62 - Al-Jumu'a ()

|

(1) ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. ఆయన ఒక్కడే రాజ్యమును ఏలే ఏకైక రాజాది రాజు, ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.

(2) ఆయనే చదవలేని వ్రాయలేని వారైన అరబ్బులలో వారిలో నుంచే ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన తనపై అవతరింపజేసిన అతని ఆయతులను వారికి చదివి వినిపిస్తాడు. మరియు ఆయన వారిని అవిశ్వాసము నుండి,దుర లక్షణాల నుండి పరిశుద్ధపరుస్తాడు. మరియు వారికి ఖుర్ఆన్ ను బోదిస్తాడు. మరియు వారికి సున్నత్ ను నేర్పిస్తాడు. మరియు నిశ్చయంగా ఆయన వారి వద్దకు ప్రవక్తగా పంపించక మునుపు వారు సత్యము నుండి స్పష్టమైన అపమార్గంలో ఉండేవారు. ఎందుకంటే వారు విగ్రహాలను ఆరాధించేవారు. మరియు రక్తమును చిందించేవారు. మరియు బంధుత్వమును త్రెంచేవారు.

(3) మరియు ఆయన ఈ ప్రవక్తను అరబ్బుల్లోంచి ఇతర జనుల వైపునకు మరియు వారే కాకుండా ఇంకా రాని వారి వైపునకు పంపించాడు. మరియు వారు తొందరలోనే వస్తారు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు.

(4) ఈ ప్రస్తావించబడినది - అరబ్బుల వైపునకు మరియు ఇతరుల వైపునకు ప్రవక్తను పంపించడం - అల్లాహ్ అనుగ్రహము ఆయన దాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ గొప్ప ఉపకారము చేసేవాడు. మరియు ఆయన ఉపకారములో నుంచి ఈ సమాజపు ఒక ప్రవక్తను ప్రజలందరి వైపునకు ఆయన ప్రవక్తగా పంపించటం.

(5) తౌరాతులో ఉన్న దానికి కట్టుబడి ఉండమని బాధ్యత ఇవ్వబడిన తరువాత దాని బాధ్యత వహించని యూదుల ఉపమానము పెద్ద పెద్ద పుస్తకాలు మోసే గాడిద లాంటిది. దానిపై మోయబడినవి పుస్తకాలా లేదా వేరేవా దానికి తెలియదు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే జాతి వారి ఉపమానము ఎంతో చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గ జనులకు సత్యమును పొందే భాగ్యమును కలిగించడు.

(6) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ యూదత్వముపై దానిలో మార్పు చేర్పులైన తరువాత ఉండిపోయినవారా ప్రజలను కాకుండా మిమ్మల్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకమైన స్నేహితులుగా మీరు ఒక వేళ వాదిస్తే మీరు మరణమును కోరుకోండి - మీ వాదనకు తగ్గట్టుగా - మీకు ప్రత్యేకించుకున్నది గౌరవం త్వరగా లభించటానికి ఒక వేళ మీరు ప్రజలు కాకుండా అల్లాహ్ స్నేహితులని మీ వాదనలో సత్యవంతులే అయితే.

(7) మరియు వారు ఎన్నటికి మరణమును ఆశించరు. కాని వారు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు,దుర్మార్గము,తౌరాతులో మార్పు చేర్పుల వలన ఇహలోకంలో శాశ్వతంగా ఉండిపోవటమును ఆశిస్తారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(8) ఓ ప్రవక్తా ఈ యూదులందరితో మీరు ఇలా పలకండి : నిశ్చయంగా మీరు ఏ మరణము నుండి పారిపోతున్నారో అది త్వరగా లేదా అలస్యంగా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు ప్రళయదినమున గోచర,అగోచర విషయాల గురించి జ్ఞానము కల అల్లాహ్ వైపునకు మరలించబడుతారు. ఆ రెండిటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. అప్పుడు ఆయన మీరు ఇహలోకంలో చేసుకున్న వాటి గురించి మీకు తెలియపరుస్తాడు. మరియు వాటి పరంగా ఆయన మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(9) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా జుమా రోజున ప్రసంగం చేసే వారు మెంబరుపై ఎక్కిన తరువాత అజాన్ ఇచ్చే వారు పిలుపు ఇచ్చినప్పుడు మీరు ఖుత్బాకి,నమాజుకు హాజరు కావటం కొరకు త్వరపడండి. మరియు మీరు విధేయత చూపటం నుండి అశ్రద్ధవహించకుండా ఉండటానికి వ్యాపారమును వదిలివేయండి. జుమా నమాజు కొరకు అజాన్ ఇవ్వబడిన తరువాత పరుగెత్తి రావటం, వ్యాపారమును వదిలివేయటం లాంటి ఆదేశించబడినవి ఇవి మీకు ఎంతో మేలైనది - ఓ విశ్వాసపరులారా - ఒక వేళ మీకు అది తెలిసి ఉంటే మీరు అల్లాహ్ మీకు ఆదేశించిన వాటిని చేసి చూపించండి.

(10) మీరు జుమా నమాజును పూర్తి చేసినప్పుడు హలాల్ సంపాదనను,మీ అవసరాలను పూర్తి చేసుకోవటమును అన్వేషిస్తూ భూమిలో విస్తరించిపోండి. మరియు హలాల్ సంపాదన మార్గము నుండి మరియు హలాల్ ప్రయోజనం నుండి అల్లాహ్ అనుగ్రహమును ఆశించండి. మరియు మీరు ఆహారోపాధిని మీరు అన్వేషిస్తున్న సమయంలో అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. ఆహారోపాధిని మీ అన్వేషించటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరపింపజేయకూడదు. మీరు ఇష్టపడే వాటి ద్వారా విజయమును ఆశిస్తూ మరియు మీరు భయపడే వాటి నుండి విముక్తి పొందుతూ.

(11) మరియు కొంత మంది ముస్లిములు ఏదైన వ్యాపారమును లేదా వినోదమును చూసినప్పుడు దాని వైపునకు బయలుదేరి వేరైపోయేవారు. మరియు ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని మెంబరుపై నిలబడి ఉండగా వదిలేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా తెలపండి : సత్కార్యము చేయటంపై అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలము మీరు బయలుదేరి వెళ్ళిన వ్యాపారము,వినోదము కన్న ఎంతో మేలైనది. మరియు అల్లాహ్ జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు.