110 - An-Nasr ()

|

(1) ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లాహ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రాప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు.

(2) మరియు మీరు ప్రజలను ఒక సమూహం తరువాత ఒక సమూహం ఇస్లాంలో ప్రవేశిస్తుండగా చూస్తారు.

(3) కాబట్టి మీరు అది మీరు ఏ మిషన్ తో పంపించబడ్డారో దాని ముగింపు దగ్గరపడినది అనటాని సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్థుతులతో పరిశుద్ధతను కొనియాడండి సహాయము,విజయము యొక్క అనుగ్రహము పై ఆయనకు కృతజ్ఞతగా. మరియు ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.