43 - Az-Zukhruf ()

|

(1) హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

(2) అల్లాహ్ సత్యం వైపునకు మార్గదర్శకం యొక్క మార్గమును స్పష్ట పరిచే ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు.

(3) నిశ్చయంగా దాన్ని అరబీ భాష ఖుర్ఆన్ గా చేశాము; ఓ మీ భాషలో అవతరింపబడిన వారా మీరు దాని అర్ధములను గ్రహిస్తారని,వాటిని అర్ధంచేసుకుని ఇతర సమాజములకు వాటిని చేరవేస్తారని ఆశిస్తూ.

(4) మరియు నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఉన్నతమైన,గొప్పదైన,విజ్ఞత కలిగిన లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది. దాని ఆయతులు దాని ఆదేశములలో,వారింపులలో నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి.

(5) ఏమి మీరు అధికంగా షిర్కు మరియు పాప కార్యములు చేయటం వలన మేము విముఖత చూపుతూ మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేయటమును వదిలేయాలా ?. మేము అలా చేయము. కాని మీతో ఉన్న కారుణ్యము దినికి విరుద్ధంగా నిర్ణయిస్తుంది.

(6) మరియు పూర్వ సమాజములలో మేము ఎంతో మంది ప్రవక్తలను పంపించాము.

(7) ఆ పూర్వ సమాజాల వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా వారు వారి పట్ల పరిహాసమాడేవారు.

(8) అప్పుడు మేము ఆ పూర్వ సమాజములలో నుండి బలీష్టులైన వారిని నాశనం చేశాము. వారిలో నుండి బలహీనులు నాశనం చేయటం నుండి మమ్మల్ని అశక్తులని చేయలేరు. మరియు పూర్వ సమాజాల వినాశన విధము ఖుర్ఆన్ లో గడిచినది. ఉదాహరణకి : ఆద్,సమూద్,లూత్ జాతి మరియు మద్యన్ వారు.

(9) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ తిరస్కారులైన ముష్రికులందరిని ఆకాశములను సృష్టించినది ఎవరు మరియు భూమిని సృష్టించినది ఎవరు ? అని అడిగితే వారు తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలుకుతారు : ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు మరియు ప్రతీది బాగా తెలిసినవాడు వాటిని సృష్టించినాడు.

(10) అల్లాహ్ యే మీ కొరకు భూమిని ఏర్పాటు చేసి దాన్ని మీ కొరకు పరుపుగా చేశాడు మీరు దానిపై మీ కాళ్శతో నడుస్తున్నారు. మరియు ఆయన అందులో మీ కొరకు దాని పర్వతాల్లో,దాని లోయల్లో మార్గములను చేశాడు; మీరు వాటి ద్వారా మీ ప్రయాణముల్లో మార్గము పొందుతారని ఆశిస్తూ.

(11) మరియు ఆయనే మీకు సరి అగు,మీ జంతువులకు,మీ పంటలకు సరి అగు పరిమాణంలో ఆకాశము నుండి నీటిని కురిపించాడు. అప్పుడు మేము దాని ద్వారా ఎటువంటి మొక్కలు లేకుండా ఎండిపోయిన ప్రదేశమను జీవింపజేశాము. అల్లాహ్ ఈ శుష్క భూమిని (ఎండిపోయిన భూమిని) మొక్కలతో జీవింపజేసినట్లే మరల లేపటం కొరకు మిమ్మల్ని జీవింపజేస్తాడు.

(12) మరియు ఆయనే రాత్రి,పగలు,మగ,ఆడ మరియు మొదలగు వాటిలాంటి అన్ని రకాలను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు మీరు మీ ప్రయాణముల్లో మీరు సవారీ చేసే ఓడలను,జంతువులను తయారు చేశాడు. కావున మీరు సముద్రములో ఓడలపై సవారీ చేస్తున్నారు. మరియు భూమిలో మీ పశువులపై సవారీ చేస్తున్నారు.

(13) ఆయన వాటన్నింటిని మీ కొరకు చేశాడు; మీరు మీ ప్రయాణముల్లో స్వారీ చేసేవాటి విపులపై మీరు స్థిరంగా ఉంటారని, వాటి వీపులపై మీరు స్థిరంగా ఉన్నప్పుడు వాటిని మీ ఆదీనంలో చేసినందుకు మీ ప్రభువు అనుగ్రహమును జ్ఞప్తికి తెచ్చుకుంటారని మరియు మీ నాలుకలతో ఇలాపలుకుతారని ఆశిస్తూ : ఈ స్వారీని మా కొరకు సిద్ధం చేసి, మా ఆదీనంలో చేసిన ఆయన పరిశుద్ధుడు మరియు అతీతుడు. మేము దానిని నియంత్రించే వారము అయినాము. ఒక వేళ అల్లహ్ దాన్ని ఆదీనంలో చేసి ఉండకపోతే దాన్ని వశపరచుకునే మాకు శక్తి ఉండేదికాదు.

(14) మరియు నిశ్చయంగా మేము మా మరణము తరువాత లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం కొరకు ఒక్కడైన మా ప్రభువు వైపునకు మరలుతాము.

(15) ముష్రికులు కొన్ని సృష్టి రాసులు పరిశుద్ధుడైన సృష్టికర్త నుండి జన్మించాయని ఆరోపించారు అందుకనే వారు ఇలా పలికారు : దైవదూతలు అల్లాహ్ కుమార్తెలు. నిశ్చయంగా ఇలాంటి మాటలు పలికిన మనిషి పెద్ద అవిశ్వాసి,అవిశ్వాసమును,అపమార్గమును స్పష్టపరిచాడు.

(16) ఓ ముష్రికులారా ఏమీ అల్లాహ్ తాను సృష్టించిన సంతానము నుండి ఆడ సంతానమును తన స్వయం కొరకు చేసుకుని,మీకు మగ సంతానమును ప్రత్యేకించుకున్నాడు అని పలుకుతున్నారా ?. మీరు చెప్పుకుంటున్న ఈ విభజన ఎటువంటి విభజన ?.

(17) తన ప్రభువు వైపునకు అంటగట్టినటువంటి ఆడ సంతానము వారిలో నుండి ఎవరికైన కలిగిందని శుభవార్త ఇవ్వబడినప్పుడు బాధ,దుఃఖము యొక్క తీవ్రత వలన అతని ముఖము నల్లగా మారిపోయేది మరియు అతడు కోపముతో నిండిపోయేవాడు. అటువంటప్పుడు తనకు శుభవార్త ఇవ్వబడినప్పుడు తనకు బాధ కలిగించిన దాన్ని తన ప్రభువునకు ఎలా అంతగడుతాడు ?.

(18) ఏమీ వారు అలంకరణలో పోషించబడిన దాన్ని తమ ప్రభువునకు అంటగడుతున్నారా, వాస్తవానికి అది తన ఆడతనం వలన తగువులాటలో మాటను స్పష్టపరచజాలదు ?.

(19) మరియు వారు పరిశుద్ధుడైన కరుణామయుడి దాసులైన దైవదూతలను ఆడవారిగా నామకరణం చేశారు. ఏమీ వారు వారికి ఆడవారని స్పష్టమవటానికి అల్లాహ్ వారిని సృష్టించినప్పుడు వారు హాజరై ఉన్నారా ?. తొందరలోనే దైవదూతలు వారి ఈ సాక్ష్యమును వ్రాసి ఉంచుతారు. మరియు ప్రళయదినమున దాని గురించి ప్రశ్నించబడుతారు. మరియు తమ అసత్యం పలకటం వలన వాటి పరంగా శిక్షింపబడుతారు.

(20) మరియు వారు విధివ్రాత ద్వారా వాదిస్తూ ఇలా పలుకుతారు : ఒక వేళ మేము దైవదూతలను ఆరాధించకూడదని అల్లాహ్ కోరుకుంటే మేము వారిని ఆరాధించేవారము కాదు. కాబట్టి మా నుండి అది జరగటం ఆయన మన్నతను సూచిస్తుంది. వారి ఈ మాట గురించి వారికి ఎటువంటి జ్ఞానం లేదు. వారు అబద్దము మాత్రం పలుకుతున్నారు.

(21) లేదా మేము ఈ ముష్రికులందరికి ఖుర్ఆన్ కన్న ముందు ఏదైన గ్రంధం ఇచ్చి ఉన్నామా అది వారి కొరకు అల్లాహేతరుల ఆరాధనకు అనుమతిస్తున్నదా ?. వారు ఆ గ్రంధమును అంటిపెట్టుకుని ఉండి దాని ద్వారా వాదిస్తున్నారు.

(22) లేదు, అలా జరగలేదు. కాని వారు అనుకరణతో వాదిస్తూ ఇలా పలికారు : నిశ్చయంగా మేము మా కన్న ముందు నుండి మా తాతముత్తాతలను ఒకే ధర్మం పై మరియు ఒకే సమాజము పై పొందాము. మరియు వారు విగ్రహాలను ఆరాధించేవారు. మరియు నిశ్చయంగా మేమూ వాటి ఆరాధన విషయంలో వారి అడుగుజాడలలోనే నడుస్తాము.

(23) మరియు వీరందరు తిరస్కరించి తాము తమ తల్లిదండ్రల అనుకరణతో వాదించినట్లే ఓ ప్రవక్త మేము మీకన్న మునుపు ఏ బస్తీలో ఏ ప్రవక్తను తమ జాతి వారిని హెచ్చరించటానికి పంపించిన వారిలో నుండి ఐశ్వర్యవంతుల్లోంచి వారి నాయకులు,వారి పెద్దవారు మాత్రం ఇలా పలకకుండా ఉండలేదు : నిశ్చయంగా మేము మా తాతముత్తాతలను ఒకే ధర్మం పై,ఒకే సమాజంపై పొందాము. మరియు నిశ్చయంగా మేము వారి అడుగుజాడలను అనుసరించేవారము. అయితే మీ జాతి వారు ఈ విషయంలో కొత్త కాదు.

(24) వారితో వారి ప్రవక్తలు ఇలా పలికారు : ఏమీ మీరు మీ తాతముత్తాతలనే అనుసరిస్తారా ఒక వేళ నేను వారు ఉన్న వారి ధర్మం కన్న మేలైనది మీ వద్దకు తీసుకుని వచ్చిన ?. వారు ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా మేము మీరు,మీకన్న మునుపు ప్రవక్తలు ఇచ్చి పంపించబడిన దాన్ని తిరస్కరిస్తున్నాము.

(25) అప్పుడు మేము మీ కన్న మునుపు ప్రవక్తలను తిరస్కరించినటువంటి సమాజములతో ప్రతీకారము తీర్చుకుని వారిని నాశనం చేశాము. కావున మీరు తమ ప్రవక్తలను తిరస్కరించిన వారి ముగింపు ఎలా జరిగినదో యోచన చేయండి. నిశ్చయంగా అది బాధాకరమైన ముగింపు అయినది.

(26) ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో,తన జాతి వారితో మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని పలికినప్పటి వృత్తాంతమును గుర్తు చేసుకోండి.

(27) కాని నన్ను సృష్టించినటువంటి అల్లాహ్ తప్ప. నిశ్చయంగా ఆయనే నాకు తన దృఢమైన ధర్మమును అనుసరించటం నుండి నాకు ప్రయోజనం ఉన్న దాని వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

(28) మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం తౌహీద్ వాక్కును (లా యిలాహ ఇల్లల్లాహ్ ను) తన తరువాత తన సంతానములో విడిచి వెళ్ళారు - వారిలో క్రమం తప్పకుండా అల్లాహ్ ఏకత్వమును కొనియాడి,ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించని వారు కొనసాగారు - వారు అల్లాహ్ వైపునకు షిర్కు,పాపకార్యముల నుండి పశ్చాత్తాప్పడుతూ మరలుతారని ఆశిస్తూ.

(29) తిరస్కారులైన ఈ ముష్రికులందరిని నేను తొందరగా వినాశనమునకు గురి చేయను. కాని నేను ఇహలోకంలో విడిచిపెట్టి వారికి ప్రయోజనం కలిగించాను. మరియు వారి కన్న మునుపు వారి తాతముత్తాతలకు ప్రయోజనం కలిగించాను. చివరికి వారి వద్దకు ఖుర్ఆన్ మరియు స్పష్ఠంగా వివరించే ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు.

(30) మరియు ఎటువంటి సందేహం లేని సత్యమైన ఈ ఖుర్ఆన్ వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఇలా పలికారు : ఇది ఒక మంత్రజాలము,దీని ద్వారా ముహమ్మద్ మమ్మల్ని మంత్రజాలమునకు గురి చేస్తున్నాడు. మరియు నిశ్చయంగా మేము దీనిని తిరస్కరిస్తున్నాము. దీనిని మేము నమ్మమంటే నమ్మము.

(31) మరియు తిరస్కారులైన ముష్రికులు ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ను పేదవాడైన,అనాధ అయిన ముహమ్మద్ పై కాకుండా మక్కా లేదా తాయిఫ్ ప్రాంతముల్లోంచి ఇద్దరు గొప్ప వ్యక్తుల్లోంచి ఒకరిపై అవతరింపజేయలేదు.

(32) ఓ ప్రవక్తా ఏమిటీ వారు నీ ప్రభువు యొక్క కారుణ్యమును పంచిపెడుతున్నారా ? కనుక వారు తాము తలచిన వారికి దాన్ని ఇస్తున్నారు మరియు తాము తలచిన వారి నుండి దాన్ని ఆపుతున్నారు లేదా అల్లాహ్ నా ?. ఇహలోకములో మేము వారి ఆహారోపాధిని వారి మధ్య పంచిపెట్టాము. మరియు మేము వారిలో నుండి ఐశ్వర్యవంతులను,పేదవారిని తయారుచేశాము వారిలో నుండి కొందరు కొందరి ఆదీనంలో ఉండటానికి. మరియు పరలోకంలో తన దాసుల కొరకు నీ ప్రభువు కారుణ్యం వీరందరు కూడబెట్టే అంతమైపోయే ఇహలోక భాగము కన్న మేలైనది.

(33) మరియు ఒక వేళ ప్రజలందరు అవిశ్వాసంలో ఒకే వర్గంగా తయారవుతారనే మాట గనుకు లేకుంటే మేము అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి గృహముల కప్పులను వెండితో తయారు చేసేవారము. మరియు వారి కొరకు దానిపై మెట్లను వెండితో చేసేవారము వారు ఎక్కేవారు.

(34) మరియు మేము వారి గృహముల కొరకు తలుపులను తయారు చేసేవారము. మరియు మేము వారి కొరకు పీఠాలను తయారు చేసేవారము వారు వాటిపై ఆనుకుని కూర్చునేవారు. ఇది వారికి నెమ్మది నెమ్మదిగా తీసుకుని వెళ్ళటానికి,పరీక్షగా.

(35) మరియు మేము వారి కొరకు బంగారంతో కూడా చేసేవారము. ఇవన్ని ప్రపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. కాబట్టి అది నిరంతరం కాకుండా ఉండటం వలన దాని ప్రయోజనం తక్కువ. మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు వద్ద పరలోకంలో ఉన్న అనుగ్రహాలు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి అల్లాహ్ కు బయపడే వారి కొరకు మేలైనవి.

(36) మరియు ఎవరైతే సాధికారత లేని దృక్పదంతో ఖుర్ఆన్ లో చూస్తారో అది అతనిని విముఖత వైపునకు దారితీస్తే అతడు తనను అపమార్గములో అధికం చేసే షైతాన్ ఆదీనంలో చేయబడటంతో శిక్షింపబడుతాడు.

(37) మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ నుండి విముఖత చూపే వారిపై నియమింపబడిన ఈ స్నేహితులందరు వారిని అల్లాహ్ ధర్మం నుండి ఆపుతారు. అప్పుడు వారు ఆయన ఆదేశములను పాటించరు మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండరు. మరియు వారు సత్యం వైపునకు మార్గం పొందారని భావిస్తారు. మరియు ఎవరైతే ఆ స్థానంలో ఉంటారో వారు తమ మార్గ భ్రష్టకు గురి అవటం నుండి పశ్ఛాత్తాప్పడరు.

(38) అల్లాహ్ స్మరణ నుండి విముఖత చూపినవాడు ప్రళయదినమున మా వద్దకు వచ్చినప్పుడు ఆశతో ఇలా పలుకుతాడు : ఓ స్నేహితుడా నీకూ నాకూ మధ్య తూర్పు పడమరల మధ్య దూరమంత దూరముంటే ఎంత బాగుండేది. అయితే నీవు అసహ్యించుకోబడ్డ స్నేహితుడివి.

(39) ప్రళయదినమున అల్లాహ్ అవిశ్వాసపరులతో ఇలా పలుకుతాడు : మరియు ఈ రోజు మీ సాటి కల్పించటం శిక్ష విషయంలో ప్రయోజనం కలిగించదు - వాస్తవానికి మీరు షిర్కు,పాపకార్యముల ద్వారా మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు - కాబట్టి మీరు భాగస్వాములుగా చేసుకున్న వారు మీ నుండి శిక్షను కొంచము కూడా మోయలేరు.

(40) నిశ్చయంగా వీరందరు సత్యమును వినటం నుండి చెవిటివారు మరియు దాన్ని చూడటం నుండి గ్రుడ్డివారు. అయితే ఓ ప్రవక్త ఏమిటీ మీరు చెవిటివారిని వినిపించగలరా లేదా గ్రుడ్డి వారికి మార్గం చూపగలరా లేదా సన్మార్గము నుండి స్పష్టంగా అపమార్గంలో ఉన్న వారిని మార్గదర్శకత్వం చేయగలరా ?.

(41) అయితే ఒక వేళ మేము వారిని శిక్షించక ముందే మిమ్మల్ని మరణింపజేసి తీసుకుని వెళ్ళిపోయినా నిశ్చయంగా మేము వారిని ఇహలోకంలో,పరలోకంలో శిక్షకు గురి చేసి వారిపై ప్రతీకారం తీర్చుకుంటాము.

(42) లేదా మేము వారికి వాగ్దానం చేసిన కొంత శిక్షను మీకు తప్పకుండా చూపుతాము. నిశ్చయంగా మేము వారిపై పూర్తి అధికారము కలవారము. వారు ఏ విషయంలో కూడా మమ్మల్ని ఓడించజాలరు.

(43) కావున ఓ ప్రవక్త మీ ప్రభువు మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన దాన్ని అట్టిపెట్టుకొని దానిపై ఆచరించండి. నిశ్చయంగా మీరు ఎటువంటి సందేహం లేని సత్య మార్గముపై ఉన్నారు.

(44) నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ మీ కొరకు ఒక కీర్తి మరియు మీ జాతి వారి కొరకు ఒక కీర్తి. మరియు మీరు తొందరలోనే ప్రళయదినమున దానిపై విశ్వాసము గురించి,దాని సూచనలపై అనుసరించటం గురించి,దాని వైపునకు పిలవటం గురించి ప్రశ్నించబడుతారు.

(45) ఓ ప్రవక్తా మీరు మీ కన్న పూర్వం మేము పంపించిన ప్రవక్తలను మేము అనంత కరుణామయుడిని కాకుండా ఇతర దైవాలను ఆరాధించటానికి చేశామా ? అడగండి.

(46) మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాం ను మా ఆయతులను ఇచ్చి ఫిర్ఔన్ మరియు అతని జాతివారిలో నుండి గొప్ప వారి వద్దకు పంపించాము. అప్పుడు ఆయన వారితో నిశ్చయంగా నేను సృష్టిరాసులందరి ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్తను అని పలికారు.

(47) ఆయన వారి వద్దకు మా ఆయతులను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని పరిహాసంగా,ఎగతాళిగా చేసుకుని నవ్వసాగారు.

(48) మరియు మేము ఫిర్ఔన్ కి మరియు అతని జాతి వారిలో నుండి నాయకులకు మూసా అలైహిస్సలాం తీసుకుని వచ్చినది సరి అయినదన్న దానిపై చూపించిన ఆధారము దాని కన్న ముందు ఉన్న ఆధారము కన్న ఎంతో గొప్పది. మరియు మేము వారిని ఇహలోకంలో శిక్షకు గురి చేశాము. వారు ఉన్న అవిశ్వాసము నుండి మరలుతారా అని ఆశిస్తూ. కాని ఎటువంటి ప్రయోజనం లేకపోయినది.

(49) వారికి కొంత శిక్ష కలిగినప్పుడు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికేవారు : ఓ మంత్రజాలకుడా ఒక వేళ మేము విశ్వసిస్తే నీ ప్రభువు శిక్షను తొలగిస్తానని నీతో ప్రస్తావించిన దాని గురించి నీ ప్రభువుతో మా కొరకు వేడుకో. ఒక వేళ ఆయన మా నుండి దాన్ని తొలగిస్తే నిశ్ఛయంగా మేము ఆయన వైపునకు మార్గం పొందుతాము.

(50) ఎప్పుడైతే మేము వారి నుండి శిక్షను తొలగించామో వారు తమ వాగ్దానమును భంగపరిచి దాన్ని పూర్తి చేసేవారు కాదు.

(51) మరియు ఫిర్ఔన్ తన రాజ్యము పై ప్రగల్భాలను పలుకుతూ తన జాతిలో ఇలా ప్రకటించాడు : ఓ నా జాతి వారా ఏమీ మిసర్ యొక్క సామ్రాజ్యాధికారం మరియు నైలు నది నుండి నా భవనముల క్రింది నుండి ప్రవహించే ఈ కాలువలు నాయి కావా ?. ఏమీ మీరు నా సామ్రాజ్యాధికారమును చూడటంలేదా మరియు నా గొప్పతనమును గుర్తించటంలేదా ?.

(52) మరియు నేను గెంటివేయబడిన,మంచిగా మాట్లాడలేని బలహీనుడైన మూసా కన్న ఉత్తముడిని.

(53) మరియు అతడు ప్రవక్త అని స్పష్టపరచటానికి అతన్ని ప్రవక్తగా పంపించిన అల్లాహ్ అతనిపై ఎందుకని బంగారపు కంకణాలను వేయలేదు ?. లేదా ఎందుకని అతనితో పాటు ఒకరినొకరు అనుసరించే దైవదూతలు రాలేదు ?.

(54) అప్పుడు ఫిర్ఔన్ తన జాతి వారిని ఉసిగొల్పాడు. వారు అతని అపమార్గంలో అతన్ని అనుసరించారు. నిశ్చయంగా వారు అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన జనులు.

(55) వారు అవిశ్వాసంపై కొనసాగి మాకు కోపం కలిగించినప్పుడు మేము వారితో ప్రతీకారం తీర్చుకున్నాము. అప్పుడు మేము వారందరిని ముంచివేశాము.

(56) అయితే మేము ఫిర్ఔన్ ను మరియు అతని సభా ప్రముఖులను ప్రజలకు ముందుండే వారిగా మరియు మీ జాతి లో నుండి అవిశ్వాసపరులను వారి అడుగుజాడలో నడిచే వారిగా చేశాము. మరియు మేము వారిని గుణపాఠం నేర్చుకునే వారికి గుణపాఠంగా చేశాము వారికి ఏదైతే సంభవించినదో వారికి సంభవించకుండా ఉండటానికి వారి కార్యమునకు వారు పాల్పడకుండా ఉండటానికి.

(57) మరియు ఎప్పుడైతే క్రైస్తవులు ఆరాధించే ఈసా అలైహిస్సలాం ను ముష్రికులు మహోన్నతుడైన ఆయన ఈ వాక్యంలో ఉన్నాడని భావించారో : {إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنْتُمْ لَهَا وَارِدُونَ} నిశ్ఛయంగా మీరు మరియు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించే దైవాలు నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానిలో ప్రవేశిస్తారు (అల్ అన్బియా). వాస్తవానికి అల్లాహ్ విగ్రహాలను ఆరాధించటం నుండి వారించినట్లుగానే ఆయన ఆరాధన నుండి వారించాడు. అప్పుడు ఓ ప్రవక్తా మీ జాతివారు తగువులాటలో ఇలా పలుకుతూ అరిచేవారు మరియు కేకలు వేసేవారు : ఈసా యొక్క స్థానంలో మా దైవాలు అవటమును మేము ఇష్టపడుతున్నాము. అప్పుడు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అవతరింపజేశాడు : "నిశ్చయంగా ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగా ఉంచబడుతారు" (అల్ అన్బియా) {إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُمْ مِنَّا الْحُسْنَى أُولَئِكَ عَنْهَا مُبْعَدُونَ}.

(58) మరియు వారు ఇలా పలికారు : మా ఆరాధ్యదైవాలు మేలైనవా లేదా ఈసా ?. ఇబ్నే జిబఅర మరియు అతని లాంటి వారు ఈ ఉపమానమును సత్యమునకు చేరుకోవటానికి ఇష్టపడుతూ ఇవ్వలేదు కాని తగువులాడటమును ఇష్టపడుతూ ఇచ్చారు. మరియు వారు తగాదా పడటమునకే సృష్టించబడిన జనులు.

(59) మర్యమ్ కుమారుడగు ఈసా మేము దైవదౌత్యం ప్రసాదించిన అల్లాహ్ దాసుల్లోంచి ఒక దాసుడు మాత్రమే. మరియు మేము అతన్నిఇస్రాయీలు సంతతి వారికి ఒక ఉపమానముగా చేశాము. వారు ఆయన ఆదం ను తల్లిదండ్రులు లేకుండా సృష్టించినట్లే ఆయనను తండ్రి లేకుండా సృష్టించినప్పుడు అల్లాహ్ సామర్ధ్యముపై దాని ద్వారా ఆధారం చూపేవారు.

(60) ఓ ఆదం సంతతివారా ఒక వేళ మేము మీ వినాశనమును తలచుకుంటే మిమ్మల్ని నాశనం చేసి మీకు బదులుగా దైవదూతలను తీసుకుని వచ్చేవారము. వారు భూమిలో మీకు ప్రాతినిధ్యం వహిస్తారు. అల్లాహ్ ఆరాధన చేస్తారు,ఆయనతో పాటు దేనినీ సాటి కల్పించరు.

(61) మరియు నిశ్చయంగా ఈసా అలైహిస్సలాం ప్రళయ సూచనల్లోంచి ఒక సూచన ఆయన చివరికాలంలో దిగుతారు. ప్రళయం వాటిల్లే విషయంలో మీరు సందేహించకండి. నేను అల్లాహ్ వద్ద నుండి మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను మీరు అనుసరించండి. నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది ఇదే ఎటువంటి వంకరతనం లేని తిన్నని మార్గము.

(62) మరియు షైతాను తన మోసము ద్వారా,తన మోహింపజేయటం ద్వారా మిమ్మల్ని ఋజు మార్గము నుండి మళ్ళించకూడదు. నిశ్ఛయంగా అతడు మీ కొరకు బహిరంగ శతృవు.

(63) మరియు ఈసా అలైహిస్సలాం తాను ఒక ప్రవక్త అవటంపై స్పష్టపరిచే సూచనలను తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా పలికారు : నిశ్చయంగా నేను మీ వద్దకు అల్లాహ వద్ద నుండి విజ్ఞతను (హిక్మత్) తీసుకుని వచ్చాను. మరియు నేను మీరు మీ ధర్మ విషయాల్లోంచి విభేదించుకుంటున్న వాటిలో కొన్నింటిని మీకు స్పష్టపరుస్తాను. కావున మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మరియు మీకు వారించిన వాటి విషయంలో నాపై విధేయత చూపండి.

(64) నిశ్ఛయంగా అల్లాహ్ నాకూ మరియు మీకు ప్రభువు. ఆయన తప్ప మాకు ఏ ప్రభువు లేడు. కాబట్టి మీరు ఆయన ఒక్కడి కొరకు ఆరాధనను ప్రత్యేకించండి. మరియు ఈ ఏకేశ్వరోపాసన (తౌహీద్) ఇదే ఎటువంటి వంకరతనం లేని తిన్నని మార్గము.

(65) అయితే ఈసా అలైహిస్సలం విషయంలో క్రైస్తవ వర్గాలు విభేదించుకున్నాయి. వారిలో నుండి కొందరు ఆయనను దైవం అన్నారు మరియు మరి కొందరు ఆయనను అల్లాహ్ కుమారుడన్నారు మరియు మరి కొందరు ఆయన,ఆయన తల్లి ఇద్దరు దేవుళ్ళన్నారు. ఈసా అలైహిస్సలాం ను దైవత్వముతో లేదా దైవ కుమారునితో లేదా ముగ్గురిలో నుండి మూడో వాడితో పోల్చటం వలన తమ స్వయమునకు అన్యాయం చేసుకున్న వారి కొరకు ప్రళయదినమున వారి గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్షతో వినాశనం కలుగును.

(66) ఈసా అలైహిస్సలాం విషయంలో విభేదించుకునే ఈ వర్గాలన్నీ తమ వద్దకు ప్రళయం దాని రావటమును వారు గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు వారి వద్దకు రావటం గురించి నిరీక్షిస్తున్నారా ?. అది ఒక వేళ వారి వద్దకు వారు తమ అవిశ్వాస స్థితిలో ఉన్నప్పుడు వస్తే నిశ్చయంగా వారి పరిణామము బాధాకరమైన శిక్షే అవుతుంది.

(67) అవిశ్వాసంలో,అపమార్గంలో సన్నిహితులు,స్నేహితులు ప్రళయదినమున ఒకరికొకరు శతృవులు. కానీ అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారు వారి సన్నిహితము అంతం కాకుండా శాశ్వతంగా ఉంటుంది.

(68) మరియు అల్లాహ్ వారితో ఇలా పలుకుతాడు : ఓ నా దాసులారా ఈ రోజు మీరు ఎదుర్కొనే దాని విషయంలో మీపై ఎటువంటి భయం ఉండదు. మరియు మీరు కోల్పోయిన ప్రాపంచిక భాగముల విషయంలో మీరు బాధ పడరు.

(69) వారు తమ ప్రవక్త పై అవతరింపబడిన ఖుర్ఆన్ పట్ల విశ్వాసమును కనబరిచారు. మరియు వారు ఖుర్ఆన్ కు కట్టుబడి ఉండేవారు; దాని ఆదేశాలను పాటిస్తారు మరియు దాని వారింపుల నుండి దూరంగా ఉంటారు.

(70) మీరూ మరియు విశ్వాసంలో మీలాంటి వారు స్వర్గంలో ప్రవేశించండి. తరగని,అంతంకాని వైన మీరు పొందే శాశ్వత అనుగ్రహాలతో మీరు సంతోషముగా ఉంటారు.

(71) వారి సేవకులు వారిపై బంగారపు పాత్రలను మరియు కడియములు లేని కప్పులను తీసుకుని తిరుగుతుంటారు. స్వర్గములో మనస్సులు కోరేవి మరియు కళ్ళు చూసి ఆనందించేవి ఉంటాయి. మరియు మీరు అందులో నివాసముంటారు. దాని నుండి మీరు ఎన్నటికి బయటకు రారు.

(72) మీ కొరకు వర్ణించబడిన ఈ స్వర్గము, దీనికే అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహముగా మీ కర్మలకు బదులుగా మిమ్మల్ని వారసులుగా చేశాడు.

(73) అందులో మీ కొరకు అంతం కాని ఎన్నో ఫలాలు ఉంటాయి. వాటిలో నుండి మీరు తింటారు.

(74) నిశ్చయంగా అవిశ్వాసము,పాపాలకు పాల్పడిన అపరాదులు ప్రళయదినమున నరకము యొక్క శిక్షలో ఉంటారు,అందులో శాశ్వతంగా నివాసముంటారు.

(75) వారి నుండి శిక్షను తేలికచేయబడదు. మరియు వారు అందులో అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ్యులై ఉంటారు.

(76) మేము వారిని నరకంలో ప్రవేశింపజేసినప్పుడు వారికి అన్యాయం చేయలేదు. మరియు కాని వారే అవిశ్వాసముతో తమ స్వయమునకు అన్యాయం చేసుకున్నారు.

(77) మరియు వారు నరకాగ్ని రక్షక భటుడైన మాలిక్ తో ఇలా పలుకుతూ పిలుస్తారు : ఓ మాలిక్ మేము శిక్ష నుండి ఉపశమనం పొందటానికి ని ప్రభువు మాకు మరణమును ప్రసాదించాలి. అప్పుడు మాలిక్ వారికి తన మాటలో ఇలా సమాధానమిస్తాడు : నిశ్చయంగా మీరు శిక్షలో శాశ్వతంగా నివాసముంటారు. మీరు మరణించరు మరియు మీ నుండి శిక్ష అంతమవదు.

(78) నిశ్ఛయంగా మేము ఇహలోకంలో ఎటువంటి సందేహం లేని సత్యమును మీ వద్దకు తీసుకుని వచ్చాము. కానీ మీలోని చాలామంది సత్యమును అసహ్యించుకునేవారు.

(79) ఒక వేళ వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మోసం చేసి ఆయన కొరకు ఏదైన కుట్రను సిద్ధం చేస్తే నిశ్చయంగా మేము వారి కుట్రకు మించిన ఏదైన వ్యూహమును వారి కొరకు నిర్ణయిస్తాము.

(80) లేదా వారు తమ హృదయములలో దాచిన వారి రహస్యమును లేదా వారు చాటుగా మాట్లాడుకునే వారి రహస్యమును మేము వినమని వారు భావిస్తున్నారా. ఎందుకు కాదు నిశ్చయంగా మేము వాటన్నింటిని వింటున్నాము. మరియు దైవదూతలు వారి వద్ద ఉండి వారు చేసే వాటన్నింటిని వ్రాస్తున్నారు.

(81) ఓ ప్రవక్తా అల్లాహ్ కొరకు కుమార్తెలను అపాదించే వారితో - అల్లాహ్ వారి మాటల నుండి గొప్ప మహోన్నతుడు - ఇలా పలకండి : అల్లాహ్ కొరకు ఎటువంటి సంతానము ఉంటే - ఆయన దాని నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు - మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన చేసి,ఆయన పరిశుద్ధతను కొనియాడే వారిలో నుంచి నేను ఆరాధన చేసే వారిలో మొదటివాడినయ్యేవాడిని.

(82) భూమ్యాకాశముల ప్రభువు మరియు అర్ష్ (సామ్రాజ్య పీఠమునకు) ప్రభువు ఈ ముష్రుకులందరు ఆయనకు భాగస్వామ్యం,భార్య,సంతానమును అంటగడుతూ పలుకుతున్న మాటల నుండి అతీతుడు.

(83) ఓ ప్రవక్తా వారు మునిగి ఉండి,ఆడుకుంటున్న అసత్యములోనే వారిని మీరు వదిలివేయండి చివరికి వారు తమతో వాగ్దానం చేయబడుతున్న తమ దినమును పొందుతారు. అది ప్రళయదినము.

(84) మరియు పరిశుద్ధుడైన ఆయనే ఆకాశములో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే భూమిలో సత్యంగా ఆరాధించబడేవాడు. మరియు ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు,తన దాసుల పరిస్థితులను బాగా తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(85) పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క మేలు,ఆయన ఆశీర్వాదము అధికమగును. ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూమి యొక్క సామ్రాజ్యాధికారము,ఆ రెండింటి మధ్య ఉన్నవాటి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన ఆయనకే చెందుతుంది. మరియు ప్రళయం సంభవించే ఘడియ యొక్క జ్ఞానము ఆయన ఒక్కడి వద్దనే ఉన్నది. అది ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియదు. పరలోకములో లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ఇవ్వబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.

(86) ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న వారికి అల్లాహ్ వద్ద సిఫారసు చేసే అధికారము లేదు. కాని అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడని సాక్ష్యం పలికే వారికి ఉంది. అతడు ఏమి సాక్ష్యం పలికాడో అల్లాహ్ కి తెలుసు. ఉదాహరణకి ఈసా,ఉజైర్,దైవదూతలు.

(87) మరియు ఒక వేళ మీరు వారిని మిమ్మల్ని సృష్టించినది ఎవరు ? అని అడిగితే వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : మమ్మల్ని అల్లాహ్ సృష్టించాడు. అటువంటప్పుడు వీరు ఈ అంగీకారము తరువాత ఎలా ఆయన ఆరాధన నుండి మరలించబడుతున్నారు ?.

(88) మరియు పరిశుద్ధుడైన ఆయన వద్ద తన ప్రవక్త యొక్క అతని జాతి వారి తిరస్కారము గురించి ఫిర్యాదు యొక్క మరియు ఆ విషయంలో "ఈ జాతి వారందరు నీవు వారి వద్దకు నాకు ఇచ్చి పంపించిన దాన్ని విశ్వసించరు" అని ఆయన అన్న మాట యొక్క జ్ఞానము ఉన్నది.

(89) కావున నీవు వారి నుండి విముఖత చూపి, వారి చెడును తొలగించే మాటను వారి కొరకు పలుకు - ఇది మక్కాలో అయ్యింది - అయితే వారు తొందరలోనే వారు ఎదుర్కొనే శిక్షను తెలుసుకుంటారు.