(1) {అలఫ్-లామ్-రా} సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యంపై చర్చ జరిగింది.ఈ సూరహ్ లో అవతరించబడిన ఈ ఆయతులు సుస్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులు అందులో పొందుపరచబడి ఉన్నవి.
(2) ఓ అరబ్బులారా నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అరబీ భాషలో అవతరింప జేశాము బహుశా మీరు దాని అర్ధాలను అర్థం చేసుకుంటారని.
(3) ఓ ప్రవక్తా మేము ఉత్తమమైన గాధలను వాటి నిజాయితీ వలన,వాటి పదాల భద్రత,వాటి సమగ్రత వలన ఈ ఖుర్ఆన్ ను మా అవతరణ ద్వారా మీకు తెలియపరచాము.మరియు నిశ్చయంగా మీరు దీని అవతరణ ముందు ఈ గాధల నుండి పరధ్యానంలో ఉన్నారు.వాటి గురించి మీకు తెలియదు.
(4) ఓ ప్రవక్తా మేము మీకు యూసుఫ్ తన తండ్రి యాకూబ్ తో ఇలా పలికిన వేళను తెలియపరుస్తున్నాము : ఓ నా ప్రియ తండ్రి నిశ్చయంగా నేను కలలో పదకొండు నక్షత్రాలను చూశాను మరియు నేను సూర్యుడిని,చంద్రుడిని చూశాను.నేను వాటన్నింటిని నాకు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.అయితే ఈ కల యుసుఫ్ అలైహిస్సలాము కొరకు తొందరగా ఇవ్వబడిన శుభవార్త అయినది.
(5) యాఖూబ్ తన కుమారుడగు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నీవు నీ కలను నీ సోదరులకు తెలియపరచకు అప్పుడు వారు దాన్ని అర్ధం చేసుకుంటారు. మరియు వారు నీ పై అసూయ చెందుతారు.అప్పుడు వారు తమ అసూయతో నీ కొరకు కుట్రలు పన్నుతారు . నిశ్చయంగా షైతాను మానవుని కొరకు స్పష్టమైన శతృవు.
(6) మరియు ఏ విధంగా నైతే నీవు ఈ కలను చూశావో ఓ యూసుఫ్ నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు.మరియు నీకు కలల తాత్పర్యమును నేర్పుతాడు,మరియు ఆయన దైవదౌత్యము ద్వారా నీపై తన అనుగ్రహమును సంపూర్ణం చేస్తాడు. ఏవిధంగానైతే ఆయన నీ కన్నా మునుపు నీ తాతముత్తాతలైన ఇబ్రాహీమ్,ఇస్ హాఖ్ లపై తన అనుగ్రహమును సంపూర్ణం చేశాడో ఆవిధంగా.నిశ్చయంగా నీ ప్రభువు తన సృష్టి గురించి బాగా తెలిసినవాడు,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు.
(7) వాస్తవానికి యూసుఫ్ యొక్క సమాచారములో.ఆయన సోదరుల సమాచారములో వారి సమాచారముల గురించి అడిగే వారి కొరకు గుణపాఠాలు,హితబోధనలు కలవు.
(8) ఆయన సోదరులు వారి మధ్యలో ఇలా అనుకున్నప్పుడు : నిశ్చయంగా యూసుప్ మరియు అతని సొంత సోదరుడు మా తండ్రి వద్ద మా కన్నా ఎక్కువ ఇష్టత కలిగిన వారు.వాస్తవానికి మేము ఎక్కువ సంఖ్య గల వర్గము.అయితే ఆయన వారిద్దరిని మన కన్నా ఎక్కువ యోగ్యులుగా ఎలా భావిస్తున్నారు ?.నిశ్చయంగా మా నుండి ఎటువంటి కారణం స్పష్టం కాకుండానే ఆయన వారిని మా కన్నా ఎక్కువ యోగ్యులుగా భావించినప్పడు మేము ఆయనను స్పష్టమైన తప్పులో చూస్తున్నాము.
(9) మీరు యూసుఫ్ ను హతమార్చండి లేదా అతన్ని దూర ప్రదేశంలో తీసుకెళ్ళి అదృశ్యం చేయండి అప్పుడు మీ తండ్రి ముఖము మీ కోసం ప్రత్యేకమైపోయి ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తారు.మీరు అతన్ని హతమార్చి లేదా అతన్ని అదృశ్యం చేసి తరువాత మీరు మీ పాపమునకు పశ్చాత్తాప్పడినప్పుడు మీరు సద్వర్తనులుగా అయిపోతారు.
(10) సోదరుల్లోంచి ఒకడు ఇలా పలికాడు : మీరు యూసుఫ్ ను హతమార్చకండి.కాని అతన్ని మీరు ఏదైన లోతైన బావిలో పడవేయండి అతని వద్ద నుండి వెళ్లే ప్రయాణికుల్లోంచి ఎవరైన అతన్ని ఎత్తుకుంటారు.ఇది నష్టం కలిగించటానికి అతన్ని హతమార్చటం కన్నాచాలా తేలికైనది.ఒక వేళ మీరు అతని విషయంలో చెప్పిన దాన్ని చేయటంపై దృడ నిర్ణయం చేసుకుని ఉంటే (చేయండి).
(11) మరియు వారందరు ఆయన్ను దూరం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తమ తండ్రి అయిన యాఖూబ్ తో ఇలా పలికారు : ఓ మా తండ్రి మీకేమయింది మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మకస్తులుగా చేయటం లేదు ?.మరియు నిశ్చయంగా మేము అతనిపై దయ కలవారము అతనిని హాని కలిగించే వాటి నుండి అతనిని జాగ్రత్తగా చూసుకుంటాము.మరియు మేము అతని రక్షణ గురించి,అతని భద్రత గురించి అతను నీ వద్దకు భద్రంగా చేరే వరకు అతనికి సలహా ఇచ్చేవారము.అటువంటప్పుడు అతన్ని మాతో పంపించటానికి నిన్ను ఏది ఆపుతుంది ?.
(12) రేపు అతన్ని మేము మాతోపాటు తీసుకుని వెళ్ళటానకి నీవు అనుమతి ఇవ్వు. అతను ఆహారాన్ని ఆస్వాదిస్తాడు,సరదాగా ఉంటాడు.మరియు నిశ్చయంగా అతనికి కలిగే ప్రతీ బాధ నుండి అతన్ని మేము రక్షిస్తాము.
(13) యాఖూబ్ తన కుమారులతో ఇలా పలికారు : నిశ్చయంగా మీరు అతన్ని తీసుకుని వెళ్ళటం నన్ను దుఃఖమునకు గురి చేస్తుంది.అతను దూరమవటమును నేను సహించలేను.మీరు తినటంలో,ఆటల్లో ఉండి అతని నుండి మీరు ఏమరు పాటులో ఉన్నప్పుడు అతన్ని తోడేలు తినివేస్తుందని నేను భయపడుతున్నాను.
(14) వారు తమ తండ్రితో ఇలా పలికారు : ఒక వేళ తోడేలు యూసుఫ్ ను తినివేస్తే మేము సంఘంగా ఉండి కూడా మా ఈ స్థితిలో మాలో ఏ ప్రయోజనం లేదు.మేము అతన్ని తోడేలు నుండి ఆపనప్పుడు మేము నష్టంచవిచూసేవారము.
(15) అప్పుడు యాఖూబ్ ఆయనను వారితోపాటు పంపించారు.వారు ఎప్పుడైతే అతన్ని తీసుకుని దూరంగా వెళ్ళి అతన్ని లోతైన బావిలో పడవేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారో అప్పుడు మేము ఆ పరిస్థితిలో యూసుఫ్ కి దివ్య సందేశము ద్వారా తెలియపరిచాము : నీవు తప్పకుండా వారి ఈ చర్య గురించి వారికి తెలియపరుస్తావు.వారు నీవు తెలిపరిచే స్థితిలో నిన్ను గ్రహించలేరు.
(16) మరియు యూసుఫ్ సోదరులు ఇషా సమయంలో తమ కుట్రవలన ఏడుస్తున్నట్లు నటించటంను బహిర్గతం చేస్తూ తమ తండ్రి వద్దకు వచ్చారు.
(17) వారందరూ ఇలా పలికారు : ఓ మా ప్రియ తండ్రి నిశ్చయంగా మేము పరుగు పందాలలో,బల్లెములు విసరటంలో మునిగి ఉన్నాము.మరియు మేము యూసుఫ్ ను మా బట్టల వద్ద,మా సామాను వద్ద వాటిని అతడు సంరక్షించటానికి విడిచిపెట్టాము.ఒకవేళ మేము మీకు చెప్పిన దానిలో వాస్తవముగా సత్యవంతులైనా మీరు మమ్మల్ని సత్యవంతులుగా గుర్తించరు.
(18) వారు తమ మాటను ఒక వంక ద్వారా దృవీకరించారు.వారు యూసుఫ్ చొక్కాను అతని రక్తం కాకుండా ఇతర రక్తంతో అద్ది అది అతనిని తోడేలు తిన్న గుర్తులు అని అపోహకు లోను చేస్తూ తీసుకుని వచ్చారు. అప్పుడు యాఖూబు అతని చొక్కా చిరగబడలేదన్న సూచనతో వారి అబద్దముును గుర్తించారు. అప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : మీరు చెప్పినట్లు విషయం లేదు.కాని మీ మనస్సులు చెడు విషయమును అలంకరించుకున్నాయి దాన్నే మీరు చేశారు.నా వ్యవహారము మంచిగా సహనం పాటించటం మాత్రమే,అందులో ఎటువంటి ఆందోళన లేదు. మీరు తెలియపరుస్తున్న యూసుఫ్ విషయంలో అల్లాహ్ తో సహాయమును కోరబడుతుంది.
(19) మరియు అటు ప్రయాణిస్తున్న ఒక బృందం వచ్చింది.వారి కొరకు నీటిని త్రాపించే వ్యక్తిని వారు పంపించారు. అప్పుడు అతను తన బొక్కెనను బావిలో వేశాడు. అప్పుడు యూసుఫ్ త్రాడుతో వ్రేలాడసాగారు.వారు పంపించిన వ్యక్తి అతన్ని చూసినప్పుడు సంతోషముతో ఇలా పలికాడు : ఇదిగో శుభవార్త ఇతను ఒక పిల్లవాడు. మరియు అక్కడ వచ్చిన వ్యక్తి అతని సహచరులు అతన్ని మీగతా బృందము నుండి అతన్ని తాము కొన్న వర్తకసామగ్రిగా భావిస్తూ దాచివేశారు.యూసుఫ్ తో వారు చేస్తున్న అసభ్యత,అమ్మకం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.వారు చేస్తున్న కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు.
(20) ఆ వచ్చిన వ్యక్తి మరియు అతని సహచరులు అతన్ని (యూసుఫ్) మిసర్ లో స్వల్ప ధరకు అమ్మి వేశారు.అతి సులభంగా లెక్కించదగిన కొన్ని దిర్హమ్ లు.మరియు వారు అతన్ని తొందరగా వదిలించుకునే విషయంలో వారి తపన వలన వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.వాస్తవానికి అతని స్థితి అతను బానిస కాదన్న విషయం వారికి తెలుసు.మరియు వారు అతని ఇంటి వారి వలన భయపడ్డారు.ఇది అతనిపై అల్లాహ్ కారుణ్యం పూర్తవటం లోనిది.చివరికి అతను వారితో ఎక్కువ సమయం ఉండలేదు.
(21) మరియు మిసర్లో అతన్ని కొన్న వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు : నీవు అతినికి మంచి చేయి మరియు మాతోపాటు అతని స్థానములో అతన్ని గౌరవించు.బహుశా అతను ఉండటంలో మాకు అతనిలో అవసరమైన వాటిలోంచి కొన్నింటి ద్వారా మనకు ప్రయోజనం చేకూరుస్తాడు లేదా మేము అతన్ని కొడుకుగా చేసుకుందాం. ఇలాగే మేము యూసుఫ్ ను హత్య నుండి రక్షించాము మరియు అతన్ని బావి నుండి వెలికి తీశాము,మిసర్ వాసి మనస్సును అతనిపై కనికరించేటట్లు చేశాము,అతనికి మిసర్ లో నివాసమును కలిగించాము అతనికి కలల తాత్పర్యమును నేర్పించటం కొరకు. మరియు అల్లాహ్ తన ఆదేశముపై ఆధిక్యత కలవాడు.ఆయన ఆదేశం నెరవేరుతుంది.పరిశుద్ధుడైన ఆయనకు బలవంతం చేసేవాడు ఎవడూ లేడు.కాని ఆయన ప్రజలపై ఆదిక్యత కలవాడు.వారు అవిశ్వాసపరులు.వారు దాన్ని తెలుసుకోవటం లేదు.
(22) మరియు యూసుఫ్ యవ్వన వయస్సుకు చేరుకున్నప్పుడు అతనికి మేము వివేకమును,జ్ఞానమును ప్రసాధించాము.మేము అతనికి ప్రసాధించిన ప్రతిఫలం లాంటిదే అల్లాహ్ కొరకు తమ ఆరాధనల్లో మంచిగా ఉండేవారికి (సజ్జనులను) మేము ఫ్రతిఫలమును ప్రసాధిస్తాము.
(23) అజీజు భార్య సున్నితముతో మరియు వ్యూహమును చేసి యూసుఫ్ నుండి అశ్లీలకార్యం చేయటమునకు కోరింది.మరియు ఆమె ఏకాంతమును కోరుకుంటూ తలుపులను మూసివేసింది.మరియు ఆయనతో ఇలా పలికింది : నీవు నా వద్దకు రా.అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం నీవు నన్ను దేనివైపునైతే పిలుస్తున్నావో దాని నుండి నేను అల్లాహ్ రక్షణను కోరుతున్నాను.నిశ్చయంగా నా యజమాని తన వద్ద నాకు స్థానమును కల్పించి నాకు ఉపకారము చేశాడు.అయితే నేను అతనిపట్ల అవినీతికు పాల్పడను.ఒక వేళ నేను ఆయన పట్ల అవినీతికి పాల్పడితే నేను దుర్మార్గుడిని అయిపోతాను.నిశ్చయంగా దుర్మార్గులు సాఫల్యం చెందరు.
(24) మరియు వాస్తవానికి ఆమె స్వయంగా అశ్లీల కార్యం చేయాలని పూనుకుంది.ఒక వేళ అతను తనను ఆ కార్యము నుండి ఆపే,దాని నుండి దూరంగా ఉంచే అల్లాహ్ సూచనలను చూడకుండా ఉంటే అతని మనసులో కూడా దాని ఆలోచన కలిగి ఉండేది.మరియు నిశ్చయంగా మేము అతని నుండి చెడును దూరం చేయటానికి మరియు మేము అతనిని వ్యబిచారము నుండి అవినీతి నుండి దూరంగా ఉంచటానికి వాటిని అతనికి చూపించాము. నిశ్చయంగా యూసుఫ్ సందేశాలను చేరవేయటానికి,దైవ దౌత్యం కొరకు ఎంచుకోబడిన మా దాసుల్లోంచి ఉన్నాడు.
(25) మరియు వారిద్దరు తలుపు వైపునకు పరిగెత్తారు. యూసుఫ్ తనను రక్షించుకోవటానికి,మరియు ఆమె అతన్ని బయటకు వెళ్ళకుండా ఆపటానికి.అప్పుడు ఆమె అతన్ని బయటకు వెళ్ళకుండా ఆపటానికి అతని చొక్కాను పట్టుకుని దాన్ని వెనుక నుండి చింపివేసింది.మరయు వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను పొందారు.అజీజ్ భార్య అజీజ్ తో వ్యూహాత్మకంగా ఇలా పలికింది : నీ భార్యతో అశ్లీల కార్యం చేయదలచిన వాడిని చెరసాలలో వేయటం లేదా అతన్ని బాధాకరమైన శిక్షకు గురి చేయటం తప్ప ఇంకో శిక్ష లేదు.
(26) యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నారు : నన్ను అశ్లీల కార్యం చేయమని ఆమెయే కోరింది మరియు నేను దానిని చేసే ఉద్దేశం ఆమెతో చేయలేదు. మరియు అల్లాహ్ ఆమె కుటంబములో నుంచి ఒడిలో ఉన్న ఒక పిల్లవాడికి మాట్లాడేటట్లు చేశాడు అతడు తన మాటల్లో ఇలా సాక్షమిచ్చాడు : ఒక వేళ యూసుఫ్ చొక్కా అతని ముందు నుండి చిరిగి ఉంటే అది ఆమె నిజాయితీకి సూచన. ఎందుకంటే ఆమె అతన్ని తన నుండి ఆపటానికి ప్రయత్నించి ఉంటుంది. అప్పుడు అతను అబద్దం పలికిన వాడు అవుతాడు.
(27) ఒక వేళ అతని చొక్కా వెనుక నుండి చినిగి ఉంటే అది అతని నిజాయితీకి సూచన.ఎందుకంటే ఆమె అతన్ని ప్రేరేపించటానికి ప్రయత్నించి ఉంటుంది మరియు అతను ఆమె నుండి పారిపోవటానికి ప్రయత్నించి ఉంటాడు.అప్పుడు ఆమె అబద్దం పలికినది అవుతుంది.
(28) ఎప్పుడైతే అజీజు యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను వెనుక నుండి చినిగి ఉండటమును చూశాడో యూసుఫ్ నిజాయితీ నిర్ధారమైనది. మరియు ఇలా పలికాడు : నిశ్చయంగా నీవు వేసిన ఈ నింద మీ స్త్రీ జాతి వారి కుట్రల్లొంచిది.నిశ్చయంగా మీ కుట్ర బలంగా ఉంటుంది.
(29) మరియు అతడు (అజీజు) యూసుఫ్ తో ఇలా పలికాడు : ఓ యూసుఫ్ నీవు క్షమించి ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయి. మరియు దాన్ని ఎవరి ముందు ప్రస్తావించకు.మరియు నీవు (భార్యతో) కూడా నీ పాపమునకు క్షమాపణ కోరుకో.నిశ్ఛయంగా యూసుఫ్ మనస్సును పురిగొల్పిన కారణంగా నీవే పాపాత్ముల్లోంచి అయిపోయావు.
(30) మరియు ఆమె సమాచారం నగరంలో వ్యాపించింది.మరియు స్త్రీల్లోంచి ఒక వర్గము నిరాకరణ వైనముతో ఇలా పలికారు : అజీజు భార్య తన బానిసను స్వయంగా పిలుచుకుంటుంది.నిశ్చయంగా అతని ప్రేమ ఆమె హృదయమునకు కప్పివేసేదాకా చేరుకుంది.నిశ్చయంగా అతన్ని ఆమె మోహింపజేయటం వలన,ఆమె ప్రేమ అతని కొరకు అతను ఆమె బానిస అయినప్పటికి కలిగి ఉండటం వలన మేము ఆమెను స్పష్టమైన అపమార్గములో చూస్తున్నాము.
(31) అజీజు భార్య తనను వారి తప్పుబట్టటమును,ఆమెపైనే వారి నిందారోపణలను విని వారు యూసుఫ్ ని చూసి ఆమెను నిర్దోషిగా భావించటానికి వారిని పిలిపించింది.మరియు పరుపులు,దిండులు కల ఒక ప్రదేశమును ఆమె వారి కొరకు సిద్ధం చేసింది.మరియు పిలవబడిన ప్రతి ఒక్కరికి ఆహారమును కోయటానికి ఒక కత్తిని ఇచ్చింది.మరియు ఆమె యూసుఫ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించింది : నీవు వారి ముందుకు రా.వారు యూసుఫ్ ను చూసినప్పుడు ఆయన్ను చాలా గొప్పగా భావించారు.మరియు ఆయన అందమును చూసి ఆశ్చర్యపోయారు.మరియు వారు అతని అందమునకు ముగ్దులైపోయారు.ఆయనపై ముగ్దులవటము యొక్క తీవ్రత వలన ఆహారమును కోయటం కొరకు సిద్ధం చేసి ఉన్న కత్తులతో వారు తమ చేతులను గాయపరుచుకున్నారు. మరియు వారు ఇలా పలికారు : అల్లాహ్ పరిశుద్ధుడు ఈ పిల్లవాడు మానవుడు కాదు.అతనిలో ఉన్న అందం మనిషిలో ఉండదు.అతడు గౌరవోన్నతులైన దైవదూతల్లోంచి ఒక దైవదూత మాత్రమే.
(32) అజీజ్ భార్య వారికి జరిగినది చూసి ఇలా పలికింది : ఇతడే ఆ యువకుడు ఇతని ప్రేమ కారణం చేతనే మీరు నన్ను అపనిందపాలు చేసింది.వాస్తవానికి నేను అతన్ని కోరాను.మరియు నేను అతన్ని వశపరచుకోవటానికి కుట్ర పన్నాను.అయితే అతను ఆగిపోయాడు.ఒక వేళ అతను భవిష్యతులో నేను కోరినది చేయకపోతే తప్పకుండా అతను చెరసాలపాలవుతాడు.మరియు అతను తప్పకుండా అవమానానికి గురైన వారిలో అయిపోతాడు.
(33) యూసుఫ్ అలైహిస్సలాం తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా వారు నన్ను పిలుస్తున్న అశ్లీల కార్యము కన్న నీవు నాకు చూపించిన చెరసాలయే నాకు చాలా ఇష్టం.వారి ఎత్తుగడలను నాకు బహిర్గతం చేసి ఉండకపోతే నేను వారివైపు మొగ్గే వాడిని.మరియు ఒక వేళ నేను వారి వైపు మొగ్గి వారు నాతో కోరిన విషయంలో వారి మాట విని ఉంటే నేను అజ్ఞానుల్లో నుంచి అయిపోయేవాడిని.
(34) అప్పుడు అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.అజీజు భార్య కుట్రను,నగర స్త్రీల కుట్రను ఆయన నుండి తప్పించాడు.నిశ్చయంగా ఆయన పరిశుద్ధుడు మరియు మహోన్నతుడు యూసుఫ్ యొక్క దుఆను వినేవాడు.మరియు ప్రతి వేడుకునే వాడి దుఆని వినేవాడు.అతని స్థితిని మరియు ఇతరుల స్థితిని తెలుసుకునేవాడు.
(35) ఆ తరువాత ఎప్పుడైతే అజీజు,అతని జాతి వారు అతని నిర్దోషత్వమును నిరూపించే ఆధారాలను చూశారో అపనింద భహిర్గతం కానంత వరకు నిర్ణీతం కాని కాలం వరకు అతన్ని చెరసాల్లో బంధించాలని వారి సలహా అయింది.
(36) అప్పుడు వారు అతన్ని చెరసాలలో బంధించారు.మరియు ఆయనతోపాటు ఇద్దరు యువకులు చెరసాలలో ప్రవేశించారు.ఇద్దరి వ్యక్తుల్లోంచి ఒకడు యూసుఫ్ తో ఇలా అన్నాడు : నిశ్చయంగా నేను సారాయి చేయటానికి ద్రాక్ష పండ్లను పిండుతున్నాను.రెండో వ్యక్తి ఇలా పలికాడు : నిశ్చయంగా నేను నా తలపై రొట్టెను ఎత్తుకుని ఉన్నాను అందులో నుంచి పక్షులు తింటున్నవి.ఓ యూసుఫ్ మేము చూసిన దానికి వివరణను మాకు తెలుపు.నిశ్చయంగా మేము నిన్ను ఉపకారము చేసే వారిలోంచి భావిస్తున్నాము.
(37) యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : రాజు తరపు నుండి లేదా ఇతరుని తరపు నుండి మీ పై జారీ అయిన భోజనం మీ వద్దకు రాలేదు కాని నేను అది మీ వద్దకు రాక ముందే నేను దాని వాస్తవమును (కల యొక్క వాస్తవమును),అది ఎలా ఉంటుందో మీకు స్పష్టపరుస్తాను.ఆ తాత్పర్యము నా ప్రభువు నాకు నేర్పించిన విధ్యల్లోంచిది దాన్నే నేను నేర్చుకున్నాను.అది జ్యోతిష్యములో నుంచి కాదు మరియు నక్షత్ర శాస్త్రము కాదు.నిశ్చయంగా నేను అల్లాహ్ ను విశ్వసించని జనుల వారి ధర్మమును వదిలివేశాను.మరియు వారు పరలోకమును తిరస్కరించారు.
(38) మరియు నేను నా తండ్రితాతలైన ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ ధర్మమును అనుసరించాను. మరియు అది అల్లాహ్ కొరకు ఏకత్వము యొక్క ధర్మము. అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించటం నాకు సరికాదు. మరియు అతను ఏకత్వములో అతీతుడు.ఈ ఏకత్వము,విశ్వాసము దేనిపైనైతే నేను,నా తాతముత్తాతలు ఉన్నామో అది మాపై ఉన్న అల్లాహ్ అనుగ్రహము దాన్ని మాకు అనుగ్రహించాడు. మరియు ఎప్పుడైతే ఆయన వారి వద్దకు ప్రవక్తలను దానిని ఇచ్చి పంపించాడో అది ప్రజలందరిపై ఆయన అనుగ్రహము. కాని చాలా మంది అల్లాహ్ అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోరు ,అంతేకాదు వారు ఆయనను తిరస్కరిస్తున్నారు.
(39) ఆ తరువాత యూసుఫ్ చెరసాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి ఇలా పలికారు : ఏమీ చాలా దేవుళ్లను ఆరాధించటం మేలైనదా లేదా ఎటువంటి సాటి లేని,ఇతరులపై ఆధిక్యత కలిగి తనపై ఎవరూ ఆధిక్యత చూపని ఒక్కడైన అల్లాహ్ ఆరాధన మేలైనదా ?.
(40) మీరు,మీ తాత ముత్తాతలు పేర్లు లేని పేర్లు పెట్టుకున్న కొన్ని దేవుళ్ళను మాత్రమే మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారు. వాటి కొరకు దైవత్వములో ఎటువంటి భాగము లేదు. మీరు పేరు పెట్టుకున్నవి సరి అయినవి అనటానికి అల్లాహ్ ఎటువంటి ఆధారమును అవతరింపచేయలేదు. సృష్టితాలన్నింటి విషయంలో అల్లాహ్ ఒక్కడికి మాత్రమే ఆదేశించే అధికారము ఉంది. మీరు,మీ తాతముత్తాతలు పేర్లు పెట్టుకున్న వీటికి ఆ అధికారము లేదు. పరిశుద్ధుడైన అల్లాహ్ మీరు ఆయన ఒక్కడినే ఆరాధించమని ఆదేశించాడు. మరియు ఆయనతోపాటు వేరేవారిని మీరు సాటి కల్పించటం నుండి వారించాడు. ఈ తౌహీదే (ఏకత్వము) ఎటువంటి వంకరతనం లేని తిన్నని ధర్మము.కాని అది చాలా మందికి తెలియదు.అందుకనే వారు అల్లాహ్ తోపాటు సాటి కల్పిస్తున్నారు. అయితే వారు ఆయన సృష్టితాల్లోంచి కొన్నింటిని ఆరాధిస్తున్నారు.
(41) ఓ నా చెరసాల ఇద్దరు మిత్రులారా సారాయి తయారు చేయటానికి ద్రాక్ష పండ్లను పిండుతున్నట్లు చూసిన వాడు చెరసాల నుండి బయటకు వస్తాడు మరియు తన పని వైపునకు మరలి రాజుకు (సారాయి) త్రాపిస్తాడు. కాని తన తలపై రొట్టెను ఎత్తుకుని ఉంటే అందులో నుంచి పక్షులు తింటుండగా చూసిన వ్యక్తి అతడు హతమార్చబడుతాడు.మరియు సిలువపై ఎక్కించబడుతాడు.అప్పుడు అతని తల మాంసమును పక్షులు తింటూ ఉంటాయి. మీరిద్దరు ఫత్వా అడిగిన ఆదేశం ముగిసింది మరియు అది పూర్తయ్యింది.అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది.
(42) వారిద్దరిలో నుంచి బ్రతికి బయటపడుతాడని భావించిన వాడు మరియు అతడు రాజుకి (సారాయి) త్రాపించే వాడు అతనితో యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : నీవు నా గాధను మరియు నా విషయమును రాజు వద్ద ప్రస్తావించు.బహుశా అతను నన్ను చెరసాల నుండి బయటకు తీస్తాడు. అయితే షైతాను త్రాపించేవాడిని రాజు వద్ద యూసుఫ్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన చేయటమును మరిపింపజేశాడు. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం దాని తరువాత చెరసాలలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు.
(43) మరియు రాజు ఇలా పలికాడు : నిశ్చయంగా నేను కలలో ఏడు లావుగా బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన (బలహీనమైన) ఆవులు తింటున్నట్లు చూశాను.మరియు ఏడు పచ్చటి వెన్నులను మరియు ఏడు ఎండిన వెన్నులను చూశాను.ఓ నాయకులారా మరియు పెద్దవారా మీరు ఒక వేళ కలల తాత్పర్యం తెలిసిన వారైతే నాకు నా ఈ కల యొక్క తాత్పర్యమును తెలుపండి.
(44) వారందరు ఇలా పలికారు : నీ కల పీడకలల మిశ్రమం.విషయం అది అయితే అటువంటప్పుడు దానికి ఎటువంటి తాత్పర్యం లేదు.మరియు మేము మిశ్రమ పీడకలల తాత్పర్యము తెలియని వారము.
(45) ఇద్దరు ఖైదీలైన యువకుల్లోంచి విముక్తి పొందిన వాడు సారాయి త్రాపించేవాడు అతనికి కలల తాత్పర్య జ్ఞానం లేదు అతడు కొంత కాలం తరువాత యూసుఫ్ అలైహిస్సలాంను గుర్తు చేసుకుని దాని (కల) తాత్పర్యం ఎవరికి తెలుసు అన్న ప్రశ్న తరువాత ఇలా పలికాడు : రాజు చూసిన కల యొక్క తాత్పర్యం గురించి నేను మీకు తెలియపరుస్తాను. ఓ రాజా నీ కల తాత్పర్యం తెలియపరచటానికి నీవు నన్ను యూసుఫ్ వద్దకు పంపించు.
(46) మరియు విముక్తి పొందిన వాడు యూసుప్ అలైహిస్సలాం వద్దకు చేరినప్పుడు అతడు ఆయనతో ఇలా పలికాడు : ఓ సత్యవంతుడైన యూసుఫ్ ఏడు లావుగా బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన ఆవులు తిని వేయటమును చూసిన మరియు ఏడు పచ్చటి వెన్నులను ఏడు ఎండిన వెన్నులను చూసిన వాడి కలయొక్క తాత్పర్యమును గురించి మాకు తెలియపరచు. బహుశా నేను రాజు వద్దకు,అతని వద్ద ఉన్న వారి వద్దకు మరలుతాను బహుశా వారు రాజు కల యొక్క తాత్పర్యమును తెలుసుకుంటారు. మరియు వారు నీ గొప్పతనమును,నీ స్థానమును తెలుసుకుంటారు.
(47) యూసుఫ్ అలైహిస్సలాం ఈ కల యొక్క తాత్పర్యం చెబుతూ ఇలా పలికారు : మీరు వరుసగా ఏడు సంవత్సరములు శ్రమతో సేద్యం చేస్తారు. అయితే ఈ ఏడు సంవత్సరాల్లో నుంచి ప్రతీ సంవత్సరం మీరు కోసిన పంటలో నుండి మీరు తినటానికి అవసరమగు ధాన్యములో నుంచి కొంచెం తప్ప మిగతాది పురుగు పట్టకుండా నిరోధించటానికి వాటి వెన్నుల్లోనే వదిలివేయండి.
(48) ఆ పిదప మీరు సేద్యం చేసిన ఏడు సారవంతమైన సంవత్సరముల తరువాత ఏడు కరువు సంవత్సరములు వస్తాయి. సారవంతమైన సంవత్సరముల్లో కోసిన పంటలోంచి మీరు విత్తనముల కొరకు భద్రపరచుకున్న వాటిలోంచి కొంచెం వాటిలో (కరువు సంవత్సరముల్లో) ప్రజలు తింటారు.
(49) ఈ కరువు సంవత్సరముల తరువాత ఒక సంవత్సరము వస్తుంది.అందులో వర్షాలు కురుస్తాయి.మరియు పంటలు పండుతాయి.మరియు ప్రజలు అందులో రసం పిండటానికి అవసరమగు ద్రాక్షా,జైతూను,చెరకు లాంటి వాటిని పిండుతారు.
(50) మరియు తన కల తాత్పర్యమును యూసుఫ్ అలైహిస్సలాం తెలియపరచిన సమాచారము చేరగానే రాజు తన సేవకులను ఆదేశిస్తూ ఇలా పలికాడు : అతడిని మీరు చెరసాల నుండి బయటకు తీయండి. మరియు అతడిని మీరు నా వద్దకు తీసుకుని రండి. యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు రాజదూత వచ్చినప్పుడు ఆయన అతనితో ఇలా పలికారు : నీ స్వామి అయిన రాజు వద్దకు వెళ్ళి తమ చేతులను గాయపరచుకున్న స్త్రీల సంఘటనను గురించి అతనితో అడుగు. చెరసాల నుండు బయటకు రాక ముందే తన నిర్దోషత్వం బహిర్గతమవ్వటానికి. నిశ్చయంగా వారు మోహముతో నా పట్ల వ్యవహరించిన తీరును నా ప్రభువు బాగా తెలిసినవాడు. వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు.
(51) స్త్రీలను ఉద్దేశించి రాజు ఇలా పలికాడు మీ విషయం ఏమిటి మీరు యూసుఫ్ ను ఆయన మీతో అశ్లీలంగా ప్రవర్తించటానికి ఏదో వంకతో పిలిచారు. స్త్రీలు రాజుకు సమాధానమిస్తూ ఇలా పలికారు యూసుఫ్ పై నింద మోపటం నుండి అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ సాక్షిగా మేము ఆయనలో ఎటువంటి చెడును గుర్తించలేదు. అప్పుడు అజీజ్ భార్య తాను చేసిన దాన్ని అంగీకరిస్తూ ఇలా పలికింది ఇప్పుడు సత్యం బహిర్గతమయ్యింది. నేను అతనిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాను మరియు అతను నన్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించలేదు. నేను అతనిపై వేసిన నింద ఏదైతే ఉన్నదో దాని నుండి అతను నిజాయితీ పరుడని వాదిస్తున్న విషయంలో అతను నిజాయితీపరుడు.
(52) అజీజు భార్య ఇలా పలికినది : నేను అతన్ని మోహింపజేశాను అని,మరియు అతను సత్యవంతుడని,నేను అతన్ని పరోక్షంగా నిందించలేదని నేనే అంగీకరించినప్పుడు యూసుఫ్ తెలుసుకోవాలని. జరిగిన దాన్ని బట్టి అల్లాహ్ అబద్దము పలికే వాడిని,కుట్రలు పన్నే వాడిని అనుగ్రహించడని నాకు స్పష్టమైనది.
(53) మరియు అజీజు భార్య తన మాటలను కొనసాగిస్తూ ఇలా పలికింది : మరియు నన్ను నేను చెడు యొక్క సంకల్పము నుండి నిర్దోషిని అని చెప్పుకోను.దీని ద్వారా నేను నా మనస్సును పరిశుద్ధపరచుకోవాలనుకోలేదు.ఎందుకంటే మానవుని మనస్సుది ఎక్కువగా చెడును ఆదేశించే పరిస్థితి ఎందుకంటే అది తాను కోరుకునే దాని వైపునకు మొగ్గు చూపటం మరియు దాని నుండి తనను నిర్మూలించుకోవటం కష్టం వలన .అల్లాహ్ కనికరించి చెడు ఆదేశించటం నుండి రక్షించిన మనస్సులు తప్ప.నిశ్చయంగా నా ప్రభువు తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.
(54) మరియు యూసుఫ్ నిర్దోషత్వము మరియు ఆయన జ్ఞానము స్పష్టమైనప్పుడు రాజు తన సేవకులతో ఇలా పలికాడు : మీరు అతడిని నా వద్దకు తీసుకుని రండి. నేను అతడిని నా కొరకు ప్రత్యేకంగా నియమించుకుంటాను. అప్పుడు వారు అతడిని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే అతడు (రాజు) అతనితో మాట్లాడాడో మరియు అతనికి అతడి జ్ఞానము మరియు అతడి బుద్ది స్పష్టమైనదో అప్పుడు అతడితో ఇలా పలికాడు : ఓ యూసుఫ్ నిశ్చయంగా నీవు మా వద్ద ఈ రోజు ఉన్నత స్థానం,గౌరవం నమ్మకం కలవాడిగా అయిపోయావు.
(55) యూసుఫ్ అలైహిస్సలాం రాజుతో ఇలా పలికారు : నీవు నన్నుమిసర్ ప్రాంతములో ధాన్యాగారాల,సంపదల కోశాగారాల సంరక్షణ బాధ్యతను అప్పగించు. ఎందుకంటే నేను బాధ్యత వహించే వాటిలో జ్ఞానము కల,రక్షణ కల నీతిమంతుడైన కోశాధికారిని.
(56) మరియు ఏవిధంగానైతే మేము నిర్దోషత్వమును మరియు చెరసాల నుండి విముక్తిని కలిగించి యూసుఫ్ పై ఉపకారము చేశామో అలాగే ఆయనకు మిసర్ లో అధికారమును ప్రసాధించి ఆయనపై ఉపకారము చేశాము.ఆయన ఏ ప్రదేశంలో తలచుకుంటే అక్కడ దిగుతారు మరియు నివసిస్తారు.ఇహలోకములో మా దాసుల్లోంచి మేము తలచుకున్న వారిని మా కారుణ్యమును అనుగ్రహిస్తాము.మరియు మేము సజ్జనుల పుణ్యాన్ని వృధా చేయము.కాని మేము వారికి దానినే పరిపూర్ణంగా ఎటువంటి తగ్గుదల లేకుండా ప్రసాధిస్తాము.
(57) అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి మరియు ఆయన ఆదేశాలను పాటించి మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన వారి కొరకు పరలోకములో అల్లాహ్ తయారు చేసి ఉంచిన ప్రతిఫలము ఇహలోక ప్రతిఫలముకన్న మేలైనది.
(58) మరియు యూసుఫ్ సోదరులు తమ సరుకుల కొరకు మిసర్ ప్రాంతమునకు వచ్చారు.అప్పుడు వారు ఆయన వద్దకు వచ్చారు.ఆయన వారు తన సోదరులని గుర్తించారు.మరియు వారు అతన్ని తమ సోదరుడని గుర్తించలేదు.కాలం ఎక్కువవటం వలన మరియు ఆయన రూపము మారటం వలన ఎందుకంటే వారు ఆయన్ను బావిలో పడవేశినప్పుడు పిల్లవాడిగా ఉన్నారు.
(59) మరియు ఆయన (యూసుఫ్) వారు కోరిన ఆహారపు సామగ్రి,ప్రయాణపు సామగ్రిని వారికి సమకూర్చినప్పుడు వారు తమ తండ్రి నుండి ఒక సోదరుడు ఉన్నాడని అతడిని వారు అతని తండ్రి వద్ద వదిలి వచ్చారని ఆయనకు (యూసుఫ్ కు) తెలియపరచిన తరువాత ఆయన ఇలా పలికారు : మీ తండ్రి తరపు నుండి మీ సోదరుడిని నా వద్దకు తీసుకుని రండి అప్పుడు నేను ఒక ఒంటె మోసే బరువంత ఆహార సామగ్రిని మీకు ఇస్తాను.ఏమీ నేను తగ్గించకుండా పరిపూర్ణంగా కొలతలు వేస్తున్నది మీరు చూడటం లేదా .మరియు నేను ఉత్తమ అతిధేయుడిని.
(60) ఒక వేళ మీరు అతడిని నా వద్దకు తీసుకుని రాకపోయి మీ తండ్రి నుండి మీకు ఒక సోదరుడు ఉన్నాడన్న మీ వాదనలో మీ అబద్దము స్పష్టమైతే నేను మీ కొరకు ఎటువంటి ఆహారమును కొలచి ఇవ్వను.మరియు మీరు నా నగర దరిదాపులకు రాకండి.
(61) అప్పుడు అతని సోదరులు ఇలా పలుకుతూ అతనికి సమాధానమిచ్చారు : మేము అతని తండ్రి నుండి అతడిని కోరుతాము.మరియు ఈ విషయంలో మేము ప్రయత్నం చేస్తాము.మరియు నిశ్చయంగా మేము నీవు మాకు ఇచ్చిన ఆదేశమును ఎటువంటి లోపము లేకుండా పూర్తి చేస్తాము.
(62) మరియు యూసుఫ్ అలైహిస్సలాం తన సేవకులతో ఇలా ఆదేశించారు : మీరు వీరందరి ధాన్యమును కొనే రుసుమును వారికి వాపసు ఇచ్చేయండి చివరికి వారు మరలి వెళ్లినప్పుడు మేము వారి నుండి ధాన్యపు రుసుమును తీసుకో లేదని గుర్తిస్తారు.ఇది వారిని రెండోవసారి రావటానికి బలవంతం చేస్తుంది.మరియు తమతోపాటు తమ సోదరుడిని యూసుఫ్ యందు తమ నిజాయితీని నిరూపించుకోవటానికి తీసుకుని వస్తారు.మరియు ఆయన వారి నుండి తమ సరకులను అంగీకరించటానికి.
(63) అయితే వారు తమ తండ్రి వద్దకు మరలి మరియు ఆయనకు వారు తమకు యూసుఫ్ అలైహిస్సలాం చేసిన గౌరవ మర్యాదల గురించి తెలియపరచినప్పుడు వారు ఇలా పలికారు : ఓ మా తండ్రి మేము ధాన్యం ఇవ్వబడటం నుండి ఆపబడ్డాము ఒక వేళ మేము మాతోపాటు మా సోదరుడిని తీసుకుని రాకపోతే. కావున నీవు అతడిని మాతోపాటు పంపించు.ఒక వేళ నీవు అతడిని మాతోపాటు పంపిస్తే మాకు ధాన్యం కొలచి ఇవ్వటం జరుగుతుంది.నిశ్చయంగా అతడిని నీ వద్దకు భద్రంగా తీసుకుని వచ్చేంత వరకు అతని రక్షణ గురించి నీకు మేము మాట ఇస్తున్నాము.
(64) వారి తండ్రి వారితో ఇలా పలికారు : ఏమీ లోగడ ఇతని సొంత సోదరుడైన యూసుఫ్ విషయంలో నేను మిమ్మల్ని నమ్మినట్లే ఇతని విషయంలో నేను మిమ్మల్ని నమ్మాలా .వాస్తవానికి నేను అతని విషయంలో మిమ్మల్ని నమ్మాను.మరియు మీరు అతని భద్రత గురించి వాగ్దానం చేశారు.మరియు మీరు వాగ్దానం చేసిన దాన్ని పూర్తి చేయలేదు.అయితే ఇతని భద్రత గురించి మీ వాగ్దానం పై నా వద్ద ఎటువంటి నమ్మకం లేదు.నా నమ్మకం మాత్రం అల్లాహ్ మీదే. అతని రక్షణను కోరే వాడి కొరకు అతడు రక్షణ కల్పించే వారిలో ఉత్తమ రక్షకుడు మరియు అతని కరుణను కోరే వాడి కొరకు అతడు కరుణించే వారిలో ఉత్తమంగా కరుణించేవాడు.
(65) మరియు వారు తాము తీసుకుని వచ్చిన తమ ఆహారపు మూటలను విప్పి చూస్తే వారు తమకు తిరిగి ఇవ్వబడిన దాని వెలను (సొమ్మును) చూశారు.అప్పుడు వారు తమ తండ్రితో ఇలా పలికారు : ఈ గౌరవమర్యాదల తరువాత ఈ అజీజుతో (సోదరునితో)మేము ఏమి కోరాలి . మరియు ఇది మా ఆహారపు సామగ్రి వెల దాన్ని అజీజు తన వద్ద నుండి అదనంగా మాకు తిరిగి ఇచ్చేశాడు.మరియు మేము మా ఇంటి వారి కొరకు ఆహారము తీసుకుని వస్తాము.మరియు మీరు అతని గురించి భయపడుతున్న విషయంలో మేము మా సోదరుణికి రక్షణ కల్పిస్తాము.మరియు ఇతని తోడుగా ఉండటం వలన మేము ఒక ఒంటె మోసే బరువు గల ఆహారమును మేము అధికంగా పొందుతాము.అజీజు వద్ద ఒక ఒంటె మోసే బరువు కల ఆహారము అధికంగా పొందటం శులభమైన విషయం.
(66) వారితో వారి తండ్రి ఇలా పలికారు : అతడిని మీరు నాకు వాపసు చేస్తామని మీరు నాకు అల్లాహ్ పై ఖచ్చితమైన ప్రమాణం ఇవ్వనంత వరకు నేను అతడిని మీతోపాటు పంపించను.కాని ఒక వేళ మిమ్మల్నందరిని వినాశనం చుట్టుముట్టి,మీలో నుంచి ఎవరు మిగలకుండా ఉండి,మీరు దాన్ని ఎదుర్కొనక పోయి ,వాపసు అవకపోయి ఉంటే వేరే విషయం. అయితే వారు దానిపై ఆయనకు అల్లాహ్ పై ఖచ్చితమైన ప్రమాణమును ఇచ్చినప్పుడు ఆయన ఇలా పలికారు : మేము పలికిన మాటలపై అల్లాహ్ యే సాక్షి, ఆయనే మాకు చాలు.
(67) మరియు వారి తండ్రి వారినే ఉపదేశిస్తూ ఇలా పలికారు : మీరందరు కలిసి ఒకే ద్వారము నుండి మిసర్ లో ప్రవేశించకండి.కాని మీరు వేరు వేరు ద్వారాల ద్వారా ప్రవేశించండి.అలా ఎందుకంటే ఒక వేళ ఎవరన్న మీకు ఏదన్నహాని తలపెట్టాలని నిర్ణయించుకుని ఉంటే అతని కీడు ఒకేసారి మీ అందరిపై పడటం నుండి భద్రంగా ఉండటానికి.మరియు అల్లాహ్ మీకు ఏదైన హాని కలిగించదలచుకుంటే నేను మీ నుండి దాన్ని దూరం చేస్తానని గాని అల్లాహ్ కోరని లాభాన్ని మీ కొరకు నేను తీసుకుని వస్తానని ఇది మీకు నేను చెప్పటం లేదు.అయితే నిర్ణయం మాత్రం అల్లాహ్ నిర్ణయమే.ఆదేశం అల్లాహ్ఆదేశం మాత్రమే.నా వ్యవహారలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే నేను నమ్మకమును కలిగి ఉంటాను.నమ్మకమును కలిగేవారు తమ వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉండాలి.
(68) అయితే వారందరు తమతో అతని సొంత సోదరుడిని తీసుకుని బయలదేరారు. మరియు అప్పుడు వారు వారి తండ్రి వారిని ఆదేశించిన విధంగా వేరు వేరు ద్వారముల నుండి ప్రవేశించారు.వేరు వేరు ద్వారముల నుండి వారి ప్రవేశము వారిపై అల్లాహ్ నిర్ణయించిన దాని నుండి దేనినీ వారి నుండి దూరం చేయలేదు.అది తన సంతానము పై యాఖూబ్ అలైహిస్సలాం యొక్క దయ దానిని ఆయన వ్యక్తపరచారు మరియు దానితో వారికి ఆయన ఉపదేశం చేశారు.మరియు అల్లాహ్ నిర్ణయం తప్ప వేరే నిర్ణయం లేదని ఆయనకు తెలుసు.మరియు మేము ఆయనకు నేర్పిన విధిపై విశ్వాసం,మార్గాలను ఎంచుకోవటం ద్వారా ఆయనకు తెలుసు.కాని చాలా మందికి అది తెలియదు.
(69) మరియు ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు వచ్చారో వారితోపాటు అతని సొంత సోదరుడు కూడా ఉన్నాడు.ఆయన తన సొంత సోదరుడును తనకు హత్తుకున్నారు.మరియు అతనితో నిశ్చయంగా నేను నీ సొంత సోదరుడిని అని రహస్యంగా చెప్పారు. అయితే నీవు నీ సోదరులు మనల్ని బాధ కలిగించే,ద్వేషించే మరియు వారు నన్ను బావిలో పడవేసే బుద్దిహీన కార్యాలకు పాల్పడుతున్నారని బాధపడకు.
(70) యూసుఫ్ తన సోదరుల ఒంటెలపై ఆహారమును ఎత్తిపెట్టమని తన సేవకులను ఆదేశించినప్పుడు ఆహారమును కోరుతూ వచ్చిన వారి కొరకు ఆహారమును కొలిచి ఇచ్చే రాజుగారి పాత్రను తన సోదరుడిని తనతో పాటు అట్టిపెట్టి ఉంచుకోవటానికి వారికి తెలియకుండా తన సొంత సోదరుని సామానులో పెట్టేశాడు. వారు తమ ఇంటి వారి వద్దకు మరలతున్నప్పుడు వారి వెనుక నుండే ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు : ఓ ఒంటెలపై ఆహారమును ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవారా నిశ్చయంగా మీరు దొంగలు.
(71) దాని వెంటనే యూసుఫ్ సోదరులు ప్రకటించిన వ్యక్తి మరియు అతని తోపాటు ఉన్న అతని సహచరుల వైపు తిరిగి మీ వద్ద నుండి ఏ వస్తువు పోయింది చివరికి మీరు మాపై దొంగతనము నింద వేస్తున్నారు ? అని అన్నారు.
(72) ప్రకటించేవాడు మరియు అతనితోపాటు అతని సహచరులు యూసుఫ్ అలైహిస్సలాం సోదరునితో ఇలా పలికారు : మా వద్ద నుండి రాజు గారి ఆ పాత్ర దేనితోనైతే ఆయన కొలిచే వారో పోయినది.మరియు తనిఖీ చేయక ముందు రాజు గారి పాత్రను తీసుకుని వచ్చిన వారి కొరకు బహుమానం ఉన్నది.మరియు అది ఒక ఒంటె మోసే బరువంత.మరియు నేను దానికి అతని కొరకు పూచీదారునిగా ఉన్నాను.
(73) యూసుఫ్ సోదరులు వారితో ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా మా చిత్తశుద్ధి మరియు మా నిర్దోషత్వము (అమాయకత్వము) మీకు తెలుసు ఎలాగంటే మీరు దాన్ని మా పరిస్థితుల నుండి గమనించారు.మరియు నిశ్చయంగా మేము మిసర్ ప్రాంతములో అరాచకమును సృష్టించటానికి రాలేదు. మరియు మేము మా జీవితములో దొంగలము కాము.
(74) ప్రకటించేవాడు మరియు అతని సహచరులు ఇలా పలికారు : ఒక వేళ దొంగతనము నుండి నిర్దోషత్వ మీ వాదనలో మీరు అబధ్ధపరులైతే మీ వద్ద దొంగతనము చేసిన వారికి శిక్ష ఏమిటి ?.
(75) యూసుఫ్ సోదరులు వారికి ఇలా సమాధానమిచ్చారు : మా వద్ద దొంగతనం చేసిన వారికి శిక్ష ఏమిటంటే ఎవరి సామానులో దొంగలించబడిన వస్తువు దొరుకుతుందో అతన్ని ఎవరి వస్తువు దొంగలించబడినదో వారికి బానిసగా అప్పజెప్పాలి వారు అతన్ని బానిస చేసుకుంటారు. బానిసగా చేయటం ద్వారా ఈ విధంగా మేము దొంగతనం చేసిన వారికి ఈ విధమైన శిక్షను ప్రతిఫలంగా ప్రసాధిస్తాము.
(76) అయితే వారు వారి సామానును తనిఖీ చేయటానికి వారిని యూసుఫ్ వద్దకు తరలించారు.అప్పుడు ఆయన పధకమును బహిర్గతం కాకుండా ఉండటానికి తన సొంత సోదరుని సామానును వెతికే ముందు తన సవతి సోదరుల సామానును వెతకటమును మొదలు పెట్టారు. ఆ తరువాత తన సొంత సోదరుని సామానును వెతికారు.మరియు రాజు కొలిచే పాత్రను దాని నుండి తీశారు.అతని సోదరుని సామానులో కొలిచే పాత్రను పెట్టే ఉపాయం ద్వారా యూసుఫ్ కొరకు మేము పధకం వేసినట్లే అతని సోదరులు దొంగను బానిసగా చేసుకునే తమ దేశ శిక్షను తీసుకుని రావటం ద్వారా అతని కొరకు ఇంకో పధకం వేశాము.ఈ విషయం సాధ్యం కాదు ఒక వేళ దొంగతనం చేసిన వారి కొరకు రాజు శిక్ష అయిన కొట్టడం మరియు జరిమాన విధించటం అమలు చేస్తే .కాని అల్లాహ్ ఇంకో ఉపాయం తలిస్తే అతడు దాన్ని చేసే సామర్ధ్యం కలవాడు.మా దాసుల్లోంచి మేము ఎవరిని కోరుకుంటే వారి స్థానములను పెంచగలము.ఏ విధంగానైతే మేము యూసుఫ్ స్థానమును పెంచామో.ప్రతీ జ్ఞానము కలవాడి పైన అతని కంటే ఎక్కువ జ్ఞానం కలవాడు ఉంటాడు. అందరి జ్ఞానముపై అన్ని విషయాల జ్ఞానము కల అల్లాహ్ జ్ఞానము ఉన్నది.
(77) యూసుఫ్ సోదరులు ఇలా పలికారు : ఒక వేళ ఇతను దొంగతనం చేశాడంటే ఆశ్చర్యం కాదు.ఇతని దొంగతనం కన్న ముందు ఇతని సొంత సోదరుడు కూడా దొంగతనం చేసి ఉన్నాడు.అంటే యూసుఫ్ అలైహిస్సలాం.అయితే యూసుఫ్ వారి ఈ మాటల వలన కలిగిన తన బాధను దాచిపెట్టారు,దాన్ని వారి ముందు బహిర్గతం చేయలేదు. తన మనసులో ఇలా అనుకున్నారు : మీ నుండి ముందు జరిగిన అసూయ,కీడు కలిగించటం ఆ చెడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షంగా కనబడుతుంది.మరియు మీ నుండి బహిర్గతమైన ఈ కల్పితము అల్లాహ్ కి బాగా తెలుసు.
(78) యూసుఫ్ సోదరులు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ అజీజు నిశ్చయంగా అతనికి వయసు మీరిన వృద్దుడైన తండ్రి కలడు ఆయన అతడిని ఎక్కువగా ఇష్టపడుతాడు.అయితే నీవు అతనికి బదులుగా మనలో నుంచి ఒకరిని అట్టిపెట్టుకో.నిశ్చయంగా మా విషయంలో,ఇతరుల విషయంలో నిన్ను మేము ఉపకారము చేసేవారిలోంచి భావిస్తున్నాము.అయితే నీవు మాకు అదే ఉపకారము చేయి.
(79) యూసుఫ్ అలైహిస్సలాం ఇలా పలికారు : మేము ఎవరి సామానులో రాజు కొలిచే పాత్రను పొందామో అతన్ని వదిలేసి ఇతరులను అట్టిపెట్టుకొని దుర్మార్గుని దుష్చర్యపై నిర్దోషిని మేము హింసించటం నుండి అల్లాహ్ రక్షించుగాక. మేము పాపాత్ముడిని వదిలేసి నిర్దోషిని శిక్షించినప్పుడు మేము అలా చేస్తే నిశ్చయంగా మేము దుర్మార్గులము.
(80) అయితే తమకోరికను యూసుఫ్ అంగీకరించటం నుండి వారు నిరాశులైనప్పుడు ఒకరినొకరు సలహాలు తీసుకోవటం కొరకు (చర్చించుకోవటం కొరకు) ప్రజల నుండి వేరైపోయారు. వారిలో పెద్ద సోదరుడు ఇలా పలికాడు : మీరు తొలగించలేని దానితో మీరు చుట్టు ముడితే తప్ప మీరు తన కుమారుడిని తనకు తిరిగి అప్పజెప్పుతారని ఖచ్చితమైన అల్లాహ్ ప్రమాణమును మీ తండ్రి మీతో తీసుకున్న విషయమును మీకు గుర్తు చేస్తున్నాను.దీనికన్నా ముందు మీరు యూసుఫ్ విషయంలో మాట తప్పారు.ఆయన విషయంలో మీరు మీ తండ్రికి ఇచ్చిన మాటాను పూర్తి చేయలేదు.అయితే నా తండ్రి తన వైపునకు మరలటానికి నాకు అనుమతించనంతవరకు లేదా నా సోదరుడిని తీసుకుని రావటానికి అల్లాహ్ తీర్పునివ్వనంత వరకు నేను మిసర్ ప్రాంతమును వదలను. ఆయన సత్యముతో మరియు న్యాయముతో తీర్పునిస్తాడు.
(81) మరియు పెద్ద సోదరుడు ఇలా పలికాడు : మీరందరు మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలకండి : నిశ్చయంగా మీ కుమారుడు దొంగతనం చేశాడు.మిసర్ రాజు అతని దొంగతనమునకు అతనికి శిక్షగా అతన్ని బానిసగా చేసుకున్నాడు.మేము అతని సామాను నుండి కొలిచే పాత్ర దొరకటం మేము చూసినది మాకు తెలిసినది మాత్రమే మీకు తెలియపరుస్తున్నాము.అతడు దొంగతనం చేస్తాడని మాకు తెలియదు.ఒక వేళ అది మాకు తెలిసి ఉంటే మేము అతన్ని మీకు తిరిగి అప్పగిస్తామని మాట ఇచ్చేవారము కాదు.
(82) ఓ మా తండ్రి మా నిజాయితీని నిర్ధారించుకోవటానికి మీరు మేము ఉండి వచ్చిన మిసర్ వాసులను అడగండి మరియు మేము ఎవరితోపాటు వచ్చామో ఆ బిడారము వారిని అడగండి.నిశ్చయంగా అతని దొంగతనం గురించి మీకు మేము ఇచ్చిన సమాచారములో వాస్తవానికి మేము సత్యవంతులము.
(83) వారితో వారి తండ్రి ఇలా పలికారు : అతడు దొంగతనం చేశాడని మీరు తెలిపినట్లు విషయం అలా లేదు.కాని ముందు అతని సోదరడు యూసుఫ్ విషయంలో మీరు పధకం పన్నినట్లు ఇతని విషయంలో మీరు పధకం పన్నటానికి మీ మనస్సులు మీ కొరకు మంచిగా చేసి చూపాయి. నా సహనం సుందరమైనది. అందులో ఎటువంటి ఫిర్యాదు లేదు కాని అల్లాహ్ వద్ద మాత్రమే.యూసుఫ్,అతని సొంత సోదరుడు మరియు వారిద్దరి పెద్ద సోదరుడు అందరిని నా వద్దకు మరలిస్తాడని అల్లాహ్ పై ఆశ ఉన్నది.నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన నా స్థితిని గురించి బాగా తెలిసిన వాడు,నా వ్యవహారము కొరకు తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(84) మరియు ఆయన వారి నుండి ముఖం త్రిప్పుకుని దూరముగా జరిగి ఇలా పలికారు : "అయ్యో యూసుఫ్ పై నా దుఃఖ తీవ్రతా".అతన్ని తలచుకుని ఎక్కువగా ఏడవటం వలన ఆయన రెండు కళ్ల నల్లదనం తెల్లగా అయిపోయింది. ఆయన దుఃఖముతో,బాధతో నిండపోయి ఉన్నారు.ప్రజల నుండి తన బాధను దాచి ఉంచారు.
(85) యూసుఫ్ సోదరులు తమ తండ్రితో ఇలా పలికారు ఓ మా తండ్రి అల్లాహ్ సాక్షిగా మీరు తీవ్ర జబ్బు పడే వరకు లేదా నిజంగా నశించే వరకు యూసుఫ్ ను నిరంతరంగా తలచుకుంటుంటారు మరుయు అతనిపై దుఃఖిస్తూ ఉంటారు.
(86) వారితో వారి తండ్రి ఇలా పలికారు : నాకు కలిగిన ఆవేదన,దుఃఖము గురించి ఒక్కడైన అల్లాహ్ వద్ద మాత్రమే నేను ఫిర్యాదు చేసుకుంటాను.మరియు అల్లాహ్ దయాదాక్షిణ్యాలు,కష్టాల్లో ఉన్న వాడి పట్ల ఆయన స్పందన మరియు ఆపదకి గురైన వారికి ఆయన ఇచ్చే ప్రతిఫలము గురించి మీకు తెలియనిది నాకు తెలుసు.
(87) వారితో వారి తండ్రి ఇలా పలికారు : ఓ నా కుమారులారా మీరు వెళ్ళి యూసుఫ్ మరియు అతని సోదరుడి సమాచారము గురించి దర్యాప్తు చేయండి.మరియు మీరు అల్లాహ్ తన దాసులను విముక్తి కలిగించటం నుండి,అతని ఉపశమనం కలిగించటం నుండి నిరాశులు కాకండి.అతని విముక్తి కలిగించటం నుండి,అతని ఉపశమనం కలిగించటం నుండి కేవలం అవిశ్వాసపరులు మాత్రమే నిరాశులవుతారు.ఎందుకంటే వారికి అల్లాహ్ గొప్ప సామర్ధ్యం గురించి, తన దాశులపై ఆయన అనుగ్రహము గోప్యత గురించి తెలియదు.
(88) అయితే వారు తమ తండ్రి ఆదేశమును పాటించారు.మరియు వారు యూసుఫ్ ను,అతని సోదరుడిని వెతుకుతూ వెళ్ళారు.అప్పుడు వారు యూసుఫ్ వద్దకు వచ్చి మాపై కష్టము,పేదరికం వచ్చి పడింది.మరియు మేము అల్పమైన,తక్కువదైన సామగ్రిని తీసుకుని వచ్చాము.అయితే నీవు మాకు మునుపు కొలిచి ఇచ్చినట్లే పూర్తిగా కొలచి ఇవ్వు .మరియు దానికన్నా ఎక్కువ మాకు దానంగా ఇవ్వు లేదా మా అల్పమైన సామగ్రి నుండి దృష్టి సడలించి ఇవ్వు.నిశ్చయంగా అల్లాహ్ దానం చేసే వారికి మంచి ప్రతి ఫలాన్ని ప్రసాధిస్తాడు.
(89) ఆయన వారి మాటలు విన్నప్పుడు వారిపై దయ కలిగినది. మరియు ఆయన స్వయంగా వారికి తన పరిచయం చేసుకున్నారు.మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు యూసుఫ్ మరియు అతని సొంత సోదరుడు ఇద్దరికీ మీరు ఏమి చేశారో మీకు తెలియదా ?! అని వారిని అడిగారు.
(90) దానితో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.మరియు ఏమి నిశ్చయంగా నీవు యూసుఫ్ వా ?! అని పలికారు.యూసుఫ్ వారికి ఇలా సమాధానమిచ్చారు : అవును నేను యూసుఫ్ ని మరియు మీరు నాతోపాటు చూస్తున్న ఇతడు నా సొంత సోదరుడు.మేము ఉన్న దాని నుండి మమ్మల్ని విముక్తిని కలిగించి,ఉన్నత స్థానమును కలిగించి అల్లాహ్ మాపై అనుగ్రహమును కలిగించాడు.నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాఠించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి మరియు ఆపదల్లో సహనం చూపిస్తాడో నిశ్చయంగా అతని ఆచరణ మంచిది.మరియు అల్లాహ్ సత్కర్మలను చేసేవారి పుణ్యమును వృధా చేయడు.కాని వాటిని వారి కొరకు సంరక్షిస్తాడు.
(91) అతని సోదరులు అతనికి వారు చేసిన దాని నుండి క్షమాపణ కోరుతూ అతనితో ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా అల్లాహ్ నీకు ప్రసాధించిన పరిపూర్ణ గుణాల ద్వారా నిన్ను మాపై ప్రాధాన్యతను ప్రసాధించాడు.మరియు నిశ్చయంగా మేము నీకు కలిగించిన దానిలో పాపాత్ములు,దుర్మార్గులమైపోయాము.
(92) అప్పుడు యూసుఫ్ వారి క్షమాపణను స్వీకరించారు.మరియు ఇలా పలికారు : మీపై శిక్షను నిర్ణయించటానికి మీపై ఎటువంటి నిందా లేదు మరియు ఎటువంటి దురుద్దేశమూ లేదు.అల్లాహ్ మిమ్మల్ని మన్నించాలని నేను ఆయనను అర్ధిస్తున్నాను.మరియు పరిశుద్దుడైన ఆయన కరుణించే వారిలో ఎక్కువ కరుణించే వాడు.
(93) వారు అతని తండ్రి దృష్టికి సంభవించిన దాని గురించి తెలియజేసినప్పుడు ఆయన వారికి తన చొక్కాను ఇచ్చి ఇలా పలికారు : మీరు నా ఈ చొక్కాను తీసుకుని వెళ్ళి దాన్ని నా తండ్రి ముఖముపై వేయండి ఆయన దృష్టి ఆయనకు తిరిగి వస్తుంది.మరియు మీరు మీ ఇంటి వారందరిని నా వద్దకు తీసుకుని రండి.
(94) మరియు బిడారం మిసర్ నుండి బయలుదేరి అది జనసంచారము నుండి దూరమైనప్పుడు యాఖూబ్ అలైహిస్సలాం తన కుమారులతో మరియు తన చుట్టుప్రక్కల ఉన్న వారితో ఇలా పలికారు : ఒక వేళ మీరు నాకు జ్ఞానం లేదని మరియు నాకు మతి భ్రమించిందని మీ మాటల్లో ఇతడు మతి భ్రమించిన ముసలివాడు,ఇతనికి తెలియనివి మాట్లాడుతున్నాడు అని నిందించకుండా ఉంటే నిశ్చయంగా నాకు యూసుఫ్ యొక్క వాసన అనుభూతి కలుగుతుంది.
(95) ఆయన వద్ద ఉన్న ఆయన పిల్లలు ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా మీరు యూసుఫ్ స్థితి మరియు అతనిని మళ్ళీ చూసే అవకాశం గురించి మునుపటి భ్రమలో ఉన్నారు.
(96) యాఖూబ్ ను సంతోషమును కలిగించే వార్తను తీసుకుని వచ్చిన వాడు వచ్చి యూసుఫ్ చొక్కాను ఆయన ముఖముపై వేశాడు. అప్పుడు ఆయన చూడసాగారు. ఆ సమయంలో ఆయన తన కుమారులతో ఇలా పలికారు : అల్లాహ్ దయ,ఆయన మంచి గురించి మీకు తెలియనిది నాకు తెలుసు అని మీకు నేను చెప్పలేదా ?.
(97) అతని కుమారులు తాము యూసుఫ్ మరియు అతని సోదరునికి చేసిన దాని గురించి తమ తండ్రి యాఖూబ్ అలైహిస్సలాం తో క్షమాపణ కోరుతూ ఇలా పలికారు : ఓ మా తండ్రి మీరు మా క్రితం పాపముల నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా మేము యూసుఫ్ మరియు అతని సొంత సోదరునికి ఏదైతే చేశామో ఆ విషయంలో మేము పాపాత్ములము,అపరాధులము.
(98) వారితో వారి తండ్రి ఇలా పలికారు : నేను నా ప్రభువుతో మీ కొరకు క్షమాపణను కోరుతాను.నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
(99) మరియు యాఖూబ్ మరియు అతని ఇంటి వారు తమ దేశము నుండి మిసర్ లో ఉన్న యూసుఫ్ ను ఉద్దేశించుకుని బయలుదేరారు.అయితే వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన తండ్రిని,తన తల్లిని తనతో హత్తుకున్నారు మరియు తన సోదరులతో,తన ఇంటి వారితో ఇలా పలికారు : మీరు అల్లాహ్ ఇష్టపూర్వకంగా నిర్భయంగా మిసర్ లో ప్రవేశించండి అందులో మీకు ఎటువంటి కీడు కలగదు.
(100) మరియు ఆయన తన తల్లిదండ్రులను తాను కూర్చునే సింహాసనం మీద కూర్చోబెట్టారు. మరియు అతని తల్లిదండ్రులు,అతని పదకుండు మంది సోదరులు సాష్టాంగపడుతూ అతనికి సలాం చేశారు. మరియు సాష్టాంగపడటం గౌరవించటం కొరకే కాని ఆరాధన కొరకు కాదు. కలలో ఉన్న విధంగా అల్లాహ్ ఆదేశమును నిరూపించటానికి. అందుకనే యూసుఫ్ అలైహిస్సలాం తన తండ్రితో ఇలా పలికారు : ఇది మీ తరపు నుండి నాకు సాష్టాంగపడటం ద్వారా సలాం చేయటం ఇది ఇంతకు ముందు నేను చూసి మీకు తెలియపరచిన నా కల తాత్పర్యం. నిశ్చయంగా నా ప్రభువు దాన్ని జరిపించి నిజం చేశాడు. మరియు నిశ్చయంగా నా ప్రభువు నన్ను చెరసాల నుండి బయటకు తీసినప్పుడు మరియు షైతాను నా మధ్య మరియు నా సోదరుల మధ్య ఉపద్రవాలను సృష్టించిన తరువాత మిమ్మల్ని పల్లె నుండి తీసుకుని వచ్చినప్పుడు నాపై ఉపకారం చేశాడు. నిశ్చయంగా నా ప్రభువు తాను కోరుకున్న దాని కొరకు తన పర్యాలోచనలో సూక్ష్మగ్రాహి. నిశ్చయంగా ఆయన తన దాసుల స్థితులను గురించి బాగా తెలిసిన వాడు,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(101) ఆ తరువాత యూసుఫ్ తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నీవు నాకు మిసర్ రాజ్యాధికారాన్ని ప్రసాధించావు మరియు నాకు కలల తాత్పర్యమును నేర్పించావు.ఓ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సృష్టించిన వాడా ఇహలోక జీవితంలో నా వ్యవహారాలన్నింటి సంరక్షకుడివి మరియు పరలోకంలో వాటన్నింటి సంరక్షకుడివి నీవే. నీవు నా ఆయుషు పూర్తయినప్పుడు నాకు ముస్లిమ్ స్థితిలో మరణాన్ని ప్రసాధించు. మరియు నన్ను స్వర్గములో ఉన్నతమైన ఫిరదౌస్ లో నా తాతముత్తాతలు మరియు ఇతరుల్లోంచి పుణ్యాత్ములైన దైవప్రవక్తలతో కలుపు.
(102) ఈ ప్రస్తావించబడిన యూసుఫ్ మరియు అతని సోదరుల గాధ ఓ ప్రవక్తా మేము దాన్ని మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము.వారు అతన్ని బావి లోతులో పడవేయటానికి దృడ సంకల్పం చేసుకున్నప్పుడు మరియు వారు కుట్రలేవైతే పన్నినప్పుడు మీరు యూసుఫ్ సోదరుల మధ్య లేనందు వలన మీకు దాని గురించి జ్ఞానం లేదు.కాని మేము దాన్ని మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము.
(103) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు వారు విశ్వసించాలని అన్ని రకాల శ్రమను ఖర్చు చేసినా ప్రజల్లోంచి చాలామంది విశ్వసించరు. వారిపై దుఃఖముతో మీ ప్రాణము పోకూడదు.
(104) ఓ ప్రవక్తా ఒక వేళ వారికి బుద్ధి ఉంటే వారు మిమ్మల్ని విశ్వసించి ఉండేవారు ఎందుకంటే మీరు ఖుర్ఆన్ పై మరియు వారిని మీరు దేని వైపు పిలిస్తున్నారో దానిపై వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించటం లేదు.ఖుర్ఆన్ ప్రజలందరికి హితబోధన మాత్రమే.
(105) మరియు భూమ్యాకాశములలో పరిశుద్ధుడైన ఆయన ఏకత్వమును నిరూపించే ఎన్నో సూచనలు వ్యాపించి ఉన్నాయి.వారు వాటి ముందు నుండి నడుస్తున్నారు.మరియు వారు వాటిలో యోచన చేయటం నుండి,వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటం నుండి విముఖత చూపుతున్నారు. వాటివైపు శ్రద్ధ చూపటం లేదు.
(106) మరియు ప్రజల్లో చాలా మంది అల్లాహ్ ను సృష్టికర్త,ఆహారప్రధాత,జీవనాన్ని ప్రసాధించేవాడు,ప్రాణములను తీసేవాడని విశ్వసించటం లేదు కాని వారు ఆయనతోపాటు ఇతరులను విగ్రహాలను,శిల్పాలను ఆరాధిస్తున్నారు.మరియు వారు పరిశుద్ధుడైన ఆయనకు కుమారుడు ఉన్నాడని వాదిస్తున్నారు.
(107) ఏమి ఈ ముష్రికులందరు ఇహలోకములో వారిని కప్పివేసే మరియు క్రమ్ముకునే శిక్షరావటం నుండి నిర్భయులైపోయారా ?.దాన్ని దూరంచేసే శక్తి వారికి లేదు. లేదా వారి వద్దకు ప్రళయం అకస్మాత్తుగా రావటం నుండి నిర్భయులైపోయారా ?. దాని కోసం వారు సిద్ధం అవటానికి దాన్ని గమనించలేకపోయారు. అందుకనే వారు విశ్వసించలేదు.
(108) ఓ ప్రవక్తా మీరు పిలుపునిచ్చేవారితో (దైవసందేశం ఇచ్చేవారితో) ఇలా పలకండి : ఇదే నా మార్గము దేని వైపునైతే నేను ప్రజలను పిలుస్తున్నానో. నేను పిలుస్తున్నది మరియు నన్ను అనుసరిస్తున్న వారు మరియు నా మార్గమును పొందినవారు మరియు నా సాంప్రదాయమును అనుసరిస్తున్నవారు పిలుస్తున్న మార్గము స్పష్టమైన ఆధారంతో ఉన్నది. అల్లాహ్ ఔన్నత్యమునకు తగని,ఆయన పరిపూర్ణతకు విరుద్ధమైన వాటిని ఆయనకు అపాదించటం నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. నేను అల్లాహ్ తో సాటి కల్పించే వారిలోంచి కాను కాని నేను పరిశుద్ధుడైన ఆయన కొరకు ఏకత్వమును చాటి చెప్పే వారిలోంచి వాడిని.
(109) ఓ ప్రవక్తా మీకన్న ముందు మేము పంపించిన ప్రవక్తలందరు దైవదూతలు కాకుండా మానవుల్లోంచి మగవారు మాత్రమే.మేము నీ వైపున దైవ వాణిని అవతరింపజేసినట్లే వారి వైపు అవతరింపజేశాము. వారు నగరవాసులు పల్లెవాసులు కాదు.అయితే వారిని వారి జాతులు తిరస్కరించాయి మేము వారిని తుదిముట్టించాము.ఏమీ మిమ్మల్ని తిరస్కరించిన వీరందరు వారికన్న మునుపటి తిరస్కారుల పరిణామం ఏమయిందో యోచన చేసి వారి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి భూమిలో సంచరించలేదా ?.పరలోక వాసములో ఉన్న అనుగ్రహాలు ఇహలోకములో అల్లాహ్ భీతి కలిగిన వారి కొరకు మేలైనవి.ఏమీ మీరు అల్లాహ్ భీతి కలిగి ఉండి ఆయన ఆదేశాలను పాటించటం ద్వారా వాటిలో గొప్పదైనది విశ్వాసము మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా వాటిలో పెద్దది అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ఇవి మేలైనవని మీరు అర్ధం చేసుకోరా ?.
(110) ఈ ప్రవక్తలందరు మేము పంపించినవారు వారి శతృవులకు మేము గడువునిచ్చాము.వారిని బిగించటానికి మేము వారిపై శిక్షను తొందర చేయము.చివరికి వారి వినాశనము ఆలస్యమైనప్పుడు మరియు ప్రవక్తలు వారి వినాశనము నుండి నిరాశులైనప్పుడు సత్య తిరస్కారులు తమ ప్రవక్తలు సత్య తిరస్కారుల కొరకు శిక్ష గురించి,విశ్వాసపరులకు విముక్తి గురించి తమకు చేసిన వాగ్దానములో తమకు అబద్దము చెప్పారని భావించారు.మా ప్రవక్తల కొరకు మా సహాయం వచ్చినది.సత్య తిరస్కారులపై వచ్చిపడే వినాశనము నుండి ప్రవక్తలు మరియు విశ్వాసపరులు రక్షించబడ్డారు.అపరాధులైన జాతి వారి నుండి వారిపై అవతరించేటప్పుడు మా శిక్ష మరలించబడదు.
(111) నిశ్చయంగా ప్రవక్తల గాధల్లో మరియు వారి జాతుల గాధల్లో మరియు యూసుఫ్,అతని సోదరుల గాధలో వాటి ద్వారా హితబోధన గ్రహించే ఆరోగ్యవంతమైన మనస్సులు కలవారి కొరకు హితబోధన ఉన్నది.ఈ విషయాలపై పొందుపరచబడిన ఖుర్ఆన్ అల్లాహ్ పై కల్పించిన,అపాదించిన అబద్దపు వాక్కు కాదు.కాని అది అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన దివ్య గ్రంధాలను దృవీకరించేది,వివరణ అవసరమైన ఆదేశాలు,ధర్మ శాసనాలన్నింటి కొరకు వివరణ ఇచ్చేది మరియు ప్రతి మంచిని చూపించేది మరియు దానిపై విశ్వాసమును కనబరిచే జాతి వారి కొరకు కారుణ్యము. వారే దానిలో ఉన్నవాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.