(1) ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు.
(2) అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు.
(3) అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.
(4) ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.
(5) ఓ ప్రవక్త తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?.
(6) నిశ్చయంగా అది అల్లాహ్ రాజేసిన అగ్ని.
(7) అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లోకి చొచ్చుకుపోయేది.
(8) నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది.
(9) విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు.