(1) {అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. ఓ ప్రవక్తా ఈ ఖుర్ఆన్ మీ వైపునకు మేము అవతరింపజేసిన గ్రంధము. మీరు ప్రజలను అవిశ్వాసము,అజ్ఞానము,అపమార్గము నుండి విశ్వాసము,జ్ఞానము,ఎవరు ఆధిక్యతను చూపని ఆధిక్యత కలిగిన,అన్ని విషయాల్లో సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ మార్గమైన ఇస్లాం ధర్మం వైపునకు అల్లాహ్ నిర్ణయంతో,ఆయన సహాయంతో మార్గదర్శకత్వము చేయటానికి.
(2) ఆకాశముల్లో ఉన్న సమస్తము యొక్క రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే మరియు భూమిలో ఉన్న సమస్తము యొక్క రాజ్యాధికారము ఒక్కడైన ఆయన కొరకే. ఆరాధన చేయబడటమునకు ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన సృష్టితాల్లోంచి దేనినీ ఆయన తోపాటు సాటి కల్పించబడదు. మరియు త్వరలోనే అవిశ్వాసపరులు కఠినమైన శిక్షను పొందుతారు.
(3) అవిశ్వాసపరులైన వారు ఇహలోక జీవితం మరియు అందులోని అంతమైపోయే అనుగ్రహాలను పరలోకము,అందులోని శాస్వత అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తున్నారు. మరియు వారు ప్రజలను అల్లాహ్ మార్గము నుండి మరలుస్తున్నారు. మరియు వారు ఆయన మార్గము కొరకు వక్రతను,సత్యము నుండి పరధ్యానమును,తిన్నగా ఉండటం నుండి వాలిపోవటమును కోరుతున్నారు. చివరికి అందులో ఎవరు నడవరు. ఈ లక్షణాలు కలిగిన వారందరు సత్యము నుండి ,సమగ్రంగా ఉండటం నుండి దూరంగా అప మార్గములో ఉన్నారు.
(4) మరియు మేము ఏ ప్రవక్తను పంపించిన ఆయన అల్లాహ్ వద్ద నుండి తీసుకుని వచ్చినది అర్ధం చేసుకోవటం వారికి సులభం అవటానికి అతని జాతి వారి భాషను మాట్లాడే వానిగా పంపించాము.మరియు అల్లాహ్ పట్ల విశ్వాసము చూపటానికి వారిని బలవంతం చేయటానికి మేము అతన్ని పంపించలేదు. అయితే అల్లాహ్ తాను కోరుకున్న వారికి తన న్యాయముతో అపమార్గమునకు గురి చేస్తాడు,మరియు తాను కోరుకున్న వారికి తన అనుగ్రహము ద్వారా సన్మార్గము కొరకు సౌభాగ్యమును కలిగిస్తాడు. తనను ఎవరు ఓడించని ఆధిక్యుడు అతడు.తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(5) మరియు నిశ్చయంగా మేము ముసాను సందేశహరునిగా పంపించి ఆయన నిజాయితీని,మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని దృవీకరించే సూచనల ద్వారా ఆయనకు సహకరించాము. మరియు మేము అతన్ని తన జాతివారిని అవిశ్వాసము,అజ్ఞానము నుండి విశ్వాసము,జ్ఞానము వైపునకు తీయమని ఆదేశించాము. మరియు మేము అతన్నిఆల్లాహ్ యొక్క ఆ దినములు వేటిలోనైతే ఆయన వారిపై అనుగ్రహాలు కలిగించాడో వాటి గురించి వారిని గుర్తు చేయమని ఆదేశించాము. నిశ్చయంగా ఈ దినములలో అల్లాహ్ తౌహీదుకు,ఆయన గొప్ప సామర్ధ్యమునకు,విశ్వాసపరులపై ఆయన అనుగ్రహమునకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అల్లాహ్ విధేయతపై సహనమును చూపేవారు,ఆయన ఆశీర్వాదాలపై,ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలపటంలో కట్టుబడి ఉండేవారు దీని ద్వారా ప్రయోజనం చెందుతారు.
(6) ఓ ప్రవక్తా మీరు మూసా తన ప్రభువు ఆదేశమును చేసి చూపించిన సమయమును గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన తన జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని వారిపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేస్తూ ఇలా పలికారు : ఓ నా జాతివారా ఫిర్ఔన్ వంశీయుల నుండి మిమ్మల్ని అల్లాహ్ రక్షించినప్పటి మరియు ఫిర్ఔన్ రాజ్యమును ఏలే వారు మీలో ఎవరు జన్మించకూడదని మీ కుమారులను కోసివేసి మరియు మీ ఆడవాళ్ళను అవమానపరచటానికి,పరాభవమునకు లోను చేయటానికి జీవిత బంధీలుగా చేసి మీకు చెడ్డ శిక్ష రుచి చూపించినప్పుడు మిమ్మల్ని ఆయన వారి బాధల నుండి రక్షించినప్పటి మీపై కల అల్లాహ్ అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకోండి. మరియు వారి ఈ చేష్టలలో మీ సహనమునకు పెద్ద పరీక్ష ఉన్నది. అప్పుడు అల్లాహ్ ఈ ఆపదపై మీ సహనమునకు మిమ్మల్ని ఫిర్ఔన్ వంశీయుల యొక్క బాధల నుండి విముక్తి కలిగించి మీకు ప్రతిఫలాన్ని ప్రసాధించాడు.
(7) మరియు మూసా వారితో ఇలా పలికారు : మీరు ఒకసారి మీ ప్రభువు మీకు అనర్గళంగా తెలియపరచినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : "ఒక వేళ మీరు మీకు అల్లాహ్ ప్రసాధించిన ఈ ప్రస్తావించబడిన ఈ అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటే ఆయన తప్పకుండా తన అనుగ్రహము నుండి మీకు దానికన్నా ఎక్కువగా ప్రసాధిస్తాడు. మరియు ఒక వేళ మీరు మీపై ఉన్న ఆయన అనుగ్రహాలను తిరస్కరించి,వాటిపై మీరు కృతజ్ఞతలు తెలపకపోతే నిశ్చయంగా ఆయన శిక్ష ఆయన అనుగ్రహాలను తిరస్కరించి,ఆయనకు కృతజ్ఞతలు తెలపని వారి కొరకు ఎంతో కఠినమైనది".
(8) మరియు మూసా తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఓక వేళ మీరు అవిశ్వాసమునకు పాల్పడి,మీతోపాటు భూమిపై ఉన్న వారందరు అవిశ్వాసమునకు పాల్పడితే అప్పుడు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీపై మరలుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు,సర్వస్తోత్రాలకు ఆయన స్వయంగా అర్హుడు. విశ్వాసపరుల విశ్వాసము ఆయనకు ప్రయోజనం చేయదు మరియు అవిశ్వాసపరుల అవిశ్వాసము ఆయనకు నష్టం కలిగించదు.
(9) ఓ అవిశ్వాసపరులారా ఏమి మీ పూర్వ జాతులైన నూహ్ జాతి,హూద్ జాతి అయిన ఆద్,సాలిహ్ జాతి అయిన సమూద్,మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారు మరియు వారు ఎక్కువగా ఉన్నారు వారి లెక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు వారి వినాశనము సమాచారము మీకు చేరలేదా ?. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. వారు ప్రవక్తలపై కోపముతో తమ వేళ్ళను కొరుకుతూ తమ చేతులను తమ నోళ్ళపై పెట్టుకున్నారు. మరియు వారు తమ ప్రవక్తలతో ఇలా పలికారు : నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్కరించాము. మరియు నిశ్చయంగా మేము మీరు దేనివైపునైతే మమ్మల్ని పిలుస్తున్నారో దాని గురించి సందేహమును కలిగి ఉన్నాము.
(10) వారి ప్రవక్తలు వారిని ఖండిస్తు వారితో ఇలా అన్నారు : ఏమి అల్లాహ్ ఏకత్వము విషయంలో ఆయన ఒక్కడికే ఆరాధనను చేయటము విషయంలో సందేహమా ?. వాస్తవానికి ఆకాశములను సృష్టించినవాడు,భూమిని సృష్టించినవాడు,ఆ రెండింటిని పూర్వ నమూనా లేకుండా ఏర్పరచినవాడు ఆయనే. ఆయన మీ పూర్వపు పాపములను మీ నుండి తుడిచివేయటానికి,మీ ఇహలోక జీవితములో మీ నిర్ణీత గడువులను మీరు పూర్తి చేసుకునే వరకు మీకు గడువు ఇవ్వటానికి, తనను విశ్వసించటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. వారి జాతులవారు వారితో ఇలా పలికారు : మీరు మాలాంటి మానవులు మాత్రమే. మాపై మీకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీరు మా తాతముత్తాతలు ఆరాధించే వాటి ఆరాధన చేయటం నుండి మమ్మల్ని మరల్చాలనుకుంటున్నారు. అయితే మీరు అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తలు అని మీరు చేస్తున్న వాదనలో మీ నిజాయితీని దృవీకరించే ఏదైన స్పష్టమైన ఆధారమును మీరు మా వద్దకు తీసుకుని రండి.
(11) వారి ప్రవక్తలు వారిని ఖండిస్తూ ఇలా పలికారు : మేము మీలాంటి మానవులము మాత్రమే. అయితే మేము ఈ విషయంలో మీకు పోలి ఉండటమును నిరాకరించము. కాని ఈ పోలి ఉండటంతో ప్రతి విషయంలో పోలి ఉండటం జరగదు. అల్లాహ్ తన దాసుల్లోంచి ఆయన ఎవరిని తలచుకుంటే వారిని ప్రత్యేక అనుగ్రహము ద్వారా అనుగ్రహిస్తాడు. మరియు వారిని ప్రవక్తలుగా ఎంచుకుని ప్రజల వద్దకు పంపిస్తాడు. మరియు అల్లాహ్ ఇచ్ఛ లేకుండా మేము మీరు కోరిన ప్రతీ వాదనను మీ వద్దకు తీసుకుని రావటం మాకు సరి కాదు. వాటిని తీసుకుని రావటం మా ఆధీనంలో లేదు. కాని అల్లాహ్ ఒక్కడే దాని సామర్ధ్యం కలవాడు. మరియు విశ్వాసపరులు తమ వ్యవహారాలన్నింటిలో అల్లాహ్ ఒక్కడిపై నమ్మకమును కలిగి ఉంటారు.
(12) మరియు మాకు,ఆయనపై నమ్మకమును కలిగి ఉండటమునకు మధ్య ఏ ఆటంకము,ఏ కారణం ఉన్నది ?. నిశ్చయంగా ఆయన ఋజుమార్గములను,స్పష్టమైన మార్గములను మాకు చూపించాడు. తిరస్కారము ద్వారా,ఎగతాళి చేయటం ద్వారా మీరు మాకు బాధ కలిగించిన దానిపై తప్పకుండా మేము సహనం చూపుతాము. మరియు నమ్మకమును కలిగి ఉండేవారు తమ పూర్తి వ్యవహారాల్లో అల్లాహ్ ఒక్కడి పైనే తప్పకుండా నమ్మకమును కలిగి ఉండాలి.
(13) తిరస్కరించిన జాతులవారు తమ ప్రవక్తలతో వాదించటం నుండి అశక్తులైపోయినప్పుడు ప్రవక్తలతో ఇలా పలికారు : మేము మిమ్మల్ని తప్పకుండా మా ఊరి నుండి బహిష్కరిస్తాము లేదా మీరు మీ ధర్మం నుండి మా ధర్మం వైపునకు మరలిపోండి. అప్పుడు అల్లాహ్ ప్రవక్తల నిలకడ కొరకు వారి వైపు ఇలా వహీ చేశాడు (దైవ వాణిని అవతరింపజేశాడు) : మేము తప్పకుండా అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన దుర్మార్గులను తుదిముట్టిస్తాము.
(14) ఓ ప్రవక్తలారా వారిని నాశనం చేసిన తరువాత మిమ్మల్ని,మిమ్మల్ని అనుసరించిన వారిని మేము తప్పకుండా భూమిపై ఆశ్రయమును కల్పిస్తాము. ఈ ప్రస్తావించబడినటువంటి తిరస్కారులైన అవిశ్వాసపరులను తుదిముట్టించడం,వారిని నాశనం చేసిన తరువాత వారి ప్రవక్తలను,విశ్వాసపరులకు ఆశ్రయం కల్పించటం అది నా సాన్నిధ్యంలో నిలబడటానికి హాజరు కావాలని కోరుకుని మరియు శిక్ష గురించి నా హెచ్చరికకు బయపడే వాడి కొరకు.
(15) మరియు ప్రవక్తలు తమ ప్రభువుతో తమ శతృవులకు వ్యతిరేకముగా తమకు సహాయం చేయమని కోరారు. మరియు సత్యాన్ని వ్యతిరేకించే ప్రతి అహంకారి నాశనమయ్యాడు.అది అతనికి స్పష్టమైనా కూడా దాన్ని అనుసరించలేదు.
(16) ప్రళయదినాన ఈ అహంకారి ముందట నరకముంటుంది. అది అతని కోసం మాటువేసి ఉంటుంది. మరియు అందులో అతనికి నరకవాసుల నుండి కారే చీమును త్రాపించటం జరుగుతుంది. అయితే అది అతని దాహం తీర్చదు. అతను దాహము ద్వారా మరియు ఇతర రకరకాలైన శిక్షల ద్వారా శిక్షించబడుతూ ఉంటాడు.
(17) దాని చేదుతనం,దాని వేడి,దాని దుర్వాసన తీవ్రత వలన దాన్ని అతడు అతి కష్టం మీద కొద్ది కొద్దిగా త్రాగుతాడు. దాన్ని అతడు మింగలేడు. మరియు అతను ఎదుర్కొంటున్న శిక్షల తీవ్రత వలన అతనికి మరణం ప్రతి వైపు నుండి వస్తుంది. మరియు అతడు సుఖము పొందటానికి మరణించలేడు. దానికి బదులుగా అతను శిక్షను కళ్ళారా చూడటానికి జీవించి ఉంటాడు. అతని ముందట ఇంకొక కఠినమైన శిక్ష అతని కోసం నిరీక్షిస్తూ ఉంటుంది.
(18) అవిశ్వాసపరులు చేసే సత్కర్మలైన దానధర్మాలు,ఉపకారము,బలహీనులపట్ల దయలను ఆ బూడిదతో పోల్చవచ్చు దేనిపైనైతే తీవ్ర పెనుగాలులు వీచే దినమున పెనుగాలులు వీచి దాన్ని బలముతో ఎత్తుకుని వెళ్ళి దాని ఆనమాలు లేకుండా ఉండెంత వరకు ప్రతీ ప్రదేశములో చెల్లాచెదురుగా విసిరి వేస్తుంది. ఇలాగే అవిశ్వాసం అవిశ్వాసపరుల కర్మలపై వీస్తుంది. అప్పుడు ప్రళయదినాన ఆ కర్మలు చేసుకున్న వారికి అవి ప్రయోజనం చేకూర్చవు. ఆ కర్మల పునాది విశ్వాసము పై పెట్టలేదు,అది సత్యమార్గము నుండి దూరముగా తీసుకెళ్ళే అపమార్గము.
(19) ఓ మానవుడా అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని సత్యముతో సృష్టించాడని నీకు తెలియదా ?. అయితే ఆయన ఆ రెండింటిని వృధాగా సృష్టించ లేదు. ఓ ప్రజలారా ఒక వేళ ఆయన మిమ్మల్ని నసింపజేసి మీకు బదులుగా ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని రాదలచుకుంటే ఆయన మిమ్మల్ని నసింపజేసి ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని వస్తాడు.అప్పుడు ఆ విషయం ఆయనపై సులభమైనది మరియు తేలికైనది.
(20) మరియు మిమ్మల్ని తుదిముట్టించి ఇతరులను సృష్టించి తీసుకుని రావటం పరిశుద్ధుడైన ఆయనను అశక్తుడిని చేయదు. ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏది అశక్తుడిని చేయదు.
(21) వాగ్ధానం చేయబడిన దినమున (ప్రళయదినాన) ప్రజలంతా తమ సమాదుల నుండి బయటకు వచ్చి అల్లాహ్ వైపునకు తరలి వెళుతారు. అప్పుడు బలహీనులైన అనుచరులు నాయకులతో,పెద్దవారితో ఇలా అంటారు : ఓ నాయకులారా నిశ్చయంగా మేము మీ ఆదేశాలను పాటించి,మీరు వారించిన వాటిని విడనాడి మిమ్మల్ని అనుసరించాము. అయితే మీరు అల్లాహ్ శిక్షను కొద్దిగైనా మా నుండి దూరం చేయగలరా ?. నాయకులు,పెద్దవారు ఇలా పలుకుతారు : ఒక వేళ అల్లాహ్ మాకు సన్మార్గమును ప్రసాధించి ఉంటే మేము మిమ్మల్ని దాని మార్గదర్శకం చేసేవారము. అప్పుడు మనమందరము అతని శిక్ష నుండి బ్రతికి బయటపడే వాళ్ళము. కాని మేము మార్గభ్రష్టులయ్యాము,మరియు మేము మిమ్మల్ని మార్గ భ్రష్టుల్ని చేశాము. మేము శిక్షను మోయటం నుండి బలహీన పడటం లేదా సహనం చూపటం మాపై మీపై ఒక్కటే. శిక్ష నుండి పారిపోయే ప్రదేశం ఏదీ మన కొరకు లేదు.
(22) మరియు స్వర్గ వాసులు స్వర్గములో,నరక వాసులు నరకంలో ప్రవేశించేటప్పుడు ఇబ్లీసు (షైతాను) ఇలా అంటాడు : నిశ్చయంగా అల్లాహ్ మీకు సత్యమైన వాగ్ధానం చేశాడు. అయితే ఆయన మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేశాడు. మరియు నేను మీకు అసత్యమైన వాగ్ధానము చేశాను. మరియు నేను మీకు చేసిన వాగ్ధానమును పూర్తి చేయలేదు. మరియు నేను మిమ్మల్ని ఇహలోకంలో అవిశ్వాసముపై,అప మార్గముపై బలవంతం చేయటానికి నాకు ఎటువంటి శక్తి ఉండేది కాదు. కాని నేను మిమ్మల్ని అవిశ్వాసం వైపునకు పిలిచాను. మరియు నేను మీ కొరకు అవిధేయ కార్యాలను అలంకరించి చూపాను. అప్పుడు మీరు నన్ను అనుసరించటంలో తొందరపడ్డారు. అయితే మీరు మీకు కలిగిన అప మార్గమునకు నన్ను నిదించకండి,మీరు మిమ్మల్నే నిందించుకోండి. అది నిందించుకోవాటానికి సరైనది. నేను మీ నుండి శిక్షను తొలగించడానికి మీకు సహాయపడలేను. మరియు మీరు నా నుండి దాన్ని తొలగించటానికి నన్ను సహాయపడలేరు. నిశ్చయంగా నేను మీరు నన్ను ఆరాధనలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటమును తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా ఇహలోకంలో అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ద్వారా మరియు ఆయనను అవిశ్వసించటం ద్వారా దుర్మార్గమునకు పాల్పడిన వారి కొరకు బాధాకరమైన శిక్ష ప్రళయదినాన వారి కొరకు నిరీక్షిస్తుంది.
(23) దుర్మార్గుల పరిణామముకు విరుద్ధంగా విశ్వసించి సత్కర్మలు చేసుకున్న వారిని భవనముల,వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహించే స్వర్గ వనాల్లో ప్రవేశింపబడటం జరుగుతుంది. వారు వాటిలో తమ ప్రభువు ఆదేశముతో మరియు అతని చుట్టు ఎల్లప్పుడు శాస్వతంగా ఉంటారు. వారు ఒకరినొకరు సలాం చేసుకుంటూ పలకరించుకుంటారు. మరియు దైవదూతలు వారిని సలాం తో పలకరిస్తారు.మరియు పరిశుద్ధుడైన వారి ప్రభువు మీకు శాంతి కలగు గాక అని ఆహ్వానిస్తాడు.
(24) ఓ ప్రవక్తా కలిమయె తౌహీద్ అయిన (ఏకేశ్వర వాక్యము అయిన) లా ఇలాహ ఇల్లల్లాహ్ ను తన మంచి వ్రేళ్ళతో నీళ్ళను త్రాగుతూ భూమి లోపల పాతుకు పోయిన మంచి చెట్టైన ఖర్జూరపు చెట్టుతో అల్లాహ్ ఎలా పోల్చాడో మీకు తెలియదా. మరియు దాని శాఖలు ఎత్తుగా ఆకాశము వైపునకు ఎదిగి మంచును త్రాగుతుంటాయి మరియు మంచి గాలిని పీలుస్తుంటాయి.
(25) ఈ మేలు జాతి వృక్షము తన ప్రభువు ఆదేశంతో అన్ని వేళల్లో తన మంచి ఫలాలను ఇస్తుంది. మరియు పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలకు వారు హితబోధన గ్రహిస్తారని ఆశిస్తూ ఉదాహరణలు ఇస్తుంటాడు.
(26) చెడ్డదైన షిర్క్ పదము పోలిక చెడ్డ వృక్షముతో కలిగి ఉన్నది. అది ఉమ్మెత్త వృక్షము. అది తన వ్రేళ్ళ సమేతంగా పెకలించబడింది. దానికి నేల పై స్థిరత్వము లేదు.మరియు ఆకాశము వైపు ఎదుగుదల ఉండదు. అయితే అది చనిపోతుంది. మరియు దాన్ని గాలి ఎత్తుకు పోతుంది. అవిశ్వాస పదము దాని గతి వినాశనము. మరియు దానికి పాల్పడేవాడి కొరకు సత్కర్మ అల్లాహ్ వైపునకు ఎక్కదు.
(27) అల్లాహ్ విశ్వాసపరులను ఇహలోకజీవితంలో వారు విశ్వాస స్థితిలో మరణించేవరకు స్థిరమైన తౌహీద్ కలిమా ద్వారా సంపూర్ణ విశ్వాసంలో స్థిరత్వమును ప్రసాధిస్తాడు మరియు వారి సమాధుల్లో బర్జఖ్ లో ప్రశ్నాజవాబుల సమయంలో మరియు వారికి ప్రళయ దినాన స్థిరత్వమును ప్రసాధిస్తాడు. మరియు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయనను అవిశ్వసించిన వారిని అల్లాహ్ సరైన మార్గము నుండి,సన్మార్గము నుండి తప్పిస్తాడు. మరియు అల్లాహ్ తాను ఎవరిని తన న్యాయ బధ్ధంగా అపమార్గమునకు లోను చేయదలచుకుంటాడో,మరియు ఎవరిని తన అనుగ్రహము ద్వారా సన్మార్గము చూపదలచుకుంటాడో చేసి తీరుతాడు. పరిశుద్ధుడైన ఆయనను ఎవరు బలవంతం చేయలేరు.
(28) ఖురైష్ హరమ్ ప్రాంతములో భద్రత ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను వారిలో ప్రవక్తగా పంపించటం ద్వారా తమకు అల్లాహ్ కలిగించిన అనుగ్రహమును నిరాకరించినప్పుడు వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను అవిశ్వసించిన వారి స్థితిని మీరు చూశారు. వారు వీటిని నిరాకరించారు : ఆయన తన ప్రభువు వద్ద నుండి వారి వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించినప్పుడు అతని అనుగ్రహములను తిరస్కరించటం.మరియు వారు తమ జాతుల వారిలోంచి తమను అనుసరించిన వారిని అవిశ్వాసంలో దించి వినాశ గృహంలోకి నెట్టి వేశారు.
(29) మరియు వినాశన గృహము అది నరకము.అందులో వారు ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తారు. వారి నివాసము ఎంతో చెడ్డదైన నివాసము.
(30) మరియు ముష్రికులు అల్లాహ్ మార్గము నుండి భ్రష్టులైన తరువాత తమను అనుసరించిన వారిని అల్లాహ్ మార్గము నుండి తప్పించటానికి అల్లాహ్ కొరకు సమానులుగా,సామ్యములుగా తయారు చేసుకున్నారు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మీకు ఉన్న మనోవాంచనల ద్వారా,ఇహలోకములో సందేహాలను వ్యాపించటం ద్వారా ప్రయోజనం చెందండి. ఎందుకంటే ప్రళయ దినాన మీరు మరలి వెళ్లవలసిన స్థానం నరకాగ్ని.మీకి అది తప్ప ఇంకొకటి మరలి వెళ్లే ప్రదేశం లేదు.
(31) ఓ ప్రవక్తా మీరు విశ్వాసపరులతో ఇలా పలకండి : ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పరిపూర్ణ రీతిలో పాటించండి. మరియు మీరు విధిగావించబడిన,స్వచ్ఛందమైన దాన ధర్మాలను మీ వద్దకు ఎటువంటి బేరము లేని,అల్లాహ్ శిక్షకు పరిహారం చెల్లించటానికి ఎటువంటి పరిహారము లేని,తన మితృని కొరకు సిఫారసు చేయటానికి ఎటువంటి మిత్ర సహాయము లేని దినము రాక ముందే మీకు అల్లాహ్ ప్రసాధించిన వాటిలో నుంచి ప్రదర్శనా బుద్ధితో భయపడుతూ గోప్యంగాను,మిమ్మల్ని ఇతరులు అనుసరించటానికి బహిరంగంగాను ఖర్చు చేయండి.
(32) అల్లాహ్ యే పూర్వ నమూనా లేకుండా ఆకాశములను సృష్టించాడు మరియు భూమిని సృష్టించాడు. మరియు ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడు. మరియు ఆ కురిసిన నీటి ద్వారా మీ కొరకు ఆహారముగా రకరకాల ఫలాలను వెలికి తీశాడు.ఓ ప్రజలారా ఆయన నీటిపై నడుస్తున్న ఓడలను తన అభీష్టం మేరకు మీకు వశపరచాడు. మరియు ఆయన నదులను మీ కొరకు మీరు వాటి నుండి త్రాగటానికి మరియు మీ పశువులకు,మీ పంటపొలాలకు త్రాపించటానికి వశపరచాడు.
(33) మరియు ఆయన సూర్య చంద్రులను నిరంతరం పయనించే విధంగా మీకి వశపరచాడు. మరియు రాత్రింబవళ్ళను అవి ఒక దాని వెనుక ఒకటి వచ్చే విధంగా మీకు వశపరచాడు. రాత్రిని మీ నిద్ర కొరకు,మీ ఉపశమనము కొరకు మరియు పగలును మీ కార్యచరణ,మీ శ్రమ కొరకు చేశాడు.
(34) మరియు మీరు ఆయనతో అడిగినవన్ని,ఆయనతో అడగనివి ఆయన మీకు ప్రసాధించాడు. మరియు ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రరహాలను లెక్కించినా అవి అధికముగా ,ఎక్కువగా ఉండటం వలన మీరు వాటిని లెక్కించజాలరు. అయితే మీకు తెలియపరచిన ఈ కొన్ని ఉదాహరణల్లోంచివి. నిశ్చయంగా మానవుడు తన స్వయం పై దుర్మార్గమునకు పాల్పడేవాడును,మహోన్నతుడైన పరిశుద్ధుడైన అల్లాహ్ అనుగ్రహాలను ఎక్కువగా నిరాకరించేవాడును.
(35) ఓ ప్రవక్తా నేను ఇబ్రాహీం కుమారుడు ఇస్మాయీల్ మరియు అతని తల్లి హాజిరాను మక్కా లోయలో నివాసం కలిగించిన తరువాత ఆయన ఇలా పలకినప్పటి సంఘటనను మీరు గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నేను నా ఇంటి వారిని నివాసంగా ఏర్పరచిన ఈ నగరము మక్కాను ఇందులో ఎటువంటి రక్తపాతము లేకుండా,ఇందులో ఎవరు దుర్మార్గమునకు పాల్పడకుండా నీవు శాంతి గల నగరముగా చేయి. మరియు నీవు నన్ను,నా సంతానమును విగ్రహారాధన నుండి దూరంగా ఉంచు.
(36) ఓ నా ప్రభువా నిశ్చయంగా ఈ విగ్రహాలు చాలా మంది ప్రజలు వాటిని తమ కొరకు సిఫారసు చేస్తాయని భావించినప్పుడు అవి వారిని అపమార్గమునకు గురి చేశాయి. వారు వాటి ద్వారా పరీక్షించబడ్డారు. వారు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించారు. అయితే ఎవరైతే అల్లాహ్ ఏకత్వము విషయంలో,ఆయనకు విధేయత చూపటంలో నన్ను అనుసరిస్తాడో నిశ్చయంగా అతను నా వర్గములోంచివాడు మరియు నన్ను అనుసరించిన వారిలోంచి వాడు. మరియు ఎవరైతే నా పై అవిధేయత చూపి ఆయన ఏకత్వం విషయంలో,ఆయనపై విధేయత చూపటంలో నన్ను అనుసరించడో ఓ నా ప్రభువా నిశ్చయంగా నీవు కోరిన వారి పాపములను మన్నించదలచుకుంటే మన్నించేవాడివి,వారిపై కనికరించేవాడివీ నీవే.
(37) ఓ నా ప్రభువా నిశ్చయంగా నేను నా సంతానములో కొందరైన ఇస్మాయీలు,అతని కుమారులను నీ పవిత్ర గృహం దగ్గర ఎటువంటి పంటపొలాలు లేని,ఎటువంటి నీరు లేని ఒక లోయలో ( అది మక్కా ప్రాంతం) నివాసమేర్పరచాను. ఓ మా ప్రభువా అక్కడ వారు నమాజు నెలకొల్పడం కొరకు దాని దగ్గర నేను వారిని నివాసమేర్పరచాను. ఓ నా ప్రభువా అయితే నీవు ప్రజల హృదయాలను వారి వైపునకు ఈ నగరం వైపునకు ఆకర్షింపజేయి (మరల్చు).మరియు నీవు వారిపై అనుగ్రహించిన వాటి గురించి నీకు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ వారికి ఫలాలను జీవనోపాధిగా ప్రసాధించు.
(38) ఓ మా ప్రభువా నిశ్చయంగా నీవు మేము గోప్యంగా ఉంచే ప్రతీ దాన్ని మరియు మేము బహిరంగ పరచే ప్రతీ దాన్ని తెలుసుకుంటావు. మరియు భూమిలో కాని ఆకాశములో కాని అల్లాహ్ పై ఏదీ గోప్యంగా ఉండదు. కాని ఆయన వాటిని తెలుసుకుంటాడు. అయితే ఆయన యందు మన అవసరము,మన పేదరికం గోప్యంగా ఉండదు.
(39) నాకు నీతిమంతులను అనుగ్రహించమని నా ప్రార్ధనను స్వీకరించిన ఆ అల్లాహ్ కు కృతజ్ఞతలు,స్థుతులు. అప్పుడు ఆయన నాకు నా వృద్ధాప్యంలో కూడా హాజరతో ఇస్మాయీలును,సారాతో ఇస్హాఖ్ ను ప్రసాధించాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన నా ప్రభువు తనను అర్ధించే వారి అర్ధనలను ఆలకిస్తాడు.
(40) ఓ నా ప్రభువా నీవు నన్ను పరిపూర్ణ రీతిలో నమాజును పాటించేవాడిగా చేయి. నా సంతానమును కూడా అలాగే దాన్ని పాటించేవారిగా చేయి. ఓ మా ప్రభువా నీవు నా ప్రార్ధనను స్వీకరించు మరియు దాన్ని నీ వద్ద స్వీకరించబడేటట్లు చేయి.
(41) ఓ మా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నా తండ్రి పాపములను మన్నించు. (తన తండ్రి అల్లాహ్ కు బద్ధ శతృవు అని తనకు తెలవక ముందు పలికిన మాటలు ఇవి.ఎప్పుడైతే అతను అల్లాహ్ కు శతృవు అని అతనికి స్పష్టమైనదో ఆయన అతని నుండి విసుగును చూపారు). మరియు ప్రజలు తమ ప్రభువు ముందు తమ లెక్క తీసుకోవటం కొరకు నిలబడే రోజున విశ్వాసపరుల కొరకు వారి పాపములను మన్నించు.
(42) ఓ ప్రవక్తా అల్లాహ్ దుర్మార్గుల శిక్షకు గడువు ఇచ్చినప్పుడు ఆయన దుర్మార్గులు పాల్పడే కార్యాలైన తిరస్కారము,అల్లాహ్ మార్గము నుండి ఆపటం మరియు ఇతర వాటి నుండి నిర్లక్ష్యంగా ఉన్నాడని మీరు భావించకండి. కాని ఆయనకు అవి తెలుసు. వాటిలోంచి ఏది కూడా ఆయనకు గోప్యంగా ఉండదు. ఆయన మాత్రం వారి శిక్షకు ప్రళయ దినం వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు కళ్ళు తాము చూసిన భయానక పరిస్థితుల నుండి భయం వలన పైకి లేస్తాయి.
(43) అప్పుడు ప్రజలు తమ సమాదుల నుండి లేచి పిలుపునిచ్చే వారి వైపు తొందర చేస్తూ తమ తలలను పైకి ఎత్తి ఆందోళనతో ఆకాశం వైపు చూస్తూ వెళతారు. వారి చూపులు వారి వైపు మరలవు. కాని అవి వారు చూసిన భయానక పరిస్థితుల వలన విచ్చుకున్నట్లుగా ఉండిపోతాయి. వారి హృదయములు భయానక సన్నివేశము వలన అర్ధం చేసుకో లేక,గ్రహించ లేక శూన్యంగా ఉండిపోతాయి.
(44) ఓ ప్రవక్త మీరు మీ జాతి వారిని ప్రళయదినము నాడు అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. అప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయనతోపాటు సాటి కల్పించటం ద్వారా తమపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు మాకు గడువునిచ్చి ,మా నుండి శిక్షను తొలగించి, మమ్మల్ని కొంత కాలం వరకు ఇహలోకము వైపునకు మరల్చు మేము నీపై విశ్వాసమును కనబరుస్తాము.మరియు నీవు మా వైపు పంపించిన ప్రవక్తలను అనుసరిస్తాము. అప్పుడు వారిని మందలిస్తూ వారికి ఇలా సమాధానం ఇవ్వబడుతుంది : ఏమీ మీరు ఇహలోక జీవితంలో మరణాంతరం లేపబడటంను నిరాకరిస్తూ మీకు ఇహలోకము నుండి పరలోకమునకు మరలటం అన్నది లేదని ప్రమాణం చేయలేదా ?.
(45) మరియు మీకన్నా మునుపు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి తమపై దుర్మార్గమునకు పాల్పడిన పూర్వ జాతులైన హూద్ జాతి,సాలిహ్ జాతి లాంటి వారి నివాసముల్లో మీరు నివాసమున్నారు. మేము వారిపై కలిగించిన వినాశనము మీకు స్పష్టమైనది. మరియు మేము మీరు హితోపదేశం గ్రహించటానికి అల్లాహ్ గ్రంధములో మీకు ఉపమానములను తెలియపరచాము. కాని మీరు వాటి ద్వారా హితోపదేశం గ్రహించలేదు.
(46) దుర్మార్గ జాతుల వారి నివాసముల్లో దిగిన వీరందరు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును హతమార్చటానికి,ఆయన సందేశ ప్రచారమును నిర్మూలించటానికి కుట్రలు పన్నారు. వారి కుట్రల గురించి అల్లాహ్ కు తెలుసు. ఆయనపై ఏది గోప్యంగా ఉండదు. వీరందరి వ్యూహము బలహీనమైనది. మరియు అది తన బలహీనత వలన వారిపట్ల ఉన్న అల్లాహ్ వ్యూహమునకు విరుద్ధంగా ఏ పర్వతమును గాని ఇతర వాటిని గాని జరపలేవు.
(47) ఓ ప్రవక్తా అల్లాహ్ తన ప్రవక్తలకు సహాయం చేస్తాడని,ధర్మమును ఆధిక్యతను ప్రసాధిస్తాడని తన ప్రవక్తలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చడని మీరు భావించకండి. నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యుడు,ఆయనపై ఎవరు ఆధిక్యతను చూపలేరు.మరియు ఆయన తన స్నేహితులకు ఆధిక్యతను ప్రసాధిస్తాడు. తన శతృవులను,తన ప్రవక్త శతృవులను కఠినంగా ప్రతీకారం తీసుకునే వాడు.
(48) ఈ ప్రతీకారము అవిశ్వాసపరులకి ప్రళయదినం స్థాపతమయ్యే రోజు కలుగుతుంది.ఆ రోజు ఈ భూమి తెల్లటి,స్వచ్ఛమైన మరొక భూమిగా మార్చబడుతుంది. మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మార్చబడుతాయి. మరియు తన రాజరికంలో,తన మహోన్నత్యంలో ఒకే ఒక్కడైన,ఆధిక్యతను చూపేవాడు తనపై ఎవరు ఆధిక్యతను చూపని వాడు,ఓడించే వాడు,తనను ఎవరు ఓడించని వాడైన అల్లాహ్ ముందు నిలబడడానికి తమ శరీరములతో,తమ కర్మలతో తమ సమాదుల నుండి ప్రజలు బయటకు వస్తారు.
(49) ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి. అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు. వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి. వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం). మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.
(50) ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి.అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు.వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి.వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం).మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.
(51) అల్లాహ్ ప్రతీ ప్రాణి చేసుకున్న మంచి లేదా చెడుకి ప్రతిఫలం ప్రసాధించటానికి . నిశ్చయంగా అల్లాహ్ కర్మల యొక్క లెక్క తీసుకోవటంలో శీఘ్రుడు.
(52) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి ప్రజలకు ఒక నివేదిక. మరియు అందులో ఉన్న బెదిరింపులు,తీవ్ర హెచ్చరికల ద్వారా వారు భయపెట్టబడటానికి మరియు వారు అల్లాహ్ ఒక్కడే సత్య ఆరాధ్య దైవము అని తెలుసుకుని వారు ఆయననే ఆరాధించి ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండటానికి. మరియు ఇంగిత జ్ఞానం కలవారు (మంచి బుద్ధి కలవారు) దీని ద్వారా హితోపదేశం గ్రహించటానికి మరియు గుణపాఠం నేర్చుకోవటానికి. ఎందుకంటే వారే హితబోధనల ద్వారా,గుణపాఠాల ద్వారా ప్రయోజనం చెందుతారు.