109 - Al-Kaafiroon ()

|

(1) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా.

(2) ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను.

(3) నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.

(4) మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.

(5) నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.

(6) మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లాహ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది.