105 - Al-Fil ()

|

(1) ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?!

(2) నిశ్ఛయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.

(3) మరియు వారిపై పక్షులను పంపించాడు అవి వారిపై సమూహాలు సమూహాలుగా వచ్చినవి.

(4) అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి.

(5) అప్పుడు అల్లాహ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు.