(1) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.
(2) ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.
(3) వారి వాస్తవ ఆరాధ్య దైవము. అతను తప్ప వారికి ఏ వాస్తవ ఆరాధ్యదైవము లేడు.
(4) ఆ షైతాన్ కీడు నుండి ఎవడైతే మానవునికి అల్లాహ్ స్మరణ నుండి అతడు పరధ్యానంలో ఉన్నప్పుడు తన దుష్ప్రేరణను వేస్తాడు. మరియు అతడు ఆయన స్మరణ చేసినప్పుడు అతని నుండి వెనుకడుగు వేస్తాడు.
(5) అతడు తన దుష్ప్రేరితాలను ప్రజల హృదయాల్లో వేస్తాడు.
(6) మరియు అతడు జిన్నుల్లోంచి అయినట్లే మానవుల్లోంచి అవుతాడు.