్నాము. మరియు మేము పశ్చాత్తాపముతో నీ వైపునకే మరలాము. ప్రళయదినమున మరలింపు అన్నది నీ వైపునే జరుగును.

(5) ఓ మా ప్రభువా అవిశ్వాసపరులను మాపై ప్రాభల్యమును కలిగించి మమ్మల్ని వారి కొరకు పరీక్షా సాధనంగా చేయకు అప్పుడు వారు ఇలా పలుకుతారు : ఒక వేళ వారు సత్యంపై ఉంటే మాకు వారిపై ప్రాభల్యం కలిగేది కాదు కదా. మరియు ఓ మా ప్రభువా నీవు మా పాపములను మన్నించు. నిశ్ఛయంగా నీవే ఓడించబడని సర్వాధిక్యుడివి. నీ సృష్టించటంలో,నీ ధర్మ శాసనంలో,నీ విధి వ్రాతలో వివేకవంతుడివి.

(6) ఇహలోకములో మరియు పరలోకములో అల్లాహ్ నుండి మంచిని ఆశించేవారు మాత్రమే ఈ మంచి ఆదర్శమును ఆదర్శంగా తీసుకుంటారు. మరియు ఎవరైతే ఈ మంచి ఆదర్శము నుండి విముఖత చూపుతారో నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల నుండి అక్కరలేని వాడు. ఆయనకు వారి విధేయత అవసరం లేదు. మరియు ఆయన అన్ని స్థితుల్లో స్థుతింపబడినవాడు.

(7) ఓ విశ్వాసపరులారా బహుశా అల్లాహ్ మీ మధ్య మరియు అవిశ్వాసపరుల్లో నుండి మీరు శతృత్వము చేసిన వారి మధ్య ప్రేమాభిమానములను వారికి అల్లాహ్ ఇస్లాం యొక్క భాగ్యమును కలిగించి వేస్తాడేమో. మరియు అల్లాహ్ వారి హృదయములను విశ్వాసము వైపునకు మరలించే సామర్ధ్యము కల సమర్ధుడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.

(8) మీ ఇస్లాం కారణంగా మీతో పోరాడని,మిమ్మల్ని మీ ఇండ్ల నుండి బహిష్కరించని వారికి మీరు మీపై ఉన్న వారి హక్కును చెల్లించి వారితో మీరు సద్వ్యవహారం చేయటం మరియు వారికి న్యాయం చేయటం నుండి అల్లాహ్ మిమ్మల్ని నిరోధించడు. నిశ్ఛయంగా అల్లాహ్ తమ స్వయములో,తమ ఇంటివారిలో మరియు తాము స్నేహం చేసిన వారిలో న్యాయం చేసే వారిని ఇష్టపడుతాడు.

(9) అల్లాహ్ మాత్రం మీ విశ్వాసము వలన మీతో పోరాడి మిమ్మల్ని మీ నివాసముల నుండి వెళ్ళగొట్టి మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటానికి సహాయం చేసిన వారితో మీరు స్నేహం చేయటం నుండి మిమ్మల్ని ఆపుతున్నాడు. మరియు మీలో నుండి ఎవరైతే వారితో స్నేహం చేస్తారో వారందరు అల్లాహ్ ఆదేశమును విబేధించటం వలన వినాశన స్థానమునకు చేరి తమ స్వయంపై హింసకు పాల్పడినవారు.

(10) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా విశ్వాస స్త్రీలు అవిశ్వాస ప్రదేశము నుండి ఇస్లాం ప్రదేశమునకు మీ వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు మీరు వారి విశ్వాసము యొక్క నిజమవటం విషయంలో వారితో పరీక్ష తీసుకోండి. వారి విశ్వాసము గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారి హృదయములు దేనిపై మరలి ఉన్నాయో ఏదీ కూడా ఆయనపై గోప్యంగా లేదు.వారిని పరీక్షించిన తరువాత మీకు వారి నిజాయితీ గురించి బహిర్గతం అయిన తరువాత ఒక వేళ మీరు వారిని మీరు విశ్వాసపరులని తెలుసుకుంటే వారిని మీరు వారి అవిశ్వాస భర్తల వైపునకు వాపసు చేయకండి. విశ్వాసపర స్త్రీలు అవిశ్వాసపరుల వివాహ బంధంలో కొనసాగటం ధర్మ సమ్మతం కాదు. మరియు అవిశ్వాసపరులు విశ్వాసపర స్త్రీలను వివాహం చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. మరియు వారు వారికి చెల్లించిన మహర్ ను మీరు వారి భర్తలకు ఇచ్చివేయండి. ఓ విశ్వాసపరులారా వారి ఇద్దత్ ముగిసిన తరువాత వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు వారితో మీరు వివాహం చేసుకోవటంలో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు ఎవరి భార్య అయితే అవిశ్వాసపరురాలో లేదా ఇస్లాం నుండి తిరిగిపోయినదో అమె అవిశ్వాసం వలన వారి నికాహ్ బంధం తెగిపోవటం వలన ఆమెను ఆపకూడదు. మరియు మీరు అవిశ్వాసపరులతో మీ మరలిపోయిన భార్యలకు మీరు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోండి. మరియు వారు కూడా ఇస్లాం స్వీకరించిన తమ భార్యలకు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోవాలి. మీకు ఈ ప్రస్తావించబడినది మీ వైపు నుండి మరియు వారి వైపు నుండి మహర్ ల మరలింపు అది అల్లాహ్ ఆదేశము. పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్నదాని ద్వారా మీ మధ్య తీర్పునిస్తాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల స్థితుల గురించి మరియు వారి కర్మల గురించి బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన దాసుల కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.

(11) మరియు ఒక వేళ మీ భార్యల్లోంచి ఎవరైన అవిశ్వాసపరుల వద్దకు మరలి వెళ్ళిపోవటమే జరిగి మీరు అవిశ్వాసపరుల నుండి వారి మహర్ లను కోరితే వారు వాటిని ఇవ్వకపోతే మీరు అవిశ్వాసపరుల నుండి యుద్ద ప్రాప్తిని పొందినప్పుడు ఎవరి భార్యలు మరలి వెళ్ళిపోయారో ఆ భర్తలకు వారు ఖర్చు చేసిన మహర్ లను ఇవ్వండి. మరియు మీరు ఆ అల్లాహ్ తో ఎవరి ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి మీరు విశ్వసించిన ఆయనతో భయపడండి.

(12) ఓ ప్రవక్తా విశ్వాసపర స్త్రీలు మీ వద్దకు మీతో ప్రమాణం చేస్తూ వచ్చినప్పుడు - మక్కా విజయదినమున జరిగినట్లుగా- వారు అల్లాహ్ తో పాటు దేనినీ సాటి కల్పించరని, అంతే కాక వారు ఆయన ఒక్కడి ఆరాధన చేస్తారని,దొంగతనం చేయరని,వ్యభిచారము చేయరని,అజ్ఞాన కాలం నాటి వారి అలవాటును అనుసరిస్తూ తమ సంతానమును హతమార్చరని,తమ భర్తలకు తమ సంతానమును వ్యభిచార సంతానముగా అంటగట్టమని, ఏ మంచి కార్యంలో నౌహా చేయటం,జుట్టు పీక్కోవటం,బట్టలను చించుకోవటం లాంటి కార్యముల నుండి వారించబడటం నుండి మీపై అవిధేయత చూపమని (మీతో ప్రమాణం చేస్తే) వారితో మీరు ప్రమాణం చేయించండి. మరియు మీతో వారి ప్రమాణం తరువాత మీరు వారి కొరకు వారి పాపముల మన్నింపును అల్లాహ్ తో వేడుకోండి. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.

(13) ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా అల్లాహ్ ఆగ్రహమును చూపిన జాతి వారితో మీరు స్నేహం చేయకండి. వారు పరలోకముపై నమ్మకము లేనివారు. అంతే కాదు వారు దాని నుండి నిరాశ చెంది ఉన్నారు తమ మృతులు తమ వైపునకు మరలటం నుండి మరణాంతరం లేపబడటంపై తమ అవిశ్వాసం వలన తాము నిరాశులైనట్లు.