23 - Al-Muminoon ()

|

(1) నిశ్ఛయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారూ,ఆయన ధర్మము ప్రకారం ఆచరించే వారు తాము కోరిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడే వాటి నుండి విముక్తిని పొందటం ద్వారా సాఫల్యం చెందారు.

(2) తమ నమాజులో అణకువను చూపుతారు, అందులో వారి అవయవములకు కదలికలు ఉండవు. మరియు వారి హృదయములు కార్య నిమగ్నత నుండి ఖాళీగా ఉంటాయి.

(3) మరియు ఎవరైతే అసత్యము నుండి, వ్యర్ధ కార్యకలాపాల నుండి, పాపము ఉన్న మాటల నుండి,కార్యాల నుండి దూరంగా ఉంటారో వారు.

(4) మరియు ఎవరైతే అశుద్ధతల నుండి తమ మనస్సులను శుద్ధ పరచటానికి,తమ సంపదలను శుద్ధ పరచటానికి వాటి జకాత్ విధి దానమును చేస్తారో వారు.

(5) మరియు ఎవరైతే తమ మర్మావయవాలను వ్యభిచారము నుండి,స్వలింగ సంపర్కము నుండి,అశ్లీల కలాపాల నుండి వాటిని దూరంగా ఉంచి కాపాడుకుంటారో వారు. వారు స్వచ్ఛమైన వారు,పరిశుద్ధులు.

(6) కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బనిసలతో. ఎందుకంటే వారితో సంబోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు.

(7) అయితే ఎవరైతే బార్యలను లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలు కాకుండా వేరే వారితో ప్రయోజనం చెందటమును ఆశిస్తాడో అతడు తనకు ఏ ప్రయోజనం అయితే సమ్మతమో దాని నుండి తనకు సమ్మతం కాని దాని వైపునకు వెళ్లటం వలన అల్లాహ్ హద్దులను అతిక్రమించాడు.

(8) మరియు అల్లాహ్ వారికి అప్పజెప్పినవి లేదా ఆయన దాసులు వారికి అప్పజెప్పిన పూచీలను, తమ వాగ్దానములను వృధా చేయకండా వాటిని పూర్తి చేసి పరిరక్షించేవారు వారే.

(9) మరియు తమ నమాజులను వాటిని అను నిత్యం పాటించటంతో,వాటి వేళల్లో,వాటి షరతులతో,వాటి విధులతో,వాటి సున్నతులతో పాటిస్తూ పరిరక్షించేవారు వారే.

(10) ఈ గుణములతో వర్ణించబడిన వీరందరే వారసులు.

(11) వారే ఎవరైతే ఉన్నతమైన స్వర్గమునకు వారసులవుతారో. వారు అందులో శాస్వతంగా ఉంటారు. అందులో వారి అనుగ్రహాలు అంతము కావు.

(12) మరియు నిశ్ఛయంగా మేము మానవ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించాము. దాని మట్టి భూమి మట్టిలో కలిపిన నీటి నుండి తీసిన ఒక సారం నుండి తీసుకోబడింది.

(13) ఆ తరువాత మేము జన్మించే వేళ వరకు గర్భములో స్థానమేర్పరచుకునే వీర్య బిందువుతో అతని సంతానమును పుట్టించాము.

(14) దాని తరువాత మేము గర్భంలో స్థిరంగా ఉన్న వీర్యపు బిందువును ఎర్రటి రక్తపు ముద్దగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎర్రటి రక్తపు ముద్దను నమిలివేయబడిన ఒక మాంసపు ముక్క లాగా చేశాము. అప్పుడు మేము ఆ మాంసపు ముక్కను గట్టిపడిన ఎముకలుగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎముకలకు మాంసమును తొడిగించాము. ఆ తరువాత మేము దానిలో ఆత్మను ఊది,దాన్ని మరో జీవితం వైపునకు తీసుకుని వెళ్ళి దాన్ని వేరొక సృష్టిగా సృష్టించాము. అందరికన్నా ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ శుభకరుడు.

(15) ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ ప్రజలారా ఆ దశల నుండి వెళ్ళిన తరువాత మీ ఆయుష్యులు మగిసినప్పుడు మీరు మరణిస్తారు.

(16) ఆ తరువాత నిశ్ఛయంగా మీరు మీ మరణం తరువాత ప్రళయదినమున మీ సమాదుల నుండి మీరు ముందు పంపించుకున్న కర్మల లెక్క తీసుకోబడటం కొరకు మరల లేపబడుతారు.

(17) మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రజలారా మీపై సప్తాకాశాలను ఒక దానిపై ఒకటిగా సృష్టించాము. మరియు మేము మా సృష్టితాల విషయంలో నిర్లక్ష్యంగా లేము,మేము వాటిని మరిచేవారము కాము.

(18) మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని నాశనం చేసేంత ఎక్కువా కాకుండా,సరిపోనంత తక్కువ కాకుండా అవసరానికి సరిపడే ప్రమాణంలో కురిపించాము. ఆ తరువాత దాన్ని మేము భూమిలో స్థిరపరచాము. ప్రజలు,జంతువులు దానితో ప్రయోజనం చెందుతాారు. మరియు నిశ్ఛయంగా మేము దాన్ని తీసుకునటంలో సామర్ధ్యం కలవారము. అప్పుడు మీరు ప్రయోజనం చెందలేరు.

(19) అప్పుడు మేము ఆ నీటితో మీ కొరకు ఖర్జూరపు,ద్రాక్ష తోటలను ఉత్పత్తి చేశాము. వాటిలో మీ కొరకు రకరకాల రూపములు,రంగులు గల అంజూరము,దానిమ్మ,యాపిల్ లాంటి పండ్లు ఉన్నాయి. వాటిలో నుండి మీరు తింటారు.

(20) మరియు మేము దానితో మీ కొరకు సీనాయ్ పర్వతం ప్రాంతంలో వెలికి వచ్చే ఆలీవ్ వృక్షమును సృష్టించాము. అది తన ఫలముల నుండి వెలువడే నూనెను ఉత్పత్తి చేస్తుంది. దానితో నూనె తయారు చేయబడుతుంది. మరియు కూర వండబడుతుంది.

(21) మరియు ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ కొరకు జంతువుల్లో (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) గుణపాఠము ఉన్నది. మరియు మీరు అల్లాహ్ సామర్ధ్యము,మీపై ఉన్న ఆయన దయ పై మీరు ఆధారము ఇస్తున్న ఆధారము ఉన్నది. మేము త్రాగే వారి కొరకు ఈ జంతువుల కడుపులలో ఉన్న స్వచ్ఛమైన,ఆమోద యోగ్యమైన (రుచికరమైన) పాలను మీకు త్రాపిస్తాము. మరియు మీ కొరకు వాటిలో మీరు ప్రయోజనం చెందే చాలా ప్రయోజనాలు కలవు. వాటిలో నుండి : ఉదాహరణకు సవారీ చేయటం,ఉన్ని,ఒంటె వెంట్రుకలు,జుట్టు,మరియు మీరు వాటి మాంసములో నుండి తింటారు.

(22) మరియు మీరు భూమిలో జంతువుల్లోంచి ఒంటెలపై,సముద్రంలో ఓడలపై సవారీ చేయబడుతారు.

(23) మరియు నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను ఆయన జాతి వారి వద్దకు వారిని అల్లాహ్ వైపు పిలవటానికి పంపించాము. అప్పుడు ఆయన వారితో అన్నారు : ఓ నా జాతి వారా మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు సత్య ఆరాధ్య దైవం లేడు. ఏమీ మీరు అల్లాహ్ తో ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భీతిని కలిగి ఉండరా ?.

(24) ఆయన జాతి వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన పెద్దవారు,నాయకులు తమను అనుసరించే వారితో,సాధారణ ప్రజలతో ఇలా పలికారు : తాను ప్రవక్తనని వాదించే ఇతను మీలాంటి ఒక మనిషి మాత్రమే అతడు మీపై అధికారమును,నాయకత్వమును ఆశిస్తున్నాడు. ఒక వేళ అల్లాహ్ మా వద్దకు ఒక ప్రవక్తనే పంపించదలిస్తే అతన్ని దైవ దూతల్లోంచి పంపించేవాడు. అతడిని మనుషుల్లోంచి పంపించేవాడు కాదు. మాకన్న పూర్వం గతించిన పూర్వికుల వద్ద అతడు వాదిస్తున్నటువంటి దాన్ని మేము విన లేదు.

(25) ఇతడు కేవలం పిచ్చి పట్టిన ఒక మనిషి మాత్రమే.అతను చెబుతున్నది అతనికే తెలియదు. అయితే మీరు అతని విషయం ప్రజల కొరకు స్పష్టమయ్యే వరకు అతనితో పాటు నిరీక్షించండి.

(26) నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.

(27) అప్పుడు మేము ఒక ఓడను మా పర్యవేక్షణలో,దాన్ని ఎలా తయారు చేయాలో మేము నీకు నేర్పంచిన విధంగా తయారు చేయమని వహీ ద్వారా తెలియపరచాము. అయితే వారి వినాశనముతో మా ఆదేశము వచ్చినప్పుడు,నీరు ఉడకబెడుతున్న ప్రదేశము నుండి బలంగా పొంగినప్పుడు అందులో (ఓడలో) ప్రాణం ఉన్న ప్రతి ఆడ,మగను సంతానము కొనసాగటానికి ప్రవేశింపజేయి. మరియు నీ ఇంటి వారిలోంచి నీ భార్య,నీకుమారుడు లాంటి వారు వినాశనం గురించి అల్లాహ్ మాట ముందే జరిగిపోయినదో వారు తప్ప ప్రవేశింపజేయి. మరియు నీవు వారి విషయంలో ఎవరైతే అవిశ్వాసముతో దుర్మార్గమునకు పాల్పడ్డారో వారి విముక్తిని,వారిని వినాశనమును వదిలివేయటమును ఆశిస్తూ నాతో మాట్లాడకు. నిశ్ఛయంగా వారు తుఫాను నీటిలో ముంచబడి ఖచ్చితంగా వినాశనమునకు గురి అవుతారు.

(28) నీవు, నీతోపాటు విముక్తి పొందిన విశ్వాసపరులు ఓడలో ఎక్కినప్పుడు ఇలా పలుకు : సర్వ స్తోత్రములు ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే మమ్మల్ని అవిశ్వాస జాతి వారి నుండి రక్షించాడో మరియు వారిని తుదిముట్టించాడో.

(29) మరియు నీవు ఇలా పలుకు : ఓ నా ప్రభువా నీవు నన్ను గౌరవ ప్రదంగా భూమిపై దించు. మరియు నీవు మంచిగా దించేవాడివి.

(30) నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,ఆయనతో పాటు విశ్వాసపరులను విముక్తి కలిగించటంలో,అవిశ్వాసపరులను తుది ముట్టించటంలో మా ప్రవక్తలకు సహాయం చేయటంలో,వారిని తిరస్కరించిన వారిని తుదిముట్టించటంలో మా సామర్ధ్యంపై గొప్ప సూచనలు కలవు. నిశ్ఛయంగా మేము నూహ్ జాతిని వారి వద్దకు ఆయనను పంపించి అవిశ్వాసపరుడు నుండి విశ్వాసపరుడు,అవిధేయుడు నుండి విధేయుడు స్పష్టమవటం కొరకు పరీక్షిస్తాము.

(31) ఆ పిదప నూహ్ జాతివారిని తుదిముట్టించిన తరువాత మేము మరొక జాతి వారిని పుట్టించాము.

(32) అప్పుడు మేము వారిలోని వారి నుండే ఒక ప్రవక్తను పంపించాము. అతడు వారిని అల్లాహ్ వైపు పిలుస్తాడు. అయితే ఆయన వారితో ఇలా పలికాడు : మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అయితే, ఏమిటీ మీరు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ,ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ అల్లాహ్ తో భయపడరా ?.

(33) మరియు అతని జాతి వారిలో నుంచి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,పరలోకమును,అందులో ఉన్న పుణ్యమును,శిక్షను తిరస్కరించినటువంటి పెద్దవారు,నాయకులు మరియు మేము ఎవరికైతే ఇహలోక జీవితంలో పుష్కలంగా అనుగ్రహాలను కలిగించామో ఆ మితిమీరిన వారు తమను అనుసరించే వారితో,తమ సాధారణ ప్రజల్లో ఇలా పలికారు : ఇతడు మీరు తినేటటువంటి వాటిలో నుంచి తినే,మీరు త్రాగేటటువంటి వాటిలో నుంచి త్రాగే మీ లాంటి ఒక మనిషి మాత్రమే. అతనికి మీపై ఏ ప్రాముఖ్యత లేదు చివరికి అతను మీ వైపునకే ఒక ప్రవక్తగా పంపించబడ్డాడు.

(34) మరియు ఒక వేళ మీరు మీ లాంటి ఒక మనిషిని అనుసరిస్తే మీరు మీ ఆరాధ్య దైవాలను వదిలి వేయటం వలన అతని అనుసరణతో మీకు ప్రయోజనం లేక పోవటం వలన మరియు మీపై ఎటువంటి ప్రాముఖ్యత లేని వాడిని అనుసరించటం వలన నిశ్ఛయంగా అటువంటప్పుడు నష్టపోతారు.

(35) ఏమీ, తాను ప్రవక్తనని వాదించే ఇతను మీరు మరణించి మట్టిగా ఎముకలు క్రుసించి పోయినప్పుడు మీరు మీ సమాదుల నుండి జీవింపబడి వెలికి తీయబడుతారని మీతో వాగ్దానం చేస్తున్నాడా ?!. ఏమీ ఇది అర్ధం అయ్యే విషయమా ?!.

(36) మీరు మరణించి మీ పరిణామం మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయిన తరువాత జీవింపబడి మీ సమాదుల నుండి మీరు వెలికి తీయబడుతారని మీతో చేయబడతున్న వాగ్దానం చాలా దూరము (అసంభవం).

(37) జీవితం ఇహలోక జీవితం మాత్రమే. పరలోక జీవితం లేదు. మాలో నుండి జీవించి ఉన్న వారు మరణిస్తారు మరియు బ్రతకరు. మరియు వేరే వారు జన్మిస్తారు ,వారు జీవిస్తారు. మా మరణం తరువాత ప్రళయ దినం నాడు లెక్క కొరకు మేము వెలికి తీయబడము.

(38) మీ వైపునకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదన చేసే ఇతడు ఒక మనిషి మాత్రమే అతడు తన ఈ వాదనతో అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడు. మరియు మేము అతనిపై విశ్వాసమును కనబరచము.

(39) ప్రవక్త ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.

(40) అల్లాహ్ ఇలా పలుకుతూ ఆయనకు సమాధానమిచ్చాడు : కొంత కాలం తరువాత నీవు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వీరందరు తొందలోనే తమ నుండి జరిగిన తిరస్కారము పై పశ్ఛాత్తాప్పడేవారైపోతారు.

(41) అప్పుడు వారి మొండి తనము వలన వారు శిక్ష యొక్క అర్హులు కావటం వలన వారికి తీవ్ర వినాశనము గల శబ్దము పట్టుకుంది. అప్పుడు అది వారిని నీటి ప్రవాహంపై కొట్టుకుని వచ్చిన చెత్త మాదిరిగా వినాశనమైన వారిగా చేసేసింది.

(42) వారిని వినాశనము చేసిన తరువాత మేము లూత్ జాతి,షుఐబ్ జాతి,యూనుస్ జాతి వారి లాంటి ఇతర జాతులను,సమాజములను పుట్టించాము.

(43) ఈ తిరస్కార జాతుల్లోంచి ఏ జాతి కూడా దాని వినాశనం రావటం కొరకు నిర్ణయించబడిన సమయము కన్న ముందుకు పోజాలదు,దాని నుండి వెనుకకు పోజాలదు. దాని కొరకు ఏ కారకాలు ఉన్నా కూడా.

(44) ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒక ప్రవక్త తరువాత ఒక ప్రవక్తను క్రమం తప్పకుండా పంపించాము. ఎప్పుడైనా ఈ జాతుల్లోంచి ఏ ఒక జాతి వద్దకు దాని వైపు పంపించబడ్డ దాని ప్రవక్త వస్తే వారు అతడిని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని ఒకరి తరువాత ఒకరిని వినాశనముతో అనుసరించాము. వారి గురించి ప్రజల గాధలు తప్ప వారి కొరకు అస్తిత్వము మిగలలేదు. అయితే తమ ప్రభువు వద్ద నుండి తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని విశ్వసించని జాతి వారి కొరకు వినాశనము కలుగు గాక.

(45) ఆ తరువాత మేము మూసాను,అతని సోదరుడు హారూన్ ను మా ఏడు మహిమలు (చేతి కర్ర,చేయి,మిడుతలు,నల్లులు,కప్పలు,రక్తము,తుఫాను,కరువుకాటకాలు,ఫలాల కొరత) ,స్పష్టమైన ఆధారమును ఇచ్చి పంపించాము.

(46) మేము వారిద్దరిని ఫిర్ఔన్,అతని జాతి వారిలోంచి పెద్దల వద్దకు పంపించాము అప్పుడు వారు అహంకారమును చూపారు. అప్పుడు వారు విశ్వసించటం కొరకు వారిద్దరి మాట వినలేదు. మరియు వారు ప్రజలపై ఆధిక్యతతో,దుర్మార్గంతో అహంకారమును చూపే జాతివారు అయిపోయారు.

(47) అప్పుడు వారు ఇలా పలికారు : ఏమీ మేము మా లాంటి ఇద్దరు మనుషులను విశ్వసించాలా ?!. వారిద్దరికి మాపై ఎటువంటి ప్రాముఖ్యత లేదుఇంకా వారి జాతి వారు (ఇస్రాయీల్ సంతతివారు) మాకు విధేయత చూపే వారు,అణకువ చూపేవారు.

(48) అప్పుడు వారు అల్లాహ్ వద్ద నుండి వారు తీసుకుని వచ్చిన వాటి విషయంలో వారిద్దరిని తిరస్కరించారు. అప్పుడు వారు వారిని తిరస్కరించటం వలన ముంచబడి వినాశనమునకు గురైన వారిలో అయిపోయారు.

(49) మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును ఆయన జాతివారు దాని ద్వారా సత్యము వైపునకు మార్గం పొందుతారని,దానిపై ఆచరిస్తారని ఆశిస్తూ ప్రసాదించాము.

(50) మరియు మేము మర్యమ్ కుమారుడు ఈసా మరియు అతని తల్లి మర్యమ్ ను మా సామర్ధ్యమును సూచించే ఒక సూచనగా చేశాము. ఆమె తండ్రి లేకుండానే అతని గర్భం దాల్చింది. మరియు మేము వారిద్దరిని భూమి నుండి ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయమిచ్చాము. దానిపై స్థిరపడటానికి సమానంగా అనువైనదిగా ఉంది. అందులో ప్రవహించే తాజా నీరు ఉంది.

(51) ఓ దైవ ప్రవక్తల్లారా వేటిని తినటం మంచిదో వాటిలోంచి మేము మీ కొరకు సమ్మతము చేసిన వాటిని మీరు తినండి. మరియు మీరు ధర్మానికి అనుగుణంగా ఉన్న సత్కర్మలను చేయండి. నిశ్ఛయంగా మీరు చేస్తున్న కర్మల గురించి నాకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ నాపై గోప్యంగా ఉండదు.

(52) ఓ ప్రవక్తల్లారా నిశ్ఛయంగా మీ ధర్మం ఒకే ధర్మము అది ఇస్లాం. మరియు నేను మీ ప్రభువును నేను తప్ప మీకు ఇంకో ప్రభువు లేడు. అయితే మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నా భయమును కలిగి ఉండండి.

(53) వారి తరువాత వారిని అనుసరించిన వారు ధర్మంలో బేధాభిప్రాయాలను కల్పించుకున్నారు. అప్పుడు వారు తెగలుగా వర్గాలుగా అయిపోయారు. ప్రతీ వర్గము అల్లాహ్ వద్ద స్వీకరించబడే ధర్మము అని విశ్వసించిన దానితో సంతోషముగా ఉంది. ఇతరుల వద్ద ఉన్న దాని వైపున చూడటం లేదు.

(54) ఓ ప్రవక్తా మీరు వారిని వారిపై శిక్ష అవతరించే వరకు వారు ఉన్న అజ్ఞానం,గందరగోళంలోనే వదిలి వేయండి.

(55) ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తాము. కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు.

(56) ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తాము.కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు.

(57) నిశ్ఛయంగా ఎవరైతే తమ విశ్వాసము,తమ సత్కర్మలతోపాటుతమ ప్రభువు పట్ల భయభీతులు కలిగి ఉంటారో,

(58) మరియు ఎవరైతే ఆయన గ్రంధ ఆయతులపై విశ్వాసము కనబరుస్తారో,

(59) మరియు ఎవరైతే తమ ప్రభువు యొక్క ఏకత్వమును చాటుతూ ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించరో,

(60) మరియు ఎవరైతే పుణ్య కార్యాల్లో శ్రమించి సత్కర్మల ద్వారా దగ్గరత్వాన్ని పొందుతారో వారు ప్రళయ దినాన ఆయన వైపునకు మరలినప్పుడు అల్లాహ్ వారి నుండి వారి ఖర్చు చేయటమును,వారి సత్కర్మలను స్వీకరించడని భయపడుతుంటారు.

(61) ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారు సత్కర్మల వైపు త్వరపడుతారు. మరియు వారు వాటి వైపుకు ముందుకు సాగుతారు,దాని వలనే వారు ఇతరులకంటే ముందుకు సాగిపోతారు.

(62) మరియు మేము ఏ ప్రాణిపై ఆచరణ భారం వేసినా అతని శక్తి మేరకు వేస్తాము. మరియు మా వద్ద ఒక పుస్తకమున్నది అందులో మేము ఆచరించే ప్రతీ వ్యక్తి యొక్క ఆచరణను పొందుపరచాము. అది ఎటువంటి సందేహము లేని సత్యం గురించి పలుకుతుంది. మరియు తమ పుణ్యములను తగ్గించి గాని వారి పాపములను అధికం చేసి హింసకు గురి చేయబడరు.

(63) అంతేకాదు అవిశ్వాసపరుల హృదయాలు సత్యం గురించి పలికే ఈ గ్రంధం నుండి, వారిపై అవతరింపబడిన గ్రంధం నుండి పరధ్యానంలో ఉన్నవి. మరియు వారి కొరకు వారు ఉన్న అవిశ్వాసమే కాకుండా ఇతర కార్యాలు ఉన్నవి వాటిని వారు చేస్తున్నారు.

(64) చివరికి మేము ఇహలోకంలో వారిలో నుండి విలాసవంతులైన వారిని ప్రళయదినాన శిక్షించినప్పుడు వారు సహాయమును వేడుకుంటూ తమ స్వరములను పెంచుతారు.

(65) అప్పుడు వారిని అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పరుస్తూ ఇలా తెలపబడుతుంది : మీరు ఈ రోజు గోల చేయకండి, సహాయమును కోరకండి. ఎందుకంటే అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే మీ కొరకు సహాయకుడెవడూ లేడు.

(66) ఇహలోకంలో అల్లాహ్ యొక్క గ్రంధ ఆయతులు మీపై చదివి వినిపించబడేవి. అయితే మీరు వాటిని విన్నప్పుడల్లా వాటి పట్ల అయిష్టతతో ముఖము చాటేసి మరలిపోయేవారు.

(67) మీరు హరమ్ వాసులని భావిస్తున్నారు కాబట్టి మీరు ప్రజలపై అహంకారమును ప్రదర్శిస్తూ మీరు ఇలా చేస్తున్నారు. వాస్తవానికి మీరు దానికి తగిన వారు కారు. ఎందుకంటే దానికి తగిన వారు దైవ భీతి కలిగిన వారు ఉంటారు. మరియు మీరు దాని చుట్టు చెడు మాటలను రాత్రి పూట మాట్లాడgతూ ఉన్నారు. మీరు దాని పవిత్రతను లెక్క చేయటం లేదు.

(68) ఏ ఈ ముష్రికులందరు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ లో దాన్ని వారు విశ్వసించి అందులో ఉన్నవాటిని ఆచరించటానికి యోచన చేయరా ? లేదా వారి కన్నా ముందు వారి పూర్వికుల వద్దకు రానిది వారి వద్దకు వచ్చిందనా ? వారు దాని నుండు విముఖత చూపుతున్నారు మరియు దాన్ని తిరస్కరిస్తున్నారు.

(69) లేదా వారు తమ వద్దకు అల్లాహ్ ప్రవక్తగా పంపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తించరా అందుకు ఆయన్ను తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు ఆయననూ గుర్తించారు మరియు ఆయన నీతిని,ఆయన నిజాయితీని గుర్తించారు.

(70) అంతేకాదు వారు అతడు పిచ్చివాడు అని పలుకుతున్నారు. నిశ్ఛయంగా వారు తిరస్కరించారు . కాని అతను వారి వద్దకు సత్యమును అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము లేదు తీసుకుని వచ్చాడు. వారిలో చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు. తమ వద్ద నుండి అసూయ వలన, తమ అసత్యం పట్ల పక్షపాతం వలన దాన్ని ద్వేషించుకుంటున్నారు.

(71) మరియు ఒక వేళ అల్లాహ్ వ్యవహారాలను నడిపించి,వారి మనుస్సుల కోరికలకు అనుగుణంగా వాటి పర్యాలోచన చేస్తే భూమ్యాకాశములు పాడైపోయేవి. మరియు వ్యవహారాల పరిణామాల గురించి, పర్యాలోచనలో సరైనది, చెడ్డదైనది గురించి వారి అజ్ఞానం వలన వాటిలో ఉన్నవారు పాడైపోతారు. అంతేకాదు మేము వారికి వారి గౌరవము,మర్యాద కలిగి ఉన్న ఖుర్ఆన్ ను ప్రసాదించాము. వారు దాని నుండి విముఖత చూపారు.

(72) ఓ ప్రవక్తా మీరు వీరి వద్దకు తీసుకుని వచ్చిన దానిపై వీరందరితో ఏదైన పరిహారం కోరుతున్నారా మరియు అది వారి ఆహ్వానమును తిరస్కరించేటట్లు చేసినదా ?. ఇది మీతో సంభవించలేదు. అయితే మీ ప్రభువు ప్రసాదించే పుణ్యము,దాని ప్రతిఫలం వీరందరి,ఇతరుల ప్రతిఫలం కన్నా మేలైనది. మరియు పరిశుద్ధుడైన ఆయన అందరికంటే మంచిగా ఆహారమును ప్రసాదించేవాడు.

(73) మరియు నిశ్ఛయంగా మీరు ఓ ప్రవక్తా వారందరిని,ఇతరులను ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు పిలుస్తున్నారు. మరియు అది ఇస్లాం మార్గము.

(74) మరియు నిశ్ఛయంగా ఎవరైతే పరలోకంపై,అందులో ఉన్న లెక్క తీసుకోవటం,శిక్ష,ప్రతిఫలం పై విశ్వాసమును కనబరచనివారు ఇస్లాం మార్గమునుండి నరకము వైపునకు తీసుకునిపోయే వంకర మార్గములైన ఇతర మార్గముల వైపునకు మగ్గు చూపుతున్నారు.

(75) మరియు మేము వారిపై కరుణించి వారిపై కల కరువును,ఆకలిని తొలగించినా వారు సత్యం నుండి తమ అపమార్గంలోనే కొనసాగేవారు మరియు సంశయించేవారు,తడబడేవారు.

(76) వాస్తవానికి మేము వారిని రకరకాల ఆపదలతో పరీక్షించాము. అయినా వారు తమ ప్రభువుకు విధేయులు కాలేదు,ఆయన ముందు వంగలేదు. మరియు ఆపదలు కలిగినప్పుడు తమ నుండి తొలగించమని ఆయనతో అణకువతో వేడుకోలేదు.

(77) చివరికి మేము వారిపై కఠినమైన శిక్ష కల ఒక ద్వారమును తెరిచినప్పుడు వారు ప్రతీ ఉపశమనం మరియు మేలు నుండి నిరాశ చెందారు.

(78) మరియు ఓ మరణాంతరం లేపబడటమును తిరస్కరించేవారా పరిశుద్ధుడైన అల్లాహ్ ఆయనే మీ కొరకు మీరు వినటానికి చెవులను, మీరు చూడటానికి కళ్ళను, మీరు అర్ధం చేసుకోవటానికి హృదయములను సృష్టించాడు. అయినా కూడా మీరు ఈ అనుగ్రహాలపై ఆయనకు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

(79) ఓ ప్రజలారా ఆయనే మిమ్మల్ని భూమిలో సృష్టించాడు. మరియు మీరు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు.

(80) మరియు పరిశుద్ధుడైన ఆయన ఒక్కడే జీవింపజేసేవాడు. ఆయన తప్ప ఇంకెవరూ జీవింపజేసేవాడు లేడు. మరియు ఆయన ఒక్కడే మరణాన్ని ప్రసాదించేవాడు,ఆయన తప్ప ఇంకెవరూ మరణాన్ని ప్రసాదించేవాడు కాడు. రాత్రి పగళ్ళ మార్పు చీకటిపరంగా,వెలుగ పరంగా,పొడవవటం పరంగా,చిన్నదవటం పరంగా సామర్ధ్యం ఆయన ఒక్కడికే ఉన్నది. ఏమీ మీరు సృష్టించటంలో,పర్యాలోచనలో ఆయన సామర్ధ్యమును,ఆయన ఒక్కడే అన్న విషయమును అర్ధం చేసుకోరా ?!.

(81) అంతేకాక వారు అవిశ్వాసంలో తమ తాతముత్తాతలు,తమ పూర్వికులు పలికినట్లే పలుకుతున్నారు.

(82) వారు దూరమయ్యే ,తిరస్కరించే తీరుతో ఇలా పలికారు : ఏమీ మేము మరణించి మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయపోయినప్పుడు లెక్క కొరకు జీవింపబడి మరల లేపబడుతామా ?!.

(83) మరియు నిశ్ఛయంగా ఇటువంటి వాగ్ధానం అది మరణాంతరం మరల లేపబడటం మాతో చేయబడినది మరియు మాకన్న ముందు దీని గురించి మా పూర్వికులు వాగ్దానం చేయబడ్డారు. మరియు మేము ఈ వాగ్దానం నెరవేరటం చూడలేదు. ఇవి మా పూర్వికుల అసత్యాలు,వారి అబద్దాలు మాత్రమే.

(84) ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో "ఒక వేళ మీకు జ్ఞానమే ఉంటే ఈ భూమి,దానిపై ఉన్నది ఎవరిది చెప్పండి ?" అని అడగండి.

(85) వారు తొందరలోనెే భూమి,దానిపై ఉన్నది అల్లాహ్ ది అని సమాధానమిస్తారు. అప్పుడు మీరు వారితో ఇలా పలకండి : భూమీ,దానిపై ఉన్నది ఎవరిదో అతడు మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని మీరు హితోపదేశం స్వీకరించరా ?.

(86) మీరు వారిని అడగండి : సప్తాకాశముల ప్రభువు ఎవరు ?. మరియు ఆ మహోన్నత సింహాసనం దాని కన్న గొప్ప సృష్టి లేదు అటువంటి దాని ప్రభువు ఎవరు ?.

(87) వారు తొందరలోనే ఇలా అంటారు : సప్తాకాశములు,మహోన్నత సింహాసనం అల్లాహ్ ఆదీనంలో ఉన్నవి. అప్పుడు మీరు వారితో అడగండి : అతని శిక్ష నుండి మీరు జాగ్రత్తగా ఉండటానికి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయబీతిని కలిగి ఉండరా ?.

(88) వారితో ఇలా అడగండి : ప్రతీ వస్తువు యొక్క అధికారము ఎవరి చేతిలో ఉన్నది,అతని అధికారము నుండి ఏదీ వేరవదు. మరియు అతడు తన దాసుల్లోంచి తాను ఎవరిని తలచుకుంటే వారకి సహాయం చేస్తాడు. ఆయన ఎవరికైన చెడు చేయదలచుకుంటే అతని నుండి ఆపి అతని నుండి శిక్షను దూరం చేసేవాడూ ఎవడూ లేడు ఒక వేళ మీకు ఏదైన జ్ఞానం ఉంటే (చెప్పండి).

(89) వారు తొందరలోనే ప్రతీ వస్తువు యొక్క అధికారము పరిశుద్ధుడైన ఆయన చేతిలోనే ఉన్నది అని అంటారు. అయితే మీ బుద్ధులు ఎలా ఉన్నాయని మీరు దాన్ని అంగీకరించి కూడా ఆయనను వదిలి ఇతరులను ఆరాధిస్తున్నారు ?!.

(90) విషయం వారు వాదిస్తున్నట్లు కాదు. కాని మేము వారి వద్దకు ఎటువంటి సందేహం లేని సత్యాన్ని తీసుకుని వచ్చాము. అల్లాహ్ కొరకు భాగస్వామి,సంతానము ఉన్నదని వారు వాదిస్తున్న విషయంలో వారు అబద్దము పలుకుతున్నారు. వారి మాటల నుండి అల్లాహ్ ఎంతో మహోన్నతుడు.

(91) అవిశ్వాసపరులు అనుకుంటున్నట్లు అల్లాహ్ సంతానమును చేసుకోలేదు. మరియు ఆయనతో పాటు ఎటువంటి వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఒక వేళ ఆయనతో పాటు ఎవరైన వాస్తవ ఆరాధ్య దైవం ఉన్నాడే అనుకోండి ప్రతీ ఆరాధ్య దైవం తాను సృష్టించిన సృష్టితాల్లోంచి తన భాగమును తీసుకుని పోతాడు. వారిలోంచి కొందరు కొందరిపై ఆధిక్యతను చూపుతారు. అప్పుడు విశ్వ వ్యవస్త నాశనమవుతుంది. నిజానికి ఇవేమీ జరగలేదు. అయితే ఆయన సత్య ఆరాధ్య దైవం ఒక్కడే అని ఆయన ఏకైక అల్లాహ్ అని సూచించాడు. ఆయనకు తగని సంతానము,భాగస్వామి దేని గురించి అయితే ముష్రికులు వర్ణిస్తున్నారో వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవిత్రుడు.

(92) ఆయన తన సృష్టితాల నుండి గోచరంగా ఉన్న ప్రతీది తెలిసిన వాడు, ఏవైతే ఆయన చూసి ఇంద్రియాలతో గ్రహిస్తాడో వాటిని తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. పరిశుద్ధుడైన ఆయన తనకు భాగస్వామి ఉండటం నుండి మహోన్నతుడు.

(93) ఓ ప్రవక్తా మీరు ఇలా ప్రార్ధించండి : ఓ ప్రభువా నీవు ఈ ముష్రికులందరితో వాగ్దానం చేసిన శిక్షను ఒక వేళ నాకు చూపించదలచుకుంటే;

(94) ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని నేను చూస్తున్నప్పుడే శిక్షిస్తే అప్పుడు నీవు నన్ను వారికి కలిగిన శిక్ష కలగటానికి వారిలో చేయకు.

(95) మరియు నిశ్చయంగా మేము వారికి వాగ్దానం చేసిన శిక్షను మీరు చూసేటట్లుగా మిమ్మల్ని చేసే సామర్ధ్యం కలవారము. దాని నుండి,ఇతర వాటి నుండి మేము అశక్తులము కాము.

(96) ఓ ప్రవక్తా మీరు మీతో చెడు చేసిన వారికి మంచితనముతో,అతనిని మన్నించి,అతని వలన కలిగిన బాధపై సహనం వహించి తొలగించండి. వారు కల్పిస్తున్న భాగస్వామ్యము,అసత్యము గురించి,నీకు తగనివి మంత్రజాలకుడు,పిచ్చివాడు అన్న గుణాలను నీకు వారు అపాదిస్తున్న వాటి గురించి మాకు బాగా తెలుసు.

(97) మరియు మీరు ఇలా ప్రార్ధించండి : ఓ నా ప్రభువా నేను షైతానుల దుష్ప్రేరణల నుండి,వారి కలతల నుండి నీ రక్షణను కోరుతున్నాను.

(98) ఓ నా ప్రభువా వారు నా వ్యవహారములలో నుండి ఏదైన దానిలో నా వద్దకు రావటం నుండి నేను నీ శరణమును కోరుతున్నాను.

(99) చివరికి ఈ ముష్రికులందరిలోంచి ఎవరి వద్దకైన మరణం వచ్చి అతను తనపై వచ్చిన దాన్ని కళ్ళారా చూసినప్పుడు తన వయస్సులో నుండి తాను కోల్పోయిన దానిపై,అల్లాహ్ విషయంలో తాను చేసిన తప్పిదంపై పశ్ఛాత్తాప్పడుతూ ఇలా వేడుకుంటాడు : ఓ నా ప్రభువా నీవు నన్ను ఇహలోక జీవితంవైపు మరలించు.

(100) నేను దాని వైపునకు మరలినప్పుడు నేను సత్కార్యములు చేయటానికి. ఖచ్చితం అలా జరగదు. విషయం నీవు కోరినట్లుగా లేదు. ఇది కేవలం అతను చెప్పిన మాట మాత్రమే. ఒక వేళ అతను ఇహలోక జీవితం వైపునకు మరలించబడితే అతను తాను చేసిన వాగ్దానమును నెరవేర్చడు. చనిపోయిన వీరందరు ఇహలోకము, మరణాంతరం లేపబడి మరలించబడే పరలోకమున మధ్య ఒక అడ్డు తెరలో (బర్జఖ్ లో) ఉండిపోతారు. వారు తాము కోల్పోయిన దాన్ని పొందటానికి, తాము పాడు చేసుకున్న దాన్ని సరి చేసుకోవటానికి దాని నుండి ఇహలోకము వైపునకు మరలించబడరు.

(101) బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత ప్రళయం గురించి ప్రకటన ఇచ్చే రెండవ బాకాను కొమ్ములో (సూర్ లో) ఊదినప్పుడు వారు పరలోక భయాందోళనల్లో మునిగి ఉండటం వలన వారు తమ మధ్య గొప్పగా చెప్పుకునే వంశావళి ఉండదు. వారు తమ ముఖ్యమైన పనిలో మునిగి ఉండటం వలన వారు ఒకరినొకరు అడగరు.

(102) అయితే ఎవరి సత్కర్మలు అయితే అతని దుష్కర్మలపై అధికమై అతని త్రాసు పళ్ళాలు బరువవుతాయో వారందరు తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటితో విముక్తి పొంది సాఫల్యం పొందుతారు.

(103) మరియు ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న అధికమై అతని త్రాసు పళ్ళములు తేలికైపోతాయో వారందరు తమకు నష్టము చేసే కార్యాలను చేసి,తమకు లాభం కలిగించే కార్యాలైన విశ్వాసం, సత్కార్యం చేయటమును వదిలివేసి తమ స్వయమును వృధా చేసుకుంటారు. వారు నరకాగ్నిలో శాస్వతంగా ఉంటారు. దానిలో నుండి వారు బయటపడరు.

(104) నరకాగ్ని వారి ముఖములను మాడ్చివేస్తుంది. వారు అందులో ఎలా ఉంటారంటే విచార తీవ్రత వలన వారి ఎగువ పెదాలు మరియు దిగువ పెదాలు వారి పళ్ళ నుండి కుంచించుకుపోతాయి.

(105) వారిని బెదిరిస్తూ వారితో ఇలా చెప్పబడుతుంది : ఇహలోకంలో ఖుర్ఆన్ ఆయతులు మీపై చదివి వినిపించబడలేదా. అయినా మీరు వాటిని ధిక్కరించేవారు ?!.

(106) వారు ఇలా పలికారు : ఓ మా ప్రభువా నీ జ్ఞానంలో ముందే ఉన్నది మాపై మా దురదృష్టం క్రమ్ముకుని ఉన్నది. మరియు మేము సత్యము నుండి తప్పిపోయిన వారిగా ఉన్నాము.

(107) ఓ మా ప్రభువా మమ్మల్ని నరకాగ్ని నుండి బయటకి తీ, అయినప్పటికీ మేము, మేము చేసిన అవిశ్వాసము,మార్గ భ్రష్టత వైపునకు మరలితే అప్పుడు మేము నిశ్ఛయంగా మాపై హింసకు పాల్పడిన వారమవుతాము. నిశ్ఛయంగా మా సాకు అంతమైపోయింది.

(108) అల్లాహ్ అంటాడు : మీరు నరకాగ్నిలో అవమానకరంగా,పరాభవమునకు లోనై జీవించండి. నాతో మీరు మాట్లాడకండి.

(109) నిశ్ఛయంగా నా పై విశ్వాసం కనబరచిన ఒక వర్గము ఇలా పలుకుతూ ఉండేది : ఓ మా ప్రభువా మేము నీ పై విశ్వాసమును కనబరిచాము. అయితే నీవు మా పాపములను మన్నించు,మాపై నీ కారుణ్యముతో దయచూపు. మరియు నీవు కరుణించేవారిలో నుంచి ఉత్తమమైనవాడివి.

(110) కాని మీరు తమ ప్రభువును వేడుకునే ఈ విశ్వాసపరులందరి హేళనచేయటానికి ఒక స్థలమును ఏర్పరచి మీరు వారిపై ఎగతాళి చేసేవారు,హేళన చేసేవారు. చివరికి వారి గురించి హేళనలో మునిగి ఉండటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరిపింపజేసింది. మరియు మీరు వారిపై ఎగతాళి చేస్తూ,హేళన చేస్తూ నవ్వేవారు.

(111) నిశ్ఛయంగా నేను ఈ విశ్వాసపరులందరికి అల్లాహ్ విధేయతలో ,మీ నుండి పొందిన బాధలపై వారి సహనం వలన ప్రళయదినాన స్వర్గము ద్వారా సాఫల్యమును ప్రతిఫలంగా ప్రసాదించాను.

(112) ఆయన ఇలా ప్రశ్నిస్తాడు : మీరు భూమిపై ఎన్ని సంవత్సరాలు గడిపారు ?, ఎంత సమయమును అందులో వృధా చేశారు ?.

(113) అప్పుడు వారు తమ మాటల్లో ఇలా జవాబు ఇస్తారు : మేము ఒక రోజు లేదా ఒక రోజు యొక్క కొంత భాగము గడిపాము.అయితే నీవు దినములను,నెలలను లెక్క వేసే వారిని అడుగు.

(114) (అల్లాహ్) ఇలా అంటాడు : మీరు ఇహలోకములో కొన్ని రోజులు మాత్రమే గడిపారు,అందులో విధేయత పై సహనం చాలా సులభముగా ఉండేది. ఒక వేళ మీరు గడిపిన పరిమాణం ఎంతో తెలుసుకుని ఉంటే బాగుండేది.

(115) అయితే ఓ ప్రజలారా ఏమీ మేము మిమ్మల్ని ఎటువంటి విజ్ఞత లేకుండా ఆటగా,ఎటువంటి ప్రతిఫలం గాని ఎటువంటి శిక్ష గాని లేని జంతువులవలే సృష్టించామని,మీరు ప్రళయ దినాన లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు మా వైపు మరలించబడరని మీరు భావిస్తున్నారా ?

(116) యజమాని,తన సృష్టితాల్లో తాను కోరిన విధంగా వ్యవహరించే వాడైన అల్లాహ్ పవితృడు. ఆయన సత్యము,ఆయన వాగ్దానము సత్యము,ఆయన మాట సత్యము. ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. సృష్టితాల్లో గొప్పదైన సృష్టి అయిన ఉత్తమమైన అర్ష్ ప్రభువు. ఎవరైతే సృష్టితాల్లో గొప్పవాటి ప్రభువు అవుతాడో ఆయనే అన్నింటియొక్క ప్రభువు.

(117) మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఆరాధనకు హక్కుదారుడు అనటానికి ఎటువంటి ఆధారం లేని (ఇదే పరిస్థితి అల్లాహ్ కాకుండా ఇతర ప్రతీ ఆరాధ్య దైవ పరిస్థితి) వేరే ఆరాధ్య దైవముగా ఆరాధిస్తాడో అతని దుష్కర్మ యొక్క ప్రతిఫలం పరిశుద్ధుడైన తన ప్రభువు వద్ద ఉన్నది. ఆయనే అతనిపై శిక్షను కలిగించి అతనికి ప్రతిఫలమును ప్రసాధిస్తాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఆశిస్తున్న వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందలేరు.

(118) ఓ ప్రవక్తా మీరు ఇలా వేడుకోండి : ఓ నా ప్రభువా నా పాపములను మన్నించు మరియు నీ కారుణ్యముతో నాపై దయ చూపు. మరియు నీవు ఒక పాపాత్ముడి పై దయ చూపి అతని పశ్ఛాత్తాపమును అంగీకరించిన ఉత్తమమైనవాడివి.