107 - Al-Maa'un ()

|

(1) ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!

(2) అతనే అనాథను అతని అవసరం నుండి చాలా మొరటుగా నెట్టివేస్తాడు.

(3) పేదవాడికి భోజనం తినిపించటం విషయంలో స్వయమును ప్రేరేపించడు మరియు ఇతరులను ప్రేరేపించడు.

(4) తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహించి వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోని నమాజీల శిక్ష మరియు వినాశనం.

(5) తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహించి వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోని నమాజీల శిక్ష మరియు వినాశనం.

(6) వారే తమ నమాజులను మరియు తమ కర్మలను ప్రదర్శిస్తారు. ఆచరణను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో చేయరు.

(7) మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.