(1) ఖురేష్ యొక్క అలవాటు వలన మరియు వారికి అలవాటు పరచటానికి.
(2) నిశ్ఛింతగా యమన్ వైపునకు శీతాకాల ప్రయాణము మరియు వేసవి కాలంలో షామ్ (సిరియా) వైపునకు ప్రయాణం (అలవాటు పరచటానికి).
(3) కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.
(4) ఆయనే వారిని ఆకలితో ఉన్నప్పుడు తినిపించాడు మరియు భయాందోళనలో శాంతిని కలిగించాడు. అరబ్ వాసుల హృదయములలో హరమ్ యొక్క గౌరవమును వేయటంతో మరియు అక్కడి వాసుల గౌరవమును వేయటంతో.