50 - Qaaf ()

|

(1) {قٓ} ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యాలపై చర్చ జరిగినది. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ పై దానిలో ఉన్న అర్ధాలు మరియు అధికమైన మేలు మరియు శుభాల వలన ప్రళయదినము నాడు మీరు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని ప్రమాణం చేశాడు.

(2) వారు మీ నిజాయితీని తెలిసి కూడా తిరస్కరించటం వారి నుండి ఆశించటం వారి తిరస్కారమునకు కారణం కాలేదు. కానీ హెచ్చరించే ఒక ప్రవక్త దైవ దూతల్లోంచి కాకుండా వారిలో నుంచే వారి వద్దకు రావటం ఆశ్ఛర్యమునకు గురి చేయటం (కారణమయింది). మరియు వారు తమ ఆశ్చర్యముతో ఇలా పలికారు : మనుషుల్లోంచి ఒక ప్రవక్త మా వద్దకు రావటం ఒక ఆశ్ఛర్యకరమైన విషయం.

(3) ఏమీ మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మేము మరల లేపబడుతామా ?! ఈ మరలింపబడటం మరియు మా శరీరములకు జీవితం మరలించటం అది కూడా ప్రతీ వస్తువు క్రుశించిపోయిన తరువాత చాలా దూరమైన విషయం. అది జరగటం సాధ్యంకాని విషయం.

(4) వారి మరణం తరువాత వారి శరీరముల నుండి భూమి ఏమి తింటుందో మరియు ఏది నాశనం చేస్తుందో మాకు తెలుసు. మరియు వారి జీవితంలో మరియు మా వద్ద వారి మరణం తరువాత అల్లాహ్ వారికోసం ఏమేమి అంచనా వేసి ఉంచాడో ప్రతీది గుర్తుంచుకునే ఒక గ్రంధం ఉన్నది.

(5) కాని ఈ ముష్రికులందరు ఖుర్ఆన్ ను వారి వద్దకు ప్రవక్త దాన్ని తీసుకుని వచ్చినప్పుడు తిరస్కరించారు. అప్పుడు వారు ఒక సమస్యాత్మక పరిస్థితిలో ఉన్నారు. వారు దాని విషయంలో (ఖుర్ఆన్ విషయంలో) దేనిపై స్థిరంగా ఉండలేరు.

(6) ఏమీ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరు తమ పైన ఉన్న ఆకాశము విషయంలో మేము దాన్ని ఎలా సృష్టించామో మరియు మేము దాన్ని ఎలా తయారు చేశామో మరియు మేము దానిలో ఉంచిన నక్షత్రములతో దాన్ని ఎలా ముస్తాబు చేశామో మరియు దానిలో లోపమును కలిగించే ఎటువంటి పగుళ్ళు లేకపోవటంలో యోచన చేయటం లేదా ?! కావున ఈ ఆకాశమును సృష్టించిన వాడు మృతులను జీవింపజేసి మరణాంతరం లేపటం నుండి అశక్తుడు కాడు.

(7) మరియు భూమిని మేము దానిపై నివాసము కొరకు యోగ్యముగా ఉండేటట్లు దాన్ని విస్తరింపజేశాము. మరియు అది కదలకుండా ఉండేటందుకు అందులో మేము స్థిరమైన పర్వతములను ఉంచాము. మరియు మంచి దృశ్యమును కలిగించే అన్నీరకముల మొక్కలను మరియు చెట్లను అందులో మేము మొలకెత్తింపజేశాము.

(8) మరియు మేము వీటన్నింటిని తన ప్రభువు వైపునకు విధేయత ద్వరా మరలే ప్రతీ దాసుని కొరకు దూరదృష్టి అవటానికి మరియు హితబోధన అవటానికి సృష్టించాము.

(9) మరియు మేము ఆకాశము నుండి చాలా ప్రయోజనకరమైన,మేలైన నీటిని కురిపించాము. ఆ నీటి ద్వారా మేము చాలా తోటలను పండించాము. మరియు మీరు కోత కోసే జొన్నలు మొదలగు ధాన్యములను పండించాము.

(10) మరియు దాని ద్వారా మేము పొడవైన, ఎత్తైన ఖర్జూరపు చెట్లను పండించాము, ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన పండ్ల గుత్తులు వాటికి కలవు.

(11) వాటి నుండి మేము పండించిన దాన్ని దాసుల కొరకు ఆహారంగా వారు దాని నుండి తినటానికి పండించినాము. మరియు మేము దాని ద్వారా ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమును జీవింపజేశాము. ఏ విధంగా నైతే ఈ వర్షము ద్వారా మేము ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమును జీవింపజేశామో అలాగే మేము మృతులను జీవింపజేస్తాము అప్పుడు వారు జీవించి బయటకు వస్తారు.

(12) ఓ ప్రవక్తా మిమ్మల్ని తిరస్కరించిన వీరందరికన్న ముందు చాలా సమాజాలు తమ ప్రవక్తలను తిరస్కరించారు. నూహ్ జాతి వారు మరియు బావి వారు తిరస్కరించారు మరియు సమూద్ జాతివారు తిరస్కరించారు.

(13) మరియు ఆద్ జాతివారు,ఫిర్ఔన్ మరియు లూత్ జాతివారు తిరస్కరించారు.

(14) అయికా వారైన షుఐబ్ జాతివారు మరియు తుబ్బా జాతివారు యమన్ రాజును తిరస్కరించారు. ఈ జాతులవారందరు అల్లాహ్ వారి వద్దకు పంపించిన ప్రవక్తలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారితో వాగ్దానం చేసిన శిక్షను వారిపై నిరూపించాడు.

(15) అయితే ఏమిటీ మేమి మిమ్మల్ని మొదటి సారి సృష్టించటం నుండి అలసిపోయామా మిమ్మల్ని మరల లేపటం నుండి అలసిపోవటానికి ?! కాని వారిని సృష్టించిన తరువాత సరికొత్తగా సృష్టించటం గురించి వారు ఆశ్ఛర్యములో పడి ఉన్నారు.

(16) మరియు నిశ్చయంగా మేము మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనసులో పుట్టుకొచ్చే ఆలోచనలు,హావభావాలు మాకు తెలుసు. మరియు మేము అతనికి హృదయముతో ఇమిడి ఉండి గొంతులో ఉండే నరము కన్న చాలా దగ్గరగా ఉన్నాము.

(17) అతని కర్మను తీసుకునే ఇద్దరు దూతలు తీసుకునేటప్పుడు వారిలో ఒకడు అతని కుడి ప్రక్న కూర్చుని ఉంటాడు మరియు రెండవ వాడు అతనికి ఎడమ ప్రక్క కూర్చుని ఉంటాడు.

(18) అతని వద్ద అతను పలికే ప్రతి మాటకు పర్యవేక్షకునిగా (వ్రాయటానికి) ప్రత్యక్షంగా ఒక దూత ఉంటాడు.

(19) మరియు మృత్యువు తీవ్రత సత్యపరంగా వచ్చి తీరుతుంది దాని నుండి పారిపోవటానికి ఏ స్థలం ఉండదు. నిర్లక్ష్యంలో ఉన్న ఓ మానవుడా దాని నుండి నీవు దూరం కాజాలవు మరియు పారిపోలేవు.

(20) మరియు బాకాలో ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత రెండవ సారి బాకాలో ఊదుతాడు. అది ప్రళయదినము. అవిశ్వాసపరులకు,అవిధేయులకు శిక్ష గురించి హెచ్చరించే రోజు.

(21) మరియు ప్రతీ వ్యక్తి తనతో పాటు తనను తీసుకుని వచ్చే ఒక దూతతో మరియు తన కర్మల గురించి సాక్ష్యం పలికే దూతతో వస్తాడు.

(22) తీసుకుని రాబడిన ఆ మనిషితో ఇలా పలకబడుతుంది : నిశ్చయంగా నువ్వు ఇహలోకంలో ఈ దినము గురించి నీ మనోవాంఛలతో మరియు నీ కోరికలతో నీ మోసపోవటం వలన నిర్లక్ష్యంలోపడి ఉన్నావు. అయితే నీవు శిక్షను,యాతనను కళ్ళారా చూడటం వలన మేము నీ నుండి నీ పరధ్యానమును తొలగించాము. నీ చూపులు నీవు పరధ్యానంలో ఉన్న వాటిని పొందటానికి ఈ రోజు చురుకుగా ఉన్నవి.

(23) మరియు దైవదూతల్లోంచి అతని బాధ్యత వహించే అతని సహచరుడు ఇలా పలుకుతాడు : ఎటువంటి తరగుదల లేకుండా, అధికం చేయకుండా నా వద్ద ఉన్న అతని కర్మలో నుంచి ఇది.

(24) మరియు అల్లాహ్ తీసుకుని వచ్చే మరియు సాక్ష్యం పలికే ఇద్దరు దూతలతో ఇలా పలుకుతాడు : మీరిద్దరు సత్యమును తిరస్కరించి దాన్ని విబేధించే ప్రతీ వ్యక్తిని నరకంలో వేయండి.

(25) తన పై అల్లాహ్ అనివార్యం చేసిన హక్కులను ఎక్కువగా ఆపేవాడిని,అల్లాహ్ హద్దులను అతిక్రమించేవాడిని,తనకు తెలియపరచబడిన వాగ్దానము,హెచ్చరిక విషయంలో సందేహపడేవాడిని.

(26) అతడే అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధనలో ఆయన తో పాటు సాటి కల్పించుకుని చేసుకున్నాడు. కావున అతడిని తీవ్రమైన శిక్షలో పడవేయండి.

(27) షైతానుల్లో నుంచి అతని స్నేహితుడు అతని నుండి నిర్దోషత్వమును చూపుతూ ఇలా పలుకుతాడు : ఓ మా ప్రభువా నేను అతన్ని అపమార్గమునకు లోను చేయలేదు. కాని అతడే సత్యము నుండి మార్గభ్రష్టత్వములో చాలా దూరం వెళ్ళిపోయాడు.

(28) అల్లాహ్ ఇలా పలుకుతాడు : మీరు నా దగ్గర గొడవపడకండి. దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నిశ్చయంగా నేను ముందుగానే ఇహలోకంలో మీ వద్దకు నన్ను తిరస్కరించిన మరియు నా పట్ల అవిధేయతకు పాల్పడిన వారి కొరకు నా ప్రవక్తలు తీసుకుని వచ్చిన తీవ్ర హచ్చరికను పంపించినాను.

(29) నా వద్ద మాట మార్చబడదు మరియు నా వాగ్దానం నెరవేరకుండా ఉండదు. మరియు నేను దాసులపై వారి పుణ్యాలను తరిగించి గాని వారి పాపములను అధికం చేసి గాని అన్యాయం చేయను. కాని వారు చేసిన కర్మలకు నేను ప్రతిఫలమును ప్రసాదిస్తాను.

(30) ఆ రోజు మేము నరకముతో ఏమీ నీలో వేయబడిన అవిశ్వాసపరులతో,పాపాత్ములతో నీవు నిండిపోయావా ? అని అడుగుతాము. అప్పుడు అది తన ప్రభువుతో ఇంకా ఏదైనా అధికంగా ఉన్నదా ? అని అధికంగా కోరుతూ ఆగ్రహంతో తన ప్రభువుకు సమాధానమిస్తుంది.

(31) మరియు తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారి కొరకు స్వర్గము దగ్గర చేయబడుతుంది. అప్పుడు వారు అందులో ఉన్న వారి నుండి దూరంగా లేని అనుగ్రహాలను చూసుకుంటారు.

(32) మరియు వారితో ఇలా పలకబడుతుంది : ఇది అల్లాహ్ తన ప్రభువు వైపునకు పశ్చాత్తాపముతో ఎక్కువగా మరలే ప్రతీ వ్యక్తి కొరకు మరియు తన ప్రభువు తనకు తప్పని సరి చేసిన దాన్ని పరిరక్షించే వారి కొరకు కల దాని గురించి మీకు వాగ్దానం చేశాడు.

(33) ఎవరైతే రహస్యంగా అల్లాహ్ కు భయపడుతాడో ఏ విధంగానంటే అతడిని అల్లాహ్ తప్ప ఇంకెవరూ చూడటం లేదు. మరియు అల్లాహ్ వైపునకు మరలే పరిశుద్ధ హృదయముతో అల్లాహ్ తో కలుస్తాడో,ఆయన వైపునకు అధికంగా మరలే వాడు.

(34) మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు ద్వేషించే వాటి నుండి భద్రతతో స్వర్గంలో ప్రవేశించండి. అది దాని తరువాత అంతం లేని శాశ్వతమైన దినము.

(35) వారి కొరకు అందులో వారు కోరుకున్న తరగని అనుగ్రహాలు ఉంటాయి. మరియు మా వద్ద ఏ కళ్ళు చూడని మరియు ఏ చెవులు వినని మరియు ఏ మనిషి హృదయములో తట్టని అనుగ్రహాలు అధికంగా ఉంటాయి. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ను దర్శించుకోవటం అందులో నుంచే.

(36) మక్కా వాసుల్లోంచి తిరస్కరించిన ఈ ముష్రికులందరికన్నా ముందు మేము వినాశనమునకు గురిచేసిన చాలా తరాల వారున్నారు. వారు బహుశా శిక్ష నుండి తప్పించుకుని పారిపోయే ప్రదేశం పొందుతారని పట్టణాల్లో గాలించసాగారు. కాని వారు దాన్ని పొందలేదు.

(37) నిశ్చయంగా పూర్వ సమాజాల వినాశనపు ఈ ప్రస్తావించబడటంలో అర్ధం చేసుకునే హృదయం కలవాడికి లేదా మనస్సును అట్టిపెట్టి నిర్లక్ష్యంగా కాకుండా లక్ష్యపెట్టి వినేవాడికి ఒక ఉపదేశము మరియు హితోపదేశమున్నది.

(38) మరియు నిశ్చయంగా మేము ఆకాశములను మరియు భూమిని మరియు భూమ్యాకాశముల మధ్య ఉన్న వాటిని ఒక్క క్షణంలో వాటిని సృష్టించటంపై మాకు సామర్ధ్యం ఉండి కూడా ఆరు దినములలో సృష్టించినాము. మరియు యూదులు పలికినట్లు మాకు ఎటువంటి అలసట కలగలేదు.

(39) ఓ ప్రవక్త యూదులు మరియు ఇతరులు పలికే మాటలపై మీరు సహనం చూపండి. మరియు మీ ప్రభువు కొరకు ఆయన స్థుతులను పలుకుతూ సూర్యోదయం కన్న ముందు మీరు ఫజర్ నమాజును చదవండి మరియు అది అస్తమించక ముందు అసర్ నమాజును చదవండి.

(40) మరియు ఆయన కొరకు రాత్రి నమాజును చదవండి. మరియు నమాజుల తరువాత ఆయన పరిశుద్ధతను కొనియాడండి.

(41) ఓ ప్రవక్తా బాకాలో రెండవ సారి ఊదే బాధ్యత ఇవ్వబడిన దూతను దగ్గర ప్రదేశము నుండి పిలిచే దినమున మీరు చెవి యొగ్గి వినండి.

(42) ఆ రోజున సృష్టితాలన్నీ మరణాంతరం లేపబడే శబ్దమును సత్యముతో వింటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. అది వారు దాన్ని వినే రోజు మృతులు తమ సమాదుల నుండి లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు బయటకు వచ్చే రోజు అది.

(43) నిశ్చయంగా మేమే జీవింపజేసేవారము మరియు మరణింపజేసేవారము. మేము తప్ప ఎవరూ జీవింపజేసేవారు మరియు మరణింపజేసేవారు లేరు. మరియు ప్రళయ దినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు దాసుల మరలింపు మా ఒక్కరి వైపే జరుగును.

(44) భూమి పగిలే రోజు వారు హడావిడిగా బయటకు వస్తారు. ఈ సమీకరించటం మా పై ఎంతో సులభము.

(45) ఈ తిరస్కారులందరు పలికే మాటల గురించి మాకు బాగా తెలుసు. ఓ ప్రవక్త వారిని విశ్వాసము తీసుకునిరావటంపై బలవంతం చేయటానికి మీరు వారిపై నియమింపబడలేదు. మీరు అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని చేరవేసేవారు మాత్రమే. కావున మీరు నా హెచ్చరికకు భయపడే అవిశ్వాసపరులకు,పాపాత్ములకు ఖుర్ఆన్ ద్వారా హితబోధన చేయండి. ఎందుకంటే భయపడేవాడే హితబోధన చేయబడినప్పడు హితబోధన గ్రహిస్తాడు మరియు గుణపాఠం నేర్చుకుంటాడు.