(1) {అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. ఉన్నతమైన స్థానము కల ఈ ఆయతులు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడ్డాయి అనటము పై నిరూపిస్తున్నాయి. ఇవి ఏకేశ్వరోపాసన,ధర్మ శాసనాలను స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.
(2) అవిశ్వాసపరులు వారికి విషయం స్పష్టమైనప్పుడే,ఇహలోకములో వారు పాల్పడిన అవిశ్వాసము అసత్యమని తేటతెల్లమైనప్పుడే వారు ముస్లిములైపోతే బాగుండేదని ప్రళయదినాన ఆశిస్తారు.
(3) ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరిని పశువుల్లాగా తింటూఉండగా మరియు అంతమైపోయే ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తుండగా వదిలివేయండి. మరియు సుదీర్ఝ ఆశలు వారిని విశ్వాసము నుండి సత్కర్మల నుండి దూరం చేస్తాయి. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో వచ్చినప్పుడు వారు ఉన్నది నష్టం లోనే అని తెలుసుకుంటారు.
(4) మరియు మేము దుర్మార్గులైన బస్తీల్లోంచి ఏదైన బస్తీ పై వినాశనమును దించితే దాని కొరకు నిర్ణీత గడువు అల్లాహ్ జ్ఞానంలో ఉంటుంది. అది దాని నుండి ముందూ జరగదు వెనుకకు నెట్టబడదు.
(5) జాతుల వారిలోంచి ఏ జాతిపై దాని వినాశనము దాని గడువు సమయం రాక ముందు రాదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు దాని నుండి వినాశనము వెనుకకు నెట్టడం జరగదు. అయితే దుర్మార్గులు అల్లాహ్ వారికి ఇచ్చిన గడువుతో మోసపోకూడదు.
(6) మక్కా వాసుల్లోంచి అవిశ్వాసపరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికారు : ఓ తనపై ఖుర్ఆన్ అవతరింపబడినది అని వాదించేవాడా నిశ్చయంగా నీవు నీ ఈ వాదనలో పిచ్చాళ్ళ మరలే లాగా మరలుతున్న పిచ్చివాడువు.
(7) నీవు సత్యవంతుల్లోంచి అయితే నీవు పంపించబడ్డ సందేశహరుడని మరియు మాపై శిక్ష అవతరిస్తుందని నీ కొరకు సాక్ష్యం పలికే దైవదూతలను మా వద్దకు ఎందుకని తీసుకునిరావు.
(8) అల్లాహ్ ఎవరైతే దైవదూతలు రావాలని ఆయనకు సూచించారో వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : శిక్ష ద్వారా మిమ్మల్ని వినాశనమునకు గురి చేసే సమయం ఆసన్నమయినప్పుడు జ్ఞానం ద్వారా అవసరమయ్యే దాని ప్రకారం తప్ప మేము దైవదూతలను దించము. మేము దైవదూతలను తీసుకుని వచ్చినప్పుడు వారు విశ్వసించకుండా ఉంటే వారు గడువు ఇవ్వబడిన వారిలోంచి అవ్వరు. అంతే కాక వారు శీఘ్రంగా శిక్షకు గురి అవుతారు.
(9) నిశ్చయంగా మేమే ఈ ఖుర్ఆన్ ను ప్రజల కొరకు హితబోధనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై అవతరింపజేశాము. మరియు మేమే ఖుర్ఆన్ ను హెచ్చు,తగ్గులు మరియు మార్పు,చేర్పుల నుండి పరిరక్షించే వాళ్ళము.
(10) మరియు ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మీకన్న ముందు పూర్వ అవిశ్వాసపరులైన వర్గాల్లో ప్రవక్తలను పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు. అయితే మీ జాతి వారు మీకు తిరస్కరించటంలో ప్రవక్తల్లోంచి మీరు కొత్త కాదు.
(11) పూర్వ అవిశ్వాసపరుల వర్గాల వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్ని తిరస్కరించారు. మరియు వారు అతన్ని పరిహసించారు.
(12) ఈ జాతుల వారి హృదయముల్లో మేము తిరస్కారమును ప్రవేశపెట్టినట్లే దాన్ని అలాగే మేము మక్కా బహుదైవారాధకుల హృదయాల్లో వారి విముఖత ద్వారా మరియు వారి మొండితనము ద్వారా ప్రవేశపెడతాము.
(13) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను వారు విశ్వసించటం లేదు. తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించిన వారిని వినాశనంచేసే విషయంలో అల్లాహ్ సంప్రదాయం జరిగింది. అయితే మిమ్మల్ని తిరస్కరించేవారు గుణపాఠం నేర్చుకోవాలి.
(14) ఈ తిరస్కారులందరు మొండి పట్టుదల కలిగి ఉంటారు చివరికి ఒక వేళ స్పష్టమైన ఆధారాలతో సత్యము వారి ముందు స్పష్టమైనా అప్పుడు ఒక వేళ మేము వారి కొరకు ఆకాశములో ఒక ద్వారాన్ని తెరిస్తే వారు ఎక్కుతూ పోతూ కూడా
(15) వారు నమ్మలేదు.మరియు వారు ఇలా పలికారు : కేవలం మా కళ్ళు చూపు నుండి బంధించబడ్డాయి.అంతే కాదు మేము చూసినది మంత్రజాల ప్రభావము. అప్పుడు మేము మంత్రజాలము చేయబడ్డాము.
(16) మరియు నిశ్చయంగా మేము ప్రజలు భూమిలో,సముద్రములో తమ ప్రయాణముల్లో దారిని పొందే పెద్ద పెద్ద నక్షత్రాలను ఆకాశములో సృష్టించాము. మరియు దాన్ని చూసేవారి కొరకు,దాన్ని దర్శించేవారి కొరకు వారు దాని ద్వారా పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యము పై ఆధారమును పొందటం కొరకు దానిని అందముగా చేశాము.
(17) మరియు మేము ఆకాశమును అల్లాహ్ కారుణ్యము నుంచి బహిష్కరించబడిన ప్రతీ షైతాను నుండి రక్షించాము.
(18) కానీ ఎవరైతే మలయిల్ ఆలా దైవ దూతలను దొంగ చాటుగా వింటాడో అతడిని కాంతివంతమైన అగ్ని జ్వాల వెంటాడుతుంది. మరియు అతన్ని దహించివేస్తుంది.
(19) మరియు మేము భూమిని ప్రజలు దానిపై నివాసం ఏర్పరచుకోవటం కొరకు విస్తరింపజేశాము.మరియు అది ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా ఉండటానికి అందులో మేము స్థిరమైన పర్వతాలను నాటాము.మరియు అందులో విజ్ఞతను నిర్ణయిచటం ద్వారా నిర్ధారించబడిన,నిర్ణయించబడిన రకరకాల మొక్కలను మొలకెత్తించాము.
(20) ఓ ప్రజలారా మేము మీ కొరకు ఇహలోకములో మీరు జీవించి ఉన్నంత వరకు మీకు జీవనాన్ని కలిగించే తినే వస్తువులను,త్రాగే వస్తువులను భూమిలో తయారు చేశాము. మీరే కాకుండా ప్రజల్లోంచి,జంతువుల్లోంచి వారికి జీవనాన్ని కలిగించే ఆహారోపాధిని మీరు ఏర్పాటు చేయలేని వారి కొరకు మేము తయారు చేశాము.
(21) మరియు ప్రజలు,పశువులు ప్రయోజనం చెందే వస్తువులను సృష్టించటంలో,వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం చేయటంలో మేమే సామర్ధ్యం కలవారము.మరియు వాటిలో నుంచి మేము సృష్టించే వాటిని మా విజ్ఞత మరియు మా ఇచ్ఛ నిర్ణయించే నిర్ణీత పరిణామం ద్వారా మాత్రమే మేము సృష్టిస్తాము.
(22) మరియు మేము మేఘములను సంపర్కముచేసే గాలులను పంపాము. అప్పుడు వాటి ద్వారా సంపర్కము చెందిన మేఘముల ద్వారా మేము వర్షమును కురిపించాము. మేము మీకు వర్షపు నీటిని త్రాపించాము. ఓ ప్రజలారా మీరు ఈ నీటిని సెలయేర్లు,బావులు అవటానికి భూమిలో నిల్వచేయలేరు. అల్లాహ్ మాత్రమే దానిని అందులో నిల్వచేస్తాడు.
(23) మరియు నిశ్చయంగా మేము మృతులను ఉనికిలో లేని స్థితి నుండి వారిని సృష్టించటం ద్వారా,వారిని మరణం తరువాత లేపటం ద్వారా జీవింప చేశాము. మరియు జీవించి ఉన్నవారిని వారి గడువు పూర్తయిన తరువాత మేము మరణింపజేస్తాము.మరియు మేమే భూమికి,దానిపై ఉన్న వాటికి వారసులుగా మిగులుతాము.
(24) వాస్తవానికి మీలో నుండి పుట్టుకలో,మరణంలో ముందు గతించిన వారి గురించి మాకు తెలుసు.ఆ రెండింటిలో తరువాత వచ్చే వారి గురించి మాకు తెలుసు.అందులో నుంచి ఏదీ మాపై గోప్యంగా లేదు.
(25) ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు సత్కర్మలు చేసిన వాడికి అతని సత్కర్మకు దుష్కర్మకు పాల్పడే వాడికి అతని దుష్కర్మకు ప్రతిఫలమును ప్రసాదించటానికి వారందరిని ప్రళయదినాన సమావేశపరుస్తాడు. నిశ్చయంగా ఆయన తన పర్యాలోచనలో వివేచనాపరుడు. ఆయనపై ఏదీ గోప్యంగా లేని సర్వజ్ఞుడు.
(26) మరియు నిశ్చయంగా మేము ఆదమ్ ను పొడి బంకమట్టితో సృష్టించాము. ఒక వేళ దాన్ని తట్టితే శభ్ధం చేస్తుంది.మరియు అతను సృష్టించబడిన ఈ మట్టి నల్లనిది, అది ఎక్కువ కాలం ఉండిపోవటం వలన వాసన మారిపోయింది.
(27) మరియు మేము జిన్నుల తండ్రిని ఆదం అలైహిస్సలాంను సృష్టించక మునుపు తీవ్ర వేడి గల అగ్నితో సృష్టించాము.
(28) ఓ ప్రవక్తా నీ ప్రభువు దైవ దూతలతో మరియు వారితోపాటు ఉన్న ఇబ్లీసుతో ఇలా పలకినప్పటి వైనమును నీవు గుర్తు చేసుకో : నిశ్చయంగా నేను తట్టినప్పుడు మ్రోగే,వాసనను మార్చే నల్లటి పొడి బంక మట్టితో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
(29) నేను అతని రూపమును చక్కదిద్ది అతన్ని సృష్టించటంను పూర్తి చేసినప్పుడు మీరు నా ఆదేశమును పాటిస్తూ,అతనికి నమస్కరిస్తూ అతనికి సాష్టాంగపడండి.
(30) అప్పుడు దైవదూతలందరు తమ ప్రభువు తమకు ఆదేశించినట్లే ఆయనకి సాష్టాంగపడి విధేయత చూపారు.
(31) కాని దైవదూతలతోపాటు ఉండి కూడా వారిలో నుంచి కాని ఇబ్లీసు దైవదూతలతోపాటు ఆదంకి సాష్టాంగపడటం నుండి నిరాకరించాడు.
(32) ఇబ్లీసు ఆదంనకు సాష్టాంగపడటం నుండి ఆగిపోయిన తరువాత అల్లాహ్ ఇబ్లీసుతో ఇలా పలికాడు : నా ఆదేశమునకు కట్టుబడి సాష్టాంగపడిన దైవదూతలతోపాటు నీవు సాష్టాంగ పడటం నుండి ఏది నిన్ను ఆపినది,నిన్ను ఏది ప్రేరేపించినది ?.
(33) ఇబ్లీసు అహంకారముతో ఇలా సమాధానమిచ్చాడు : నీవు పొడిమట్టితో అది కూడా నల్లగా మారిన బంకమట్టితో సృష్టించిన ఒక మానవునికి నేను సాష్టాంగపడటం నాకు తగదు.
(34) అల్లాహ్ ఇబ్లీసుకు ఇలా ఆదేశమిచ్చాడు : నీవు స్వర్గము నుండి వెళ్ళిపో. నిశ్చయంగా నీవు ధూత్కరించబడ్డావు.
(35) నిశ్చయంగా నీపై శాపము,నా కారుణ్యము నుండి ధూత్కారము ప్రళయదినం వరకు ఉంటుంది.
(36) ఇబ్లీసు ఇలా వేడుకున్నాడు : ఓ నా ప్రభువా నీవు మానవులు తిరిగి లేపబడే దినం వరకు నాకు మరణం కలిగించకుండా గడువును ప్రసాధించు.
(37) అల్లాహ్ అతనికి ఇలా సమాధానమిచ్చాడు : నిశ్చయంగా నీవు నేను ఆయుషును వెనుకకు చేసిన గడువు ఇవ్వబడిన వారిలోంచివి.
(38) మొదటి శంఖం ఊదినప్పుడు సృష్టితాలన్ని మరణించే సమయం వరకు.
(39) ఇబ్లీసు ఇలా పలికాడు : ఓ నా ప్రభువా నీవు నన్ను అపమార్గమునకు గురి చేసినందుకు నేను భూమిలో వారి కొరకు దుష్కర్మలను మంచిగా చూపిస్తాను.మరియు వారందరిని సన్మార్గము నుండి తప్పిస్తాను.
(40) నీవు నీ ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న నీ దాసులను తప్ప.
(41) అల్లాహ్ ఇలా సమాధానమిచ్చాడు : ఇది నన్ను చేరే సన్మార్గము.
(42) నిశ్చయంగా మార్గ భ్రష్టుల్లోంచి నిన్ను అనుసరించిన వారు తప్ప నా ప్రత్యేక దాసులకు అపమార్గమునకు లోను చేసె అధికారము కాని ఆధిక్యత కాని నీకు లేదు.
(43) నిశ్చయంగా ఇబ్లీసు కొరకు మరియు అతన్ని అనుసరించిన మార్గ భ్రష్టులందరి కొరకు వాగ్ధానం చేయబడిన చోటు నరకము.
(44) నరకము కొరకు ఏడు ద్వారములు కలవు. వారు వాటిలో నుండి ప్రవేశిస్తారు. దాని ద్వారముల్లోంచి ప్రతి ద్వారము ద్వారా ఇబ్లీసును అనుసరించే వారిలో నుంచి ప్రత్యేకించబడి నిర్ధారించబడిన వారు ప్రవేశిస్తారు.
(45) నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ దైవభీతి కలిగిన వారు స్వర్గవనాల,సెలయేరుల మధ్య ఉంటారు.
(46) అందులో ప్రవేశించేటప్పుడు వారితో ఇలా అనబడుతుంది : మీరు అందులో ఆపదల నుండి నిశ్చింతగా,భయాందోళనల నుండి సురక్షితంగా ఉండి ప్రవేశించండి.
(47) మేము వారి హృదయముల్లో కల ద్వేషమును,శతృత్వమును తొలగించాము. ఒకరినొకరు ప్రేమించుకునే సోధరులు పీఠాలపై కూర్చుని ఒకరినొకరు చూసుకుంటుంటారు.
(48) అందులో వారికి ఎటువంటి అలసట కలుగదు. మరియు వారిని అక్కడ నుండి వెళ్ళకొట్టడం జరగదు. కానీ వారు అందులో శాస్వతంగా ఉంటారు.
(49) ఓ ప్రవక్తా నిశ్చయంగా నేనే వారిలోంచి పశ్చాత్తాప్పడే వాడిని మన్నించే వాడునని, వారి పై కరుణించే వాడునని నా దాసులకు నీవు తెలియజేయి.
(50) మరియు నా శిక్షే బాధాకరమైన శిక్ష అని వారికి తెలియజేయి. అయితే వారు నా మన్నింపును పొందటానికి,నా శిక్ష నుండి రక్షణను పొందటానికి పశ్చాత్తాప్పడాలి.
(51) మరియు వారికి ఇబ్రాహీం అలైహిస్సలాంకు కుమారుడి శుభవార్త ఇవ్వటానికి,లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి వచ్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం అతిధులైన దైవదూతల వార్తను నీవు వారికి తెలియజేయి.
(52) వారు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతనితో సలాం (నీపై అల్లాహ్ శాంతి కురియుగాక) పలికారు.ఆయన కూడా వారు చేసిన సలాంనకు మంచిగా ప్రతిసలాం చేశారు. మరియు ఆయన వారి ముందట కాల్చబడిన ఒక గొర్రె పిల్లను వారు మనషులని భావించి వారు తినటానికి పెట్టారు. వారు దానిని తినకపోవటమును చూసి నిశ్చయంగా మేము మీతో భయపడుతున్నాము అన్నారు.
(53) దైవదూతలు ఇలా సమాధానమిచ్చారు : నీవు భయపడకు.నిశ్చయంగా మేము నీకు జ్ఞానవంతుడైన మగ సంతానము కలుగుతుందని నీకు సంతోషమును కలిగించే వార్తను ఇస్తున్నాము.
(54) ఇబ్రాహీమ్ తనకు కుమారుడు కలుగుతాడని వారిచ్చిన శుభవార్త వలన ఆశ్చర్య పడుతూ వారితో ఇలా పలికారు : ఏమీ మీరు నాకు కలిగిన వృద్ధాప్యంలో,ముసలితనంలో కుమారుడు కలుగుతాడని శుభవార్త ఇస్తున్నారా,అయితే మీరు నాకు ఏ ఆధారంతో శుభవార్తనిస్తున్నారు ?.
(55) దైవదూతలు ఇబ్రాహీంతో ఇలా పలికారు : మేము ఎటువంటి సందేహం లేని సత్యమైన శుభవార్తను నీకు ఇచ్చాము. అయితే మేము నీకు ఇచ్చిన శుభవార్తను గురించి నిరాశ చెందే వారిలో నీవు చేరకు.
(56) ఇబ్రాహీం ఇలా పలికారు : అల్లాహ్ ఋజు మార్గము నుండి మడమ త్రిప్పిన వారు తప్ప ఇంకెవరు తన ప్రభువు కారుణ్యము నుండి నిరాశ చెందుతారు ?.
(57) ఇబ్రాహీం ఇలా పలికారు : ఓ మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చిన దూతలారా మీకు మీ ఏ విషయం తీసుకుని వచ్చినది ?.
(58) దైవదూతలు ఇలా సమాధానమిచ్చారు : నిశ్చయంగా తీవ్ర ఉపద్రవాలను సృష్టించిన,మహా చెడులకు పాల్పడిన జాతి అయిన లూత్ జాతి వారిని తుదిముట్టించటానికి అల్లాహ్ మమ్మల్ని పంపించాడు.
(59) లూత్ ఇంటివారు,ఆయనను అనసరించిన విశ్వాసపరులు తప్ప.వారికి వినాశనము కలుగదు.నిశ్చయంగా మేము వారందరిని దాని నుండి రక్షిస్తాము.
(60) కాని అతని భార్య,నిశ్చయంగా ఆమె వెనుక ఉండిపోయి వినాశనం చెందే వారిలోంచి అయిపోతుందని మేము నిర్ణయించాము.
(61) పంపబడిన దైవదూతలు లూత్ వద్దకు మనుషుల రూపములో వచ్చినప్పుడు;
(62) లూత్ అలైహిస్సలాం వారితో మీరు పరిచయం లేని వ్యక్తులు అని పలికారు.
(63) దైవ దూతలు లూత్ తో ఓ లూత్ నీవు భయపడకు. నీ జాతి వారు సందేహిస్తున్న వారిని తుదిముట్టించే శిక్షను మేము నీ వద్దకు తీసుకుని వచ్చాము అని పలికారు.
(64) మేము ఎటువంటి పరిహాసము లేని సత్యాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చాము. నిశ్చయంగా మేము నీకు తెలియపరచిన విషయంలో సత్యవంతులము.
(65) అయితే నీవు రాత్రి కొంత భాగం గడిచిన తరువాత నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు,వారి వెనుకే నీవు పో. మీ లో నుంచి ఎవరూ వారికి ఏమి జరిగిందో చూడటానికి వెనుకకు తిరుగకూడదు. మీకు అల్లాహ్ ఎక్కడకు వెళ్లమని ఆదేశించాడో అటు వెళ్ళిపోండి.
(66) మరియు మేము నిర్ధారించుకున్న ఆ ఆదేశము అది ఈ జాతి వారందరు తెల్లవారే సరికి వారి చివరి వరకు సమూలంగా నిర్మూలించబడుతారన్నది మేము లూత్ అలైహిస్సలాంకు వహీ ద్వారా తెలియపరచాము.
(67) మరియు సదూమ్ వాసులు లూత్ అలైహిస్సలాం అతిధులతో అశ్లీల కార్యమును ఆశిస్తూ సంబరపడుతూ వచ్చారు.
(68) లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : వీరందరు నా అతిధులు.మీరు వారితో ఏది ఆశిస్తున్నారో దాని ద్వారా నా పరువు తీయకండి.
(69) మరియు మీరు ఈ అశ్లీల కార్యమును వదిలి వేసి అల్లాహ్ కి భయపడండి. మరియు మీ ఈ దుష్చర్య ద్వారా మీరు నన్ను అవమానపరచకండి.
(70) ప్రజల్లోంచి ఎవరిని చేర్చుకోవటం నుండి నిన్ను మేము వారించలేదా ? అని అతని జాతి వారు అతనితో అన్నారు.
(71) లూత్ అలైహిస్సలాం తన అతిధుల ముందు తన తరపు నుండి క్షమాపణ కోరుతూ వారితో ఇలా పలికారు : మీ మహిళలందరిలో నుంచి వీరు నా కుమార్తెలు. ఒక వేళ మీరు మీ కోరికలను తీర్చుకోవాలనుకుంటే వారిని వివాహం చేసుకోండి.
(72) ఓ ప్రవక్తా నీ జీవితం సాక్షి నిశ్చయంగా లూత్ జాతి తమ కామ కోరికల్లో హద్దు మీరి త్రోవ తప్పి తిరుగుతున్నారు.
(73) సూర్యోదయం అయ్యే సమయంలో వారు ప్రవేశించినప్పుడు ప్రాణాంతకమైన పెద్ద స్వరం వారిని పట్టుకున్నది.
(74) అప్పుడు మేము వారి బస్తీలను తలక్రిందులగా త్రిప్పి వేశాము. మరియు మేము వారిపై బంక మట్టితో తయారు చేయబడిన కంకర రాళ్ళను కురిపించాము.
(75) నిశ్చయంగా లూత్ జాతి వారిపై కురిసిన ఈ వినాశన ప్రస్తావనలో యోచన చేసే వారి కొరకు సూచనలు కలవు.
(76) నిశ్చయంగా లూత్ జాతి బస్తీలు రహదారి పైనే ఉన్నవి. వాటి వద్ద నుండి వెళ్ళే ప్రయాణికులు వాటిని చూస్తూ ఉంటారు.
(77) నిశ్చయంగా ఈ సంభవించిన దానిలో దాని ద్వారా గుణపాఠం నేర్చుకునే విశ్వాసపరుల కొరకు సూచన ఉన్నది.
(78) దట్టమైన వనవాసులు కల షుఐబ్ జాతి వారు అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన,తమ ప్రవక్త ను తిరస్కరించటం వలన దుర్మార్గులుగా ఉండేవారు.
(79) కావున వారికి శిక్ష పట్టుకున్నప్పుడు మేము వారి మీద ప్రతీకారం తీసుకున్నాము.నిశ్చయంగా లూత్ జాతి వారి బస్తీలు,షుఐబ్ జాతి వారి ప్రాంతములు ఒక ప్రధాన మార్గంలో ఉన్నవి దానిపై నడిచే వారి కొరకు.
(80) నిశ్చయంగా హిజాజ్ మరియు షామ్ (సిరియా) మధ్య కల ప్రాంతమైన హిజ్ర్ వాసులైన సమూద్ జాతివారు తమ ప్రవక్త అయిన సాలిహ్ అలైహిస్సలాంను ఎప్పుడైతే తిరస్కరించారో ప్రవక్తలందరిని తిరస్కరించారు.
(81) మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి ఏవైతే తీసుకుని వచ్చారో అందులో ఆయన నిజాయితీపై వాదనలను,ఆధారాలను మేము వారికి ప్రసాధించాము. ఒంటె వాటిలోంచిదే.కాని వారు ఆ ఆధారాలతో గుణపాఠం నేర్చుకోలేదు,వారు వాటి గురించి పట్టించుకోలేదు.
(82) మరియు వారు తమ కొరకు గృహాలను నిర్మించుకోవటానికి పర్వతాలను తొలిచేవారు. తాము భయపడే వాటి నుండి నిశ్చింతగా వాటిలో నివాసముండేవారు.
(83) వారిపై తెల్లవారుతుండగా భయంకర గర్జన శిక్ష వారిని పట్టుకుంది.
(84) అప్పుడు వారు సంపాదించుకున్న వారి సంపదలు,నివాసాలు అల్లాహ్ శిక్షను వారిపై నుండి తొలగించలేక పోయాయి.
(85) మరియు మేము భూమ్యాకాశములను,వాటిలో ఉన్న వాటన్నింటిని విజ్ఞత లేకుండా శూన్యంగా సృష్టించలేదు. మేము వాటన్నింటిని సత్యంతో మాత్రమే సృష్టించాము. మరియు నిశ్చయంగా ప్రళయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓ ప్రవక్తా మిమ్మల్ని తిరస్కరించిన వారి నుండి మీరు విముఖత చూపండి,వారిని ఉత్తమ రీతిలో మన్నించండి.
(86) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువే సర్వాన్ని సృష్టించి వాటి గురించి జ్ఞానం కలవాడు.
(87) నిశ్చయంగా మేము ఏడు ఆయతులు కల ఫాతిహాను మీకు అనుగ్రహించాము. మరియు అది మహోన్నతమైన ఖుర్ఆన్.
(88) అవిశ్వాసపరుల్లోంచి పలు వర్గాల వారికి మేము ఇచ్చిన అంతమైపోయే ప్రాపంచిక సంపద వైపునకు నీవు నీ దృష్టిని సారించకు.మరియు నీవు వారి తిరస్కారముపై బాధపడకు,విశ్వాసపరుల కొరకు అణకువను చూపించు.
(89) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా నేనే శిక్ష నుండి స్పష్టమైన హెచ్చరిక చేసే వాడిని.
(90) అల్లాహ్ గ్రంధాలను వేరు వేరు భాగములుగా చేసుకుని కొన్నింటిని విశ్వసించి కొన్నింటిని తిరస్కరించిన వారిపై అల్లాహ్ కురిపించినట్లు మీపై కూడా సంభవిస్తుందని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను.
(91) ఎవరైతే ఖుర్ఆన్ ను విడి విడి భాగములు చేసుకున్నారో వారు దాన్ని మంత్రజాలము (జాదూ) లేదా జోతిష్యము లేదా కవిత్వము అన్నారు.
(92) ఓ ప్రవక్తా నీ ప్రభువు సాక్షిగా దాన్ని(ఖుర్ఆన్ ని) విడి విడి భాగములుగా చేసిన వారందరిని ప్రళయదినాన మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
(93) వారు ఇహలోకములో చేసుకున్న అవిశ్వాసము,అవిధేయ కార్యాల గురించి మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
(94) ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దేని గురించి పిలుపునివ్వమని ఆదేశించాడో దాన్ని బహిరంగంగా చేయండి. మరియు ముష్రికులు ఏదైతే పలుకుతున్నారో,ఏదైతే చేస్తున్నారో దాని వైపు తిరిగి చూడకండి.
(95) మరియు మీరు వారితో భయపడకండి. ఖురైష్ లో నుండి అవిశ్వాసపరులైన నాయకుల్లోంచి పరిహాసమాడే వారి నుండి రక్షించటానికి మేము మీకు చాలు.
(96) అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధ్య దైవముగా చేసుకునేవారు తమ షిర్కు యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు.
(97) ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని తిరస్కరించటం వలన,మిమ్మల్ని ఎగతాళి చేయటం వలన మీకు మనస్తాపం కలుగుతుందన్న విషయం మాకు తెలుసు.
(98) అయితే మీరు అల్లాహ్ వైపునకు ఆయనకు తగని గుణాల నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ, ఆయన పరిపూర్ణ గుణాల ద్వారా ఆయన స్థుతులను తెలుపుతూ ఆశ్రయించు. మరియు నీవు అల్లాహ్ కొరకు ఆరాధన చేసే వారిలో,ఆయన కొరకు నమాజులు పాటించే వారిలో అయిపో. ఇందులో మీకు కలిగిన మనస్తాపమునకు వైధ్యం ఉన్నది.
(99) మరియు నీవు నీ ప్రభువు ఆరాధనను ఎడతెగకుండా చేయి, నీవు జీవించి ఉన్నంత కాలం దానిపై కొనసాగు,చివరికి నీకు మరణం సంభవించినప్పుడు నీవు దానిపైనే ఉండు.