(1) {అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.ఖుర్ఆన్ దాని వాఖ్యాలు క్రమములో,అర్ధములో ప్రావీణ్యం కలిగిన గ్రంధం.మీరు అందులో ఎటువంటి వ్యత్యాసము కాని లోపము కాని చూడరు.ఆ తరువాత అవి తన పర్యాలోచనలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడి తరపు నుండి,తన దాసుల స్థితులను,వారికి సంస్కరించే వాటిని తెలిసిన వాడి తరపు నుండి హలాల్,హరామ్,ఆదేశము,వారింపు,వాగ్దానము,హెచ్చరిక,గాధలు,ఇతర విషయాల ప్రస్తావన ద్వారా స్పష్టపరచబడినవి.
(2) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఆయతుల అంశము దాసులను అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధించటం నుండి వారించటం.ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయనకు అవిధేయతకు పాల్పడితే నిశ్చ యంగా నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టే వాడిని.ఒక వేళ మీరు ఆయన పై విశ్వాసమును కనబరచి ఆయన ధర్మమము ప్రకారము ఆచరిస్తే మీకు శుభవార్త తెలిపే వాడిని.
(3) ఓ ప్రజలారా మీరు మీ ప్రభువుతో మీ పాపముల కొరకు మన్నింపును వేడుకోండి.మరియు ఆయన విషయంలో మీ ద్వారా జరిగిన లోపము పై పశ్చాత్తాప్పడుతూ ఆయన వైపునకు మరలండి బదులుగా ఆయన మీ పరిమిత వయస్సులు ముగిసే సమయం వరకు మీ ఇహలోక జీవితంలో మీకు ఆయన మంచి సుఖసంతోషాలను ప్రసాధిస్తాడు,మరియు విధేయతను,ఆచరణను ఎక్కువగా చేసే ప్రతి వ్యక్తికి ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.ఒక వేళ మీరు నేను నా ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి విముఖత చూపితే నిశ్చయంగా నేను మీ పై భయానక పరిస్థితులు కల దినము యొక్క శిక్ష గురించి భయపడుతున్నాను.అది ప్రళయ దినము.
(4) ఓ ప్రజలారా ప్రళయదినాన మీ మరలటం ఒక్కడైన అల్లాహ్ వైపునే ఉంటుంది.మరియు పరిశుద్ధుడైన ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు.ఏ వస్తువూ కూడా ఆయన్ను అశక్తుడిని చేయదు.అయితే మీ మరణం,మీ మరల లేపబడటం తరువాత మిమ్మల్ని జీవింప చేయటం,మీ లెక్క తీసుకోవటం ఆయనను అశక్తుడిని చేయదు.
(5) వినండి నిశ్చయంగా ఈ ముష్రికులందరూ అల్లాహ్ గురించి వారి అజ్ఞానం వలన అల్లాహ్ గురించి వారి హృదయముల్లో ఉన్న సందేహమును వారు దాయటానికి తమ హృదయములను మరలిస్తున్నారు.వినండి వారు తమ తలలను తమ దుప్పట్లతో కప్పుకున్నప్పుడు అల్లాహ్ వారు దాచిన వాటిని,బహిర్గతం చేసేవాటిని తెలుసుకుంటాడు.నిశ్చయంగా ఆయన హృదయములు దాచే వాటిని తెలుసుకుంటాడు.
(6) భూమిపై సంచరించే ఏ ప్రాణి ఎక్కడ ఉన్నా అల్లాహ్ మాత్రమే తన వద్ద నుండి అనుగ్రహంగా దాని జీవనోపాది బాధ్యత తీసుకుని ఉన్నాడు.భూమిలో దాని నివాస స్థలం పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు.మరియు అది మరణించే స్థలము ఆయనకు తెలుసు.ప్రతీ ప్రాణి దాని ఆహారము,దాని నివాస స్థలము,దాని మరణ స్థలము గురించి స్పష్టమైన గ్రంధంలో ఉన్నది.అది లౌహె మహ్ఫూజ్.
(7) పరిశుద్ధుడైన ఆయనే ఆకాశములను,భూమిని ఆ రెండింటి గొప్పతనంమీద సృష్టించాడు.మరియు ఆ రెండింటిలో ఉన్న సమస్తమును ఆరు దినముల్లో సృష్టించాడు.ఆ రెండింటిని సృష్టించక ముందు ఆయన సింహాసనం నీటిపై ఉండేది.ఓ ప్రజలారా ఏవైతే అల్లాహ్ ను ప్రసన్నుడిని చేస్తాయో ఆ మంచిపనులు మీలో నుంచి ఎవరు చేస్తారో,ఏవైతే ఆయన్ను ఆగ్రహానికి లోను చేస్తాయో ఆ చెడ్డ పనులు మీలో నుంచి ఎవరు చేస్తారో మిమ్మల్ని ఆయన పరీక్షించటం కొరకు(సృష్టంచాడు).అయితే ఆయన ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఇలా పలికితే : ఓ ప్రజలారా నిశ్చయంగా మీరు మీ మరణం తరువాత మీ లెక్కతీసుకోవబడటానికి లేపబడుతారు . ఎవరైతే అల్లాహ్ ను అవిశ్వసించి మరణాంతరం లేపబడటాన్ని నిరాకరిస్తారో వారు తప్పకుండా ఇలా సమాధానమిస్తారు : నీవు పఠించే ఈ ఖుర్ఆన్ స్పష్టమైన మంత్రజాలము మాత్రమే.అది అసత్యాన్ని స్పష్టపరిచే అసత్యము.
(8) మరియు ఒక వేళ మేము ఇహలోక జీవితంలో ముష్రికుల నుండి వారు ఏ శిక్ష హక్కుదారులో అది కొన్ని నిర్ణీత దినముల కాలం వరకు ఆపి ఉంచితే దాన్ని తొందర చేసేవారు,ఎగతాళిచేసేవారు ఏ వస్తువు మన నుండి శిక్షను ఆపింది అని తప్పకుండా అంటారు.వినండి నిశ్చయంగా వారు ఏ శిక్ష హక్కుదారులో దానికి అల్లాహ్ వద్ద ఒక సమయం ఉన్నది.అది వారి వద్ద ఏ రోజైతే వస్తుందో వారి నుండి దాన్ని మరల్చేవాడిని ఎవరినీ వారు పొందరంటే పొందరు.కాని అది వారిపై వచ్చి పడుతుంది.ఏ శిక్ష గురించైతే వారు ఎగతాళిగా,హేళనగా తొందరచేసేవారో అది వారిని చుట్టుముట్టుతుంది.
(9) ఒక వేళ మేము మానవునికి మా వద్ద నుండి ఆరోగ్యము,ఐశ్వర్యము లాంటి అనుగ్రహాలను ప్రసాధించి ఆ తరువాత ఆ అనుగ్రహాలను అతని నుండి మేము లాక్కుంటే నిశ్చయంగా అతను అల్లాహ్ కారుణ్యము నుండి ఎక్కువగా నిరాశ్యుడవుతాడు,ఆయన అనుగ్రహములపట్ల ఎక్కువగా కృతఘ్నుడవుతాడు.అతని నుండి అల్లాహ్ వాటిని లాక్కున్నప్పుడు అతను వాటిని మరచిపోతాడు.
(10) ఒక వేళ మేము అతనికి జీవనోపాదిలో విశాలత్వము,అతనికి కలిగిన రోగము,పేదరికము తరువాత ఆరోగ్యము రుచిని చూపిస్తే అతను తప్పకుండా ఇలా అంటాడు : నా నుండి చెడు దూరమైపోయింది,నష్టము తొలిగిపోయింది.అతడు వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోడు.నిశ్చయంగా అతడు అహంకారముతో ఎక్కువగా సంతోషమును కలిగి ఉంటాడు,ప్రజలపై ఎక్కువగా దాడి చేస్తాడు,అల్లాహ్ అతనికి అనుగ్రహించిన దానిపై విర్రవీగుతాడు.
(11) కాని ఎవరైతే ఆపదల్లో,విధేయత చూపటంలో,అవిధేయ కార్యాల నుండి దూరం ఉండటంలో సహనం చూపి,సత్కర్మలు చేస్తారో వారి పరిస్థితి వేరుగా ఉంటుంది.వారికి నిరాశ కలగదు,అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నత ఉండదు.ప్రజల పై దాడీ చేయటం జరగదు.ఈ గుణాలను కలిగిన వారందరి కొరకు వారి ప్రభువు వద్ద వారి పాపములకు మన్నింపు ఉంటుంది.మరియు పరలోకములో వారికి పెద్ద ప్రతిఫలం ఉంటుంది.
(12) ఓ ప్రవక్తా వారి అవిశ్వాసము,వారి అవిధేయత,ఆయతుల పట్ల వారి ప్రతిపాదన చేయటం లాంటి వాటిని మీరు ఏవైతే వారి నుండి ఎదుర్కొన్నారో వాటి వలన అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిలోంచి కొన్నివారు పాటించటం వారికి ఇబ్బందిగా ఉన్నదని,ఎందుకు ఇతన్ని ధనికునిగా చేసే ఏదైన నిధి ఇతనిపై దింపబడలేదు లేదా అతన్ని దృవీకరించే ఎవరైన దూత అతనికి తోడుగా రాలేదు అని వారి అనటం వలన వాటిని చేరవేయటమునకు మీ మనస్సు కు ఇబ్బందిగా ఉన్నదని బహుశా మీరు వాటిని చేరవేయటమును వదిలి వేస్తారేమో.మీరు దాని వలన మీ వైపు అవతరింపబడిన వాటిలోంచి కొన్నింటి ని (కూడా) వదలమాకండి.మీరు హెచ్చరించే వారు మాత్రమే.మీకు అల్లాహ్ చేరవేయమని ఆదేశించిన వాటిని మీరు చేరవేస్తారు.ఆయతుల విషయంలో వారు ప్రతిపాదిస్తున్న వాటిని చేయటం మీకు సరికాదు.మరియు అల్లాహ్ ప్రతి వస్తువును సంరక్షించేవాడు.
(13) కాని ఏమీ ముష్రికులు ముహమ్మద్ ఖుర్ఆన్ ను కల్పిచుకున్నాడు,మరియు అది అల్లాహ్ తరపు నుండి అవతరింపబడిన దివ్యవాణి కాదు అని అంటున్నారా ?.ఓ ప్రవక్తా వారినే చాలెంజ్ విసరేస్తు ఇలా పలకండి : అలాగైతే మీరు ఈ ఖుర్ఆన్ లాంటి పది సూరాలను కల్పించుకుని తీసుకుని రండి.వాటిలో మీరు ఖుర్ఆన్ లాంటి సత్యాన్ని దేన్నైతే మీరు కల్పించబడినది అని వాదించారో ఇమడ్చలేరు.దీనిపై మీరు సహాయం తీసుకోవటం కొరకు మీరు పిలువగలే వారిని పిలుచుకోండి ఖుర్ఆన్ కల్పించబడినది అన్న వాదనలో మీరు సత్య వంతులే అయితే.
(14) అయితే ఒక వేళ వారికి దాని సామర్ధ్యం లేకపోవటం వలన మీరు వారితో కోరినది వారు తీసుకుని రాకపోతే ఓ విశ్వాసపరులారా ఖుర్ఆన్ ను అల్లాహ్ తన జ్ఞానముతో తన ప్రవక్తపై అవతరింపజేశాడని,అది కల్పించబడినది కాదు అని నిశ్చిత జ్ఞానముతో తెలుసుకోండి.మరియు మీరు అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం ఇంకొకరు లేడని తెలుసుకోండి.ఏ మీరు ఈ ఖచ్చితపు వాదనల తరువాత ఆయనకు లోబడరా ?.
(15) ఎవరైతే తన ఆచరణ ద్వారా ఇహలోక జీవితమును,అంతమైపోయే దాని సంపదను కోరుకుంటారో,దాని ద్వారా పరలోకమును కోరుకోరో వారికి మేము వారి కర్మల ప్రతిఫలమును ఆరోగ్యము,శాంతి,ఆహారోపాదిలో విశాలత్వము రూపములో ఇహలోకములోనే ప్రసాదిస్తాము.వారికి తమ కర్మల ప్రతిఫలము కొద్దిగా కూడా తగ్గించి ఇవ్వబడదు.
(16) ఈ దుర ఉద్దేశము కలిగిన వారందరికి ప్రళయదినాన నరకాగ్ని తప్ప ఇంకేమీ ఉండదు,వారు అందులో ప్రవేశిస్తారు.మరియు వారి నుండి వారి కర్మల ప్రతిఫలం తొలిగిపోతుంది.వారి కర్మలన్నీ మిథ్యగా మారిపోతాయి.ఎందుకంటే ఏ విశ్వాసము కాని ఏ మంచి ఉద్దేశము కాని వాటిని ముందుకు పంపించలేదు.మరియు వారు వాటి ద్వారా అల్లాహ్ మన్నతను,పరలోక నివాసమును ఆశించలేదు.
(17) మహోన్నతుడైన తన ప్రభువు తరపు నుండి ఆధారమును తనకు తోడుగా కలిగిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి సమానులు కారు,మరియు ఆయన ప్రభువు తరపునుండి జిబ్రయీల్ సాక్షిగా ఆయన వెనుక ఉండి,మూసా అలైహిస్సలాం పై ప్రజలకు నమూనాగా,వారిపై కారుణ్యంగా అవతరింపబడిన తౌరాతు గ్రంధం ముందు నుంచే ఆయన దైవ దౌత్యం పై సాక్ష్యం పలుకుతుంది.ఆయన,ఆయనతోపాటు విశ్వసించిన వారు అపమార్గంలో ఎదురుదెబ్బలు తగిలించుకుంటున్న అవిశ్వాసపరులందరితో సమానులు కారు.వారందరు ఖుర్ఆన్ పై,అది అవతరింపబడిన మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసమును కలిగి ఉన్నారు.జాతుల వారిలోంచి ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో ప్రళయదినాన వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే.అయితే ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ నుండి,వారి వాగ్దాన స్థలం నుండి ఎటువంటి సందేహములో పడకండి.అది ఎటువంటి సందేహం లేని సత్యము.స్పష్టమైన ఆధారాలు,బహిరంగ ఋజువులు తోడుగా ఉన్నా కూడా వారు విశ్వసించటం లేదు.
(18) అల్లాహ్ కు భాగస్వామి లేదా ఆయనకు కుమారుడి సంబంధం కలిగించటం ద్వారా అల్లాహ్ పై అబధ్ధమును కల్పించే వాడికన్న పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు.అల్లాహ్ పై అబద్థమును కల్పించే వారందరు ప్రళయదినాన వారి కర్మల గురించి ప్రశ్నించటం కొరకు తమ ప్రభువు ముందు ప్రవేశపెట్టబడుతారు.వారికి వ్యతిరేకంగా దైవ దూతలు,దైవ ప్రవక్తలు ఇలా సాక్ష్యం పలుకుతారు : వీరందరు వారే ఎవరైతే అల్లాహ్ కు భాగస్వామ్యం,కుమారుడి సంబంధం కల్పపటం ద్వారా అల్లాహ్ పై అబద్ధమును అంటగట్టారో. వినండి అల్లాహ్ పై అబద్ధమును అంటగట్టటం ద్వారా తమ ప్రాణముల కొరకు దుర్మార్గమునకు పాల్పడిన వారికి అల్లాహ్ కారుణ్యము నుండి అల్లాహ్ ధుత్కారము కలదు.
(19) ఎవరైతే ప్రజలను అల్లాహ్ యొక్క సన్మార్గము నుండి ఆపుతున్నారో,మరియు ఆయన మార్గము కొరకు అందులో ఎవరు నడవకుండా ఉండేంత వరకు సరళమును వదిలి వక్రతను కోరుకుంటున్నారో వారందరు మరణాంతరం లేపబడటాన్ని అవిశ్వసిస్తున్నారు,దాన్ని తిరస్కరిస్తున్నారు.
(20) ఈ లక్షణాలతో వర్ణించబడిన వారందరూ అల్లాహ్ శిక్ష వారిపై వచ్చి పడినప్పుడు భువిలో దాని నుండి పారిపోయే శక్తి లేనివారు.మరియు వారి నుండి అల్లాహ్ శిక్షను దూరంచేయటానికి వారి కొరకు అల్లాహ్ కాకుండా ఎవరూ మద్దతు ఇచ్చేవారు,సహాయకులు లేరు.వారు తమ స్వయాన్ని,ఇతరులను అల్లాహ్ మార్గము నుండి మరల్చినందు వలన ప్రళయదినాన వారిపై శిక్ష అధికం చేయబడుతుంది.సత్యము నుండి వారి తీవ్ర విముఖత వలన ఇహలోకములో సత్యమును,సన్మార్గమును స్వీకరించటానికి వినే విధంగా వినలేరు,విశ్వంలో ఉన్న అల్లాహ్ సూచనలను వారికి ప్రయోజనం చేసేవిదంగా చూడటమును చూడలేరు.
(21) ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు వారే అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ద్వారా కావాలనే వినాశనము స్థానాలను ఎంచుకుని తమ స్వయం కొరకు నష్టాన్ని మూటగట్టుకున్నారు.వారు కల్పించుకున్న సాటికల్పించబడినవారు,సిఫారసు చేసే వారు వారి నుండి దూరమైపోయారు.
(22) నిశ్చయంగా వారే ప్రళయదినాన వ్యాపారపరంగా (అత్యధికంగా) నష్టం చవిచూసేవారు. ఎప్పుడైతే వారు విశ్వాసమునకు బదులుగా అవిశ్వాసమును,పరలోకమునకు బదులుగా ఇహలోకమును,కారుణ్యమునకు బదులుగా శిక్షను కోరుకున్నరో.
(23) నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేసి,అల్లాహ్ కొరకు వినయమును,నిమమ్రతను చూపుతారో వారందరు స్వర్గవాసులు.వారు అందులో శాశ్వతంగా నివాసముంటారు.
(24) అవిశ్వాసపరుల,విశ్వాసపరుల ఇరువర్గాల ఉపమానము చూడలేని అంధుని,వినలేని చెవిటి వాని ఉపమానము,ఈ ఉపమానము ఆ అవిశ్వాసపరుల వర్గముది ఎవరైతే సత్యాన్ని స్వీకరించటానికి విన్నట్లుగా వినలేరు,మరియు దాన్ని (సత్యమును) వారికి ప్రయోజనం చేసేటట్లుగా చూడటమును చూడలేరు.వినే చూసే ఉపమానము,ఈ ఉపమానము ఆ విశ్వాసపరుల వర్గముది ఎవరైతే వినటము,చూడటం మధ్య సమీకరిస్తారు.ఈ రెండు వర్గాలు స్థితిని బట్టి,గుణమును బట్టి సమానులు కాగలరా ?!.సమానులు కాలేరు.వారిరువురి అసమానము వలన మీరు గుణపాఠము నేర్చుకోరా ?!.
(25) మరియు నిశ్చయంగా మేము నూహ్ అలైహిస్సలాంను తన జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము.అయితే ఆయన వారితో ఇలా పలికారు : ఓ నాజాతి ప్రజలారా నిశ్చయంగా నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించేవాడిని,నేను మీ వద్దకు ఇచ్చి పంపించబడిన దాన్ని మీ కొరకు స్పష్టపరిచే వాడిని.
(26) మరియు నేను మిమ్మల్ని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన వైపునకు పిలుస్తున్నాను.అయితే మీరు ఆయన తప్ప ఇంకొకరిని ఆరాధించకండి. నిశ్చయంగా నేను మీపై బాధ కలిగించే దినము యొక్క శిక్ష నుండి భయపడుతున్నాను.
(27) అయితే ఆయన జాతి వారిలోంచి సత్యతిరస్కారులైన పెద్దలు,నాయకులు ఇలా పలికారు : మేము మీ పిలుపును స్వీకరించమంటే స్వీకరించము ఎందుకంటే నీకు మాపై ఎటువంటి ప్రత్యేకతేేే లేదు.నీవు మా లాంటి మనిషివే.మరియు ఎందుకంటే మేము గమనించిన వారిలో బహిర్గతమైనది నిన్ను కేవలం మాలో నుండి నీచులు మాత్రమే అనుసరించారు,మరియు ఎందకంటే మేము మిమ్మల్ని అనుసరించటానికి మీకు ఉండవలసిన అర్హత గౌరవం,ధనం,ప్రతిష్టలో ఆధిక్యత మీకు లేదు.కాని మేము మీరు పిలుస్తున్న వాటిలో అసత్యులని మిమ్మల్ని అనుమానిస్తున్నాము.
(28) నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నాకు చెప్పండి ఒక వేళ నేను నా నిజాయితీ గురించి సాక్ష్యం పలికే మరియు నేను సత్యవంతుడని విశ్వసించటం మీపై అనివార్యం చేసే ఏదైన ఆధారంపై ఉంటే,మరియు నాకు ఆయన తన వద్ద నుండి కారుణ్యమైన దైవదౌత్యము (నుబువ్వత్),దైవ సందేశాలను చేరవేసే బాధ్యత (రిసాలత్) ను ప్రసాదిస్తే మరియు దాని విషయంలో మీ అజ్ఞానము వలన అది మీకు కనబడకపోతే దాన్ని విశ్వసించటం పై మిమ్మల్ని మేము బలవంతం చేయగలమా,దాన్ని మేము మీ హృదయముల్లో బలవంతాన ప్రవేసింపచేయగలమా ?.మాకు దాని శక్తి లేదు.విశ్వాస సౌభాగ్యము కలిగించేవాడు అతడే అల్లాహ్.
(29) ఓ నా జాతి వారా సందేశాలను చేరవేయటంపై నేను మీ నుండి ఎటువంటి ధనాన్ని ఆశించటం లేదు.నా ప్రతిఫలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది.మరియు మీరు గెంటివేయమని కోరిన పేద విశ్వాసపరులను నా సమావేశముల నుండి నేను దూరంచేయను.నిశ్చయంగా వారు ప్రళయదినాన తమ ప్రభువును కలుసుకుంటారు.మరియు ఆయన వారికి వారి విశ్వాసపరముగా ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.కానీ నేను మిమ్మల్ని మీరు పేదవిశ్వాసపరులను గెంటివేయమని కోరినప్పుడు ఈ పిలుపు యొక్క వాస్తవాన్ని అర్ధం చేసుకోని జాతి వారిగా భావిస్తున్నాను.
(30) ఓ నాజాతి వారా ఒక వేళ నేను ఈ విశ్వసపరులందరిని ఏ పాపము లేకుండా దౌర్జన్యంగా గెంటివేస్తే నా నుండి అల్లాహ్ శిక్షను ఎవరు దూరం చేస్తారు ?.ఏమీ మీరు గుణపాఠం నేర్చుకోరా,మీకు ఎక్కువ ప్రయోజనం కల,ఎక్కువ లాభదాయకమైన కార్యాల కై ప్రయత్నం చేయరా ?!.
(31) ఓ నాజాతి వారా నా వద్ద అల్లాహ్ నిధులు ఉన్నాయని వాటిలో ఆయన ప్రసాధించిన ఆహారోపాది ఉన్నదని ఒక వేళ మీరు విశ్వసిస్తే నేను దాన్ని మీపై ఖర్చు చేస్తాను అని మీతో అనటంలేదు.మరియు నాకు అగోచర విషయాల గురించి జ్ఞానం ఉన్నదని మీతో అనటం లేదు.నేను దైవదూతల్లోంచి అని మీతో అనటం లేదు కాని నేనూ మీలాగా మనిషిని.మరియు మీరు మీ దృష్టిలో అల్పముగా,చిన్నవారిగా భావించేవారిని అల్లాహ్ మేలు చేయడని సన్మార్గం చూపడని అనటం లేదు.అల్లాహ్ కి వారి సంకల్పాల గురించి,వారి స్థితుల గురించి బాగా తెలుసు.నిశ్చయంగా ఒక వేళ నేను దాన్నివాదిస్తే (దావా) అల్లాహ్ శిక్షకు అర్హత కలిగిన దుర్మార్గుల్లోంచి అయిపోతాను.
(32) వారు మొండితనముతో,అహంకారముతో ఇలా పలికారు : ఓ నూహ్ నిశ్చయంగా నీవు మాతో గొడవపడ్డావు,మాతో వాదించావు.అప్పుడు నీవు మాతో గొడవను,వాదనను అధికం చేశావు.అయితే ఒక వేళ నీవు నీ వాగ్దానములో సత్యవంతుడివే అయితే నీవు మాతో వాగ్దానం చేసిన శిక్షను మా వద్దకు తీసుకుని రా.
(33) నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నేను మీ వద్దకు శిక్షను తీసుకుని వచ్చేవాడిని కాను.దాన్ని మీ వద్దకు తలచుకుంటే అల్లాహ్ మాత్రమే తీసుకుని వస్తాడు.ఒక వేళ అల్లాహ్ మీకు శిక్షించదలచుకుంటే మీరు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోలేరు.
(34) మరియు ఒక వేళ మీ మొండితనం వలన అల్లాహ్ మిమ్మల్ని సన్మార్గము నుండి తప్పించదలచుకుంటే,మిమ్మల్ని సన్మార్గము నుండి పరాభవమునకు లోను చేయదలచుకుంటే నా హితబోధన,నా సలహాలు మీకు ప్రయోజనం చేకూర్చవు.ఆయనే మీ ప్రభువు.ఆయనే మీ వ్యవహారాలకు యజమాని.ఒక వేళ ఆయన తలచుకుంటే మిమ్మల్ని అపమార్గమునకు గురి చేస్తాడు.ప్రళయదినాన ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు.ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(35) నూహ్ అలైహిస్సలాం జాతి వారి అవిశ్వాసమునకు కారణం ఆయన తీసుకుని వచ్చిన ఈ ధర్మమును ఆయన అల్లాహ్ పై కల్పించుకున్నారని వారు భావించేవారు.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను దాన్ని కల్పించుకుంటే నా పాపము యొక్క శిక్ష నా ఒక్కడిపై ఉంటుంది.మరియు నేను మీ తిరస్కారము యొక్క కొంచెము పాపమును కూడా మోయను.నేను దాని నుండి నిర్దోషిని.
(36) మరియు అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం వైపునకు వహీ చేశాడు ఓ నూహ్ మీ జాతి వారిలోంచి ముందు విశ్వసించిన వారు తప్ప ఇంకా విశ్వసించరు.అయితే ఓ నూహ్ ఈ సుదీర్ఘమైన కాలము మధ్యలో వారు పాల్పడిన తిరస్కారము,ఎగతాళి చేయటం వలన మీరు బాధపడకండి.
(37) మరియు మీరు మా కళ్ళ ముందు,మా సంరక్షణలో మేము వహీ ద్వారా మీకు ఓడను ఎలా చేయాలని మీకు సూచించిన విధంగా ఓడను తయారు చేయండి.అవిశ్వాసము ద్వారా తమపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి గడువు ఇవ్వమని కోరుతూ నీవు నాతో మాట్లాడకు.అవిశ్వాసము పై వారి మొండితనము వలన వారు తమకు శిక్షగా నిశ్చయంగా తుఫానులో ఖచ్చితంగా వారు ముంచివేయబడుతారు.
(38) అయితే నూహ్ తన ప్రభువు ఆదేశమును చేసి చూపించారు.ఆయన ఓడను తయారు చేయటం ప్రారంభించారు.ఎప్పుడెప్పుడైతే అతని జాతి పెద్దలు,వారి నాయకులు ఆయన ముందు నుంచి వెళ్లేవారో ఆయన ప్రాంతంలో నీరు కాని కాలువలు కాని లేకపోయినా ఆయన ఓడ తయారు చేయటాన్ని పూనుకోవటం వలన ఆయన పట్ల పరిహాసమాడేవారు.ఎప్పుడైతే ఆయన పట్ల వారి పరిహాసము ఎక్కువైపోయినదో ఆయన ఇలా పలికారు : ఓ పెద్దలారా ఒక వేళ ఈ రోజు మేము ఓడను నిర్మించటంపై మీరు పరిహాసమాడితే నిశ్చయంగా మేమూ మీ అజ్ఞానం వలన మీ వ్యవహారము మునగటం అవుతుందో దానితో మీ పట్ల పరిహాసమాడుతాము.
(39) అయితే ఇహలోకములో ఎవరిపై వారిని పరాభవము కలిగించే,అవమానము కలిగించే శిక్ష వస్తుందో,ప్రళయ దినాన ఎవరిపై అంతము కాని శాస్వత శిక్ష వస్తుందో వారు తొందరలోనే తెలుసుకుంటారు.
(40) మరియు అల్లాహ్ తనకు ఆజ్ఞాపించినట్టే ఓడను తయారు చేయటాన్ని నూహ్ అలైహిస్సలాం పూర్తి చేశారు.చివరికి వారిని వినాశనం చేస్తూ మా ఆదేశం వచ్చి,మరియు తుఫాను ఆరంభం గురించి సూచిస్తూ వారు రొట్టెలను వండే పొయ్యి నుండి నీరు పొంగినప్పుడు మేము నూహ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించాము మీరు భూమిపై ఉండే జంతవుల రకముల్లోంచి రెండింటిని అంటే ఒక ఆడ,ఒక మగను ఓడలో ఎక్కించుకోండి.మరియు మీ కుటుంబము వారిలో ఎవరి గురించైతే అతను విశ్వసించకపోవటం వలన ముందు నుండి అతను ముంచబడుతాడు అని నిర్ణయం అయిపోయినదో వారు తప్ప ఇతరులను ఎక్కించుకోండి.మరియు మీ జాతి వారిలోంచి మీతోపాటు విశ్వసించిన వారిని ఎక్కించుకోండి.ఆయన జాతిలో ఆయన వారిని అల్లాహ్ విశ్వాసము వైపునకు పిలుస్తూ వారిలో సుధీర్గ కాలం ఉండిన తరువాత వారిలోంచి ఆయన తోపాటు చాలా తక్కువ మంది విశ్వసించారు.
(41) మరియు నూహ్ అలైహిస్సలాం తన కుటుంబం వారిలోంచి,తన జాతి వారిలోంచి విశ్వసించిన వారితో ఇలా పలికారు మీరు ఓడలోనికి ఎక్కండి.అల్లాహ్ నామముతో దాని పయనము,ఆయన నామముతో దాని ఆగటం అవుతుంది.నిశ్చయంగా నా ప్రభువు తన దాసుల్లోంచి పాపములకు మన్నింపు వేడుకొనే వారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.విశ్వాసపరులని ఆయన వినాశనం నుండి రక్షించటం వారిపై ఆయన కారుణ్యం.
(42) మరియు ఓడ తనలో ఉన్న ప్రజలను,ఇతరులను తీసుకుని పర్వతాల్లాంటి పెద్ద పెద్ద అలల్లో పయనించింది.ఒక దయ గల తండ్రిలా నూహ్ అలైహిస్సలాం అవిశ్వాసపరుడైన తన కుమారుడిన పిలిచారు.మరియు అతడు తన తండ్రి నుండి,తన జాతివారి నుండి ఒంటరిగా ఒక ప్రదేశములో ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారా నీవు మునగటం నుండి బ్రతికి బయటపడటానికి మాతో పాటు ఓడలో ఎక్కు.మరయు నీవు సత్య తిరస్కారుల్లోంచి కాకు.అలాంటప్పుడు నీకూ వారికి మునగటం ద్వారా సంభవించిన వినాశనము సంభవిస్తుంది.
(43) నూహ్ కుమారుడు నూహ్ తో ఇలా పలికాడు : నా వద్దకు నీరు చేరటం నుండి ఆపటానికి నేను ఎత్తైన పర్వతంపై శరణం తీసుకుంటాను.నూహ్ తన కుమారునికి ఇలా సమాధానమిచ్చారు : పరిశుద్ధుడైన తాను తలచుకున్న వారిని తన కరుణతో కరుణించే కరుణామయుడైన అల్లాహ్ తప్ప ఇంకెవరూ తూఫానులో మునిగే అల్లాహ్ శిక్ష నుండి ఈ రోజు ఆపేవాడు ఉండడు.నిశ్చయంగా ఆయనే అతడిని మునగటం నుండి ఆపుతాడు.అప్పుడే ఒక కెరటము నూహ్ ను ఆయన అవిశ్వాస కుమారుడిను వేరు చేసింది.ఆయన కుమారుడు తన అవిశ్వాసం వలన తూఫానులో మునిగేవారిలోంచి అయిపోయాడు.
(44) మరియు అల్లాహ్ తూఫాను ఆగిపోయిన తరువాత భూమిని ఓ భూమి నీపై ఉన్న తూఫాను నీటిని త్రాగేయి అని ఆదేశించాడు.ఆకాశముని ఓ ఆకాశమా నీవు వర్షాన్ని కురిపించకు,ఆపివేయి అని ఆదేశించాడు.మరియు నీరు తగ్గుముఖం పట్టి చివరికి నేల పొడి అయిపోయినది.మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను తుదిముట్టించాడు.మరియు ఓడ జూదీ కొండపై వెళ్ళి ఆగినది.అవిశ్వాసం వలన అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారి కొరకు దూరము,వినాశనము అవుగాక అని అనబడింది.
(45) మరియు నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును సహాయం కోసం పిలిచారు.అయితే ఆయన ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నా కుమారుడు నీవు రక్షిస్తానని వాగ్దానం చేసిన నా కుటుంబములోని వాడు.నీ వాగ్దానము సత్యమైనది అందులో ఎటువంటి విభేదము లేదు.మరియు నీవే అందరికన్నా న్యాయపూరితముగా తీర్పునిచ్చేవాడివి,వారిలో ఎక్కువ జ్ఞానము కలవాడివి.
(46) అల్లాహ్ నూహ్ తో ఇలా అన్నాడు : ఓ నూహ్ నీవు నాతో సంరక్షణ కొరకు అడిగిన నీ కుమారుడుని నేను సంరక్షిస్తాను అని నీతో వాగ్దానం చేసిన నీ కుటుంబము లోంచి కాడు.ఎందుకంటే అతడు అవిశ్వాసపరుడు.నిశ్చయంగా ఓ నూహ్ నీ అడగటం నీకు తగని కార్యం. నీ స్థానంలో ఉన్న వారికి అది సరైనది కాదు.నీకు తెలియని విషయాల గురించి నన్ను అడగకు.నీవు అజ్ఞానుల్లో అవటం నుండి జాగ్రత్తగా ఉండమని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.అప్పుడు నీవు నా జ్ఞానమునకు,నా వివేకమునకు విరుద్ధమైన వాటిని నీవు నన్ను అడుగుతావు.
(47) నూహ్ అలైహిస్సలాం ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నేను నాకు జ్ఞానం లేని వాటి గురించి నీకు అడగటం నుండి నీతో శరణమును,రక్షణను కోరుతున్నాను.ఒక వేళ నీవు నా పాపమును మన్నించకపోతే,నీ కారుణ్యముతో నన్ను కరుణించకపోతే నేను పరలోకములో తమ భాగములను కోల్పోయిన వారిలోంచి అయిపోతాను.
(48) అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం తో ఇలా పలికాడు : ఓ నూహ్ నీవు ఓడ నుండి సురక్షితముగా,భద్రముగా మరియు మీ పై,మీతో పాటు ఓడలో ఉన్న మీ తరువాత వచ్చే విశ్వాసపరులపై అధికమైన అల్లాహ్ అనుగ్రహాలతో భుమిపై దిగండి.మరియు అక్కడ వారి సంతతికి చెందిన వేరే అవిశ్వాస జాతులవారు ఉంటారు వారికి మేము ఇహలోకములో సుఖసంతోషాలను ప్రసాధిస్తాము,వారు జీవించటానికి కావలసినవి వారికి మేము ప్రసాధిస్తాము.ఆ తరువాత వారు పరలోకములో మా నుండి బాధాకరమైన శిక్షను పొందుతారు.
(49) నూహ్ అలైహిస్సలాం యొక్క ఈ గాధ అగోచర సమాచారములోనిది.మేము మీ వైపు అవతరింపజేసిన ఈ దైవ వాణి కన్నా మునుపు ఓ ప్రవక్తా దాని గురించి (నూహ్ గాధ గురించి) మీకు తెలియదు మరియు దాని గురించి మీ జాతి వారికీ తెలియదు.అయితే నూహ్ అలైహిస్సలాం సహనం వహించినట్లు మీ జాతి వారు బాధించటం పై,వారి తిరస్కారం పై మీరూ సహనం వహించండి.నిశ్చయంగా అల్లాహ్ ఆదేశాలను ఎవరైతే పాఠిస్తారో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారో వారికే విజయము,ఆధిపత్యము కలుగును.
(50) మరియు మేము ఆద్ జాతి వారి వైపు వారి సోదరుడు హూద్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము.ఆయన వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి.మరియు ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించకండి.పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేరు.ఆయనకు సాటి ఉన్నారని మీ వాదనలో కేవలం మీరు అబద్దము పలుకుతున్నారు.
(51) ఓ నా జాతి వారా నేను నా ప్రభువు సందేశాలను మీకు చేరవేయటం పై,ఆయన వైపునకు మిమ్మల్ని పిలవటం పై మీ నుండి నేను ఎటువంటి ప్రతిఫలాన్ని కోరటం లేదు.నా ప్రతిఫలం నన్ను సృష్టించిన అల్లాహ్ వద్ద ఉన్నది. ఏ నేను దేని వైపున మిమ్మల్ని పిలుస్తున్నానో మీరు దాని జవాబు ఇవ్వటానికి మీరు దాన్ని అర్ధం చేసుకోరా ?.
(52) ఓ నా జాతి ప్రజలారా మీరు మీ పాపములనుండి అందులో నుంచి పెద్ద పాపమైన షిర్కు నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకొని ఆయన వైపు పశ్చాత్తాప్పడండి.దానిపై ఆయన ఎక్కువగా వర్షాన్ని కురిపించటం ద్వారా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.మరియు సంతానమును,సంపదను అధికం చేసి మీకు బలంపై బలాన్ని అధికం చేస్తాడు.మరియు నేను దేని వైపునైతే మిమ్మల్ని పిలుస్తున్నానో దాని నుండి మీరు విముఖత చూపకండి.అయితే నా పిలుపు నుండి మీ విముఖత వలన,అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసము వలన,నేను తీసుకుని వచ్చిన దాని పట్ల మీ తిరస్కారము వలన మీరు అపరాదుల్లోంచి అయిపోతారు.
(53) ఆయన జాతి వారు ఇలా పలికారు : ఓ హూద్ మేము నిన్ను విశ్వసించేటట్లు చేసే ఎటువంటి స్పష్టమైన వాదనను నీవు మా వద్దకు తీసుకుని రాలేదు. ఎటువంటి ఆధారం లేకుండా ఖాళీగా ఉన్న నీ మాటలతో మేము మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టే వారము కాము.నీవు ప్రవక్త అని వాదించిన విషయాల్లో మీ కొరకు మేము విశ్వసించేవారము కాము.
(54) మా కొన్ని ఆరాధ్య దైవాల ఆరాధన నుండి నీవు మమ్మల్ని ఆపటం వలన అవి నిన్ను పిచ్చికి గురిచేశాయి అని మాత్రమే మేము అంటున్నాము. హూద్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను.మరియు మీరు కూడా నేను మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ ఆరాధ్య దైవాల ఆరాధన నుండి విసిగిపోయానని సాక్ష్యం పలకండి.అయితే మీరు మరియు నాకు పిచ్చి కలిగించారని మీరు వాదిస్తున్న మీ ఆరాధ్య దైవాలు కలిసి నాపై కుట్రలు పన్నండి.ఆ పిదప నాకు గడువు ఇవ్వకండి.
(55) మా కొన్ని ఆరాధ్య దైవాల ఆరాధన నుండి నీవు మమ్మల్ని ఆపటం వలన అవి నిన్ను పిచ్చికి గురిచేశాయి అని మాత్రమే మేము అంటున్నాము. హూద్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా నేను మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ ఆరాధ్య దైవాల ఆరాధన నుండి విసిగిపోయానని సాక్ష్యం పలకండి.అయితే మీరు మరియు నాకు పిచ్చి కలిగించారని మీరు వాదిస్తున్న మీ ఆరాధ్య దైవాలు కలిసి నాపై కుట్రలు పన్నండి.ఆ పిదప నాకు గడువు ఇవ్వకండి.
(56) నిశ్చయంగా నేను ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉన్నాను. మరియు నేను నా వ్యవహారాల్లో ఆయన పైనే ఆధారపడి ఉన్నాను. అతడు నా ప్రభువు మరియు మీ ప్రభువు.నేలపై సంచరించే ప్రతీది అల్లాహ్ ఆదీనంలో,ఆయనకు లోబడి ఉన్నది.ఆయన దాన్ని ఏవిధంగా తలచుకుంటే ఆవిధంగా మరలిస్తాడు.నిశ్చయంగా నా ప్రభువు సత్యానికి న్యాయానికి కట్టుబడి ఉన్నాడు.ఆయన మిమ్మల్ని నాపై ఆధిక్యతను ప్రసాధించడు. ఎందుకంటే నేను సత్యంపై ఉన్నాను మరియు మీరు అసత్యముపై ఉన్నారు.
(57) ఒక వేళ మీరు నేను తీసుకుని వచ్చిన దాని నుండి విముఖత చూపి వీపు త్రిప్పుకుంటే మిమ్మల్ని సందేశాలను చేరవేయటం మాత్రమే నా బాధ్యత.మరియు నేను అల్లాహ్ నాకు ఇచ్చి పంపించి,నన్ను చేరవేయమని ఆదేశించిన వాటన్నింటిని మీకు చేరవేశాను.మరియు మీపై వాదన నిరూపితమైనది.తొందరలోనే నా ప్రభువు మిమ్మల్ని తుదిముట్టిస్తాడు.మరియు మీరు కాకుండా ఇంకొక జాతిని తీసుకుని వస్తాడు వారు మీకు వారసులవుతారు.మరియు మీరు మీ తిరస్కారం ద్వారా,మీ విముఖత ద్వారా అల్లాహ్ కి పెద్ద నష్టం గాని చిన్నది గాని కలిగించలేరు.ఎందుకంటే ఆయనకు తన దాసుల అవసరం లేదు.నిశ్చయంగా నా ప్రభువు ప్రతీ దానిపై సంరక్షకుడిగా ఉన్నాడు.ఆయనే మీరు నా గురించి చేస్తున్న కుట్రల చెడు నుండి నన్ను రక్షిస్తాడు.
(58) మరియు వారిని తుదిముట్టించటం ద్వారా మా ఆదేశం వచ్చినప్పుడు హూద్ ను,ఆయన తోపాటు విశ్వసించిన వారిని మా వద్ద నుండి వారికి కలిగిన కారుణ్యం ద్వారా రక్షించాము.మరియు మేము వారిని కఠినమైన శిక్ష నుండి రక్షించాము.ఆయన జాతి వారిలోంచి అవిశ్వాసపరులను దాని ద్వారా శిక్షించాము.
(59) మరియు ఆ ఆద్ జాతి వారు తమ ప్రభువైన అల్లాహ్ ఆయతులను తిరస్కరించారు.మరియు తమ ప్రవక్త హూద్ కు అవిధేయత చూపారు.మరియు వారు సత్య విరోధి,దాన్ని స్వీకరించకుండా దానికి లొంగ కుండా తలబిరుసుతో వ్వవహరించే ప్రతీ వ్యక్తి ఆదేశమును అనుసరించారు.
(60) మరియు వారికి ఇహలోక జీవితములో పరాభవము,అల్లాహ్ కరుణ్యం నుండి ధుత్కారము చుట్టుకుంది.మరియు ఇలాగే ప్రళయదినాన వారు అల్లాహ్ కారుణ్యం నుండి దూరం చేయబడుతారు.మరియు అది మహోన్నతుడైన అల్లాహ్ పట్ల వారి తిరస్కారము వలన జరుగును. వినండీ అల్లాహ్ వారిని ప్రతీ మేలు నుండి దూరం చేస్తాడు మరియు వారిని ప్రతి చెడుకు దగ్గర చేస్తాడు.
(61) మరియు మేము సమూద్ జాతి వారి వైపునకు వారి సోదరుడు సాలిహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి వారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి.ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం మీ కొరకు ఇంకొకరు లేరు. ఆయన మీ తండ్రి అయిన ఆదమ్ ను భూమి మట్టి నుండి సృష్టించటం వలన మిమ్మల్ని భూమి మట్టి నుండి సృష్టించాడు. మరియు ఆయన మిమ్మల్ని దానిలో నివసింపజేశాడు.అయితే మీరు ఆయనతో మన్నింపు వేడుకోండి.ఆ పిదప మీరు విధేయ కార్యాలకు పాల్పడి,పాపకార్యాలను విడనాడి ఆయన వైపునకు మరలండి.నిశ్చయంగా నా ప్రభువు ఆయన కొరకు ఆరాధనను ప్రత్యేకించుకునే వారికి చాలా దగ్గరగా ఉంటాడు.వారి అర్ధనలను స్వీకరిస్తాడు.
(62) ఆయన జాతి వారు ఆయనతో ఇలా పలికారు : ఓ సాలిహ్ నీవు నీ ఈ పిలుపునివ్వక ముందు మాలో ఉన్నత స్థానం కలవాడిగా ఉండేవాడివి.నిశ్చయంగా నీవు హితబోధకునిగా,సలహాదారునిగా బుద్ధిమంతుడివై ఉంటావని మేము ఆశించినాము. ఓ సాలిహ్ ఏమి నీవు మా తాతముత్తాతలు ఆరాధించే వాటి ఆరాధన చేయటం నుండి మమ్మల్ని ఆపుతున్నావా ?. మరియు నిశ్చయంగా నీవు ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయటం వైపునకు మమ్మల్ని పిలిచిన దానిలో మేము సంశయంలో ఉన్నాము.అది అల్లాహ్ పై అబద్దము చెబుతున్నట్లు మమ్మల్ని నీపై ఆరోపించేటట్లు చేస్తుంది.
(63) సాలిహ్ అలైహిస్సలాం తన జాతి వారిని ఖండిస్తూ ఇలా పలికారు : ఓ నాజాతి వారా మీరు నాకు తెలియపరచండి. ఒక వేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన వాదనపై ఉంటే మరియు ఆయన తన వద్ద నుండి నాకు కారుణ్యమును ప్రసాదిస్తే అది దైవదౌత్యము అయితే నేను ఒక వేళ మీకు చేర వేయమని ఆయన నాకు ఆదేశించిన వాటిని చేరవేయటమును నేను వదిలివేస్తే ఎవరు ఆయన శిక్ష నుండి నన్ను ఆపుతారు .మీరు నన్ను అపమార్గమునకు గురిచేయటమును,ఆయన మన్నతల నుండి దూరం చేయటం తప్ప ఇంకా ఏమి అధికం చేయటం లేదు.
(64) మరియు ఓ నాజాతి వారా ఇది అల్లాహ్ ఒంటె,నా నిజాయితీ పై మీకు ఒక సూచన.దాన్ని మీరు అల్లాహ్ నేలలో మేస్తుండగా వదిలివేయండి, దానికి మీరు ఎటువంటి హాని తలపెట్టకండి.దాన్ని మీరు గాయపరచిన సమయము నుండే దగ్గరలో ఉన్న శిక్ష చుట్టుకుంటుంది.
(65) అయితే వారు తిరస్కారములో మునుగుతూ దాన్ని కోసివేశారు.అప్పడు సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు దాని కాలి నరాలు కోసినప్పటి నుండి మూడు దినముల కాలము మీ నేలలోనే (ఇండ్లలో)జీవితముతో ప్రయోజనం చెందండి.ఆ తరువాత మీ వద్దకు అల్లాహ్ శిక్ష వస్తుంది.దీని తరువాత ఆయన శిక్ష రావటం అబద్దము కాకుండా ఖచ్చితముగా జరిగే వాగ్దానము.కాని అది నిజమైన వాగ్దానము.
(66) ఎప్పుడైతే వారిని తుదిముట్టిస్తూ మా ఆదేశం వచ్చినదో మేము సాలిహ్ అలైహిస్సలాంను,ఆయనతోపాటు విశ్వసించిన వారిని మా వద్ద నుండి కారుణ్యం ద్వారా రక్షించాము.మరియు మేము వారిని ఆ రోజు యొక్క పరాభవము నుండి,దాని అవమానము నుండి రక్షించాము.ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఎవరు పరాజయం చేయలేని బలవంతుడు,ఆధిక్యుడు.మరియు అందు వలనే ఆయన తిరస్కరించే జాతులను తుదిముట్టించాడు.
(67) మరియు సమూద్ ను ప్రాణాంతకమైన తీవ్రమైన శబ్దము పట్టుకుంది.దాని తీవ్రత వలన వారు చనిపోయారు.వారు తమ ముఖములపై పడిపోయినట్లు అయిపోయారు.వారి ముఖములు మట్టిలో కూరుకుపోయాయి.
(68) వారు తమ బస్తీల్లో అనుగ్రహాల్లో,సుఖభోగాల్లో ఉండనట్లే ఉన్నారు.వినండీ నిశ్చయంగా సమూద్ జాతి వారు తమ ప్రభువు అయిన అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచారు.వారు అల్లాహ్ కారుణ్యం నుండి దూరంగా ఉండిపోయారు.
(69) మరియు నిశ్చయంగా దైవదూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు మనుషుల రూపములో ఆయనకు,ఆయన సతీమణికు ఇస్హాఖ్,ఆ తరువాత యాఖూబ్ గురించి శుభవార్త ఇస్తూ వచ్చారు.దైవ దూతలు (నీపై) శాంతి కలియుగాక అన్నారు.అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం తన మాట (మీపై) శాంతి కురియు గాక ద్వారా వారికి సమాధానము ఇచ్చారు.మరియు ఆయన వేగముగా వెళ్ళి వారు మనుషులు అని భావించి వారు తినటానికి వేయించబడిన ఒక ఆవుదూడను వారి వద్దకు తీసుకొని వచ్చారు.
(70) ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి చేతులు దూడకు దగ్గరవ్వకపోవటమును,వారు దాని నుండి తినకపోవటమును చూశారో ఆయన వారి నుండి శంకించారు,మరియు ఆయన లోలోపల వారి నుండి భయపడసాగారు.ఎప్పుడైతే దైవదూతలు తమ నుండి ఆయన భయపడటం గమనించారో ఇలా పలికారు : నీవు మా నుండి భయపడకు.మమ్మల్నే అల్లాహ్ లూత్ జాతి వారి వద్దకు వారిని మేము శిక్షించటానికి పంపించాడు.
(71) మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం సతీమణి సారహ్ నిలబడి ఉన్నది.అప్పుడు మేము ఆమెకు సంతోషమును కలిగించే వార్తను ఇచ్చాము.అది ఏమంటే ఆమె ఇస్హాఖ్ ను జన్మనిస్తుంది. మరియు ఇస్హాఖ్ నకు కుమారుడు కలుగుతాడు అతడు యాఖూబ్. అప్పుడు ఆమే నవ్వినది మరియు తాను విన్న దానితో సంతోషబడింది.
(72) దైవ దూతలు సారహ్ కు ఈ శుభవార్తను ఇచ్చినప్పుడు ఆమె ఆశ్చర్యముతో ఇలా పలికింది : నేను ఎలా జన్మనివ్వగలను ? నేను సంతానము కలగటంపై ఆశ వదులుకున్న వృద్ధురాలిని,మరియు నా ఈ భర్త వృద్ధాప్య వయసునకు చేరిన వాడు.నిశ్చయంగా ఈ స్థితిలో పిల్లవాడిని జన్మనివ్వటం అలవాటుకు విరుద్ధమైనది ఆశ్చర్యకరమైన విషయం.
(73) సారహ్ శుభవార్త పై ఆశ్చర్యపడినప్పుడు దైవదూతలు ఆమెతో ఇలా పలికారు : నీవు ఆల్లాహ్ నిర్ణయంపై,ఆయన సామర్ధ్యంపై ఆశ్చర్యపడుతున్నావా ?.నీ లాంటి స్త్రీ పై అల్లాహ్ ఇటువంటి విషయంపై సామర్ధ్యం కలవాడన్న విషయం గోప్యంగా లేదు.ఓ ఇబ్రాహీం ఇంటివారా అల్లాహ్ కారుణ్యము,ఆయన శుభాలు మీపై ఉన్నాయి.నిశ్చయంగా అల్లాహ్ తన గుణాల్లో,తన కార్యాల్లో స్తోత్రాలకు అర్హుడు,మహత్వము,గొప్పతనము కలవాడు.
(74) ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి ఆ భయము ఏదైతే అతని ఆ అతిధుల నుండి ఎవరైతే అతని భోజనమును తినలేదో వారు దైవ దూతలని ఆయనకు తెలిసిన తరువాత దూరమైనదో మరియు ఆయన వద్దకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు ఇస్హాఖ్ సంతానముగా కలుగుతాడని ఆ తరువాత యాఖూబ్ కలుగుతారని వచ్చినదో ఆయన లూత్ జాతి విషయంలో మా దూతలతో వాదించటం మొదలు పెట్టారు.బహుశా వారు వారి నుండి శిక్షను వెనుకకు నెట్టుతారని,బహుశా వారు లూత్ ను మరియు ఆయన ఇంటివారిని విముక్తి కలిగిస్తారని.
(75) నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం సహనశీలుడు. శిక్షను ఆలస్యం చేయటమును ఇష్టపడుతాడు.తన ప్రభువు వైపు ఎక్కువగా వినయమును చూపేవాడు,ఎక్కువగా అర్ధించేవాడు,ఆయన వైపు పశ్చాత్తాప్పడే వాడు.
(76) దైవదూతలు ఇలా పలికారు : ఓ ఇబ్రాహీం మీరు లూత్ జాతి వారి విషయంలో ఈ వాదించటమును మానుకోండి.నిశ్చయంగా వారిపై ఆయన వ్రాసిన శిక్ష వచ్చి పడటం ద్వారా నీ ప్రభువు ఆదేశం వచ్చినది.మరియు నిశ్చయంగా లూత్ జాతి వారిపై పెద్ద శిక్ష వస్తున్నది. దాన్ని ఎటువంటి వాదన గాని ప్రార్ధన గాని మళ్ళించదు.
(77) మరియు దైవ దూతలు మగవారి రూపములో లూత్ వద్దకు వచ్చినప్పుడు వారి రాక ఆయనకు బాధ కలిగించింది.మరియు ఆయన జాతిలో కొందరు స్త్రీలను వదిలి మగవారితో కామ కోరికలు తీర్చుకునేవారు. వారిపై ఆయన భయము ఉండటం వలన ఆయన హృదయము కృంగిపోయింది.మరియు లూత్ జాతివారు ఆయన అతిధుల విషయంలో ఆయన్ను ఓడిస్తారని భావించటం వలన ఇది కఠినమైన దినము అని లూత్ అన్నారు.
(78) మరియు లూత్ జాతి వారు లూత్ వద్దకు ఆయన అతిధుల పట్ల నీచపు పని (ఆశ్లీల చర్య) చేసే ఉద్దేశముతో పరిగెత్తుకొని వచ్చారు.దానికన్నా ముందు నుంచే స్త్రీలను వదిలి కామ కోరికలను మగవారితో పూర్తి చేసుకోవటం వారి అలవాటు ఉండేది.లూత్ తనజాతి వారిని ఎదుర్కొంటూ మరియు తన అతిధుల ముందు క్షమాపణ కోరుతూ ఇలా అన్నారు : వీరందరూ నా కుమార్తెలు మీ స్త్రీలలో నుంచే కాబట్టి మీరు వారితో వివాహం చేసుకోండి.వారందరు మీ కొరకు నీచపు చర్యకు పాల్పడటం కన్న ఎక్కువ పరిశుద్ధులు.అయితే మీరు అల్లాహ్ కు భయపడండి,మరియు మీరు నా అతిధుల విషయంలో నన్ను అవమానపాలు చేయకండి (తలదించుకొనేలా చేయకండి).ఓ నా జాతి వారా మీలో నుండి ఈ దుష్ట చర్య నుండి మిమ్మల్ని ఆపేవాడు సరైన బుద్ది కలవాడు లేడా ?!.
(79) ఆయన జాతి వారు ఆయనతో ఇలా పలికారు : ఓ లూత్ నీ కుమార్తెలలో,నీ జాతి స్త్రీలలో మాకు ఎటువంటి అవసరం గాని కోరిక గాని లేదని నీకు తెలుసు.మరియు నిశ్చయంగా మేము ఏమి కోరుకుంటున్నామో నీకు తెలుసు.మేము కేవలం మగవారినే కోరుకుంటున్నాము.
(80) లూత్ అలైహిస్సలాం ఇలా పలికారు : నాకు మిమ్మల్ని ఎదుర్కొనే బలం ఉంటే లేదా నా నుండి ఆపే ఏదైన వంశం ఉంటే ఎంత బాగుండేది.అప్పుడు నేను మీకు మరియు నా అతిధుల మధ్య అడ్డుగా ఉంటాను.
(81) దైవ దూతలు లూత్ అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ లూత్ నిశ్చయంగా మేము అల్లాహ్ పంపించిన దూతలము.నీ జాతి వారు నీ వద్దకు చెడును తీసుకొని చేరలేరు.అయితే మీరు మీ ఇంటి వారిని తీసుకొని రాత్రి చీకటి వేళలో ఈ ఊరి నుండి బయలుదేరండి.మీలో నుంచి ఎవ్వరూ నీ భార్య తప్ప వెనుక తిరిగి చూడకూడదు.ఆమె భిన్నంగా మారబోతుంది.ఎందుకంటే ఆయన నీ జాతి వారికి కలిగించే శిక్షను ఆమెకు కూడా కలిగిస్తాడు.నిశ్చయంగా ఉదయం వేళ వారి వినాశన నిర్ణీత వేళ.మరియు అది దగ్గరగా ఉన్న నిర్ణీత సమయం.
(82) లూత్ జాతి వారిని తుదిముట్టిస్తూ మా ఆదేశం వచ్చినప్పుడు మేము వారి బస్తీలను తలకిందులుగా చేసి వారిపై తిప్పి వేశాము.మరియు మేము వారిపై మట్టితో పటిష్టంగా తయారు చేయబడిన రాళ్ళను ఒకదానిపై ఒకటి వరుసగా కురిపించాము.
(83) ఈ రాళ్ళు అల్లాహ్ వద్ద నుండి ఒక ప్రత్యేకమైన గుర్తు వేయబడి ఉంటాయి.మరియు ఈ రాళ్ళు ఖురైష్ జాతి వారిలోంచి దుర్మార్గులు,ఇతరుల నుండి దూరంగా లేవు.అంతేకాదు అల్లాహ్ వాటిని వారిపై ఎప్పుడు అవతరించాలని నిర్ధారిస్తే అవి దిగటానికి దగ్గరలో ఉన్నవి.
(84) మరియు మేము మద్యన్ వారి వైపునకు వారి సోదరుడు షుఐహ్ ను ప్రవక్తగా పంపించినాము. ఆయన ఇలా పలికారు : ఓ నా జాతి ప్రజలారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆరాధనకు అర్హుడైన ఆరాధ్య దైవం ఆయన తప్ప ఇంకొకడు లేడు. మీరు ప్రజల కొరకు కొలచినప్పుడు లేదా వారి కొరకు తూకము వేసినప్పుడు కొలతల్లో,తూనికల్లో తగ్గించకండి. నిశ్చయంగా నేను మిమ్మల్ని పుష్కలమైన ఆహారోపాధిలో,సుఖభోగాల్లో చూస్తున్నాను. అయితే మీరు మీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను పాపకార్యాల ద్వారా మార్చుకోకండి. మరియు నిశ్చయంగా నేను ఆరోజు చుట్టుముట్టుకునే శిక్ష గురించి మీపై భయపడుతున్నాను. అది మీలో నుంచి ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. మీరు దాని నుండి ఎటువంటి పారిపోయే స్థలమును,శరణాలయమును పొందలేరు.
(85) ఓ నా జాతి వారా మీరు ఒక వేళ ఇతరుల కొరకు కొలిస్తే లేదా తూకము వేస్తే న్యాయపూరితంగా కొలతలను,తూనీకలను పూర్తి చేయండి.మరియు మీరు ప్రజల హక్కుల్లోంచి కొద్దిగా కూడా తూనికల్లో హెచ్చుతగ్గులు చేసి,దగా చేసి,మోసం చేసి తక్కువ చేసి ఇవ్వకండి.భువిలో హత్యచేయటం,ఇతర పాపకార్యాల ద్వారా అల్లకల్లోలాలను సృష్టించకండి.
(86) అల్లాహ్ న్యాయపరంగా ప్రజల హక్కులను పూర్తి చేసిన తరువాత మీ కొరకు మిగిల్చిన హలాల్ సంపద కొలతల్లో,తూనికల్లో హెచ్చు తగ్గులు చేయటం ద్వారా,భూమిలో అల్లకల్లోలాలను సృష్టించటం ద్వారా అధికంగా పొందిన దాని కన్న ఎక్కువ ప్రయోజనకరమైనది,శుభకరమైనది.ఒక వేళ మీరు సత్య విశ్వాసవంతులే అయితే ఈ మిగిలిన దానితో సంతృప్తి చెందండి.మరియు నేను మీ కర్మలను లెక్క వేయటానికి,వాటి పరంగా మీ లెక్క తీసుకోవటానికి మీపై పర్యవేక్షకుడిగా లేను. రహస్యాల గురించి జ్ఞానం కలవాడు మాత్రమే వాటిపై పర్యవేక్షకుడు.
(87) షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా పలికారు : ఓ షుఐబ్ అల్లాహ్ కొరకు నీవు చదివే నమాజు మా తాత ముత్తాతలు ఆరాధించిన విగ్రహాలను ఆరాధించటమును మేము వదిలివేయాలని నీకు ఆదేశిస్తున్నదా మరియు మేము కోరిన చోట మా సంపదను మేము ఖర్చు చేయటమును,వాటిని మేము కోరిన విధంగా పెంచటమును మేము వదిలేయాలని నిన్ను ఆదేశిస్తున్నదా ?.నిశ్చయంగా నీవే సహన శీలుడివి,ఉదాత్తుడివి.మరియు నిశ్చయంగా నీవే బుద్ధిమంతుడివి,వివేకవంతుడివి ఏ విధంగానైతే మేము నిన్ను ఈ సందేశము ఇవ్వక మునుపు గుర్తించేవారమో.అయితే నీకు ఏమి పట్టుకుంది ?.
(88) షుఐబ్ తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతివారా ఒక వేళ నేను నా ప్రభువు వద్ద నుండి ఏదైన స్పష్టమైన నిదర్శనంపై,ఆయన వద్ద నుండి ఏదైన ఆధారంపై ఉండి మరియు ఆయన తన వద్ద నుండి నాకు హలాల్ ఆహారాన్ని,ఆయన వద్ద నుండి దైవ దౌత్యమును ప్రసాధించి ఉంటే మీ పరిస్థితి గురించి నాకు తెలియపరచండి.నేను మిమ్మల్ని ఒక విషయం నుండి వారించి దాన్ని చేయటంలో మీకు వ్యతిరేకంగా చేయదల్చుకో లేదు.నా శక్తి మేరకు మిమ్మల్ని మీ ప్రభువు ఏకత్వం వైపునకు ఆయన విధేయత వైపునకు పిలిచి మీ సంస్కరణ మాత్రమే కోరుతున్నాను.దాన్ని పొందే నాకు భాగ్యము పరిశుద్ధుడైన అల్లాహ్ ద్వారానే జరుగును.ఆయన ఒక్కడిపైనే నేను నా వ్యవహారాలన్నింటిలో నమ్మకమును కలిగి ఉన్నాను మరియు ఆయన వైపునకే నేను మరలుతాను.
(89) ఓ నా ప్రజలారా నా శతృత్వం మిమ్మల్ని నేను తీసుకొని వచ్చిన దాన్ని తిరస్కరించటంపై పురిగొల్పకూడదు,నూహ్ జాతి వారికి లేదా హూద్ జాతి వారికి లేదా సాలిహ్ జాతి వారికి సంభవించినటువంటి శిక్ష మీకూ సంభవిస్తుందన్న భయము ఉన్నది.మరియు లూత్ జాతి వారు కాల పరంగా ,స్థాన పరంగా మీకన్నా దూరంగా లేరు.మరియు వారికి సంభవించినది మీకు తెలుసు.మీరు గుణపాఠం నేర్చుకోండి.
(90) మరియు మీరు మీ ప్రభువుతో మన్నింపును వేడుకోండి.ఆ తరువాత మీరు మీ పాపముల నుండి ఆయన వద్ద పశ్చాత్తాప్పడండి.నిశ్చయంగా నా ప్రభువు పశ్చత్తాప్పడే వారి పట్ల కరుణామయుడు.వారిలోంచి పశ్చాత్తాప్పడే వారి కొరకు అధిక వాత్సల్యము కలవాడు.
(91) షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా పలికారు : ఓ షుఐబ్ నీవు తీసుకొని వచ్చిన దాన్ని మేము చాలా వరకు అర్ధం చేసుకో లేదు.మరియు నిశ్చయంగా వృద్ధాప్యం వలన లేదా అంధత్వం వలన నీ కళ్ళకు కలిగిన దాని వలన మేము నిన్ను మా మధ్య బలహీనుడిగా చూస్తున్నాము.ఒక వేళ నీ వంశమే కనుక మా ధర్మంపై ఉండకపోయి ఉంటే మేము నిన్ను రాళ్ళతో కొట్టి చంపే వాళ్ళము.నిన్ను హతమార్చటం నుండి మేము భయపడటానికి నీవు మాపై ఆధిక్యత లేని వాడివి. మరియు మేము కేవలం నీ వంశమును గౌరవించటానికి మాత్రమే నిన్ను హతమార్చకుండా వదిలివేశాము.
(92) షుఐబ్ తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఏమీ నా వంశము మీ వద్ద మీ ప్రభువైన అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవము ,ఎక్కువ ఆధిక్యత కలవారా ?!.మరియు మీరు అల్లాహ్ మీ వైపు పంపించిన ఆయన ప్రవక్తను విశ్వసించకపోయిన వేళ అల్లాహ్ ను మీరు మీ వెనుక పడిఉన్నట్లు వదిలేశారు.నిశ్చయంగా నా ప్రభువు మీరు చేస్తున్న కార్యాలను చుట్టుముట్టి ఉన్నాడు.మీ కర్మల్లోంచి ఏదీను ఆయనపై గోప్యంగా లేదు.మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా ఇహలోకములో వినాశనము ద్వారా మరియు పరలోకములో శిక్ష ద్వారా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(93) ఓ నా జాతి వారా మీరు మీకు ఇష్టమైన పద్దతిపై మీ శక్తిమేరకు ఆచరించండి.నిశ్చయంగా నేను కూడా నాకు ఇష్టమైన పద్దతిపై నా శక్తిమేరకు ఆచరిస్తాను.తొందరలోనే మీరు మనలో నుంచి ఎవరిపై అవమానానికి గురి చేసే శిక్ష వచ్చిపడుతుందో మరియు మనలో నుంచి ఎవరు తన వాదనలో అసత్యపరుడో తెలుసుకుంటారు.అల్లాహ్ నిర్ణయం గురించి మీరు నిరీక్షించండి.నిశ్చయంగా నేనూ మీతోపాటు నిరీక్షిస్తాను.
(94) మరియు షుఐబ్ జాతి వారిని తుదిముట్టించటం ద్వారా మా ఆదేశం వచ్చినప్పుడు మేము షుఐబ్ ను,ఆయన తోపాటు విశ్వసించిన వారిని మా కారుణ్యముతో రక్షించాము.మరియు ఆయన జాతివారిలోంచి దుర్మార్గులకు ప్రాణాంతకమైన తీవ్రమైన శబ్దము పట్టుకుంది.అప్పుడు వారు చనిపోయారు.వారు తమ ముఖములపై పడిపోయినట్లు అయిపోయారు.వారి ముఖములు మట్టిలో కూరుకుపోయాయి.
(95) ఇంతక ముందు వారు అక్కడ నివాసముండనట్లు అయిపోయారు.వినండీ ఏ విధంగానైతే సమూద్ వారిపై అల్లాహ్ ఆగ్రహం కురవటం ద్వారా అల్లాహ్ కారుణ్యము నుండి సమూద్ గెంటివేయబడినదో అలా మద్యన్ పై అల్లాహ్ శిక్ష దిగటం ద్వారా మద్యన్ అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయబడినది.
(96) మరియు నిశ్చయంగా మేము మూసాను అల్లాహ్ ఏకత్వమును దృవపరిచే మా సూచనలను ఇచ్చి మరియు ఆయన తీసుకొని వచ్చినవి సత్యమని దృవీకరించే స్పష్టమైన మా వాదనలను ఇచ్చి పంపించాము.
(97) మేము ఆయన్ను ఫిర్ఔన్ మరియు అతని జాతి పెద్దల వద్దకు ప్రవక్తగా పంపించాము.అయితే ఈ పెద్దలందరు తమకు ఫిర్ఔన్ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబర్చమని ఇచ్చిన ఆదేశమును అనుసరించారు.వాస్తవానికి ఫిర్ఔన్ ఆదేశము అనుసరించటానికి సరైనది కాదు.
(98) ప్రళయదినమున నరకాగ్ని వైపు ఫిర్ఔన్ తన జాతి వారికి ముందు ముందు ఉంటాడు చివరికి వారిని తనే నరకాగ్నిలోకి ప్రవేశింపజేస్తాడు.అతను వారిని ప్రవేశింపచేసే స్థలము చెడ్డదైనది.
(99) మరియు అల్లాహ్ ఇహలోకములో వారిని ముంచి వినాశనమునకు గురి చేయటంతోపాటు వారి వెనుక శాపమును,ధూత్కారమును అంటగట్టాడు,తన కారుణ్యము నుండి దూరం చేశాడు.మరియు ఆయన ప్రళయదినాన వారి వెనుక ధూత్కారమును అంటగడుతాడు.దాని నుండి (కారుణ్యం నుండి) దూరం చేస్తాడు.వారికి ఇహలోకములో,పరలోకములో కలిగిన రెండు శాపాల బహుమానము మరియు శిక్ష చెడ్డవైనవి.
(100) ఓ ప్రవక్తా ఈ సూరహ్ లో ప్రస్తావించబడిన బస్తీల సమాచారాలు మేము మీకు వాటి గురించి తెలియపరుస్తున్నాము.ఆ బస్తీల్లోంచి కొన్నింటి ఆనవాళ్లు నిలబడి ఉన్నవి. మరియు వాటిలోంచి కొన్నింటి ఆనవాళ్లు తుడిచివేయబడినవి.దాని కొరకు ఎటువంటి గుర్తు మిగల లేదు.
(101) వారికి మేము కలిగించిన వినాశనము ద్వారా వారికి అన్యాయం కలిగించ లేదు.కాని వారు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము ద్వారా స్వయంగా వినాశనము స్థానమును నిర్ణయించుకొని తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. వారిని వినాశనం చేయటానికి నీ ప్రభువు ఆదేశం వచ్చినప్పుడు ఓ ప్రవక్తా, వారిపై అవతరించిన శిక్షను వారు అల్లాహ్ ను వదిలి పూజిస్తున్న వారి ఆరాధ్య దైవాలు వారి నుండి దూరం చేయలేకపోయాయి. వారి ఈ ఆరాధ్య దైవాలు వారిపై నష్టాన్ని,వినాశనమును మాత్రమే అధికం చేశాయి.
(102) అల్లాహ్ తిరస్కారులైన బస్తీ వాళ్ళను శిక్ష రూపములో పట్టుకున్నట్లే ప్రతీ కాలములో,ప్రతీ చోట శిక్ష రూపములో పట్టుకోవటం,తుదిముట్టించడం ఉంటుంది.నిశ్చయంగా దుర్మార్గులైన బస్తీ వాళ్ళ కొరకు ఆయన పట్టు బాధాకరమైన బలమైన పట్టు.
(103) నిశ్చయంగా ఈ దుర్మార్గులైన బస్తీల వారి కొరకు అల్లాహ్ యొక్క కఠినమైన పట్టులో ప్రళయదిన శిక్ష నుండి భయపడే వారి కొరకు గుణపాఠము,హితబోధన కలదు.ఈ దినము అల్లాహ్ ప్రజలను వారి లెక్క తీసుకోవటం కొరకు సమీకరిస్తాడు.మరియు ఇది మహషర్ వాళ్ళు సమావేశమయ్యే సమావేశపరచబడే రోజు.
(104) ఈ హాజరుపరచబడే దినమును మేము ఒక నిర్ణీత కాలము వరకు మాత్రమే ఆపి ఉంచాము.
(105) ప్రళయం నెలకొన్న రోజు ఏ మనిషి ఏ వాదన ద్వారా లేదా సిఫారసు ద్వారా ఆయన అనుమతి తరువాతే మాట్లాడగలుగుతాడు.ఆ విషయంలో ప్రజలు రెండు రకాలు ఒకడు దౌర్భాగ్యుడు అతడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు మరియు ఇంకొకడు పుణ్యాత్ముడు అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.
(106) అయితే దౌర్భాగ్యులు తమ అవిశ్వాసం వలన,తమ దుష్కార్యాల వలన నరకాగ్నిలో ప్రవేశిస్తారు.వారు ఏదైతే దాని మంట తీవ్రతను వారు చూస్తారో దాని వలన అందులో వారి స్వరాలు,వారి రొప్పుల స్వరాలు పెద్దవి అవుతాయి.
(107) అందులో శాస్వతంగా ఉంటారు.భూమ్యాకాశములు ఉన్నంత వరకు వారు అందులో నుంచి బయటకు రాలేరు.అల్లాహ్ మువహ్హిదీన్ (ఏకేశ్వరోపాసన చేసే వారు) లలోంచి పాపాత్ములును బయటకు తీయదలచు కుంటే తప్ప.ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరినది చేసి తీరుతాడు.దాన్ని చెడుగా భావించేవాడు ఎవడూ ఉండడు,ఆయన పరిశుద్ధుడు.
(108) మరియు వారి విశ్వాసము వలన,వారి సత్కర్మల వలన అల్లాహ్ వద్ద నుండి ముందే పుణ్యం కలిగిన పుణ్యాత్ములు వారందరు భూమ్యాకాశములు ఉన్నంత వరకు స్వర్గములో శాస్వతంగా నివాసముంటారు.విశ్వాస పరుల్లోంచి పాపాత్ములను స్వర్గము కన్న ముందు అల్లాహ్ ఎరినైన నరకములో ప్రవేశింపజేయదలిస్తే తప్ప.నిశ్చయంగా స్వర్గ వాసుల కొరకు అల్లాహ్ అనుగ్రహాలు వారి నుండి అంతం కానివి.
(109) ఓ ప్రవక్తా మీరు ఈ బహుదైవారాధకులందరు ఆరాధిస్తున్న వాటి చెడు నుండి ఎటువంటి సందేహంలో గాని సంశయంలో గాని పడమాకండి. అది సరి అయినది అనటానికి వారి వద్ద భౌద్దికంగా గాని ఆధ్యాత్మికంగా గాని ఎటువంటి ఆధారము లేదు.మరియు అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధనపై వారిని పురిగొల్పింది కేవలం వారి తాతముత్తాతలను వారి అనుసరణ మాత్రమే.మరియు నిశ్చయంగా మేము వారి కొరకు వారి భాగమును శిక్ష రూపములో ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా నొసుగుతాము.
(110) మరియు నిశ్చయంగా మేము మూసాకు తౌరాత్ ను ప్రసాధించాము.అయితే ప్రజలు అందులో విభేధించుకున్నారు.మరియు వారిలో కొందరు దాన్ని విశ్వసించారు మరికొందరు తిరస్కరించారు. ఒకవేళ అల్లాహ్ ఏదైన వివేకము వలన శిక్షను తొందరగా విధించకుండా ప్రళయదినం వరకు దాన్ని వెనుకకు చేయాలని నిర్ణయం ముందే చేసి ఉండకపోతే వారికి విధించవలసిన శిక్షను ఇహలోకములోనే విధించేవాడు.మరియు నిశ్చయంగా యూదుల్లోంచి అవిశ్వాసపరులు మరియు ముష్రికులు ఖుర్ఆన్ విషయంలో సందేహములో,సంశయములో పడి ఉన్నారు.
(111) ఓ ప్రవక్తా నిశ్చయంగా విభేధించుకున్న వారిలోంచి ప్రస్తావించబడిన ఫ్రతి ఒక్కరికి నీ ప్రభువు వారి కర్మల ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. మంచిగా ఉన్న వారికి వారి ప్రతిఫలం మంచిగా ఉంటుంది. చెడుగా ఉన్నవారికి వారి ప్రతిఫలం చెడుగా ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ వారు చేసే సున్నితమైన కర్మల గురించి బాగా తెలిసినవాడు. ఆయన పై వారి కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు.
(112) ఓ ప్రవక్తా అల్లాహ్ మిమ్మల్ని ఆదేశించినట్లు ఋజుమార్గమును అంటిపెట్టుకుని ఉండటంపై మీరు కట్టుబడి ఉండండి.అయితే మీరు ఆయన ఆదేశాలను పాటించండి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండండి.మరియు మీతోపాటు పశ్చాత్తాపభావంతో మరలి వచ్చిన వారు తిన్నగా నిలబడాలి.మరియు మీరు అవిధేయ కార్యాలకు పాల్పడి హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా ఆయన మీరు చేస్తున్న కర్మలను వీక్షిస్తున్నాడు.మీ కర్మల్లోంచి ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు.మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(113) మరియు మీరు ముఖస్తుతితో (నునుపుదనంతో) లేదా వాత్సల్యముతో దుర్మార్గులైన అవిశ్వాసుల వైపునకు మొగ్గు చూపకండి.ఈ మొగ్గటం వలన మీకు నరకాగ్ని చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ కాకుండా దాని నుండి మిమ్మల్ని రక్షించటానికి మీ కొరకు సంరక్షకులుగా ఎవరూ ఉండరు. ఆ తరువాత మిమ్మల్ని సహాయము చేసేవారిగా ఎవరినీ మీరు పొందరు.
(114) ఓ ప్రవక్తా మీరు దినపు చివరి రెండు భాగాలైన అవి దినపు మొదటి వేళ మరియు దాని చివరి వేళ లో నమాజును ఉత్తమ పద్దతిలో నెలకొల్పండి.మరియు రాత్రి వేళల్లో కూడా నెలకొల్పండి.నిశ్చయంగా సత్కర్మలు చిన్న పాపములను తుడిచివేస్తాయి.ఈ ప్రస్తావించబడినది హితబోధనను గ్రహించే వారి కొరకు హితబోధన మరియు గుణపాఠము నేర్చుకునే వారి కొరకు గుణపాఠము.
(115) మరియు నేను ఆదేశించినటువంటి నిలకడ చూపటం,ఇతర వాటిపై మరియు నేను వారించినవి హద్దుమీరటం,దుర్మార్గం వైపునకు మొగ్గు చూపటంను వదిలివేయటంపై సహనం చూపండి. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల పుణ్యాన్ని వృధా చేయడు. కాని వారు చేసిన దాని కన్న మంచిగా వారి నుండి స్వీకరిస్తాడు. మరియు వారికి వారు చేసిన దాని కన్న మంచిగా వారి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
(116) మీకన్నా పూర్వం శిక్షించబడిన జాతుల వారిలోంచి మిగిలిన గొప్పవారు,సజ్జనులు ఈ జాతుల వారిని అవిశ్వాసము నుండి,భూమిలో పాపకార్యాల ద్వారా అల్లకల్లోలాలను రేకెత్తించటం నుండి ఆపటానికి ఎందుకు లేరు.వారిలోంచి మిగిలిన వారు చాలా తక్కువ మంది అల్లకల్లోలాల నుండి ఆపేవారు ఉన్నారు.అయితే మేము దుర్మార్గులైన వారి జాతుల వారిని తుది ముట్టించినప్పుడు వారిని రక్షించాము.వారి జాతుల వారిలోంచి దుర్మార్గులు తాము ఉన్న సుఖభోగాల వెనుక పడిపోయారు.మరియు వారు ఆ అనుసరించటం ద్వారా దుర్మార్గులైపోయారు.
(117) ఓ ప్రవక్తా బస్తీల్లోంచి ఏదైన బస్తీ వారు భూమిలో సంస్కరించే వారై ఉన్నప్పుడు నీ ప్రభువు దాన్ని నాశనం చేయడు.ఒక వేళ దాని వాసులు అవిశ్వాసముతో,దుర్మార్గముతో,అవిధేయ కార్యాలతో అల్లకల్లోలాలు సృష్టిస్తే మాత్రమే దాన్ని నాశనం చేస్తాడు.
(118) ఓ ప్రవక్తా ఒక వేళ అల్లాహ్ ప్రజలందరిని సత్యంపై ఉండేటట్లుగా ఒకే జాతిగా చేయదలచుకుంటే చేసేవాడు.కానీ ఆయన అలా తలచకోలేదు.వారు మాత్రం కోరికలను అనుసరించటం,దౌర్జన్యం వలన అందులో విభేదించుకుంటూ ఉండిపోయారు.
(119) కాని అల్లాహ్ ఎవరిపైనైతే సన్మార్గమును నొసగటం ద్వారా కరుణించాడో వారు పరిశుద్ధుడైన ఆయన ఏకత్వము విషయంలో విభేదించుకోరు. ఈ పరీక్ష కొరకే విభేధంగా వారిని పరిశుద్ధుడైన ఆయన (అల్లాహ్) సృష్టించాడు.వారిలోంచి దుష్టుడు మరియు పుణ్యాత్ముడు ఉన్నారు.ఓ ప్రవక్తా నీ ప్రభువు యొక్క ఆ మాట దేనినైతే ఆయన అనంతములో నిర్ణయించాడో మానవుల్లోంచి,జిన్నుల్లోంచి షైతానును అనుసరించే వారితో నరకమును నింపి వేయటం ద్వారా నెరవేరింది.
(120) ఓ ప్రవక్తా నీకన్నా మునుపటి ప్రవక్తల సమాచారముల్లోంచి ప్రతి సమాచారమును మీకు తెలియపరచాము. వాటి ద్వారా మేము మీ హృదయమును సత్యముపై స్థిరపరచటానికి మరియు దాన్ని బలపరచటానికి వాటిని (సమాచారమును) మీకు తెలియపరచాము. మరియు ఈ సూరహ్ లో ఎటువంటి సందేహము లేని సత్యము మీ వద్దకు వచ్చింది.అందులో మీ వద్దకు అవిశ్వాసపరుల కొరకు హితోపదేశము మరియు హితోపదేశము ద్వారా ప్రయోజనం చెందే విశ్వాసపరుల కొరకు జ్ఞాపిక వచ్చినది.
(121) ఓ ప్రవక్తా అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచని మరియు ఆయన ఏకత్వమును చాటి చెప్పని వారితో మీరు ఇలా పలకండి : మీరు సత్యము నుండి విముఖత చూపటంలో,దాని నుండి ఆపటంలో మీ పద్దతిలో మీరు అమలు చేయండి నిశ్చయంగా మేము కూడా దానిపై స్థిరత్వము చూపటంలో,దాని కొరకు పిలుపునివ్వటంలో,దాని పై సహనం చూపటంలో మా పద్దతిలో మేము అమలు చేస్తాము.
(122) మాపై ఏమి అవతరిస్తుందో మీరు వేచి చూడండి నిశ్చయంగా మేము మీపై ఏమి అవతరిస్తుందో వేచి చూస్తాము.
(123) ఆకాశాల్లో ఆగోచరంగా ఉన్నవాటి మరియు భూమిలో అగోచరంగా ఉన్నవాటి యొక్క జ్ఞానము ఒక్కడైన అల్లాహ్ కే ఉన్నది. అందులో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు.ప్రళయదినాన వ్యవహారాలన్ని ఆయన ఒక్కడి వైపునకే మరలుతాయి.ఓ ప్రవక్తా మీరు ఆయన ఒక్కడినే ఆరాధించండి.మరియు మీ వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే నమ్మకమును కలిగి ఉండండి.వారు ఆచరించే వాటి నుండి మీ ప్రభువు పరధ్యానంలో లేడు.కాని ఆయన వాటి గురించి బాగా తెలిసినవాడు.మరియు ఆయన ఆచరించిన ప్రతి ఒక్కరికి వారు చేసిన దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.